
Rupee hits over three week high: డాలర్‌తో పోలిస్తే దేశీయ కరెన్సీ రూపాయి వరుసగా మూడో రోజూ (ఆగస్ట్ 24న ) లాభాల్లో కొనసాగుతోంది. డాలర్ మారకంలో రూపాయి మూడు వారాల గరిష్ఠ స్థాయిని 82.47 వద్ద మునుపటి ముగింపుతో పోలిస్తే 0.26 శాతం పెరిగింది. బుధవారం 27 పైసలు పెరిగి 82.72 వద్ద క్లోజైన సంగతి తెలిసిందే. ఇంట్రాడేలో, కరెన్సీ గరిష్టంగా 82.46ను తాకింది. ఆగస్టు 2న చివరిగా కనిపించిన స్థాయి. (ఉబెర్ 'గ్రూప్ రైడ్స్' ఫీచర్: ఎగిరి గంతేస్తున్న రైడర్లు)
రెండు నెలల వ్యవధిలో రూపాయి ఈ స్థాయిలోపెరగడం విశేషం. చైనీస్ యువాన్ , జపనీస్ యెన్‌లలో పెరుగుదల , దేశీయ ఫండమెంటల్స్ సానుకూలంగా ఉండటం రూపాయికి సానుకూలంగా మారింది. ఐపీవో సంబంధ పెట్టుబడుల ప్రవాహం, దేశీ మార్కెట్లు సానుకూలంగా ఉండటం, క్రూడాయిల్ రేట్లు తగ్గుతుండటం తదితర అంశాలు రూపాయి పెరగడానికి దోహదపడిందని నిపుణుల భావిస్తున్నారు. సమీకాలంలో 82 స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment