
4.25–4.5 శాతం వద్దే ఫండ్స్ రేట్లు
తాజా పాలసీ సమీక్షలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించేందుకే నిర్ణయించింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేట్లు మరోసారి 4.25–4.5 శాతంవద్దే కొనసాగనున్నాయి. ఛైర్మన్ జెరోమ్ పావెల్ అధ్యక్షతన రెండు రోజులపాటు సమావేశమైన ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) గత సమీక్షలోనూ యథాతథ పాలసీ అమలుకే ఓటు వేసిన సంగతి తెలిసిందే.
వివిధ దేశాలపై ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల విధింపు, వీటి కారణంగా యూఎస్‌లో స్టాగ్‌ఫ్లేషన్ పరిస్థితులు తలెత్తనున్నట్లు ఆర్థికవేత్తల అంచనాల నడుమ ఎఫ్‌వోఎంసీ ఆచితూచి అడుగేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. దీంతో ఫెడ్ నిర్ణయాల తదుపరి చైర్మన్ పావెల్ ప్రసంగంపై ప్రపంచ కేంద్ర బ్యాంకులు దృష్టిపెట్టనున్నట్లు తెలియజేశారు. అయితే ఆర్థికవేత్తలు ఊహిస్తున్నట్లు 2025లో వడ్డీ రేట్ల కోతలపై ఫెడ్ నుంచి స్పష్టమైన సంకేతాలు వెలువడకపోవచ్చని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: అక్కడ సంపాదించి ఇక్కడకు పంపిస్తున్నారు!
భారతదేశంలో ఆర్‌బీఐ గత మానిటరీ పాలసీ సమావేశంలో ఐదేళ్లలో మొదటిసారి రేటు తగ్గింపును అమలు చేసింది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6.25 శాతానికి చేర్చింది. ద్రవ్యోల్బణాన్ని ఆర్థిక వృద్ధితో సమతుల్యం చేయడమే ఈ చర్య లక్ష్యంగా తెలిపింది. అంతర్జాతీయ ద్రవ్య విధానాలు తరచూ భారత్ వంటి వర్ధమాన మార్కెట్లపై ఒత్తిడి పెంచుతున్నా స్థానికంగా ఆర్‌బీఐ నిర్ణయాలు కీలకంగా మారుతున్నాయి. ఫెడ్ తాజా నిర్ణయాల నేపథ్యంలో ఏప్రిల్ 7-9 వరకు జరిగే ఆర్‌బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో ఏమేరకు వడ్డీరేట్లపై చర్యలు తీసుకొంటారో మార్కెట్ వర్గాలు పరిశీలించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment