Fed cut
-
బంగారం: ఫెస్టివ్ సీజన్లో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో పసిడి రేట్లు కొనుగోలు దారులకు ఊరట నిస్తున్నాయి. బలపడుతున్న డాలర్ విలువ, ఫెడరల్ రిజర్వ్ భారీ వడ్డీ రేటు పెంపు అవకాశాల నడుమ బంగారానికి డిమాండ్ తగ్గింది. ఫలితంగా వరుసగా నాలుగో రోజు (సెప్టెంబర్ 16, 2022) బంగారం వెండి ధరలు పడిపోయాయి. దీంతో పసిడి ధర ఆరు నెలల కనిష్టానికి దిగి వచ్చింది. అయితే రానున్న ఫెస్టివ్ సీజన్, ముఖ్యంగా దీపావళికి నాటికి దేశంలో మరింత దిగి వచ్చే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. (Hero Motocorp: విడా ఈవీ,తొలి మోడల్ కమింగ్ సూన్) తాజాగా సెప్టెంబర్ 17న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 400కు పైగా తగ్గింది. ప్రస్తుతం 5 వేల వద్ద, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950 ఉంది. అలాగే ఉదయం వెండి కిలో ధర రూ.600 మేర దిగి వచ్చింది. ఇపుడు స్వల్పంగా పుంజుకుని కిలో 56,700 వద్ద ఉంది. ఇక గ్లోబల్‌గా నిరాశపరిచిన అమెరికా సీపీఐ డేటా తర్వాత, బంగారంలో అమ్మకాలు వెల్లువెత్తాయి. అలాగే ఆగస్ట్‌లో యూఎస్ ద్రవ్యోల్బణం 8.1 శాతంగానమోదైంది.దీంతో వచ్చే నెలలో జరగబోయే ఫెడ్ సమావేశంలో 100 బీపీఎస్ వడ్డీ రేటు పెంపుపై ఊహాగానాలు నెలకొన్నాయి. దీంతో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో బంగారం ధర 10 గ్రాములకి 1,187 (2.35 శాతం) పతనమై 49,334 స్థాయికి చేరింది. స్పాట్ మార్కెట్లో గోల్డ్ ధర శుక్రవారం 1,654డాలర్ల వద్ద 2 సంవత్సరాల కనిష్టాన్ని తాకింది.చివర్లోకాస్త పుంజుకుని ఔన్సుకు 1,674 డాలర్లుగా ఉంది. బంగారం ధర పతనానికి గల కారణాలపై ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ అనూజ్ గుప్తా మాట్లాడుతూ తాజా పరిణామాలతో పెట్టుబడిదారులు అమెరికా డాలర్ వైపు మళ్లుతున్నారని, యుఎస్ ఫెడ్ సమావేశం ముగిసేవరకు ఈ రెండు ట్రిగ్గర్లు ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలను ప్రభావితం చేస్తాయన్నారు. ఇదీ చదవండి: Johnson & Johnson: జాన్సన్ అండ్ జాన్సన్‌కు భారీ దెబ్బ, కోర్టును ఆశ్రయించిన సంస్థ -
రూ.600 పెరిగిన పసిడి
దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో గురువారం ఉదయం సెషన్లో పసిడి ఫ్యూచర్స్ ధర రూ.600 లాభపడింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర వారం గరిష్టానికి చేరుకోవడంతో దేశీయ పసిడి ఫ్యూచర్లకు డిమాండ్ పెరిగినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. నేడు ఎంసీఎక్స్‌లో ఆగస్ట్ కాంట్రాక్టు 10గ్రాముల పసిడి ధర రూ. 46,750 వద్ద మొదలైంది. మార్కెట్ ప్రారంభం నుంచే పసిడి ఫ్యూచర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో రూ.608లు లాభపడి రూ.47,234 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఉదయం 10గంటలకు నిన్నటి ముగింపు(రూ.46626)తో పోలిస్తే రూ.559లు పెరిగి రూ.47185 వద్ద ట్రేడ్ అవుతోంది. ఫెడ్ వడ్డీరేట్ల ప్రకటన కోసం ఎదురుచూపుల నేపథ్యంలో నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ ధర రూ.32 స్వల్ప నష్టంతో రూ. 46626 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా వారం గరిష్టానికి: అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర వారం గరిష్టాన్ని అందుకుంది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ నిన్నరాత్రి కీలకమైన వడ్డీరేట్ల రేట్లపై తన వైఖరి ప్రకటించింది. కోవిద్-19 వ్యాధి వ్యాప్తి నేపథ్యంలో వడ్డీరేట్లను యథాతథంగా సున్నా స్థాయిలోనే ఉంచుతున్నట్లు ఫెడ్ ఛైర్మన్ పావెల్ తెలిపారు. ఈ సందర్భంగా పావెల్ ఆర్థిక వృద్ధి, రికవరీ పై ఆందోళన వ్యక్తం చేశారు. పావెల్ నిరాశజనకమైన వాఖ్యలతో ఇన్వెసర్లు తమ పెట్టుబడులను రక్షణాత్మక సాధనమైన పసిడి ఫ్యూచర్లలోకి మళ్లించారు. ఫలితంగా ఆసియాలో నేటి ఉదయం ఔన్స్ పసిడి ఫ్యూచర్స్ ధర 30డాలర్లు లాభపడి 1,749.70డాలర్లను అందుకుంది. ఈ ధర పసిడికి వారం రోజుల గరిష్టస్థాయి కావడం విశేషం. -
ఫెడ్ నిర్ణయం కోసం పసిడి ఎదురుచూపులు
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తోంది. ఆసియాలో బుధవారం ఉదయం ట్రేడింగ్ సెషన్లో ఔన్స్ పసిడి ధర నిన్నటి ముగింపు(1,721.90 డాలర్లు)తో పోలిస్తే 1డాలరు స్వల్ప లాభంతో 1,722.90 వద్ద ట్రేడ్ అవుతోంది. భారత వర్తమాన కాల ప్రకారం నిన్నరాత్రి అమెరికాలో ఫెడ్ రిజర్వ్ పాలసీ సమావేశం ప్రారంభమైంది. నేడు ఫెడ్ వడ్డీరేట్లపై ఫెడ్ తన వైఖరిని ప్రకటించనుంది. సాధారణంగా వడ్డీరేట్లు పెరిగితే పసిడి ధర తగ్గుతుంది. ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు ఫెడ్ మరోసారి వడ్డీరేట్ల తగ్గింపునకే మొగ్గుచూపవచ్చనే కొందరు మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. దేశీయంగానూ అదే ధోరణి అంతర్జాతీయ ట్రెండ్‌కు తగ్గట్లుగానే దేశీయ ఎంసీఎక్స్ మార్కెట్లో బుధవారం పసిడి ధర స్థిరంగా ట్రేడ్ అవుతోంది. నేటి ఉదయం10 గంటలక 10గ్రాముల పసిడి ధర రూ.23ల స్వల్ప లాభంతో రూ.46617.00 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈక్విటీ మార్కెట్లో లాభాల స్వీకరణ, రూపాయి బలహీనతల కారణంగా నిన్న రాత్రి పసిడి ధర రూ.493ల లాభంతో రూ.46594 వద్ద ముగిసింది. -
ఫెడ్ ఎఫెక్ట్ : పుంజుకున్న రూపాయి
సాక్షి, ముంబై : కోవిడ్-19 విజృంభణ, ఆర్థిక ఆందోళన నేపథ్యంలో పెడరల్రిజర్వ్ వడ్డీరేటు కోతకు నిర్ణయించడంతో దేశీయ రూపాయికి బలమొచ్చింది. క్రూడ్ ధరలు ఎగిసి పడటంతో మంగళవారం కీలకమైన 73 స్థాయికి క్షీణించిన కరెన్సీ 16 నెలల కనిష్టానికి పడిపోయింది. 73.19 వద్ద ముగిసిన రూపాయి ఈ స్థాయినుంచి పుంజుకుని డాలరుమారకంలో రూపాయి 73.07 వద్ద ఆరంభమైంది. అనంతరం 34 పైసలు ఎగిసి రూ. 72.95ని తాకింది. ప్రస్తుతం 73.06 వద్దకొనసాగుతోంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు కోత పెట్టింది ఫెడ్. దీంతో డాలరు బాగా బలహీనపడింది. -
పసిడి పరుగో.. పరుగు! రూ.1200 జంప్
సాక్షి, ముంబై: ఆర్థిక మందగమనం, కరోనా కష్టాల నేపథ్యంలో సరళతర ద్రవ్య విధానాలు అవలంభించడానికి సంబంధించి మీమాంస తగదని అమెరికా సెంట్రల్ బ్యాంక్– ఫెడ్‌పై అధ్యక్షుడు ట్రంప్ సోమవారంనాటి విమర్శలు, దీంతో ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయంంతో పసిడి మళ్లీ భారీగా దూసుకెళ్లింది. ఈ వార్త రాసే సమయంలో(మంగళవారం రాత్రి 0.30కు) అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ నైమెక్స్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర 50 డాలర్ల పెరుగుదలతో 1,644 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నిజానికి వారం క్రితం ఏడేళ్ల గరిష్టం 1,691 డాలర్లకు చేరిన పసిడి గత వారం ముగిసేనాటికి 1,565 డాలర్ల వరకూ పడిపోయింది. రూపాయి...గరిష్టానికి 100 పైసలు దూరంలో.. ఇక అంతర్జాతీయ ధోరణికి తోడు, దేశంలో రూపాయి బలహీనత పసిడికి వరంగా మారుతోంది. మంగళవారం ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 43 పైసలు పడిపోయి, 16 నెలల కనిష్ట స్థాయి 73.19కి జారింది. 2018 అక్టోబర్ 9న రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. తాజా రూపాయి బలహీనత కూడా తోడు కావడంలో ఈ వార్త రాసే సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్లో పసిడి 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర సోమవారం ముగింపుతో పోల్చితే (రాత్రి 10.30 గంటల సమయంలో) రూ.1,289 లాభంతో రూ.43,245 వద్ద ట్రేడవుతోంది. ఇదే ధోరణి కొనసాగితే బుధవారం పలు పట్టణాల్లోని స్పాట్ మార్కెట్లలో పసిడి 10 గ్రాములు స్వచ్ఛత ధర రూ.44,000 దాటిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
బంగారం ‘బంగారమే’ : మళ్లీ పెరిగింది
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో పుత్తడి ధరలు ఎంతైనా బంగారం బంగారమే అన్న రేంజ్లో తిరిగి పుంజుకున్నాయి. నాలుగు రోజుల నష్టాలకు చెక్ పెట్టిన ధరలు సోమవారం మళ్లీ ర్యాలీ అయ్యాయి. దేశీయ మల్టీ కమోడిటీ మార్కెట్లో శుక్రవారం ముగింపుతో పోలిస్తే రూ.593 పెరిగి 10 గ్రాముల పసిడి రూ.41,829 వద్ద ట్రేడ్ అయింది. మునుపటి సెషన్లో భారీగా పడిపోయిన తరువాత బంగారం ధరలు ఫ్యూచర్ మార్కెట్లో1.42 శాతం ఎగిసాయి. కిలో వెండి ధర రూ. 45350 వద్ద కొనసాగుతోంది. అటు ప్రపంచ మార్కెట్లలో, మునుపటి సెషన్లో 5 శాతం నష్టపోయిన పసిడి ఈరోజు లాభాల్లో వుంది. కరోనా వైరస్ వివిధ దేశాలకు విస్తరిస్తుండడంతో అంతర్జాతీయ మార్కెట్లో శనివారం ముగింపుతో పోలిస్తే బంగారం 18 డాలర్లు పెరిగి ఔన్స్ బంగారం ధర 1,603 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి 1.3 శాతం పెరిగి ఔన్సు ధర 16.88 డాలర్లకు చేరింది. ఇతర విలువైన లోహాలలో పల్లాడియం ఔన్స్‌కు 0.7 శాతం పెరిగి 2,611 డాలర్లు, ప్లాటినం 1.9 శాతం 880 డాలర్లకు చేరుకుంది. మరోవైపు శుక్రవారం 1500 పాయింట్లకు పైగా కుప్పకూలిన దేశీయ స్టాక్‌మార్కెట్లు సోమవారం భారీగా రికవరీ సాధించాయి. ఆరంభంలోనే దాదాపు 750 పాయింట్లు ఎగిసిన సెన్సెక్స్ ప్రస్తుతం 587 పాయింట్ల లాబంతో 39 వేల మార్క్‌కు దిగువన, నిఫ్టీ 164 పాయింట్ల లాభంతో 11365 వద్ద 11500 స్థాయికి దిగువన కొనసాగుతోంది. మరోవైపు కోవిడ్-19 ఆందోళన, ఆర్థిక మందగమనంపై శుక్రవారం ఫెడ్ చైర్ జెరోమ్ పావెల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ బలంగా వుందని, అవసరమైతే అన్ని చర్యల్ని తీసుకోవడానికి తాము (ఫెడ్) సిద్ధంగా ఉందంటూ వడ్డీరేట్ల కోత సంకేతాలందించారు. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ రేట్లు భారీగా తగ్గించనుందని గోల్డ్‌మన్ సాచ్స్ ఆర్థికవేత్తలు ఆదివారం అంచనా వేశారు. అలాగే 12 నెలల్లో బంగారం ధర ఔన్స్‌కు 1,800 డాలర్లకు చేరుతుందని పేర్కొంది. #IBJA’s indicative #Retail selling #Rates for #Gold #Jewellery To get these rates on your phone give a missed call on - 8955664433 pic.twitter.com/qnLHc763Xp — IBJA (@IBJA1919) March 2, 2020 -
12 పైసలు బలపడిన రూపీ
సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి తిరిగి లాభాల్లోకి వచ్చింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను 25 బేసిసి పాయింట్లను తగ్గించడంతో రూపాయికి బలమొచ్చింది. తాజా కోతతో ఫెడ్ వడ్డీ రేటు 2 శాతం నుంచి దిగి 1.5-1.75 శాతం పరిధిలోకి వచ్చింది. దీంతో డాలర్ మారకంలో గురువారం సెషన్లో 12 పైసలు బలపడి 70.77 వద్ద ప్రారంభమైంది. బుధవారం ఆరంభంలోనే 11 పైసలు నష్టపోయిన రూపాయి చివరికి 5 పైసలు బలహీనపడి 70.89 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్ ఇండెక్స్ బుధవారం నాటి బలహీనతనుకొనసాగిస్తూ గురువారం 0.32 శాతం నష్టపోయింది. యుఎస్ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో వరుసగా నాల్గవ సెషన్లో కూడా క్రూడ్ ఆయిల్ నష్టాల్లోనే ట్రేడవుతోంది. అయితే అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై పూర్తి స్పష్టత వచ్చేంతవరకు డాలప్పై అప్రమత్తత కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు. -
రూపాయి కోలుకున్నా..బలహీనమే
సాక్షి, ముంబై : స్టాక్‌మార్కెట్లతోపాటు, దేశీయ కరెన్సీ రూపాయిని కూడా ఫెడ్ వడ్డీరేటు కోత సెగతాకింది. అమెరికా చైనా ట్రేడ్ వార్ అందోళనల నేపథ్యంలో ఆర్థిక మందగమనాన్ని ఆర్థికవేత్తలు అంచనావేశారు. ఎనలిస్టులు ఊహించినట్టుగానే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం కోత పెట్టింది. దీంతో డాలరు జోరందుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ ప్రారంభంలోనే 40 పైసలు(0.5 శాతం) నష్టాలతో 69.19 వద్ద ప్రారంభమైంది. తదుపరి కొంతమేర కోలుకున్నప్పటికీ నష్టాలతోనే ట్రేడవుతోంది. ప్రస్తుతం 28 పైసలు నీరసించి 69.07 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఐదు వారాల కనిష్టాన్ని తాకింది. ప్రస్తుత రేట్ల తగ్గింపు మధ్యంతర సర్దుబాటు మాత్రమేననీ, ఇకపై రేట్ల కోత ఉండబోదని ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో యూరో, జపనీస్ యెన్ తదితర ప్రధాన కరెన్సీలతో మారకంలో బుధవారం డాలరు ఇండెక్స్ 98.85 వద్ద రెండేళ్ల గరిష్టాన్ని తాకింది -
గణాంకాలు, ఫలితాల ప్రభావం
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అభిప్రాయం న్యూఢిల్లీ: ఓఎన్జీసీ, గెయిల్, కోల్ ఇండియా వంటి బ్లూ చిప్ కంపెనీల ఆర్థిక ఫలితాలు ఈ వారంలోనే వెలువడుతున్నాయి. ఈ కంపెనీల ఆర్థిక ఫలితాలు, సేవల రంగానికి సంబంధించిన నెలవారీ గణాంకాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు కారణంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితం కానున్నది. అంతర్జాతీయ సంకేతాలు, ప్రపంచ స్టాక్ మార్కెట్ల పోకడ, వర్షపాత విస్తరణ, డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి తదితర అంశాల ప్రభావం కూడా ఉంటుందని నిపుణుల అభిప్రాయం. ఫెడ్ కోత ఉండదు !: గత శుక్రవారం వెలువడిన అమెరికా ఉద్యోగ గణాంకాలు అంచనాల కంటే బలహీనంగా ఉండటంతో ఈ నెలలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ రేట్ల కోత అవకాశాలకు గండి పడిందని, ఈ ప్రభావం మంగళవారం నాటి ట్రేడింగ్‌పై ఉంటుందని నిపుణులంటున్నారు. ఎలాంటి ప్రధాన సంఘటనలు లేకపోతే, షేర్లను బట్టి ట్రేడింగ్ ఉంటుందని అమ్రపాలి అధ్య ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ డెరైక్టర్ అభినాశ్ కుమార్ సుధాంశు చెప్పారు. షేర్ల విలువలు ఖరీదైనవిగా ఉన్నాయని, ప్రస్తుత స్థాయిల్లో కన్సాలిడేషన్ జరిగే అవకాశాలున్నాయని ట్రేడ్ స్మార్ట్ ఆన్లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా పేర్కొన్నారు. ఫలితాలతో ఒడిదుడుకులు కోల్ ఇండియా కంపెనీ ఈ నెల 9న క్యూ1 ఫలితాలు వెల్లడించనున్నది. కోల్ ఇండియాతో పాటు ఓఎన్జీసీ, గెయిల్, భెల్, సెయిల్ వంటి కంపెనీలు తమ ఆర్థిక ఫలితాలను ఈ వారంలోనే వెల్లడిస్తాయని, ఫలితంగా మార్కెట్ ఒడిదుడుకులకు గురయ్యే అవకాశాలున్నాయని క్యాపిటల్ వయా గ్లోబల్ రీసెర్చ్ సీఈఓ రోహిత్ గాడియా చెప్పారు. చైనా సేవల రంగం గణాంకాలు 5న(సోమవారం) వెలువడుతున్నాయి. ఈనెల 8న(గురువారం) యూరప్ కేంద్ర బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని వెల్లడిస్తుంది. నేడు సెలవు: వినాయక చవితి సందర్భంగా సోమవారం స్టాక్ మార్కెట్‌కు సెలవు