Rishiteswari
-
మా గురించి ఎమ్మెల్యే అనిత ఎలా చెబుతారు?
-
మా గురించి ఎమ్మెల్యే అనిత ఎలా చెబుతారు?
అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలపై రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అసెంబ్లీలో తమ గురించి ఎమ్మెల్యే అనిత ఎందుకు మాట్లాడారో అర్థం కాలేదన్నారు. రిషితేశ్వరి చనిపోయాక తాము సంతృప్తిగా ఉన్నామనడం సమంజసం కాదన్నారు. తన కుమార్తె మరణం తర్వాత ఎమ్మెల్యే అనిత ఏ రోజు తమని కలవలేదని, కనీసం ఫోన్ కూడా చేయలేదని మురళీకృష్ణ తెలిపారు. కూతురు చనిపోయాక తాము పుట్టెడు బాధలో ఉంటే...తామంతా సంతోషంగా ఉన్నామని టీడీపీ ఎమ్మెల్యే అనిత సభలో చెప్పడం సమంజసం కాదన్నారు. ఆమె సభలో అలా ఎందుకు చెప్పిందో అర్థం కావడం లేదని వాపోయారు. అసెంబ్లీ సమావేశాల్లో తమలాంటి పేదళ్లను లాగొద్దని రిషితేశ్వరి తండ్రి అన్నారు. రిషితేశ్వరి మృతి తరువాత ఏ రోజు తమను అనిత పరామర్శించలేదన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణమైనవారికి ఇంకా శిక్ష పడలేదని, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేయాలని కోరినప్పటికీ ఇప్పటివరకూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయలేదన్నారు. కాగా మంగళవారం శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మహిళలకు రక్షణ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో మహిళలపై చోటుచేసుకున్న దాడులు, ఆ దాడుల్లో నిందితులకు టీడీపీ నేతలు అండగా నిలిచిన వైనాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ విప్ చింతమనేని ప్రభాకర్ చేసిన దాడి, ఆచార్య నాగార్జున వర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి, ఆ ఆత్మహత్యకు కారణమైన వర్సిటీ ప్రొఫెసర్ బాబురావుకు టీడీపీ అండ, సీఎం చంద్రబాబు సభకు దళిత సర్పంచ్‌ను హాజరుకానివ్వకుండా అడ్డుకున్న వైనంపై పత్రికల్లో వచ్చిన కథనాలను ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై టీడీపీ వంగలపూడి అనిత మాట్లాడుతూ టీడీపీ పాలనలో మహిళలకు రక్షణ ఉందని సమర్థించుకున్నారు. రిషితేశ్వరి ఘటనలో చంద్రబాబు సర్కారు న్యాయం చేసిందని బాధితురాలి తల్లిదండ్రులే చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. పైపెచ్చు రిషితేశ్వరి తల్లిదండ్రులు తమకు న్యాయం జరిగిందంటూ మంత్రి గంటా శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలుపుతూ మెసేజ్ చేశారంటూ చెప్పడం కొసమెరుపు. అయితే ఆ న్యాయం ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని మాత్రం అనిత ప్రస్తావించకపోవడం గమనార్హం. రిషితేశ్వరి చనిపోయిన బాధను వాళ్ల తల్లిదండ్రులే మరిచిపోతుంటే ప్రతిపక్షం పదే పదే గుర్తు చేస్తోందంటూ ఎద్దేవా చేశారు. అయితే రిషితేశ్వరి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, వాటి నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్నారనే దానిపై ఎమ్మెల్యే అనిత ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఈ తరహా చర్యలకు పాల్పడుతున్న విద్యార్థులకు వత్తాసు పలికిన ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదన్న విషయాన్ని మాత్రం ఆమె ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అనిత వ్యాఖ్యలను రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ అభ్యంతరం వ్యక్తం చేశారు. కాగా నాగార్జున యూనివర్సిటీలో చోటుచేసుకున్న అమానవీయ సంఘటనల ఫలితంగా తీవ్ర అవమాన భారంతో 2014 జూన్ 14న రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
'వాళ్ల పిల్లలు కీచకులుగా మారారు'
విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీచక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం విశాఖలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకల్లో రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. అధికార పార్టీ సభ్యుల పిల్లలే కీచకులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కఠినంగా వ్యవహరించుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. రిషితేశ్వరి విషయంలో విధిలేక ప్రిన్సిపల్ బాబురావును అరెస్ట్ చేశారని అన్నారు. తహశీల్దారు వనజాక్షి వ్యవహారంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తో మాట్లాడి సెటిల్ చేశారని విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఛీటింగ్ చీఫ్ మినిస్టర్‌గా బిరుదు ఇవ్వొచ్చు' అని ఆమె ఎద్దేవా చేశారు. రాష్ట్ర బడ్జెట్ ఇంగ్లీషులో చదవడం దురదృష్టకరమని అన్నారు. బడ్జెట్లో మహిళలకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని రోజా విమర్శించారు. -
బాబురావు పాత్ర నాడే తేలింది!
ర్యాగింగ్, లైంగిక వేధింపులతో రిషితేశ్వరి ఆత్మహత్య ఘటన.. విచారణ కమిటీ నివేదికను పట్టించుకోని వైనం ఇప్పటికీ అరెస్టు చేయకపోవడంపై అనుమానాలు అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజా, విద్యార్థి సంఘాల డిమాండ్ గుంటూరు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని రిషితేశ్వరి ర్యాగింగ్, లైంగిక వేధింపులు తట్టుకోలేక మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించడంతో ప్రభుత్వం విశ్రాంత ఐఏఎస్ అధికారి బాలసుబ్రహ్మణ్యం నేతృత్వంలో నియమించి కమిటీ పలువురిని విచారించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందించింది. ఈ నివేదికలో అప్పటి ప్రిన్సిపాల్ బాబురావు పాత్ర ఉందని స్పష్టం చేసింది. చినకాకానిలోని హాయ్లాండ్లో జరిగిన ఫ్రెషర్స్ డే పార్టీలో బాబురావు ఉద్దేశపూర్వకంగానే రిషితేశ్వరిని వేధింపులకు గురిచేసే విద్యార్థులను ప్రోత్సహించాడని నివేదికలో తేల్చిచెప్పింది. అందరికీ బహుమతులు స్వయంగా అందజేసిన ఆయన రిషితేశ్వరికి మాత్రం ఆమెను ప్రేమిస్తున్నానని వెంటపడే విద్యార్థి శ్రీనివాస్‌తో బహుమతి ఇప్పించాడని పేర్కొంది. కళాశాలలో జరుగుతున్న వేధింపులు కూడా తన దృష్టికి వచ్చినా ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ర్యాగింగ్ శ్రుతి మించిందని కమిటీ పేర్కొంది. ఆయా అంశాల ఆధారంగా బాబురావుపై చర్యలు తీసుకోవాలని కమిటీ నివేదికలో స్పష్టం చేసింది. అయినా ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆయన్ను రక్షించే క్రమంలో బాలసుబ్రహ్మణ్యం కమిటీ సూచనలు పక్కన బెడుతూ వచ్చాయి. తప్పులు సరిదిద్దే పనుల్లో పోలీసులు దీంతో ప్రభుత్వం, పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తుందని భావించి అప్పటి ప్రిన్సిపాల్ పాత్రపై ఆధారాలు వెతికే పనిలో పడ్డారు. ఎట్టకేలకు పోలీసులు ఆరు నెలల తరువాత దాఖలు చేసిన చార్జిషీట్లో బాబురావు పేరు చేర్చడం చూస్తుంటే ఇప్పటివరకు చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు పోలీసులు అడుగులు వేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు. చార్జిషీటులో పేరు చేర్చడమే కాకుండా సంచలనాత్మక కేసు కావడంతో బాబురావును అరెస్టు చేసి పూర్తిస్థాయిలో విచారించాలని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అతడ్ని అరెస్టు చేయకుండా చార్జిషీటులో పేరు చేర్చడం వల్ల ముందస్తు బెయిల్ పొందే అవకాశం పోలీసులే కల్పించినట్లుగా అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. ఆందోళనలు చేసినా పట్టించుకోలేదు.. అప్పట్లో విద్యార్థి, మహిళాసంఘాలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబురావుపై చర్యలు తీసుకోవాలంటూ తీవ్రస్థాయిలో ఆందోళన చేసినప్పటికీ పట్టించుకోలేదు. అతని పాత్రపై తమకు స్పష్టమైన ఆధారాలు దొరకలేదంటూ చెబుతూ వచ్చిన ప్రభుత్వం, పోలీసులు కేసును మరుగున పెట్టేందుకు యత్నించారు. దీనిపై అన్ని వర్గాల ప్రజలు తీవ్రస్థాయిలో స్పందించి సోషల్ మీడియాలో సైతం రిషితేశ్వరి పేరుతో ఫేస్బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేయడం, అందులో వేల మంది లైక్‌లు, కామెంట్లు పెట్టిన విషయం విదితమే. ఈ ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బాబురావును శిక్షిస్తేనే పూర్తి న్యాయం జరుగుతుంది ఆర్కిటెక్చర్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ బాబురావును శిక్షిస్తేనే రిషితేశ్వరి కేసులో పూర్తి న్యాయం జరిగినట్లు. ప్రస్తుతం పోలీసులు దాఖలు చేసిన చార్జిషీటులో బాబురావును నాలుగో నింది తుడిగా చేర్చడం వల్ల కేసు న్యాయం వైపు అడుగులు వేస్తున్నట్లు భావించవచ్చు. ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించి అతనిపై చర్యలు తీసుకోవాలి. - ఎం. మురళీకృష్ణ, రిషితేశ్వరి తండ్రి -
రిషితేశ్వరి కేసులో షాకింగ్ నిజాలు
-
గంటా.. వియ్యంకుడికి భయపడుతున్నారా?
-
గంటా.. వియ్యంకుడికి భయపడుతున్నారా?: రోజా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లో మహిళా వ్యతిరేక పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యానించారు. మహిళలపై దాడులు, ఆత్మహత్యలు కొనసాగుతున్నా ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆమె మండిపడ్డారు. సోమవారం పార్టీ కార్యాలయంలో రోజా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ నేరస్తులకు అండగా నిలుస్తోందని ధ్వజమెత్తారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన ప్రిన్సిపాల్ బాబూరావును ఎందుకు అరెస్ట్ చేయలేదని ఆమె డిమాండ్ చేశారు. బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించి తక్షణమే బాబూరావుపై విచారణకు ఆదేశించాలన్నారు. రిషితేశ్వరి మృతిపై బాలసుబ్రహ్మణ్యం కమిటీ ఇచ్చిన నివేదినకు ఆంధ్రప్రభుత్వం ఎందుకు పక్కన పెట్టిందని రోజా ప్రశ్నించారు. నిజాలు బయటపడతాయని ప్రభుత్వం భయపడుతుందన్నారు. తమకు న్యాయం జరగలేదనే రిషితేశ్వరి తండ్రి... తన కుమార్తె మృతిపై సీబీఐతో విచారణ చేయించాలంటున్నారని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. మరోవైపు నారాయణ కాలేజీల్లో 11మంది విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు...తన వియ్యంకుడు నారాయణకు భయపడే ఆ కళాశాలపై చర్యలు తీసుకోవటానికి వెనకాడుతున్నారన్నారు. నారాయణ కాలేజీల్లో జరుగుతున్న ఆత్మహత్యలపై విచారణ జరిపించి, తప్పులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, నారాయణ కాలేజీల గుర్తింపు రద్దు చేయాలన్నారు. రాష్ట్రంలో మహిళలు అంతా ఏకమై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులను నిలదీసి పోరాడాలని రోజా పిలుపు నిచ్చారు. -
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడి
-
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక
-
రిషితేశ్వరి రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో రెండో డైరీపై ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైంది. సూసైడ్ నోట్ తో పాటు, రెండో డైరీలోని చేతిరాత రిషితేశ్వరిదేనని నివేదికలో తేలింది. మొత్తం రెండు డైరీలతో పాటు రిషితేశ్వరికి చెందిన మరో నాలుగు నోట్ బుక్స్‌ను ఫోరెన్సిక్ అధికారులు పరీక్షించారు. ఒక లాంగ్ నోట్ బుక్, మరొక స్పైరల్ బుక్, మరో రెండు ఆన్సర్ నోట్ బుక్‌లలోని రిషితేశ్వరి చేతిరాతను ఫోరెన్సిక్ అధికారులు పోల్చి చూశారు. ఈ నివేదికను ఫోరెన్సిక్ అధికారులు శనివారం గుంటూరు జిల్లా ఎస్పీకి అందచేశారు. ఈ కేసులో మరికొందరి పేర్లను చేర్చే అవకాశం ఉంది. ఛార్జ్‌షీట్ వేసేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ర్యాగింగ్ కారణంగా మనస్తాపం చెందిన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
-
రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
గుంటూరు:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.రిషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల బెయిల్ పిటిషన్ పై కోర్టు లో గురువారం వాదనలు జరిగాయి. అయితే వీరి బెయిల్ పిటిషన్ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. గత రెండు నెలల క్రితం ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై విచారించిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థిని ఆత్మహత్యకు ర్యాగింగ్ కే ప్రధాన కారణమని తన నివేదికలో స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సదరు విద్యార్థులు గత 49 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. -
నాగార్జున యూనివర్సిటీలో కలకలం!
-
నాగార్జునలో మరో విద్యార్థినికి ప్రేమ వేధింపులు
గుంటూరు : గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్సిటీలో మళ్లీ కలకలం చెలరేగింది. ఓవైపు ర్యాగింగ్ పైశాచికత్వానికి జూనియర్లు బలైపోతున్నా....మరోవైపు అధికారులు కఠినచర్యలు తీసుకుంటున్నా కొందరు సీనియర్ల మార్పు రావట్లేదు. ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఉదంతం మరవకముందే ఎమ్మెస్సీ బోటనీ విద్యార్థిని రత్నమంజరిపై అక్వా కల్చర్ విద్యార్థి బాలయ్య ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఘటన వెలుగు చూసింది. గత వారం రోజులుగా తనను ప్రేమించాలంటూ బాలయ్య వేధిస్తున్నాడని రత్నమంజరి గురువారం పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. -
హడావుడిగా శ్రీమంతుడు ఆడియో ఫంక్షన్కా?
హైదరాబాద్ : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య అంశంపై బుధవారం అసెంబ్లీలో వాడీవేడిగా చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ రిషితేశ్వరి తల్లిదండ్రులను పరామర్శించకుండా హోటల్‌కు పిలిపించుకున్న ఘటన మంత్రులదని, ఇక్కడే వారి సంస్కారం అర్థం అవుతుందన్నారు. రిషితేశ్వరి చనిపోయిన తర్వాత తీరిగ్గా నాలుగు రోజులకు ప్రెస్‌మీట్ పెట్టి...హడావుడిగా శ్రీమంతుడు సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొనడానికి మంత్రి హైదరాబాద్ వచ్చారని, అదే చిత్తశుద్ధి ర్యాగింగ్ అరికట్టేందుకు చిత్తశుద్ధే ఉంటే పలువురు విద్యార్థులు ప్రాణాలు తీసుకునేవారు కాదన్నారు. రోజా ఏం మాట్లాడారంటే... 'నాగార్జున వర్సిటీలో లైంగిక వేధింపులు, అసాంఘిక కార్యకలాపాలపై రిషితేశ్వరి డైరీలో రాసుకుంది. ఆమె డైరీని చదివితే మనసున్నవారు ఎవరైనా కంటతడి పెట్టక మానరు. ర్యాగింగ్, లైంగిక వేధింపులే రిషితేశ్వరిని చంపేశాయని బాలసుబ్రహ్మణ్యం కమిటీ తేల్చింది. ముగ్గురిని అరెస్ట్ చేసి పనైపోయిందని సర్కార్ చేతులు దులుపుకుంటోంది. వర్సిటీలో చదువుకున్న అమ్మాయిలకే రక్షణ లేకపోతే...ఇక మిగతా వారికి ఎలా రక్షణ కల్పించగలరు. రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం ప్రిన్సిపాల్ బాబూరావే. టీడీపీ అధికారంలోకి వచ్చాక మహిళలపై దాడులు పెరిగిపోయాయి. కడపలోని నారాయణ కాలేజీలో ఇద్దరు ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెను వేధిస్తున్నారని ప్రిన్సిపాల్‌కు రిషితేశ్వరి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ర్యాగింగ్‌ను నిరోధించాల్సింది పోయి ప్రిన్సిపాల్ బాబూరావు తాగి తందనాలు ఆడారు. వర్సిటీలో నిధులు దుర్వినియోగం చేశారంటూ బాబూరావు చెక్ పవర్‌ను రద్దుచేస్తే... ఆతర్వాత వచ్చిన వీసీ మళ్లీ మంజూరు చేశారు. బాబూరావు వెనక ఎవరున్నారో ఇట్టే అర్థం అవుతుంది. వర్సిటీ నిధులతో బాబూరావు మద్యాన్ని ఎలా కొనుగోలు చేయగలిగారు. రిషితేశ్వరికి అవార్డు ప్రిన్సిపాల్ కాకుండా...వేధింపులకు గురి చేసిన అబ్బాయిలతో ఇప్పించారు. రిషితేశ్వరి ఘటన జరిగిన తర్వాత మంత్రులు వెంటనే ఎందుకు స్పందించలేదు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే స్థానిక ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఎందుకు స్పందించలేదు. బాబూరావును ప్రాసిక్యూషన్ చేయాలని బాలసుబ్రహ్మణ్యం కమిటీ చెప్పినా సర్కారు చర్యలు తీసుకోలేదు. యాంటీ ర్యాగింగ్‌పై తాను తెచ్చిన చట్టాన్ని చంద్రబాబే ఎందుకు అమలు చేయటం లేదు' అని ప్రశ్నించారు. -
రిషితేశ్వరి నిందితుల బెయిల్ విచారణ వాయిదా
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నిందితులు ముగ్గురు శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం సెప్టెంబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. -
రిషితేశ్వరి కేసులో నిందితులకు బెయిల్ వాయిదా
గుంటూరు లీగల్: రిషితేశ్వరి కేసులో నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతికేసులో నిందితులైన హనీష, ధరావత్ చరణ్, నరాల శ్రీనివాస్ దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ వాదనలు వినేందుకు న్యాయమూర్తి జి.గోపీచంద్ గురువారానికి వాయిదా వేశారు. ఏపీపీ రామచంద్రరావు వాదనలు వినిపించేందుకు సమయం కావాలని అడగడంతో న్యాయమూర్తి గోపీచంద్ వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. -
దర్జాగా తిరుగుతున్న ప్రిన్సిపాల్బాబురావు
-
వరస్ట్ లైఫ్.. బొమ్మలా బతుకుతున్నాను
* మంచి మిత్రుడిగా భావించిన వాడే ప్రపోజ్ చేశాడు * ప్రతి వ్యక్తి ఆడపిల్లను అదే భావనతో చూస్తున్నారు * అందరిపై నాకు అసహ్యం కలుగుతోంది * ‘సాక్షి’ చేతికి రిషితేశ్వరి రెండో డైరీలోని మరికొన్ని పేజీలు సాక్షి, గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కళాశాలలో చేరినప్పటి నుంచీ ఎదుర్కొన్న బాధలు, పడ్డ కష్టం మొత్తం డైరీల్లో రాసుకుంది. తాజాగా బయటపడిన రిషితేశ్వరి రెండో డైరీలోని కొన్ని పేజీలు ‘సాక్షి’ చేతికి చిక్కాయి. అందులోని కొన్ని ముఖ్యమైన విషయాలు ఇలా ఉన్నాయి... ♦ ఇంటర్లో 88% మార్కులు తెచ్చుకున్నా. ఆర్కిటెక్చర్ కోర్సు తీసుకుని కెరీర్‌ను తీర్చిదిద్దుకోవాలని ఆశిస్తున్నా.. నిరుపేదలకు తక్కువ ఖర్చుతో ఇల్లు నిర్మించుకొనేలా చేయాలనేది నా లక్ష్యం. ఆర్కిటెక్చర్లో సీటు సాధించడానికి నాటా(నేషనల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఆర్కిటెక్చర్) ఎంట్రన్స్ రాసేందుకు విజయవాడ, మొగల్రాజపురంలోని ఓ కోచింగ్ సెంటర్లోచేరి నెలరోజులపాటు కష్టపడి చదివా. 112 ర్యాంక్ రావడంతో జేఎన్ఎఫ్ఏయూలో సీటు వస్తుందని ఆశించా. ఒక్క ర్యాంకు తేడాతో జేఎన్ఎఫ్ఏయూలో సీటు కోల్పోయి ఏఎన్‌యూలో సీటు సాధించా. ఎంతో నమ్మకం... కోరిక... ఆశలు... ఆశయాలతో మొదటిరోజు కళాశాలలో అడుగుపెట్టాను. ♦ కొత్త కాలేజీ కావడంతో ర్యాగింగ్ ఉంటుందని టెన్షన్‌తో ఉన్న నాకు ఇక్కడ ర్యాగింగ్ ఉండదంటూ వార్డెన్ ధైర్యం చెప్పింది. కానీ మొదటిరోజు రాత్రి సీనియర్స్ నన్ను పిలిచి సీనియర్స్‌తో ఎలా వ్యవహరించాలో షరతులు విధించారు. మా రూమ్‌లో 8 మంది ఉన్నాం. వారిలో పావని, హనీష, ఉన్నతి, మౌనికలు సీనియర్లు. ముగ్గురు నా క్లాస్మేట్స్. ♦ హనీష నాతో మొదట్లో బాగుండేది. తరువాత నాలుగో సంవత్సరం విద్యార్థి శ్రీనివాస్‌తో మాట్లాడాలని చెప్పింది. నేను మాట్లాడలేదు. ఓ రోజు శ్రీనివాస్‌తో ఫోన్‌చేసి మాట్లాడాలంటూ నన్ను ర్యాగింగ్ చేసింది. చేసేదిలేక నేను అతనితో మాట్లాడాను. లైబ్రరీలో కలవాని చెప్పాడు. శ్రీనివాస్ లైబ్రరీలో నాపక్కనే కూర్చుని ఫోన్ లాక్కొని నా ఫొటోలు చూశాడు. నువ్వు చిన్న హీరోయిన్లా ఉన్నావంటూ కామెంట్ చేశాడు. చాటింగ్ చేయడం ప్రారంభించాడు. కానీ నాకు అలా చేయడం ఇష్టం ఉండేది కాదు. ♦ నా ఫోన్లో శ్రీనివాస్ కాంటాక్ట్ నేమ్ మార్చమని హనీష చెప్పింది. నేను అన్నయ్య అని అతని నంబర్ సేవ్ చేశాను. కొద్దిసేపటికి శ్రీనివాస్ ఫోన్‌చేసి నా నంబర్ ఏమని సేవ్ చేశావని అడిగాడు. అన్నయ్య అని చెప్పాను. అలా ఎందుకు చేశావు, నన్ను శ్రీ అని పిలవమని అనడంతో షాక్‌కు గురయ్యాను. ♦ దసరా సెలవుల్లో నా ఫ్రెండ్ ఆదిత్య నన్ను ప్రేమించమంటూ ప్రపోజ్ చేశాడు. నో చెప్పాను. చాలా కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. మరో సీనియర్ చరణ్ నావెంటపడటం మొదలు పెట్టాడు. నేను మంచి మిత్రుడుగా భావించిన మనిషి కూడా నన్ను ప్రేమించమంటూ ప్రపోజ్ చేశాడు. నేను అతన్ని మంచి ఫ్రెండ్‌గా చూశాను. కానీ ఆ వెధవ నన్ను మరో దృష్టితో చూశాడు. ♦ శ్రీనివాస్ నా క్లాస్ అబ్బాయిలతో నా గురించి ఎంక్వయిరీ చేస్తున్నాడు. ప్రతి వ్యక్తి ఆడపిల్లను అదేభావనతో చూస్తున్నారు. దీంతో అందరిపై నాకు అసహ్యం కలుగుతోంది. ఆర్కిటెక్చర్ విద్యార్థులు ఎక్కువమంది వెధవలు ఉన్నారు. ఛీ... వరస్ట్ లైఫ్... నేను బొమ్మలా బతుకుతున్నాను. ♦ హాయ్‌ల్యాండ్‌లో శ్రీనివాస్, చరణ్‌లు నాపట్ల అసభ్యంగా ప్రవర్తించారు. మద్యం సేవించి నన్ను దగ్గరకు లాక్కుని వేధించారు. ఆ స్థితిలో చనిపోవాలనిపించింది. మిస్పర్ఫెక్ట్ అవార్డును శ్రీనివాస్ చేతులు మీదుగా ఇప్పించారు. చాలా అసహ్యంగా అనిపించింది. ఈ విషయాలన్నీ ఎవరితోనూ చెప్పుకోలేక పోయా.. చివరకు మానాన్నతో కూడా. -
రిషితేశ్వరి రెండో డైరీలో ఏం రాసిందంటే..!
గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి కేసు మరో మలుపు తిరిగింది. రిషితేశ్వరి రాసుకున్న రెండో డైరీ 'సాక్షి టీవీ' చేతికి చిక్కింది. ఆ డైరీలో ఆమె అనుభవించిన చిత్రవధ మొత్తాన్ని వివరించింది. యూనివర్సిటీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, చేదు అనుభవాలను ఆమె తన డైరీలో ఇలా రాసుకుంది.... * ఫ్రెషర్స్ డే పార్టీ రోజు నాకు మిస్ ఫర్ఫెక్ట్ అవార్డు ఇచ్చారు. * మిస్ ఫర్ఫెక్ట్ అవార్డును శ్రీనివాస్ చేతుల మీదుగా అందించారు. * ఆ సమయంలో షేక్ హ్యాండ్ ఇస్తూనే అతను నా నడుం మీద చేయి వేశాడు. * స్టేజి దిగి క్రిందకు వస్తుంటే జయచరణ్ నాతో అసభ్యంగా వ్యవహరించాడు. * ఆ సమయంలో జయచరణ్ ఫుల్‌గా మందు తాగి ఉన్నాడు. * శ్రీనివాస్‌తో ఫోన్ చేయమని, జయచరణ్తో మాట్లాడమని హనీషా పదేపదే కోరేది. * కాదన్నందుకు హనీషా నన్ను ర్యాగింగ్ చేసింది. * తప్పనిసరి పరిస్థితుల్లో శ్రీనివాస్‌ను కలిశాను. నన్ను చూసి హీరోయిన్లా ఉన్నావన్నాడు. * తర్వాత రోజు నుంచి శ్రీనివాస్ నాతో ఫోన్లో చాటింగ్ చేస్తున్నాడు. * అతని మెసేజీలన్నీ నన్ను ఇష్టపడుతున్నట్లుగానే ఉంటున్నాయి. నాకు చిరాకేస్తోంది. * అతనితో చాటింగ్ చేయాలని కానీ, మాట్లాడాలని కానీ లేదు. * తర్వాత కాలేజీలో అభిషేక్, ఆదిత్య పరిచయమయ్యారు. వారు మంచి ఫ్రెండ్స్ అని బ్రదర్స్ అని ఫీలయ్యాను. * అయితే దసరా సెలవుల సమయంలో ఆదిత్య నాకు ప్రపోజల్ చేశాడు. నేను నో అని చెప్పా. * శ్రీనివవాస్ను ఒకసారి సార్ అని పిలిస్తే.. సర్ కాదు.. శ్రీ అని పిలవమన్నాడు. * శ్రీనివాస్ ఫోన్ చేస్తే ఓసారి నా ఫ్రెండ్‌తో నేను లేనని చెప్పించా. * తర్వాత క్లాస్ రూమ్‌కు వచ్చి నీ ఫోన్ ఎక్కడుందని అడిగాడు. * నా ఫ్రెండ్‌కి ఇచ్చానని చెప్తే.. అయితే తీసుకుని నాకివ్వు. వారం తర్వాత ఇస్తానన్నాడు. * శ్రీనివాస్ వేషాలను తట్టుకోలేక అతనితో గట్టిగా వాదించాను. తర్వాత అతను కొద్దిరోజులు దూరంగా ఉన్నాడు. * అదే సమయంలో జయచరణ్ ఎంటరయ్యాడు. నావెంట పడుతున్నాడు. * నేను మంచి ఫ్రెండ్ అనుకున్న అభిషేక్ కూడా నాకు ప్రపోజల్ చేశాడు. అతనొక స్టుపిట్. * శ్రీనివాస్‌కు దూరంగా ఉంటున్నానని, అతను నా గురించి నా క్లాస్‌మెట్స్ దగ్గర ఎంక్వయిరీ చేస్తున్నాడు. * ఎన్నో ఆశలు, ఆశయాలతో నాగార్జున యూనివర్సిటీలో అడుగు పెట్టా. కానీ ఇది ఇక్కడి ఆర్కిటెక్చర్ కాలేజీ వరెస్ట్ కాలేజీ. * ఇక్కడి స్టూడెంట్స్‌లో చాలామంది వరెస్ట్ గాళ్లే. చాలామంది అబ్బాయిలు నాకోసం ట్రై చేస్తున్నారు. * నా జీవితం మీద విరక్తి కలుగుతోంది. నేను అనుకున్నదొకటి.. జరుగుతోందొకటి. * అన్నీ నాన్నతో చెప్పుకునే నేను.. ఈ విషయాలు చెప్పుకోలేకపోతున్నా. * ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావటం లేదు. * ఫ్రెషర్స్ డే పార్టీ రోజు చరణ్ ఫుల్లుగా తాగి డిన్నర్ సమయంలో తన పక్కన కూర్చోమన్నాడు. * ఎలా పడితే అలా మాట్లాడుతుంటే నేను తట్టుకోలేకపోయా. అక్కడున్నుంచి ఎలా తప్పించుకోవాలా? అని ఆలోచించా. * నా ఫోన్ లాక్కుని నా నెంబర్లు, ఫోటోలు, వివరాలన్నీ చూశాడు. నాకైతే చచ్చిపోవాలనిపించింది. -
రిషితేశ్వరి కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ముగ్గురు నిందితులకు కోర్టు రిమాండ్ పొడిగించింది. ఈ నెల 28 వరకూ నిందితులకు రిమాండ్ కొనసాగించాలని న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. గతంలో వారు పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో దుంప హనీషా, జయచరణ్, నరాల శ్రీనివాస్ నిందితులుగా ఉన్న విషయం విదితమే. A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. -
'అన్ని యూనివర్సిటీల్లో పోలీస్ ఔట్ పోస్టులు'
గుంటూరు: అన్ని విశ్వవిద్యాలయాల్లో పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పటు చేస్తామని ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రిషితేశ్వరి కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. కొత్త రాజధానిలో పోలీసు కమిషనరేట్ ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తున్నామని పేర్కొన్నారు. అదే విధంగా పట్టిసీమను మూడు నెలల ముందే ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నామని హోంమంత్రి చినరాజప్ప ఈ సందర్భంగా తెలియజేశారు. -
ఈ విష సంస్కృతికి విరుగుడేది?
విద్య, వివేక, వినయ సంపదకూ, వ్యక్తిత్వవికాసా నికీ నిలయాలుగా ఉండవలసిన విద్యాలయాలను ర్యాగింగ్ భూతాలు రాజ్యమేలుతున్నాయి. బయ టకు చెప్పుకోలేక మానసిక క్షోభననుభవిస్తున్న రిషి తేశ్వరిలు ఎందరో! విద్యాలయాల్లో శ్రుతిమించిన ర్యాగింగ్‌తో, ఆత్మన్యూనత, అభద్రతాభావాలతో రోజు గడుస్తుంటే విద్యార్థినీ విద్యార్థులకు చదువుపై మనసు లగ్నమవుతుందా? ఉన్నత చదువుల కోసం కొండంత ఆశలతో విశ్వవిద్యాలయాల్లో తమ పిల్ల లను తల్లిదండ్రులు ఎన్నో కష్టాలకోర్చి, స్తోమతకు మించిన ఫీజులు చెల్లించి చేర్పిస్తారు. కాని తమ బిడ్డ లు ఆత్మహత్యలు చేసుకోవడమో, ప్రేమ ముసుగు లో మోసపోవడమో జరిగితే వారి క్షోభ చెప్పనలవి కాదు. ముఖ్యంగా ఆడపిల్లల మరణాలకు దారితీసే విషవాతావరణం విద్యాలయాల్లో పెరిగిపోతున్నం దుకు నేటి సమాజం ఎంతో కలవరపడుతున్నది. ఎక్కడుంది లోపం? ఎందుకు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి వాతావరణం నెలకొం టున్నది? నిజానికి ప్రతి విద్యార్థిలో అనంతమైన మానవతా గుణాలు, నీతి, నిజాయితీ, స్నేహం, సాయపడేతత్వం అంతర్లీనంగా ఉంటాయి. కానీ సరైన మార్గదర్శి, వ్యక్తిత్వాలను వికసింపచేసే ఆదర్శ ప్రాయులు లేక యువతలో నివురుగప్పిన అజ్ఞానం, అసూయాద్వేషాలు వారిని అమానవీయ ప్రవర్తన వైపు నడిపిస్త్తున్నాయి. ఆ ప్రవృత్తులను తుడిచి వారి లో సహజంగా ఉన్న మంచి గుణాలను, ఉన్నత విలువలను పైకి తీయడం, వారిని తీర్చిదిద్దడం బాధ్యత నెరిగిన ప్రతి ఉపాధ్యాయుడు నిర్వర్తించవ లసిన కర్తవ్యం. ప్రతి విద్యాలయ ప్రథమ లక్ష్యం కూడా అదే. విద్యాలయాలు కేవలం వ్యాపార దృష్టి తో, ఉద్యోగాల కోసం డిగ్రీలనందించే కార్ఖానాలు గా మారిపోతుంటే మంచి నైతిక విలువలతో కూడిన మానవ వనరులను ఎలా తయారు చేయగలుగు తాయి? భారత జనాభాలో 25 శాతం యువతరం ఉంది. వీరిని నిర్వీర్యం చేసే దిశగా ఉన్నత విద్యాల యాలుంటే దేశమెలా బాగుపడుతుంది? కళాశాలల్లోగాని, విశ్వవిద్యాలయాల్లోగాని ప్రి న్సిపాల్ లేదా ఉపకులపతుల బాధ్యత గురుతరమై నది. అతడు, ఆమె; కుల, మత, ప్రాంతీయ తత్వా లకు, రాజకీయాలకతీతంగా కళాశాలను, విశ్వవిద్యా లయాన్ని వారు నడిపించాలి. ఉపకులపతులు, ప్రధానోపాధ్యాయులు విద్యార్థులను, వారు ఎంచు కున్న విద్య, శిక్షణలలో అగ్రగాములుగా నిలిపే దిశ గా ప్రయాణించేటట్టు చేయడమేకాదు, వారంతా ఉన్నత పౌరులుగా, జీవించడమనే కళ తెలిసిన వారి గా రూపొందే వాతావరణాన్ని కూడా నిర్మించాలి. ఈ కృషిలో అధ్యాపకులు, పరిపాలనా విభాగం, సీని యర్ విద్యార్థుల సహకారాలను తీసుకోవాలి. ఇప్పుడు ఒక భూతంలా వేధిస్తున్న ర్యాగింగ్ అసలు లక్ష్యం-కొత్తగా చేరిన విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి, ఆత్మ స్థయిర్యాన్ని నింపడం. ఇది శ్రుతిమిం చడమే ఇప్పటి సమస్యకు మూలం. కాబట్టి ప్రతిభకు మెరుగుపెట్టే పెద్ద విద్యాలయంలో సంకోచాలు లేకుండా, విశాల దృక్పథంతో వ్యవహరిస్తే, విశ్వవి ద్యాలయం ఇచ్చే అవకాశాలను వినియోగించుకుం టే విద్యార్థులు ఎంత ఉన్నత స్థాయిని అందుకొనే అవకాశాలు ఉన్నాయో ప్రతి ఉపాధ్యాయుడు చెప్పి, సీనియర్ విద్యార్థుల చేత చెప్పించడం అవసరం. అలాగే శ్రుతిమించిన ర్యాగింగ్‌తో కలిగే అనర్థాల గురించి విస్తృత అవగాహన కల్పించాలి. కమిటీలు ప్రతిపాదించిన శిక్షలను అమలు జరపాలి. రాజకీ యాల పేరుతో ప్రవేశించే కాలుష్యాన్ని నివారించి, దానికి అతీతంగా యువతకు దిశా నిర్దేశం చేయాలి. ప్రధానోపాధ్యాయుడు, ఉప కులపతుల నియామ కాల్లో విలువలను పాటించాలి. సమర్థ నాయకత్వ లక్షణాలు కలిగి, విశ్వవిద్యాలయాలలో మంచి విద్యా వాతావరణాన్ని నెలకొల్పగలిగే సచ్ఛీలురను, మేధావులను ఆ పదవులకు ఎంపిక చేయడం కూడా ప్రభుత్వం నిర్వర్తించవలసిన కర్తవ్యాలలో ప్రధాన మైనది. విద్యను కాపాడుకుందాం. విద్యాలయా లను పవిత్రంగా చూసుకుందాం. - డా॥పి. విజయలక్ష్మి పండిట్, హైదరాబాద్ (విశ్రాంత ఆచార్యులు, బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం) -
లవ్ యూ డాడీ.. మిస్ యూ అన్నయ్యా..
వాట్సాప్‌లో రిషితేశ్వరి చివరి మేసేజ్‌లు సాక్షి, గుంటూరు: లవ్ యూ డాడీ.. మిస్ యూ అన్నయ్యా.. ఇవి రిషితేశ్వరి ఫోన్ నుంచి వెళ్లిన చివరి మేసేజ్‌లు. తరువాత ఫోనుతోపాటు ఆమె గొంతు కూడా మూగబోయింది. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఆమె ఫోన్ కాల్ డేటాపై దృష్టి సారించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై 14వ తేదీ ఆమె చనిపోయిన సమయం వరకు ఆమె ఎవరెవరితో మాట్లాడింది, ఆమెకు ఎవరెవరు ఫోన్లు చేశారు అనే వివరాలను పోలీసులు సేకరించారు. అందులో ఉన్న ఫోన్ నంబర్ల ఆధారంగా అనుమానితులను పిలిచి విచారిస్తున్నారు. రిషితేశ్వరి జూలై 13న తల్లిదండ్రులతో, అన్నయ్య అని పిలిచే జితేంద్రతో మాత్రమే మాట్లాడింది. జితేంద్రకు మాత్రం అనేకసార్లు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడినట్లు తేలింది. జూలై 13వ తేదీ రాత్రి సినిమా హాల్ నుంచి కూడా ఆమె జితేంద్రతో మాట్లాడినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. హాల్ బయటకు వచ్చిన రిషితేశ్వరి తల్లిదండ్రులకు ఫోన్ చేసినట్లుగా కాల్ డేటాలో స్పష్టమైంది. తరువాత హాస్టల్‌కు చేరాక కూడా పలుమార్లు జితేంద్రతో ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. ఘటన జరిగిన రోజు జూలై 14వ తేదీ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆమె తల్లిదండ్రులు, జితేంద్రతో తప్ప ఎవరికి ఫోన్ చేయలేదు. ఆమెకు కూడా ఎవరూ చేయలేదు. చివరగా మధ్యాహ్నం 12.28 గంటలకు వాట్సాప్ ద్వారా తండ్రికి, జితేంద్రకు ఒకేసారి మెసేజ్‌లు చేసిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. దీని ఆధారంగా పోలీసులు పలుమార్లు జితేంద్రను విచారించినప్పటికీ ఎటువంటి కొత్త ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం. ఏపీ సీఎంకు కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై విచారణకు నియమించిన బాలసుబ్రహ్మణ్యం కమిటీ తన నివేదికను ఏపీ సీఎం చంద్రబాబుకు అందచేసింది. ఈ విషయాన్ని సీఎం తనను కలిసిన మంత్రి గంటా శ్రీనివాసరావుకు తెలిపారు. మంత్రి గంటా, కమిటీ ఛైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఆదివారం ఈ నివేదికలోని ముఖ్యాంశాలను మీడియాకు వెల్లడించనున్నారు. -
'రిషితేశ్వరి' నిందితులను కఠినంగా శిక్షించాలి
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకొన్న విద్యార్థి రిషితేశ్వరికి న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. ఈ కేసుకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి చేసి ... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. రిషితేశ్వరి ఆత్మహత్య నేపథ్యంలో ఎస్ఎఫ్ఐ పిలుపు మేరకు శుక్రవారం గుంటూరు నగరంలోని కళాశాలల బంద్ నిర్వహించారు. నగరంలోని అన్ని కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించి బంద్‌కి మద్దతు తెలిపారు. -
'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు'
-
పులులు చంపిన లేడికూన!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) పాపం.. పుణ్యం.. ప్రపంచమార్గం ఏమీ తెలియదు. మనుషులు, మనస్తత్వాలు అర్థం కావు. చుట్టూ ఉన్న మనుషులు అందరూ మంచివారేననే అమాయకత్వం. స్కూల్లో, కాలేజిలో అంతా సవ్యంగా ఉందనే భ్రమ. పరిస్థితులను అర్థం చేసుకోలేని తెలియనితనం. ఆడుతూ పాడుతూ గడిపిన పరిస్థితుల్లోంచి ఒకేసారి పెద్ద ప్రపంచంలోకి.. యూనివర్సిటీల్లోకి.. అంతా గందరగోళంగా కనపడుతుంది. అమాయకమైన నవ్వుల్ని అపార్థం చేసుకుంటారని తెలియని పసితనం. రోజుల్లో పరిస్థితులు తలకిందులవుతాయి. ఆప్తులుగా అనుకున్నవారు వెంటాడి వేధిస్తారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. మనసు విప్పి చెప్పుకున్నవారు నట్టేట ముంచేస్తే ఏం చేయాలో అర్థం కాదు. రెండు పదులు కూడా సరిగా నిండని వయసులో ఎటువైపు అడుగులు వేయాలో తెలియని అనిశ్చితిలో.. సీలింగ్ ఫ్యానో, పంట కాలువో, స్లీపింగ్ పిల్సో, దూసుకొచ్చే రైలో... ఏదో ఒకటి ఆసరా అయితే.. తప్పెవరిది? నిరుత్సాహంతో, నిర్వేదంతో, అవమానంతో ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరిదా? తనకు భరోసా కల్పించలేకపోయిన.. తోటి విద్యార్థులదా, ఉపాధ్యాయులదా.. విద్యావ్యవస్థదా? రిషితేశ్వరి డైరీలోని అంశాలు చాలా ప్రశ్నల్ని లేవనెత్తాయి. చిన్నతనంలో తాను అనుభవించిన ఒంటరితనం ఆ అక్షరాల్లో కనపడుతోంది. పిల్లల్ని ప్రేమగా పెంచితే సరిపోతుందా? ప్రేమగా పెంచడం అంటే ఏమిటి? ఆప్యాయంగా అడిగినవన్నీ కొనిపెడితే సరిపోతుందా! పిల్లల మనసులోని భావాలను పట్టించుకోవాలి కదా! ''నువ్వెందుకు, నేను చేసి పెడతాను.. నేను తీసుకొస్తాను.. నువ్వు ఇలా ఉండు.. నువ్వు ఆ పని చేయకు..'' ఇలా ప్రతి అడుగు తల్లిదండ్రుల పర్యవేక్షణలో కొనసాగితే.. బాహ్యప్రపంచం అనుపానులు తెలిసేదెప్పుడు.. తెలియకపోతే జరిగే అనర్థానికి ఎవరిది బాధ్యత? చుట్టూ ఒక రక్షణ కవచం ఏర్పాటుచేసి ప్రొటెక్ట్ చేస్తూ 18 సంవత్సరాల పాటు పెంచి ఒకేసారి అడవిలో వదిలిపెడితే పులులు, సింహాలు సంచరించే చోట లేడికూనకి ఎంత కష్టం! రిషితేశ్వరి కూడా దాదాపు ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్న లేడికూనే. నమ్మిన మనిషి చేసిన ద్రోహం ఆ డైరీలోని అక్షరాల్లో కన్నీరై ప్రవహించింది. మంచేదో చెడేదో తెలుసుకోలేని అమాయకత్వం.. ఆ దుర్మార్గం ముందు తలవంచింది. చేయి వేస్తే ఆ చేయి నరికేయొచ్చనే హక్కు, ఆత్మగౌరవం తన సొత్తు అనే చిన్న విషయం కూడా తెలియని బేలతనం.. ''నాన్నకి ఎలా చెప్పను''.. అనే మధ్యతరగతి అభిమానం.. 'రిషితేశ్వరి' సమూహంలో కూడా ఒంటరిగా మిగిలిపోయింది. అప్పుడప్పుడే ప్రపంచాన్ని చూస్తున్న రిషితేశ్వరికి సమస్య ఎదురైనప్పుడు చెప్పుకోడానికి, సమస్య పరిష్కారం అవుతుందనే భరోసా కల్పించే వ్యవస్థ లేకపోవడం మన విద్యావ్యవస్థలో ఉన్న లోపం.. రిషితేశ్వరి లాంటి లేడికూనల పాలిట శాపం. చదువు, పరీక్ష, ఫలితాలు, సర్టిఫికెట్లు తప్ప బతుకు పోరులో ఎదురయ్యే సమస్యల్ని వివరించి విడమరిచే వ్యవస్థ ఊసే లేకపోవడం అన్యాయమే. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రభుత్వాలు వ్యవహరించే పద్ధతి ఒకటే.. విచారణ కమిటీ, నివేదిక. మా పని అయిపోయింది అని చేతులు దులుపుకొన్నట్లుగా పదో, పరకో విదిలింపు. ఇలాంటివి సహించం.. కాలేజీల గుర్తింపు రద్దు చేస్తాం లాంటి హుంకరింపులు. విద్యార్థులతో కలిసి తాగి చిందులేసిన గురువర్యులు అలాగే ఉంటారు. మాకెందుకులే జీతాలు వస్తే చాలనుకునే సాధారణ ఉపాధ్యాయులు అలాగే కొనసాగుతారు. రిషితేశ్వరి ఘటన కొద్ది రోజుల్లో మరుగున పడిపోతుంది. ఆమె చావుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమైనవారు అదే క్యాంపస్‌లో కాలరెగరేసుకుంటూ తొందరలోనే కనపడతారు. విచారణ కమిటీ నివేదికకు చెదలు పట్టేస్తాయి. ఇప్పుడు కాకపోయినా.. కొద్ది రోజులకైనా రిషితేశ్వరి హాస్టల్ రూమ్ తలుపులు మళ్లీ తెరుచుకుంటాయి. అమాయకంగా బిక్కుబిక్కుమంటూ మరో పసికూన క్యాంపస్ మెట్లు ఎక్కుతుంది... -ఎస్. గోపినాథ్ రెడ్డి -
రిషితేశ్వరి డైరీలో ఏం రాసిందంటే..!
-
రిషితేశ్వరికేసులో ఆసక్తికర అంశాలు
-
రిషితేశ్వరి డైరీలో ఏం రాసిందంటే..!
ఆరోతరగతి నుంచే ఒంటరితనం అనుభవించా చరణ్ ఒక ఇడియట్ అన్న అని పిలిచినా అసభ్యంగా ప్రవర్తించాడు బీచ్‌కి వెళ్లి వస్తుంటే ఆటోలో పైశాచికంగా వ్యవహరించారు శ్రీనివాస్‌ను ప్రేమించాలని అనిశా ఒత్తిడి చేసేది యూనివర్సిటీలో నరకాన్ని డైరీలో రాసిన రిషితేశ్వరి గుంటూరు: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్‌కు గురై ఆత్మహత్య చేసుకున్న రిషితేశ్వరి రాసుకున్న డైరీ 'సాక్షి టీవీ' చేతికి చిక్కింది. ఆ డైరీలో ఆమె తాను అనుభవించిన చిత్రవధ మొత్తాన్ని వివరించింది. యూనివర్సిటీలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఆమె తన డైరీలో రాసుకుంది. మొదటి పేజీలో వ్యక్తిత్వ వికాసం గురించి, సమస్యలను ఎలా ఎదుర్కోవాలన్న అంశం గురించి రాసుకుంది. తాను ఆరోతరగతి నుంచే ఒంటరితనాన్ని ఫీలయినట్లు డైరీలో రాసింది. ఉద్యోగాల నుంచి అమ్మ, నాన్న రాత్రి 9 గంటల తర్వాత వచ్చేవారని, తాను స్కూలు నుంచి సాయంత్రం 4 గంటలకే వచ్చి ఒంటరిగా ఉండేదాన్నని డైరీలో రాసింది. చరణ్ ఒక ఇడియట్ అని రాసుకుంది. యూనివర్సిటీకి వచ్చిన తర్వాత తాను నమ్మినవారంతా తనను మోసం చేశారని, అన్న అని పిలిపించుకునే యువకుడు కూడా తన పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని రిషితేశ్వరి తన డైరీలో రాసుకుంది. స్నేహితులంతా సూర్యలంక బీచ్‌కి వెళ్లి.. ఆటోలో తిరిగి వస్తుండగా చాలా పైశాచికంగా వ్యవహరించారని ఆమె తెలిపింది. అనిశ తన వివరాలన్నింటినీ శ్రీనివాస్‌కు చేరవేసేదని, అతడిని ప్రేమించాలంటూ తనపై ఒత్తిడి చేసేదని రాసింది. తన డైరీ చదివి శ్రీనివాస్, చరణ్‌లకు చెప్పేదని కూడా అందులో తెలిపింది. ఫ్రెషర్స్ డే పార్టీ రోజు చరణ్ తన ఒంటిపై చేయి వేశాడని, నాన్నకు ఏమీ చెప్పుకోలేక.. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని డైరీలో రాసింది. యూనివర్సిటీలో తాను ప్రత్యక్ష నరకం అనుభవించినట్లు డైరీలో తెలిపింది. -
'రిషితేశ్వరి బతికుందని లేఖ ఇమ్మన్నారు'
గుంటూరు : నాగార్జున యూనివర్సిటీలో ఓ కులం వారి ఆగడాలకు అడ్డులేకుండా పోతోందని ఆర్కిటెక్చర్ కాలేజీ ప్రొఫెసర్ డేవిడ్ రాజు అన్నారు. ప్రశ్నించిన వారిని, నిజాలు మాట్లాడేవారి నోరు నొక్కేస్తూ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆయన మంగళవారమిక్కడ తెలిపారు. ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం తాగి క్లాసుకు వస్తారని, ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటల పాటు స్టాప్ రూమ్‌లోనే నిద్రపోతారని, అమ్మాయిలతో బాబూరావు అసభ్యకరంగా వ్యవహిరించే మాట వాస్తవమని డేవిడ్ రాజు అన్నారు. విద్యార్థులు ప్రతివారం ప్రిన్సిపాల్‌కు మందు పార్టీ ఇవ్వాలని, లేదంటే విద్యార్థులకు మార్కులు వేయరని, ఇలాంటి చరిత్ర ఉందనే గతంలో బాబురావు పని చేసిన కాలేజీల యాజమాన్యాలు తరిమేశాయని, ఫ్రెషర్స్ పార్టీలో ఆయన మద్యం సేవించి డాన్స్ చేశారని, బాబూరావు బాధలు తట్టుకోలేక ఇద్దరు మహిళా ఫ్యాకల్టీలు వెళ్లిపోయారని, రిషితేశ్వరి చనిపోయిన రోజు... ఇంకా బతికే ఉందని లెటర్ కోసం వర్సిటీ మెడికల్ ఆఫీసర్‌పై ఒత్తిడి తెచ్చారని డేవిడ్ రాజు తెలిపారు. -
వనజాక్షికి అండగా ఉంటా: హరికృష్ణ
హైదరాబాద్ : కృష్ణాజిల్లా ముసునూరు ఎమ్మార్వో వనజాక్షికి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సినీనటుడు నందమూరి హరికృష్ణ మద్దతుగా నిలిచారు. ఆమెను వచ్చిన బెదిరింపు లేఖను ఆయన మంగళవారమిక్కడ తీవ్రంగా ఖండించారు. వనజాక్షి పోరాటానికి అండగా ఉంటామని, ఆమెను చంపుతామని బెదిరింపు లేఖ రాసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. ఇంతకాలం పార్టీలో మౌనంగా ఉన్న హరికృష్ణ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మహిళలకు రక్షణ కల్పించడంలో తెలుగుదేశం ప్రభుత్వ విఫలమవుతోందనే అభిప్రాయాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రెండు కేసులు వనజాక్షి, రిషితేశ్వరి కేసుల గురించి హరికృష్ణ తన సన్నిహితుల వద్ద ప్రస్తవించినట్లు ప్రచారం జరుగుతోంది. నిజాయితీగా పని చేసిన ముసునురు ఎమ్మార్వో వనజాక్షిపై దాడి చేసిన ఎమ్మెల్యేలకు అండగా నిలవడంపై హరికృష్ణ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆమెకు రక్షణ నిలవాల్సిన ప్రభుత్వం అమెను దోషిగా నిలబెడ్డమేంటని ప్రశ్నించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వనజాక్షి కుంటంబాన్ని చంపుతామని బెదిరింపు లేకలు వారిసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతికి కారణమైన వారిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని హరికృష్ణ డిమాండ్ చేశారు. వారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టకూడదని ఆయన కోరారు. సీనియర్ల ర్యాగింగ్ చేయటంతో మనస్తాపం చెంది రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాను ముసునూరు వదిలి వెళ్లే ప్రసక్తే లేదని ఎమ్మార్వో వనజాక్షి స్పష్టం చేశారు. బెదిరింపులకు తాను లొంగనని, ఉద్యోగుల ప్రాణాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని ఆమె అన్నారు. తన కుటుంబానికి హాని ఉన్నందున భద్రత కల్పించాలని వనజాక్షి ప్రభుత్వాన్ని కోరారు. -
ర్యాగింగే రిషితేశ్వరి ప్రాణం తీసింది
సాక్షి, హైదరాబాద్: నాగార్జున విశ్వవిద్యాలయం ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగ్ వేధింపులే కారణమని నిర్ధారణ అవుతోంది. ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన రిటైర్డ్ ఐఏఎస్ బాల సుబ్రహ్మణ్యం తన ప్రాథమిక దర్యాప్తులో తేల్చినట్టుగా సమాచారం. ఈ వివరాలను ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు వివరించినట్టుగా తెలుస్తోంది. నాగార్జున విశ్వవిద్యాలయాన్ని సందర్శించి దర్యాప్తు చేసిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి ఘటనకు దారితీసిన పరిస్థితులపై సేకరించిన ప్రాథమిక ఆధారాలను వివరించారు. అయితే వివరించిన అంశాలతో మధ్యంతర నివేదికను సమర్పించాల్సిందిగా సీఎస్ కమిటీకి సూచించారు. రిషితేశ్వరి ఆత్మహత్యకు ఎవరెవరు కారణమనే విషయాన్ని కూడా బాల సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా సీఎస్‌కు వివరించారు. రిషితేశ్వరి అమాయకురాలని, ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఎవరెవరి చర్యలు కారణమనే వివరాలతో బాలసుబ్రహ్మణ్యం త్వరలో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించనున్నారు. -
'సీబీఐతో విచారణ జరిపించండి'
-
'సీబీఐతో విచారణ జరిపించండి'
న్యూఢిల్లీ : విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ భాస్కర్ కోరారు. న్యూఢిల్లీలో ఆదివారం కేంద్ర హోం మంత్రిని ఆయన కలుసుకున్నారు. సీనియర్ల ర్యాగింగ్ వల్లే రిషితేశ్వరి మరణించిందని నిర్దారించిన విషయం తెలిసిందే. సీనియర్ల వేధింపులు, ర్యాగింగ్ భరించలేక నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. -
'సిట్టింగ్ జడ్జీల కొరత.. అందుకే ఐఏఎస్ తో విచారణ'
హైదరాబాద్ : రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై పూర్తిస్థాయి నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ మానవ వనరులశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. గంటాతో విద్యార్థిని రిషితేశ్వరి కేసు విచారణ కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం ఆదివారం హైదరాబాద్ లో భేటీ అయ్యారు. రిషితేశ్వరి ఘటనపై వారు చర్చించారు. రిషితేశ్వరి ఆత్మహత్య ఉదంతంపై ప్రాథమిక నివేదికను మంత్రి గంటాకు అందజేశారు. విచారణ కమిటీకి మరో వారం రోజుల గడువు పొడిగించినట్లు గంటా తెలిపారు. యూనివర్సిటీకి సెలవులు ఉండటంతో విచారణ కోసం కమిటీ మరో వారం రోజులు గడువు అడిగినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు జరిగిన విచారణ గురించి కమిటీ సభ్యులు వివరించినట్లు చెప్పారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీల కొరత ఉందని, ఐఏఎస్ అధికారితో విచారణ చేపట్టినట్లు మంత్రి వివరించారు. సీనియర్ల వేధింపులు, ర్యాగింగ్ భరించలేక నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. -
ఏఎన్‌యూలో ర్యాగింగ్ ఉంది
-
'నాగార్జున'లో ర్యాగింగ్ నిజమే
ఆర్కిటెక్చర్ కళాశాల హాస్టల్ వార్డెన్ స్వరూపారాణి స్పష్టీకరణ సాక్షి, గుంటూరు, ఏఎన్‌యూ: నాగార్జున యూనివర్సిటీలో ర్యాగింగ్ జరుగుతూనే ఉందని వర్సిటీ మహిళా వసతిగృహాల చీఫ్ వార్డెన్ సీహెచ్ స్వరూపరాణి స్పష్టం చేశారు. వర్సిటీలో ర్యాగింగ్‌పై ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించిన జిల్లా న్యాయ సేవాధికారసంస్థ కార్యదర్శి లక్ష్మీ నరసింహారెడ్డి వర్సిటీ ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపల్ బాబురావు, వార్డెన్ స్వరూపరాణిలను ఆగస్టు 1న విచారణకు హాజరు కావాలని నోటీసులిచ్చారు. శనివారం వారిద్దరూ న్యాయ సేవాధికారసంస్థ ముందు హాజరయ్యారు. రిషితేశ్వరి మృతి, మహిళా వసతిగృహాలకు సంబంధించిన పలు అంశాలపై వివరణిచ్చారు. వీరు 7న మరోమారు విచారణకు హాజరుకానున్నారు. అనంతరం వార్డెన్ విలేకరులతో మాట్లాడుతూ..‘‘వర్సిటీలో ర్యాగింగ్ ఉంది. గతంలోనూ ర్యాగింగ్ ఘటనలు జరిగాయి. భాగ్యలక్ష్మి అనే విద్యార్థినిపై ర్యాగింగ్ జరిగిన ఘటనకు సంబంధించి గతంలో వర్సిటీ నియమించిన సి.రాంబాబు కమిటీ కూడా ర్యాగింగ్ జరిగినట్టు నిర్ధారించింది. దీంతో ఐదుగురు విద్యార్థినుల్ని హాస్టల్నుంచి పంపించేశాం. అయితే వారిపై విద్యాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు’’ అని తెలిపారు. ప్రిన్సిపల్ బాబూరావు ఆదేశాలతోనే విద్యార్థులు రిషితేశ్వరి మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారన్నారు. దీనిపై బాబూరావు మాట్లాడుతూ.. మృతదేహాన్ని తరలించాలని తానెవర్నీ ఆదేశించలేదన్నారు. విద్యార్థుల కోరిక మేరకే పార్టీలో డ్యాన్స్ చేశా నన్నారు. హాస్టల్ వార్డెన్ రాజీనామా.. వర్సిటీలో బాలికల వసతిగృహాల వార్డెన్ బాధ్యతలకు స్వరూపరాణి జూలై 30నే రాజీనామా చేసినట్టు వెల్లడైంది. రిషితేశ్వరి ఘటన అనంతరం తనపై విమర్శలు రావడంతో కలత చెంది రాజీనామా చేసినట్లు ఆమె తెలిపింది. తాను వార్డెన్‌గా నియామకమై జూలై 6కు మూడేళ్లు దాటిందని, పలుమార్లు రిలీవ్ చేయాలని కోరినా కొనసాగించారన్నారు. కాగా రిషితేశ్వరి ఘటనలో విచారణకు సహకరించేందుకు 30వరకు వార్డెన్‌గా కొనసాగానన్నారు. విచారణ కమిటీ గడువు పొడిగింపు సాక్షి, హైదరాబాద్: రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనపై నియమించిన విచారణ కమిటీ గడువును ఏపీ ప్రభుత్వం ఈ నెల 10 వరకు పొడిగించింది. కమిటీ చైర్మన్ బాలసుబ్రహ్మణ్యం రాసిన లేఖ మేరకు గడువు పెంచినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
'హాస్టల్ లో ర్యాగింగ్ వాస్తవమే'
గుంటూరు: ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి మృతి కేసులో నాగార్జున యూనివర్సిటీ బాలికల వసతి గృహాల చీఫ్ వార్డెన్ స్వరూప రాణి స్పందించారు. ఆమె కేసు విషయమై శనివారమిక్కడ జిల్లా లోక్ అదాలత్ ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హాస్టల్ లో ర్యాగింగ్ ఉన్నమాట వాస్తవమేనని ఆమె అంగీకరించారు. అయితే రిషితేశ్వరి విషయంలో ఏం జరిగిందో తనకు తెలియదని వార్డెన్ చెప్పారు. 'రిషితేశ్వరి మృతి చెందిన రోజు నేను హాస్టల్ కు వచ్చేసరికి డెడ్ బాడీని అంబులెన్స్ లో తరలిస్తున్నారు. అప్పటికే రిషితేశ్వరి చనిపోయిందని వర్సిటీ వైద్యాధికారి ధృవీకరించారు. తర్వాత ఆమె మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు' అని స్వరూపరాణి తెలిపారు. -
రిషితేశ్వరి కేసులో కొత్తకోణం!
-
రిషితేశ్వరి కేసులో కొత్తకోణం!
గుంటూరు: నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో ఇద్దరు యువకులు, ఓ యువతితో పాటు మరో వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. త్వరలోనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. కాగా రిషితేశ్వరితో పాటు మిగిలిన విద్యార్థులు మంగళగిరిలో సినిమా చూడలేదని, విజయవాడలోని ఓ మల్టీఫ్లెక్స్ థియేటర్లో చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. రాత్రి 11 గంటలకు రిషితేశ్వరితో పాటు మిగతా విద్యార్థులు హాస్టల్‌కు చేరుకున్నారని, అనంతరం ఆమె భోజనం చేసి పడుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా థియేటర్‌తో పాటు హాస్టల్లో ఏం జరిగిందనే విషయాలపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. -
ఛేంజ్ కోరుకుంటోంది!
'ఒక అమాయకురాలైన ఆడపిల్లకు న్యాయం చెయ్యలేని సీఎం ఉంటే ఎంత ఊడితే ఎంత.. చేతగాని వ్యవస్థలో చేతగాని సీఎం..! ఇది కాదండీ ప్రజలు కోరుకునేది. మార్పు కోరుకుంటున్నారు. వ్యవస్థలో మార్పు, విధానాల్లో మార్పు, రాజకీయాల్లో మార్పు' ర్యాగింగ్ భూతానికి బలైన రిషితేశ్వరికి మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో జోరుగా వినిపిస్తున్న, కనిపిస్తున్న డైలాగ్ ఇది. 'లీడర్' చిత్ర దర్శకుడు పలికించినట్టుగా నిజంగానే యువత మార్పు కోరుకుంటోంది. ఒకప్పుడు ఏం జరిగినా నిమ్మకు నీరెత్తినట్టుండే యువతరం ఇప్పుడు ఉగ్రనరసింహావతారం ఎత్తుతోంది. ప్రభుత్వాలను, వ్యవస్థలను ఉలిక్కిపడేలా చేస్తోంది. ఛేంజ్.ఆర్గ్ లాంటి వెబ్సైట్లు వీరికి వేదికగా నిలుస్తున్నాయి. పదిహేనేళ్ల లక్ష్మి పేరుకు తగ్గట్టు లక్ష్మీదేవిలా ఉండేది. ఆమె అందం, అమాయక చూపులు పదిమందిలోనూ ఆమెను ప్రత్యేకంగా నిలిపేవి. ఈ ప్రత్యేక గుర్తింపు టీనేజీ అమ్మాయిలను సంబరపెట్టేదే. అయితే లక్ష్మి విషయంలో జీవితాంతం వేదన మిగిల్చింది. ప్రేమిస్తున్నామంటూ, పెళ్లిచేసుకోవాలంటూ ఇద్దరు వ్యక్తులు వెంటపడేవారు. వారిని లక్ష్మి తిరస్కరించింది. అంతే.. సమీపంలోని మెడికల్ షాపులో యాసిడ్ కొన్నారు. తర్వాత జరిగేది మన ఊహకు అందని విషయమేమీ కాదు. ఏడేళ్లు గడిచాయి. లక్ష్మి చూస్తుండగానే వందల సంఖ్యలో యాసిడ్ దాడులు. వందల మంది లక్ష్మిలు! ఆమె గుండె రగిలింది. ఈ సమాజం మారదా అంటూ తనను తాను ప్రశ్నించుకుంది. లోలోపలే కుమిలిపోతే లాభం లేదనుకుంది. తన వ్యథను పంచుకుంటూ 'ఛేంజ్.ఆర్గ్' వెబ్సైట్ వేదికగా ఓ పిటిషన్ దాఖలు చేసింది. యూపీఏ హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను ఉద్దేశిస్తూ.. 'భారత్‌లో యాసిడ్ అమ్మకాలపై నియంత్రణ కావాలి' అంటూ గళమెత్తింది. పిటిషన్ పోస్ట్ చేసిన వారం రోజుల్లోనే 27 వేల మంది మద్దతుగా సంతకాలు చేశారు. సుప్రీం కోర్టు జోక్యంతో నాటి యూపీఏ ప్రభుత్వం యాసిడ్ అమ్మకాలను నియంత్రిస్తామంటూ 2013, జూలై 16న ప్రకటించింది. లక్ష్మి విజయం సాధించింది. పరిణామాలు.. నెటిజన్ల ఆదరణ చూరగొన్న పిటిషన్లు ప్రభుత్వాలను సైతం కదిలించగలుగుతున్నాయి. ప్రభుత్వ సంస్థలే కాక, ప్రైవేటు వ్యవస్థల మీద కూడా ఈ సోషల్ ఉద్యమాల ప్రభావం ఉంటోంది. దీనికి నిదర్శనం అమెరికా, బ్రిటన్ సహా ప్రపంచ దేశాల్లో నెటిజన్లు సాధించిన విజయాలే. తన జననాంగాల కోతను (ఫీమేల్ జెనిటల్ మ్యుటిలైజేషన్) అడ్డుకోవాలంటూ లండన్‌కు చెందిన ఓ మైనారిటీ చిన్నారి చేసిన విజ్ఞప్తి, బాస్కెట్‌బాల్ క్రీడలో తలపాగాలు తొలగించబోమన్న ఓ సిక్కు క్రీడాకారుడి ప్రతిఘటన, ఫ్లిప్‌కార్ట్‌లో లింగ నిర్ధారణ పుస్తకాల విభాగాన్ని తొలగించాలంటూ చేసిన ఆందోళన, కేరళలో వీధి కుక్కలను చంపొద్దంటూ తెలిపిన నిరసన.. ఇవన్నీ ఛేంజ్.ఆర్గ్‌లో కనిపిస్తాయి. వేల సంఖ్యలో సంతకాలు పోగుచేసి విజయఢంకానూ మోగిస్తాయి. భారత్‌లో.. ఫేస్బుక్, ట్వీటర్ హవాలో నెగ్గుకురావడం కొంత కష్టమైన పనే అయినప్పటికీ మన దేశంలోనూ ఈ మధ్యే ఛేంజ్.ఆర్గ్ లాంటి సంస్థలు పుంజుకుంటున్నాయి. ఉబెర్ క్యాబ్స్ ఉదంతం, కర్ణాటకలో పాఠశాల విద్యార్థుల భద్రత, వేలాది చెట్లను నరికివేతకు కారణమైన హుబ్లీ ధర్వార్డ్ హైవే నిర్మాణం వంటి సమస్యలు ఈ ఆన్లైన్ వేదికపై విజయం సాధించాయి. కేరళలో వీధి కుక్కల సంహారం లాంటి అంశాలు విజయం సాధించనప్పటికీ, దేశంలో చర్చలకు కారణమవుతున్నాయి. తెలుగు విద్యార్థిని రిషితేశ్వరి పేరున కూడా ఈ వెబ్సైట్లో ఓ పిటిషన్ ప్రారంభమైంది. వివాదం.. ఈ వెబ్సైట్ ద్వారా సంఘ విద్రోహక పిటిషన్లకు కూడా మద్దతుదారులు పెరగడం లాంటి సంఘటనలు వివాదాస్పదమవుతున్నాయి. అయితే, దీన్ని సున్నితంగా ఖండిస్తున్నారు నిర్వాహకులు. ఏదైనా అంశం ప్రజలకు నచ్చితేనే మద్దతు తెలుపుతారని, ఒక వర్గం ప్రజలకు మంచి అనిపించేది మరో వర్గానికి చెడుగా అనిపించవచ్చని వివరణ ఇచ్చుకుంటున్నారు. ఏంటీ ఛేంజ్.ఆర్గ్..? ఫేస్బుక్, ట్వీటర్, గూగుల్ ప్లస్.. ఇలా సామాజిక వెబ్సైట్లు ప్రస్తుతం పదుల సంఖ్యలో ఉన్నాయి. వీటి కోవలోకి వచ్చేదే ఈ ‘ఛేంజ్.ఆర్గ్’. సామాజిక ఉద్యమాలే దీని ముఖ్య ఉద్దేశం. 2007 ఫిబ్రవరి 7న అమెరికాలో ప్రారంభమైన ఈ వెబ్సైట్లో ప్రస్తుతం 11 కోట్లకు పైగా సభ్యులు ఉన్నారు. ఈ సైట్లో ఎవరైనా పిటిషన్ దాఖలు చేయవచ్చు. సమకాలీన అంశాలపై ప్రశ్నించవచ్చు. అధినాయకులను, సంస్థలను, ప్రభుత్వాలను విన్నవిస్తూ, నిలదీస్తూ పిటిషన్ ప్రారంభించవచ్చు. మద్దతుదారులు దీనిపై సంతకాలు చేస్తారు. తాము సంతకం చేసిన పిటిషన్‌ను ఫేస్బుక్, ట్వీటర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో షేర్ కూడా చేస్తారు. భారీ సంఖ్యలో సంతకాల సేకరణకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాయపడతారు. -
గంటా వైఖరిపై చంద్రబాబు అసంతృప్తి!
హైదరాబాద్ : నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఘటనపై మంత్రి గంటా శ్రీనివాసరావు అనుసరించిన వైఖరిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు గంటా ఒక్కసారి మాత్రమే యూనివర్సిటీకి వెళ్లడమేంటని బాబు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షం, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేసినపుడు... ఇలా వ్యవహరించడం సరైన పద్ధతేనా అని మంత్రి గంటాను చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. ఇప్పటికైనా యూనివర్సిటీలో ర్యాగింగ్‌పై చర్యలు తీసుకోవాలని మంత్రి గంటాకు చంద్రబాబు ఆదేశించినట్లు తెలుస్తోంది. మరోవైపు రిషితేశ్వరి మృతి ఘటనపై విచారణ శుక్రవారంతో ముగిసింది. మూడో రోజు విచారణకు గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతీలాల్ దండే, ఐజీ సంజయ్, ఇతర అధికారులు హాజరయ్యారు. రెండు రోజుల్లో కమిటి సభ్యులు ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. -
బలికోరుతున్న వికృతక్రీడ
నెల్లూరు (టౌన్) : నాగార్జున యూనివర్సిటీలో ఘటన మరువక ముందే నెల్లూరులో ర్యాగింగ్‌కు మరో విద్యార్థి బలయ్యాడు. కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కలలు గన్న విద్యార్థులు ర్యాగింగ్ భూతంలో చిక్కుకుంటున్నారు. తాజాగా నెల్లూరులోని పిడతపోలూరు శ్రీగాయత్రి జూనియర్ కళాశాలలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఏఎన్‌యూలో ఆర్కిటెక్ విద్యార్థిని రుషితేశ్వరి ర్యాగింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. దీనిపై ప్రభుత్వం చర్యలు నామమాత్రంగా ఉండటంతో ర్యాగింగ్‌కు అడ్డుకట్ట పడటం లేదు. విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు వివిధ ప్రాంతాల నుంచి చేరుతుంటారు. కళాశాలల్లో ఆధిపత్యం సాధించేందుకు కొంతమంది వింత పోకడలకు పాల్పడుతుంటారు. వారిని మొదటలోనే కళాశాలల యాజమాన్యం అడ్డుకట్ట వేస్తే అనర్థాలు జరిగే అవకాశం ఉండదు. కళాశాలల్లో సీనియర్లు జూనియర్లను స్నేహపూర్వకంగా చూడాల్సిన అవసరం ఉంది. అయితే ర్యాగింగ్ పేరుతో వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ప్రధానంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలలతో పాటు వివిధ ప్రైవేటు కళాశాలల్లో ర్యాగింగ్ కనబడుతుంది. ర్యాగింగ్ విషయాన్ని పోలీసులకు తెలియనీయకపోవడంతో కొంతమంది ఆగడాలు మితిమీరుతున్నాయి. గతంలో ర్యాగింగ్ మీదు కేసులు నమోదైన చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. దీంతో ర్యాగింగ్‌కు విచ్చలవిడిగా పాల్పడుతున్నారు. కొన్ని సమయాల్లో యాజమాన్యాలు జోక్యం చేసుకుని సర్ధిచెప్పడంతో ర్యాగింగ్ వ్యవహారం బయటకు రావడంలేదు. కొత్త విద్యార్థులు స్నేహం విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చట్టంలో ఏముంది.... ►1997లో ర్యాగింగ్ చట్టం అమలులోకి వచ్చింది. యాంటీ ర్యాగింగ్ సెక్షన్-4 ప్రకారం ర్యాగింగ్‌కు పాల్పడ్డా, ప్రోత్సహించినా 6నెలలు జైలు, 1,000లు జరిమానా విధిస్తారు. ►ర్యాగింగ్ సమయంలో భయబ్రాంతులకు గురిచేస్తే ఏడాది జైలు, రూ.2 వేలు జరిమానా. ►ర్యాగింగ్ సమయంలో తీవ్రంగా గాయపరిచినా, అత్యాచారానికి పాల్పడినా ఐదేళ్లు జైలుశిక్ష, రూ.10వేలు జరిమానా విధిస్తారు. ►ర్యాగింగ్ సమయంలో మరణించినా, ఆత్యహత్య చేసుకునేలా ప్రేరిపించినా జీవిత శిక్ష, రూ.50వేలు జరిమానా ఉంటుంది. ►కళాశాలల యాజమాన్యాలు పట్టించుకోకపోయినా, కాలయాపన చేసినా నేరతీవ్రతను బట్టి శిక్షను అమలు చేస్తారు. ►ర్యాగింగ్ సందర్భాల్లో ఎవరికైనా శిక్షపడ్డ వారిని కళాశాలల్లో చేర్చుకోవడం నేరంగా పరిగణిస్తారు. ర్యాగింగ్‌పై అందని ఫిర్యాదులు కళాశాలల్లో ర్యాగింగ్‌లకు పాల్పడ్డా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదులు అందడం లేదు. కళాశాలల్లోనే విద్యార్థులను సమావేశపరిచి యాజమాన్యాలు సర్ధిచెబుతున్నారు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. దీనిని ఆసరాగా తీసుకుంటున్న కొంతమంది విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడుతున్నారు. విద్యాసంవత్సరం ప్రారంభమైన రెండు నెలల పాటు కళాశాలలపై పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ర్యాగింగ్ సమస్యను ఎదుర్కొన్నా బయటకు చెప్పలేని విచిత్ర పరిస్థితి కొన్ని కళాశాలల్లో నెలకొంది. యాజమాన్యాలు మాత్రం ఫీజులపై పెట్టిన దృష్టి విద్యార్థుల ప్రవర్తనలపై పెట్టడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. తొలుత ఫిర్యాదందినప్పుడే చర్యలు తీసుకుంటే మున్ముందు ఎలాంటి సంఘటనలు జరగవంటున్నారు. ఇప్పటికైనా ర్యాగింగ్‌కు పాల్పడే విద్యార్థులకు కళాశాలల ప్రవేశాలను బహిష్కరించాలని పలువురు కోరుతున్నారు. విద్యాసంస్థలు ప్రోత్సహించకూడదు -మురుగయ్య, వీఎస్‌యూ ప్రిన్సిపాల్ కళాశాలల్లో సీనియర్లు, జూనియర్లు అంటూ వ్యత్యాసం ప్రదర్శిస్తున్నారు. ర్యాగింగ్‌ల పేరుతో ప్రాణాలు మీదకు తెస్తున్నారు. ర్యాగింగ్‌కు పాల్పడిన వారికి టీసీలు ఇచ్చి పంపించాలి. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. ర్యాంగింగ్ నిషేధం బోర్డులను ఏర్పాటు చేయాలి -శివకుమార్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రధానంగా ఇంజనీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో ర్యాగింగ్ నిషేధం అని బోర్డులను ఏర్పాటు చేయాలి. ర్యాంగింగ్కు పాల్పడితే అమలయ్యే చట్టాలపై అవగాహన కల్పించాలి. ర్యాగింగ్‌లో ఒకరిపై అపవాదు మోపినా తీవ్ర నేరం. అవగాహన కల్పిస్తున్నాం -తిరుమలనాయుడు, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ర్యాగింగ్‌పై అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నాం. ర్యాగింగ్‌కు పాల్పడితే శిక్షలు ఏవిధంగా అమలువుతయో తెలియజేస్తాం. ర్యాగింగ్‌కు పాల్పడితే విద్యార్థులు జీవితాలు నాశనమవుతాయి. కఠిన చర్యలు తీసుకోవాలి - శ్రవణ్‌కుమార్, వైసీపి విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు ర్యాగింగ్‌కు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కళాశాలలపై కూడా చర్యలు తీసుకోవాలి. కళాశాలల్లో ర్యాంగింగ్‌పై అవగాహన కల్పించాలి. -
రిషితేశ్వరి ఆత్మహత్యపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి
విశాఖపట్నం : విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్యపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో రఘువీరారెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... రిషితేశ్వరి కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాక్సైట్ కేటాయింపులపై జోక్యం చేసుకుని ఎటువంటి అవకతవకలు లేకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
రిషితేశ్వరి కేసు రిమాండ్ రిపోర్టు ఇదే!
-
రిషితేశ్వరి కేసు రిమాండ్ రిపోర్టు ఇదే!
గుంటూరు : ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల రిమాండ్ రిపోర్ట్ 'సాక్షి టీవీ' సంపాదించింది. ఈ కేసులో A1గా సీనియర్ విద్యార్థిని హనీషా, A2గా జయచరణ్, A3గా శ్రీనివాస్ పేర్లను పోలీసులు నమోదు చేశారు. ప్రేమించాలంటూ రిషితేవ్వరిపై సీనియర్ విద్యార్థులు ఒత్తిడి చేశారని, నిరాకరించడంతో శ్రీనివాస్, జయచరణ్‌లు కలిసి రిషితేశ్వరిపై వదంతులు ప్రారంభించారని, ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఆమె తీవ్ర మనోవేదనకు గురైనట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. ర్యాగింగ్‌లో భాగంగా హాస్టల్ నుంచి రిషితేశ్వరిని రూమ్మెట్స్ బయటకు నెట్టారని, వార్డెన్ స్వరూపరాణి, ఆఫీస్ అసిస్టెంట్ రాజ్‌కుమార్‌కు ఫిర్యాదు చేసిందని, ఏప్రిల్ 18న కాలేజీలో ఫ్రెషర్స్ డే పార్టీ సందర్భంగా రిషితేశ్వరికి మిస్ పర్ఫెక్ట్ అవార్డు వచ్చిందని, అదేరోజు రిషితేశ్వరి పట్ల శ్రీనివాస్, జయచరణ్ అసభ్యంగా ప్రవర్తించారని, ర్యాగింగ్ శృతి మించడంతో జులై 14న హాస్టల్లో చున్నీతో రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందని రిమాండ్ రిపోర్టులో ఉంది. చున్నీకి వేలాడుతున్న రిషితేశ్వరిని మొదటగా విద్యార్థినులు... సుజాత, కుసుమలత, గౌరిలు చూశారని, మధ్యాహ్నం 2.30గంటలకు యూనివర్సిటీ అంబులెన్స్‌లో ఆమెను గుంటూరుకు తరలించారని,ఆత్మహత్య చేసుకున్న రూమ్‌లో 2 నైలాన్ తాడులు గుర్తించామని, నిందితులపై ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం అదుపులోకి తీసుకున్నామని, ఈ నెల 16న యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని, రిషితేశ్వరి కేసును మరింత లోతుగా విచారించాల్సి ఉందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. -
'రిషితేశ్వరి' నిందితులను అరెస్టు చేయాలి
-
రిషితేశ్వరి మృతిపై విచారణ కమిటి ఏర్పాటు!
-
రిషితేశ్వరికి మద్ధతుగా ఎస్వి విద్యార్థుల బంద్
-
'తెలివైన అమ్మాయి అలా చేయడం దురదృష్టం'
తిరుపతి : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నాగార్జున వర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. 'సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇది. అరాచక శక్తులు, సంఘవిద్రోహక కార్యకలాపాలకు యూనివర్సిటీలు అడ్డగా మారుతున్నాయి. యూనివర్సిటీలో కొందరు నరకం అనుభవిస్తున్నారని రిషితేశ్వరి సూసైడ్ లేఖలో పేర్కొంది. తెలివైన అమ్మాయి అలా చేయడం దురదృష్టకరం. ఇప్పటికే ఈ ఘటనపై నిజనిర్థారణ కమిటీ విచారిస్తుంది. సీనియర్ ఐఏఎస్ అధికారితో విచారణ చేయిస్తాం' అని ఆయన సోమవారమిక్కడ తెలిపారు. కాగా సీనియర్ల ర్యాగింగ్‌తో ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కాగా వైఎస్ఆర్ సీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి, గుంటూరు జిల్లా నేతలు సోమవారం నాగార్జున యూనివర్సిటీని సందర్శించనున్నారు. -
రిషితేశ్వరి ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని చేస్తున్న పోరాటానికి సోషల్ మీడియాలో అనూహ్య స్పందన వస్తోంది. వేలాది మంది విద్యార్థులు, ప్రజలు మద్దతుగా నిలిచారు. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ విద్యార్థులు ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి ఇప్పటికే 10 వేల లైక్‌లు వచ్చాయి. (చదవండి: రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ) -
ఫేస్బుక్ పేజీకి అనూహ్య స్పందన
-
రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ
-
రిషితేశ్వరి పేరుతో ఫేస్ బుక్ పేజీ
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోరాటం ఉధృతమవుతోంది. రిషితేశ్వరికి న్యాయం జరగాలంటూ ఆమె పేరుతో ఫేస్ బుక్ పేజీని ప్రారంభించారు. రిషితేశ్వరికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా గొంతు విప్పాలని పిలుపునిచ్చారు. ఈ కేసుపై మీడియాలో వచ్చిన కథనాలు, నిందితుల ఫోటోలను పోస్ట్ చేశారు. రిషితేశ్వరి ఫేస్ బుక్ పేజీకి అనూహ్య స్పందన వస్తోంది. రిషితేశ్వరి మృతికి సంబంధించి పలు ప్రశ్నలను కూడా సంధించారు. రిషితేశ్వరి కేసులో చీకటి కోణాలు... 1. ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను దించిందెవరు? 2. హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది? 3. ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు? 4. బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు? 5. హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు? 6. ఉరి వేసుకుని చనిపోయినట్టు నిరూపితమవ్వటానికి కనీసం ఒక్క ఫోటో కూడా ఆధారం లేదు, ఎందుకని? 7. బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? హైదరాబాద్ లో ఏం పైరవీలు నడుపుతున్నాడు? 8.బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? 9. కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? 10.ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగింది? 11.ఆమెను వేధిస్తూ తీసిన వీడియో ఏమైంది? 12.రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? 13.విద్యార్ది సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నిన్న వినతి పత్రాన్నిచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నాక హడావిడిగా వర్శిటీకి ఇప్పుడెందుకు 10 రోజులు సెలవులిచ్చారు? -
ఆ ప్రిన్సిపాల్ ఉంటే న్యాయం జరగదు.. తొలగించాలి
గుంటూరు: తమ కూతురు ఆత్మహత్యపై నియమించిన నిజనిర్దారణ కమిటీపై తమకు ఏమాత్రం నమ్మకంలేదని నాగార్జున యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిని రిషితేశ్వరి తల్లిదండ్రులు అన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య విచారణకు యూనివర్సిటీ వేసిన నిజనిర్దారణ కమిటీపై తొలిసారి సాక్షితో మాట్లాడిన పేరెంట్స్ మురళీకృష్ణ, దుర్గాభాయి.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ కూడా కమిటీలో సభ్యుడిగా ఉంటే ఇంకేం న్యాయం జరుగుతుందని ప్రశ్నించారు. సమాజ సేవకులు, విద్యార్థులు, రిటైర్డ్ న్యాయమూర్తులు, లాయర్లను కమిటీలో వేయాలని వారు డిమాండ్ చేశారు. ముందు ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని ఆయన ఉద్యోగంలో ఉంటే తమకు న్యాయం జరగదని స్పష్టం చేశారు. ఏడాది నుంచి తాము కాలేజీకి వస్తున్నా ఇంతవరకు హాస్టల్ వార్డెన్ ఎవరో కూడా తమకు తెలియదని, ఒక్కసారి కూడా ఆయన కనిపించలేదని చెప్పారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న తర్వాత కూడా ఆమె కనిపించలేదని అన్నారు. అంతా అయిపోయాక హాస్టల్లో సీసీటీవీ కెమెరాలు పెడతామంటే ఏం లాభమని ప్రశ్నించారు.