'రిషితేశ్వరి కేసు నిందితులకు పెద్దల అండదండలు' | vijaya saireddy statement on rishiteswari case | Sakshi
Sakshi News home page

'రిషితేశ్వరి కేసు నిందితులకు పెద్దల అండదండలు'

Published Mon, Jul 27 2015 4:45 PM | Last Updated on Fri, Aug 17 2018 2:08 PM

'రిషితేశ్వరి కేసు నిందితులకు పెద్దల అండదండలు' - Sakshi

'రిషితేశ్వరి కేసు నిందితులకు పెద్దల అండదండలు'

గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ విద్యార్థిని రిషితేశ్వరి మరణానికి కారణమైన వారికి పెద్దల అండదండలు ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేత విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ఆ కేసులోని దోషులను శిక్షించి.. కఠినంగా చర్యలు తీసుకొని.. రిషితేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.  చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని మండిపడ్డారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే బాధ్యులెంతటి వారైనా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement