ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు.
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది.
బెయిల్ పిటిషన్పై విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది.