గతవారం బిజినెస్ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్

Published Mon, Nov 21 2016 1:28 AM | Last Updated on Fri, Aug 24 2018 4:48 PM

గతవారం బిజినెస్ - Sakshi

గతవారం బిజినెస్

 కింగ్‌ఫిషర్ మూసివేతకు ఆదేశం
 ఉద్దేశపూర్వక బ్యాంకింగ్ రుణ ఎగవేతదారు విజయ్‌మాల్యాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ యన నియంత్రణలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్‌‌స లిమిటెడ్ అధికారిక మూసివేతకు కర్ణాటక హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బ్రిటన్‌కు చెందిన ఎయిర్‌లైన్ కంపెనీ ఎయిరోట్రన్‌కు రూ.35 కోట్ల బకాయిల చెల్లింపు వైఫల్యం కేసులో హైకోర్టు ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ సంస్థ కింగ్‌ఫిషర్ సంస్థకు ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాలను సరఫరా చేసింది.
 
 ఫారెక్స్ నిల్వలు డౌన్
 దేశీ విదేశీ మారక నిల్వలు నవంబర్ 11తో ముగిసిన వారంలో 1.19 బిలియన్ డాలర్ల క్షీణతతో 367.04 బిలియన్ డాలర్లకు పడ్డాయి. విదేశీ కరెన్సీ అసెట్స్‌లో తగ్గుదలే ఫారెక్స్ నిల్వల క్షీణతకు కారణమని రిజర్వు బ్యాంక్ పేర్కొంది. విదేశీ కరెన్సీ అసెట్స్ 1.15 బిలియన్ డాలర్ల క్షీణతతో 342.77 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇక బంగారు నిల్వలు స్థిరంగా 20.46 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా కడపటి వారంలో ఫారెక్స్ నిల్వలు 368.23 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. 
 
 రేట్ల పెంపు సమయం దగ్గర పడుతోంది
 అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు సమయం దగ్గరపడుతోందని ఫెడరల్ రిజర్వు చైర్‌పర్సన్ జన్నెత్ యెలెన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ రేటు 0.25-0.50 శ్రేణిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలో ఉపాధి అవకాశాలు మెరుగుపడుతుండడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి అంశాలు వడ్డీరేట్ల పెరుగుదలకు దోహద పడతాయని వివరించారు. రేట్ల పెంపునకు మరీ సమయం తీసుకుంటే అది ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని తెలిపారు.  
 
 త్వరలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ 
 టెలికం రంగ సంస్థ భారతి ఎయిర్‌టెల్ త్వరలో పేమెంట్స్ బ్యాంక్ సేవలను ప్రారంభిస్తోంది. డిసెంబర్‌లోనే ఈ సర్వీసులను మొదలు పెట్టేందుకు కసరత్తు చేస్తున్నామని కంపెనీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. వాస్తవానికి జూలై-సెప్టెంబర్‌లో ఆరంభించాలని అనుకున్నప్పటికీ ప్రారంభ తేదీ వాయిదా పడుతూ వస్తోంది. పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎయిర్‌టెల్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే.  
 
 కేంద్ర ఐటీ మంత్రితో బిల్ గేట్స్ సమావేశం
 మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు  బిల్ గేట్స్ తాజాగా కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్‌తో సమావేశమయ్యారు. ఇరువురి మధ్య డిజిటల్ ఇన్‌క్లూజన్, ఈపేమెంట్స్, ఈఅగ్రికల్చర్, సైబర్ సెక్యూరిటీ వంటి పలు అంశాలపై దాదాపు అర్ధ గంటసేపు చర్చ జరిగింది. ‘భారత ప్రభుత్వం పేమెంట్ బ్యాంక్స్,  పేమెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వంటి వాటిపై పెట్టుబడులు పెట్టింది. ఇప్పుడు మేం వాటినే ఆధారం చేసుకొని అప్లికేషన్‌‌సను రూపొందిస్తాం. ఇక్కడ హెల్త్, అగ్రికల్చర్ రంగాలకు ప్రాధాన్యమిస్తాం’ అని బిల్‌గేట్స్ వివరించారు. 
 
 ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాల్లో కోత
 ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ తాజాగా 2016-17 ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను తగ్గించింది. వీటిని 8-10 శాతానికి పరిమితం చేసింది. అంతర్జాతీయ ఆర్థిక ఇబ్బందులు, యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమణ వంటి అంశాలను దీనికి కారణంగా పేర్కొంది. కాగా నాస్కామ్ ఈ ఏడాది ప్రారంభంలో దేశీ సాఫ్ట్‌వేర్ సర్వీసుల్లో 10-12 శాతం వృద్ధిని అంచనా వేసింది. బ్రెగ్జిట్, అమెరికా ఎన్నికల అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలు, కరెన్సీ ఒడిదుడుకులు వంటి పలు అంశాలు వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని నాస్కామ్ ప్రెసిడెంట్ ఆర్.చంద్రశేఖర్ తెలిపారు.
  
 ఏసీసీ, అంబుజాల్లో లఫార్జే వాటా అప్
 లఫార్జే హోల్సిమ్ కంపెనీ ఏసీసీ, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో తన వాటాలను మరింతగా పెంచుకుంది. లఫార్జే హోల్సిమ్ అనుబంధ కంపెనీ హోల్డర్ ఇండ్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ 3.91 కోట్ల అంబుజా సిమెంట్స్ షేర్లను, 78.7 లక్షల ఏసీసీ షేర్లను కొనుగోలు చేసింది. ఈ షేర్ల కొనుగోళ్ల విలువ రూ.1,832 కోట్లు. ఈ షేర్ల కొనుగోళ్లతో హోల్డర్‌ఇండ్ ఇన్వెస్ట్‌మెంట్ వాటాలు అంబుజా సిమెంట్స్‌లో 61.62 శాతం నుంచి 63.11 శాతానికి, ఏసీసీలో 0.29 శాతం నుంచి 4.48 శాతానికి పెరిగారుు. 
 
  టోకు ధరలు ’కూల్’
 టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో కొంత శాంతించింది. సెప్టెంబర్‌లో 3.57 శాతంగా ఉన్న ఈ రేటు అక్టోబర్‌లో 3.39 శాతానికి దిగివచ్చింది. అంటే సెప్టెంబర్‌లో ఉన్న ఆహార ధరల పెరుగుదల వేగం (గత ఏడాది ఇదే నెలతో పోల్చి చూస్తే) అక్టోబర్‌లో తగ్గిందన్నమాట. ఆహార ధరలు అదుపులో ఉండడం దీనికి ఒక కారణం. గత ఏడాది ఇదే నెలలో ఆహార ద్రవ్యోల్బణం అసలు పెరుగుదలలో లేకపోగా 3.70 శాతం క్షీణతలో ఉంది.  వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం సైతం అక్టోబర్‌లో 14 నెలల కనిష్ట స్థారుు 4.20 శాతం వద్ద ఉన్న సంగతి తెలిసిందే. 
 
 రెండవ నెలా పెరిగిన ఎగుమతులు
 భారత్ ఎగుమతులు వరుసగా రెండవ నెలలోనూ సానుకూల ఫలితాన్ని అందించాయి. వార్షికంగా చూస్తే... అక్టోబర్‌లో 9.59 శాతం వృద్ధి నమోదయిది. విలువ 23.51 బిలియన్ డాలర్లు. ఆభరణాలు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడం మొత్తం గణాంకాల మెరుగుకు కారణమయియంది. ఇవే రంగాల దన్నుతో సెప్టెంబర్‌లో ఎగుమతుల వృద్ధి 4.62 శాతం (22.9 బిలియన్ డాలర్లు)గా నమోదయిన సంగతి తెలిసిందే. ఇక అక్టోబర్‌లో దేశం దిగుమతులను చూస్తే... 8.11 శాతం వృద్ధి నమోదయియంది. విలువ రూపంలో ఇది 33.67 బిలియన్ డాలర్లు.  
 
 వాహన రంగంలో 6.5 కోట్ల ఉద్యోగాలు!
 దేశీ వాహన పరిశ్రమలో వచ్చే దశాబ్ద (పదేళ్లు) కాలంలో 6.5 కోట్ల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని మారుతీ సుజుకీ అంచనా వేసింది. ఇదే సమయంలో దేశ జీడీపీలో వాహన పరిశ్రమ వాటా 12 శాతానికి చేరుతుందని మారుతీ సుజుకీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్, సీఈవో కెనిచి అయుకవ అభిప్రాయపడ్డారు. 
 
 డీల్స్..
 అమెరికాకు చెందిన వాకర్ ఫోర్జ్ టెన్నెస్సీ ఎల్‌ఎల్‌సీ (డబ్ల్యూఎఫ్‌టీ)కంపెనీని భారత వాహన విడిభాగాల దిగ్గజం భారత్ ఫోర్జ్ రూ.95 కోట్లకు (1.4 కోట్ల డాలర్లు) కొనుగోలు చేయనుంది.
 
 ఫేషియల్ రికగ్నిషన్ స్టార్టప్ ‘ఫేషియోమెట్రిక్స్’ను సోషల్ మీడియా దిగ్గజం ‘ఫేస్‌బుక్’ కొనుగోలు చేసింది. అరుుతే ఈ డీల్‌కు సంబంధించిన ఆర్థిక వివరాలను ఫేస్‌బుక్ వెల్లడించలేదు. 
 
 రిలయన్‌‌స ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్), జీఈ కంపెనీలు ఇండస్ట్రియల్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స(ఐఐఓటీ) వ్యాపారం కోసం ఒక అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా ఇరు సంస్థలు సంయుక్తంగా ఆరుుల్, గ్యాస్, ఎరువులు, విద్యుత్తు, ఫార్మా, టెలికం వంటి పలు ఇతర పరిశ్రమల్లో వినియోగదారులకు ఐఐఓటీ సొల్యూషన్‌‌స అందిస్తాయి. 
 
 ఎలక్ట్రానిక్స్ దిగ్గజ కంపెనీ శాంసంగ్.. అమెరికాకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ ఆడియో సిస్టమ్స్ తయారీ కంపెనీ హర్మన్‌ను కొనుగోలు చేయనుంది. ఇందుకు 8 బిలియన్ డాలర్లు (రూ.53,400 కోట్లు సుమారు) వెచ్చించనున్నట్టు శాంసంగ్ ప్రకటించింది. డీల్‌లో భాగంగా హర్మన్‌కు చెందిన ఒక్కో షేరుకు 112 డాలర్లను శాంసంగ్ చెల్లించనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement