![Rupee settles 18 paise higher at 74.84 against US dollar - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/21/rupee.jpg.webp?itok=RS6eWLQY)
సాక్షి, ముంబై: దేశీయ ఈక్విటీలలో భారీగా కొనుగోళ్లతో దేశీయ కరెన్సీ శుక్రవారం లాభాల్లో ముగిసింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 18 పైసలు పెరిగి 74.84 వద్ద స్థిరపడింది. అంతకుముందు 75.02 వద్ద ముగిసిన రూపాయి పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలం, డాలరు బలహీన నేపథ్యంలో లాభాల్లో ముగిసింది. ముడి చమురు ధరలను పతనంకూడా రూపాయికి మద్దతిచ్చినట్టు ఫారెక్స్ వ్యాపారులు చెప్పారు.
బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.29 శాతం క్షీణించింది 44.77 డాలర్లకు , డాలర్ ఇండెక్స్ 0.17 శాతం పెరిగి 92.95 వద్దకు చేరింది. మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్ దాదాపు 300 పాయింట్ల మేర లాభాల్లో ఉంది. సెన్సెక్స్ 296 పాయింట్లుఎగియగా, నిఫ్టీ 86 పాయింట్లు లాభపడి 11390 వద్ద కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment