US Federal Reserve System
-
గణాంకాలు, ఫలితాలపై దృష్టి
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసిక ఫలితాల సీజన్ ముగింపునకు వస్తోంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని కార్పొరేట్ దిగ్గజాలు జులై–సెప్టెంబర్(క్యూ2) పనితీరును వెల్లడించనున్నాయి. వీటితోపాటు దేశీ స్టాక్ మార్కెట్లను దేశీ ఆర్థిక గణాంకాలు సైతం ఈ వారం ప్రధానంగా ప్రభావితం చేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ వారం ఓఎన్జీసీ, అపోలో టైర్స్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, హిందాల్కో ఇండస్ట్రీస్, బీఈఎంఎల్, బీఏఎస్ఎఫ్, బాష్, అల్ఫాజియో, జూబిలెంట్ ఫుడ్, ఎన్ఎండీసీ, బ్లూడార్ట్, బ్రిటానియా, ఫినొలెక్స్ కేబుల్స్, హ్యుందాయ్, ఈఐహెచ్, బటర్‌ఫ్లై గంధిమతి, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్(ఫస్ట్‌క్రై మాతృ సంస్థ), గ్రాఫైట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, శ్రీ సిమెంట్, జైడస్ వెల్నెస్ తదితర పలు కంపెనీలు క్యూ2 ఫలితాలు ప్రకటించనున్నాయి. పావెల్ ప్రసంగం అక్టోబర్ నెలకు యూఎస్ ద్రవ్యోల్బణ గణాంకాలు 13న వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో 2.4 శాతంగా నమోదైంది. ఇక కీలకమైన వినియోగ ధరల సూచీ సెప్టెంబర్‌లో 3.3 శాతాన్ని తాకింది. శుక్రవారం కీలక అంశాలపై యూఎస్ ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమీ పావెల్ ప్రసంగించనున్నారు. గత వారం చేపట్టిన పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించిన విషయం విదితమే. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు తాజాగా 4.5–4.75 శాతానికి చేరాయి. ఇక మరోపక్క జులై–సెప్టెంబర్‌కు జపాన్ జీడీపీ గణాంకాలు ఇదే రోజు వెల్లడికానున్నాయి. ఏప్రిల్–జూన్‌లో జపాన్ జీడీపీ 0.7 శాతం పుంజుకుంది. అక్టోబర్‌కు చైనా పారిశ్రామికోత్పత్తి గణాంకాలు సైతం తెలియనున్నాయి. సెప్టెంబర్‌లో 5.4 శాతం పురోగతి నమోదైంది. ఇతర అంశాలు యూఎస్ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టనుండటంతో డాలరు ఇండెక్స్సహా యూఎస్ బాండ్ల ఈల్డ్స్ ఇటీవల బలపడుతూ వస్తున్నాయి. దీంతో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి సరికొత్త కనిష్టాలను తాకుతోంది. 84.38వరకూ పతనమైంది. మరోవైపు రాజకీయ, భౌగోళిక అనిశ్చతుల కారణంగా ముడిచమురు ధరలు ఆటుపోట్లకు లోనవుతున్నాయి. కాగా.. ఈ వారం దేశ, విదేశీ గణాంకాలు సెంటిమెంటుపై ప్రభావం చూపనున్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. వీటికితోడు దేశీ కార్పొరేట్ల క్యూ2 ఫలితాలకూ ప్రాధాన్యత ఉన్నట్లు మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా తెలియజేశారు. గత వారమిలా విదేశీ ఇన్వెస్టర్ల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు గత వారం డీలా పడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. ఈ నెలలోనూ అమ్మకాలు కొనసాగే వీలున్నట్లు అంచనా వేశారు. అంతంతమాత్ర క్యూ2 ఫలితాలు, ప్రపంచ అనిశి్చతుల కారణంగా ఈ వారం మార్కెట్లు సైడ్‌వేస్‌లో కదలవచ్చని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్, రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా అభిప్రాయపడ్డారు. అయితే ఫలితాల ఆధారంగా కొన్ని స్టాక్స్‌లో యాక్టివిటీకి వీలున్నట్లు తెలియజేశారు. గత వారం సెన్సెక్స్ 238 పాయింట్లు క్షీణించి 79,486వద్ద నిలవగా.. నిఫ్టీ 156 పాయింట్లు కోల్పోయి 24,148 వద్ద ముగిసింది.ఎఫ్‌పీఐలు5 రోజుల్లో రూ. 20,000 కోట్లు ఈ నెలలోనూ విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్స్‌లో విక్రయాలకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తొలి ఐదు ట్రేడింగ్ సెషన్లలో నికరంగా దాదాపు రూ. 20,000 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. చైనా సహాయక ప్యాకేజీలకు తెరతీయడం, దేశీయంగా మార్కెట్లు సరికొత్త గరిష్టాలకు చేరి ఖరీదుగా మారడం తదితర కారణాలతో కొద్ది రోజులుగా ఎఫ్‌పీఐలు నిరవధిక అమ్మకాలకు పాల్పడుతున్నారు. ఫలితంగా గత నెలలో సరికొత్త రికార్డ్ నెలకొల్పుతూ రూ. 94,017 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించిన విషయం విదితమే. అయితే అంతకుముందు సెప్టెంబర్‌లో గత 9 నెలల్లోనే అత్యధికంగా రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం! కాగా.. ఇంతక్రితం 2020 మార్చిలో మాత్రమే ఒకే నెలలో అత్యధికంగా రూ. 61,973 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం సెలవు గురునానక్ జయంతి సందర్భంగా వారాంతాన(15) ఈక్విటీ మార్కెట్లకు సెలవు. దీంతో ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. కాగా.. అక్టోబర్ నెలకు రిటైల్ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) గణాంకాలు మంగళవారం(12న) వెలువడనున్నాయి. సెప్టెంబర్‌లో సీపీఐ 5.49 శాతంగా నమోదైంది. టోకు ధరల ద్రవ్యోల్బణం(డబ్ల్యూపీఐ) వివరాలు గురువారం(14న) వెల్లడికానున్నాయి. సెప్టెంబర్‌లో డబ్ల్యూపీఐ 1.84 శాతానికి చేరింది. ఈ బాటలో ప్రభుత్వం శుక్రవారం(15న) అక్టోబర్ నెలకు వాణిజ్య గణాంకాలు విడుదల చేయనుంది. -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా?
ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లపై ప్రభావాన్ని చూపే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఇప్పటికే వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. గత పాలసీ సమీక్షలో 0.5 శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఈ ప్రభావం దేశీ కేంద్ర బ్యాంకు ఆర్బీఐపైనా ఉండవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు ప్రభావితంకానున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. దేశీ స్టాక్ మార్కెట్లు నేటి(7) నుంచి ప్రారంభంకానున్న రిజర్వ్ బ్యాంక్ పాలసీ సమీక్షా సమావేశాలపై దృష్టి పెట్టనున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) బుధవారం(9న) పరపతి నిర్ణయాలను తీసుకోనుంది. వెరసి ఈ వారం ఇన్వెస్టర్లు ఆర్బీఐ పాలసీ నిర్ణయాలపై అధికంగా దృష్టి సారించనున్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. గత నెల18న యూఎస్ ఫెడ్ నాలుగేళ్ల తదుపరి యూటర్న్ తీసుకుంటూ వడ్డీ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఫెడ్ పాలసీ నిర్ణయాల వివరాలు(మినిట్స్) బుధవారం వెల్లడికానున్నాయి. అయితే దేశీయంగా ద్రవ్యోల్బణ పరిస్థితులు, మధ్యప్రాచ్య అనిశి్చతులు వంటి అంశాల నేపథ్యంలో ఆర్బీఐ యథాతథ పాలసీ అమలుకే మొగ్గు చూపవచ్చని బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశీయంగా వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 6.5 శాతంగా అమలవుతోంది. ఫలితాల సీజన్ షురూ ఈ వారం నుంచి దేశీ కార్పొరేట్ జులై–సెపె్టంబర్ (క్యూ2) ఫలితాల సీజన్ ప్రారంభంకానుంది. ప్రధానంగా ఐటీ దిగ్గజాలు ప్రస్తుత ఆరి్థక సంవత్సరం(2024–25) క్యూ2 ఫలితాల సీజన్‌కు తెరతీయనున్నాయి. జాబితాలో టాటా గ్రూప్ దిగ్గజాలు టీసీఎస్, టాటా ఎలక్సీ 10న క్యూ2 పనితీరు వెల్లడించనున్నాయి. ఈ బాటలో డెన్ నెట్వర్క్స్, జీఎం బ్రూవరీస్, ఇరెడా సైతం ఇదే రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి. కాగా.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సెంటిమెంటుపై ప్ర భావాన్ని చూపగలదని స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ సీనియర్ టెక్నికల్ నిపుణులు ప్రవేశ్ గౌర్ అంచనా వేశారు. మధ్యప్రా చ్య ఉద్రిక్తతలతో సెన్సెక్స్ 85,000, నిఫ్టీ 26,000 పాయింట్ల మైలురాళ్లను స్వల్ప కాలంలోనే కోల్పోయినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయిర్ పేర్కొన్నారు. గత వారం మార్కెట్లు 4 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఇతర అంశాలు కీలకం ఆర్బీఐ పాలసీ సమీక్ష, పశి్చమాసియా ఉద్రిక్తతలతోపాటు.. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు లేదా విక్రయాలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ కదలికలు, చమురు ధరలు వంటి అంశాలు సైతం దేశీ స్టాక్ మార్కెట్లలో ట్రెండ్‌ను నిర్దేశిస్తాయని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ ఎస్వీపీ అజిత్ మిశ్రా వివరించారు. మాస్టర్ క్యాపిటల్ సరీ్వసెస్ డైరెక్టర్ పల్కా ఆరోరా చోప్రా సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత వారం పశి్చమాసియాలో చెలరేగిన యుద్ధవాతావరణం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల భారీ అమ్మకాలు దేశీ మార్కెట్లను దెబ్బతీసిన విషయం విదితమే. సెన్సెక్స్ 3,883 పాయింట్లు(4.5 శాతం) పతనమై 81,688 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 1,164 పాయింట్లు(4.5 శాతం) కోల్పోయి 25,015 వద్ద ముగిసింది. దీంతో గత వారం ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)లో రూ. 16.25 లక్షల కోట్లు ఆవిరికావడం ప్రస్తావించదగ్గ అంశం! కాగా.. దేశీయంగా లిక్విడిటీ పటిష్టంగా ఉన్నదని గౌర్ పేర్కొన్నారు. ప్రస్తుతం అధిక విలువల్లో ఉన్న రంగాల నుంచి ఆకర్షణీయ విలువల్లో ఉన్న స్టాక్స్‌వైపు పెట్టుబడులు తరలే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్‌పీఐల భారీ అమ్మకాలుఇటీవలి యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఉన్నట్టుండి విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) అమ్మకాల బాట పట్టారు. దేశీ స్టాక్స్ నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకునేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో ఈ నెల(అక్టోబర్)లో భారీ గా అమ్మకాలకు తెరతీశారు. ఈ నెలలో తొలి మూడు(1–4 మధ్య) సెషన్లలోనే భారీగా రూ. 27,142 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు. ఇందుకు ముడిచమురు ధరలు జోరందుకోవడం, చైనాలో సహాయక ప్యాకేజీల ప్రకటనలు సైతం ప్రభావం చూపాయి. అయితే సెపె్టంబర్లో గత తొమ్మిది నెలల్లోనే అత్యధికంగా దేశీ స్టాక్స్‌లో రూ. 57,724 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు పశి్చమాసియాలో ఉద్రిక్తతలు ఊపందుకోవడంతో అమ్మకాల యూటర్న్ తీసుకున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో అమ్మకాలకే ప్రాధాన్యమిచి్చన ఎఫ్‌పీఐలు జూన్ నుంచి కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్న విషయం విదితమే. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తుందా..?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ నాలుగేళ్ల తర్వాత కీలక వడ్డీరేట్లను 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఫెడ్ నిర్ణయంతో ఇప్పటివరకు 5.25-5.5 శాతంగా ఉన్న వడ్డీరేట్లు 4.75-5 శాతానికి చేరినట్లయింది. ఈ నేపథ్యంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ కూడా రానున్న ద్రవ్యపరపతి సమావేశంలో కీలక వడ్డీరేట్లను తగ్గించాలని పలువురు కోరుతున్నారు. అయితే ఇప్పటికే వడ్డీరేట్ల తగ్గింపు అంశంపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ తన అభిప్రాయాన్ని తెలిపారు.ఇటీవల సింగపూర్‌లో జరిగిన ఓ సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో తొందరపడబోమని స్పష్టం చేశారు. ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతం మధ్య ఉంచడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ద్రవ్యోల్బణాన్ని 4 శాతంగా ఉంచేలా ప్రణాళికలు పాటిస్తున్నామని చెప్పారు. వరుసగా జులై, ఆగస్టు నెలలోనూ ద్రవ్యోల్బణం 4 శాతం కంటే తక్కువగా ఉండడంతో అందుకు అనుగుణంగా మార్కెట్ వర్గాలు వడ్డీరేట్లు తగ్గించాలని కోరుతున్నాయి. 2021-24 మధ్య కాలంలో దేశ జీడీపీ సరాసరి 7.5 శాతం వృద్ధి చెందింది. కానీ గత త్రైమాసికంలో ఇది 6.5 శాతంగా ఉంది. సార్వత్రిక ఎన్నికల వల్ల ప్రభుత్వ వ్యయం మందగించడం ఇందుకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు.2023 జులై, ఆగస్టుల్లో రిటైల్ ద్రవ్యోల్బణం బేస్ వరుసగా 7.44 శాతం, 6.83 శాతంగా నమోదైంది. దాంతో పోలిస్తే ఇటీవల ద్రవ్యోల్బణం తగ్గుతున్నట్లు కనిపిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. 2024 జులై, ఆగస్టులో ద్రవ్యోల్బణ గణాంకాలు ఐదేళ్ల కనిష్ట స్థాయిలో (వరుసగా 3.6 శాతం, 3.65 శాతం) నమోదయ్యాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 2-4 శాతం వద్ద ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధానానికి ఈ సూచీనే ప్రామాణికంగా ఉండనుంది.ఇదీ చదవండి: 1000 మందికి రూ.10 వేల చొప్పున సాయంరిటైల్ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా గడిచిన తొమ్మిది ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశాల నుంచి ఆర్బీఐ రెపో రేటును (ప్రస్తుతం 6.5 శాతం) యథాతథంగా కొనసాగిస్తోంది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రధానంగా ఆహార ద్రవ్యోల్బణమే అడ్డంకని గవర్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. సరళతర వడ్డీరేట్ల విధానం కోరుతున్న ప్రభుత్వం రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాల్లో ఆహార ధరలను మినహాయించాలని కూడా సూచిస్తోంది. అవసరమైతే పేదలకు ఫుడ్ కూపన్లను జారీ చేసే ప్రతిపాదనను ఆర్థిక సర్వే ప్రస్తావిస్తోంది. అక్టోబర్ 7 నుంచి 9 వరకూ తదుపరి పాలసీ సమీక్షా సమావేశం జరగనుంది. తాజా పరిణామాల నేపథ్యంలో రానున్న ఆర్బీఐ పాలసీ విధానంపై ఆసక్తి నెలకొంది. -
ఫెడ్ అర శాతం వడ్డీ కట్
న్యూయార్క్: యూఎస్ ఫెడరల్ రిజర్వ్ నాలుగేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్ల తగ్గింపు బాట పట్టింది. అత్యధిక శాతం విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగా వడ్డీ రేటులో ఏకంగా 0.5 శాతం కోత పెట్టింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 4.75–5 శాతానికి దిగివచ్చాయి. ఇప్పటివరకూ 5.25–5.5 శాతంగా అమలవుతున్నాయి. 32 నెలల తదుపరి ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అధ్యక్షతన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) వడ్డీ రేట్ల పెంపు నుంచి యూటర్న్ తీసుకుంది. ఆగస్ట్‌లో వ్యవసాయేతర ఉద్యోగాలు అంచనాలకంటే తక్కువగా 1,42,000కు పరిమితంకాగా.. రిటైల్ ధరలు 0.3 శాతం బలపడి 3.2 శాతాన్ని తాకాయి. దీంతో ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు అందినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇంతక్రితం కోవిడ్–19 కారణంగా 2000 మార్చిలో ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. 2022 మార్చి నుంచి వడ్డీ రేట్లను పెంచుతూ వచి్చన ఫెడ్ 2023 జూలై తదుపరి నిలకడను కొనసాగిస్తూ వచి్చన సంగతి తెలిసిందే. 2000 డిసెంబర్లో 6.5 శాతానికి ఎగసిన ఫెడ్ ఫండ్స్ రేట్లు గతేడాది తిరిగి 5.5 శాతానికి చేరడంతో గరిష్టస్థాయిలో కొనసాగుతున్నాయి! వడ్డీ రేట్ల తగ్గింపుతో యూఎస్ మార్కెట్లు 1% పైగా ఎగసి ట్రేడవుతున్నాయి. పసిడి ఔన్స్ ధర 24 డా లర్లు పెరిగి 2,618 డాలర్ల ఆల్‌టైమ్ హైని చేరింది. -
ఫెడ్ నిర్ణయాలు కీలకం
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ ద్రవ్య పరపతి నిర్ణయాలు, ప్రపంచ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్ దిశానిర్దేశం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆయా దేశాల స్థూల ఆర్థిక గణాంకాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటన తర్వాత ఇన్వెస్టర్లు సార్వత్రిక ఎన్నికల పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలింవచ్చు. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. ‘‘స్మాల్, మిడ్ క్యాప్ ఫండ్ల నిర్వహణ సామర్థ్యాలను పరీక్షించేందుకు స్ట్రెస్ టెస్ట్ నిర్వహించాలని సెబీ ఆదేశాలు జారీ నేపథ్యంలో ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్, రక్షణాత్మక షేర్ల పట్ల ఆసక్తి చూపొచ్చు. సాంకేతికంగా నిఫ్టీ బలహీనంగా ఉంది. నిర్ణయాత్మక తక్షణ మద్దతు 21,850 స్థాయిని కోల్పోతే దిగువ స్థాయిలో 21,450 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఇంధన, రియలీ్ట, ఫైనాన్స్ రంగాలకు చెందిన చిన్న, మధ్య స్థాయిలకు షేర్లలో భారీ ఎత్తున అమ్మకాలు జరగడంతో సూచీలు గతవారంలో 2% మేర నష్టపోయాయి. వారం మొత్తంగా సెన్సెక్స్ 1476 పాయింట్లు, నిఫ్టీ 470 పాయింట్లు పతనమయ్యాయి. బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 2,641 పాయింట్లు, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1602 పాయింట్లు చొప్పున క్షీణించాయి. ఫెడ్ వడ్డీ రేట్ల నిర్ణయ ప్రభావం అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(మార్చి 19న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(20న)రోజున ప్రకటిస్తారు. ఫిబ్రవరి అమెరికా కన్జూమర్ ఇండెక్స్, ద్రవ్యోల్బణం అంచనాలకు మించి నమోదుకావడంతో ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల(5.25 – 5.5%) యథాతథంగా ఉంచొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరికి ముందు కొందరు ట్రేడర్లు తమ పొజిషన్లను వెనక్కి తీసుకోవచ్చు. ప్రపంచ పరిణామాలు అమెరికా ఫెడ్ రిజర్వ్ తో పాటు బ్యాంక్ ఆఫ్ జపాన్(మార్చి 19), బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(మార్చి 21) ద్రవ్య విధానాలు వెల్లడి కానున్నాయి. అలాగే చైనా ఐదేళ్ల రుణ పరపతి రేటు ప్రకటించనుంది. దీంతో ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవచ్చు. బ్రిటన్ ప్రొడక్టర్ ప్రైస్ ఇండెక్స్, తయారీ, సేవారంగ పీఎంఐ గణాంకాలు వెల్లడి కానున్నాయి. యూరోజోన్ ద్రవ్యోల్బణం, వాణిజ్య లోటు, చైనా రిటైల్ సేల్స్, నిరుద్యోగ డేటాలు ఇదే వారంలో వెల్లడి కానున్నాయి. మార్చి ప్రథమార్థంలో రూ.40 వేల కోట్ల పెట్టుబడులు విదేశీ ఇన్వెస్టర్లు ఈ మార్చి ప్రథమార్థంలో రూ.40,710 కోట్ల భారత ఈక్విటీలు కొన్నారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం, దేశీయ స్థూల ఆర్థిక వృద్ధి సానుకూల అంచనాలు ఇందుకు ప్రధాన కారణాలని మార్కెట్ నిపుణులు తెలిపారు. అమెరికా బాండ్లపై రాబడులకు అనుగుణంగా విదేశీ ఇన్వెస్టర్లు తమ వ్యూహాన్ని మార్చుకుంటున్నారు. తాజాగా ద్రవ్యోల్బణ పెరగడంతో బాండ్లపై రాబడులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దీంతో విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ నికర విక్రయదారులుగా మారే అవకాశం ఉంది. -
ఫెడ్ పాలసీ, బడ్జెట్‌పై ఫోకస్
ముంబై: మధ్యంతర కేంద్ర బడ్జెట్ 2024 – 25 ప్రభావిత అంశాలు, యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ద్రవ్య పాలసీ నిర్ణయాలు ఈ వారం మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. వాహన విక్రయ డేటా, అదే నెలకు సంబంధించి కొన్ని స్థూల ఆర్థిక గణాంకాలు వెల్లడికానున్నాయి. దేశీయ కార్పొరేట్ డిసెంబర్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు తుది దశకు చేరుకున్నాయి. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరుతెన్నులు, రూపాయి కదిలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలూ సూచీల ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. ట్రేడింగ్ 3 రోజులే జరిగిన గతవారంలో స్టాక్ సూచీలు ఒకశాతం నష్టపోయాయి. కార్పొరేట్ క్యూ3 ఆర్థిక ఫలితాలు నిరాశపరచడం, ఎఫ్ఐఐల వరుస విక్రయాలు, మధ్యంతర బడ్జెట్, ఫెడ్ పాలసీ ప్రకటనకు అప్రమత్తతతో గతవారంలో నిఫ్టీ 270 పాయింట్లు, సెన్సెక్స్ 982 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. ‘‘అమెరికా, బ్రిటన్ కేంద్ర బ్యాంకుల ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడి నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు స్థిరీకరణకు లోనయ్యే అవకాశం ఉంది. ఈ వారంలో పలు పెద్ద కంపెనీలు తమ క్యూ3 ఫలితాలు విడుదల చేస్తున్న నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. అమ్మకాలు కొనసాగితే సాంకేతికంగా నిఫ్టీకి దిగువున 21050 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఈ స్థాయిని కోల్పోతే 20,970 – 20,770 శ్రేణిలో మరో మద్దతు ఉంది. సానుకూల పరిణామాలు నెలకొని కొనుగోళ్లు జరిగితే ఎగువ స్థాయిలో 21,640 పాయింట్ల వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది.’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా తెలిపారు. క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రభావం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఆర్థిక ఫలితాల ప్రకటన తుది అంకానికి చేరుకుంది. ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఎల్అండ్టీ, సన్ ఫార్మా, మారుతీ సుజుకీ, టైటాన్, అదానీ పోర్ట్స్‌తో ఈ వారంలో మొత్తం 475 కంపెనీలు తమ డిసెంబర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. వీటితో పాటు ఎన్టీపీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్, బీపీసీఎల్, అదానీ టోటల్ గ్యాస్, కొచి్చన్ షిప్‌యార్డ్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, పిరమిల్ ఫార్మా, స్ట్రైడ్స్ ఫార్మా, వోల్టాస్, బ్యాంక్ ఆఫ్ బరోడా, డాబర్ మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించే జాబితాలో ఉన్నాయి. కార్పొరేట్ ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా కంపెనీల యాజమాన్యం అవుట్‌లుక్ వ్యాఖ్యలను మార్కెట్ వర్గాలు పరిశీలిస్తాయి. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక డేటాపై దృష్టి కేంద్ర గణాంకాల శాఖ డిసెంబర్ నెలకు సంబంధించి ద్రవ్య లోటు, మౌలిక రంగ ఉత్పత్తి గణాంకాలను బుధవారం వెల్లడించనుంది. మరుసటి రోజు ఫిబ్రవరి ఒకటిన(గురువారం) ఆటో కంపెనీలు తమ జనవరి నెల వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. అదే రోజున తయారీ రంగ పీఎంఐ డేటా వెల్లడవుతుంది. వారాంతాపు రోజున (శుక్రవారం) జనవరి 26తో ముగిసిన ఫారెక్స్ రిజర్వ్ డేటాను ఆర్బీఐ విడుదల చేస్తుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. రెండు లిస్టింగులు, ఒక ఐపీఓ ఇదే వారంలో ఇటీవల ఇష్యూలను పూర్తి చేసుకున్న ఈప్యాక్ డ్యూరబుల్ జనవరి 30న, మరుసటి రోజు (31న)నోవా ఆగ్రిటెక్ కంపెనీల షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. బీఎల్ఎస్ ఈ–సరీ్వసెస్ పబ్లిక్ ఇష్యూ బుధవారం ప్రారంభమై ఫిబ్రవరి ఒకటిన ముగుస్తుంది. అందరి చూపు ఫెడ్ సమావేశం పైనే అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జనవరి 30న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(జనవరి 31)రోజున ప్రకటిస్తారు. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు తగ్గుముఖం పట్టినట్లయితే ఈ ఏడాదిలో మూడు దఫాలు వడ్డీరేట్ల కోత ఉంటుందని గతేడాది డిసెంబర్లో పాలసీ ప్రకటన సందర్భంగా ఫెడ్ సంకేతాలిచ్చింది. ఈ దఫా ఫెడ్ కీలకవడ్డీ రేట్లను ప్రస్తుత స్థాయి (5.25 – 5.50 వద్ద) యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. యూఎస్ జీడీపీ అంచనాలకు మించి నమోదైన నేపథ్యంలో మార్కెట్ వర్గాలు ఫెడ్ చైర్మన్ పావెల్ వ్యాఖ్యలను నిశీతంగా పరిశీలించే వీలుంది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు అమెరికా ట్రెజరీ బాండ్లపై రాబడులు పెరుగుతుడంతో భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 25వ తేదీ నాటికి రూ.24,700 కోట్ల షేర్లను విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్లో రూ.17,120 కోట్లు పెట్టుబడులు పెట్టారు. అమెరికా బాండ్లపై రాబడులు ఆందోళనలను కలించే అంశమే కాకుండా నగదు మార్కెట్లో అమ్మకాలను ప్రేరేపిస్తుందని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వీకే విజయ్ కుమార్ కుమార్ తెలిపారు. ఆటో, ఆటో ఉపకరణాలు, మీడియా ఎంటర్టైన్మెంట్, ఐటీ షేర్లను విక్రయించారు. ఆయిల్‌అండ్‌గ్యాస్, విద్యుత్, ఎంపిక చేసుకున్న ఫైనాన్స్ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపారు. మధ్యంతర బడ్జెట్‌పై ఆసక్తి ఫెడ్ పాలసీ తర్వాత దలాల్ స్ట్రీట్ వర్గాలు అత్యంత ఆస్తకిగా ఎదురుచూసే మరో కీలక ఘట్టం బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి ఒకటిన మధ్యంతర బడ్జెట్ 2024–25 ను ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల వేళ ప్రజాకర్షక బడ్జెట్ ఉండొచ్చనేది అత్యధిక వర్గాల అంచనా. ముఖ్యంగా ద్రవ్య పరమైన కార్యాచరణ, మూలధన ఆధారిత పెట్టుబడుల విస్తరణ, గ్రామీణాభివృద్ధికి ప్రణాళికలకు మధ్యంతర బడ్జెట్ అధిక ప్రాధ్యాన్యత ఇవ్వొచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఏదిఏమైనా మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు, షేర్లు ఇప్పటికే భారీ ర్యాలీ చేసిన నేపథ్యంలో లాభాలు పరిమితంగా ఉండొచ్చు. ప్రతికూల నిర్ణయం వెలువడితే మరింత లాభాల స్వీకరణ చోటుచేసుకొని సూచీలు పతనాన్ని చవిచూడొచ్చు. -
ఐటీ, మెటల్, ఫైనాన్స్ షేర్లలో అమ్మకాలు
ముంబై: ఫైనాన్స్, మెటల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో స్టాక్ సూచీలు రెండో రోజూ నష్టాలు చవిచూశాయి. కీలక వడ్డీ రేట్లను నిర్ణయించే యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశ వివరాలు(మినిట్స్), ఉపాధి కల్పన డేటా వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. దేశీయ తయారీ రంగం డిసెంబర్లో 19 నెలల కనిష్టానికి క్షీణించి 54.9 స్థాయికి దిగిరావడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు అందాయి. ఫలితంగా సెన్సెక్స్ 539 పాయింట్లు నష్టపోయి 71,357 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 149 పాయింట్లు క్షీణించి 21,517 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు బలహీనంగా మొదలయ్యాయి. ఏ దశలోనూ కొనుగోళ్ల మద్దతు లభించకపోవడంతో సూచీలు రోజంతా నష్టాల్లో ట్రేడయ్యాయి. సెన్సెక్స్ 588 పాయింట్లు క్షీణించి 71,304 వద్ద, నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21,500 వద్ద ఇంట్రాడే కనిష్టాలను తాకాయి. నష్టాల మార్కెట్లోనూ వినిమయ, సరీ్వసెస్, రియల్టీ, విద్యుత్, ఫార్మా రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.666 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.863 కోట్ల విలువైన షేర్లు కొన్నారు. అంతర్జాతీయంగా డాలర్ బలపడటంతో, చైనాలో డిమాండ్ తగ్గుదల ఆందోళనలతో మెటల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. దేశీయ ఐటీ రంగ డిసెంబర్ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందు ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అదానీ షేర్ల పరుగు.. అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై సెబీ జరుపుతున్న దర్యాప్తులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో బుధవారం అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పరుగులు పెట్టాయి. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 12%, అదానీ టోటల్ గ్యాస్ 10%, అదానీ గ్రూప్ ఎనర్జీ 6%, అదానీ పవర్ 5% చొప్పున లాభపడ్డాయి. అదానీ విల్మార్ 4%, ఎన్డీటీవీ 3.50%, అదానీ ఎంటర్ప్రైజెస్ 2.50%, అదానీ పోర్ట్స్ 1.30%, అంబుజా సిమెంట్స్ 1%, ఏసీసీ 0.10% పెరిగాయి. ఫలితంగా అదానీ గ్రూప్ 10 కంపెనీల సంయుక్త మార్కెట్ విలువ ఒక్కరోజే రూ.64,189 కోట్లు పెరిగి రూ.15.11 లక్షల కోట్లకు చేరింది. -
ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచేందుకు తాజాగా నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 5.25–5.5 శాతం వద్దే కొనసాగనున్నాయి. ఉపాధి, హౌసింగ్ గణాంకాలు నీరసించడంతోపాటు ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతున్న సంకేతాలు యథాతథ పాలసీ అమలుకు కారణమైనట్లు ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ పేర్కొన్నారు. వెరసి రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ).. గత 18 నెలల్లో రెండోసారి వడ్డీ రేట్ల పెంపునకు విముఖత చూపింది. ప్రస్తుత రేట్లు గత రెండు దశాబ్దాలలోనే అత్యధికంకాగా.. 2022 మార్చి నుంచి దశలవారీగా ఫెడ్.. 5.25 శాతంమేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో రుణాలు, క్రెడిట్ కార్డు చెల్లింపులపై వడ్డీలు భారంగా మారినట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ధరలు ఫెడ్ లక్ష్యాన్ని మించుతున్నప్పటికీ లేబర్ మార్కెట్, హౌసింగ్ రంగం మందగించడంతో భవిష్యత్‌లోనూ ఎఫ్‌వోఎంసీ రేట్ల పెంపునకు ఆసక్తి చూపకపోవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. (రూ.400 కోట్లకు అలనాటి మేటి హీరో బంగ్లా అమ్మకం: దాని స్థానంలో భారీ టవర్?) -
20 వేల దిగువకు నిఫ్టీ
ముంబై: హెచ్డీఎఫ్సీ బ్యాంకు(4%), రిలయన్స్ ఇండస్ట్రీస్(2%) షేర్ల పతనంతో స్టాక్ సూచీలు బుధవారం ఒకశాతానికి పైగా నష్టపోయాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి (బుధవారం రాత్రి)కి ముందు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాలు సైతం సెంటిమెంట్‌పై ఒత్తిడి పెంచాయి. ఫలితంగా సెన్సెక్స్ 796 పాయింట్లు క్షీణించి 66,801 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 232 పాయింట్లు పతనమై 20 వేల స్థాయి దిగువన 19,901 వద్ద నిలిచింది. వెరసి గడిచిన రెండు నెలల్లో అతిపెద్ద నష్టాన్ని చవిచూశాయి. ట్రేడింగ్ ప్రారంభం అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ముఖ్యంగా ఫైనాన్స్, మెటల్, బ్యాంకింగ్ రంగాల షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక దశలో సెన్సెక్స్ 868 పాయింట్లు నష్టపోయి 66,728 వద్ద, నిఫ్టీ 254 పాయింట్లు క్షీణించి 19,879 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,111 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.573 కోట్ల ఈక్విటీలను విక్రయించారు. సెన్సెక్స్ రెండు రోజుల పతనంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2.89 లక్షల కోట్లు హరించుకుపోయి రూ.320 లక్షల కోట్లకు దిగివచ్చింది. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం జీవితకాల కనిష్ట స్థాయి (83.32) నుంచి కోలుకుంది. డాలర్ మారకంలో 21 పైసలు బలపడి 83.11 స్థాయి వద్ద స్థిరపడింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ పాటు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు చోటు చేసుకున్న అప్రమత్తతతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బేరిష్ ట్రెండ్ నెలకొని ఉంది. మార్కెట్లో మరిన్ని సంగతులు ... ► ఆర్ ఆర్ కేబుల్ షేరు లిస్టింగ్ పర్లేదనిపించింది. బీఎస్ఈలో ఇష్యూ ధర(రూ.1,035)తో పోలిస్తే 14% ప్రీమియంతో రూ.1,179 వద్ద లిస్టయ్యింది. ట్రేడింగ్‌లో 17% ఎగసి రూ.1,213 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 16% లాభంతో 1,197 వద్ద స్థిరపడింది. కంపెనీ మార్కెట్ విలువ రూ.13,500 కోట్లుగా నమోదైంది. పబ్లిక్ ఇష్యూ ముగిసిన రెండురోజుల్లోనే ఎక్సే్చంజీల్లో లిస్టయ్యి టీ+2 టైంలైన్ విధానంలో లిస్టయిన తొలి కంపెనీగా రికార్డుకెక్కింది. ► చివరి రోజు నాటికి యాత్రా ఆన్లైన్ ఐపీఓకు 1.61 రెట్ల అధిక స్పందన లభించింది. కంపెనీ 3.09 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయగా 4.98 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 2.11 రెట్లు సబ్‌్రస్కిప్షన్ సాధించింది. ► హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌తో విలీనం తర్వాత జూలై ఒకటి నుంచి స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏ) పెరిగే అవకాశం ఉందని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ సోమవారం ప్రకటించింది. అలాగే నోమురా బ్రోకరేజ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేరు రేటింగ్‌ను ‘బై’ నుంచి ‘న్యూట్రల్’కి డౌన్‌గ్రేడ్ చేసింది. దీంతో ఈ బ్యాంకు షేరు 4% నష్టపోయి రూ.1564 వద్ద స్థిరపడింది. షేరు భారీ పతనంతో ఒక్క రోజులోనే దాదాపు రూ.50 వేల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ కోల్పోయింది. సెన్సెక్స్, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన షేరు ఇదే. ► ఎంఅండ్ఎం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్లను అధిగమించింది. ఎస్యూవీ విభాగం, ట్రాక్టర్లకు బలమైన ఆర్డర్లు లభించడం ఇందుకు తోడ్పడిందని కంపెనీ తెలిపింది. బీఎస్ఈలో ఈ కంపెనీ షేరు రూ.1634 వద్ద ముగిసింది. -
ద్రవ్యోల్బణం, ఫెడ్ మినిట్స్‌పై ఫోకస్
ముంబై: దేశీయ ద్రవ్యోల్బణం డేటా, అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) సమావేశ నిర్ణయాల వివరాలు (మినిట్స్) ఈ వారం మార్కెట్‌కు దారిచూపొచ్చని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. తుది దశకు చేరిన కార్పొరేట్ క్యూ1 ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టి సారించవచ్చంటున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం (రేపు) ఎక్సే్చంజీలకు సెలవు. ట్రేడింగ్ నాలుగు రోజులే కావడంతో మార్కెట్ వర్గాల పారి్టసిపేషన్ (భాగస్వామ్యం) స్వల్పంగా ఉంటుంది. కావున సూచీలు పరిమిత శ్రేణిలో కదలాడొచ్చంటున్నారు. వీటితో పాటు విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్ మారకంలో రూపాయి విలువ క్రూడాయిల్ ధరలపై దృష్టి సారించే వీలుందంటున్నారు. దేశీయంగా ట్రేడింగ్‌ను పెద్దగా ప్రభావితం చేసే అంశాలేవీ లేకపోవడంతో పాటు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశ్చితి పరిస్థితుల దృష్ట్యా సూచీలు స్థిరీకరణ దిశగా సాగొచ్చు. అయితే ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించే వీలుంది. సాంకేతికంగా నిఫ్టీకి దిగువు స్థాయిలో 19,300–19,100 శ్రేణిలో కీలక మద్దతు స్థాయిని ఉంది. కొనుగోళ్ల మద్దతు లభిస్తే ఎగువ స్థాయిలో 19,650–19,700 స్థాయిని పరీక్షించవచ్చు’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్సియల్ సరీ్వసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమా తెలిపారు. ఆర్బీఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యల్బోణ అంచనాలను 30 బేసిస్ పాయింట్లు పెంచడం, అదనపు ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు ఇంక్రిమెంటల్ సీఆర్ఆర్(నగదు నిల్వల నిష్పత్తి)ను పదిశాతం పెంపు చర్యలతో గతవారంలో మార్కెట్ నష్టాలను చవిచూసింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ షేర్ల పతనంతో సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు, నిఫ్టీ 89 పాయింట్లు కోల్పోయాయి. ద్రవ్యోల్బణ డేటాపై దృష్టి ద్రవ్యోల్బణ ఆందోళనలు అధికమతున్న వేళ నేడు(సోమవారం) రిటైల్, టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ డేటా విడుదల కానుంది. వడ్డీరేట్లను ప్రభావితం చేసే ఈ గణాంకాలపై మార్కెట్ వర్గాలు దృష్టి సారించనునున్నారు. టమోటాతో పాటు ఇతర కాయగూరల ధరలు పెరగడంతో ఈ జూలై సీపీఐ ద్రవ్యోల్బణం అర్బీఐ లక్షిత పరిధి ఆరు శాతాన్ని మించి 6.3%గా నమోదుకావచ్చని ఆరి్థకవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఆర్బీఐ తన సమీక్ష సమావేశంలో ప్రస్తుత ఆరి్థక సంవత్సరానికి గానూ ద్రవ్యోల్బణ అంచనాను 5.1% నుంచి 5.4 శాతానికి పెంచింది. ఇదే రోజున టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణ గణాంకాలూ వెలువడనున్నాయి. ఫెడ్ రిజర్వ్ సమావేశ వివరాలపై కన్ను అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ జూలైలో నిర్వహించిన ద్రవ్య పాలసీ సమావేశ వివరాలు (ఫెడ్ మినిట్స్) బుధవారం విడుదల కానున్నాయి. ఈ ఏడాదిలో మరోసారి వడ్డీరేట్ల పెంపు సంకేతాలిచి్చన ఫెడ్ సమావేశ అంతర్గత నిర్ణయాలు, అవుట్‌లుక్ వివరాలను మార్కెట్ వర్గాలు నిశితంగా పరిశీలించే వీలుంది. చివరి దశకు కార్పొరేట్ ఆరి్థక ఫలితాలు దేశీయ కార్పొరేట్ క్యూ1 ఫలితాల అంకం తుది దశకు చేరింది. ఐటీసీ, దివీస్ ల్యాబ్స్, వోడాఫోన్ ఐడియాలు నేడు (సోమవారం) తమ జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇదే వారంలో కేరియర్ పాయింట్స్, ఈజీ ట్రిప్ ప్లానర్స్, ఫ్యూచర్ కన్జూమర్, గ్లోబల్ స్పిరిట్స్, జీఎంఆర్ ఎయిర్‌పోర్ట్స్, హిందుస్థాన్ కాపర్, జాగరణ్ ప్రాకాశన్, మేఘ్మణి ఆర్గానిక్స్, పీసీ జ్యూవెలరీ, వోకార్డ్ కంపెనీలు ఫలితాలను వెల్లడించే జాబితాలో ఉన్నాయి. మారుతున్న ఎఫ్ఐఐల వైఖరి ఈ ఆగస్టు తొలివారంలో నికర అమ్మకందారులుగా నిలిచిన విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి మారింది. గడిచిన వారంలో రూ.3,200 కోట్ల ఈక్విటీలను కొనుగోలు చేశారు. మొత్తంగా దేశీయ మార్కెట్లో ఈ ఆగస్టు 11 తేదీ నాటికి రూ.3,272 కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టినట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని అనిశి్చతి, చైనా ఆరి్థక వ్యవస్థ మందగమన పరిస్థితులు మన మార్కెట్లో పెట్టుబడులకు ఉతమిస్తున్నాయి. అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుండటం కలిసొస్తుంది’’ అని మారి్నంగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాన్షు శ్రీవాస్తవ తెలిపారు. అంచనాలకు మించి నమోదైన జూన్ క్వార్టర్ ఫలితాలూ విదేశీ ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చాయనన్నారు. -
గ్లోబల్ ట్రెండ్, ఆర్బీఐ సమీక్షపై దృష్టి
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) పాలసీ సమీక్షను చేపట్టనుంది. బుధవారం(28) నుంచి మూడు రోజులపాటు సమావేశంకానున్న పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) శుక్రవారం(30న) నిర్ణయాలను ప్రకటించనుంది. ఆర్బీఐ అధ్యక్షతన ఎంపీసీ ధరల అదుపునకే ప్రాధాన్యతనిస్తూ గత మూడు సమీక్షల్లో వడ్డీ రేట్లను పెంచుతూ వచ్చింది. వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 1.4 శాతం హెచ్చించింది. దీంతో రెపో రేటు 5.4 శాతానికి చేరింది. ఈసారి సమీక్షలోనూ మరోసారి 0.5 శాతం రేటును పెంచే వీలున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. వెరసి రెపో రేటు మూడేళ్ల గరిష్టం 5.9 శాతానికి ఎగసే వీలుంది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఆర్బీఐ పరపతి నిర్ణయాలపై కన్నేయనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. డాలరు జోరు యూఎస్ ఫెడరల్ రిజర్వ్‌సహా పలు కేంద్ర బ్యాంకులు గత వారం వడ్డీ రేట్లను పెంచాయి. ద్రవ్యోల్బణ కట్టడికే కట్టుబడనున్నట్లు ప్రకటించిన ఫెడ్ ఫండ్స్ రేట్లను ఈ ఏడాది మరింత పెంచే వీలున్నట్లు సంకేతాలిచ్చింది. ఈ ప్రభావం ఆర్బీఐపైనా పడనున్నట్లు ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. కాగా.. ఫెడ్ అండతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ రెండు దశాబ్దాల గరిష్టం 111కు చేరింది. ట్రెజరీ ఈల్డ్స్ సైతం 3.5 శాతాన్ని దాటాయి. దీంతో దేశీ కరెన్సీ ఏకంగా కొత్త చరిత్రాత్మక కనిష్టం 81కు పడిపోయింది. వడ్డీ రేట్లు, రూపాయి మారకం వంటి అంశాలు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. కొత్త సిరీస్ షురూ సెప్టెంబర్ నెల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్టుల గడువు గురువారం(29) ముగియనుంది. వారాంతం నుంచీ అక్టోబర్ సిరీస్ ప్రారంభంకానుంది. దీంతో ట్రేడర్లు పొజిషన్లను కొత్త సిరీస్‌కు రోలోవర్ చేసుకునే అవకాశముంది. ఇది మార్కెట్లలో ఆటుపోట్లకు దారితీయవచ్చని స్టాక్ నిపుణులు అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్త వడ్డీ రేట్ల పెంపు కారణంగా ఆర్థిక మాంద్యం తలెత్తవచ్చన్న అంచనాలు కొద్ది రోజులుగా గ్లోబల్ మార్కెట్లను దెబ్బతీస్తున్న విషయం విదితమే. దీంతో దేశీ స్టాక్ మార్కెట్లను ఈ అంశాలు ప్రభావితం చేసే అవకాశముంది. పలు అంశాలు.. ఆర్బీఐ, ఎఫ్‌అండ్‌వో ముగింపు, గ్లోబల్ మార్కెట్ల ట్రెండ్‌తోపాటు.. ఈ వారం ఇన్వెస్టర్లు మరిన్ని అంశాలపై దృష్టి సారించనున్నారు. యూఎస్ ఆర్థిక వృద్ధి(జీడీపీ) గణాంకాలు, ముడిచమురు ధరలపై రష్యా యుద్ధ భయాల ప్రభావం, ఎఫ్‌పీఐల పెట్టుబడులు, రూపాయి మారకంలో హెచ్చుతగ్గులు తదితరాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు పలువురు నిపుణులు వివరించారు. ఎఫ్‌పీఐలు ఓకే పలు ఆటుపోట్ల మధ్య ఈ నెల(సెప్టెంబర్)లోనూ విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) దేశీ స్టాక్ మార్కెట్లపట్ల ఆసక్తి చూపుతున్నారు. 1–23 మధ్య మూడు వారాల్లో రూ. 8,638 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. గత నెల(ఆగస్ట్)లో ఏకంగా రూ. 51,200 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఎఫ్‌పీఐలు ఇటీవల కాస్త వెనకడుగు వేస్తున్నారు. గత వారం చివరి రెండు రోజుల్లోనూ ఎఫ్‌పీఐలు రూ. 2,500 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టడం గమనార్హం! డాలరు ఇండెక్స్ బలపడుతుండటంతో ఇకపై పెట్టుబడులు మందగించవచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నిపుణులు వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. అయితే 9 నెలల వరుస అమ్మకాల తదుపరి జులైలో తిరిగి ఎఫ్‌పీఐలు నికర ఇన్వెస్టర్లుగా నిలుస్తూ రూ. 5,000 కోట్ల విలువైన ఈక్విటీలను సొంతం చేసుకున్నారు! కాగా.. గతేడాది అక్టోబర్ మొదలు ఈ ఏడాది జూన్ వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్ల నుంచి రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మాంద్య ఆందోళనలు, డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ బలపడటం వంటి అంశాలు ఎఫ్‌పీఐలను వెనక్కి లాగుతున్నట్లు కొటక్ సెక్యూరిటీస్ నిపుణులు శ్రీకాంత్ చౌహాన్ తెలియజేశారు. -
మార్కెట్లకు ఫెడ్ దెబ్బ
ముంబై: ఆర్థికవేత్తల ఆందోళనలను నిజం చేస్తూ యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మూడోసారి 0.75 శాతం పెంచడంతో దేశీ స్టాక్ మార్కెట్లు డీలా పడ్డాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వడంతో సెన్సెక్స్ 337 పాయింట్లు క్షీణించింది. 59,120 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 89 పాయింట్ల వెనకడుగుతో 17,630 వద్ద స్థిరపడింది. ప్రస్తుతం 3.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేట్లను ఈ ఏడాది చివరికల్లా 4.4 శాతానికి చేర్చే వీలున్నట్లు ఫెడ్ సంకేతాలివ్వడంతో ప్రపంచ కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ 111ను దాటింది. ఫలితంగా రూపాయి ఇంట్రాడేలో 100 పైసలు కోల్పోయి చరిత్రాత్మక కనిష్టం 80.96కు చేరింది. వీటికితోడు ఉక్రెయిన్‌పై దాడికి రష్యా సైనిక బలగాలను పెంచుతుండటంతో సెంటిమెంటు దెబ్బతిన్నట్లు మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దీంతో మిడ్‌సెషన్‌కల్లా సెన్సెక్స్ 624 పాయింట్లు పతనమైంది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 17,723–17,532 పాయింట్ల మధ్య ఆటుపోట్లను చవిచూసింది. అయితే ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడంతో ఒక దశలో సెన్సెక్స్ నామమాత్ర లాభాల్లోకి ప్రవేశించడం గమనార్హం! మీడియా అప్ ఫెడ్ బాటలో ఇతర కేంద్ర బ్యాంకులూ కఠిన విధానాలను అవలంబించనున్న అంచనాలు ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెంచుతున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతో వర్ధమాన మార్కెట్లలో కరెన్సీలు, ఈక్విటీలు నీరసిస్తున్నట్లు తెలియజేశారు. ఎన్ఎస్ఈలో ప్రధానంగా బ్యాంకింగ్ 1.4 శాతం నీరసించగా.. మీడియా, ఎఫ్ఎంసీజీ, వినియోగ వస్తువులు, ఆటో రంగాలు 1.9–0.7 శాతం మధ్య బలపడ్డాయి. బ్లూచిప్స్‌లో పవర్‌గ్రిడ్, హెచ్డీఎఫ్సీ ద్వయం, యాక్సిస్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్, ఐసీఐసీఐ, బజాజ్ ఫిన్, శ్రీసిమెంట్, బీపీసీఎల్ 3–1.2 శాతం మధ్య నష్టపోయాయి. అయితే టైటన్, హెచ్‌యూఎల్, ఏషియన్ పెయింట్స్, మారుతీ, ఐషర్, అదానీ పోర్ట్స్, బ్రిటానియా, ఐటీసీ 2.8–1.4 శాతం మధ్య ఎగశాయి. చిన్న షేర్లు ఓకే.. తాజాగా చిన్న షేర్లకు డిమాండ్ నెలకొంది. బీఎస్ఈలో మిడ్, స్మాల్‌క్యాప్స్ 0.5–0.3 శాతం చొప్పున బలపడ్డాయి. నగదు విభాగంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 2,510 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 263 కోట్లు ఇన్వెస్ట్ చేశాయి. స్టాక్ హైలైట్స్ ► పట్టణీకరణతోపాటు వినియోగం పెరుగుతుండటంతో జాకీ బ్రాండ్ దుస్తుల కంపెనీ పటిష్ట ఫలితాలు సాధించనున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ఈ షేరు 4 శాతం జంప్‌చేసి రూ. 53,225 వద్ద ముగిసింది. ► రూ. 10 ముఖ విలువగల షేర్లను రూ. 1 ముఖ విలువగల 10 షేర్లుగా విభజిస్తుండటంతో ఐటీ సేవల కంపెనీ శాక్సాఫ్ట్ షేరు 12 శాతం దూసుకెళ్లి రూ. 1,278 వద్ద స్థిరపడింది. ► ప్రమోటర్ సంస్థ విల్మర్ తాజాగా వర్కింగ్ క్యాపిటల్ తదితర అవసరాలకు మద్దతునివ్వడంతో శ్రీ రేణుకా షుగర్స్ 6.5% ఎగసి 60.50 వద్ద క్లోజైంది. ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి ► ఒకేరోజు 83 పైసలు డౌన్ ► 80.79 వద్ద ముగింపు అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం ఒకేరోజు భారీగా 83 పైసలు బలహీనపడి, 80.79 రికార్డు కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన ఏడు నెలల్లో (ఫిబ్రవరి 24న 99 పైసలు పతనం) రూపాయి ఒకేరోజు ఈ స్థాయిలో బలహీనపడ్డం ఇదే తొలిసారి. అమెరికా ఫెడ్ రేటు పెంపుతోపాటు, రష్యా–ఉక్రెయిన్ భౌగోళిక ఉద్రిక్తతలు, ద్రవ్యోల్బణం భయాలు కూడా రూపాయిని వెంటాడుతున్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు తెలిపారు. బుధవారం రూపాయి ముగింపు 79.96. ట్రేడింగ్ ప్రారంభంలోనే 80.27 వద్ద ప్రారంభమైన రూపాయి విలువ ఒక దశలో ఆల్‌టైమ్ ఇంట్రాడేలో 80.96కు కూడా పడిపోయింది. ఫెడ్ ఫండ్ రేటు పెంపు నేపథ్యంలో ఇక ఇన్వెస్టర్ల దృష్టి ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ జపాన్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్‌పై ఉన్నట్లు ట్రేడర్లు పేర్కొన్నారు. మరోపక్క, అంతర్జాతీయ మార్కెట్లో ఆరు ప్రధాన కరెన్సీల ప్రాతిపదిక లెక్కించే డాలర్ ఇండెక్స్ 20యేళ్ల గరిష్టం 111 వద్ద ట్రేడవుతోంది. రూపాయి విలువ భారీ నష్టంతో 81.18 వద్ద ట్రేడవుతోంది. -
విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు నుంచి రూ.12,000 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో 1–16 వరకు దేశీ ఈక్విటీల్లోకి నికరంగా రూ.12,084 కోట్ల పెట్టుబడులను జోప్పించారు. యూఎస్ ఫెడ్ సహా అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్ల విషయంలో దూకుడు తగ్గించుకుంటాయన్న అంచనాలే నికర పెట్టుబడులకు కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆగస్ట్ నెలలోనూ ఎఫ్‌పీఐల నికర పెట్టుబడులు రూ.51,200 కోట్లుగా ఉండగా, జూలైలో రూ.5,000 కోట్లు కావడం గమనార్హం. వరుసగా తొమ్మిది నెలల పాటు భారత ఈక్విటీల్లో నికర విక్రయాల తర్వాత జూలై నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నికర పెట్టుబడుల బాట పట్టడం తెలిసిందే. అయితే, వడ్డీ రేట్ల పెరుగుదల, ద్రవ్యోల్బణం పెరుగుదల, భౌగోళిక ఉద్రిక్తతల వల్ల సమీప కాలంలో ఎఫ్‌పీఐ పెట్టుబడుల్లో ఆటుపోట్లు ఉండొచ్చని కోటక్ సెక్యూరిటీస్ ఈక్విటీ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అన్నారు. అనుకూలం యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు విషయంలో నిదానంగా వెళ్లొచ్చన్న అంచనాలతో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు మార్నింగ్‌స్టార్ ఇండియా రీసెర్చ్ హెడ్ హిమాన్షు శ్రీవాస్తవ పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కాస్త శాంతించడంతో భారత ఈక్విటీలు అనుకూలంగా ఉన్నట్టు చెప్పారు. పెట్టుబడుల అవకాశాన్ని కోల్పోవడం కంటే కొనసాగడమే మంచిదన్న అభిప్రాయంతో వారున్నట్టు తెలిపారు. ఇక ఈ నెలలో 16వ తేదీ వరకు ఎఫ్‌పీఐలు డెట్ మార్కెట్లో నికరంగా రూ.1,777 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. చదవండి: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లు: కొనే ముందు ఇవి గుర్తుపెట్టుకోండి, లేదంటే బేబుకి చిల్లే! -
ఫెడ్ రేట్ల నిర్ణయంపై మార్కెట్ దృష్టి
న్యూఢిల్లీ: దేశీ స్టాక్ మార్కెట్లలో ఈ వారం ట్రెండ్ ప్రధానంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ పాలసీ సమీక్షా నిర్ణయాలపై ఆధారపడి ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మంగళవారం(20) నుంచి రెండు రోజులపాటు సమావేశంకానున్న ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) బుధవారం వడ్డీ రేట్ల నిర్ణయాలు ప్రకటించనుంది. ద్రవ్యోల్బణం, ఉపాధి తదితర అంశాలపై సమీక్షను చేపట్టనుంది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, ఆర్థిక మాంద్యం తదితరాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫెడ్ నిర్ణయాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ధరల అదుపుపైనే దృష్టి పెట్టిన ఎఫ్‌వోఎంసీ వరుసగా మూడోసారి వడ్డీ రేట్లను భారీగా పెంచే వీలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బాటలో యూరోపియన్ కేంద్ర బ్యాంకు, బ్యాంక్ ఆప్ ఇంగ్లండ్, బ్యాంక్ ఆఫ్ జపాన్ తదితరాలు సైతం ఇదే బాటలో సాగనున్నట్లు భావిస్తున్నారు. పెట్టుబడుల ప్రభావం విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు సైతం ఈ వారం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా ముడిచమురు ధరలు, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో బలపడుతున్న డాలరు, ట్రెజరీ ఈల్డ్స్ వంటి అంశాలపైనా ఇన్వెస్టర్లు దృష్టి పెట్టనున్నట్లు తెలియజేశారు. యూఎస్ ద్రవ్యోల్బణంతోపాటు, 110కు చేరిన డాలరు ఇండెక్స్‌పట్ల గ్లోబల్ మార్కెట్లు ఆందోళనగా ఉన్నట్లు స్వస్తికా ఇన్వెస్ట్‌మార్ట్ రీసెర్చ్ హెడ్ సంతోష్ మీనా పేర్కొన్నారు. ప్రభావిత దేశీ అంశాలు కొరవడటంతో యూఎస్ ఫెడ్‌పైనే మార్కెట్లు కన్నేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ నిపుణులు అజిత్ మిశ్రా, శామ్కో సెక్యూరిటీస్ నిపుణులు అపూర్వ సేథ్ అభిప్రాయపడ్డారు. గత వారం వెనకడుగు యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో దేశీ ఈక్విటీ మార్కెట్లు గత వారం(12–16) భారీగా వెనకడుగు వేశాయి. సెన్సెక్స్ 952 పాయింట్లు పతనమై 58,841 వద్ద నిలవగా.. 303 పాయింట్లు క్షీణించిన నిఫ్టీ 17,531 వద్ద స్థిరపడింది. అన్నివైపులా అమ్మకాలు పెరగడంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్సులు సైతం 1.25 శాతం స్థాయిలో నీరసించాయి. అయితే స్థూల ఆర్థిక గణాంకాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ డాలరుసహా బాండ్ల ఈల్డ్స్ బలపడటంతో దేశీ స్టాక్ మార్కెట్లు విదేశీ ప్రభావంతో బలహీనపడినట్లు జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ పేర్కొన్నారు. ఎఫ్‌పీఐల దన్ను తొమ్మిది నెలల అమ్మకాల తదుపరి ఈ ఏడాది జులైలో పెట్టుబడుల బాట పట్టిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పీఐలు) ఈ నెలలో ఇప్పటివరకూ(1–16) దేశీ స్టాక్స్‌లో రూ. 12,084 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఆగస్ట్‌లో రూ. 51,200 కోట్ల పెట్టుబడులు పంప్‌చేయగా.. జులైలోనూ రూ. 5,000 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఈ నెలలో రుణ సెక్యూరిటీలలోనూ రూ. 1,777 కోట్లు ఇన్వెస్ట్ చేయడం గమనార్హం. కాగా.. గతేడాది చివర్లో అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడం ప్రారంభించిన ఎఫ్‌పీఐలు 2021 అక్టోబర్– 2022 జూన్ మధ్య కాలంలో రూ. 2.46 లక్షల కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే వడ్డీ పెంపు అంచనాల నడుమ ఇకపై ఎఫ్‌పీఐలు ఊగిసలాట ధోరణి ప్రదర్శించవచ్చని కొటక్ సెక్యూరిటీస్ రీసెర్చ్ హెడ్ శ్రీకాంత్ చౌహాన్ అభిప్రాయపడ్డారు. -
బలహీనంగా సెంటిమెంట్
ముంబై: ట్రేడింగ్ నాలుగు రోజులే జరిగే ఈ వారంలోనూ బలహీన సెంటిమెంట్ కొనసాగొచ్చని స్టాక్ నిపుణులు తెలిపారు. యూఎస్ ఫెడ్ రిజర్వ్ నిర్వహించిన జాక్సన్ హోల్ 45వ వార్షిక సమావేశంలో ఫెడ్ చైర్మన్ పావెల్ చేసిన ‘‘కఠినతర ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు’’ వ్యాఖ్యలతో సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యే వీలుందంటున్నారు. దేశీయంగా రిలయన్స్ ఏజీఎం, జూన్ క్వార్టర్ జీడీపీ, స్థూల ఆర్థిక గణాంకాలు, ఆటో అమ్మకాలు తదితర కీలక పరిణామాల నుంచి ఇన్వెస్టర్లు సంకేతాలను అందుకోవచ్చు. వీటితో పాటు సాధారణ అంశాలైన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు తీరుతెన్నులు, రూపాయి కదలికలు, కమోడిటీ, క్రూడాయిల్ ధరలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయోచ్చంటున్నారు. నష్టాలతో ప్రారంభానికి చాన్స్..? ద్రవ్యోల్బణ కట్టడే తమ తొలి కర్తవ్యమని, ఇందుకు కోసం వచ్చే కొద్ది నెలల్లో మరింత దూకుడుగా వడ్డీ రేట్ల పెంపు తప్పదంటూ శుక్రవారం జాక్సన్ హోల్లో జరిగిన వార్షిక సమావేశంలో ఫెడ్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ స్పష్టం చేశారు. ఫెడ్ చీఫ్ ‘‘కఠినతర ద్రవ్య విధాన వైఖరి కొనసాగింపు’’ వ్యాఖ్యలతో శుక్రవారం యూఎస్ నాస్డాక్ ఇండెక్స్ 4%, ఎస్అండ్పీ500 సూచీ మూడున్నర శాతం నష్టపోయాయి. ఆర్థిక అగ్రరాజ్యపు మార్కెట్ భారీ పతనం నుంచి దేశీయ మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలు అందుకొని నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్ నిఫ్టీ 215 పాయింట్లు పతనమై 17,444 వద్ద స్థిరపడింది. రిలయన్స్ ఏజీఎం సమావేశం దేశీయ అతిపెద్ద కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 45వ వార్షిక సమావేశం సోమవారం(నేడు) మధ్యాహ్నం రెండు గంటలకు జరగనుంది. ఏజీఎం వేదికగా కంపెనీ సీఎండీ ముఖేశ్ అంబానీ ప్రసంగాన్ని దలాల్ స్ట్రీట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలించనున్నాయి. ముఖ్యంగా 5జీ సేవల ప్రారంభం, రెన్యూవబుల్ ఎనర్జీ బిజినెస్ ప్రణాళికలతో పాటు టెలికాం(జియో), రిటైల్ వ్యాపారాల పబ్లిక్ ఇష్యూలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసిక జీడీపీ డేటాతో పాటు జూలై ద్రవ్యోల్బణ లోటు, మౌలిక రంగ గణాంకాలు బుధవారం(ఆగస్టు 31న వెల్లడి కానున్నాయి. మరసటి రోజు ఆగస్టు నెల వాహన విక్రయ గణాంకాలతో పాటు అదే నెల తయారీ రంగ డేటా కూడా విడుదల అవుతుంది. అలాగే శుక్రవారం ఆర్బీఐ ఆగస్టు 26 తేదీతో ముగిసిన ఫారెక్స్ నిల్వల డేటా, ఇదే నెల 12వ తేదీతో ముగిసిన డిపాజిట్– బ్యాంక్ రుణ వృద్ధి డేటాను వెల్లడించనుంది. దేశీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులను ప్రతిబింబించేసే ఈ స్థూల గణాంకాలను మార్కెట్ వర్గాలు క్షుణ్ణంగా పరిశీలిస్తాయి. ఈ వారంలోనూ ట్రేడింగ్ 4 రోజులే.. వినాయక చవితి సందర్భంగా బుధవారం (ఆగస్టు 31) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్చంజీలు పనిచేయవు. అయితే కమోడిటీ, ఫారెక్స్ మార్కె ట్లు్ల ఉదయం సెషన్లో మాత్రమే సెలవును పాటి స్తాయి. సాయంత్రం సెషన్లో ట్రేడింగ్ జరుగుతుంది. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. మార్కెట్లు తిరిగి గురువారం యధావిధిగా ప్రారంభమవుతాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు అంచనాలతో పాటు గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో గతవారం మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే కీలక పరిణాలేవీ లేకపోవడం కూడా సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపింది. ఐటీ, ఫార్మా, ఆర్థిక, ఎఫ్ఎంసీజీ, ఆటో షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 812 పాయింట్లు, నిఫ్టీ 200 పాయింట్లను కోల్పోయాయి. ‘‘జూన్ కనిష్ట స్థాయిల నుంచి భారీ ర్యాలీ తర్వాత బుల్స్ కాస్త నెమ్మదించాయి. అంతర్జాతీయంగా డాలర్ ఇండెక్స్ 108 స్థాయిపై, బ్రెంట్ క్రూడాయిల్ ధర 100 డాలర్లపైకి చేరుకున్నాయి. ఇటీవల వెల్లడైన ప్రపంచ స్థూల ఆర్థిక గణాంకాలు నిరాశపరిచిన తరుణంలో సూచీలు మరికొంత స్థిరీకరణకు లోనుకావచ్చు. అమ్మకాలు కొనసాగితే 17,300 వద్ద తొలి మద్దతుని, ఈ స్థాయిని కోల్పోయితే 17,000 వద్ద మరో తక్షణ మద్దతు స్థాయి లభించొచ్చు. ఎగువ స్థాయిలో 17,800 వద్ద నిరోధాన్ని చేధించాల్సి ఉంటుంది’’ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ సిద్దార్థ ఖేమా తెలిపారు. కొనసాగుతున్న విదేశీ ఇన్వెస్టర్ల బుల్లిష్ వైఖరి దేశీయ ఈక్విటీల పట్ల విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) బుల్లిష్ వైఖరిని కొనసాగిస్తున్నారు. ఈ ఆగస్టులో ఇప్పటి వరకు(1–26 తేదీల మధ్య) రూ.49,250 కోట్లను భారత మార్కెట్లోకి మళ్లించారు. ప్రస్తుత ఏడాదిలో ఎఫ్‌పీఐలు పెట్టిన అత్యధిక మొత్తం ఇదే కావడం విశేషం. కంపెనీల జూన్ త్రైమాసికపు ఆర్థిక ఫలితాలతో పాటు స్థూల ఆర్థిక గణాంకాలు మెప్పించడంతో ఎఫ్‌పీఐలు భారత మార్కెట్లో తిరిగి కొనుగోళ్లు చేపడుతున్నారని నిపుణులు తెలిపారు. ఆర్థిక, క్యాపిటల్ గూడ్స్, ఎఫ్ఎంసీజీ, టెలికాం షేర్లను కొనేందుకు అధికాసక్తి చూపుతున్నారు. ‘‘ద్రవ్యోల్బణ కట్టడికి కీలక వడ్డీ రేట్ల పెంపు తప్పదని ఫెడ్ చైర్మన్ పావెల్ ప్రకటన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు సవాలుగా మారింది. రానున్న నెలల్లో కమోడిటీ ధరలు, భౌగోళిక ఉద్రిక్తతలు, కార్పొరేట్ త్రైమాసిక ఫలితాలు, ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్ల పెంపు వైఖరి తదితర అంశాలకు అనుగుణంగా విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను కొనసాగించవచ్చు’’ అని ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్ గోల్‌టెల్లర్ వ్యవస్థాపక సభ్యుడు వివేక్ బంకా వెల్లడించారు. -
కొనసాగుతున్న ఎఫ్‌పీఐ విక్రయాలు
న్యూఢిల్లీ: డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింతగా పెంచే అవకాశాల నేపథ్యంలో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ మార్కెట్లలో విక్రయాలు కొనసాగిస్తున్నారు. మే నెలలో ఇప్పటివరకూ రూ. 39,000 కోట్ల మేర అమ్మకాలు జరిపారు. క్రూడాయిల్ ధరలు భారీ స్థాయిలో కొనసాగుతుండటం, ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్యపరపతి విధానాలు అమలు కానుండటంతో భారత్‌లోకి విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు రావడంలో ఒడిదుడుకులు తప్పకపోవచ్చని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ఈక్విటీ రీసెర్చ్–రిటైల్) శ్రీకాంత్ చౌహాన్ తెలిపారు. ‘ఇటీవలి కాలంలో ఎఫ్‌పీఐల విక్రయాలు ఒక స్థాయికి చేరినట్లుగా కనిపిస్తోంది. దేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (డీఐఐ), రిటైల్ ఇన్వెస్టర్లు దీటుగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఇకపైనా గరిష్ట స్థాయుల్లో ఎఫ్‌పీఐలు అమ్మకాలు కొనసాగించవచ్చు. అయితే, డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఆ ప్రభావం కొంత తగ్గగలదు‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయ్ కుమార్ పేర్కొన్నారు. భారత్‌తో పాటు తైవాన్, దక్షిణ కొరియా, ఇండొనేషియా, ఫిలిప్పీన్స్ వంటి ఇతర వర్ధమాన దేశాల్లో కూడా ఎఫ్‌పీఐలు విక్రయాలు కొనసాగించారు. ఇప్పటివరకూ రూ. 1.66 లక్షల కోట్లు వెనక్కి.. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ ఏడాది (2022)లో ఇప్పటివరకు రూ. 1.66 లక్షల కోట్ల పెట్టుబడులను ఈక్విటీల నుంచి వెనక్కి తీసుకున్నారు. మార్కెట్ కరెక్షన్‌కి లోను కావడంతో ఏప్రిల్ తొలి వారంలో ఎఫ్‌పీఐలు కాస్త కొనుగోళ్లపై ఆసక్తి చూపారు. రూ. 7,707 కోట్లు ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేశారు. కానీ మళ్లీ ఆ తర్వాత వారాల్లో భారీగా అమ్మకాలకు దిగారు. మే 2–27 మధ్య కాలంలో రూ. 39,137 కోట్ల మేర విక్రయించారు. ఇదే సమయంలో డెట్ మార్కెట్ నుంచి ఎఫ్‌పీఐలు రూ. 6,000 కోట్లు వెనక్కి తీసుకున్నారు. మే నెలలో మరో రెండు ట్రేడింగ్ సెషన్లు మిగిలి ఉన్నాయి. ‘భారత్‌లో వేల్యుయేషన్లు అధిక స్థాయిలో ఉండటం, అమెరికాలో బాండ్ ఈల్డ్‌లు .. డాలర్ మారకం విలువ పెరుగుతుండటం, అక్కడ మాంద్యం భయాలతో వడ్డీ రేట్లను పెంచుతుండటం వంటి అంశాలే ఎఫ్‌పీఐ అమ్మకాలకు కారణం‘ అని విజయ్ కుమార్ వివరించారు. అధిక ద్రవ్యోల్బణం వల్ల కార్పొరేట్ల లాభాలు తగ్గొచ్చని, వినియోగదారులు ఖర్చు పెట్టడం తగ్గించవచ్చన్న ఆందోళన కూడా ఇన్వెస్టర్లను అమ్మకాలకు పురిగొల్పుతోందని మార్నింగ్‌స్టార్ ఇండియా అసోసియేట్ డైరెక్ట్ర హిమాన్షు శ్రీవాస్తవ వివరించారు. వీటితో పాటు రష్యా–ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగనుండటం కూడా ప్రపంచ దేశాల ఆర్థిక వృద్ధిని దెబ్బతీసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశీయంగాను ద్రవ్యోల్బణం.. దాన్ని కట్టడి చేసేందుకు ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుండటం, ఆర్థిక వృద్ధిపై దాని ప్రభావాలు మొదలైన వాటిపై కొంత ఆందోళన నెలకొందని తెలిపారు. -
అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్ష, వడ్డీ రేటును!
న్యూయార్క్: ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేటును మరోసారి పెంచింది. ధరల కట్టడి లక్ష్యంగా 0.5 శాతం హెచ్చించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు 0.75–1 శాతానికి చేరాయి. గత సమీక్షలో రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా 0.25 శాతమే పెంచినప్పటికీ.. ఈసారి మరింత కఠినంగా వ్యవహరించింది. కరోనా మహమ్మారి సంక్షోభం తదుపరి ఆర్థిక వ్యవస్థ గాడిన పడటంతో ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సరళతర విధానాలకు స్వస్తి పలుకుతూ వడ్డీ రేట్ల పెంపునకు మొగ్గు చూపుతోంది. నాలుగు దశాబ్దాల గరిష్టానికి చేరిన ద్రవ్యోల్బణం(సీపీఐ), ఉపాధి ఊపందుకోవడం వంటి అంశాల మద్దతుతో 9 ట్రిలియన్ డాలర్ల ఆస్తుల పోర్ట్‌ఫోలియోను జూన్ నుంచి తగ్గించుకోనుంది. -
ఫెడ్ వడ్డీ రేటు 0.25% పెంపు
వాషింగ్టన్: ముందస్తు సంకేతాలను నిజం చేస్తూ అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేటును 0.25 శాతంమేర పెంచుతున్నట్లు ప్రకటించింది. వెరసి ప్రపంచ ఫైనాన్షియల్ మార్కెట్లను ప్రభావితం చేయగల ఫెడ్.. 2018 తదుపరి మళ్లీ రేట్ల పెంపు బాట పట్టింది. రెండు రోజులపాటు నిర్వహించిన సమావేశంలో చివరికి ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) కఠిన విధానాలకే మొగ్గు చూపింది. కోవిడ్–19 ప్రభావం, రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ఫెడ్ పాలసీ సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయంతో ఫండ్స్ రేట్లు 0.25–0.5 శాతానికి చేరాయి. ఫిబ్రవరిలో ద్రవ్యోల్బణ వార్షిక రేటు 40 ఏళ్ల గరిష్టం 7.9 శాతానికి చేరడం ప్రతికూల అంశంకాగా.. నిరుద్యోగిత భారీగా తగ్గి 3.8 శాతానికి పరిమితం కావడంతో రేట్ల పెంపునకు అనువైన పరిస్థితులు ఏర్పడినట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీంతో 2.18 శాతానికి చేరిన 10ఏళ్ల ట్రెజరీ బాండ్ల ఈల్డ్స్ మరింత బలపడనున్నట్లు తెలియజేశారు. ఆర్థిక వ్యవస్థకు దన్నుగా ప్రతీ నెలా బాండ్ల కొనుగోలు ద్వారా వ్యవస్థలోకి భారీగా విడుదల చేస్తున్న నిధులను మార్చి నుంచి ఫెడ్ పూర్తిగా నిలిపివేయనున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలపడనుండగా.. పసిడి, స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేసే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. -
సవాళ్లను ఎదుర్కొనేందుకు సన్నద్ధం
న్యూఢిల్లీ: అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు సహా అంతర్జాతీయ పరిణామాల వల్ల తలెత్తే ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొనేందుకు భారత్ సర్వసన్నద్ధంగా ఉందని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీతో సమావేశంలో మంత్రి చెప్పారు. అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం తర్వాత భారత్ అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం మహమ్మారి అనంతరం ప్రపంచంలో పరిస్థితులు మారిపోయాయని, భారత్ ఈసారి అవకాశాలను జారవిడుచుకోకుండా పారిశ్రామిక రంగం చూడాలని ఆమె పేర్కొన్నారు. జీఎస్టీలోకి ఏటీఎఫ్‌పై చర్చ.. కాగా, విమాన ఇంధనాన్ని (ఏటీఎఫ్) వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) పరిధిలోకి చేర్చే అంశాన్ని జీఎస్టీ కౌన్సిల్ తదుపరి సమావేశంలో చర్చించనున్నట్లు అసోచాం సమావేశంలో నిర్మలా సీతారామన్ చెప్పారు. మరోవైపు, బ్యాంకింగ్‌పరంగా సహకారం లభించేలా ఏవియేషన్‌కు పరిశ్రమ హోదా ఇవ్వాలన్న విజ్ఞప్తిపై బ్యాంకులతో మాట్లాడతామని ఆమె చెప్పారు. పెట్టుబడులకు ఆహ్వానం... వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో చేసిన ప్రతిపాదనల ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలని సీతారామన్ సూచించారు. వృద్ధి వేగం పుంజుకునేలా సత్వరం పెట్టుబడులను పెంచడంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. పరిశ్రమ వర్గాల సమాఖ్య సీఐఐ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు
ముంబై: కీలక వడ్డీరేట్ల పెంపు మార్చిలో ఉంటుందనే అమెరికా ఫెడ్ రిజర్వ్ సంకేతాలతో గురువారం ఈక్విటీ మార్కెట్లు బేర్మన్నాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగడం దేశీయ మార్కెట్‌పై మరింత ఒత్తిడిని పెంచాయి. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భౌగోళిక ఉద్రిక్తతలతో సప్లై అవాంతరాలు నెలకొని ఎనిమిదేళ్ల తర్వాత బ్యారెల్ క్రూడాయిల్ ధర 90 డాలర్లను తాకింది. డాలర్ విలువ ఐదు వారాల గరిష్టానికి చేరింది. ఈ అంశాలు సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఫలితంగా సెన్సెక్స్ 581 పాయింట్లు నష్టపోయి 57,277 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 168 పాయింట్లను కోల్పోయి 17,110 వద్ద నిలిచింది. ఐటీ, ఫార్మా షేర్లలో భారీ ఎత్తున లాభాల స్వీకరణ జరిగింది. ద్వితీయార్థంలో బ్యాంకింగ్ షేర్లు భారీగా రాణించాయి. ఆటో, మీడియా షేర్లలో చెప్పుకోదగిన కొనుగోళ్లు కనిపించాయి. సెన్సెక్స్ సూచీలో తొమ్మిది షేర్లు మాత్రమే లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.6,267 కోట్ల షేర్లను అమ్మేయగా.., డీఐఐలు రూ.2,881 కోట్ల షేర్లను కొన్నారు. సూచీలు ఒకశాతం నష్టపోవడంతో ఇన్వెస్టర్లు ఒకరోజులో రూ.2.81 లక్షల కోట్ల సంపదను కోల్పోయాయి. తద్వారా బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ రూ.2,59 లక్షల కోట్లకు దిగివచ్చింది. నష్టాలను పరిమితం చేసిన బ్యాంకింగ్ సూచీలు భారీ నష్టంతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 541 పాయింట్ల నష్టంతో 57,317 వద్ద, నిఫ్టీ 216 పాయింట్లు పతనమై 17,062 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఒక దశలో సెన్సెక్స్ 1419 పాయింట్లు కోల్పోయి 56,439 వద్ద, నిఫ్టీ 411 పాయింట్లు నష్టపోయి 16,867 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. అయితే మిడ్ సెషన్ నుంచి బ్యాంకింగ్ షేర్లకు అనూహ్య కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు కోలుకున్నాయి. ఫలితంగా సెన్సెక్స్ నష్టాలు (–)1,419 పాయింట్ల నుంచి (–)581కు, నిఫ్టీ (–) నష్టాలు 411 పాయింట్ల నుంచి (–)167 పరిమితయ్యాయి. కాగా డాలర్ మారకంలో రూపాయి విలువ 31 పైసలు బలహీనపడి 75.09 వద్ద ముగిసింది. ఐపీవో బాటలో బోట్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ బోట్ మాతృ సంస్థ ఇమేజిన్ మార్కెటింగ్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు వీలుగా సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసింది. తద్వారా రూ. 2,000 కోట్లు సమీకరించే యోచనలో ఉంది. -
కార్పొరేట్ ఫలితాలు, ఫెడ్ పాలసీలే కీలకం
ముంబై: కంపెనీల తొలి త్రైమాసిక ఫలితాలు, అమెరికా ఫెడ్ రిజర్వ్ పాలసీ నిర్ణయాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకమని నిపుణులు భావిస్తున్నారు. ప్రపంచ పరిమాణాలు, విదేశీ ఇన్వెస్టర్ల వైఖరి, కోవిడ్ డెల్టా వేరియంట్ వైరస్ వ్యాప్తి తదితర అంశాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. జూలై డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు గురువారం ముగియనున్న నేపథ్యంలో సూచీలు తడబాటుకు లోనయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు రూపాయి విలువ, క్రూడాయిల్ కదలికలపైనా ఇన్వెస్టర్లు దృష్టిసారించవచ్చని స్టాక్ నిపుణులు చెబుతున్నారు. డెల్టా వేరియంట్ కేసుల అనూహ్య పెరుగుదల, ఆర్థిక వృద్ధి ఆందోళనలతో గతవారం నాలుగురోజుల ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఆటో, బ్యాంకింగ్, విద్యుత్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవడంతో సెన్సెక్స్ 164 పాయింట్లు, నిఫ్టీ 67 పాయింట్లు నష్టపోయాయి. అయితే అదేవారంలో విడుదలైన కార్పొరేట్ క్యూ1 ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాలను మెప్పించడంతో సూచీల నష్టాలు పరిమితమయ్యాయి. ‘‘యూఎస్, యూరప్ మార్కెట్లు జీవితకాల గరిష్టాల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. దేశీయ బెంచ్‌మార్క్ సూచీలు సైతం ఆల్‌టైం హైకి చేరువలో కదలాడుతున్నాయి. బ్యాంకింగ్ షేర్లు రాణిస్తే సూచీలు సరికొత్త రికార్డులను నమోదు చేయవచ్చు. తర్వాత గరిష్ట స్థాయిల్లో కొంత స్థిరీకరణ జరగవచ్చు. సాంకేతికంగా నిఫ్టీ 15,900 వద్ద కీలకమైన నిరోధాన్ని కలిగి ఉంది. ఈ స్థాయిని అధిగమిస్తే 16200 స్థాయి వద్ద మరో ప్రధాన అవరోధాన్ని పరీక్షిస్తుంది. దిగువస్థాయిలో 15,800 వద్ద బలమైన మద్దతుస్థాయిని కలిగిఉంది’’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్స్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమా అభిప్రాయపడ్డారు. అందరి చూపు ఫెడ్ సమావేశం వైపే... అగ్ర రాజ్యం అమెరికా సెంట్రల్ బ్యాంక్ యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం మంగళవారం(జూన్ 27న) ప్రారంభమవుతుంది. ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ తీసుకున్న నిర్ణయాలను ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ బుధవారం(28న)రోజున ప్రకటిస్తారు. కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగవచ్చు. అయితే బాండ్ల కొనుగోలు, ఆర్థిక వ్యవస్థ పనితీరుపై పావెల్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనని ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు ఆసక్తి ఎదురుచూస్తున్నాయి. ఎఫ్అండ్ఓ ముగింపునకు ముందు అప్రమత్తత ఈ గురువారం జూలై సీరీస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్(ఎఫ్అండ్ఓ) డెరివేటివ్‌ల ముగింపు జరగనుంది. ఆగస్ట్ సిరీస్‌కు ట్రేడర్లు తమ పొజిషన్లను స్కోర్ ఆఫ్ చేసుకునే అవకాశముంది. ఈ నేపథ్యంలో ట్రేడర్లు అప్రమత్తతతో మార్కెట్ కొంత ఒడిదుడకులకు లోనుకావచ్చు. గురువారం తత్వ చింతన్ ఫార్మా లిస్టింగ్ ... స్పెషాలిటీ కెమికల్స్ తయారీ కంపెనీ తత్వ చింతన్ షేర్లు గురువారం ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. ఐపీఓ ఈ జూలై 16–20 తేదీల మధ్య పూర్తి చేసుకుంది. షేరుకి రూ. 1,073–1,083 ధరల శ్రేణిలో చేపట్టిన ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 500 కోట్లు సమకూర్చుకుంది. ఇష్యూలో భాగంగా కంపెనీ 32,61,882 షేర్లను విక్రయానికి ఉంచగా.., 58.83 కోట్ల షేర్ల కోసం దరఖాస్తులు వచ్చాయి. 180 రెట్లు అధికంగా సబ్స్క్రయిబ్ అయ్యింది. ఇష్యూ ధర రూ.1,083తో పోలిస్తే గ్రే మార్కెట్లో రూ.1,000 ప్రీమియం పలుకుతోంది. దీనిబట్టి ఇష్యూ లిస్టింగ్ రోజు 92% లాభాల్ని పంచవచ్చని తెలుస్తోంది. ఇదే వారంలో రెండు ఐపీఓలు రెండు కంపెనీలు ఇదే వారంలో ఐపీఓ ద్వారా నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. గ్లెన్‌మార్క్ లైఫ్ సైన్సెస్ ఐపీఓ జూన్ 27 ప్రారంభమై, ఇదే నెల 29న ముగుస్తుంది. షేరుకి ధరల శ్రేణి రూ.695–720గా నిర్ణయించి ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం రూ. 1,513.6 కోట్లను సమకూర్చుకోనుంది. మరో కంపెనీ రోలాక్స్ రింగ్స్ ఇష్యూ 28–30 తేదీల మధ్య జరనుంది. ఐపీఓలో భాగంగా కంపెనీ రూ.56 కోట్ల తాజా షేర్లను జారీ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ పద్ధతిలో 75 లక్షల షేర్లను అమ్మకానికి పెట్టింది. కీలక దశలో క్యూ1 ఆర్థిక ఫలితాలు స్టాక్ మార్కెట్ ముందుగా రిలయన్స్, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, యస్ బ్యాంక్‌ల క్యూ1 ఆర్థిక ఫలితాలకు స్పందించాల్సి ఉంటుంది. ఈ మూడు ప్రధాన కంపెనీలు గతవారాంతంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వారంలో బ్యాంకింగ్, ఆటో, ఐటీ, రియల్టీ రంగాలకు చెందిన 380 కంపెనీలు తమ క్యూ1 ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇందులో యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఎల్అండ్టీ, టాటా మోటార్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, నెస్లే, మారుతీ, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, బ్రిటానియా, యూపీఎల్, ఐఓసీలతో సహా నిఫ్టీ 50 ఇండెక్స్‌లోని కంపెనీలున్నాయి. జూన్ క్వార్టర్ ఫలితాల ప్రకటన నేపథ్యంలో స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. ఆగని విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ఆగడం లేదు. ఈ జూలై 1–23 తేదీల మధ్య రూ.5,689 కోట్ల షేర్లను విక్రయించినట్లు ఎక్సే్చంజీ గణాంకాలు చెబుతున్నాయి. షేర్ల వ్యాల్యూయేషన్లు, యూఎస్ కరెన్సీ డాలర్ విలువ, క్రూడాయిల్ ధరలు పెరిగిపోవడంతో స్వల్పకాలిక రిస్క్ దృష్ట్యా మన ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకొంటున్నారు. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ పోటు
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వెల్లడించిన విధాన పరపతి నిర్ణయాలు ఈక్విటీ మార్కెట్లను నిరాశపరిచాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి 76 పైసల పతనం నుంచీ ప్రతికూల సంకేతాలు అందాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 52,323 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 76 పాయింట్లు నష్టపోయి 15,691 వద్ద నిలిచింది. సూచీలకిది రెండోరోజూ నష్టాల ముగింపు. ఫెడ్ విధాన కమిటీ బుధవారం రాత్రి పాలసీ నిర్ణయాలు ప్రకటించింది. అందరూ ఊహించినట్లే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. అయితే 2024 తొలినాళ్లలో పెంచుతారని భావించిన వడ్డీరేట్లను 2023లోనే పెంచే అవకాశం ఉందనే సంకేతాలను ఇచ్చింది. నెలకు 120 బిలియన్ డాలర్ల విలువైన బాండ్లను కొంటామని తెలిపింది. ఫెడ్ అనూహ్య నిర్ణయాలతో డాలర్, బాండ్ ఈల్డ్స్ పెరిగి ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉదయం సెన్సెక్స్ 380 పాయింట్లు నష్టంతో 52,122 వద్ద, నిఫ్టీ 120 పాయింట్ల నష్టంతో 15,648 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఆరంభ నష్టాలను పూడ్చుకోగలింది. యూరప్ మార్కెట్ల నష్టాల ప్రారంభం ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని దెబ్బతీసింది. చివర అరగంటలో అమ్మకాలు మరోసారి వెల్లువెత్తడంతో సూచీల నష్టాల ముగింపు ఖరారైంది. ఒక్క ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల్లో అమ్మకాలు జరిగాయి. రూపాయి పతనం ఐటీ షేర్లకు కలిసొచ్చింది. అత్యధికంగా బ్యాంకింగ్ షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.880 కోట్ల షేర్లను అమ్మారు. దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ. 45 కోట్ల షేర్లను కొన్నారు. చదవండి: వేల కోట్ల నష్టం: అదానీ గ్రూప్ సీఎఫ్ఓ స్పందన -
మార్కెట్‌కు ఫెడ్ జోష్..!
ముంబై: కీలక వడ్డీరేట్లపై సరళతర ధోరణికే కట్టుబడి ఉన్నట్లు అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటనతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు రాణించడం మన మార్కెట్‌కు కలిసొచ్చింది. ఫలితంగా ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్థిరమైన కొనుగోళ్లతో సూచీలు వరుసగా ఐదురోజూ లాభాల్లో ముగిశాయి. అలాగే కొత్త రికార్డుల నమోదును కొనసాగించాయి. సెన్సెక్స్ 224 పాయింట్లు లాభంతో 46,890 వద్ద సిర్థపడింది. నిఫ్టీ సైతం 58 పాయింట్లు బలపడి 13,741 వద్ద నిలిచింది. కరోనా సంక్షోభం నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పట్టిన సంకేతాలు కనిపించడం, పలు దేశాల్లో కోవిడ్–19 వ్యాక్సిన్‌కు అనుమతినివ్వడం, దేశీయ ఈక్విటీల్లోకి ఎఫ్ఐఐల పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం లాంటి సానుకూలాంశాలు మార్కెట్ సెంటిమెంట్‌ను బలపరిచాయి. ఆర్థిక, ప్రైవేట్ రంగ బ్యాంక్, ఫార్మా, రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెనెక్స్ ఇంట్రాడేలో 326 పాయింట్లు లాభపడి 46,992 వద్ద కొత్త జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 90 పాయింట్లు ర్యాలీ చేసి 13,773 వద్ద నూతన ఆల్‌టైం హైని నమోదు చేసింది. మెటల్, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఎఫ్ఎంసీజీ, ఆటో, మీడియా షేర్లలో స్వల్పంగా లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. సూచీలు కొత్త రికార్డు సృష్టిస్తున్నప్పటికీ.., ఇటీవల మధ్య, చిన్న తరహా షేర్లు స్తబ్ధుగా ట్రేడ్ అవుతున్నాయని నిపుణులు తెలిపారు. గురువారం రికార్డు ర్యాలీలో ఈ షేర్ల వాటా అత్యంత స్వల్పంగా ఉంది. ఈ తరుణంలో అప్రమత్తతతో కూడిన ట్రేడింగ్ అవసరమని వారు సూచించారు. ప్రపంచ ఈక్విటీలకు ఫెడ్ రిజర్వ్ బూస్టింగ్... అమెరికా ఫెడరల్ రిజర్వ్‌బ్యాంక్ ద్రవ్య పరపతి విధాన నిర్ణయాలు బుధవారం రాత్రి వెలువడ్డాయి. కరోనాతో పూర్తిగా కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థకు బాసటగా నిలిచే చర్యల్లో భాగంగా కీలక వడ్డీరేట్లను మార్చలేదు. నిర్దేశించుకున్న ద్రవ్యోల్బణ, ఉద్యోగ కల్పన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు ఆర్థిక వ్యవస్థ కోలుకునే వరకు సరళతరమైన విధానాలకే కట్టుబడి ఉంటామని ఫెడ్ తెలిపింది. వ్యవస్థలో ద్రవ్యతను పెంచేందుకు 12 బిలియన్ డాలర్ల విలువైన నెల బాండ్ల కొంటామని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఫెడ్ సులభతరమైన ద్రవ్య పరపతి విధాన ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు మరింత దూసుకెళ్లాయి. ఆసియాలో ప్రధాన దేశాల ఈక్విటీ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఇందులో జపాన్‌కు చెందిన నికాయ్ సూచీ 29 ఏళ్ల గరిష్ట స్థాయి చేరువలో ముగిసింది. యూరప్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ ర్యాలీ చేశాయి. అమెరికా సూచీల్లో నాస్డాక్ ఇండెక్స్ బుధవారం సరికొత్త గరిష్టం వద్ద నిలిచింది. ఉద్దీపన ప్యాకేజీ ఆమోదం లభించవచ్చనే ఆశలతో అమెరికా ఫ్యూచర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. బెక్టర్స్ ఫుడ్ ఐపీఓ హాంఫట్ 198 రెట్ల బిడ్లు బెక్టర్స్ ఫుడ్ స్పెషాలిటీస్ కంపెనీ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి విశేష స్పందన లభించింది. ఇష్యూ సైజుతో పోలిస్తే 198 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ఇందులో అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగం నుంచి 176.85 రెట్ల సబ్స్క్రిప్షన్ లభించగా.. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల నుంచి 620.86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం నుంచి 29.28 రెట్ల బిడ్లు దాఖలయ్యాయి. ప్రస్తుతం గ్రే మార్కెట్లో ఈ షేరు ధర రూ.220గా పలుకుతోంది. ఐపీఓ ద్వారా రూ.540 కోట్లు సమీకరించాలనేది కంపెనీ లక్ష్యం. -
పడేసిన ఫెడ్ !
అమెరికా ఫెడరల్ రిజర్వ్ అదనపు తాయిలాలను ప్రకటించకపోవడంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా గురువారం పతనమైంది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 14 పైసలు క్షీణించి 73.66కు చేరడం, రిలయన్స్, టీసీఎస్ వంటి ఇండెక్స్ షేర్లలో అమ్మకాలు జరగడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 323 పాయింట్లు పడి 38,980 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 88 పాయింట్లు నష్టపోయి 11,516 పాయింట్ల వద్ద ముగిశాయి. మరో మూడేళ్లు సున్నా స్థాయిలోనే.... కీలకమైన వడ్డీరేట్లు మరో మూడేళ్లపాటు సున్నా స్థాయిలోనే కొనసాగుతాయని అమెరికా ఫెడరల్ రిజర్వ్ సంకేతాలిచ్చింది. అదనపు ఉద్దీపన ప్యాకేజీని ఇవ్వకపోవడం, పైగా భవిష్యత్తు ఆర్థిక స్థితిగతుల అంచనాలపై తీవ్రమైన అనిశ్చితి నెలకొందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమి పావెల్ వ్యాఖ్యానించారు. ఈ ప్రతికూల వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను పడగొట్టాయి. ఆసియా మార్కెట్లు 1 శాతం మేర నష్టపోగా, యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. రోజంతా నష్టాలే.... ఆసియా మార్కెట్ల పతన ప్రభావంతో మన మార్కెట్ కూడా నష్టాల్లోనే మొదలైంది. రోజంతా నష్టాలు కొనసాగాయి. చివరి గంటలో అమ్మకాలు మరింత జోరుగా పెరిగాయి. చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయని, మార్కెట్ అనిశ్చితిగానే ఉంటుందని, ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ► బజాజ్ ఫిన్సర్వ్ షేర్ 2 శాతం నష్టంతో రూ.6,006 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► దాదాపు 150కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎస్ఆర్ఎఫ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మార్కెట్ నష్టపోయినా, 288 షేర్లు అప్పర్ సర్క్యూట్లను తాకాయి. రామ్‌కో సిస్టమ్స్, గంధిమతి అప్లయెన్సెస్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేర్ జోరు కొనసాగుతోంది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై, రూ.817ను తాకిన ఈ షేర్ చివరకు 2.3 శాతం లాభంతో రూ.808 వద్ద ముగిసింది. గత నాలుగు రోజుల్లో ఈ షేర్ 13 శాతం లాభపడింది. ► డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ షేర్ కూడా ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయి, రూ.4,845ను తాకింది. చివరకు 4 శాతం లాభంతో రూ.4,826 వద్ద ముగిసింది. ఒక్క రోజులో రూ.లక్ష కోట్లు ఆవిరి నష్టాల కారణంగా ఒక్క రోజులోనే ఇన్వెస్టర్ల పెట్టుబడుల విలువ రూ.1,03,248 కోట్ల మేర తగ్గిపోయింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ గురువారం ముగింపు నాటికి రూ.159,04,785 కోట్లుగా ఉంది. ‘‘మార్కెట్లు బుధవారం గడించిన లాభాలన్నింటినీ కోల్పోయాయి. బలహీన అంతర్జాతీయ సంకేతాలకు అనుగుణంగా రోజులో కనిష్టాల వద్ద ముగిశాయి. ఆర్థిక రికవరీ విషయమై యూఎస్ ఫెడ్ ఆందోళన వ్యక్తం చేయడం మన మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యేందుకు దారి చూపింది. బెంచ్ మార్క్ సూచీలు రోజులో పలు విడతలు రికవరీకి ప్రయత్నించినప్పటికీ ఎగువ స్థాయిల్లో లాభాల స్వీకరణ కారణంగా కనిష్టానికి చేరాయి’’ అని రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. ఆర్థిక రికవరీపై అనిశ్చితిని యూఎస్ ఫెడ్ వ్యక్తీకరించడం సెంటిమెంట్‌పై ప్రభావం చూపించినట్టు చాయిస్ బ్రోకింగ్ ఈడీ సుమీత్ బగాడియా సైతం తెలిపారు. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ జోష్!
వడ్డీరేట్ల విషయంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సరళతర విధానం కారణంగా ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. దీనికి మన దగ్గర షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు, వేల్యూ బయింగ్ కూడా జత కావడంతో మన మార్కెట్ కూడా గురువారం భారీగా లాభపడింది. గత మూడు రోజులుగా అంతంత మాత్రం లాభాలతో సరిపెట్టుకున్న సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలు సాధించాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ పుంజుకోవడం, రానున్న బడ్జెట్లో వ్యాపార వర్గాలకు అనుకూలమైన చర్యలు ఉంటాయనే అంచనాలు సానుకూల ప్రభావం చూపించాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్ 489 పాయింట్లు పెరిగి 39,602 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 140 పాయింట్లు ఎగసి 11,832 పాయింట్ల వద్ద ముగిశాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. ముడిచమురు ధరలు భగ్గుమన్నా... అమెరికాకు చెందిన డ్రోన్‌ను ఇరాన్ కూల్చేసిందన్న వార్తల కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా ప్రజ్వరిల్లుతాయనే ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ముడిచమురు ధరలు భగ్గుమన్నాయి. ఒక పీపా బ్రెంట్ ముడి చమురు ధర దాదాపు 3% పెరిగి 63.37 డాలర్లకు చేరింది. సాధారణంగా చమురు ధరలు పెరిగితే మన మార్కెట్ పడిపోతుంది. ఈసారి దీనికి భిన్నంగా జరిగింది. ముడిచమురు 3% పెరిగినా, డాలర్‌తో రూపాయి మారకం 23 పైసలు లాభపడటం కలసివచ్చింది. 703 పాయింట్ల రేంజ్లో సెన్సెక్స్... సెన్సెక్స్ నష్టాల్లో ఆరంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. బ్యాంక్, ఫార్మా, వాహన షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతల నివారణకు ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయన్న ఆశలూ సానుకూల ప్రభావం చూపించాయి. మహారాష్ట్రలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయన్న వార్తలు సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చాయి. ఇటీవల నష్టాలతో ధరలు తగ్గి ఆకర్షణీయంగా ఉన్న షేర్లలో వేల్యూబయింగ్ చోటు చేసుకుంది. మరో వారం రోజుల్లో జూన్ సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనుండటంతో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లూ జరిగాయి. ఒక దశలో 179 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ మరో దశలో 524 పాయింట్లు పెరిగింది. రోజంతా 703 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. జెట్ ఎయిర్వేస్ షేరు డబుల్... జెట్ ఎయిర్వేస్ భారీ లాభాలను సాధించింది. స్టాక్ మార్కెట్లో ఏ షేరూ ఏ రోజూ పెరగనంత స్థాయిలో జెట్ ఎయిర్వేస్ షేర్ పెరిగింది. ట్రేడింగ్ ఆరంభంలోనే ఈ షేర్ 18 శాతం నష్టంతో జీవిత కాల కనిష్ట స్థాయి, రూ.27కు పడిపోయింది. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్లతోఈ ఈ షేర్ పుంజుకుంది. ఇంట్రాడేలో 134 శాతం లాభంతో రూ.77కు ఎగసిన జెట్ ఎయిర్వేస్ షేర్ చివరకు 93 శాతం లాభంతో రూ.64 వద్ద ముగిసింది. గత 13 సెషన్లలో ఈ షేర్ దాదాపు 78 శాతం పతనమైంది. ఈ కంపెనీపై దివాలా ప్రక్రియ ప్రారంభించాలని ఎన్సీఎల్టీలో ఎస్బీఐ కేసు వేయడం తెలిసిందే. మరిన్ని విశేషాలు.. ► 31 సెన్సెక్స్ షేర్లలో నాలుగు షేర్లు–ఐటీసీ, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హిందుస్తాన్ యూనిలీవర్‌లు మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 27 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఇండియాబుల్స్ హౌసింగ్ షేర్ 8% ఎగసింది. ► యస్ బ్యాంక్ 11 శాతం లాభపడి రూ. 115 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ఆరంభంలో ఈ షేర్ రెండంకెల స్థాయి, రూ.98.75కి పడిపోయింది. ఈ షేర్ రెండంకెల స్థాయికి పడిపోవడం గత ఐదేళ్లలో ఇదే మొదటిసారి. అయితే షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల కారణంగా ఈ నష్టాల నుంచి ఈ షేర్ కోలుకుంది. రూ.1.75 లక్షల కోట్లు పెరిగిన ఇన్వెస్టర్ల సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాలతో ఇన్వెస్టర్ల సంపద రూ.1.75 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.1.75 లక్షల కోట్లు పెరిగి రూ.1,61,30,671 కోట్లకు పెరిగింది. ఫెడ్... రేట్ల తగ్గింపు సంకేతాలు! అమెరికా ఫెడరల్ రిజర్వ్ పాలసీ రేట్లను ప్రస్తుతమున్న 2.25–2.50 శాతం రేంజ్‌లోనే కొనసాగించాలని నిర్ణయించింది. రేట్ల విషయమై యథాతథ స్థితిని కొనసాగించినప్పటికీ, అనిశ్చిత పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వృద్ధి తోడ్పాటుకు తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. వివిధ పరిణామాల కారణంగా మందగమనం చోటు చేసుకోవడంతో అవసరమైతే, వచ్చే నెలలోనే రేట్లను అర శాతం మేర తగ్గించగలమని సంకేతాలు ఇచ్చింది. దాదాపు పదేళ్ల తర్వాత ఫెడ్ రేట్లను తగ్గించడానికి సిద్ధమవుతోంది. ఫెడ్ నిర్ణయాన్ని ఇతర దేశాల కేంద్ర బ్యాంక్‌లూ అనుసరించే అవకాశాలుండటంతో ప్రపంచ మార్కెట్లు లాభపడ్డాయి. ఫెడ్ రేట్లను తగ్గిస్తే, వృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యంగా భారత్‌కు విదేశీ నిధులు వెల్లువలా వస్తాయి. అందుకని ఫెడ్ నిర్ణయంతో మన మార్కెట్ భారీగా లాభపడింది. ఐదేళ్ల గరిష్టానికి పసిడి పరుగు న్యూఢిల్లీ/న్యూయార్క్: అంతర్జాతీ య ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ధర గురువారం పరుగులు పెట్టింది. ఒక దశలో ఔన్స్ (31.1గ్రా) ధర బుధవారం ముగింపుతో పోల్చిచూస్తే, 45 డాలర్ల లాభంతో 1,395 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. పసిడికి ఇది ఐదు సంవత్సరాల్లో గరిష్టస్థాయి. గతంలో పలు సార్లు పసిడి 1,360 డాలర్ల వద్ద తీవ్ర నిరోధాన్ని ఎదుర్కొంది. ఇప్పుడు ఈ స్థాయి దాటడంతో ఒక్కసారిగా 1,400 డాలర్ల వైపు పరుగుపెట్టింది. ఈ స్థాయి దాటితే మరో 50 డాలర్లకు పసిడి పెరుగుతుందన్న అంచనాలు ఉన్నాయి. పరుగుకు కారణం..: అమెరికాలో వృద్ధి రేటు మందగమనం, దీనితో అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్ ఫండ్ రేటు తగ్గుతుందన్న అంచనాలు (ప్రస్తుతం 2.25–2.50 శాతం) పసిడి పరుగుకు కారణంగా నిలిచాయి. అమెరికా వృద్ధి మందగమనం వార్తలతో డాలర్ ఇండెక్స్ స్పీడ్ తగ్గడం కూడా గమనార్హం. ఇక వాణిజ్యయుద్ధం వంటి అంశాలు ప్రపంచ వృద్ధి తీరును ఆందోళనలోకి నెడుతున్నాయి. ఆయా అంశాలు పసిడికి తక్షణ బలాన్ని ఇస్తున్నాయి. దేశంలో రూ. 1,000 అప్..: ఇక దేశంలోని మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్ చూస్తే, ఈ వార్త రాసే సమయానికి బుధవారం ముగింపుతో పోల్చితే 10 గ్రాముల బంగారం ధర రూ.1,000 లాభంతో రూ. 34,058 వద్ద ట్రేడవుతోంది. ప్రస్తుతం 69.44 వద్ద ఉన్న రూపాయి మరింత బలహీనపడితే, దేశంలో పసిడి పరుగు మరింత వేగంగా ఉండే అవకాశం ఉందని అంచనా.