
మరో గాంధీ కోసం ఎదురు చూద్దాం..
గుంటూరు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్కిటెక్చర్ విద్యార్థి రిషితేశ్వరి ఆత్మహత్య కేసులో ప్రిన్సిపల్ బాబూరావును అరెస్ట్ చేయనందుకు విద్యార్థుల ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజును బ్లాక్ డేగా పాటించాలని విద్యార్థులు పిలుపిచ్చారు. ఫేస్బుక్లో రిషితేశ్వరి పేజీలో విద్యార్థులు విస్తృతంగా ప్రచారం చేశారు.
చిట్టిచెల్లెలు మనల్ని విడిచి నెలరోజులు అయినా నిష్పక్షపాతంగా విచారణ జరగలేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు రక్షణ కల్పించలేని స్వాతంత్ర్యం మనకొద్దంటూ విద్యార్థులు ఫేస్బుక్లో నిరసన తెలియజేశారు. మరో గాంధీ కోసం ఎదురు చూద్దామంటూ విద్యార్థులు కామెంట్లు పోస్ట్ చేశారు.