![Rupee Surges 63 Paise to 73.15Against US Dollar - Sakshi](/styles/webp/s3/article_images/2020/10/1/rupee.jpg.webp?itok=fbFkd5x2)
సాక్షి, ముంబై : అన్‌లాక్ 5.0 సడలింపులు, దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి బాగా పుంజుకుంది. డాలరు మారకంలో రూపాయి 63 పైసలు ఎగిసింది. బుధవారం 73.76 వద్ద ముగిసిన రూపాయి గురువారం ఆరంభంలోనే 22 పైసలు ఎగిసింది. ఆనంతరం మరింత లాభపడి 73.14 వద్ద ఉత్సాహంగా ముగిసింది.
అటు దేశీయ కీలక సూచీలు ఆరంభం నుంచి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 635 పాయింట్లకుపైగా ఎగిసి 38 700 ఎగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 173 పాయింట్ల లాభంతో 11500 సమీపంలో ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్, టెక్ మహీంద్ర భారీగా లాభపడుతున్నాయి. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లాంటి సినిమా రంగ షేర్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment