Kingfisher
-
కింగ్ ఫిషర్ బీర్ల నిలిపివేత.. అందుకేనా?: హరీష్‌రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీర్ల అమ్మకాలు నిలిపివేయడానికి యునైటెడ్ బ్రూవరీస్(UB) తీసుకున్న నిర్ణయం పలు ప్రశ్నలు పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అనుమానం వ్యక్తం చేశారు. బీర్లకు సంబంధించి యునైటెడ్ బ్రూవరీస్ ప్రకటనపై ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు.బీర్లకు సంబంధించిన బకాయిలను బెవరేజెస్ కార్పొరేషన్(TGBCL) చెల్లించలేదని యునైటెడ్ బ్రూవరీస్ పేర్కొందన్న హరీష్ రావు.. దీంతో రాష్ట్రంలో కింగ్ ఫిషర్, హినెకెన్ వంటి ప్రీమియం బ్రాండ్ల లభ్యతకు అంతరాయం కలుగుతుందని భావిస్తున్నారని చెప్పారు.బూమ్ బూమ్, బిర్యానీ వంటి స్థానిక బ్రాండ్ల బీర్లను ప్రోత్సహించేందుకు ఇది ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ప్రయత్నమా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. బిల్లుల చెల్లింపులో వరుస క్రమాన్ని కాకుండా ప్రత్యేక ప్రాధాన్యతల కారణంగా ఈ పరిస్థితి తలెత్తిందా అని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.ఇదీ చదవండి: తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్ -
తెలంగాణ బేవరేజస్ కార్పొరేషన్‌కు బీర్ల సప్లై నిలిపివేత
-
తెలంగాణకు కింగ్‌ఫిషర్ బీర్లు బంద్
సాక్షి, హైదరాబాద్: పండుగ ముందర మద్యం ప్రియులకు చేదు వార్త. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్(TSBCL)కు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్(యూబీ)ప్రకటించింది. దీంతో ఆ సంస్థ నుంచి రాష్ట్రానికి వచ్చే కింగ్‌ఫిషర్(King Fisher), హెనికిన్ బీర్ల సరఫరా ఆగిపోనుంది. తెలంగాణ బెవరేజస్ కార్పొరేషన్ నుంచి తమకు రూ.900 కోట్లు బకాయి ఉందని, పైగా 2019 నుంచి ధరలను సవరించకపోవడంతోనే యూబీ సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీర్ల సరఫరా నిలిపివేస్తున్నట్లు సెబీకి లేఖ ద్వారా తెలిపింది.కాగా, రాష్ట్రంలో ఎక్కువగా అమ్ముడయే బీర్ బ్రాండ్ కింగ్‌షిషరే. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ యూబీ సంస్థకు ప్రతి 45 రోజులకోసారి బకాయిలు చెల్లించాల్సి ఉండగా, నాలుగు నెలలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సరఫరా నిలిపివేసినట్లు సమాచారం.తెలంగాణలో కింగ్ ఫిషర్ బీర్లపై 35 శాతం రేట్లు పెంచాలని బేవరేజ్ కార్పొరేషన్‌ను యునైటెడ్ బ్రూవరీస్ కోరింది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలపై గతంలోనే కమిటీని ప్రభుత్వం నియమించింది. రిటైర్డ్ జడ్జిలతో వేసిన కమిటీ నివేదిక కోసం ప్రభుత్వం వేచి చూస్తోంది. యునైటెడ్ బేవరేజస్ ప్రతిపాదనలతో మందు బాబులపై ఆర్థిక భారం పెరగనుంది. మద్యం ప్రియులపై భారం పడకుండా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఇదీ చదవండి: ఫ్యూచర్ సిటీ.. పోలీసుల పోటీ! -
రూ.50 కోట్లతో లగ్జరీ ఫ్లాట్ కొనుగోలు.. ఎక్కడంటే..
ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు ఎన్ఆర్ నారాయణ మూర్తి కొత్తగా రూ.50 కోట్లతో ఫ్లాట్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు. బెంగళూరులో కింగ్‌ఫిషర్ టవర్స్‌లోని పదహారో అంతస్తులో ఆయన ఫ్లాట్ కొనుగోలు చేశారు. సుమారు 8,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఫ్లాట్ నాలుగు బెడ్రూమ్లను కలిగి ఉంది. దీనికి ఐదు కారు పార్కింగ్ స్థలాలున్నాయి. మూర్తి దీన్ని రూ.50 కోట్లతో కొనుగోలు చేయడంతో నగరంలోని అత్యంత ఖరీదైన ఫ్లాట్ల్లో ఒకటిగా నిలిచింది. దాదాపు పదేళ్ల క్రితం ఈ టవర్స్‌లో ఫ్లాట్ సొంతం చేసుకున్న ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్త నుంచి మూర్తి తాజాగా ఈ ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు.బెంగళూరు నగరం మెయిన్ సిటీలో ఉన్న యూబీ సిటీ హౌస్ వద్ద కింగ్‌ఫిషర్ టవర్స్ 4.5 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో మూడు బ్లాకుల్లో 34 అంతస్తుల్లో 81 ఫ్లాట్లు ఉన్నాయి. ఒక్కోటి సగటున 8,321 చదరపు అడుగుల పరిమాణంలో ఉన్నాయి. గతంలో ఈ ప్రదేశంలో విజయ్ మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండేది. అందులో ఫ్లాట్లు నిర్మించారు. ఇందుకోసం 2010లో కింగ్‌ఫిషర్, ప్రెస్టీజ్ గ్రూప్ కలిసి పనిచేశాయి. ఇప్పటికే ప్రెస్టీజ్ గ్రూప్ ఆధ్వర్యంలోని 41 లగ్జరీ అపార్ట్మెంట్లను సంస్థ విక్రయించింది.ఇదీ చదవండి: విభిన్న ఖాతాలు.. మరెన్నో పరిమితులు!ఇప్పటికే నారాయణ మూర్తి సతీమణి సుధామూర్తి ఆ టవర్స్‌లో 23 అంతస్తులో రూ.29 కోట్లతో ఓ ఫ్లాట్ కొనుగోలు చేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్పర్సన్ కిరణ్ మజుందార్‌షా, కర్ణాటక విద్యుత్‌శాఖ మంత్రి కేజే జార్జ్ కుమారుడు రానా జార్జ్, క్వెస్ట్ గ్లోబల్ సీఈఓ, ఛైర్మన్ అజిత్ప్రభు ఈ టవర్స్‌లో ఫ్లాట్లు కొనుగోలు చేశారు. -
శీతాకాల అతిథుల సందడి
శీతాకాలం వచ్చేసింది.. కొల్లేరు సరస్సుకు విదేశీ అతిథుల రాకా మొదలైంది. వేల మైళ్ల దూరం నుంచి ఎగిరొచి్చన రంగురంగుల పక్షులు కిలకిలారావాలతో పర్యాటకులను అలరిస్తున్నాయి. విదేశీ పక్షుల స్వస్థలాల్లో వాతావరణ మార్పు కారణంగా మనుగడ కోసం తరులు, గిరులు, సాగరాలను దాటి ఏలూరు జిల్లా కొల్లేరుకు చేరుతున్నాయి. ఇక్కడే సంతానోత్పత్తి చేసుకొని పిల్లలతో మార్చి చివర్లో సొంతూర్లకు వెళ్లిపోతాయి. ఏటా వచ్చే ఈ అతిథులను ఇక్కడి ప్రజలు సొంతబిడ్డల్లా ఆదరిస్తారు. వీటిని చూసి ఆనందించేందుకు వచ్చే పర్యాటకులతో పక్షుల విహార కేంద్రాలు కళకళలాడుతున్నాయి.రాష్ట్రంలో పక్షుల విహార కేంద్రాలు ⇒ కొల్లేరు – ఏలూరు జిల్లా⇒ పులికాట్ సరస్సు, నేలపట్టు – నెల్లూరు జిల్లా ⇒ ఉప్పలపాడు – గుంటూరు ⇒ తేలినీలపురం, తేలుకుంచి – శ్రీకాకుళం ⇒ కౌండన్య – చిత్తూరు జిల్లా77,138 ఎకరాల విస్తీర్ణంలో.. ప్రకృతి సోయాగాల ఆరాధకులను కనువిందు చేస్తుంది కొల్లేరు సరస్సు. ఏలూరు జిల్లాలో 77,138 ఎకకాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ ఆటపాక, మాధవపురం పక్షుల విహార కేంద్రాలు ప్రశిద్ధమైనవి. ఏటా శీతాకాలంలో వందలాది జాతుల పక్షులు ఇక్కడికి వచ్చి సేదతీరుతుంటాయి. మన దేశానికి ఏటా వలస వచ్చే పక్షి జాతులు 1,349 ఉన్నట్లు అంచనా. వీటిలో ఎక్కువగా కొల్లేరు ప్రాంతానికి వస్తుంటాయి. ఏషియన్ వాటర్ బర్ట్స్ నివేదిక ప్రకారం గతేడాది ఇక్కడ 105 పక్షి జాతులకు సంబంధించి 81,495 పక్షులు విడిది చేశాయి. ఈ ఏడాది మార్చిలో 50 వేల పక్షులు ఉన్నట్టు అటవీశాఖ అధికారులు వెల్లడించారు. వలస పక్షులకు విడిది వలస అనేది పక్షుల జీవన శైలి. రుతువుల్లో మార్పులు వచ్చునప్పుడు దాదాపు 4,000 పక్షి జాతులు అనువైన ప్రదేశాలను వెతుక్కుంటూ వలసలు వెళతాయి. వీటిలో సుమారు 1,800 జాతులు అత్యంత సుదూర ప్రాంతాలకు వెళ్తాయి. కొల్లేరుకు సైబీరియా, రష్యా, టర్కీ, తూర్పు యూరప్, అ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి పక్షులు వస్తున్నాయి. వీటిలో ఆఫ్రికా నుంచి రెడ్ క్రిస్టెడ్ పోచార్డ్ (ఎర్ర తల చిలువ), అలాస్మా నుంచి పసిఫిక్ గెల్డెన్ ఫ్లోవర్ (బంగారు ఉల్లంకి), ఐర్లండ్ నుంచి కామన్ రెడ్ షాంక్ (ఎర్ర కాళ్ల ఉల్లంకి), ఐరోపా నుంచి యురేíÙయన్ స్పూన్ బిల్ (తెడ్డు మూతి కొంగ), దక్షిణాఫ్రికా నుంచి బ్రాహ్మణి షెల్ డక్ (బాపన బాతు), ఫిలిప్సీన్స్ నుంచి వైట్ పెలికాన్ (తెల్ల చింక బాతు) వంటివి ముఖ్యమైనవి.చిత్తడి నేలల నెలవు ‘కొల్లేరు’ చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు పక్షుల జీవనానికి అనువైనది. ఇక్కడి ఆటపాక పక్షుల కేంద్రం పెలికాన్ (గూడబాతు) పక్షుల ఆవాస ప్రాంతంగా పేరుగడించింది. దీనిని పెలికాన్ ప్యారడైజ్‌గా పిలుస్తారు. కొల్లేరు సరస్సులో గూడబాతుతో పాటు ఎర్ర కాళ్ల కొంగ (పెయింటెడ్ స్టార్క్), నల్ల రెక్కల ఉల్లంకి పిట్ట (బ్లాక్ వింగ్డ్ స్టిల్ట్), తెడ్డు ముక్కు కొంగ (ఏషియన్ ఓపెన్‌బిల్ స్టార్క్) కంకణాల పిట్ట (గ్లోబీ ఐబీస్), చిన్న నీటి కాకి (లిటిల్ కార్మోరెంట్), సాధారణ కోయిలలు (స్వాలో), పెద్ద చిలువ బాతు (లార్జ్ విజ్లింగ్ డక్), చెరువు బాతు (గార్గనే), తొండు వల్లంకి (బ్లాక్ టయల్డ్ గాట్‌విట్) వంటి 105 రకాల పక్షి జాతులు ఉన్నాయి.పక్షులు మంచి నేస్తాలు పక్షులు పర్యావరణ సమతుల్యతకు మంచి నేస్తాలు. వాటిని సంరక్షించుకోవాల్సిన బా ధ్యత అందరిపై ఉంది. వలస పక్షుల్లో అనేక జాతులు అంతరించేపోయే ప్రమాదంలో ఉన్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. కొల్లేరులో చిత్తడి నేలల ప్రదేశాలు వలస పక్షులకు ఆవాసాలుగా ఉన్నాయి. పక్షులకు ఏ విధమైన హాని తలపెట్టకుండా సంరక్షించుకోవాలి. –దీపక్ రామయ్యన్, వైల్డ్‌లైఫ్ ఎక్స్పర్ట్, హైదరాబాద్ఆకాశమే వాటి హద్దుసమశీతల వాతావరణాన్ని వెతుక్కుంటూ పక్షులు వలస వస్తాయి. ఆకాశమే వాటి హద్దు. కొల్లేరు చిత్తడి నేలల ప్రాంతం వీటికి అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో శీతాకాలంలో మంచుగడ్డ కడుతుంది. అందువల్ల అవి సెంట్రల్ ఆసియన్ ఫ్లైవే (సీఏఎఫ్) మీదుగా మన దేశానికి వస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో బోటు షికారు ద్వారా పక్షులను దగ్గరగా తిలకించే అవకాశం ఉంది. –కేవీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్, కైకలూరు. -
అంబానీ ఇంటిని తలదన్నే ఇల్లు!! బెంగళూరులో..
దేశంలో అత్యంత ఖరీదైన ఇల్లు ఏది అంటే టక్కున ముఖేష్ అంబానీది అనే చెప్పేస్తారు. ముంబైలో ఉన్న ఈ విలాసవంతమైన నివాసం పేరు ‘యాంటిలియా’. అయితే దీనిని తలదన్నే మ్యాన్షన్ బెంగళూరులో ఉంది. అది ఎవరిది.. దాని విలువ ఎంత.. ఇతర విశేషాలు ఈ కథనంలో తెలుసుకుందాం..400 అడుగుల ఎత్తు.. 33 అంతస్తుల లగ్జరీ అపార్ట్మెంట్ కాంప్లెక్స్.. దానిపైన మ్యాన్షన్. రెండు అంతస్తుల్లో ఉన్న ఈ స్కై మ్యాన్షన్‌లో ఉన్న విలాసవంతమైన సదుపాయాల గురించి తెలిస్తే నోరెల్లబెడతారు. హెలిప్యాడ్, లష్ గార్డెన్స్, ఇన్ఫినిటీ స్విమ్మింగ్ పూల్, 360 డిగ్రీ వ్యూయింగ్ డెక్‌తో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది.ప్రస్తుతం విదేశాలకు పరారైన, లిక్కర్ కింగ్‌గా పేరొందిన విజయ్ మాల్యాకు చెందిందే ఈ విలాసవంతమైన భవనం. కింగ్‌ఫిషర్ టవర్స్‌గా పిలిచే ఈ అపార్ట్మెంట్ బ్లాక్‌ను మాల్యా పూర్వీకుల ఇల్లు ఉండే 4.5 ఎకరాల స్థలంలో నిర్మించారు. ప్రెస్టీజ్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ దీన్ని నిర్మించింది. ఈ ఇంటి విలువ 20 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.ఒక్క రోజు కూడా ఉండలేదుఇక అంబానీ కుటుంబానికి చెందిన ముంబై టవర్, యాంటిలియా దేశంలోని అత్యంత సంపన్నుల యాజమాన్యంలో ఉన్న మరో అద్భుతమైన ఇల్లు . దీని నిర్మాణానికి 2 బిలియన్ ఖర్చయినట్లు అంచనా. విలువపరంగా చూస్తే కింగ్‌ఫిషర్ టవర్స్ విలువ తక్కువే అయినా అంబానీ నివాసం 27 అంతస్తులు ఉంటే.. మాల్యా మ్యాన్షన్ ఉండే టవర్స్ 33 అంతస్తుల్లో ఉంది. అయితే ముచ్చట పడి కట్టించుకున్న ఈ మ్యాన్షన్‌లో విజయ్ మాల్యా ఒక్క రోజు కూడా ఉండలేదు. ఇది ఇంకా నిర్మాణంలో ఉండగానే బ్యాంకులకు రుణాల ఎగవేత వ్యవహారంలో ఆయన దేశం వదిలి పారిపోయారు. -
జపాన్ బుల్లెట్ రైలు తలరాతని మార్చిన కింగ్‌ఫిషర్!
శాస్త్రవేత్తలు, మహామహా మేధావులు ఎన్నో కొంగొత్త ఆవిష్కరణలు చేయడం గురించి విన్నాం. అవన్నీ పూర్తి స్థాయిలో ఫలవంతమయ్యేందుకు దేవుడు వైపు(ప్రకృతి వైపు) చూడక తప్పేది కాదు. ఆయన చేసిన సృష్టి అద్భుతమే ఓ గొప్ప మేథస్సు. దాని సాయంతోనే ఆవిష్కరణలు ఫలమంతమయ్యేవి. అలాంటి ఘటనే జపాన్ బుల్లెట్ రైలు విషయంలో చోటు చేసుకుంది. అదేంటంటే..జపాన్ శాస్త్రవేత్తలు సాంకేతికతో కూడిన అత్యంత వేగవంతమైన బుల్లెట్ రైళ్లను రూపొందించారు. అవి ప్రజల దూరాలను దగ్గర చేసి సమయాన్ని ఆదా చేసేలా అత్యంత నాణ్యతతో రూపొందించారు. అయితే జపాన్‌లో రైలు మార్గం చాలా వరకు టన్నెళ్లతో కూడినది. దీంతో గంటక సుమారు 240 నుంచి 320 కిలోమీటర్లు దూరం ప్రయాణించే ఈ బల్లెట్ రైళ్లు ఈ టన్నెల్ గుండా వెళ్లగానే భారీ శబ్దాలు వచ్చేవి. ఎంతలా అంటే ఇవి దాదాపు 400 మీటర్లు దూరంలో ఉన్న నివాసితులకు వినిపించేంత పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేవి. దీంతో ఈ రైళ్లపై ఫిర్యాదులు రావడం మొదలయ్యింది. నిజంగానే ఆ శబ్దాలు భరిచలేనంత పెద్దగా వచ్చేవి. దీంతో శాస్త్రవేత్తలు ఈ సమస్యకు పరిష్కారం ఏంటని వెతకడం ప్రారంభించారు. పలు సమావేశాల్లో చర్చల్లో దీనికి పరిష్కారం ప్రకృతిని పరిశీలించే కనుగొనగలమని ఒక శాస్త్రవేత్త సూచించడంతో..ఈ బుల్లెట్ ట్రెయిన్ని ఆవిష్కరించిన ఇజీ నకాట్సు ఆ దిశగా ఆలోచించడం మొదలు పెట్టాడు. ఇక్కడ బుల్లెట్ రైలు అత్యంత వేగంతో టన్నెల్ గుండా వెళ్తుండటంతో దాని ముందున్న అట్మాస్పియరిక్ ప్రెజరే ఈ బారీ శబ్దానికి కారణమని గుర్తించాడు. ఇలా ఆకాశం నుంచి వేగవంతంగా పయనించి భూమ్మీదకు వచ్చే జీవి ఉందా అనే దిశగా ఆలోచించడం ప్రారంభించాడు. అప్పుడే కింగ్ ఫిషర్ బర్డ్ జ్ఞప్తికి వచ్చింది. అది ఆకాశ నంచి అత్యంత వేగంగా వచ్చి నీటిలోకి శబ్దం లేకుండా తల ముంచి చేపలను లటుక్కున పట్టుకునే తీరు నకాట్సని సరికొత్త ఆలోచనను రేకెత్తించింది. దాని ముక్కు అత్యంత సూదిగా పొడుగుగా ఉండటంతోనే కదా నీటిపై శబ్దం చేయకుండా లోపలకు ముంచి చేపను పట్టుకోగలుగుతుంది అని గుర్తించాడు. దీన్నే బుల్లెట్ రైలుకి అప్లైచేసి దాని రూపురేఖలు మార్పు చేస్తాడు. అనుహ్యాంగా అది టన్నెల్ గుండా వెళ్లినప్పుడూ ఎలాంటి శబ్ద కాలుష్యాన్ని సృష్టించకుండా నిశబ్దంగా వెళ్తుంది. ఈ కొత్త డిజైన్ శబ్దాన్ని తగ్గించడమే కాకుండా, రైళ్లను 15% వేగంగా, 15% శక్తిని ఆదాచేసేలా చేసింది. దేవుడి అద్భత సృష్టిని కాపీ కొట్టడం ద్వారా ఇది సాధ్యం అయ్యిందని ఆయన మేథస్సు ముందు మానవ మేథస్సు చిన్నదేనని నకాట్సు అన్నారు. Japan's famous bullet train used to make a loud boom when it travelled through tunnels. But, thanks to a spot of bird-watching, an engineer was able to fix the problem after he was inspired by a kingfisher.#biomimicry #designthinking #uxRead more at: https://t.co/MzROXEt3aV pic.twitter.com/2HZd9P8FIy— Black Bee (@BlackBeeCoIndia) June 27, 2021 (చదవండి: భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగేస్తున్నారా? నిపుణులు ఏమంటున్నారంటే..) -
అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్ సంస్థ
Vijay Mallya Kingfisher House Sold For Rs 52 Crores: కింగ్ ఆఫ్ గుడ్టైమ్గా పేరు తెచ్చుకుని ప్రస్తుతం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ఆస్తులు వేలానికి వస్తున్నాయి. ఇందులో ముంబైలో ఉన్న విలాసవంతమైన ఇంటిని హైదరాబాద్‌కి చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ చేజిక్కించుకుంది. వేలానికి ఆస్తులు విజయ్‌మాల్యా... బిజినెస్ రంగానికి గ్లాబర్ సొబగులు అద్దిన వ్యాపారవేత్త. విలాసవంతమైన జీవితానికి కేరాఫ్ అడ్రస్. అయితే కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ ప్రారంభంతో ఆయన ప్రభ మసకబారిపోయింది. ఎయిర్‌లైన్స్ కంపెనీకి వచ్చిన వరుస నష్టాలతో మాల్యా ఏకంగా తొమ్మిది వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకులకు బాకీ పడ్డారు. చివరకు తమ అప్పుల కింద విజయ్ మాల్యా ఆస్తులను వేలానికి పెట్టే హక్కును బ్యాంకులు చట్టపరంగా సాధించాయి. రూ. 52 కోట్లు ముంబై ఎయిర్‌పోర్టుకు దగ్గర్లో విలేపార్లే ఏరియాలో ఉన్న కింగ్ ఫిషర్ హౌజ్‌ను బ్యాంకులు వేలానికి వేశాయి. ఈ భవనం వేలం ప్రారంభ ధర రూ.52 కోట్లుగా నిర్ణయించాయి. ఈ వేలంలో హైదరాబాద్‌కి చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ బేస్ ధర దగ్గరే ఈ భవంతిని సొంతం చేసుకున్నట్టు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2016 నుంచి ప్రస్తుతం వేలంలో అమ్ముడైపోయిన భవనాన్ని బ్యాంకుల కన్సార్టియం 2016లో వేలానికి తెచ్చింది. అయితే ప్రారంభ ధర రూ.150 కోట్లుగా పేర్కొనడంతో కొనేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆ తర్వాత పలు మార్లు బ్యాంకులు ప్రయత్నాలు చేసినా సానుకూల ఫలితాలు పొందలేదు. చివరకు ఆ భవనం ధర తగ్గించి ప్రారంభ ధర రూ. 52 కోట్లుగా నిర్ణయించడంతో వెంటనే అమ్ముడు పోయింది. -
‘కేఎఫ్’ కావాలి.. కరీంనగర్లో కలపండి!
సాక్షి, జగిత్యాల: బీర్బల్ కథలు వినే ఉంటారు. ‘బీర్’బాబుల లేఖ ఎప్పుడైనా చదివారా? వేసవిలో మందుబాబుల దాహం తీర్చే ‘బీర్’కాయల కోసం జగిత్యాల వాసులు ఏకంగా తమ జిల్లాను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కిక్కిచ్చే ‘కింగ్‌ఫిషర్’ కోసం కరీంనగర్ జిల్లాకు మారిపోతామంటున్నారు! తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్ లోంచి బయటపడ్డ ఉత్తరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ జిల్లాను తిరిగి కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కోరుతూ జగిత్యాల వాసుల పేరుతో ‘బీర్’కాయుడెవరో ఈ లేఖ రాశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇది బయటపడింది. తమకెంతో ఇష్టమైన బీర్ జగిత్యాల జిల్లాలో లభ్యంకానందున తమ జిల్లాను కరీంనగర్లో కలిపేయాలని లేఖలో కోరారు. కింగ్‌ఫిషర్(కేఎఫ్) బీర్‌ను అందుబాటులో ఉంచాలని పనిలో పనిగా అభ్యర్థించారు. ఈ లెటర్ చదివి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. అయితే ఈ లేఖ బ్యాలెట్ బాక్స్‌లో రాలేదని, ఇదంతా ఫేక్ అని స్థానికులు అంటున్నారు. -
కింగ్‌ఫిషర్ మాల్యాపై ఎస్ఎఫ్ఐఓ ప్రాసిక్యూషన్ కేసు!
న్యూఢిల్లీ: కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ విషయంలో విజయ్ మాల్యా, ఇతరులపై ప్రాసిక్యూషన్ కేసులు దాఖలు చేయడానికి ఎస్ఎఫ్ఐఓకి మంత్రిత్వ శాఖ ఆమోదం లభించింది. కింగ్ ఫిషర్ ఏర్‌లైన్స్ విషయంలో విజయ్ మాల్యా, ఇతరులు పలు ఉల్లంఘనలకు పాల్పడ్డారని సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్(ఎస్ఎఫ్ఐఓ) ఒక సవివరమైన నివేదికను కార్పొరేట్ వ్యవహరాల శాఖకు సమర్పించింది. మాల్యా, కంపెనీ అధికారుల్లో కొందరు కంపెనీల చట్టంలోని వివిధ నిబంధనలను ఉల్లంఘించారని, కంపెనీల నిధులను దారిమళ్లించారని ఈ నివేదిక పేర్కొంది. ఎస్ఎఫ్ఐఓ కార్పొరేట్ మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నందున ప్రాసిక్యూషన్ కేసుల దాఖలుకు ఎస్‌ఎఫ్‌ఐఓకు సదరు మంత్రిత్వ శాఖ ఆమోదం అవసరం. ఈ కేసు విషయమై కలసి చర్యలు తీసుకోవడానికి గాను, ఇటీవలే ఎస్ఎఫ్ఐఓ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు సమావేశమై చర్చించాయని సమాచారం. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ రూ.9,000 కోట్ల రుణ చెల్లింపుల్లో విఫలం కావడంతో ఆ కంపెనీ అధినేత విజయ్ మాల్యాపై కేసుల దాఖలయ్యాయి. మాల్యా, ఇతర నిందితులపై ఈడీ, సీబీఐలు ఇప్పటికే వేర్వేరు చార్జిషీట్లు దాఖలయ్యాయి. ఈ విమానయాన సంస్థకు రుణాలు మంజూరు విషయంలో కొన్ని బ్యాంకుల, కొం దరు బ్యాంక్ అధికారుల పాత్రలపై దర్యాప్తు చేయాలని ఎస్ఎఫ్ఐఓ సూచించింది. ఈ కంపెనీ ప్రమోటర్లపై చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది. -
కింగ్‌ఫిషర్ హౌస్ వేలం... మళ్లీ విఫలం
కింగ్‌ఫిషర్ హౌన్‌ను కొనేవారు కరువయ్యారు. బ్యాంకుల కన్సార్షియం ఎంత ప్రయత్నించినప్పటికీ ముంబైలోని ఈ ప్రాపర్టీని మాత్రం విక్రయించలేకపోతోంది. దీన్ని తాజాగా ఐదోసారి వేలానికి ఉంచినా ఫలితం దక్కలేదు. -
‘మాల్యా! మా రూ. 300 కోట్ల మాటేంటి’
బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయలను ఎగవేసి లండన్ పారిపోయిన విజయ మాల్యా భారత్ రాక కోసం ఒక్క బ్యాంకులే కాదు, ఆయన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో పనిచేసిన మాజీ ఉద్యోగులతో పాటు ఇప్పటికీ కంపెనీ పే రోల్స్‌లో ఉన్న ఉద్యోగులు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు. దాదాపు మూడువేల మంది ఉద్యోగులకు వేతన బకాయిలు, గ్రాట్యుటీల కింద దాదాపు 300 కోట్ల రూపాయలను విజయమాల్యా చెల్లించాల్సి ఉంది. బ్యాంకుల వద్ద మరిన్ని రుణాలు తీసుకొని జీతాల బకాయిలు చెల్లించడంతో పాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌ను పునరుద్ధరిస్తానని మాల్యా చాలాకాలం పాటు ఉద్యోగులకు మాయమాటలు చెప్పారు. చివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే లండన్ చెక్కేశారు. 2012, సెప్టెంబర్ 30వ తేదీన కింగ్‌ఫిషర్ విమాన సర్వీసులు నిలిచిపోయాయి. ఇందులో సీనియర్ మేనేజర్‌గా పనిచేసి, 2012, నవంబర్ నెలలో రాజీనామా చేసిన అనిరుధ్ బల్లాల్ తనకు కంపెనీ నుంచి ఏడు నెలల జీతం బకాయిలు రావాలని మీడియాకు తెలిపారు. ఆయన ఇప్పుడు ముంబైలోని ఏర్‌క్రాఫ్ట్ గ్రౌండ్ హాండ్లింగ్ కంపెనీలో పనిచేస్తున్నారు. 2013, జూన్ 8న ఎయిర్‌లైన్స్ లైసెన్స్‌ను పునరుద్ధరించేందుకు భారత విమానయానం డైరెక్టర్ జనరల్ నిరాకరించడంతో ఇక తాను ఉద్యోగులకు బకాయిలు కూడా చెల్లించలేనని మాల్యా చేతులెత్తేశారు. బల్లాల్‌కు సకాలంలో ఉద్యోగం దొరికింది కనుక ఆయన అదృష్టవంతుడు. చాలామంది ఉద్యోగాలు దొరక్క చాలాకాలం కంపెనీలోనే ఉండిపోయారు. ఇప్పటికీ ఉద్యోగాలు దొరకని దురదృష్టవంతులు ఉన్నారు. విజయ మాల్యాను లండన్‌లో అరెస్ట్ చేశారని తెలిసి ఎంతో సంతోషించానని, అంతలోనే ఆయనకు బెయిల్ కూడా లభించిందని తెల్సి నిరుత్సాహానికి గురయ్యానని కింగ్‌ఫిషర్ కంపెనీలో ఫ్లైట్ సర్వీసు డైరెక్టర్‌గా పనిచేసిన నీతు శుక్లా చెప్పారు. ఆమె 2014, డిసెంబర్ నెలలో కంపెనీకి రిజైన్ చేశారు. ఆమెకు మూడేళ్ల బకాయిలు రావాలి. విజయ మాల్యా గురించి ప్రభుత్వం మాట్లాడినప్పుడల్లా ఆయన బ్యాంకులకు ఎగవేసిన రుణాల గురించే మాట్లాడుతుంది తప్ప బాధిత ఉద్యోగుల గురించి మాట్లాడిన సందర్భం లేదని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. కింగ్‌ఫిషర్ కంపెనీలో సిస్టమ్స్ మేనేజర్‌గా పనిచేసిన రజనీ జైన్ ఇప్పటికీ ఎక్కడా ఉద్యోగం చేయడం లేదు. తాము ఇల్లు కొనేందుకు ప్లాన్ చేసుకొని అడ్వాన్సు చెల్లించిన మూడు, నాలుగు నెలలకే ఎయిర్‌లైన్స్ మూతపడిందని, ఫలితంగా తాము ఇల్లు కొనే ఆలోచనను వదులుకున్నామని ఆమె చెప్పారు. దీని వల్ల తాము అడ్వాన్స్‌గా చెల్లించిన సొమ్మును నష్టపోవాల్సి వచ్చిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. 2016–17 ఆర్థిక సంవత్సరం వరకు కూడా భారత్‌లోని కంపెనీ పే రోల్స్‌లో 900 మంది ఉద్యోగులు ఉన్నారని ఆమె తెలిపారు. విదేశీ చట్టాలు కఠినంగా ఉండడం వల్ల విదేశాల్లోని ఉద్యోగులకు కంపెనీ మూతపడినందుకు నష్టపరిహారం కూడా కంపెనీ చెల్లించిందని, ఇక్కడి వారికి జీతం బకాయిలు కూడా చెల్లించలేదని ఆమె వాపోయారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం పోయిన కారణంగా నిశ్చితార్థం అయిన తన కొలీగ్ పెళ్లి నిలిచిపోయిందని, ఒకరు కిరాయి ఉంటున్న అద్దె ఇంటి నుంచి ఉన్నపళంగా రోడ్డున పడాల్సి వచ్చిందని, మరొకరి తల్లి ఆత్మహత్య చేసుకుందని తన చేదు అనుభవాలను రజనీ మీడియా ముందు గుర్తుచేశారు. -
ఎయిర్ కోస్టా ఎత్తేస్తారా?
► పైలట్లందరూ కంపెనీకి గుడ్‌బై ► 300 మందికిపైగా ఉద్యోగుల రాజీనామా ► రెండు నెలలుగా సిబ్బందికి జీతాల్లేవ్ ► మరో కింగ్‌ఫిషర్ అంటున్న సిబ్బంది హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ప్రపంచ దేశాల్లో రెక్కలు వాల్చాలని ఆశగా ఎదురు చూసిన ఎయిర్ కోస్టా శకం ముగిసినట్టే కనిపిస్తోంది. అప్పుల ఊబిలో చిక్కుకున్న సంస్థను ఆదుకోవడానికి ఇన్వెస్టర్లు ఎవరూ ముందుకు రాకపోవటంతో కంపెనీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. జనవరి నుంచి తమకు జీతాలు చెల్లించటం లేదని, ఇది మరో కింగ్‌ఫిషర్‌గా మారుతోందని కొందరు ఉద్యోగులు గట్టిగానే చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 28 నుంచి ఎయిర్కోస్టా విమానాలు ఎగరటం నిలిచిపోయాయి. మొదట్లో ఈ అవాంతరాలు రెండు మూడు రోజులే ఉంటాయని చెబుతూ వచ్చిన సంస్థ ప్రమోటర్లు... ఇప్పటికీ విమాన సర్వీసుల పునరుద్ధరణ జరగకపోయినా మౌనం వీడటం లేదు. వీటన్నిటికీ తోడు ఉద్యోగులు ఒక్కరొక్కరుగా రాజీనామా చేస్తున్నా... ప్రధానంగా పైలట్లు కంపెనీని విడిచి పోతున్నా... వారిని నిలువరించే ప్రయత్నాలు కూడా చేయటం లేదు. ‘‘ఇదంతా చూస్తుంటే సంస్థను మూసివేయటానికే ప్రమోటర్లు ఇష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. ఒక్కొక్కరుగా సీనియర్ ఉద్యోగులంతా వెళ్లిపోతున్నా ఒక్కరిని కూడా ఆపే ప్రయత్నాలు చేయటం లేదు’’ అని కంపెనీలో కీలక స్థానంలో పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. రాజీనామాలు చేసిన వెంటనే వాటిని ఆమోదించడం చకచకా జరిగిపోతున్నట్లు తెలియజేశారు. ఏడాదిగా వేతనాలు సరిగా రావడం లేదని ఆయన వాపోయారు. ‘‘కొత్త ఇన్వెస్టర్ వస్తేనే విమానాలు ఎగురుతాయని కంపెనీ చెబుతున్నప్పటికీ ఇప్పట్లో ఇది సాధ్యపడే అవకాశాలు కనిపించటం లేదు. ఎందుకంటే కంపెనీకి ఉన్నపళంగా రూ.250 కోట్లదాకా నిధులు కావాలి. ఆ స్థాయిలో పెట్టేందుకు ఎవ్వరూ ముందుకొచ్చే అవకాశాలు లేవు’’ అని ఆయన వివరించారు. బాధితులుగా మిగిలిపోయాం.. కంపెనీలో 40 మంది వరకు పైలట్లు ఉండేవారు. దాదాపుగా వీరందరూ వేరే విమానయాన కంపెనీల్లో చేరిపోయారు. అలాగే ఇతర విభాగాల్లో దాదాపు 600 మంది ఉద్యోగులు పనిచేసేవారు. ఇప్పుడీ సంఖ్య సగానికంటేపైగా తగ్గిపోయింది. మిగిలిన ఉద్యోగులు కూడా ఇతర అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. చాన్స్ రాగానే జంప్ అవుతా రని ఇంకా కంపెనీలోనే ఉన్న మరో ఉద్యోగి తెలియజేశారు. ప్రమోటర్లకు, ఉద్యోగులకు మధ్య అంతరం ఉందని చెప్పారాయన. ‘రాజీనామాలు చేస్తుంటే వద్దని ఎవరూ వారించడం లేదు. ఇప్పటి వరకు కంపెనీలో ఏం జరుగుతోందో పత్రికలు, వార్తా చానెళ్ల ద్వారానే తెలుస్తోంది. ప్రమోటర్లు ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ కవి చౌరాసియా మాత్రమే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. కింగ్‌ఫిషర్ విషయంలో విజయ్ మాల్యా కనీసం అప్పుడప్పుడైనా మాట్లాడారు. ఎయిర్ కోస్టా విషయంలో అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ప్రభుత్వానికి అంతా తెలుసు. ఉద్యోగుల ప్రయోజనాలు ఎవరికీ పట్టడం లేదు. మేము ఇప్పుడు బాధితులుగా మిగిలిపోయాం’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎగిరే అవకాశం లేదు.. వేలాది మంది కస్టమర్లు ఎయిర్ కోస్టా టికెట్లు బుక్ చేసుకున్నారు. సర్వీసులు రద్దు అయిన తర్వాత కస్టమర్ల సొమ్ము తిరిగి చెల్లించేందుకు కంపెనీ ఏర్పాట్లేవీ చేయలేదని మరో ఉద్యోగి చెప్పారు. కస్టమర్ కేర్ నంబరు సైతం మూగబోయింది. విమానాశ్రయాల్లో కంపెనీ ఏర్పాటు చేసిన ఆఫీసులను ఉద్యోగులు తెరుస్తున్నారా లేదా అన్న విషయమూ కంపెనీ పట్టించుకోవడం లేదని మరో ఉద్యోగి చెప్పారు. కస్టమర్‌తో మాట్లాడేందుకు ఉద్యోగులు ఎవరూ లేరని చెప్పారు. ఎయిర్ కోస్టా బ్రాండ్ కథ ముగిసినట్టేనని వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు ముందుకు వచ్చినా కంపెనీ నిలబడుతుందో లేదోనని అనుమానం వ్యక్తం చేశారు. 2017 మే 31 వరకు సర్వీసులు నిలిపివేసినట్టు కంపెనీ చెబుతున్నా.. మరో నాలుగైదు నెలల దాకా విమానాలు ఎగిరే అవకాశం లేదని, ఆ తరవాతా అనుమానమేనని ఆయన స్పష్టం చేశారు. కాగా విశ్వసనీయ సమాచారం మేరకు శంషాబాద్ విమానాశ్రయానికి రూ. కోటి, జైపూర్ విమానాశ్రయానికి రూ.40 లక్షలు బాకీ ఉన్నట్టు తెలిసింది. ఉద్యోగులకేగాక ఎయిర్ కోస్టాకు సర్వీసులు అందించే అన్ని కంపెనీలకు బకాయిలు పేరుకు పోయాయి. ఇంకా ఇన్వెస్టర్ల వేట.. మరో మూడు నెలల దాకా విమానాలు ఎగిరే అవకాశం లేదని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ కవి చౌరాసియా స్పష్టం చేశారు. ఇన్వెస్టర్ల అన్వేషణ కొనసాగుతోందని వెల్ల డించారు. ఇన్వెస్టర్ ఎవరైనా ముందుకు వచ్చారా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని పేర్కొన్నారు. 250 మంది కంపెనీని విడిచి Ðð ళ్లినట్టు తెలిపారు. ఏడాదిలో రూ.130 కోట్ల నష్టం వివిధ వర్గాల సమాచారం మేరకు... జనవరి నెలకు రూ.2.5 కోట్లు, ఫిబ్రవరికి రూ.3 కోట్ల వేతనాలు కంపెనీ బకాయి పడింది. ఉన్న ఉద్యోగుల్లో యాజమాన్యానికి బాగా కావాల్సిన అతి కొద్ది మందికే జనవరి వేతనాలు అందాయి. ఉద్యోగుల ఖాతాల్లో పీఎఫ్ జమ కూడా నిలిచిపోయింది. అందరికీ మార్చి 15 నాటికల్లా బకాయిలు చెల్లిస్తానని చెప్పిన కంపెనీ... 20వ తేదీ నాటికి కూడా అలాంటి ప్రయత్నాలేమీ చేయలేదు. వివిధ వ్యాపారాలను నిర్వహిస్తున్న ఎల్ఈపీఎల్ గ్రూప్‌నకు జీతాల మొత్తం పెద్ద భారం కాదని, అయినా చెల్లించకపోవటంతో కంపెనీ తీరు అనుమానాలకు తావిస్తోందని సీనియర్ ఉద్యోగి ఒకరు వ్యాఖ్యానించారు. పౌర విమానయాన శాఖకు ఇచ్చిన సమాచారం ప్రకారం ఎయిర్ కోస్టా 2015–16లో రూ.327 కోట్ల టర్నోవరుపై రూ.130 కోట్ల నష్టం చవిచూసింది. నిర్వహణ వ్యయాలు రూ.457 కోట్లుగా ఉన్నాయి. ఎయిర్ కోస్టాకు జీఈ క్యాపిటల్ ఏవియేషన్ సర్వీసెస్ మొత్తం మూడు విమానాలను అద్దెకు సమకూర్చింది. ఈ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలపై వివాదం తలెత్తడంతో 20 రోజులుగా విమానాలు ఎగరడం లేదు. ఇలాంటి వివాదంతోనే 2016 ఆగస్టు తొలివారంలో ఒక రోజు పూర్తిగా, మరోరోజు పాక్షికంగా సర్వీసులను ఎయిర్ కోస్టా నిలిపివేసింది. -
కింగ్‌ఫిషర్ మూతకు ఇంజన్ సమస్యలూ కారణం: మాల్యా
న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్ మూతబడ్డానికి కారణాల్లో లోపభూయిష్టమైన ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్లూ ఒక కారణమని బ్రిటన్‌లో ఉన్న బ్యాంకింగ్ ఉద్దేశ్యపూర్వక ఎగవేతదారు విజయ్‌మాల్యా పేర్కొన్నారు. ఇండిగో, ఎయిర్గోలకు విమాన ఇంజన్ల సరఫరాకు సంబంధించి ప్రాట్ అండ్ విట్నీ గ్రూప్‌పై ఏవియేషన్ రెగ్యులేటర్– డీజీసీఏ విచారణకు ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో మాల్యా ఈ ప్రకటన చేశారు. కింగ్ఫిషర్కు లోపభూయిష్టమైన ఇంజన్లు సరఫరా చేసినందుకు, ప్రాట్ అండ్ విట్నీ గ్రూప్ కంపెనీ ఐఏఆపై తాము కేసు దాఖలు చేశామని మాల్యా ట్వీట్ చేశారు. 40 మిలియన్ డాలర్ల బదిలీపై సుప్రీం విచారణ కాగా, తన పిల్లలకు విజయ్‌మాల్యా 40 మిలియన్ డాలర్ల బదలాయించడంపై బ్యాంకింగ్ కన్సార్షియం దాఖలు చేసిన పిటిషన్‌ను వచ్చే వారం విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. బ్రిటన్ సంస్థ డియోజియో నుంచి గత ఏడాది ఫిబ్రవరిలో తాను పొందిన మొత్తాన్ని పలు జ్యుడీషియల్ ఉత్తర్వులను ఉల్లంఘించి మాల్యా తన పిల్లలకు బదలాయించారని ఎస్బీఐ నేతృత్వంలోని కన్సార్షియం తరఫున సుప్రీంకోర్టుకు సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్ విన్నవించారు. -
మాల్యాకు మరో ఝలక్!
యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను మూసేయండి! • కింగ్‌ఫిషర్ బకాయిల వసూళ్లకు ఇదే మార్గం • బ్యాంకుల పిటిషన్‌కు కర్ణాటక హైకోర్టు అనుమతి • మాల్యాకు మరిన్ని చిక్కులు బెంగళూరు: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి, బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విజయ్ మాల్యాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. యూబీ గ్రూప్ మాతృసంస్థ– యునైటెడ్ బ్రూవరీస్ (హోల్డింగ్స్) లిమిటెడ్ (యూబీహెచ్ఎల్)ను మూసివేయాలని కర్ణాటక హైకోర్టు రూలింగ్ ఇచ్చింది. యూబీహెచ్ఎల్ ప్రమోట్ చేసిన కింగ్‌ఫిషర్ ఎయిల్‌లైన్స్ లిమిటెడ్ రుణ బకాయిల వసూళ్లకు మాతృసంస్థ మూసివేత తప్పదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాంకులు, విమానాలను లీజుకు ఇచ్చిన సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను మంగళవారం అనుమతించింది. ‘‘తమ రుణదాతలకు చెల్లించాల్సిన బకాయిల చెల్లింపుల్లో వైఫల్యానికి గాను ప్రతివాద కంపెనీ– యూబీహెచ్‌ఎల్‌ను మూసివేత, వాటాల అమ్మకమే సమంజసమని ఈ కోర్టు ఒక నిర్ణయానికి వచ్చింది’’ అని హైకోర్టు ధార్వాడ్ బెంచ్ జస్టిస్ వినీత్ కొఠారీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బకాయిలు రూ.146 కోట్లు పీఎన్బీ పారీబాస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎయిర్‌క్రాఫ్ట్‌ను అద్దెకు ఇచ్చిన సంస్థలు, రోల్స్ రాయిస్, ఐఏఈ వంటి ఇంజిన్ తయారీ సంస్థలు రూ.146 కోట్ల తమ బకాయిలను రాబట్టుకోడానికి ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. చట్ట ప్రకారం మూసివేత ప్రక్రియను పూర్తిచేసేందుకు ప్రతివాది ఆస్తులను అధికారిక లిక్విడేటర్‌కు అప్పగించాల్సి ఉంటుందని న్యాయమూర్తి తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కింగ్‌ఫిషర్‌ను నిర్వహించడానికి సంబంధించిన రుణాలకు యూబీహెచ్ఎల్ కార్పొరేట్ గ్యారెంటార్‌గా ఉంది. యూబీహెచ్‌ఎల్‌లో మాల్యా వాటా దాదాపు 52.34 శాతం. బ్రిటన్‌లో ఉన్న ఆయనను అప్పగించాలని సీబీఐ విజ్ఞప్తి, రూ.720 కోట్ల ఐడీబీఐ రుణం కేసులో మాల్యాకు వ్యతిరేకంగా నాన్–బెయిలబుల్ వారెంట్ తత్సంబంధ అంశాల నేపథ్యంలో తాజా తీర్పు వెలువడింది. మాల్యా, ఆయన కంపెనీల నుంచి రూ.6,203 కోట్లను 11.5 శాతం వార్షిక వడ్డీతో రాబట్టుకునే ప్రక్రియను ప్రారంభించడానికి ఎస్బీఐ నేతృత్వంలోని బ్యాంకింగ్ కన్సార్షియంకు ఇంతక్రితం బెంగళూరు డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనుమతిని ఇచ్చిన సంగతి తెలిసిందే. -
దోషిగా తేల్చేవరకూ నిరపరాధినే: మాల్యా
న్యూఢిల్లీ: అక్రమంగా నిధుల తరలింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా మరోసారి తాను అమాయకుడినని చెప్పుకొచ్చారు. బ్యాంకులకు రూ.9వేల కోట్లకుపైగా రుణాలు ఎగవేసి లండన్‌లో తలదాచుకుంటున్న ఆయన ట్వీటర్ వేదికగా స్పందించారు. ‘‘ఈ నిమిషం వరకు బ్యాంకులకు కేఎఫ్ఏ (కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్) బకాయి పడిన విషయంలో న్యాయపరంగా ఎటువంటి తుది నిర్ణయం రాలేదు. వ్యక్తిగత హోదాలో నేను ఎంత రుణపడి ఉన్నానన్నది విచారణ తర్వాత తెలుస్తుంది’’ అంటూ మాల్యా ట్వీట్ చేశారు. శుక్రవారం వరుసపెట్టి ట్వీట్లు చేసిన ఆయన ఇటీవలి పరిణామాలను మీడియా చిత్రీకరించిన తీరు పట్ల మండిపడ్డారు. ‘‘మన దేశంలో దోషిగా ప్రకటించే వరకు అమాయకుడిగానే పరిగణిస్తారు. కానీ, ఎటువంటి విచారణ లేకుండానే వివిధ రకాల ప్రభావాలకు లోనై మీడియా నన్ను దోషిగా ప్రకటించేసింది’’ అంటూ మాల్యా ట్వీట్ చేశారు. కోర్టు తనను దోషిగా తేల్చే వరకు అమాయకుడినేనన్నారు. ‘‘బ్యాంకులకు బకాయి పడి విదేశాలకు పారిపోయానని అంటున్నారు. కానీ వ్యక్తిగతంగా నేనెప్పుడూ రుణాలు తీసుకోలేదు’’ అని మాల్యా పేర్కొన్నారు. యునైటెడ్ స్పిరిట్స్ నుంచి నిధుల మళ్లింపు కేసులో మాల్యా, మరో ఆరుగురిని సెబీ నిషేధించడం తెలిసిందే. -
కింగ్‌ఫిషర్ కేసులో సీబీఐ చార్జిషీట్
ఐడీబీఐ అధికారులుసహా తొమ్మిదిమంది పేర్లు ముంబై: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి బ్రిటన్‌కు పారిపోయిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా, ఆయన నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌తో సంబంధమున్న ఐడీబీఐ రుణం కేసులో మంగళవారంనాడు సీబీఐ ఒక చార్జ్‌షీట్ దాఖలు చేసింది. చార్జ్‌షీట్‌లో సోమవారం అరెస్టయిన తొమ్మిది మంది పేర్లు ఉన్నాయి. వీరిలో ఐడీబీఐ మాజీ చైర్మన్ యోగేష్ అగర్వాల్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఎఫ్ఓ ఏ రఘునాథన్, ఐడీబీఐ ఎగ్జిక్యూటివ్‌లు ఓవీ బుండేలు, ఎస్కేవీ శ్రీనివాసన్, ఆర్ఎస్ శ్రీధర్, బీకే బాత్రా, కింగ్‌ఫిషర్ ఎగ్జిక్యూటివ్‌లు శైలేష్ బోర్కీ, ఏసీ షా, అమిత్ నంద్కర్ణిలు ఉన్నారు. కేసులో కీలక వ్యక్తి మాల్యాను అరెస్ట్ చేయాల్సి ఉంది. రుణం పక్కదారి..: కేఎఫ్‌ఏకు రూ.1,300 కోట్ల రుణం మంజూరు, పంపిణీ ప్రక్రియలో పలు అవకతవకలు చోటుచేసుకున్నటు తన ప్రత్యేక విచారణ బృందం కనుగొన్నట్లు చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొన్నట్లు సమాచారం. రుణంలో రూ.260 కోట్లను కేఎఫ్ఏ పక్కదోవ పట్టించింది. రూ.263 కోట్లు వేతనాల చెల్లింపులు, టీడీఎస్, ఆదాయపు పన్ను, రుణ ఇన్స్టాల్మెంట్లకు వెచ్చించింది. రుణంలో కొంత ‘‘తన వ్యక్తిగత అవసరాలకు’’ మాల్యా వినియోగించుకున్నట్లు చార్జిషీట్ వివరించింది. మాల్యా, కింగ్ఫిషర్కు సంబంధించిన అకౌంట్ల వివరాలను తెలియజేయాలని కోరుతూ ఇప్పటికే ట్యాక్స్ హెవెన్స్‌గా పేరొందిన బ్రిటిష్ విర్జిన్ ఐలాండ్స్, సింగపూర్‌లకు సీబీఐ లేఖలు రాసినట్లు చార్జ్‌షీట్ వివరించింది. తొమ్మిది మందికి రిమాండ్... మరోవైపు సోమవారం అరెస్టయిన తొమ్మిది మందికి ఇక్కడి సీబీఐ కేసుల ప్రత్యేక జడ్జి హెచ్ఎస్ మహాజన్ ఫిబ్రవరి 7వ తేదీ వరకూ జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరి బెయిల్ దరఖాస్తులను జనవరి 30న కోర్టు విచారిస్తుంది. -
రూ.6,203 కోట్ల బకాయిలు..రికవరీ మొదలెట్టండి
విజయ్‌మాల్యా రుణ ఎగవేతపై బ్యాంకులకు డీఆర్టీ ఆదేశం • వార్షికంగా 11.5% వడ్డీ విధింపు • కింగ్‌ఫిషర్ కేసుపై ట్రిబ్యునల్‌లో ముగిసిన మూడేళ్ల న్యాయపోరాటం బెంగళూరు: కింగ్ ఫిషర్ రుణాల కేసులో బ్యాంకింగ్ ఉద్దేశపూర్వక ఎగవేతదారు విజయ్‌మాల్యా, ఆయన కంపెనీల నుంచి బకాయిల వసూళ్ల ప్రక్రియలో తొలి అడుగు పడింది. ఈ కేసులో సుదీర్ఘ వాదనలు విన్న ఇక్కడి డెట్ రికవరీ ట్రిబ్యునల్ (డీఆర్టీ), రూ.6,203 కోట్ల రికవరీ ప్రక్రియను ప్రారంభించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియంను ఆదేశించింది. 11.5 శాతం వార్షిక వడ్డీని బకాయిలపై వసూలు చేయాలని నిర్దేశించింది. ‘‘11.5 శాతం వడ్డీతో రూ.6,203 కోట్లను యూబీహెచ్ఎల్, కింగ్‌ఫిషర్ ఫిన్వెస్ట్, కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్సహా మాల్యా ఆయన కంపెనీల నుంచి రికవరీ చేయాలని డీఆర్టీ నిర్దేశిస్తోంది’’ అని తన ఉత్తర్వుల్లో ప్రిసైడింగ్ ఆఫీసర్ కే శ్రీనివాసన్ పేర్కొన్నారు. కేసుకు సంబంధించి మాల్యా ఆయన కంపెనీలు దాఖలు చేసిన దాదాపు 20 అనుబంధ పిటిషన్లను (ఐఏ) కూడా డీఆర్టీ పరిష్కరించింది. మూడేళ్ల విచారణ... కింగ్‌ఫిషర్ బకాయిల వసూలుకు 2013లో బ్యాంకింగ్ డీఆర్టీని ఆశ్రయించింది. మాల్యా అరెస్ట్, ఆయన పాస్‌పోర్ట్ స్వాధీనం వంటి అభ్యర్థనలతో ఎస్బీఐ మరో మూడు పిటిషన్లు దాఖలు చేసింది. గత ఏడాది మార్చి 2వ తేదీన మాల్యా బ్రిటన్‌కు పారిపోయిన తరువాత ఆయనను ముంబైలోని అక్రమ ధనార్జనా నిరోధక ప్రత్యేక కోర్టు ‘ప్రకటిత నేరస్తునిగా’ పేర్కొంది. మాల్యా రుణ ఎగవేతలతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా మరోవైపు విచారణ జరుపుతోంది. డియోజియో నియంత్రణలోని యునైటెడ్ స్పిరిట్స్ నుంచి చైర్మన్‌గా వైదొలగినందుకుగాను మాల్యాకు ఆ సంస్థ చెల్లించాల్సిన 75 బిలియన్ డాలర్లను బ్యాంక్ నుంచి విత్‌డ్రా చేసుకోకుండా నిరోధిస్తూ... డీఆర్టీ మార్చి 7న ఉత్తర్వులు ఇచ్చింది. అయితే అంతకుముందే ఇందులో 40 మిలియన్ డాలర్లు విత్‌డ్రా అయినట్లు వెల్లడికావడంతో మార్చి 7న ఉత్తర్వులను ‘మురిగిపోయినట్లు’గా ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే బ్యాంకింగ్ దాఖలు చేసిన మరో పిటిషన్‌పై ట్రిబ్యునల్ రూలింగ్ ఇస్తూ... మిగిలిన 35 మిలియన్ డాలర్లను ట్రిబ్యునల్‌లో డిపాజిట్ చేయాలని డియోజియోను ఆదేశించింది. అప్పీల్ చేస్తాం: యూబీ గ్రూప్ డీఆర్టీ ఉత్తర్వుపై అప్పీల్‌కు వెళతామని విజయ్‌మాల్యా నేతృత్వంలోని యూబీ గ్రూప్ ప్రకటించింది. ఉత్తర్వు ప్రతికోసం ఎదురుచూస్తున్నామని, ఇది అందిన తరువాత తగిన విధంగా చర్యలు తీసుకుంటామని యూబీ గ్రూప్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. -
మరోసారి వేలానికి మాల్యా విల్లా
ముంబై: కింగ్ ఫిషర్ అధినేత విజయ్ మాల్యా విల్లా మరోసారి వేలానికి వస్తోంది. తమకు మాల్యా నుంచి రావలసిన బకారుుల వసూళ్ల కోసం ఇంతకు ముందు ఈ విల్లాను వేలానికి పెట్టారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో తాజాగా ఈ నెల 22న రిజర్వ్ ధరలో 5 శాతం డిస్కౌంట్‌తో మరోసారి వేలానికి పెడుతున్నారు. ఉత్తర గోవాలోని కండోలిమ్ వద్దనున్న కింగ్ ఫిషర్ విల్లాకు రిజర్వ్ ధరగా రూ.81 కోట్లను ఎస్బీఐ క్యాప్ ట్రస్టీ నిర్ణరుుంచింది. ఈ ఏడాది అక్టోబర్ 19 నాటి రిజర్వ్ ధర రూ.85.29 కోట్లతో పోలిస్తే ఇది 5 శాతం తక్కువ. ప్రతి సారీ 10 శాతం తగ్గింపు భారీగా ఉన్న విజయ్ మాల్యా బ్యాంక్ బకారుులను రాబట్టుకోవడానికి బ్యాంక్‌ల కన్సార్షియమ్ ఆయనకు చెందిన పలు స్థిర, చరాస్థులను వేలం వేయడానికి ప్రయత్నిస్తోంది. ముంబైలోని కింగ్‌ఫిషర్ కేంద్ర కార్యాలయం, కింగ్ ఫిషర్ హౌస్‌ను, కింగ్ ఫిషర్ విమానయాన సంస్థకు చెందిన ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండ్లను వేలం వేసింది. వీటికి తగిన స్పందన లేకపోవడంతో రిజర్వ్ ధరలను 10 శాతం చొప్పున తగ్గిస్తూ వస్తోంది. -
గతవారం బిజినెస్
టాటా స్టీల్ చైర్మన్ పదవి నుంచి మిస్త్రీ ఔట్ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని టాటా స్టీల్ డెరైక్టర్ల బోర్డు తొలగించింది. శుక్రవారం ఈ మేరకు టాటా స్టీల్ స్టాక్ ఎక్స్చేంజీలకు అందించిన సమాచారంలో వెల్లడిస్తూ, మిస్త్రీ స్థానంలో స్వతంత్ర డెరైక్టర్ ఓపీ భట్‌ను తాత్కాలిక చైర్మన్‌గా బోర్డు నియమించినట్లు తెలిపింది. కంపెనీ ప్రమోటింగ్ సంస్థ అరుున టాటా సన్స నుంచి అందుకున్న ప్రత్యేక నోటీసు ప్రకారం నవంబర్ 25న తమ డెరైక్టర్ల బోర్డు సమావేశమై ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు టాటా స్టీల్ పేర్కొంది. ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి గతంలో చైర్మన్‌గా వ్యవహరించిన ఓపీ భట్...తమ తదుపరి జరిపే అత్యవసర సర్వసభ్య సమావేశం వరకూ పదవిలో కొనసాగుతారని కంపెనీ తెలిపింది. మూడోసారి వేలానికి ’కింగ్‌ఫిషర్’ భవనం కింగ్‌ఫిషర్ ఎరుుర్‌లైన్‌సకు భారీగా అప్పులిచ్చి పీకల్లోతు ఇరుక్కుపోరుున 17 బ్యాంకుల కన్సార్టియమ్, ఆ సంస్థకు చెందిన ముంబైలోని ప్రధాన కార్యాలయ భవనాన్ని మూడోసారి వేలానికి పెడుతోంది. ఈ సారి రిజర్వ్ ధరను 15% తగ్గించి రూ.115 కోట్లుగా నిర్ణరుుంచారు.ముంబైలోని విమానాశ్రయం సమీపంలో ప్లష్ విలేపార్లేలో ఇది ఉంది. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం వేలం వచ్చే నెల 19న జరగనుంది. రికార్డు కనిష్టానికి రూపారుు డీమానిటైజేషన్ తదితర పరిణామాల నేపథ్యంలో రూపారుు పతనం కొనసాగుతోంది. గురువారం ఇంట్రా డేలో డాలర్‌తో పోలిస్తే రూపారుు మారకం విలువ 68.86 స్థారుుకి పడిపోరుుంది. ఇప్పటిదాకా 2013 ఆగస్టు 28 ఇంట్రాడేలో నమోదైన 68.85 స్థాయే ఆల్‌టైమ్ కనిష్టంగా ఉంది. ఆ రోజున దేశీ కరెన్సీ 68.80 వద్ద ముగిసింది. ఇటు పెద్ద నోట్ల రద్దు, అటు సమీప భవిష్యత్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు తదితర పరిణామాలు రూపారుు పతనానికి దారి తీస్తున్నాయని పరిశీలకులు పేర్కొన్నారు. భారత్‌లో సంపద అసమానత్వం అధికం భారత్‌లో సంపద విషయమై అసమానత్వం అధికంగా ఉందని గ్లోబల్ వెల్త్ రిపోర్ట్-2016 తెలిపింది. మొత్తం జనాభాలో ఒక్క శాతం మంది దగ్గరే మొత్తం సంపదలో 60 శాతం ఉందని క్రెడిట్ సూచీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ రూపొందించిన ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లో సంపన్న పేదరికం ఉందని వివరించింది. జనాభాలో 96 శాతం మందికి పైగా పదివేల డాలర్లు (రూ.6,80,000)లోపు సంపద ఉన్నవారేనని పేర్కొంది. ప్రపంచ దేశాల్లో సంపద విషయంలో అసమానత్వం అధికంగా ఉన్న రెండో దేశం భారత్ అని వివరించింది. భారత్‌లో సంపద పెరుగుతున్నా, ఈ వృద్ధిలో అందరికి భాగస్వామ్యం ఉండడం లేదని పేర్కొంది. జీడీపీలో మొబైల్ రంగం వాటా 8.2%! దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో మొబైల్ రంగం వాటా 2020 నాటికి 8.2 శాతానికి చేరుకుంటుందని కేంద్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహక విభాగం, టెలికం శాఖలు సంయుక్తంగా ఓ నివేదికలో తెలిపారుు. ప్రస్తుతం జీడీపీలో ఈ రంగం తోడ్పాటు 6.5 శాతం (140 బిలియన్ డాలర్లు/రూ.9.38 లక్షల కోట్లు)గా ఉందని... 40 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారుు. మొబైల్ తయారీ యూనిట్లు గత రెండేళ్లలో 38,300 ఉద్యోగాలను అందించినట్టు పేర్కొంది. 2014 ఏప్రిల్ నుంచి 2016 మార్చి మధ్య కాలంలో టెలికం రంగంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 4.19 బిలియన్ డాలర్లు (రూ.28,000 కోట్లు)గా ఉన్నట్టు తెలిపింది. ఎస్బీఐ బల్క్ డిపాజిట్ల రేట్లు 1.9% తగ్గింపు బల్క్ డిపాజిట్ల రేట్లను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1.9 శాతం వరకూ తగ్గించింది. పెద్ద కరెన్సీ నోట్ల రద్దుతో డిపాజిట్లు భారీగా వచ్చిన నేపథ్యంలో రూ.1-10 కోట్ల బల్క్ డిపాజిట్ల రేట్లను తగ్గించామని ఎస్బీఐ తెలిపింది. 18-210 రోజుల డిపాజిట్లపై రేట్లను 5.75 శాతం నుంచి 3.85 శాతానికి, ఏడాది నుంచి 455 రోజుల ఫిక్స్డ్ డిపాజిట్లపై రేట్లను 6 శాతం నుంచి 4.25 శాతానికి, ఏడు రోజుల నుంచి 45 రోజుల డిపాజిట్లపై రేట్లను 5 శాతం నుంచి 3.75 శాతానికి తగ్గించామని ఎస్బీఐ తెలిపింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు షురూ! టెలికం రంగంలో దేశీయ అగ్రగామి కంపెనీ అరుున భారతీ ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు సేవల్లోకి అడుగుపెట్టింది. ఎరుుర్‌టెల్ పేమెంట్ బ్యాంకు పేరుతో రాజస్థాన్‌లో ప్రయోగాత్మకంగా బుధవారం సేవల్ని ప్రారంభించింది. దేశంలో పేమెంట్ బ్యాంకు సేవలు ప్రారంభించిన తొలి కంపెనీ ఇదే. కస్టమర్లు రాజస్థాన్ వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 10 వేల ఎరుుర్‌టెల్ అవుట్లెట్లలో ఇక బ్యాంకు ఖాతాలు ప్రారంభించవచ్చని కంపెనీ తెలిపింది. ఎరుుర్‌టెల్ అవుట్లెట్లు బ్యాంకింగ్ కేంద్రాలుగా పనిచేస్తాయని, ఖాతాల ప్రారంభం, నగదు డిపాజిట్, విత్‌డ్రా సేవలు అందిస్తాయని పేర్కొంది. ⇔ 2,071 మంది.. 3.89 లక్షల కోట్లు బకారుులు దేశంలో 2,071 మంది పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రూ.3,88,919 కోట్ల రుణాలు వసూలు కాని మొండి బకారుులు (ఎన్పీఏ)గా మారినట్టు కేంద్ర ఆర్థిక శాఖా సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ రాజ్యసభకు మంగళవారం వెల్లడించారు. ఈ పారిశ్రామిక పెద్దలు ఒక్కొక్కరు రూ.50 కోట్లు అంతకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు తీసుకున్నవారేనని తెలిపారు. ఈ ఏడాది జూన్ 30 నాటికి రూ.50 కోట్లకు మించిన ఎన్పీఏ ఖాతాలు 2,071గా ఉన్నాయని పేర్కొన్నారు. డీల్స్.. ⇔ మొబిక్విక్ జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)తో ఒప్పందం చేసుకుంది. దేశవ్యాప్తంగా 391 టోల్ ప్లాజాల వద్ద తమ కస్టమర్లు మొబిక్విక్ వ్యాలెట్ ద్వారా టోల్ రుసుములు చెల్లించవచ్చని సంస్థ తెలిపింది. అతి త్వరలోనే ఈ సేవలు ప్రారంభమవుతాయని స్పష్టం చేసింది. ⇔ అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూప్‌నకు (అడాగ్) చెందిన టీవీ చానళ్లను సుభాష్ చంద్రకు చెందిన జీగ్రూప్ కొనుగోలు చేయనుంది. ఎంటర్టైన్మెంట్ టీవీ చానళ్లలో 100% వాటాతో పాటు రిలయన్స రెడియో వ్యాపారంలో 49% వాటాను కూడా అడాగ్ విక్రరుుస్తోంది. ఈ డీల్ విలువ రూ.1,900 కోట్లు. ⇔ దేశీ ఫార్మా అగ్రగామి సన్ ఫార్మా.. రష్మా కంపెనీ జేఎస్సీ బయోసింటెజ్‌ను కొనుగోలు చేసింది. బయోసింటెజ్‌లో 85.1% వాటాను చేజిక్కించుకుంటున్నామని.. ఇందుకోసం 2.4 కోట్ల డాలర్లను చెల్లిస్తున్నట్లు సన్ ఫార్మా తెలిపింది. అదేవిధంగా ఆ కంపెనీకి చెందిన 3.6 కోట్ల డాలర్ల రుణాన్ని కూడా తామే భరించాల్సి వస్తుందని వెల్లడించింది. దీనిప్రకారం చూస్తే... మొత్తం డీల్ విలువ 6 కోట్ల డాలర్లు(దాదాపు రూ.400 కోట్లు)గా లెక్కతేలుతోంది. -
మూడోసారి వేలానికి ‘కింగ్‌ఫిషర్’ భవనం
-
ఎనభై కేసులు..రూ.4.53 లక్షల కోట్ల బకాయిలు
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్నులకు సంబంధించి కేంద్రానికి రావాల్సిన బకాయిల విలువ సుమారు రూ.4.53 లక్షల కోట్లకు చేరింది. ఇందులో వెయ్యికోట్లకు పైగా బకాయి పడ్డ సంస్థల్లో మద్యం వ్యాపారి విజయ్ మాల్యాకుచెందిన కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, టాటా గ్రూపునకు చెందిన టాటా మెటార్స్ లాంటి దిగ్గజ కంపెనీలు న్నాయి. ఈ మేరకు శుక్రవారం పార్లమెంటు లో అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆర్థిక సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వెల్లడించారు. ఈ ఏడాది జూన్ నాటికి రూ.1,000 కోట్లు, అంతకంటే అధిక మొత్తంలో బకాయి పడిన కేసుల సంఖ్య 80కి చేరుకుందని గంగ్వార్ తెలిపారు. మొత్తం ఎనభై కేసుల్లో వసూలు కావాల్సిన బకాయిలు రూ.4.53 లక్షల కోట్లని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా బ్యాంకులకు వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టి లండన్‌కు పారిపోయిన మద్యం వ్యాపారి విజయ్‌మాల్యా చెల్లించాల్సిన పన్ను బకాయిలు జరిమానా వెయ్యికోట్లకు చేరాయి. ఇప్పటికే బ్యాంకులకు తొమ్మిదివేల కోట్లకు పైగా బకాయి పడ్డ మాల్యా పన్ను చెల్లింపుల విషయంలోనూ వేల కోట్లను మించిపోయారు. మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ చెల్లించాల్సిన సేవాపన్ను, జరిమానా కలిపి రూ. 1,012.96 కోట్లకు చేరిందని తెలిపారు. కింగ్‌ఫిషర్, టాటా మోటార్ సహా మొత్తం నాలుగు సంస్థలు రూ.1,000 కోట్ల కంటే అధిక మొత్తంలో పరోక్ష పన్ను బకాయి చెల్లించాల్సి ఉందని ఆయన పార్లమెంట్‌కు తెలిపారు. టాటా గ్రూపునకు చెందిన వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ రూ.1,145.85 కోట్ల పన్ను బకాయి పడింది. అందులో రూ.629.76 కోట్లు ఎక్సైజ్ డ్యూటీ కాగా.. మిగతా రూ.516.09 కోట్లు సేవా పన్ను బకాయిగా ఉన్నాయి. కర్ణాటక ఇండస్ట్రియల్ ఏరియా డెవలప్మెంట్ బోర్డు రూ.2,590 కోట్లు, కర్ణాటక హౌసింగ్ బోర్డు రూ.1,083 కోట్ల పరోక్ష పన్నులు చెల్లించాల్సి ఉందని తెలిపారు. అయితే ఐటీ చట్టంలో సెక్షన్ 138, 1961 ప్రకారం ఎవరెవరు ఎంతెంత బకాయి పడ్డారన్న విషయాన్ని వెల్లడించలేమని గంగ్వార్ సభకు చెప్పారు. -
మూడోసారి వేలానికి ‘కింగ్‌ఫిషర్’ భవనం
ముంబై: కింగ్‌ఫిషర్ ఎరుుర్‌లైన్‌సకు భారీగా అప్పులిచ్చి పీకల్లోతు ఇరుక్కుపోరుున 17 బ్యాంకుల కన్సార్టియమ్, ఆ సంస్థకు చెందిన ముంబైలోని ప్రధాన కార్యాలయ భవనాన్ని మూడోసారి వేలానికి పెడుతోంది. ఈ సారి రిజర్వ్ ధరను 15 శాతం తగ్గించి రూ.115 కోట్లుగా నిర్ణరుుంచారు. ముంబైలోని విమానాశ్రయం సమపంలో ప్లష్ విలేపార్లేలో ఇది ఉంది. 17,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనం వేలం వచ్చే నెల 19న జరగనుంది. కింగ్‌ఫిషర్ ఎరుుర్‌లైన్‌సకు బ్యాంకులు ఇచ్చిన రూ.9,000 కోట్ల రుణాలు మొండి బకారుులుగా మారడం తెలిసిందే. ఉద్దేశపూర్వక ఎగవేతదారుడంటూ కింగ్‌ఫిషర్ అధినేత విజయ్‌మాల్యాను కొన్ని బ్యాంకులు ఇప్పటికే ప్రకటించారుు. కింగ్‌ఫిషర్ భవనం వేలం ద్వారా కొంతైనా సమకూరుతుందని బ్యాంక్చు కన్సార్టియమ్ ఆశిస్తుండగా... గతంలో రెండు సార్లు వేలానికి ఉంచగా నిరాశే ఎదురైంది. -
ఆ రెండు కంపెనీల పన్ను బకాయిలు తెలిస్తే షాక్!
న్యూఢిల్లీ : దేశీయ ప్రతిష్టాత్మకమైన టాటా గ్రూప్‌కు చెందిన టాటా మోటార్స్, లిక్కర్ కింగ్ విజయ్‌మాల్యా ప్రమోటెడ్ కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ ఈ రెండు కంపెనీలే ఏకంగా రెండువేల కోట్లకు పైగా పన్ను బకాయిలను ఖజానాకు చెల్లించకుండా ఎగ్గొట్టినట్టు పార్లమెంట్‌కు కేంద్రం తెలిపింది. పరోక్ష పన్నుల రూపంలో చెల్లించాల్సిన ఈ రెండు కంపెనీలు రూ.2158.81కోట్లను చెల్లించలేదని పేర్కొంది. టాటా మోటార్స్, 91 కేసుల్లో రూ.629.76 కోట్ల అవుట్‌స్టాండింగ్ ఎక్సైజ్ డ్యూటీని, 5 కేసుల్లో రూ.516.09 కోట్ల సర్వీసు ట్యాక్స్‌లను చెల్లించలేదని ఆర్థికశాఖ సహాయమంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్‌సభకు ఓ లిఖిత పూర్వక పత్రంలో సమర్పించారు. అదేవిధంగా విజయ్ మాల్యా ప్రమోటెడ్ కింగ్‌ఫిషర్ కూడా సర్వీసు ట్యాక్స్, పెనాల్టీల రూపంలో రూ.1,012.96 కోట్లు బకాయి పడ్డట్టు సంతోష్ కుమార్ గంగ్వార్ లోక్‌సభకు తెలిపారు. మరో రెండు సంస్థలు కూడా రూ.1000 కోట్లకు పైగా సర్వీసు ట్యాక్స్‌లను ఖజానాకు బకాయి పడినట్టు వెల్లడించారు. అయితే ఈ సమాచారం బహిర్గతం చేయడం నిషేధమని, 1961 ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 138 కింద వీటిని అందజేస్తున్నామని సంతోష్ కుమార్ గంగ్వార్ తెలిపారు. -
గతవారం బిజినెస్
కింగ్‌ఫిషర్ మూసివేతకు ఆదేశం ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారు విజయ్‌మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ యన నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స లిమిటెడ్ అధికారిక మూసివేతకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బ్రిటన్‌కు చెందిన ఎయిర్‌లైన్ కంపెనీ ఎయిరోట్రన్కు రూ.35 కోట్ల బకాయిల చెల్లింపు వైఫల్యం కేసులో హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థ కింగ్‌ఫిషర్ సంస్థకు ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలను సరఫరా చేసింది. ఫారెక్స్ నిల్వలు డౌన్ దేశీ విదేశీ మారక నిల్వలు నవంబర్ 11తో ముగిసిన వారంలో 1.19 బిలియన్ డాలర్ల క్షీణతతో 367.04 బిలియన్ డాలర్లకు పడ్డాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌లో తగ్గుదలే ఫారెక్స్ నిల్వల క్షీణతకు కారణమని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.15 బిలియన్ డాలర్ల క్షీణతతో 342.77 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక బంగారు నిల్వలు స్థిరంగా 20.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 368.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు సమయం దగ్గరపడుతోందని ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జన్నెత్ యెలెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 0.25-0.50 శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు వడ్డీరేట్ల పెరుగుదలకు దోహద పడతాయని వివరించారు. రేట్ల పెంపునకు మరీ సమయం తీసుకుంటే అది ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు. త్వరలో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ టెలికం రంగ సంస్థ భారతి ఎయిర్టెల్ త్వరలో పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తోంది. డిసెంబర్లోనే ఈ సర్వీసులను మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవానికి జూలై-సెప్టెంబర్‌లో ఆరంభించాలని అనుకున్నప్పటికీ ప్రారంభ తేదీ వాయిదా పడుతూ వస్తోంది. పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎయిర్టెల్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. కేంద్ర ఐటీ మంత్రితో బిల్ గేట్స్ సమావేశం మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తాజాగా కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈపేమెంట్స్, ఈఅగ్రికల్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి పలు అంశాలపై దాదాపు అర్ధ గంటసేపు చర్చ జరిగింది. ‘భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్, పేమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మేం వాటినే ఆధారం చేసుకొని అప్లికేషన్‌సను రూపొందిస్తాం. ఇక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాలకు ప్రాధాన్యమిస్తాం’ అని బిల్‌గేట్స్ వివరించారు. ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాల్లో కోత ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ తాజాగా 2016-17 ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను తగ్గించింది. వీటిని 8-10 శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ వంటి అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా నాస్కామ్ ఈ ఏడాది ప్రారంభంలో దేశీ సాఫ్ట్వేర్ సర్వీసుల్లో 10-12 శాతం వృద్ధిని అంచనా వేసింది. బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కరెన్సీ ఒడిదుడుకులు వంటి పలు అంశాలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు. ఏసీసీ, అంబుజాల్లో లఫార్జే వాటా అప్ లఫార్జే హోల్సిమ్ కంపెనీ ఏసీసీ, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో తన వాటాలను మరింతగా పెంచుకుంది. లఫార్జే హోల్సిమ్ అనుబంధ కంపెనీ హోల్డర్ ఇండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ 3.91 కోట్ల అంబుజా సిమెంట్స్ షేర్లను, 78.7 లక్షల ఏసీసీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ షేర్ల కొనుగోళ్ల విలువ రూ.1,832 కోట్లు. ఈ షేర్ల కొనుగోళ్లతో హోల్డర్‌ఇండ్ ఇన్వెస్ట్మెంట్ వాటాలు అంబుజా సిమెంట్స్‌లో 61.62 శాతం నుంచి 63.11 శాతానికి, ఏసీసీలో 0.29 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగారుు. టోకు ధరలు ’కూల్’ టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో కొంత శాంతించింది. సెప్టెంబర్‌లో 3.57 శాతంగా ఉన్న ఈ రేటు అక్టోబర్‌లో 3.39 శాతానికి దిగివచ్చింది. అంటే సెప్టెంబర్‌లో ఉన్న ఆహార ధరల పెరుగుదల వేగం (గత ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) అక్టోబర్‌లో తగ్గిందన్నమాట. ఆహార ధరలు అదుపులో ఉండడం దీనికి ఒక కారణం. గత ఏడాది ఇదే నెలలో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరుగుదలలో లేకపోగా 3.70 శాతం క్షీణతలో ఉంది. వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌లో 14 నెలల కనిష్ట స్థారుు 4.20 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. రెండవ నెలా పెరిగిన ఎగుమతులు భారత్ ఎగుమతులు వరుసగా రెండవ నెలలోనూ సానుకూల ఫలితాన్ని అందించాయి. వార్షికంగా చూస్తే... అక్టోబర్‌లో 9.59 శాతం వృద్ధి నమోదయిది. విలువ 23.51 బిలియన్ డాలర్లు. ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం మొత్తం గణాంకాల మెరుగుకు కారణమయియంది. ఇవే రంగాల దన్నుతో సెప్టెంబర్‌లో ఎగుమతుల వృద్ధి 4.62 శాతం (22.9 బిలియన్ డాలర్లు)గా నమోదయిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్‌లో దేశం దిగుమతులను చూస్తే... 8.11 శాతం వృద్ధి నమోదయియంది. విలువ రూపంలో ఇది 33.67 బిలియన్ డాలర్లు. వాహన రంగంలో 6.5 కోట్ల ఉద్యోగాలు! దేశీ వాహన పరిశ్రమలో వచ్చే దశాబ్ద (పదేళ్లు) కాలంలో 6.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని మారుతీ సుజుకీ అంచనా వేసింది. ఇదే సమయంలో దేశ జీడీపీలో వాహన పరిశ్రమ వాటా 12 శాతానికి చేరుతుందని మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కెనిచి అయుకవ అభిప్రాయపడ్డారు. డీల్స్.. అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్ఎల్సీ (డబ్ల్యూఎఫ్‌టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనుంది. ఫేషియల్ రికగ్నిషన్ స్టార్టప్ ‘ఫేషియోమెట్రిక్స్’ను సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్బుక్’ కొనుగోలు చేసింది. అరుుతే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఫేస్బుక్ వెల్లడించలేదు. రిలయన్స ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), జీఈ కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స(ఐఐఓటీ) వ్యాపారం కోసం ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు సంయుక్తంగా ఆరుుల్, గ్యాస్, ఎరువులు, విద్యుత్తు, ఫార్మా, టెలికం వంటి పలు ఇతర పరిశ్రమల్లో వినియోగదారులకు ఐఐఓటీ సొల్యూషన్స అందిస్తాయి. ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఆడియో సిస్టమ్స్ తయారీ కంపెనీ హర్మన్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు 8 బిలియన్ డాలర్లు (రూ.53,400 కోట్లు సుమారు) వెచ్చించనున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా హర్మన్‌కు చెందిన ఒక్కో షేరుకు 112 డాలర్లను శాంసంగ్ చెల్లించనుంది.