ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణ మూర్తి కొత్తగా రూ.50 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని పదహారో అంతస్తులో ఆయన ఫ్లాట్ కొనుగోలు చేశారు. సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ నాలుగు బెడ్‌రూమ్‌లను కలిగి ఉంది. దీనికి ఐదు కారు పార్కింగ్ స్థలాలున్నాయి. మూర్తి దీన్ని రూ.50 కోట్లతో కొనుగోలు చేయడంతో నగరంలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్‌ల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ టవర్స్‌లో ఫ్లాట్ సొంతం చేసుకున్న ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి మూర్తి తాజాగా ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.
బెంగళూరు నగరం మెయిన్ సిటీలో ఉన్న యూబీ సిటీ హౌస్ వద్ద కింగ్‌ఫిషర్ టవర్స్ 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మూడు బ్లాకుల్లో 34 అంతస్తుల్లో 81 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి సగటున 8,321 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్నాయి. గతంలో ఈ ప్రదేశంలో విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండేది. అందులో ఫ్లాట్లు నిర్మించారు. ఇందుకోసం 2010లో కింగ్‌ఫిషర్, ప్రెస్టీజ్ గ్రూప్ కలిసి పనిచేశాయి. ఇప్పటికే ప్రెస్టీజ్ గ్రూప్ ఆధ్వర్యంలోని 41 లగ్జరీ అపార్ట్‌మెంట్లను సంస్థ విక్రయించింది.
ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!
ఇప్పటికే నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఆ టవర్స్‌లో 23 అంతస్తులో రూ.29 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్‌షా, కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్, క్వెస్ట్ గ్లోబల్ సీఈఓ, ఛైర్మన్ అజిత్‌ప్రభు ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment