
సాక్షి, ముంబై : కోవిడ్-19 విజృంభణ, ఆర్థిక ఆందోళన నేపథ్యంలో పెడరల్‌రిజర్వ్ వడ్డీరేటు కోతకు నిర్ణయించడంతో దేశీయ రూపాయికి బలమొచ్చింది. క్రూడ్ ధరలు ఎగిసి పడటంతో మంగళవారం కీలకమైన 73 స్థాయికి క్షీణించిన కరెన్సీ 16 నెలల కనిష్టానికి పడిపోయింది. 73.19 వద్ద ముగిసిన రూపాయి ఈ స్థాయినుంచి పుంజుకుని డాలరుమారకంలో రూపాయి 73.07 వద్ద ఆరంభమైంది. అనంతరం 34 పైసలు ఎగిసి రూ. 72.95ని తాకింది. ప్రస్తుతం 73.06 వద్దకొనసాగుతోంది. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేటు కోత పెట్టింది ఫెడ్. దీంతో డాలరు బాగా బలహీనపడింది.