రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు | district court of gunturu rejects bail plea of rishiteswari case accused's | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు

Published Thu, Sep 3 2015 3:24 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు

రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు

గుంటూరు:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.రిషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్‌ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల బెయిల్ పిటిషన్ పై కోర్టు లో గురువారం వాదనలు జరిగాయి. అయితే వీరి బెయిల్ పిటిషన్ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది.

 

గత రెండు నెలల క్రితం ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై విచారించిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థిని ఆత్మహత్యకు ర్యాగింగ్ కే ప్రధాన కారణమని తన నివేదికలో స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సదరు విద్యార్థులు గత 49 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement