భారతదేశంలో ఎంతో మంది నిష్టాతులైన మహిళలు బిలియన డాలర్ల కంపెనీలకు సీఈవోలుగా పనిచేసి తామేంటో ఫ్రూ చేసుకున్నారు. అంతేగాదు మహిళలు ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని అయినా చాలా సునాయాసంగా నడపగలరని చేసి చూపించారు. అలాంటి కోవకు చెందిందే అను అగా.
అను అగా ప్రముఖ ఇంధన పర్యావరణ ఇంజనీరింగ్ సంస్థ అయిన థర్మాక్స్‌కు చైర్‌పర్సన్‌గా సేవలందించారు. ఆమె ఈ పదవిలో 1996 నుంచి 2004 వరకు కంపెనీ చైర్‌పర్సన్‌గా చాలా సమర్థవంతంగా పనిచేశారు. అంతేగాదు కంపెనీ వృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సరిగ్గా 2004లో ఆ పదవి నుంచి వైదొలగినప్పటికీ కంపెనీని పర్యవేక్షిస్తూనే ఉండేవారు. చివరి 2018లో తన కుమార్తె మెహర్ పుదుమ్జీకి పూర్తిగా బాధ్యతలు అప్పగించారు. డిసెంబర్ 4, 2023 నాటికి కంపెనీ క్యాపిటలైజేషన్ ఏకంగా రూ. 30,408 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంది.
అను పదవీవిరమణ తర్వాత పూర్తి సమయాన్ని సామాజిక సేవకు అంకితం చేసింది. అందుకుగానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డుతో సత్కరించింది. ఫోర్బ్స్ భారతీయు సంపన్నుల జాబితా ప్రకారం డిసెంబర్ 4,2023 నాటికి ఆమె సుమారు రూ. 20 వేల కోట్ల సంపదతో ఉన్నట్లు అంచనా వేసింది. అంతేగాదు భారతదేశంలో ఇంజనీరింగ్ రంగంలో అత్యంత సంపన్న మహిళగా నిలిచింది. ఇక ఈ థర్మాక్స్‌లో అను అగ ప్రయాణం 1985 నుంచి ప్రారంభమయ్యింది. ఇక ఆమె భర్త మృతితో 1996 కంపెనీ బాధ్యతలు తీసుకోంది.
ఎవ్వరూ ఊహించని రీతిలో కంపెనీని తనదైన చతురతో మంచి లాభాల బాటలోకి తీసుకుపోయింది. అంతేగాదు 2012లో అను రాజ్యసభకు నామినేట్ అయ్యారు కూడా. ఇక విద్యాపరంగా ఆమె ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజ్ నుంచి బీఏ ఎకనామిక్స్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సెస్(టీఐఎస్‌ఎస్) నుంచి మెడికల్ అండ్ సైక్రియాట్రిక్ సోషల్ వర్క్‌లో పీజీ చేసింది. ఆమె కంపెనీ బాధ్యలు తీసుకునే నాటికీ మహిళలు అంతగా ఆ రంగంలో లేరు. అలాంటి సమయంలో ధైర్యంగా కంపెనీ బాధ్యతలు తీసుకోవడమే గాక చైర్‌పర్స్‌గా సమర్థవంతంగా నిర్వహించి బావితరాలకు ప్రేరణగా నిలిచారు అను అగా.!
(చదవండి: ఈసారి 'కర్తవ్య పథ్'లో దేశంలోని 'నారీ శక్తి'తో చారిత్రాత్మక కవాతు!)
Comments
Please login to add a commentAdd a comment