దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరుగుదల బాటలో పయనిస్తున్నాయి. రెండు రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి రేట్లు నేడు (జూలై 2) స్వల్పంగా పెరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 24 క్యారెట్ల పసిడి తులం (10 గ్రాములు ) ధర రూ.100 పెరిగి రూ. 72,380 వద్దకు, అలాగే 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.100 ఎగిసి రూ.66,350 వద్దకు చేరాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల స్వర్ణం 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,500లకు, 24 క్యారెట్ల బంగారం రూ.110 ఎగిసి రూ.72,530 లకు చేరింది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల రేటు రూ.100 పెరిగి రూ.66,350, 24 క్యారెట్ల పసిడి రూ. 100 పెరిగి రూ. 72,380 వద్ద ఉన్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర అత్యంత స్వల్పంగా రూ.50 పెరిగి రూ.66,850 వద్ద, 24 క్యారెట్ల బంగారం రూ.50 పెరిగి రూ.72,930 లుగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.100 పెరిగి రూ.66,350, 24 క్యారెట్ల బంగారం రూ.100 పెరిగి రూ. 72,280 వద్ద కొనసాగుతున్నాయి.
భారీగా వెండి ధరలు
దేశవ్యాప్తంగా వెండి ధరల్లో పెరుగుదల కొనసాగుతోంది. నిన్నటి రోజున స్వల్పంగా పెరిగిన వెండి ధరలు ఈరోజు కాస్త భారీగానే ఎగిశాయి. హైదరాబాద్‌లో నేడు వెండి ధర కేజీకి రూ.800 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం ఇక్కడ కేజీ వెండి ధర రూ.95,500 లను తాకింది.
(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి)
Comments
Please login to add a commentAdd a comment