దేశంలోని ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు పెట్టింది పేరు ముంబై. ముఖ్యంగా వర్లీ ప్రాంతం అత్యంత ఖరీదైన సీ వ్యూ లగ్జరీ అపార్ట్‌మెంట్లకు ప్రసిద్ధి చెందింది. అనేక మంది వ్యాపార ప్రముఖలు, సెలబ్రిటీలు ఇక్కడ నివాసాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల కంపెనీల్లో ఒకటైన కిరణ్ జెమ్స్ డైరెక్టర్ రాజేష్ లభుభాయ్ లఖానీ తాజాగా ఇక్కడ రూ.97 కోట్లు పెట్టి లగ్జరీ సీ వ్యూ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు.
త్రీసిక్స్టీ వెస్ట్‌లోని సూపర్ ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో రాజేష్ లఖానీ కొనుగోలు చేసిన అపార్ట్‌మెంట్ 44వ అంతస్తులో ఉంది. దీని విస్తీర్ణం 14,911 చదరపు అడుగులు. ‘జాప్‌కీ’కి లభించిన పత్రాల ప్రకారం.. రాజేష్ లఖానీ ఈ అపార్ట్‌మెంట్‌ను మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడిగా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్టేషన్ మే 29న జరగగా రూ.5.84 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించినట్లు తెలుస్తోంది.
కాగా ఏప్రిల్ నెలలో కిరణ్ జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ మావ్‌జీభాయ్ పటేల్ ఇదే టవర్‌లోని 47వ అంతస్తులో రూ. 97 కోట్లు వెచ్చించి అపార్ట్‌మెంట్ కొనుగోలు చేశారు. త్రీసిక్స్టీ వెస్ట్ రెండు టవర్లుగా ఉంటుంది. ఒక దాంట్లో రిట్జ్-కార్ల్‌టన్ హోటల్ నిర్వహిస్తుండగా మరో టవర్‌లో లగ్జరీ నివాసాలను ఇదే సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఏడు కార్ పార్కింగ్ స్లాట్‌లు సహా అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment