'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు' | rishiteswari case:Principal Baburao raveparty with students, says prof.devid raju | Sakshi
Sakshi News home page

'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు'

Published Tue, Aug 4 2015 2:14 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు'

'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు'

గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో ఓ కులం వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోందని ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రొఫెసర్ డేవిడ్ రాజు అన్నారు.  ప్రశ్నించిన వారిని, నిజాలు మాట్లాడేవారి నోరు నొక్కేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం తాగి క్లాసుకు వస్తారని, ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల పాటు స్టాప్ రూమ్లోనే నిద్రపోతారని, అమ్మాయిలతో బాబూరావు అసభ్యకరంగా వ్యవహిరించే మాట వాస్తవమని డేవిడ్ రాజు అన్నారు.

విద్యార్థులు ప్రతివారం ప్రిన్సిపాల్కు మందు పార్టీ ఇవ్వాలని, లేదంటే విద్యార్థులకు మార్కులు వేయరని, ఇలాంటి చరిత్ర ఉందనే గతంలో బాబురావు పని చేసిన కాలేజీల యాజమాన్యాలు తరిమేశాయని, ఫ్రెషర్స్ పార్టీలో ఆయన మద్యం సేవించి డాన్స్ చేశారని, బాబూరావు బాధలు తట్టుకోలేక ఇద్దరు మహిళా ఫ్యాకల్టీలు వెళ్లిపోయారని, రిషితేశ్వరి చనిపోయిన రోజు... ఇంకా బతికే ఉందని లెటర్ కోసం వర్సిటీ మెడికల్ ఆఫీసర్పై ఒత్తిడి తెచ్చారని డేవిడ్ రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement