60వ అంతస్తులో అపార్ట్‌మెంట్‌.. రూ.115 కోట్లు | luxury Rs 115 crore sea facing apartment in Mumbai bought by | Sakshi
Sakshi News home page

60వ అంతస్తులో అపార్ట్‌మెంట్‌.. రూ.115 కోట్లు

Sep 9 2024 6:56 PM | Updated on Sep 9 2024 7:46 PM

luxury Rs 115 crore sea facing apartment in Mumbai bought by

ముంబై అత్యంత ఖరీదైన ప్రాపర్టీలకు చిరునామా మారింది. బీజింగ్‌ను అధిగమించి ఆసియా కొత్త బిలియనీర్ హబ్‌గా అవతరించిన ఈ మహానగరం సెలబ్రిటీలు, బిజినెస్‌ లీడర్లు, స్టాక్ వ్యాపారులు, చలనచిత్ర ప్రముఖులతో సహా అత్యంత సంపన్నులను ఆకర్షిస్తోంది. అనేక మంది ఇక్కడ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు.

తాజాగా ఎబ్కో ప్రైవేట్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ అయిన యాష్లే నాగ్‌పాల్, ఆయన భార్య బియాంకా నాగ్‌పాల్ ముంబైలోని వర్లీ పరిసరాల్లో 7,139 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రూ.115 కోట్లకు కొనుగోలు చేశారు. ఒబెరాయ్ రియాల్టీకి చెందిన ఎలైట్ త్రీ సిక్స్టీ వెస్ట్ ప్రాజెక్ట్‌లోని 60వ అంతస్తులో ఉన్న ఫ్లాట్‌ కోసం వారు చదరపు అడుగుకు దాదాపు రూ. 1.62 లక్షలు చొప్పున చెల్లించారు.

ఒబెరాయ్ త్రీ సిక్స్టీ వెస్ట్ అనేది రెండు టవర్‌లను కలిగి ఉన్న ప్రసిద్ధ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్. ఒక దాంట్లో రిట్జ్-కార్ల్‌టన్ హోటల్, మరొకదాంట్లో ప్రీమియం అపార్ట్‌మెంట్‌లు ఉన్నాయి. ఈ ఎత్తైన భారీ రెసిడెన్షియల్ టవర్‌లో 4, 5-బెడ్‌రూమ్ అపార్ట్‌మెంట్‌లు, డ్యూప్లెక్స్‌లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్‌కు ఐదు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, 164 చదరపు అడుగుల అదనపు స్థలం ఉన్నాయి.

ఇది హై-ప్రొఫైల్ వ్యక్తులకు, ముఖ్యంగా బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలకు నివాసంగా మారింది. బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్, డి'మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ, ఎవరెస్ట్ మసాలా ప్రమోటర్ వాడిలాల్ భాయ్ షాతో పాటు మరికొందరికి సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. గత మే నెలలో షాహిద్ కపూర్, మీరా కపూర్ దంపతులు దాదాపు రూ.60 కోట్లు పెట్టి 5,395 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను ఇక్కడ కొనుగోలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement