rishiteswari case
-
కోర్టు తీర్పుపై రిషితేశ్వరి తల్లిదండ్రుల ఆవేదన..
-
’ఆ ఆత్మహత్య కేసు నివేదిక నాదగ్గర లేదు’
-
సీఎం చంద్రబాబుకు రిషితేశ్వరి తండ్రి లేఖ
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసులో నిందితులకు శిక్ష పడే వరకూ తన పోరాటం కొనసాగిస్తానని తండ్రి మురళీ కృష్ణ స్పష్టం చేశారు. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఆయన గురువారం లేఖ రాశారు. తన కూతురు రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో అనేక అనుమానాలున్నాయని పేర్కొన్నారు. రిషితేశ్వరిని మరికొందరు సీనియర్లు వేధించారని ఆరోపణలున్నా.. ఎటువంటి చర్యలు ఎందుకు తీసుకోలేదన్నారు. ఈ కేసులో ప్రిన్సిపాల్ బాబురావు పాత్ర కన్పిస్తున్నా.. అతనిపై కేసు ఎందుకు నమోదు చేయడంలేదని లేఖలో ప్రశ్నించారు. కేసును లోతుగా దర్యాప్తు చేసి అసలు విషయాలను బయటకు తేవాలన్నారు. ఆర్థికసాయం కోసం కేసులో ఎవరితో రాజీ పడే ప్రసక్తే లేదని లేఖ ద్వారా చంద్రబాబుకు తెలిపారు. లేఖలో రిషితేశ్వరి తండ్రి మురళీ కృష్ణ ప్రధానంగా ప్రస్తావించినవి.. *ప్రిన్సిపాల్ బాబూరావు పాత్ర కన్పిస్తున్నా.. అతనిపై కేసు ఎందుకు నమోదు చేయలేదు? *ఫ్రెషర్స్ డే రోజు బాబూరావు ఉద్దేశపూర్వంకగానే రిషితేశ్వరికి శ్రీనివాస్ తో అవార్డు ఇప్పించారు *రిషితేశ్వరితో అసభ్యంగా ప్రవర్తించిన వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? *రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గది వద్దకు ముందుగా ప్రిన్సిపాల్ బాబు వెళ్లారు *పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మృతదేహాన్ని ఎందుకు తరలించారు? *బాలసుబ్రహ్మణ్యం కమిటీ నివేదికలో ర్యాగింగ్ జరిగిందని తేల్చినప్పటికీ బాబురావుపై ఎందుకు కేసు నమోదు చేయలేదు? *గతంలో బాబూరావుపై బీఆర్కే ఫ్యాకల్టీ డేవిడ్ రాజు గవర్నర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ ఎందుకు లోతైన విచారణ జరగలేదు? *పోలీసులు చార్జిషీటు వేయకముందే వీటిపై విచారణ జరిపి ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు నమోదు చేయాలి *సిట్టింగ్ జడ్జితో కేసును విచారించాలి -
రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
-
రిషితేశ్వరి కేసు:బెయిల్ పిటిషన్ కొట్టేసిన కోర్టు
గుంటూరు:ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం విద్యార్థిని ఎం.రిషితేశ్వరి మృతి కేసులో నిందితుల తరపున దాఖలైన బెయిల్ పిటిషన్ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హనీషా, జయచరణ్, శ్రీనివాస్ ల బెయిల్ పిటిషన్ పై కోర్టు లో గురువారం వాదనలు జరిగాయి. అయితే వీరి బెయిల్ పిటిషన్ ను జిల్లా సెషన్స్ కోర్టు కొట్టేసింది. గత రెండు నెలల క్రితం ర్యాగింగ్ కారణంగా రిషితేశ్వరి అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై విచారించిన బాల సుబ్రహ్మణ్యం కమిటీ విద్యార్థిని ఆత్మహత్యకు ర్యాగింగ్ కే ప్రధాన కారణమని తన నివేదికలో స్పష్టం చేసింది. కాగా, ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న సదరు విద్యార్థులు గత 49 రోజులుగా రిమాండ్ లో ఉన్నారు. -
'బాబూరావుపై కేసు పెట్టాలని కమిటీ చెప్పలేదు'
-
'బాబూరావుపై కేసు పెట్టాలని కమిటీ చెప్పలేదు'
హైదరాబాద్:ఇటీవల ఆచార్య నాగార్జన యూనివర్శిటీ(ఏఎన్ యూ)లో ఆత్మహత్యకు పాల్పడిన రిషితేశ్వరి కేసులో విచారణ నివేదికను ఇంకా బహిర్గత పరచలేదని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆ ఘటనకు సంబంధించి ఏం చేయాలో అనేది దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. కాగా, ఈకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావుపై కేసు పెట్టారా?అని మీడియా అడిగిన ప్రశ్నకు మాత్రం గంటా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. బాబురావుపై కేసు పెట్టాలని బాలసుబ్రహ్మణ్యం కమిటీ తమకు సూచించలేదన్నారు. -
మరో గాంధీ కోసం ఎదురు చూద్దాం..
-
మరో గాంధీ కోసం ఎదురు చూద్దాం..
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబూరావును అరెస్ట్ చేయనందుకు విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజును బ్లాక్ డేగా పాటించాలని విద్యార్థులు పిలుపిచ్చారు. ఫేస్బుక్లో రిషితేశ్వరి పేజీలో విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. చిట్టిచెల్లెలు మనల్ని విడిచి నెలరోజులు అయినా నిష్పక్షపాతంగా విచారణ జరగలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని స్వాతంత్ర్యం మనకొద్దంటూ విద్యార్థులు ఫేస్బుక్లో నిరసన తెలియజేశారు. మరో గాంధీ కోసం ఎదురు చూద్దామంటూ విద్యార్థులు కామెంట్లు పోస్ట్ చేశారు. -
బాబూరావుకు పెద్దల అండ?
సాక్షి, గుంటూరు: ఏఎన్‌యూ ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసులో మొదటి నుంచి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును పైస్థాయిలో కొందరు కాపాడుతున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. తమ కుమార్తెను సీనియర్ విద్యార్థులు వేధిస్తున్నారని ఫిర్యాదు చేసినా ప్రిన్సిపాల్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని రిషితేశ్వరి తండ్రి మురళీకృష్ణ నిజనిర్ధారణ కమిటీ ముందు చెప్పడం తెలిసిందే. మరోవైపు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ప్రకారం ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి విచారణ జరపాలంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ రాజశేఖర్ ఈనెల ఆరోతేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీ సులు ఆయనపై కేసు నమోదు చేయలేదు. రిషితేశ్వరి కేసులో విచారణ చేపట్టిన కమిటీలు రెండూ ర్యాగింగ్ వ్యవహారంలో ప్రిన్సిపాల్ ప్రోత్సాహం ఉన్నట్లు స్పష్టం చేశాయి. ఫ్రెషర్స్ డే పార్టీని ఉద్దేశపూర్వకంగానే హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేశారని, ఈ పార్టీలో మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులు పాల్గొనాల్సి ఉండగా, ప్రిన్సిపాల్ నాలుగో సంవత్సరం విద్యార్థులైన జయచరణ్, శ్రీనివాస్‌లను సైతం తీసుకొచ్చారని కమిటీ తెలిపింది. ఈ పార్టీలో విద్యార్థులందరికీ తన చేతుల మీదుగా బహుమతులు ఇచ్చిన ప్రిన్సిపాల్ రిషితేశ్వరికి మాత్రం చరణ్ చేతుల మీదుగా ఇప్పించినట్లు చెబుతున్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య తరువాత తనపై ఆరోపణలు రాగానే ప్రిన్సిపల్ హైదరాబాద్ వె ళ్లి సీఎం పేషీలో కొందరు అధికారుల ద్వారా పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రిషితేశ్వరి మృతి కేసులో ముగ్గురు నిందితులకు బెయిల్ నిరాకరిస్తూ గుంటూరు ఒకటో అదనపు జిల్లా జడ్జి జి.గోపిచంద్ సోమవారం ఆదేశాలు జారీచేశారు. రిషితేశ్వరి కేసులో ఆమె తండ్రి మురళీకృష్ణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వీరి ముగ్గురు పేర్లు స్ప ష్టంగా ప్రస్తావించినట్టు ఆ ఆర్డర్లో తెలిపారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 27 మంది సాక్షులను విచారించారని తెలిపారు. ఈ కేసులో మొదటి ముద్దాయి దుంపా హనీషా, రెండో ముద్దాయి ధరావత్ జయచరణ్, మూడో ముద్దా యి నరాల శ్రీనివాస్‌ల పాత్ర ఉన్నట్లు కొంతమంది సాక్షులు తెలిపారని, వీరు ముగ్గురు ర్యాగింగ్ వంటి వికృత చర్యలకు పాల్పడ్డట్లు, ర్యాగింగ్ పేరుతో రిషితేశ్వరిపై మానసిక, శారీ రక, లైంగిక వేధింపులకు పాల్పడ్డట్లు పేర్కొన్నారని తెలిపారు. ర్యాగింగ్ కారణంగానే రిషితేశ్వరి మృతిచెందినట్లు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారని, అనీషా అనే విద్యార్థిని విషయంలో ఎటువంటి వివాదం లేదని, మరో అనీషా ఉందనే విషయంపై ఎటువంటి ఆధారాలు కోర్టు ఎదుట ప్రవేశపెట్టలేదని పేర్కొన్నారు. కేసు ద ర్యాప్తులో ఉందని, బెయిల్ మంజూరు చేయడం సరికాదంటూ పిటిషన్ తిరస్కరించారు. -
వీసీ తొలగింపు.. ప్రిన్సిపాల్ పై వేటు
హైదరాబాద్:నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్యకు పాల్పడిన ఆర్కిటెక్చర్ విద్యార్థిని రిషితేశ్వరి కేసుకు సంబంధించి సుబ్రహణ్యం కమిటీ అందజేసిన నివేదికన ఏపీ ప్రభుత్వం బహిర్గతం చేసింది. శనివారం రిషితేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించి నివేదికను కమిటీ ప్రభుత్వానికి అందజేసిన సంగతి తెలిసిందే. ఈ నివేదికలో పలువిషయాలను ఆదివారం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాకు వెల్లడించారు. ర్యాగింగ్ కారణంగానే రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్నట్లు కమిటీ పేర్కొన్నట్లు ఆయన స్పష్టం చేశారు. నైతికత, మానవీయతలేని విపత్కర పరిస్థితుల్లో.. మానసికంగా కృంగిపోయిన రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుందన్నారు. భవిష్యత్ లో ర్యాగింగ్ అన్నపదం ఉచ్ఛరించడానికి భయపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు గంటా తెలిపారు. రిషితేశ్వరి ఆత్మహత్య కేసుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఇంఛార్జి వీసీ సాంబశివరావు తొలగించడమే కాకుండా.. ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రిన్సిపాల్ బాబూరావును డిస్మిస్ చేసినట్లు గంటా తెలిపారు. గంటా మీడియాకు తెలిపిన నివేదికలోని అంశాలు.. *రిషితేశ్వరి ఆత్మహత్యకు ర్యాగింగే కారణమని నిర్దారణ అయ్యింది *ప్రిన్సిపాల్ బాబూరావును విచారించమని కమిటీ చెప్పింది *బాబురావును డిస్మిస్ చేసి... పోలీస్ విచారణకు ఆదేశించాం *ఆరోపణలు నిజమని తేలితే బాబూరావును ప్రాసిక్యూట్ చేస్తాం *ర్యాంగింగ్ లో మరికొంతమంది పేర్లు కూడా ఉన్నట్లు పేర్కొన్న కమిటీ నివేదిక *హస్టల్లో రక్షణ లేదు.. పూర్తిస్థాయి వార్డెన్ కూడా లేరు *యూనివర్శిటీలో అనేక వ్యవస్థాపక లోపాలున్నాయి *ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పగించాలని కమిటీ సూచించింది *ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాం *స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏర్పాటు చేయాలని కమిటీ పేర్కొంది *ర్యాగింగ్ నిరోధానికి సెలబ్రిటీలు, ఫిల్మ్ స్టార్లతో ప్రచారం *యూనివర్శిటీల్లో బయట వ్యక్తులను లోనికి రాకుండా నియంత్రించాలి *యూనివర్శిటీల్లో గుర్తింపు కార్డులు తప్పనిసరి *యూనివర్శిటీల్లో కులసంఘాలు లేకుండా చర్యలు *అవసరమైతే పోలీస్ అవుట్ పోస్ట్ లను ఏర్పాటు చేస్తాం *షీ టీమ్ లు, టోల్ ఫ్రీ నంబర్లు.. మఫ్టీల్లో మహిళా పోలీసులను ఏర్పాటు చేస్తాం *మూడు యాక్ట్ ల కింద రిషితేశ్వరి కేసు విచారణ *యూనివర్శిటీలో ఇష్టారాజ్యంగా పరిస్థితులు *నాగార్జున యూనివర్శిటీ ఇంఛార్జి వీసీ సాంబశివరావు తొలగింపు *ఐఏఎస్ అధికారిని ఉదయలక్ష్మిని ఇంఛార్జి వీసీగా నియమిస్తున్నాం *170 మంది విద్యార్థులను విచారించం *వర్శిటీ పెద్దలను విచారించారు *అన్యాయాలకు, అక్రమాలకు అడ్డగా వర్శిటీ మారింది *పోలీసులు పూర్తిస్థాయి విచారణ ఆదేశం.. అనంతరం నిందితులపై చర్యలు *నిందితులు ఎక్కడా చదువుకోకుండా చర్యలు *ప్రెషర్స్ పార్టీని బయట ప్రాంతాల్లో కాకుండా కళాశాలల్లోనే నిర్వహించేలా చర్యలు *చాలా రోజుల తర్వాత బయట ఫ్రెషర్స్ డే పార్టీని నిర్వహించడం కూడా రిషితేశ్వరి ఆత్మహత్యకు కారణం *నియమాలు, నిబంధనలు ఆర్కిటెక్చర్ కాలేజీలో లేవు, సరైన భద్రతా వ్యవస్ధలు కూడా లేవు *అన్యాయాలకు, అరాచకాలకు ఒక అడ్రస్ లా యూనివర్శిటీ తయారైంది *ఆర్కిటెక్చర్ కోర్సులో 50 శాతం మార్కులు ప్రిన్సిపాల్ చేతిలో ఉన్నాయి *ఎవరైనా ఫిర్యాదు చేసినా భవిష్యత్తు ఏమవుతుందోనన్న భయం విద్యార్థుల్లో ఉన్న మాట వాస్తవమే *సీనియర్ విద్యార్థులు, కొంతమంది అధ్యాపకులు కలసి వేధింపులకు గురి చేస్తున్నారు *దీనిపై కూడా కమిటీ దృష్టి సారించింది *ఇక నుంచి రాత్రిపూట యూనివర్శిటీల్లో ఆకస్మిక తనిఖీలు -
నాగార్జున వర్సిటీలో పటిష్ట భద్రత
గుంటూరు: పదిరోజులు సెలవుల అనంతరం బుధవారం నుంచి నాగార్జున యూనివర్సిటీ కళాశాలల తరగతులు, వసతి గృహాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బుధవారం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. రిషితేశ్వరి మృతికి కారకులైన వారిని శిక్షించాలని యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగిన నేపథ్యంలో యూనివర్సిటీకి పదిరోజుల సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. సెలవుల్లో విచారణ చేయటాన్ని పలు ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో రుషితేశ్వరి ఘటనపై బాల సుబ్రహ్మణ్యం కమిటీ వర్సిటీలో మరోసారి విచారణ చేపట్టనుంది. కాగా బయట వ్యక్తులు వర్సిటీలోకి రాకుండా ప్రధాన ద్వారం వద్ద ఆంక్షలు విధించారు. గుర్తింపు కార్డు ఉన్నవారినే లోపలికి అనుమతిస్తున్నారు. విద్యార్థులు కూడ ఆందోళన ఉధృతం చేసే అవకాశం ఉండటంతో పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా రుషితేశ్వరి మృతికి కారణమైన వారందరిపై కేసు నమోదు చేసి, శిక్షించాలని పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసిన ఎంపి రాపోలు!
-
'రిషితేశ్వరి' నిందితులను అరెస్టు చేయాలి
- వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం డిమాండ్ - వైఎస్సార్ జిల్లాలో భారీ ఆందోళన వైఎస్ఆర్ కడప జిల్లా: సంచలనాత్మక రుషికేశ్వరి ఆత్మహత్య కేసులో నిందితుల అరెస్టును డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం ఆందోళన బాటపట్టింది. రుషితేశ్వరి తన సూసైడ్ నోట్ లో పేర్కొన్నట్లు అధ్యాపకులు, సీనియర్ల వేధింపులు భరించలేకే ఆత్మహత్య చేసుకుందని, నిదితులను అరెస్టు చేయాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగిపోయిందని ఆరోపించింది.ఇప్పటికైనా నిందితులను అరెస్టుచేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కడప నగరంలో భారీ ర్యాలీతోపాటు, మానవహారాం నిర్వహించారు. -
రిషితేశ్వరి మృతిపై విచారణ కమిటి ఏర్పాటు!
-
'రిషితేశ్వరి కేసు నిందితులకు పెద్దల అండదండలు'
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారికి పెద్దల అండదండలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆ కేసులోని దోషులను శిక్షించి.. కఠినంగా చర్యలు తీసుకొని.. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు. చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాధ్యులెంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి అన్నారు.