సాక్షి, ముంబై : స్టాక్‌మార్కెట్లతోపాటు, దేశీయ కరెన్సీ రూపాయిని కూడా ఫెడ్ వడ్డీరేటు కోత సెగతాకింది. అమెరికా చైనా ట్రేడ్ వార్ అందోళనల నేపథ్యంలో ఆర్థిక మందగమనాన్ని ఆర్థికవేత్తలు అంచనావేశారు. ఎనలిస్టులు ఊహించినట్టుగానే ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 0.25 శాతం కోత పెట్టింది. దీంతో డాలరు జోరందుకుంది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ ప్రారంభంలోనే 40 పైసలు(0.5 శాతం) నష్టాలతో 69.19 వద్ద ప్రారంభమైంది. తదుపరి కొంతమేర కోలుకున్నప్పటికీ నష్టాలతోనే ట్రేడవుతోంది. ప్రస్తుతం 28 పైసలు నీరసించి 69.07 వద్ద ట్రేడవుతోంది. దీంతో ఐదు వారాల కనిష్టాన్ని తాకింది.
ప్రస్తుత రేట్ల తగ్గింపు మధ్యంతర సర్దుబాటు మాత్రమేననీ, ఇకపై రేట్ల కోత ఉండబోదని ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ స్పష్టమైన సంకేతాలు ఇవ్వడంతో యూరో, జపనీస్ యెన్ తదితర ప్రధాన కరెన్సీలతో మారకంలో బుధవారం డాలరు ఇండెక్స్ 98.85 వద్ద రెండేళ్ల గరిష్టాన్ని తాకింది
Comments
Please login to add a commentAdd a comment