luxury apartments
-
రూ.50 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు.. ఎక్కడంటే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి కొత్తగా రూ.50 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని పదహారో అంతస్తులో ఆయన ఫ్లాట్ కొనుగోలు చేశారు. సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ నాలుగు బెడ్రూమ్లను కలిగి ఉంది. దీనికి ఐదు కారు పార్కింగ్ స్థలాలున్నాయి. మూర్తి దీన్ని రూ.50 కోట్లతో కొనుగోలు చేయడంతో నగరంలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్ల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ టవర్స్‌లో ఫ్లాట్ సొంతం చేసుకున్న ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి మూర్తి తాజాగా ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.బెంగళూరు నగరం మెయిన్ సిటీలో ఉన్న యూబీ సిటీ హౌస్ వద్ద కింగ్‌ఫిషర్ టవర్స్ 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మూడు బ్లాకుల్లో 34 అంతస్తుల్లో 81 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి సగటున 8,321 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్నాయి. గతంలో ఈ ప్రదేశంలో విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండేది. అందులో ఫ్లాట్లు నిర్మించారు. ఇందుకోసం 2010లో కింగ్‌ఫిషర్, ప్రెస్టీజ్ గ్రూప్ కలిసి పనిచేశాయి. ఇప్పటికే ప్రెస్టీజ్ గ్రూప్ ఆధ్వర్యంలోని 41 లగ్జరీ అపార్ట్మెంట్లను సంస్థ విక్రయించింది.ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!ఇప్పటికే నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఆ టవర్స్‌లో 23 అంతస్తులో రూ.29 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా, కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్, క్వెస్ట్ గ్లోబల్ సీఈఓ, ఛైర్మన్ అజిత్ప్రభు ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. -
60వ అంతస్తులో అపార్ట్మెంట్.. రూ.115 కోట్లు
ముంబై అత్యంత ఖరీదైన ప్రాపర్టీలకు చిరునామా మారింది. బీజింగ్‌ను అధిగమించి ఆసియా కొత్త బిలియనీర్ హబ్‌గా అవతరించిన ఈ మహానగరం సెలబ్రిటీలు, బిజినెస్ లీడర్లు, స్టాక్ వ్యాపారులు, చలనచిత్ర ప్రముఖులతో సహా అత్యంత సంపన్నులను ఆకర్షిస్తోంది. అనేక మంది ఇక్కడ ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నారు.తాజాగా ఎబ్కో ప్రైవేట్ లిమిటెడ్ టెక్నికల్ డైరెక్టర్ అయిన యాష్లే నాగ్‌పాల్, ఆయన భార్య బియాంకా నాగ్‌పాల్ ముంబైలోని వర్లీ పరిసరాల్లో 7,139 చదరపు అడుగుల విస్తీర్ణంలో విలాసవంతమైన అపార్ట్‌మెంట్‌ను రూ.115 కోట్లకు కొనుగోలు చేశారు. ఒబెరాయ్ రియాల్టీకి చెందిన ఎలైట్ త్రీ సిక్స్టీ వెస్ట్ ప్రాజెక్ట్‌లోని 60వ అంతస్తులో ఉన్న ఫ్లాట్ కోసం వారు చదరపు అడుగుకు దాదాపు రూ. 1.62 లక్షలు చొప్పున చెల్లించారు.ఒబెరాయ్ త్రీ సిక్స్టీ వెస్ట్ అనేది రెండు టవర్లను కలిగి ఉన్న ప్రసిద్ధ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్. ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్, మరొకదాంట్లో ప్రీమియం అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఈ ఎత్తైన భారీ రెసిడెన్షియల్ టవర్‌లో 4, 5-బెడ్రూమ్ అపార్ట్మెంట్లు, డ్యూప్లెక్స్‌లు, పెంట్‌హౌస్‌లు ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్‌కు ఐదు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు, 164 చదరపు అడుగుల అదనపు స్థలం ఉన్నాయి.ఇది హై-ప్రొఫైల్ వ్యక్తులకు, ముఖ్యంగా బాలీవుడ్ తారలు, వ్యాపారవేత్తలకు నివాసంగా మారింది. బాలీవుడ్ నటులు షాహిద్ కపూర్, అభిషేక్ బచ్చన్, డి'మార్ట్ వ్యవస్థాపకుడు రాధాకృష్ణ దమానీ, ఎవరెస్ట్ మసాలా ప్రమోటర్ వాడిలాల్ భాయ్ షాతో పాటు మరికొందరికి సముద్ర తీరానికి సమీపంలో ఉన్న ఈ విలాసవంతమైన అపార్ట్మెంట్లు ఉన్నాయి. గత మే నెలలో షాహిద్ కపూర్, మీరా కపూర్ దంపతులు దాదాపు రూ.60 కోట్లు పెట్టి 5,395 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్‌ను ఇక్కడ కొనుగోలు చేశారు. -
సాగర తీరంలో లగ్జరీ ఫ్లాట్.. రూ.41 కోట్లకు కొన్న కేరళ బిజినెస్‌మ్యాన్
కేరళకు చెందిన నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ పి.నందకుమార్ ముంబైలో ఖరీదైన లగ్జరీ సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. ప్రైమ్ కార్టర్ రోడ్డులో రూ.41.25 కోట్లకు ఈ అపార్ట్మెంట్ కొన్నట్లు ఈ లావాదేవీకి సహకరించిన రియల్ ఎస్టేట్ ప్రాప్‌టెక్ కంపెనీ నోబ్రోకర్‌ను ఉటంకిస్తూ మనీకంట్రోల్ నివేదిక పేర్కొంది.వెస్ట్ బాంద్రా ప్రాంతంలో 4,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ అపార్ట్ మెంట్ ఉంది. ఏప్రిల్ 24న రిజిస్ట్రేషన్ జరగ్గా, ఎస్ రహేజా డెవలపర్స్ దీనిని విక్రయించింది. దీని కోసం నందకుమార్ రూ.2.3 కోట్ల స్టాంప్ డ్యూటీ చెల్లించారు. ప్రస్తుతం ముంబైలో కుటుంబ వ్యాపారాన్ని నిర్వహిస్తున్న నందకుమార్ కుమారుడు ఈ నివాసం ఉపయోగించనున్నట్లు సమాచారం. కేరళకు చెందిన ఈ కుటుంబానికి ముంబైలో ఇదే తొలి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్.ముంబైలోని ఈ ఖరీదైన ప్రాంతంలో ఇటీవల పలువురు వ్యాపార సినీ ప్రముఖలు లగ్జరీ ఫ్లాట్లు కొనుగోలు చేశారు. యానిమల్, బుల్బుల్, కాలా తదితర చిత్రాల్లో నటించిన నటి తృప్తి దిమ్రీ జూన్ 3న ముంబైలోని బాంద్రా వెస్ట్ కార్టర్ రోడ్లో ఓ లగ్జరీ ప్రాపర్టీని రూ.14 కోట్లకు కొనుగోలు చేశారు. అంతకు ముందు మే నెలలో బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ ముంబైలోని బోరివాలిలో ఆరు లగ్జరీ అపార్ట్మెంట్లను రూ .15.42 కోట్లకు కొనుగోలు చేశారు. -
‘హౌస్’ఫుల్ డిమాండ్!! రూ. 2,700 కోట్ల అపార్ట్మెంట్లు విక్రయం
గురుగ్రామ్‌లో కొత్తగా ప్రారంభించిన హౌసింగ్ ప్రాజెక్టులో రూ.2,700 కోట్లకు పైగా విలువైన ప్రీమియం అపార్ట్మెంట్లను విక్రయించినట్లు రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ తెలిపింది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 71లో 'టైటానియం ఎస్పీఆర్' పేరుతో ఈ ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు సిగ్నేచర్ గ్లోబల్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.విక్రయించాల్సిన అపార్ట్మెంట్ల కంటే రెట్టింపు సంఖ్యలో ఆసక్తి వ్యక్తమవడంతో ఈ ప్రాజెక్టుకు విశేష స్పందన లభించిందని కంపెనీ తెలిపింది. ఆసక్తి వ్యక్తీకరణ నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్న కేటాయింపు ప్రక్రియ ద్వారా రూ.2,700 కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు చెప్పింది. కేటాయింపుల ప్రక్రియ ఖరారైన తర్వాత మొత్తం అమ్మకాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని భావిస్తున్నారు.సిగ్నేచర్ గ్లోబల్ ఈ కొత్త ప్రాజెక్టులో ఎన్ని హౌసింగ్ యూనిట్లను ప్రారంభించింది, వాటిలో ఇప్పటివరకు ఎన్ని విక్రయించింది వెల్లడించలేదు. ప్రీమియం ఫ్లాట్లను ఏ రేట్లకు విక్రయించిందో కూడా బహిరంగపరచలేదు. కంపెనీ ఈ ప్రాజెక్టును రెండు దశల్లో అభివృద్ధి చేస్తుందని, మొదటిది 2.1 మిలియన్ చదరపు అడుగులు, రెండవది 1.5 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉందని ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాజెక్టుకు వినియోగదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందని సిగ్నేచర్ గ్లోబల్ చైర్మన్ ప్రదీప్ అగర్వాల్ తెలిపారు. -
దాదాపు రూ. 100 కోట్లు.. లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోని ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు పెట్టింది పేరు ముంబై. ముఖ్యంగా వర్లీ ప్రాంతం అత్యంత ఖరీదైన సీ వ్యూ లగ్జరీ అపార్ట్మెంట్లకు ప్రసిద్ధి చెందింది. అనేక మంది వ్యాపార ప్రముఖలు, సెలబ్రిటీలు ఇక్కడ నివాసాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల కంపెనీల్లో ఒకటైన కిరణ్ జెమ్స్ డైరెక్టర్ రాజేష్ లభుభాయ్ లఖానీ తాజాగా ఇక్కడ రూ.97 కోట్లు పెట్టి లగ్జరీ సీ వ్యూ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.త్రీసిక్స్టీ వెస్ట్‌లోని సూపర్ ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో రాజేష్ లఖానీ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ 44వ అంతస్తులో ఉంది. దీని విస్తీర్ణం 14,911 చదరపు అడుగులు. ‘జాప్కీ’కి లభించిన పత్రాల ప్రకారం.. రాజేష్ లఖానీ ఈ అపార్ట్‌మెంట్‌ను మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడిగా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్టేషన్ మే 29న జరగగా రూ.5.84 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించినట్లు తెలుస్తోంది.కాగా ఏప్రిల్ నెలలో కిరణ్ జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ మావ్జీభాయ్ పటేల్ ఇదే టవర్లోని 47వ అంతస్తులో రూ. 97 కోట్లు వెచ్చించి అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. త్రీసిక్స్టీ వెస్ట్ రెండు టవర్లుగా ఉంటుంది. ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ నిర్వహిస్తుండగా మరో టవర్‌లో లగ్జరీ నివాసాలను ఇదే సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఏడు కార్ పార్కింగ్ స్లాట్లు సహా అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. -
Md Anwarul Azim Anwar: బెంగాల్లో బంగ్లా ఎంపీ హత్య
కోల్‌కతా/ఢాకా: చికిత్స కోసం భారత్‌కు వచ్చిన బంగ్లాదేశ్‌కు చెందిన ఆవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అన్వర్ దారుణ హత్యకు గురయ్యారు. కోల్‌కతాలోని న్యూటౌన్ లగ్జరీ అపార్ట్మెంట్లో పోలీసులు రక్తపు మరకలను గుర్తించారు. మృతదేహం కోసం పోలీసుల అన్వేషణ కొనసాగుతోంది. నిందితులు, హత్యకు గల కారణాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. బంగ్లా సీనియర్ నేత హత్యోదంతాన్ని ఇరుదేశాల ప్రభు త్వాలు సీరియస్‌గా తీసుకు న్నాయి. పశ్చిమబెంగాల్ సీఐడీ విభాగం ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ముగ్గు్గరు నిందితులను ఢాకాలోని వరీ ప్రాంతంలో అరెస్ట్‌చేశారు. కోల్కతాకొచ్చి కనిపించకుండాపోయి..మే 12వ తేదీన ఎంపీ అన్వర్ నార్త్ కోల్‌కతాలోని బారానగర్‌లో తనకు పరిచయస్తుడైన గోపాల్ బిశ్వాస్ ఇంటికి వచ్చారు. మే 13వ తేదీ మధ్యాహ్నం డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి అన్వర్ బయటకు వెళ్లారు. రాత్రి భోజనానికి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి ఎంతకీ రాకపోవడంతో గోపాల్‌కు అనుమానమొచ్చింది. అయితే అత్యవసర పని మీద ఢిల్లీకి వెళ్తున్నానని, వీఐపీలను కలబోతున్నానని వాట్సాప్ సందేశాలు వచ్చాయి. తర్వాత మే 17వ తేదీదాకా ఆయన నుంచి ఎలాంటి మెసేజ్‌లు, ఫోన్‌కాల్స్ రాకపోవడంతో మే 18వ తేదీన మిస్సింగ్ కంప్లయింట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అన్వర్ ఫోన్ జాడను కనిపెట్టే పనిలో పడ్డారు. మే 13న అన్వర్ చివరిసారిగా సంజీబ్ ఘోష్‌కు చెందిన అపార్ట్మెంట్లో లోపలికి ఇద్దరు వ్యక్తులు, ఒక మహిళతో వెళ్లినట్లు సీసీటీవీలో రికార్డయింది. మే 15, 17 తేదీల్లో ఆ గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తులు, మహిళ ఆ అపార్ట్మెంట్ నుంచి బయటికొచ్చారుగానీ అన్వర్ రాలేదు. అన్వర్ మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఎక్కడో పడేసి ఉంటారని సీఐడీ ఐజీ అఖిలేశ్ అనుమానం వ్యక్తంచేశారు. -
ధరెంతైనా.. ఖరీదైన ఇళ్లను ఎగబడి కొనుగోలు చేస్తున్న భారతీయులు
భారతీయలు లగ్జరీ ఇళ్లను కొనుగోలు చేసేందుకు మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రాపర్టీ కన్సల్టెంట్ అనరాక్ గ్రూప్ నివేదిక ప్రకారం.. మన దేశంలో విక్రయించే లగ్జరీ గృహాల వాటా గత ఐదేళ్లలో మూడు రెట్లు పెరిగింది.శుక్రవారం విడుదల చేసిన నివేదిక ప్రకారం విలాసవంతమైన గృహాల విలువ కోటిన్నర కంటే ఎక్కువ ధర ఉన్నట్లు తెలింది. భారత్‌లోని తొలి ప్రధాన ఏడు నగరాల్లో ఈ ఏడాది జనవరి- మార్చి (మొదటి త్రైమాసికం)లో విక్రయించిన రెసిడెన్షియల్ యూనిట్లు 21 శాతంగా ఉన్నాయి. 2019లో ఇదే కాలానికి 7శాతం మాత్రమే విక్రయించినట్లు నివేదిక హైలెట్ చేసింది. బలమైన ఆర్థిక వృద్ధి, ప్రవాస భారతీయుల నుండి డిమాండ్ కారణంగా భారత్‌లో రియల్ ఎస్టేట్ రంగం ఊపందుకుంది. వెరసి ఈ ఏడాది ప్రారంభంలో డీఎల్ఎఫ్ కంపెనీ న్యూఢిల్లీకి సమీపంలో 1,100 కంటే ఎక్కువ గృహాలు నిర్మాణాన్ని ప్రారంభించక ముందే మూడు రోజుల్లో అమ్ముడయ్యాయి. వీటిలో అధిక భాగం ఎన్ఆర్ఐలు కొనుగోలు చేశారు. బడ్జెట్ ధరలో లభ్యమయ్యే ఇళ్లు అదే కాలంలో అమ్మకాల వాటా 37శాతం నుండి 18శాతానికి క్షీణించాయి. మధ్య శ్రేణి, ప్రీమియం హౌసింగ్ సెగ్మెంట్లో 4 మిలియన్ నుంచి 15 మిలియన్ మధ్య ధర కలిగిన గృహాలు దాదాపు 59 శాతం వాటాతో అత్యధికంగా అమ్ముడు పోయినట్లు అనరాక్ నివేదిక హైలెట్ చేసింది. -
లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించిన ముఖేష్ అంబానీ
ఆసియాలో అత్యంత ధనవంతుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించారు. న్యూయార్క్‌లో ఉన్న తన విలాసవంతమైన 2BHK అపార్ట్‌మెంట్‌ను రూ. 74.53 కోట్లకు అమ్మేసినట్టు తెలుస్తోంది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నివాస భవనంలో ‘యాంటిలియా’ లో ఉంటున్న అంబానీ విదేశంలో ఖరీదైన ఆస్తిని విక్రయించడం వార్తల్లో నిలిచింది. అయితే ఎందుకు అమ్మారు, ఎవరెవరి మధ్య ఈ డీల్ జరిగిందనే వివరాలు అందుబాటులో లేవు. (కేంద్రం కీలక నిర్ణయం: టీసీఎస్‌కు బంపర్ ఆఫర్) న్యూయార్క్ పోస్ట్ తాజా నివేదిక ప్రకారం ముఖేష్ అంబానీ న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌లో తన విలాసవంతమైన కాండోస్లో ఒక దానిని రూ. 74.53 కోట్లకు (9 మిలియన్ డాలర్లు) విక్రయించారు. ఈ అపార్ట్మెంట్ 400 W. 12వ వీధిలోని నాల్గవ అంతస్తులో ఉంది, దీనిని సుపీరియర్ ఇంక్ అని కూడా పిలుస్తారు. రిలయన్స్ అధినేత విక్రయించిన అపార్ట్మెంట్ప్రముఖ హడ్సన్ నది ఒడ్డున, 3 బాత్రూమ్లు, కాండోలో 10-అడుగుల ఎత్తైన పైకప్పులు, నాయిస్ ప్రూఫ్ విండోస్, చెఫ్ కిచెన్ హెరింగ్బోన్ హార్డ్‌వుడ్ ఫ్లోర్లు ఉన్నాయి. ఈ భవనం 1919 నాటిదని, దీనిని గతంలో సుపీరియర్ ఇంక్ ఫ్యాక్టరీ అని పిలిచేవారట. 2,406 చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన సౌకర్యాలతో రెన్నోవేట్ 2009లో అమ్మకానికి వచ్చాయి. మార్క్ షటిల్వర్త్, లెస్లీ అలెగ్జాండర్, మార్క్ జాకబ్స్ మరియు ఇతరులతో సహా కొంతమంది సెలబ్రిటీలు ఇందులో నివసిస్తున్నారు. (అమ్మకోసం...భళా బుడ్డోడా! వైరల్ వీడియో) కాగా ముఖేష్ అంబానీ నివాసముండే ముంబైలోని యాంటిలియా ఖరీదు రూ. 15,000 కోట్లకు పైనే.దీంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా అనేక విలాసవంతమైన ఆస్తులను కలిగి ఉన్న సంగతి తెలిసిందే. -
అస్థికలు భద్రపరిచేందుకు అద్దె రూ.63 లక్షలు, ఫ్యామిలీ ప్యాక్ కూడా!
ప్రపంచ రియల్ ఎస్టేట్ మార్కెట్లో అత్యంత ఖరీదైన ప్రాంతం ఏదంటే హాంకాంగ్ అని ఠక్కున చెప్పేయొచ్చు. ఒక జత చెప్పుల డబ్బా అంతటి విస్తీర్ణం ఉన్న స్థలం కూడా వేల డాలర్లు పలుకుతుంది. అలాంటి ప్రాంతంలో చూపరుల్ని ఆకట్టుకునే 12 అంతస్తుల అందమైన భవనాన్ని ఈ మధ్య నిర్మించారు. పాలరాతితో, వంపులు తిరిగిన డిజైన్, రూఫ్ గార్డెన్తో చూడముచ్చటగా కనిపిస్తున్న ఈ భవనాన్ని చూస్తే ఎవరైనా ఫిదా(వశం) అయిపోతారు. అయితే అది నిర్మించింది ధనవంతులు నివసించడం కోసం కాదు. మరణించిన వారి అస్థికలను భద్రపరచడం కోసం ప్రత్యేకంగా నిర్మించారు. ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అదే స్థాయిలో అందులో సకల సదుపాయాలు ఏర్పాటు చేశారు. షాన్ సమ్ టవర్ పేరుతో నిర్మించిన ఈ భవనంలో అస్థికల కలశాన్ని భద్రపరచాలంటే 76,000 డాలర్లు (రూ.63 లక్షలు) చెల్లించాలి. అది కూడా 10 సంవత్సరాలు మాత్రమే. ఆ తర్వాత లీజ్ రద్దయిపోతుంది. ఎందుకంటే ఆ భవనంలో 22,000 మంది అస్థికలను మాత్రమే భద్రపరచవచ్చు. ఒక కుటుంబంలో ఎనిమిది మంది అస్తికలను భద్రపరచడానికి ఫ్యామిలీ ప్యాకేజీ సదుపాయం ఉంది. అందుకయ్యే ఖర్చు 4,40,000 డాలర్లు (రూ.3.64 కోట్లు). షాన్ సమ్ అంటే చైనా భాషలో దయా హృదయం అని అర్థం. ఈ భవనం సంపన్నులకే అందుబాటులో ఉండడం గమనార్హం. అంతా అత్యాధునికం కేవలం అస్థికల కోసం ఇంత ఖరీదా? అని ఎవరైనా నోరెళ్లబెట్టొచ్చు. కానీ, అక్కడున్న హంగులు, ఆర్భాటాలు చూస్తే మతి పోవాల్సిందే. తమకెంతో ఇష్టమైన వారిని స్మరించుకోవడానికి వచ్చేవారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ భవనాన్ని నిర్మించారు. పైన అంతా రూప్గార్డెన్ ఉంటుంది. ప్రతి అంతస్తులోనూ పెద్ద పెద్ద బాల్కనీలు ఉంటాయి. చైనా సంస్కృతి సంప్రదాయాల్లో శ్మశాన వాటికలు ఎలా ఉంటాయో అలా వంపుల తిరిగిన డిజైన్‌తో భవనం ఉంటుంది. ఇక లోపల పాలరాతి ఫ్లోరింగ్, ఏసీలు, గాలిలో తేమని తొలగించే వ్యవస్థ కూడా ఉన్నాయి. అస్థికలను భద్రపర్చే చిన్నచిన్న గదుల తలుపులను బంగారు నాణేలతో సౌందర్యభరితం చేశారు. భిన్న సంప్రదాయాలు, ఆచారాలను పాటించే వారి అభిరుచులకు అనుగుణంగా ఈ భవన నిర్మాణం జరిగింది. పెద్దలకి నివాళులరి్పంచుకోవడానికి ముందస్తుగా యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. వారికిష్టమైన ఆహారాన్ని వండి తీసుకువెళ్లి, సంప్రదాయబద్ధంగా నివేదించవచ్చు. పెద్దలను గౌరవించుకోవడానికి మనుషుల అస్థికల కోసం ప్రత్యేకంగా అందమైన భవనం కట్టాలన్న ఆలోచన ఏడు పదుల వయసున్న మార్గరెట్ జీ అనే ఒక మహిళా పారిశ్రామికవేత్తకు వచ్చింది. జ్యువెలరీ, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్న ఆమె వయసు మీదపడ్డాక సేవా కార్యక్రమాల బాట పట్టారు. తన పేరు మీదే ఒక ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసి సమాజానికి సేవలందిస్తున్నారు.‘‘మరణించిన పెద్దలకి నివాళులర్పించడానికి చైనా సంప్రదాయంలో చాలా ప్రాధాన్యతనిస్తారు. దివికేగిన పెద్దల స్మృతుల్లో గడిపి, వారిని గౌరవిస్తే అంతా మంచే జరుగుతుందని విశ్వసిస్తారు. అలాంటి వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఈ భవనం నిర్మించాం’’ అని మార్గరెట్ చెప్పారు. భర్త మరణంతో.. హాంకాంగ్ నగర జనాభా 70 లక్షలపైమాటే. చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ జనాభా కిటకిటలాడిపోతూ ఉంటుంది. వాస్తవానికి విస్తీర్ణంలో హాంకాంగ్ పెద్దదే. కానీ కొండలు, గుట్టలు ఎక్కువగా ఉండడం వల్ల నివాసయోగ్యమైన ప్రాంతం తక్కువే. అందుకే ఇక్కడ ఆకాశహార్మ్యాల నిర్మాణం ఎక్కువగా ఉంది. ఈ నగరంలో ఒక ఇంటి సగటు విస్తీర్ణం 430 చదరపు అడుగులు మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయి. అస్థికల భవన నిర్మాణాన్ని తలపెట్టిన మార్గరెట్ భర్త 2007లో మరణించారు. ఆయన స్మృతి చిహ్నం ఏర్పాటు చేయడానికి ఆమెకి స్థలం దొరకలేదు. ఆ సమయంలోనే మరణించిన వారి కోసం ప్రత్యేకంగా ఒక అపార్ట్మెంట్ నిర్మించాలన్న ఆలోచన ఆమెకు వచి్చంది. అది ఇన్నేళ్లకి సాధ్యమైందని చెబుతున్నారు. ఇక హాంకాంగ్‌లో వృద్ధుల జనాభా పెరిగిపోతోంది. ప్రతి అయిదుగురిలో ఒకరు 65 ఏళ్లకు పైబడిన వారే. ఇక నగరంలో ప్రతి ఏటా దాదాపు 46,000 మంది మరణిస్తున్నారు. వారి అవశేషాలను భద్రపరచడానికి ప్రభుత్వం పలు సదుపాయాలు ఏర్పాటు చేసింది. అయితే అవి సరిపోకపోవడం వల్ల ప్రైవేట్ భవనం నిర్మించాల్సి వచి్చంది. హాంకాంగ్‌లో సంపన్నులు కూడా ఎక్కువే. అలాంటి వారి సౌకర్యార్థం షాన్ సమ్ అందుబాటులోకి వచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
లగ్జరీ ఫ్లాట్లకు ఇంత డిమాండా? మూడు రోజుల్లో రూ. 8 వేల కోట్లతో కొనేశారు!
న్యూఢిల్లీ: లగ్జరీ అపార్టుమెంట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.దేశీయ అతిపెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ డీఎల్ఎఫ్ దూసుకుపోతోంది. తాజాగా మూడు రోజుల్లో రూ. 8వేల కోట్లకుపైగా విలువైన లగ్జరీ ఫ్లాట్లను విక్రయించింది. లాంచింగ్ ముందే వీటిని విక్రయించడం విశేషం. (రిలయన్స్ అధినేత అంబానీ కళ్లు చెదిరే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్) ప్రీ-ఫార్మల్ లాంచ్ సేల్స్‌లో భాగంగా గురుగ్రామ్‌లోని సెక్టార్ 63లో గోల్ఫ్ కోర్స్ ఎక్స్టెన్షన్ వద్ద నిర్మించిన ‘ది అర్బర్’ డీఎల్ఎఫ్ ప్రాజెక్ట్ ఈ ఫీట్ సాధించింది. లాంచింగ్‌కు మూడు రోజుల ముందుగానే పూర్తి సేల్స్‌ను నమోదు చేసింది. 25 ఎకరాల్లో నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో ఐదు టవర్లు, 38/39 అంతస్తులున్నాయి. ఇందులో 4 BHK 1137 ఫ్లాట్స్ ఉన్నాయి. వీటి ధరలు యూనిట్‌కు రూ. 7 కోట్ల నుండి ప్రారంభం. (‘నాటు నాటు’ జోష్ పీక్స్: పలు బ్రాండ్స్ స్టెప్స్ వైరల్, ఫ్యాన్స్ ఫుల్ ఫిదా!) తమ ప్రాజెక్ట్‌కు అద్భతమైన స్పందన లభించిందనీ, డీఎల్ఎఫ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆకాష్ ఓహ్రి సంతోషం ప్రకటించారు. లగ్జరీ గృహాలు, జీవనశైలి సౌకర్యాలకు పెరుగుతున్న ఆదరణకు ఇది సంకేతమన్నారు. 75 ఏళ్లుగా కస్టమర్ల ఆకాంక్షలకనుగుణంగా శ్రద్ధ, నిబద్ధతతో అందిస్తున్న సేవలు, కొనుగోలుదారుల విశ్వాసం నేపథ్యంలో ప్రాజెక్ట్ కోసం అధిక స్పందన లభిస్తోందన్నారు. ముఖ్యంగా, 95 శాతం మంది కొనుగోలు దారులు తమ తుది వినియోగం కోసం కొనుగోలు చేశారన్నారు.గురుగ్రామ్‌లో అర్బర్ నిస్సందేహంగా తమకొక మైలురాయి లాంటిదన్నారు. -
ఐదేళ్లలో 5 లగ్జరీ ఇళ్లు కొన్న రష్మిక? నెట్టింట ట్వీట్ వైరల్
నేషనల్ క్రష్ రష్మికా మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది. హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో తెగ బిజీగా మారిపోయిందీ బ్యూటీ. ఇక ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న రష్మికకు సంబంధించి తాజాగా మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. కెరీర్ ప్రారంభించిన 5ఏళ్లలోనే రష్మిక ఐదు ప్రదేశాల్లో విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసిందట. తన సంపాదనలో ఎక్కువ శాతం ప్రాపర్టీస్‌పై ఇన్వెస్ట్ చేస్తోందని, ఇందులో భాగంగానే హైదరాబాద్, కూర్గ్, బెంగుళూరు, గోవా, ముంబై నగరాల్లో రష్మికకు ఖరీదైన అపార్ట్మెంట్స్ ఉన్నాయంటూ ఓ వార్త నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. తాజాగా ఈ రూమర్స్‌పై స్వయంగా రష్మిక స్పందించింది. 'ఇదంతా నిజమైతే బాగుండు' అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఇవన్నీ అవాస్తవాలే అని క్లారిటీ ఇచ్చినట్లయ్యింది. కాగా ఛలో సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన రష్మిక అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. 'పుష్ప' హిట్‌తో పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్న రష్మిక ప్రస్తుతం రణ్‌బీర్‌తో ‘యానిమల్’ సినిమాలో నటిస్తుంది. #Rashmika owns 5 luxurious apartments in 5 places🤨#RashmikaMandanna 🔥 pic.twitter.com/9zHBwvPU37 — Nerdy News (@NerdyNews07) February 10, 2023 -
53వ అంతస్తులో.. ఖరీదైన ఇల్లు కొన్న మాధురీదీక్షిత్
బాలీవుడ్ బ్యూటీ మాధురీ దీక్షిత్ ముంబైలోని లోయర్ పరేల్ ప్రాంతంలో ఓ విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసింది. 53వ అంతస్తులో ఉన్న ఈ ఇంటిని దాదాపు రూ. 48కోట్లు పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇంటికి సంబంధించి రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయి. 5384 చదరపు గజాలు ఉన్న ఈ కొత్తింట్లో స్విమ్మింగ్ పూల్స్, ఫుట్‌బాల్ పిచ్, జిమ్, స్పా, క్లబ్ వంటి ఎన్నో సదుపాయాలు ఉన్నాయట. అంతేకాకుండా మాధురీ దీక్షిత్ ఖరీదు చేసిన అపార్ట్మెంట్ నుంచి అరేబియా సముద్రం వ్యూ చాలా అందంగా కనిపిస్తుందని ఇండియాబుల్స్ బ్లూ తన వెబ్సైట్లో తెలిపింది. 1990ల కాలంలో మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న మాధురీ దీక్షిత్ ప్రస్తుతం సినిమాలతో పాటు అటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. చివరగా ఆమె ది ఫేమ్ గేమ్ అనే వెబ్‌సిరీస్‌లో కనిపించింది. -
లగ్జరీ హోమ్స్‌కే డిమాండ్ ఎక్కువ: 3 బీహెచ్‌కే సేల్స్ జూమ్
సాక్షి, హైదరాబాద్: కరోనా గృహ కొనుగోలుదారుల అభిరుచిని మార్చేసింది. ప్రపంచ జీవన శైలి, జీవన ప్రమాణాలపై అవగాహన, ఆదాయం పెరిగాయి. దీంతో కోవిడ్ తర్వాత గృహ ఎంపికలో మార్పులు వచ్చాయి. గతంలో గృహ కొనుగోళ్లలో బడ్జెట్ మీద దృష్టి పెట్టిన కొనుగోలుదారులు.. కరోనా తర్వాతి నుంచి విస్తీర్ణం ఎక్కువగా ఉండే ఇళ్ల మీద ఆసక్తి చూపిస్తున్నారు. ► గత ఆర్థ్ధిక సంవత్సరంలో దేశంలోని ఏడు ప్రధాన నగరాలలో గృహ కొనుగోలుదారుల ప్రవర్తనలో స్పష్టమైన మార్పులు వచ్చాయి. రూ.40 లక్షల కంటే తక్కువ ధర ఉండే సరసమైన ఇళ్ల కంటే రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే మధ్య తరహా గృహాలు, రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే ఆధునిక గృహాల కొనుగోళ్లకే కస్టమర్లు ఆసక్తిని చూపిస్తున్నారు. దాదాపు 80 శాతం మంది కస్టమర్లు మధ్య తరహా, ఆధునిక గృహాలపై ఆసక్తిని కనబర్చగా.. కేవలం 10 శాతమే అందుబాటు గృహాల వైపు ఆసక్తిగా ఉన్నారు. ► గృహ కొనుగోళ్లలో సర్వీస్ క్లాస్ కొనుగోలుదారులదే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పటికీ పెద్ద సైజు గృహాలకే డిమాండ్ ఎక్కువగా ఉందని అనరాక్ డేటా వెల్లడించింది. గృహ విక్రయాలలో మిడ్ టు హై ఎండ్ విభాగం యూనిట్లకే ఎక్కువ గిరాకీ ఉంది. మొత్తం విక్రయాలలో ఈ విభాగం వాటా 79 శాతంగా ఉంది. 2 బీహెచ్‌కే యూనిట్లకు 38 శాతం, 3 బీహెచ్కేకు 26 శాతం వాటా ఉన్నాయి. హైదరాబాద్‌లో లగ్జరీ గృహాలకు.. హైదరాబాద్‌లో రూ.2.5 కోట్ల కంటే ఎక్కువ ధర కలిగిన లగ్జరీ గృహాలకు 17 శాతం, అల్ట్రా లగ్జరీ గృహాలకు 8 శాతం డిమాండ్ ఉంది. చెన్నై, పుణే నగరాలలో మధ్య తరహా, లగ్జరీ గృహాలకు డిమాండ్ ఉంది. ఆయా నగరాలలో మిడ్ సైజ్ యూనిట్లకు 60 శాతం, హై ఎండ్ ఇళ్లకు 59 శాతం గిరాకీ ఉంది. బెంగళూరులో దాదాపు 56 శాతం డిమాండ్ హై ఎండ్ గృహాలకే డిమాండ్ ఉంది. ప్రధాన నగరాలలో 2, 3 బీహెచ్‌కే యూనిట్ల విక్రయాలు 64 శాతంగా ఉన్నాయి. చెన్నైలో 2 బీహెచ్‌కే గృహాలకు అత్యంత ప్రజాదరణ ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 67 శాతం విక్రయాలు 2 బీహెచ్‌కే యూనిట్లే జరిగాయి. బెంగళూరులో 3 బీహెచ్‌కే విక్రయాల వాటా 49 శాతంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 44 శాతం విక్రయాలు 3 బీహెచ్‌కే యూనిట్లే జరిగాయి. ► రూ.40 లక్షల లోపు ధర ఉండే గృహాల కొనుగోళ్లకు 10 శాతం ► రూ.40–80 లక్షల మధ్య ధర ఉండే ఇళ్ల కొనుగోళ్లకు 42 శాతం ► రూ.80 లక్షల నుంచి రూ.1.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలపై 37 శాతం ► రూ.1.5 నుంచి రూ.2 కోట్ల మధ్య ధర ఉండే ఇళ్లపై 5 శాతం ► రూ.2–5 కోట్ల ధర ఉండే యూనిట్లపై 5 శాతం ► రూ.5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ గృహాల కొనుగోళ్లకు 1 శాతం మంది ఆసక్తిగా ఉన్నారు. -
47 అంతస్తులతో ‘హైదరాబాద్ వన్’.. దేశంలోనే ఫస్ట్!
కొత్త నగరానికి వెళ్లి తాత్కాలికంగా కొన్ని రోజులుండాల్సి వస్తే... వసతి పెద్ద సమస్య. పేయింగ్ గెస్ట్‌గా ఉన్నా, ఎంత లగ్జరీ హాస్టల్ అయినా... ఇరుకు గదులు, అంతంత మాత్రంగా ఉండే ఆహారం, టైమింగ్స్... అన్నింటికీ ఇబ్బంది. సరే ఎలాగోలా సర్దుకుపోదాం అనుకున్నా.. మెన్, ఉమెన్‌కు వేర్వేరు హాస్టల్స్ వల్ల కపుల్ కలిసుండలేరు. వీటన్నింటికీ సింపుల్ సొల్యూషన్ సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ వారి ‘హైదరాబాద్ వన్’ లగ్జరీ కో–లివింగ్ ప్రాజెక్ట్. సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు ఇక వసతికోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. 47 అంతస్తులతో అత్యంత లగ్జరీ కో–లివింగ్ ప్రాజెక్టు ఇప్పుడు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉంది. సాధారణ హాస్టల్స్‌లో ఒకే రూమ్‌లో నాలుగైదు బెడ్లు వేస్తారు. భోజన ఏర్పాట్లు హాస్టల్స్ నిర్వాహకులే చూసుకుంటారు. దీనివల్ల రూమ్ స్థలాన్ని మనకు నచ్చినవిధంగా ఉపయోగించుకోలేం. ఆహార నాణ్యతలోనూ రాజీ పడాల్సి వస్తుంది. ఇక నగరానికి వచ్చింది జంట అయితే.. హాస్టల్స్‌లో వేర్వేరుగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ కో–లివింగ్‌లో ఆ సమస్య ఉండదు. ఎవరైనా ఉండొచ్చు. సాధారణ హాస్టల్స్ లాగానే ఇక్కడా బెడ్‌కు ఇంతని ధర ఉంటుంది. గంటలు, రోజులు, నెల, సంవత్సరాల వారీగా గదులను అద్దెకు తీసుకోవచ్చు. హైదరాబాద్ వన్ ప్రాజెక్ట్‌లో నెలకు ఒక్క బెడ్ అద్దె రూ.26–36 వేల మధ్య ఉంటుందని సమాచారం. (క్లిక్: హైదరాబాద్ సిటీలో సాఫీ జర్నీకి సై) మహిళల కోసమే ఐదంతస్తులు... 47 అంతస్తుల్లో మొత్తం 1,928 స్టూడియో అపార్ట్మెంట్లుంటాయి. 6వ అంతస్తు నుంచి 10 వరకు కేవలం ఉమెన్ కో–లివింగ్ అపార్ట్మెంట్లుంటాయి. వీటిని మహిళా ఉద్యోగస్తులు, విదేశీ విద్యార్థులకు మాత్రమే అద్దెకిస్తారు. 36 నుంచి 46వ ఫ్లోర్ వరకు 11 అంతస్తులను సీనియర్ ప్రొఫెషనల్స్, ప్రవాసులకు మాత్రమే కేటాయించారు. 47వ అంతస్తులో మహిళల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నారు. (క్లిక్: హెల్త్ స్టార్టప్‌లకు వెల్లువలా పెట్టుబడులు) జీవనశైలికి అనుకూలంగా... నేటి యువత లైఫ్‌స్టైల్‌కు అనుకూలంగా.. స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్లు, బార్, సెలూన్, స్పా, యాంపి థియేటర్ వంటివి ఏర్పాటు చేస్తారు. 24 గంటలు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. అత్యవసరమైన సమయాల్లో స్త్రీల సౌకర్యార్థం పలుచోట్ల ప్యానిక్ బజర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు, సాంకేతిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విశాలమైన పార్కింగ్, అందులో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లుంటాయి. 24 గంటలు వైద్య సదుపాయం, ఫార్మసీ అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ సాంస్కృతిక, స్ఫూర్తిదాయక కార్యక్రమాలుంటాయి. వీకెండ్స్‌లో నైట్ బజార్, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు. వీటిని బయటివాళ్లు కూడా వినియోగించుకోవచ్చు. (క్లిక్: ఇందిరాపార్కులో.. లాహిరి లాహిరి) మరో మాన్హటన్.. హైదరాబాద్ వన్ ప్రాజెక్ట్‌కు 5–7 కి.మీ. పరిధిలో దాదాపు 5–6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తారు. వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాంతం అమెరికాలోని మాన్‌హటన్‌లాగా మారటం ఖాయం. నగరానికి వచ్చే విదేశీ విద్యార్థులు, ఉన్నతస్థాయి ఉద్యోగస్తులు, ప్రవాసుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. – పూర్ణ చందర్, ఈడీ, సెస్సేషన్ ఇన్ఫ్రాకాన్ -
లగ్జరీ ఫ్లాట్లకు ఫుల్ డిమాండ్.. ఊపందుకున్న విక్రయాలు
సాక్షి, ముంబై: మూడు నాలుగేళ్లుగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గణనీయంగా పడిపోయిన లగ్జరీ ఫ్లాట్ల డిమాండ్ మళ్లీ ఊపందుకుంది. మెల్లమెల్లగా ఈ ఇళ్ల విక్రయాలు పెరుగుతుండటంతో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్, ఇతర పన్నుల రూపంలో ప్రభుత్వానికి కూడా మంచి ఆదాయం వస్తోంది. ఓ సంస్థ అధ్యయనం ద్వారా ఈ వివరాలు తెలిశాయి. గత మూడేళ్ల కాలంలో జరిగిన లావాదేవీలను బట్టి చూస్తే 2021లో లగ్జరీ ఇళ్ల విక్రయాలు అధికంగా జరిగాయి. చదవండి: (షిప్లో ఇల్లు కావాలా? 24 ఏళ్ల వరకు అద్దెకు అపార్ట్మెంట్లు .. ప్రారంభ ధరెంతో తెలుసా?) పశ్చిమ, తూర్పు ఉపనగరాలతో పోలిస్తే ముంబై సిటీ అగ్రస్థానంలో ఉంది. ఆ తరువాత రెండో స్థానంలో పశ్చిమ ఉపనగరం, మూడో స్థానంలో తూర్పు ఉప నగరాలున్నాయి. రూ.మూడు కోట్లకంటే ఎక్కువ ధర పలికే ఇళ్లను లగ్జరీ ఫ్లాటు అంటారు. ఈ ఫ్లాట్లు ముఖ్యంగా నగరంలోని లోయర్ పరేల్, దాదర్, వర్లీ, శివ్డీ, మాహీం, మాటుంగా, పరేల్, వడాల ప్రాంతాలలో ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ఉన్న లగ్జరీ ఫ్లాట్లను కొనుగోలు చేయడానికి మంచి స్పందన వస్తోంది. చదవండి: (ఖరీదైన ఇళ్లకు తగ్గని డిమాండ్) ఇదిలా ఉండగా 2021లో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో నివాస ఇళ్ల రిజిస్టేషన్లు పెరిగాయి. కోవిడ్ కారణంగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌వల్ల స్టాంపు డ్యూటీ తగ్గించింది. దీంతో సామాన్య ఇళ్లతోపాటు లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు కూడా జోరుగా సాగాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం రెట్టింపు వచ్చింది. 2019లో–71, 2020లో–77, 2021లో–93 లగ్జరీ ఫ్లాట్ల విక్రయాలు జరిగాయి. -
బాచుపల్లిలో క్లౌడ్ 33
సాక్షి, సిటీబ్యూరో: బెంగళూరుకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అలయన్స్ గ్రూప్ అనుబంధ కంపెనీ అర్బన్‌రైజ్ బాచుపల్లిలో క్లౌడ్–33 అనే పేరుతో లగ్జరీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టింది. 9.15 ఎకరాల్లోని ఈ ప్రాజెక్ట్‌లో 2,600 లగ్జరీ అపార్ట్మెంట్లుంటాయి. 1,100 నుంచి 2,021 చ.అ.లలో 2, 3, 4 బీహెచ్‌కే ఫ్లాట్లుంటాయి. సింగపూర్‌లోని సిటీస్కేప్స్, మొరాకో రాయల్ రెసిడెన్సీలను స్ఫూర్తిగా తీసుకొని ఈ రెసిడెన్షియల్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేశామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 85 వేల చ.అ.లలో క్లబ్ హౌస్‌లో జీరో గ్రావిటీ యోగా గది, రూఫ్ టాప్ మీద బార్బిక్యూ, ప్రైవేట్ పార్టీ ఏరియా, గ్రీన్ డైనింగ్, గేమింగ్ జోన్, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని రకాల ఆధునిక వసతులుంటాయి. ముందస్తు సొమ్ము చెల్లించి బుకింగ్ చేసుకుంటే చాలు 2026లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేసిన తర్వాతే కొనుగోలుదారులకు నెలవారీ వాయిదా (ఈఎంఐ) మొదలవుతుందని ఈడీ రాజేంద్ర జోషి తెలిపారు. 1,3 ఎకరాల స్థలాన్ని సెంట్రల్ ల్యాండ్ స్కేపింగ్‌ను కేటాయించారు. దీంతో 75 శాతం స్థలం ఓపెన్ స్పేస్ ఉంటుంది. భవిష్యత్తులో పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ‘జీనియస్’ నాలెడ్జ్ సెంటర్‌ను నిర్మిస్తోంది. ఇందులో క్రచ్, డే కేర్ సెంటర్లతో పాటు ఆన్లైన్, ట్యూషన్, సంగీతం, నృత్యం, కుకరీ, ఏఐ, రోబోటిక్స్ వంటి శిక్షణ తరగతుల కోసం ప్రత్యేక ఏర్పాట్లుంటాయి. దీంతో పిల్లలకు భద్రత, రక్షణ ఉండటమే కాకుండా వారి అభిరుచులకు తగ్గట్లుగా శిక్షణ ఇప్పించేందుకు వీలవుతుంది. -
మనీ గురించి ఆలోచించకు.. లగ్జరీగా ఉంటే చూడు
కరోనా మహమ్మారి గృహ కొనుగోలుదారుల అభిరుచిని మార్చేసింది. ఏటేటా అందుబాటు గృహాలపై ఆసక్తి తగ్గి.. ప్రీమియం ఇళ్లను కొనుగోలు చేయాలనుకునే వారి సంఖ్య పెరుగుతుంది. గతేడాది 36 శాతం మంది అఫర్డబుల్ హౌసింగ్ కొనుగోలుకు ఆసక్తిని కనబర్చగా.. ఇప్పుడది 27 శాతానికి క్షీణించింది. 34 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధర ఉండే ఇళ్లను కొనాలని భావించారు. గతేడాది హెచ్2లో సర్వేతో పోలిస్తే ఇది 10 శాతం వృద్ధి అని సీఐఐ–అనరాక్ కన్జ్యూమర్ సర్వే వెల్లడించింది. సాక్షి, హైదరాబాద్: గృహ కొనుగోలుదారుల అభిరుచులపై కరోనా మహమ్మారి ఎంత మేర ప్రభావం చూపించిందో అంచనా వేసేందుకు ఈ సర్వేను నిర్వహించాయి. జనవరి–జూన్ మధ్య కాలంలో సుమారు 4,965 మందితో ఆన్లైన్లో సర్వే చేపట్టారు. తొలిసారిగా హోమ్ బయ్యర్లు రూ.45 లక్షల కంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్స్ పట్ల విముఖత వ్యక్తం చేశారు. 35 శాతం మంది రూ.45–90 లక్షలు, 34 శాతం మంది రూ.90 లక్షల నుంచి రూ.2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాల కొనుగోళ్లకు ఆసక్తిని కనబరిచారు. వాకింగ్ ట్రాక్, గ్రీనరీలే అధిక ప్రాధాన్యత.. గృహ కొనుగోలు ఎంపికలో తొలి ప్రాధాన్యం ఆకర్షణీయమైన ధర కాగా.. 77 శాతం మంది రెండవ ప్రియారిటీ డెవలపర్ విశ్వసనీయత. ఆ తర్వాతే ప్రాజెక్ట్ డిజైన్, లొకేషన్ ఎంపికల ప్రాథమ్యాలుగా ఉన్నాయి. కరోనా తర్వాత అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. దీంతో 72 శాతం మంది కస్టమర్లు ఇంటిని ఎంపిక చేసేముందు ప్రాజెక్ట్‌లో వాకింగ్ ట్రాక్స్ ఉండాలని, 68 శాతం మంది గ్రీనరీ ఎక్కువగా ఉండాలని కోరుకుంటున్నారు. స్విమ్మింగ్ పూల్ వసతులపై పెద్దగా ఆసక్తిని కనబర్చలేదు. 64 శాతం మంది ఆన్లైన్లో సెర్చ్ చేసే సమయంలో ఆఫర్లు, రాయితీల కోసం వెతికారు. 60 శాతానికి పెరిగిన ఆన్లైన్.. ప్రాపర్టీలను వెతకడం నుంచి మొదలుపెడితే డాక్యుమెంటేషన్, న్యాయ సలహా, చెల్లింపుల వరకు ప్రతీ దశలోనూ కొనుగోలుదారులు డిజిటల్ మాధ్యమాన్ని వినియోగిస్తున్నారు. కరోనా కంటే ముందు ప్రాపర్టీ కొనుగోలు ప్రక్రియలో ఆన్లైన్ వాటా 39 శాతంగా ఉండగా.. ఇప్పుడది 60 శాతానికి పెరిగింది. పటిష్టమైన ఆన్లైన్ మార్కెటింగ్ బృందం, సోషల్ మీడియా వేదికలు ఉన్న డెవలపర్లు మాత్రమే ప్రస్తుత పరిస్థితుల్లో నిలబడగలుగుతారు. కరోనా ఫస్ట్ వర్సెస్ సెకండ్ వేవ్ - కరోనా ఫస్ట్ వేవ్‌లో రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడిదారులు విశ్వాసం 48 శాతంగా ఉండగా.. సెకండ్ వేవ్ నాటికి 58 శాతానికి పెరిగింది. - గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న వాటిల్లో కొనుగోళ్లకు 32 శాతం మంది ఆసక్తిని చూపించగా.. ఫస్ట్ వేవ్‌తో పోలిస్తే ఇది 14 శాతం క్షీణత. బ్రాండెడ్ డెవలపర్ల ప్రాజెక్ట్‌లలో కొనేందుకు కస్టమర్లు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. - సెకండ్ వేవ్‌లో 71 శాతం మంది తాము ఉండేందుకు ఇంటిని కొనుగోలు చేయాలని భావించగా.. 29 శాతం మంది పెట్టుబడి కోసం ఎంపిక చేశారు. ఇదే ఫస్ట్ వేవ్‌లో అయితే 41 శాతం ఇన్వెస్టర్లే ఉన్నారు. కరోనా నేపథ్యంలో పచ్చదనం, ఆరోగ్యంపై ఆసక్తి పెరగడంతో సెకండ్ హోమ్ డిమాండ్‌కు కారణం కావచ్చు. ప్రవాసులు కొనేది ఆ నగరాలో బెంగళూరు, పుణే, చెన్నై నగరాల్లోని రూ.1.5–2.5 కోట్ల మధ్య ధర ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ప్రవాసులు ఆసక్తి చూపిస్తుండగా.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో అయితే చండీగఢ్, కోచి, సూరత్ వంటి పట్టణాలపై మక్కువ చూపిస్తున్నారు. 41 శాతం మంది రెండో ఇంటిని తాము ఉండేందుకు కొనుగోలు చేస్తుండగా.. 53 శాతం మంది ఎత్తయిన ప్రాంతాలలో ఇళ్ల కోసం వెతుకుతున్నారు. 65 శాతం మంది వర్క్ ఫ్రంహోమ్, ఆన్లైన్ క్లాస్‌ల నేపథ్యంలో పెద్ద సైజు ఇళ్లపై మక్కువ చూపిస్తుంటే.. 68 శాతం మంది శివారు ప్రాంతాలలో కొనుగోళ్లకు ఇష్టపడుతున్నారు. ఎందుకు వద్దంటే? – అనూజ్ పురీ, చైర్మన్, అనరాక్ రూ.45 లక్షలు, అంతకంటే తక్కువ ధర ఉండే అఫర్డబుల్ హౌసింగ్ కొనుగోళ్లకు కస్టమర్లు అనాసక్తిగా ఉండటానికి ప్రధాన కారణం ఆ విభాగం కొనుగోలుదారుల ఆర్థిక పరిస్థితులపై కరోనా ప్రభావం చూపించడమే. వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావటం, అన్ని రంగాలలో ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోవటం, ఉద్యోగ భర్తీలు పెరిగితే అందుబాటు గృహాలకు మళ్లీ గిరాకీ పెరుగుతుంది. చదవండి : రియల్టీ పెట్టుబడులు అప్ -
Aspire Spaces: మియాపూర్‌లో అమేయా
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన నిర్మాణ సంస్థ అస్పైర్ స్పేసెస్ మియాపూర్‌లో 10.18 ఎకరాల విస్తీర్ణంలో అమేయా పేరిట లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తోంది. 16.50 లక్షల చ.అ. బిల్టప్ ఏరియాలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 1,066 ఫ్లాట్లుంటాయి. 9 బ్లాక్‌లలో స్టిల్ట్+13 అంతస్తులలో నిర్మాణం ఉంటుంది. 1,210 చ.అ. నుంచి 1,940 చ.అ. మధ్య ఫ్లాట్ల విస్తీర్ణాలుంటాయి. హెచ్ఎండీఏ, రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్ట్‌లో ధర చ.అ.కు రూ.4,849. డిసెంబర్ 2024 వరకు ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తవుతుందని అస్పైర్ స్పేసెస్ ఎండీ టీవీ నర్సింహా రెడ్డి చెప్పారు. అమేయా ప్రాజెక్ట్‌కు ఆర్టి్కటెక్ట్గా జెన్సెస్ కంపెనీ, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సీబీఆర్ఈ నిర్వహిస్తుంది. ల్యాండ్‌స్కేపింగ్‌ను టెర్రా ఫర్మా చేస్తుంది. 30కి పైగా ఆధునిక వసతులు.. ప్రాజెక్ట్ మొత్తం స్థలంలో 65% ఓపెన్ స్పేస్ ఉంటుంది. 50 వేల చ.అ.లలో క్లబ్‌హౌస్‌తో పాటు 30కి పైగా ఆధునిక వసతులుంటాయి. పిల్లల కోసం టెంపరేచర్ కంట్రోల్డ్ స్విమ్మింగ్ పూల్, కిడ్స్ కోసం డే కేర్ అండ్ ఎన్రిచ్మెంట్ సెంటర్లు ఉంటాయి. యోగా, మెడిటేషన్ చేసుకోవటం కోసం ఆక్సిజన్ డిసిగ్నేటెడ్ స్పేసెస్, బిల్డింగ్ పైన టెర్రస్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. సెంటల్ కోర్ట్ యార్డ్ ల్యాండ్‌స్కేపింగ్, ఇండోర్ మరియు ఔట్‌డోర్ జిమ్ ఏర్పాట్లుంటాయి. మల్టీపర్పస్ బాంక్వెట్ హాల్, గెస్ట్ రూమ్స్, మినీ థియేటర్, కల్చరల్ సెంటర్, స్పా, సెలూన్ పార్లర్, కాఫీ షాప్, గ్రాసరీ స్టోర్ ఉంటుంది. బ్యాడ్మింటన్, బాస్కెట్‌బాల్, వాలీబాల్, స్వా్కష్ కోర్ట్ వంటివి ఉంటాయి. జాగింగ్ ట్రాక్, రెఫ్లెక్సాలజీ పాత్ ఉంటుంది. ఉద్యోగులు ఇంటి నుంచే పని చేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన వర్క్ స్టేషన్స్ ఉంటాయి. 24 గంటలు వైఫై అందుబాటులో ఉంటుంది. కాన్ఫరెన్స్ అండ్ మీటింగ్ రూమ్స్ ఉంటాయి. లొకేషన్ హైలైట్స్.. మియాపూర్ మెట్రో స్టేషన్‌కి 5 నిమిషాలు దూరంలో అమేయా ప్రాజెక్ట్ ఉంటుంది. హైటెక్‌సిటీ 10 కి.మీ., ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌కు 12 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌కు చేరువలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్, సెనీటా గ్లోబల్ స్కూల్, కెన్నిడీ గ్లోబల్ స్కూల్, సాన్ఫోర్డ్ గ్లోబల్ స్కూల్, సిల్వర్ ఓక్స్ వంటి పాఠశాలలున్నాయి. ఎస్ఎల్జీ హాస్పిటల్, మమతా అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్స్, ల్యాండ్‌మార్క్ ఆసుపత్రి, అంకురా హాస్పిటల్, రెయిన్బో చిల్డ్రన్ ఆసుపత్రి, కిమ్స్ ఆసుపత్రులు 15 నిమిషాల ప్రయాణ వ్యవధి దూరంలో ఉన్నాయి. జీఎస్ ఎం మాల్, మంజీరామాల్, ఫోరం మాల్, శరత్ క్యాపిటల్ మాల్, ఐకియా వంటివి 25 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్నాయి. -
అభిషేక్ బచ్చన్ లగ్జరీ అపార్ట్మెంట్ అమ్మకం.. ధర ఎంతంటే?
ముంబై: అభిషేక్ బచ్చన్ ముంబైలోని ఒబెరాయ్ 360 పడమరలో ఉన్న తన లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను విక్రయించాడు. దీని అమ్మకం ద్వారా ఆయనకు రూ. 45.75 కోట్లు వచ్చాయి. మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం.. ముంబైలోని వర్లి ప్రాంతంలో ఒబెరాయ్ 360 అపార్టుమెంట్ పడమరలో ఉన్న 37వ అంతస్తులో 7,527 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. అభిషేక్ బచ్చన్ ఈ ఇంటిని 2014లో రూ. 41 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. కాగా అదే బిల్డింగ్‌లో షాహిద్ తన అపార్ట్మెంట్ కోసం రూ. 56 కోట్లు చెల్లించగా, అక్షయ్ రూ.52.5 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. అంతే కాకుండా రాణి ముఖర్జీ, దిశా పటానీ ఖార్ వెస్ట్ పరిసరాల్లో సముద్ర ముఖంగా ఉన్న గృహాలను కొనుగోలు చేశారు. రాణి ముఖర్జీ దీనికోసం రూ.7.12 కోట్లు ఖర్చు చేయగా.. దిశా పటానీ రూ.5.95 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక అభిషేక్ చివరిసారిగా ది బిగ్ బుల్లో కనిపించాడు. ఇది వివాదాస్పద స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా. అయితే ఈ సినిమా హన్సల్ మెహతా హిట్ సిరీస్‌తో పోల్చితే బాగా ఆడలేదనే చెప్పాలి. ఆయన తదుపరి రెండు చిత్రాలు నిమ్రత్ కౌర్‌తో దాస్వి, చిత్రాంగద సేన్‌తో బాబ్ బిశ్వాస్ సిమాలు విడుదల కావాల్సి ఉంది. అంతేకాకుండా ఐశ్వర్య చివరిసారిగా అనిల్ కపూర్, రాజ్‌కుమార్ రావుతో కలిసి ఫన్నీ ఖాన్ సినిమాలో కనిపించింది. ఆమె తదుపరి ప్రాజెక్ట్ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ సినిమాలో కనిపించనుంది. ఈ చిత్రం కల్కి కృష్ణమూర్తి తమిళ నవల ఆధారంగా తెరకెక్కనున్న పీరియడ్ ఇతిహాసం. -
లగ్జరీ గృహాల అద్దెల్లో హైదరాబాద్ టాప్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ గృహాల అద్దెల వృద్ధిలో హైదరాబాద్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. బెంగళూరు, ముంబై, పుణే, ఢిల్లీ–ఎన్సీఆర్ వంటి దేశంలోని ఏ ప్రధాన మెట్రో నగరాలతో పోల్చినా సరే.. 2014 నుంచి 2020 మధ్య నగరంలో లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాపర్టీ రెంట్లు 26 శాతం పెరిగాయి. ఇదే సమయంలో లగ్జరీ గృహాల ధరలు 12 శాతం వృద్ధి చెందాయని అనరాక్ ప్రాపర్టీ కన్సలెంట్ తెలిపింది. 2014లో హైటెక్ సిటీలో రూ.42 వేలుగా ఉన్న అద్దెలు.. 2020 నాటికి 26 శాతం వృద్ధితో రూ.53 వేలకు పెరిగింది. జూబ్లిహిల్స్‌లో రూ.47 వేల నుంచి 15 శాతం పెరిగి రూ.54 వేలకు చేరింది. ఇక క్యాపిటల్ ప్రైస్‌లు చూస్తే.. 2014లో హైటెక్‌సిటీలో చదరపు అడుగు (చ.అ) ధర రూ.5,088గా ఉండగా.. 2020 నాటికి 12 శాతం పెరిగి రూ.5,675కి చేరింది. జూబ్లిహిల్స్‌లో రూ.6,300 నుంచి 10 శాతం వృద్ధితో రూ.6,950కి పెరిగింది. ఏడు నగరాల్లో ఏటా 3-6 శాతం వృద్ధి.. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 2 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే లగ్జరీ హోమ్స్ సగటు నెలవారీ అద్దె గత ఆరేళ్లలో 17–26 శాతం, మూలధన విలువ గరిష్టంగా 15 శాతం మేర పెరిగాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ చైర్మన్ అనుజ్ పూరీ తెలిపారు. టాప్ లగ్జరీ మార్కెట్లలో ప్రతి ఏటా అద్దెలు 3–6 శాతం పెరుగుదలతో స్థిరమైన వృద్ధిని నమోదు చేస్తున్నాయని పేర్కొన్నారు. క్యాపిటల్ ప్రైస్లలో మాత్రం మిశ్రమ ఫలితాలను నమోదు చేశాయన్నారు. కొన్ని సంవత్సరాలలో వార్షిక పెరుగుదల 7 శాతంగా ఉంటే.. 2017లో మాత్రం 5 శాతం ధరలు క్షీణించాయని తెలిపారు. ఎందుకంటే ఆ సంవత్సరంలో రెరా, జీఎస్టీ వంటి వివిధ నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేశారు. దీంతో చాలా ప్రాంతాల్లో సగటు మూలధన ధరలలో 1–3 శాతం పెరుగుదల మాత్రమే నమోదయింది. నగరాల వారీగా చూస్తే.. 2014తో పోలిస్తే 2020లో గుర్గావ్లోని గోల్ఫ్‌కోర్స్ రోడ్లో లగ్జరీ గృహాల అద్దెలు 18 శాతం, ఇదే కాలంలో ఈ ప్రాంతంలో గృహాల ధరలు 8 శాతం వృద్ధి చెందాయి. బెంగళూరులోని జేపీ నగర్లో అద్దెలు 24 శాతం, ధరలు 8 శాతం, చెన్నైలోని అన్నానగర్‌లో రెంట్స్ 17 శాతం, ప్రాపర్టీ ప్రైస్‌లు 10 శాతం, కోల్‌కత్తాలోని అలీపోర్లో రెంట్స్ 20 శాతం, ధరలు 13 శాతం, ఎంఎంఆర్‌లోని టార్డియోలో కిరాయిలు 23 శాతం, ధరలు 8 శాతం, పుణేలోని ప్రభాత్రోడ్లో అద్దెలు 23 శాతం, లగ్జరీ ప్రాపర్టీ ధరలు 5 శాతం పెరిగాయి. సంస్కరణలు, ఆర్థిక సహాయంతో రియల్టీలో పునరుత్తేజం ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్న దేశీయ రియల్టీ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేందుకు విధానపరమైన సంస్కరణలు, దీర్ఘకాలిక ఆర్థిక సహాయం అవసరమని నేషనల్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ (నరెడ్కో) ఆధ్వర్యంలో జరిగిన ‘రియాలిటీ ఆఫ్ రియల్టీ ఇన్వెస్ట్మెంట్స్’ అనే అంశం మీద జరిగిన వెబినార్‌లో వక్తలు అభిప్రాయపడ్డారు. కోవిడ్–19 మహమ్మారి నుంచి రియల్టీ రంగాన్ని కాపాడుకోవటంలో ప్రతి ఒక్క డెవలపర్, వాటాదారులు భాగస్వామ్యమయ్యారని అయితే ఈ మహమ్మారి ప్రభావం ఇంకా ముగియలేదని.. సవాళ్లను అధిగమించడానికి రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఇంకా కలిసి పనిచేస్తున్నారని తెలిపారు. రాబోయే కాలంలో ఈ రంగం పూర్తిగా కోలుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నరెడ్కో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ నిరంజన్ హిర్నందాని మాట్లాడుతూ.. లాక్డౌన్ తర్వాత రియల్టీ రంగంలో పెరిగిన లావాదేవీలు, సానుకూల వినియోగదారుల డిమాండ్ నమోదవుతుందని తెలిపారు. దేశీయ ఆర్ధిక వ్యవస్థలో సానుకూల వాతావరణం కనిపిస్తుందన్నారు. ఒకవైపు జీడీపీ ‘వీ’ ఆకారపు రికవరీ అవుతుంటే.. మరోవైపు వాణిజ్య రియల్టీ రంగం ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. వర్క్ ఫ్రం హోమ్, వర్క్ ఫ్రం రిమోట్ లొకేషన్ వంటి విధానాలతో ఆఫీస్ స్పేస్ రియల్టీ రికవరీ ఆశించిన స్థాయిలో లేదని తెలిపారు. ఆగిపోయిన, ఆలస్యమైన ప్రాజెక్ట్‌లను పూర్తి చేసేందుకు కేటాయించిన స్పెషల్ విండో ఫర్ కంప్లీషన్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ అఫర్డబుల్ అండ్ మిడ్–ఇన్‌కం హౌసింగ్ ప్రాజెక్ట్స్ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్) నిధుల పరిమాణాన్ని మరింత పెంచాలని కోరారు. ఈ విధానంలో ఆర్థిక సంస్థలను కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదలతో గృహ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందన్నారు. చరిత్రాత్మక స్థాయిలో గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గడం, కొన్ని రాష్ట్రాల్లో స్టాంప్ డ్యూటీలను తగ్గించడం వంటి వాటితో గృహ కొనుగోళ్లకు డిమాండ్ పెరిగిందని హెచ్డీఎఫ్సీ ఎండీ రేణుసుద్ కర్నాడ్ అన్నారు. ప్రాపర్టీ ధరలు పెరగకుండా డెవలపర్లు తమ వంతు కృషి చేయాలని.. దీంతో గృహ విభాగానికి మరిన్ని అవకాశాలుంటాయని సూచించారు. రియల్టీ రంగానికి ప్రభుత్వ అవసరం అయిన ప్రతీ చోట నరెడ్కో తమ వంతు పాత్రని పోషిస్తుందని.. ఇదే సమయంలో డిజిటల్ వైపు కూడా రియల్టీ రంగానికి ప్రోత్సహిస్తే వృద్ధి మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందాలంటే రిటైల్ రియల్ ఎస్టేట్ వృద్ధి చెందాలని ఎస్బీఐ రిటైల్ బిజినెస్ డిప్యూటీ ఎండీ సలోని నారాయణ్ అన్నారు. -
చోక్సికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన గృహ కొనుగోలుదారులు
ముంబై : ఇటీవల యావత్ దేశం మొత్తంలో పెను సంచలనంగా మారిన నీరవ్ మోదీ, మెహుల్ చోక్సి కుంభకోణంలో కేవలం బ్యాంకులు మాత్రమే కాక, గృహకొనుగోలు దారులు కూడా భారీగా నష్టపోయారట. లగ్జరీ రెసిడెన్షియల్ గృహాలు కట్టి ఇస్తానని చెప్పిన మెహుల్ చోక్సి, వారి వాగ్ధానాలను నేరవేర్చకుండా.. పీఎన్బీలో భారీ కుంభకోణం జరిపి దేశం విడిచి పారిపోయాడు. దీంతో పీఎన్బీ బ్యాంక్‌తో పాటు తమకు అన్యాయం జరిగింది అంటూ.. గృహ కొనుగోలుదారులు కూడా రోడ్డుపైకి వచ్చారు. డైమండ్ కింగ్ నీరవ్ మోదీ మేనమామ అయిన మెహుల్ చోక్సి గీతాంజలి జువెల్లరీ సంస్థలతో పాటు గీతాంజలి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్‌ను కూడా నిర్వహిస్తుండేవాడు. ఈస్ట్ బోరివ్లిలోని తత్వా టవర్స్‌ను కట్టేందుకు ఈ సంస్థ కాంట్రాక్ట్ తీసుకుంది. 2010లో ఈ లగ్జరీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ తత్వాను గీతాంజలి ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ ప్రారంభించింది. 20, 21 అంతస్తుల చొప్పున రెండు టవర్లలో దీన్ని కట్టాల్సి ఉంది. మొత్తం 155 అపార్ట్మెంట్లు ఉంటాయి. 2013 వరకు వీటిని గృహకొనుగోలుదారులకు అందించాల్సి ఉంది. కానీ 2013 డిసెంబర్లో తొలుత తన వాగ్దానాన్ని బ్రేక్ చేసి, 2015 వరకు తుది గడువును పొడిగించింది మెహుల్ చోక్సి సంస్థ. ఆ అనంతరం ఆ గడువును మరింత కాలం అంటే 2017 డిసెంబర్‌కు పొడిగించింది. ఇలా ఫ్లాట్స్‌ను అందించడంలో జాప్యం చేస్తూనే ఉంది. దీంతో విసుగెత్తిన గృహకొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా), నేషనల్ కన్జ్యూమర్ డిస్పూట్ రెడ్రిషల్ కమిషన్ వద్ద ఫిర్యాదు దాఖలు చేశారు. గృహకొనుగోలుదారుల ఫిర్యాదు మేరకు ఈ డిసెంబర్ వరకు ఫ్లాట్లను ఎలాగైనా ఇచ్చేస్తామని చెప్పారు. కానీ పీఎన్బీ స్కాం ఎఫెక్ట్‌తో చోక్సి దేశం విడిచి పారిపోయాడు. చోక్సి విదేశాలకు జంప్ చేయడంతో, ఈ ప్రాజెక్ట్‌ను సైతం కొత్త డెవలపర్ లక్ష్మి ఇన్ఫ్రా డెవలపర్స్‌ను నియమించారు అలాటీస్. తత్వా టవర్స్‌కు బయట ఒక నోటీసు బోర్డు ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. ఇది నిబంధనలకు విరుద్ధమని గృహకొనుగోలుదారులంటున్నారు. ప్రస్తుతం నిర్మాణం ఆపివేశారని, ఎవరూ ఈ ప్రాజెక్ట్‌కు బాధ్యత వహించడం లేదని, చోక్సి కూడా దేశం విడిచి పారిపోయాడని పేర్కొంటున్నారు. నిర్మాణం కావాల్సిన ప్రాజెక్ట్ వద్దే గృహకొనుగోలుదారులు తమకు జరిగిన అన్యాయంపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
భారత్‌లో దూసుకుపోతున్న ట్రంప్ టవర్స్
ట్రంప్ టవర్స్ భారత్‌లో దూసుకుపోతుంది. లాంచైనా తొలి రోజే ట్రంప్ టవర్స్ ప్రాజెక్ట్ కింద రియాల్టీ సంస్థ ఎం3ఎం ఇండియా 20 లగ్జరీ అపార్ట్మెంట్లను విక్రయించింది. వీటి విలువ రూ.150 కోట్లు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 250 యూనిట్లను విక్రయించి రూ.2500 కోట్లను సేకరించాలని ఎం3ఎం సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. రియాల్టీ సంస్థలు ఎం3ఎం ఇండియా, ట్రిబెకా డెవలపర్స్ ద్వారా ఉత్తర భారత్‌లో గ్లోబల్ రియాల్టీ బ్రాండు ట్రంప్ టవర్స్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. 'ట్రంప్ టవర్స్ ఢిల్లీ ఎన్సీఆర్' పేరుతో ఈ ప్రాజెక్ట్‌ను రూ.1200 కోట్లతో ఎం3ఎం ఇండియా అభివృద్ధి చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను మార్కెట్ చేయడానికి ట్రిబెకా డెవలపర్స్‌కు మాత్రమే ఎక్స్‌క్లూజివ్ హక్కులు కలిగి ఉన్నాయి. లాంచ్ అయిన తొలి రోజే గుర్గావ్లోని ఐకానిక్ ట్రంప్ టవర్స్‌లో రూ.150 కోట్ల విక్రయాలు జరిపినట్టు ఎం3ఎం ఇండియా డైరెక్టర్ పంకజ్ బన్సాల్ తెలిపారు. మొత్తం 250 ఆల్ట్రా లగ్జరీ రెసిడెన్స్‌లను ట్రంప్ టవర్స్ పేరు మీదుగా ఎం3ఎం, ట్రిబెకా అభివృద్ధి చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడంతో ప్రస్తుతం ట్రంప్ టవర్స్‌ను డొనాల్డ్ ట్రంప్ జూనియర్ నడిపిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌లో అభివృద్ధి చేస్తున్న లగ్జరీ రెసిడెన్స్‌ల ధర రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్ల మధ్యలో ఉన్నాయి. -
డబ్బు కష్టాల్లోనూ నాలుగు ఫ్లాట్లకు రూ.119కోట్లు
ముంబయి: పెద్ద నోట్ల రద్దు కారణంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేల్ అయిందని, ఇకపై ఈ రంగంలో లావాదేవీలు మందగించినట్లేనని నిపుణులు చెప్తుండగా వారంతా అవాక్కయ్యే తీరుగా ముంబయిలో రికార్డు స్థాయిలో ఓ కొనుగోలు జరిగింది. వర్లీలో నాలుగు ఫ్లాట్లను తమ సొంత ప్రాజెక్టు కోసం బిల్డర్లు ఏకంగా రూ.119 కోట్లను పెట్టి కొనుగోలు చేసి చుట్టుపక్కలవారిని బిత్తరపోయేలా చేశారు. ఈ సంస్థకు చెందిన వారికి ఈ ఫ్లాట్లు ఉన్నాయో వారే తిరిగి పెద్ద మొత్తంలో వెచ్చించి తమ సొంత ప్రాజెక్టు అభివృద్ధి పేరిట కొనుగోలు చేయడం పలువురుని ఆశ్చర్య పరుస్తుంది. వర్లీలో 1973నాటి ప్రాజెక్టులో భాగంగా ఓంకార్ రియల్టర్స్, డెవలపర్స్ పేరిట అపార్టుమెంట్లు ఉన్నాయి. ఈ బిల్డర్స్ భాగస్వాములైన బాబులాల్ వర్మ, ఓంకార్ సంస్థ సహ వ్యవస్థాపకుడు, మేనెజింగ్ డైరెక్టర్ గౌరవ్ గుప్తా పేరిట ఈ నాలుగు ఫ్లాట్లను నవంబర్ 15న రిజిస్ట్రేషన్ చేశారు. ఇందుకోసం వారు చెల్లించిన మొత్తం రూ.119కోట్లు. పెద్ద నోట్ల రద్దుతో దేశమంతా డబ్బులకోసం తీవ్ర ఇక్కట్లు పడుతుండగా ఇంతపెద్ద మొత్తంలో నగదు మార్పిడి ఎలా జరిగిందనేది మొదటిగా తలెత్తుతున్న ప్రశ్న కాగా.. ఇంత పెద్ద మొత్తం పెట్టి సొంత ప్రాజెక్టు పేరిట అదే కంపెనీకి చెందిన వ్యక్తులే కొనుగోలు చేయడం వెనుక మతలబు ఏమిటని మరోప్రశ్న తలెత్తుతుంది. కాగా, గత మూడేళ్ల కిందటే తాము వాటిని కొనుగోలు చేశామని, రిజిస్ట్రేషన్ మాత్రం ఇటీవలె పూర్తయిందని వర్మ వివరణ ఇచ్చారు. తాము కొత్తగా తలపెట్టనున్న ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే తమ కంపెనీకి చెందిన పలువురు డైరెక్టర్లు ఇదే మాదిరిగా ఫ్లాట్లను కొనుగోలు చేసినట్లు కూడా తెలిపారు.