యూనివర్సిటీల్లో ప్రతి సోమవారం డయల్ యువర్ కార్యక్రమం నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. నిపుణుల కమిటీ నివేదిక పరిశీలించి యూనివర్సిటీ చట్టాన్ని సవరిస్తామని బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన చెప్పారు. ప్రైవేటు యూనివర్సిటీల బిల్లును త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. నాణ్యమైన విద్య కోసమే ఈ బిల్లు తెస్తున్నామని పేర్కొన్నారు.