భారతదేశంలో బంగారం ధర రోజు రోజుకు విపరీతంగా పెరుగుతోంది. 10 గ్రాముల బంగారం నేడు రూ. 78వేలు దాటేసింది. దిగుమతులు కొంత తగ్గడం, పెరిగిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారం ధరలు పెరగడానికి కారణమైందని కెడియా అడ్వైజరీ డైరెక్టర్ అజయ్ కెడియా పేరొన్నారు.
బంగారం ఇప్పుడు ఆల్‌టైమ్ గరిష్ట స్థాయికి చేరుకుంది. బుధవారం లెబనాన్‌పై ఇజ్రాయెల్ తీవ్రస్థాయి వైమానిక దాడుల తరువాత యూఎస్ అధ్యక్ష ఎన్నికల చుట్టూ ఉన్న అనిశ్చితి కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమైందని కెడియా అన్నారు.
యూఎస్ ట్రెజడీ దిగుబడులు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య.. బలమైన డాలర్ కారణంగా ధరలు అధిక స్థాయిల నుండి వెనక్కి తగ్గాయి. అయినప్పటికీ సురక్షితమైన బిడ్లు మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు, ముఖ్యంగా లెబనాన్‌లోని హిజ్‌బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో, క్షీణతను పరిమితం చేయడంలో దోహదపడింది.
ఇదీ చదవండి: ట్రైన్ టికెట్ అడ్వాన్స్ బుకింగ్‌లో కీలక మార్పు
భారతదేశంలో గోల్డ్ రేటు పెరగడానికి మరో కారణం ఏమిటంటే పండుగ సీజన్స్. దీపావళికి బంగారం కొంటే మంచిదని చాలామంది సెంటిమెంట్‌గా భావిస్తారు. దీంతో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంటుంది, ధరలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కూడా బంగారం ధరలకు ఆజ్యం పోసినట్లే అయింది. మొత్తం మీద పసిడి ధర ఆకాశాన్నంటేలా దూసుకెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment