సాక్షి, ముంబై : దేశీయ కరెన్సీ రూపాయి తిరిగి లాభాల్లోకి వచ్చింది. అమెరికా ఫెడ్ రిజర్వ్ బుధవారం వడ్డీ రేట్లను 25 బేసిసి పాయింట్లను తగ్గించడంతో రూపాయికి బలమొచ్చింది. తాజా కోతతో ఫెడ్ వడ్డీ రేటు 2 శాతం నుంచి దిగి 1.5-1.75 శాతం పరిధిలోకి వచ్చింది. దీంతో డాలర్ మారకంలో గురువారం సెషన్‌లో 12 పైసలు బలపడి 70.77 వద్ద ప్రారంభమైంది.
బుధవారం ఆరంభంలోనే 11 పైసలు నష్టపోయిన రూపాయి చివరికి 5 పైసలు బలహీనపడి 70.89 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్ ఇండెక్స్ బుధవారం నాటి బలహీనతనుకొనసాగిస్తూ గురువారం 0.32 శాతం నష్టపోయింది. యుఎస్ చమురు నిల్వలు అంచనాల కంటే అధికంగా పెరగడంతో వరుసగా నాల్గవ సెషన్‌లో కూడా క్రూడ్ ఆయిల్ నష్టాల్లోనే ట్రేడవుతోంది. అయితే అమెరికా-చైనా వాణిజ్య యుద్ధంపై పూర్తి స్పష్టత వచ్చేంతవరకు డాలప్‌పై అప్రమత్తత కొనసాగే అవకాశం ఉందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment