
ఫెడ్ నిర్ణయంతో పుత్తడి జోరు
అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో పుత్తడి ధరలు పుంజుకుంటున్నాయి.
ముంబై: అమెరికా సెంట్రల్ బ్యాంక్- ఫెడరల్ రిజర్వ్ ప్రకటనతో పుత్తడి ధరలు పుంజుకుంటున్నాయి. వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించాలనే నిర్ణయంతో బులియన్ మార్కెట్ లో పసిడి ధరల జోరు పెంచాయి. నిన్నటి ధరలతో పోలిస్తే గురువారం స్థిరంగా ఉన్నాయి. మరోవైపు ఫెడ్ ప్రకటనతో అమెరికా కరెన్సీ డాలర్ బలహీనపడింది. ఈ పరిణామాలతో పుంజుకున్న పసిడి ధరలు రెండు వారాల గరిష్టాన్ని తాకాయి.
ప్రస్తుతం ఫెడ్ రేటు 0.25- 0.50 శాతం శ్రేణిలో నిలపడంతో ఫ్యూచర్స్ మార్కెట్ లో బంగార ధర 1.52శాతం లాభపడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో కూడా పాజిటివ్ ట్రెండ్ నెలకొంది. పది గ్రా. బంగారం 249 రూ. పైగా లాభపడి రూ. 31,235 దగ్గర ఉంది. అమెరికాలో బుధవారం నాటి మార్కెట్ లో ఔన్స్ బంగారం ధరం 1,338.7 డాలర్లుగా నమోదైంది.