unlock
-
ఆధార్ లాక్/అన్‌లాక్ గురించి తెలుసా?
ఆధార్ కార్డు జీవితంలో ఒక భాగమైపోయింది. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, ప్రభుత్వ పథకాలను అప్లై చేయడానికి ఇలా.. అన్నింటికీ ఆధార్ అవసరమవుతోంది. ఆధార్ నమోదు సమయంలోనే వ్యక్తిగత వివరాలు, బయోమెట్రిక్, ఐరీష్ అన్నింటినీ రికార్డ్ చేసుకుంటారు. కాబట్టి వేలి ముద్ర వేయగానే మన డీటైల్స్ అన్నీ తెలిసిపోతాయి.వేలి ముద్ర వేయగానే అన్ని వివరాలు తెలిసిపోతుండటం వల్ల, సైబర్ నేరగాళ్లు వీటి ద్వారా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి ఆధార్ కార్డును లాక్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు అన్‌లాక్ కూడా చేసుకోవచ్చు.ఆధార్ బయోమెట్రిక్ లాక్ & అన్‌లాక్➤యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అభివృద్ధి చేసిన 'ఎంఆధార్' (mAadhaar) మొబైల్ యాప్‌లో ఆధార్ డేటాను యాక్సెస్ చేసుకోవచ్చు. ఇందులో కేవలం ఒక వ్యక్తి ఆధార్ వివరాలను మాత్రమే కాకుండా.. కుటుంబ సభ్యుల ఆధార్ వివరాలను కూడా యాడ్ చేసుకోవచ్చు.➤యూఐడీఏఐ ఎంఆధార్ డౌన్లోడ్ చేసుకున్న తరువాత.. యాప్ ఓపెన్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి.➤ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తరువాత.. మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది.➤ఓటీపీ ఉపయోగించి లాగిన్ అయిన తరువాత మీకు 'ఎంఆధార్'ను యాక్సెస్ చేసుకోవడానికి ఒక పిన్ సెట్ చేసుకోవచ్చు.➤ఎంఆధార్ యాప్‌ను యాక్సెస్ చేసిన తరువాత ఆధార్ కార్డు, వ్యక్తిగత వివరాలు కనిపిస్తాయి.➤అయితే ఇప్పుడు బయోమెట్రిక్ లాక్ లేదా అన్‌లాక్ కోసం ఓ ప్రత్యేకమైన ఫీచర్ కనిపిస్తుంది. ఆధార్ లాక్ చేయడానికి 'బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీ రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఆధార్ లాక్ అవుతుంది.➤అన్‌లాక్ చేయడానికి బయోమెట్రిక్ లాక్' ఫీచర్ మీద క్లిక్ చేస్తే.. రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా అన్‌లాక్ అవుతుంది.ఆధార్ లాక్ వల్ల ఉపయోగాలువ్యక్తిగత వివరాలు సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి పడకుండా ఉండటానికి ఆధార్ బయోమెట్రిక్ లాక్ ఉపయోగపడుతుంది. దీంతో మీరు మోసాలకు బలికాకుండా ఉండవచ్చు.ఇదీ చదవండి: ఆధార్ అప్డేట్ చేయకుంటే ఏమవుతుంది?: తప్పకుండా తెలుసుకోవాల్సిందే.. -
చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది?
ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది. ముఖ్యంగా పట్టణాల్లో దీని ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. నగర ప్రజలు అన్నింటికీ డిజిటల్ లావాదేవీలనే కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఈ ధోరణికి మరింత ఊతమిస్తోంది. చివరికి టెక్నాలజీ లేకుంటే అడుగు కూడా ముందుకు పడదేమోనని అనిపించే రోజుల్లో మనిషి బతికేస్తున్నాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫొటోలు, వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. Hey Bangalore! What's going on in your city? I am traveling to your city and what do I see the unlock, download, and search buttons in garbage bins! Sigh. Explain please. #mysterybuttons pic.twitter.com/K8MitUa11n — Sapana Singh (@Sapanasinghj) July 11, 2023 ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక పబ్లిక్ ప్లేస్‌లోని చెత్తడబ్బాలలో ఇంటర్నెట్కు సంబంధించిన మూడు బటన్లు కనిపిస్తున్నాయి. ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్ల పేర్లతో ఉన్న ఈ బోర్డులు అందరినీ తెగ ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఈ బటన్లను ఇక్కడ ఎందుకు పడవేశారనే ఆలోచన అందరిలో కలుగుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఈ పట్టణంలో డిజిటల్ డిటాక్స్’ విషయమై ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు చెత్తకు, టెక్నాలజీకి సంబంధం ఏమిటంటున్నారు. కాగా ఈ ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్లు దేశంలోని కొన్ని పట్టణాల్లోని చెత్తడబ్బాల్లో కనిపించాయని సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్లు మొబైల్ వినియోగంలో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. డిజిటలైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఎవరో ఈ చర్యకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు. Just spotted massive 'Unlock', 'Uninstall', and 'Download' buttons for the first time, lying in the trash bins. Wondering what secrets they hold. @DeccanHerald, any guesses? #ButtonsDiscovered @NewIndianXpress pic.twitter.com/NAA8KtAYob — Balram Sharma (@Brsharma_In) July 11, 2023 ఇది కూడా చదవండి: విచిత్ర ఫ్యామిలీ: ఆ కుటుంబంలోని తొమ్మదిమందీ ఒకేరోజు పుట్టారు! -
ఖరీదైన బైకు.. కంట పడిందో మాయం
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జల్సాలకు అలవాటు పడిన ఆ యువకులు సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీలే మార్గంగా ఎంచుకున్నారు. గతంలో ఆటో మొబైల్ రంగంలో పనిచేసి ఉండటంతో, ద్విచక్ర వాహనాల చోరీలు మొదలుపెట్టారు. చివరకు పోలీసులకు పట్టుబడ్డారు. స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దక్షిణ మండలం డీఎస్పీ ఎం.శ్రీలత, టూటౌన్ సీఐ టి.గణేష్ ఈ వివరాలు తెలిపారు. వారి కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం రూరల్ ధవళేశ్వరానికి చెందిన గుడి పవన్‌కుమార్, నగరంలో తాడితోట వీరభద్రనగర్కు చెందిన ఎర్రారపు సత్యనారాయణ, గుత్తాల నవీన్ కుమార్ స్నేహితులు. వీరికి గతంలో ఆటోమొబైల్ మెకానిక్‌లుగా పనిచేసిన అనుభవం ఉంది. జల్సాలకు, చెడు అలవాట్లకు బానిసలైన వీరు సులువుగా డబ్బులు సంపాదించేందుకు బైకుల చోరీలు మొదలు పెట్టారు. కురక్రారు ఎక్కువగా మక్కువ పడే ఖరీదైన స్పోర్ట్స్ బైకులను లక్ష్యంగా ఎంచుకుని చోరీలు చేసేవారు. తాళం వేసి ఉన్న బైకులను చిటికెలో దొంగిలించేవారు. పలుమార్లు పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లి వచ్చినా నేరాల బాట వీడలేదు. ఇటీవల నగరంలో ద్విచక్ర వాహన చోరీలు ఎక్కువగా జరుగుతూండటంతో ఎస్పీ సీహెచ్.సుధీర్ కుమార్‌రెడ్డి ఆదేశాల మేరకు క్రైమ్ అదనపు ఎస్పీ జి.వెంకటేశ్వరరావు, డీఎస్పీ శ్రీలత పర్యవేక్షణలో సీఐ గణేష్ దర్యాప్తు చేశారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా పెట్టి, నిందితులు ముగ్గురినీ అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారి నేరాల చిట్టా బయటపడింది. ఇటీవల రాజమహేంద్రవరం, కాకినాడ, మండపేట, అనపర్తి, అమలాపురం ప్రాంతాల్లోనే కాకుండా భీమవరం, గుంటూరు నగరాల్లో కూడా వారు దొంగిలించిన 31 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.25 లక్షల వరకూ ఉంటుందని పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు, వాహనాల రికవరీలో ప్రతిభ చూపిన ఎస్సైలు జీవీవీ సత్యనారాయణ, కేఎం జోషీ, హెడ్ కానిస్టేబుళ్లు సీహెచ్ శ్రీనివాసరావు, ఎస్.రాజశేఖర్, కానిస్టేబుళ్లు కె.ప్రదీప్ కుమార్, వీరబాబు, బీఎస్కే నాయక్, ఎస్‌వీవీఎస్‌ఎన్ మూర్తి, కె.కామేశ్వరరావు, కరీమ్ బాషా, కె.సత్యనారాయణ, డి.శ్రీనివాస్‌లను డీఎస్పీ అభినందించారు. వేసవి చోరీలపై జాగ్రత్త ప్రస్తుతం వేసవి కాలం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ శ్రీలత ప్రజలకు సూచించారు. పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో ఇళ్లకు తాళాలు వేసి, కుటుంబ సమేతంగా బంధువుల ఇళ్లకు, విహార యాత్రలకు వెళ్తూంతుంటారని, అటువంటి సమయంలో చోరీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ఇలా ఇల్లు విడిచి వెళ్లేవారు సమీప పోలీసు స్టేషన్లో సమాచారం ఇస్తే గస్తీ పోలీసులు ఆయా ఇళ్లపై నిఘా పెడతారని చెప్పారు. -
మాస్క్ ఉన్న చల్తా... వారి ఫోన్ ఇట్టే అన్‌లాక్..!
కోవిడ్-19 రాకతో మాస్క్ ప్రతి ఒక్కరికి మస్ట్ అనే విధంగా తయారైంది. సరైన మాస్క్‌ను ధరించడంతోనే కరోనా వైరస్ నుంచి తప్పించుకోవచ్చునని ఇప్పటికే శాస్త్రవేత్తలు, వైద్యులు ఎంతో మంది సూచించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మనలో కొంతమందికి మాస్క్ కొంత చిరాకును కూడా తెచ్చి పెట్టే ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లకు మరీను..! ఫేస్ అన్ లాక్ ఫీచర్ కల్గిన స్మార్ట్ఫోన్లలో కచ్చితంగా మాస్క్‌ను తీసే ఫోన్ అన్ లాక్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఫోన్ పాస్‌వర్డ్‌ను టైప్ చేసి అన్‌లాక్ చేయాలి. ఫేస్ ఐడి అన్‌లాక్ కల్గిన ఫీచర్ మాత్రం నిరుపయోగంగా మారే పరిస్థితి ఏర్పడింది. అయితే మాస్క్ ఉన్న కూడా ఫోన్ అన్ లాక్ చేసే ఫీచర్‌ను త్వరలోనే యాపిల్ తన యూజర్లకు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ వెర్షన్లో..! యాపిల్ తమ iOS Beta (iOS 15.4) బీటా వెర్షన్లో ఈ కొత్త ఫీచర్ రిలీజ్ చేసింది. దాంతో పాటుగా iPadOS 15.4, macOS 12.3 వెర్షన్లలో కూడా ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది. ఫేస్ ఐడీ అన్‌లాక్ ఫీచర్‌తో మాస్క్ ధరించిన ఫోన్లను లాక్చేయవచ్చును. ఈ సరికొత్త ఫీచర్ వెంటనే పొందాలంటే ప్రస్తుత ఐవోఎస్ వెర్షన్ నుంచి ఐవోఎస్ 15.4 వెర్షన్‌కు అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. మాస్క్ ఒక్కటే కాదు..! గతంలో ఐఫోన్లను పాస్వర్డ్, ఫింగర్ ప్రింట్, యాపిల్ వాచ్‌ను ఉపయోగించి సదరు స్మార్ట్‌ఫోన్‌ను అన్‌లాక్ చేసేది. లేటెస్ట్ వెర్షన్ సహాయంతో ఇకపై పాస్వర్డ్, యాపిల్ వాచ్ అవసరం లేకుండానే సులభంగా యాపిల్ డివైజ్ అన్ లాక్ చేయవచ్చు. మాస్క్ ధరించి ఉండగానే ఫోన్ అన్ లాక్ అవుతోంది. మాస్కే కాకుండా ఐఫోన్ వినియోగదారులు గ్లాసెస్ ధరించినప్పుడు కూడా ఫేస్ ఐడిని యాక్సెస్ చేయవచ్చు. నాలుగు విభిన్న రకాల గ్లాసెస్‌తో ఐఫోను లాక్ చేసే అవకాశాన్ని యాపిల్ తన యూజర్లకు కల్పించనుంది. 'యూజ్ ఫేస్ ఐడి విత్ ఎ మాస్క్' సెట్టింగ్ సహాయంతో ఈ ఫీచర్‌ను పొందవచ్చును. ఐఫోన్ X , తరువాతి మోడల్‌లలో ఫేస్ ఐడి అందుబాటులో ఉన్నప్పటికీ, ఫేస్ ఐడిని మాస్క్‌తో ఉపయోగించే ఫీచర్ ఐఫోన్ 12 , ఐఫోన్ కొత్త వెర్షన్ ఫోన్లలో మాత్రమే ఈ ఫీచర్ పరిమితం కానుంది. చదవండి: ఐఫోన్లో మరో అదిరిపోయే ఫీచర్..! -
Twitter: ఎట్టకేలకు రాహుల్ ట్విటర్ ఖాతా పునరుద్ధరణ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విటర్‌పై తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా రాహుల్ గాంధీ కొన్ని నిబంధనలు ఉల్లంఘించారని ఆయన ఖాతాను ట్విటర్ నిషేధించిన విషయం తెలిసిందే. ఖాతాను నిలిపివేయడంపై రాజకీయ దుమారం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వంపై శుక్రవారం రాహుల్ తీవ్రంగా విమర్శలు చేశారు. రాజకీయ వ్యవహారాల్లో ట్విటర్ తలదూర్చిందని యూట్యూబ్‌లో ఓ వీడియో విడుదల చేశారు. (చదవండి: రాజకీయాల్లో ట్విట్టర్ తలదూరుస్తోంది) విమర్శలు చేసిన మరుసటి రోజే శనివారం ట్విటర్ రాహుల్ ఖాతాను పునరుద్ధరించింది. రాహుల్ ఖాతాను తిరిగి తెరిచింది (అన్‌లాక్). ఇటీవల ఢిల్లీలో తొమ్మిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై రాహుల్ తప్పుబట్టారు. బాధిత కుటుంబాన్ని పరామర్శి వారితో దిగిన ఫొటోలను ఆగస్ట్ 4వ తేదీన ట్విటర్ పోస్టు చేశారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విటర్లో పోస్టులు చేశారు. ఇది తమ నిబంధనలకు విరుద్ధంగా ఉందని పేర్కొంటూ ట్విటర్ రాహుల్ గాంధీ ఖాతాతో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు 5 వేల మంది ఖాతాలను నిలిపివేసింది. కేసీ వేణుగోపాల్, రణ్‌దీప్ సూర్జేవాలా, రోహన్ గుప్తా, పవన్ ఖేరా, మాణిక్కం ఠాగూర్‌తో పాటు రాహుల్ వివాదాస్పద ట్వీట్లను డిలీట్ చేయడంతో ట్విటర్ వారి ఖాతాలను పునరుద్ధరించింది. రాహుల్‌ను రెండు కోట్ల మందికి పైగా ఫాలో అవుతున్నారు. ట్విటర్ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ.. ‘ఇతరుల ప్రైవసీ.. భద్రత దృష్ట్యా మేం తప్పనిసరిగా నియమాలు పాటించాల్సి ఉంది. ఆ ఫొటో పోస్టు చేయడంపై మా ప్రతినిధులు పరిశీలించి ఓ నివేదిక ఇచ్చారు. ఆ నివేదికలో భాగంగా చర్యలు తీసుకున్నాం. మా విజ్ఞప్తి మేరకు ఎట్టకేలకు రాహుల్ గాంధీ ఓ లేఖ రాశారు.’ అని వివరించారు. రాహుల్ ఫొటో ఉంచడంపై బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ట్విటర్‌కు నోటీసులు జారీ చేసింది. బాధితుల కుటుంబం ఫొటోలు ఉంచిన రాహులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆ క్రమంలోనే రాహుల్ ట్విటర్ ఖాతాను నిలిపివేసినట్లు తెలిసింది. ఖాతా పునరుద్ధరణపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఒక్క వాక్యం ‘సత్యమేవ జయతే’ అని ట్వీట్ చేసింది. అంటే చివరకు సత్యమే గెలిచిందని పేర్కొంటూ ఆ ట్వీట్ చేసింది. Satyameva Jayate — Congress (@INCIndia) August 14, 2021 -
సాక్షి కార్టూన్ 13-08-2021
-
అన్‌లాక్.. కరోనాకు ‘ప్లస్’!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/మంచిర్యాల/ బోధన్ రూరల్(బోధన్)/ మద్నూర్ (జుక్కల్): కరోనా డెల్టా వేరియంట్ ఇప్పటికే దేశాన్ని అతలాకుతలం చేయగా.. ఇప్పుడు దాని నుంచి డెల్టా ప్లస్ వేరియంట్ పుట్టింది. తెలంగాణలో ఇప్పటివరకు ఒక్క కేసు రాకున్నా.. పొరుగు రాష్ట్రాల్లో వరుసగా నమోదవుతున్నాయి. ఆ రాష్ట్రాలకు దగ్గరగా ఉన్న సరిహద్దు జిల్లాల ప్రజల్లో ఆందోళన కనిపిస్తోంది. నిజానికి లాక్డౌన్ సమయంలో పోలీసు బందోబస్తు, రెవెన్యూ, వైద్య సిబ్బందితో కోవిడ్ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వచ్చీపోయే వారిలో అనుమానితులకు కోవిడ్ పరీక్షలు చేయించి పాజిటివ్ వస్తే ఐసోలేషన్‌కు పంపారు. లాక్డౌన్ ఎత్తివేశాక చెక్‌పోస్టులు తొలగించడంతో విస్తారంగా రాకపోకలు జరుగుతున్నాయి. దీంతో కొత్త వేరియంట్ ఎక్కడ కమ్ముకుంటుందోనని స్థానికులు వాపోతున్నారు. దేశంలో నమోదైన డెల్టా ప్లస్ కేసుల్లో ఎక్కువగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. మహారాష్ట్ర నుంచి మన రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు రాకపోకలు ఎక్కువ. సెకండ్ వేవ్ సమయంలోనూ ఈ జిల్లాల్లో కేసులు భారీగా వచ్చాయి. ప్రస్తుతం లాక్డౌన్ ఎత్తివేసినప్పటి నుంచీ రాకపోకలు మళ్లీ పెరిగాయి. ఆదిలాబాద్ జిల్లా ఎన్‌హెచ్ 44 భోరజ్ సరిహద్దు, నిర్మల్ జిల్లా తానూరు సరిహద్దులో ఎటువంటి పరీక్షలు నిర్వహించడం లేదు. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం గోయగాం సమీపంలో కోవిడ్ చెక్‌పోస్టు ఎత్తేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ప్రాణహిత బ్రిడ్జి సమీపం లోని రాపన్‌పల్లి చెక్‌పోస్ట్ వద్ద మాత్రం మావోయిస్టులు వైద్యం కోసం వస్తున్నారనే సమాచారంతో చెక్‌పోస్టు కొనసాగుతోంది. ఇక నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర, కామారెడ్డి జిల్లా సలాబత్పూర్ చెక్‌పోస్టుల వద్ద వాహనాల రాకపోకలు యథేచ్ఛగా సాగుతున్నాయి. జాతీయ రహదారిపై.. రాష్ట్రంలోని జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలకు కర్ణాటకతో సరిహద్దులు ఉన్నాయి. గద్వాల పరిధిలోని బల్గెర–ఎర్రగేర, నందిన్నె–సింగనేడి, నారాయణపేట పరిధిలో గుడెబల్లూరు–దేవసుగురు, కానుకుర్తి ద్వారా రాకపోకలు జరుగుతాయి. ఇక 44వ జాతీయ రహదారి మీదుగా కర్ణాటకతోపాటు ఏపీ, తమిళనాడు, కేరళ ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. లాక్డౌన్ సమయంలో ఈ సరిహద్దుల వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ఇప్పుడు ఎక్కడా కట్టడి లేదు. మళ్లీ కరోనా వస్తే ఎలా? రెండేళ్లలో కరోనా వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం. మహారాష్ట్ర వల్ల మా గ్రామంలో చాలా కేసులు వచ్చాయి. మహారాష్ట్రలో డెల్టా ప్లస్ అని కొత్తరకం వస్తోందని చెప్తున్నారు. చాలా వాహనాలు వస్తున్నాయి. జనం వచ్చిపోతున్నారు. మహా రాష్ట్ర వల్ల మళ్లీ ఇక్కడ కరోనా కేసులు రాకుండా చర్యలు తీసుకోవాలి. –కె.నారాయణ, రైతు, పంచాక్షరి, ప్రైవేటు లెక్చరర్ సాలూర గ్రామం, బోధన్ మండలం -
Unlock Effect : ఉత్సాహంలో కార్పోరేట్ కంపెనీలు
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విధించిన స్థానిక లాక్డౌన్లను తాజాగా అన్‌లాక్ చేస్తుండడం కార్పొరేట్ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఎకానమీలో తిరిగి క్రియాశీలత ప్రారంభమయ్యిందనడానికి స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నట్లు ఫిక్కీ–ధృవా అడ్వైజర్స్ నిర్వహించిన ఒక సంయుక్త సర్వే తెలిపింది. కరోనా సెకండ్‌వేవ్ కేసులు గణనీయంగా తగ్గుతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఆంక్షలను సడలిస్తున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామంపై జరిపిన సర్వే ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► వచ్చే ఆరు నుంచి పన్నెండు నెలల కాలంలో ఎకానమీ మరింత క్రియాశీలమవుతుందని కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి. ► స్థానికంగా రాష్ట్రాల్లో విధించిన లాక్డౌన్ల వల్ల తమ వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడినట్లు సర్వేల్లో పాల్గొన్న 212 కంపెనీల్లో 60 శాతం వెల్లడించాయి. ► సెకండ్ వేవ్ తీవ్రత, వివిధ రాష్ట్రాల్లో పలు విధాలైన ఆంక్షలు వినియోగ సెంటిమెంట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి. డిమాండ్ భారీగా పడిపోయింది. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోసైతం వినియోగ డిమాండ్ దెబ్బతిందని సర్వేలో వెల్లడైంది. ► కొత్త కేసులు గణనీయంగా తగ్గుతుండడంతో తిరిగి వ్యాపారాలు, ఆర్థిక క్రియాశీతల ఊపందుకుంటుందన్న విశ్వాసాన్ని కార్పొరేట్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ► అవసరమని సర్వేలో ప్రతినిధులు అభిప్రాయడ్డారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం విస్తృతితోపాటు భౌతిక దూరం పాటించడం, విధిగా మా స్క్‌లు ధరించడం వంటి సామాజిక బాధ్యతలకు అత్యధిక ప్రాధాన్యత అవసరమని పేర్కొన్నారు. ► తదుపరి వేవ్‌లను అరికట్టడానికి తీసుకోవాల్సిన మరో ఐదు ప్రధాన చర్యలను సర్వే సూచించింది. ఇందులో మొదటిది చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య భద్రతా మౌలిక రంగంపై పెట్టుబడులను పెంచాలి. రెండవది తగిన ఔషధాల నిల్వ అవసరం. తాత్కాలిక వైద్య ఏర్పాట్లు విస్తృతం చేయడం మూడవది. వ్యాధి నిర్థారణ కేంద్రాలు భారీగా ఏర్పాటు నాల్గవది. ఇక ఐదవ సూచన విషయానికి వస్తే, ప్రభుత్వ నిధులతో వ్యాక్సిన్ తయారీకి ఒక దేశీయ సంస్థ ఏర్పాటు. ►వ్యాక్సినేషన్ విస్తృతి కార్యక్రమంలో భాగంగా విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోలు, పాఠశాలలు, గ్రామీణ పంచాయితీ కార్యాలయాల్లో ప్రత్యేక వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సర్వే సూచించింది. మురికివాడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని స్పష్టం చేసింది. అలాగే పెద్దగా కదలడానికి ఇబ్బందిపడే వృద్ధులు, అంగవైకల్యం కలవారికి ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం అవసరమని సిఫారసు చేసింది. రికవరీకి మద్దతుగా పటిష్ట చర్యలు అవసరం: పీహెచ్‌డీసీసీఐ ఎకానమీ రికవరికీ మద్దతునివ్వడానికి ప్రభుత్వ పరంగా పటిష్ట చర్యలు అవసరమని పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ) ప్రెసిడెంట్ సంజయ్ అగర్వాల్ స్పష్టం చేశారు. కనీసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వర్తించే విధంగానైనా పారిశ్రామిక ప్రధాన ముడి పదార్థాల దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేయాలని కోరారు. అలాగే గత ఏడాదిగా 50 శాతంపైగా ధరలు పెరిగిన కొన్ని ప్రధాన కమోడిటీలపై ఎగుమతి సుంకాలను విధించాలని విజ్ఞప్తి చేశారు. 2021–22లో అధిక ఆర్థిక వృద్ధిని సాధించడానికి వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు పునరుత్తేజం అవసరమని, ఇందుకు తగిన చర్యలు తప్పవని సూచించారు. ఈ దిశలో కుటుంబాల వినియోగ డిమాండ్ పెంచడానికీ తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దేశంలో మూలధన పెట్టుబడుల విస్తృతితోనే ఇది సాధ్యమవుతుందని అగర్వాల్ విశ్లేషించారు. ఆయా అంశాల్లో లక్ష్యాలను సాధించడానికి నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్ పెట్టుబడులు ఎంతగానో దోహదపడతాయన్నారు. ఇంటి నుంచి పనులు, నిధుల కొరతల వల్ల ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల చెల్లింపులకు ఎటువంటి విఘాతం కలుగరాదన్నారు. వర్కింగ్ క్యాపిటల్ చట్రానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి ఇబ్బందీ రాకూడదని స్పషం చేశారు. -
తెలంగాణ లో నెలకొంటున్న సాధారణ పరిస్థితులు
-
జాగ్రత్తగా ‘అన్‌లాక్’ చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్‌వేవ్ ఉధృతి తగ్గడంతో పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కోవిడ్ ఆంక్షల ఎత్తివేత లేదా సడలింపుల బాట పట్టాయి. అయితే, కోవిడ్ తాజా పరిస్థితులను నిశితంగా గమనించాకే అప్రమత్తతతో ‘అన్‌లాక్’ ప్రక్రియను మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రప్రభుత్వం శనివారం సూచించింది. ఆంక్షల సడలింపుల కారణంగా మార్కెట్లు, కొన్ని ప్రదేశాల్లో ప్రోటోకాల్‌ను గాలికొదిలేసి ప్రజలు గుమికూడుతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తంచేసింది. దీంతో అన్‌లాక్ అప్రమత్తతపై శనివారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ట్రిపుల్ టి + వీ మంత్రం అన్ని రాష్ట్రాల్లో కోవిడ్ ప్రోటోకాల్స్ పాటించడంతోపాటు, కరోనా టెస్టింగ్–ట్రాకింగ్, ట్రీట్మెంట్(కోవిడ్ చికిత్స), టీకాలు, నిరంతర అప్రమత్తత ఇలా ఐదు అత్యంత ఆవశ్యకమైన నియమావళిని రాష్ట్రాలు తప్పక కొనసాగించాలని లేఖలో అజయ్ భల్లా సూచించారు. ‘వ్యాక్సినేషన్‌ను మరింతగా పెంచాలి. కొత్త కేసులు, మరణాల సంఖ్య తగ్గడంతో రాష్ట్రాలు కోవిడ్ ఆంక్షలను ఎత్తేయడమో, సడలించడమో చేస్తున్నాయి. అన్‌లాక్‌కు అనుగుణంగానే క్షేత్ర స్థాయి పరిస్థితులు ఉన్నాయని నిర్ధారించుకున్నాకే ఆంక్షలపై నిర్ణయాలు తీసుకోండి. మరో వేవ్ రాకుండా ఉండాలంటే నిరంతర పర్యవేక్షణ ఉండాల్సిందే’ అని భల్లా సూచించారు. సంక్రమణ రేటు, యాక్టివ్ కేసులపై నిఘా ‘ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నా కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య ఏమాత్రం తగ్గడానికి వీల్లేదు. దేశంలో థర్డ్ వేవ్ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకొని యాక్టివ్ కేసుల్లో స్వల్ప పెరుగుదలగానీ పాజిటివిటీ రేటులో పెరుగుదల వంటి సంకేతాలను ప్రారంభదశలో గుర్తించాలి. ఏదైనా ప్రాంతంలో పాజిటివ్ కేసులు ఎక్కువైతే ఆ ప్రాంతానికే వ్యాప్తిని పరిమితం చేయాలి’ అని భల్లా లేఖలో పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌తో సురక్షితం కరోనా వైరస్ కట్టడికి టీకా అతిపెద్ద ఆయుధమని కేంద్రం తెలిపింది. కరోనా గొలుసు సంక్రమణలను విచ్ఛిన్నం చేయడానికి ఇది సహాయపడుతుందని, ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయాలని సూచించింది. రాష్ట్రాలు ఆంక్షలను సడలించుకోవచ్చని, అయితే కరోనా నిబంధనలను నిర్లక్ష్యంచేయొద్దని కోరింది. డాక్టర్లపై దాడులను ఉపేక్షించొద్దు ‘కోవిడ్ చికిత్స విధి నిర్వహణలో ఉన్న వైద్యులు, ఆరోగ్యరంగంలోని వృత్తినిపుణులపై దాడులు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోండి. కఠిన విపత్తు నిర్వహణ(సవరణ) చట్టం–2020 కింద కేసు నమోదుచేయండి. సిబ్బందిపై దాడి, బెదిరింపు తదితర ఘటనలు వారిలో నైతికస్థైర్యాన్ని దెబ్బతీసి అభద్రతా భావాన్ని పెంచే ప్రమాదముంది. దాడికి పాల్పడే వారిపై కేసులు పెట్టి త్వరితగతిన శిక్షలుపడే చూడండి’ అని భల్లా పేర్కొన్నారు. విపత్తు చట్టం కింద గరిష్టంగా ఐదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది తీవ్రంగా గాయపడితే నిందితుడికి గరిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తారు. -
లాక్డౌన్ ఎత్తేయగానే దోస్తులను కలుస్తాం.. మాల్స్‌కు పోతాం..
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో అన్‌లాక్ ప్రక్రియ వివిధ దశల్లో ఉంది. ఈనేపథ్యంలో ఇన్నాళ్లు లాక్డౌన్లో ఉన్న ప్రజలు తాళం తీస్తే స్వేచ్ఛగా తిరిగేందుకు మొగ్గుచూపుతున్నారు. రెస్టారెంట్లు, సినిమాహాళ్లు, మాల్స్‌కు వెళ్తామంటున్నారు. బంధుమిత్రులను కలుస్తామని చెబుతున్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి విషయంలో ప్రజలు నిబంధనలు గాలికొదిలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మళ్లీ మహమ్మారి పంజా విసురుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 314 జిల్లాల్లో కమ్యూనిటీ లోకల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘లోకల్ సర్కిల్స్’ నిర్వహించిన సర్వేలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఆయా జిల్లాల్లోని 48 శాతం మందిని ప్రథమ శ్రేణి నగరాల నుంచి, ద్వితీయశ్రేణి నగరాల నుంచి 25 శాతం, మూడు, నాలుగు శ్రేణి నగరాల నుంచి 27 శాతం మంది నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. -
తెలంగాణలో లాక్డౌన్ ఎత్తివేత
అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కలాపాలను పూర్తి స్థాయిలో నిర్వహించుకోవచ్చు. సామాజిక, రాజకీయ, మతపర, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవచ్చు. లాక్డౌన్ పూర్తిగా ఎత్తేయడంతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగిపోయాయి. ప్రార్థన స్థలాలు, సినిమా హాళ్లు, అమ్యూజ్మెంట్ పార్కులు, క్లబ్బులు, స్విమ్మింగ్ పూల్స్, బార్లు, పబ్స్, జిమ్‌లు, స్టేడియాలు తెరుచుకోవచ్చు. వివాహాలు, అంత్యక్రియలకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనే వ్యక్తుల సంఖ్యపై పరిమితి ఉండదు. ‘‘లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా పోయినట్టు కాదు. జనజీవనం, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినవద్దనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదు. మాస్క్ ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, శానిటైజర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలి. ప్రభుత్వ నిబంధనలను విధిగా అనుసరించాలి. పూర్తి స్థాయిలో కరోనా నియంత్రణకు ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలి..’’ - ప్రజలకు మంత్రివర్గం విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్డౌన్ సమయంలో విధించిన అన్ని రకాల ఆంక్షలను ఉప సంహరిస్తున్నట్టు ప్రకటించింది. లాక్‌డౌన్‌కు ముందున్నట్టుగా రోజువారీ వ్యవహారాలు, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని సూచించింది. అన్ని విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు తెరుచుకోవచ్చని పేర్కొంది. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీలు జూలై 1వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో పునః ప్రారంభించుకోవచ్చని తెలిపింది. శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం అత్యవసర సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభమైన ఈ భేటీ రాత్రి 8.30 గంటల వరకు 6 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందంటూ, కరోనా నియంత్రణలోకి వచ్చిందంటూ వైద్యారోగ్య శాఖ అందించిన నివేదికలను పరిశీలించింది. పొరుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గిన అంశంపై పరిశీలన జరిపింది. ఇతర రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా వేగంగా నియంత్రణలోకి వచ్చిందన్న అంశాలను నిర్ధారించుకుని.. లాక్డౌన్ ఎత్తివేత నిర్ణయం తీసుకుంది. వెంటనే ఉత్తర్వులు జారీ రాష్ట్రంలో కరోనా రెండో వేవ్ నియంత్రణ కోసం మే 12 నుంచి లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. తొలుత ఉదయం నాలుగు గంటల పాటు మాత్రమే సడలింపు ఇవ్వగా.. తర్వాత ఒంటి గంట వరకు, సాయంత్రం ఐదు గంటల వరకు పెంచారు. తాజాగా పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. లాక్డౌన్ ఎత్తివేస్తూ, దానికి ముందు కొనసాగిన అన్నిరకాల కార్యకలాపాలకు అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శనివారం రాత్రే ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. జూన్ 1 నుంచే విద్యా సంస్థలు పునః ప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల హాజరు, ఆన్లైన్ క్లాసుల కొనసాగింపు తదితర అంశాలకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయాలని విద్యా శాఖను మంత్రివర్గం ఆదేశించింది. విద్యార్థులకు భౌతిక తరగతులు (ఫిజికల్ క్లాసెస్) ప్రారంభించాలని సూచించింది. లాక్డౌన్ ఎత్తివేతతో అంతర్రాష్ట్ర ప్రయాణాలపై ఆంక్షలు తొలగినా.. అంతర్రాష్ట్ర ఆర్టీసీ సర్వీసులపై మాత్రం స్పష్టత రాలేదు. గ్రామాల్లో ఆధునిక సెలూన్లు యాదవులకు గొర్రెల పంపిణీ పథకాన్ని తిరిగి ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గతంలోనే నిర్ణయించిన ప్రకారం క్షౌ ర వృత్తిలోని నాయీ బ్రాహ్మణులకు గ్రామాల్లో మోడ్రన్ సెలూన్లను తక్షణమే ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. రైతులకు బీమా సత్వరమే అందిస్తున్నట్టుగా.. చేనేత, గీత కార్మికులు, ఇతర వృత్తి కులాల వారికి సైతం త్వరగా చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించింది. మత్స్య, గీత కార్మికులకు ఇవ్వాల్సిన ఎక్స్‌గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని, ఎంబీసీ కార్పోరేషన్‌కు నిధులు విడుదల చేయాలని ఆదేశించింది. హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు రోగుల రద్దీతో కిటకిటలాడుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గించడం, ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందించడం లక్ష్యంగా.. కొత్తగా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతమున్న ‘టిమ్స్’ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా ఆధునీకరించాలని.. కొత్తగా మరో 3 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మించాలని తీర్మానించింది. ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రి ప్రాంగణంలో ఒకటి, గడ్డి అన్నారం నుంచి తరలించిన పండ్ల మార్కెట్ స్థలంలో మరొకటి, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లాలో అల్వాల్ నుంచి ఔటర్ రింగ్‌రోడ్డు మధ్య మరొకటి నిర్మించాలని నిర్ణయించింది. దీనివల్ల జిల్లాల నుంచి అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు శివారు ప్రాంతాల్లోనే వైద్య సౌకర్యం అందుతుందని పేర్కొంది. కొత్తపేటలోని కూరగాయల మార్కెట్‌ను పూర్తిగా ఆధునీకరించి ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది. -
సినీ ప్రియులకు గుడ్ న్యూస్.. థియేటర్స్ ఓపెన్.. ఇక జాతరే!
సినీ ప్రియులకు శుభవార్త. తెలంగాణలో ఆదివారం నుంచి థియేటర్లు ఓపెన్ కానున్నాయి. ఇకపై థియేటర్స్ 100 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవచ్చని అనుమతులిస్తూ ఇటు సినీ ప్రియులకు, అటు థియేటర్ యాజమాన్యాలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గడంతో లాక్‌డౌన్‌ని ఎత్తివేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ని పూర్తి ఎత్తివేస్తున్నారు. దీంతో ఆదివారం నుంచి సినిమా థియేటర్లు కూడా ఓపెన్ కానున్నాయి. లాక్ డౌన్ వల్ల సినిమా హాళ్లు దాదాపు మూసివేసి ఉంటున్న సంగతి తెలిసిందే. కేసులు తగ్గడంతో ఓపెన్ చేసేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. దీంతో సినీ పరిశ్రమకు ప్లస్ కానుంది. కరోనా వల్ల.. చిన్న, పెద్ద సినిమాలు అనే తేడా లేకుండా.. ఓటీటీలో రిలీజ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇకపోతే థియేటర్స్ ఓపెన్ అయితే థియేటర్స్ వద్ద సినిమాల జాతరే ఉండబోతుంది. ఎందుకంటే గత ఏప్రిల్ నెల నుంచి రిలీజ్ కావాల్సిన సినిమాలు వాయిదా పడుతూ వస్తున్నాయి. చివరిగా థియేటర్స్‌లో వకీల్ సాబ్ విడుదలైంది. ఆ తర్వాత థియేటర్లు మూతపడడంతో సినిమాలన్ని వాయిదా పడ్డాయి. ఆ లిస్ట్‌లో నాగచైతన్య-సాయిపల్లవి ‘లవ్ స్టోరీ’. నాని ‘టక్ జగదీష్’, రానా ‘విరాటపర్వం’, చిరంజీవి ‘ఆచార్య’, వెంకటేశ్ ‘నారప్ప’. రవితేజ ‘ఖిలాడి’, విష్వక్ సేన్ ‘పాగల్’లతో పాటు చిన్న చిత్రాలు కూడా ఉన్నాయి. -
అక్కడ రెస్టారెంట్లకు ఓకే.. లిక్కర్‌కి నాట్ ఓకే
న్యూఢిల్లీ : మందుబాబులకు ఢిల్లీ సర్కారు ఝలక్ ఇచ్చింది. క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లకు పర్మిషన్ ఇస్తూనే లిక్కర్ సర్వింగ్‌కి నో చెప్పింది. ట్రయల్ బేసిస్ మీద జూన్ 6 నుంచి 21 వరకు యాభై శాతం సీటింగ్ కెపాసిటీతో ఇటీవల ఢిల్లీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రెస్టారెంట్లు, బార్లు, క్లబ్బులు తెరుచుకోవడంతో ఓ పెగ్గు వేద్దామని వెళ్లిన మందుబాబులకు నిరాశే ఎదురవుతోంది. రెస్టారెంట్లు, బార్లలో ఆల్కహాల్ అమ్మకాలకు చేయకూడదంటూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు ఉండటంతో చుక్క మందు కూడా వాళ్లకి దొరకలేదు. కఠిన చర్యలు కోవిడ కేసులు పెరిగిపోవడంతో ఏప్రిల్ 19 నుంచి జూన్ 5 వరకు కఠిన లాక్డౌన్ అమలు చేసింది ఢిల్లీ సర్కార్. అయితే కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టడంతో ఇటీవల అన్‌లాక్ ప్రక్రియ మొదలు పెట్టింది. అందులో భాగంగా రెస్టారెంట్లు ఓపెన్ చేసినా మందుకు మాత్రం నో చెప్పింది. ఢిల్లీ బాబులు బార్లలో గొంతు తడుపుకోవాలంటే మరికొంత కాలం ఎదురు చూడక తప్పదు. బార్లు, రెస్టారెంట్లపై నిఘా పెట్టామని ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి ఆల్కహాల్ అమ్మినట్టు తేలితే కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ హెచ్చరించింది. త్వరగా ఇవ్వండి కరోనా కారణంగా ఇప్పటికే రెస్టారెంట్లు, బార్లు, హోటళ్ల రంగం భారీ నష్టాలు చవి చూస్తోందని. పరిస్థితులను అంచనా వేసి త్వరగా తమకు లిక్కర్ అనుమతులు ఇవ్వాలంటూ వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు. చదవండి:‘ఆహార’ బిల్లుల్లో లైసెన్స్ నంబరు తప్పనిసరి -
లాక్డౌన్ ఎత్తివేత.. రాత్రి కర్ఫ్యూ విధింపు
ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్డౌన్ పలు రాష్ట్రాల్లో ఎత్తి వేస్తున్నారు. లాక్డౌన్ ఎత్తివేసి రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు, మేఘాలయలో లాక్డౌన్ విధిస్తూనే భారీగా సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా బిహార్‌లో లాక్డౌన్ ఎత్తివేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. కాకపోతే రాత్రి 7 గంటల నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు 50 శాతం మందితో పనిచేసేందుకు అనుమతి ఇచ్చింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి ఉత్తర్వులు జారీ చేశాయి. ఉత్తరప్రదేశ్‌లో లాక్డౌన్ ఎత్తివేసిన అనంతరం పగటిపూట కర్ఫ్యూ కొనసాగింది. తాజాగా పగటిపూట కర్ఫ్యూను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు ఎత్తివేశారు. రాత్రి 7 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ఉత్తర్వులు వెలువడ్డాయి. మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరికొన్ని సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. లాక్డౌన్ ఎత్తివేసినా కరోనా నిబంధనలు మాత్రం కచ్చితంగా పాటించాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచించాయి. ఇప్పటి నుంచే జాగ్రత్తలు పాటిస్తే కరోనా మూడో దశ ముప్పు రాదని స్పష్టం చేశాయి. చదవండి: లాక్డౌన్ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు -
చిన్న ఎస్ఎంఎస్తో ఆధార్ డేటాను రక్షించుకోండి
ప్రస్తుతం మన దేశంలో 5 ఏళ్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు ఆధార్ కార్డును కలిగి ఉండటం తప్పనిసరి. ఇది ఒక ఐడీ ప్రూఫ్ లాగా మాత్రమే కాకుండా, చిరునామా గుర్తింపు పత్రంగా కూడా ఉపయోగపడుతుంది. విద్య, ఉద్యోగ, ప్రభుత్వ పథకాల కోసం ఈ కార్డు తీసుకోవడం తప్పనిసరి. అందుకే మన దేశంలో ఈ కార్డుకు ఉన్న మరే ఇతర కార్డుకు లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆధార్ నెంబర్ ఇతరులకు తెలిస్తే మీ వివరాలు సులువుగా తెలుసుకునే అవకాశం ఉంటుంది. వారు అసాంఘిక శక్తుల కోసం మీ నెంబర్ కోసం ఉపయోగిస్తే మీరు పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. అందుకే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రైవసీ, సెక్యూరిటీ వంటి ఫీచర్స్‌ని అందిస్తోంది. మీ ఆధార్ కార్డు ఎక్కడైనా పోతే మీరు వెంటనే మీ ఆధార్ నెంబర్‌ను లాక్ చేయొచ్చు. దీని ద్వారా ఎవరైనా మీ ఆధార్ నెంబర్‌ను ఎవరు ఉపయోగించలేరు. అలాగే లాక్ చేసిన ఆధార్‌ను ఆన్-లాక్ కూడా చేయవచ్చు. వీటి కోసం మీరు ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఆధార్ కు లింక్ చేసిన మొబైల్ నెంబర్ సహయంతో సులభంగా లాక్ చేయవచ్చు. మొదట మీరు మీ మొబైల్ నెంబర్ నుంచి GETOTPAadhaar NUMBER-last-4-digits టైపు చేసి 1947కి మెసేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే, తర్వాత మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీని LOCKUIDAadhaar NUMBER-last 4-digitsOTP-6-digits అని టైపు చేసి మళ్లీ 1947కి మెసేజ్ చేస్తే మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఉదాహరణకు ఆధార్ నెంబర్ చివరి నాలుగు అంకెలు 9123 అనుకుంటే GETOTP 9123 అని టైప్ చేయాల్సి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు వచ్చిన ఓటీపీ 012345 అనుకుంటే LOCKUID 9123 012345 ఈ ఫార్మాట్లో ఎస్ఎంఎస్ టైప్ చేసి 1947 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపితే చాలు. మీ ఆధార్ నెంబర్ లాక్ అవుతుంది. ఇక మీ ఆధార్ నెంబర్‌ను ఆథెంటికేషన్ కోసం ఎవరూ వాడలేరు. అలాగే, ఆన్-లాక్ చేయాలంటే వర్చువల్ ఐడీ సహాయంతో చేయవచ్చు. చదవండి: కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్ వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే -
అన్‌లాక్, అంతర్జాతీయ అంశాలే కీలకం..!
ముంబై: కరోనా సంబంధిత వార్తలు, లాక్డౌన్ అన్‌లాక్ ప్రక్రియ, అంతర్జాతీయ పరిణామాలు ఈ వారం స్టాక్ మార్కెట్‌కు కీలకం కానున్నాయని నిపుణులు భావిస్తున్నారు. రుతుపవనాల రాక వార్తలు మార్కెట్ గమనాన్ని నిర్దేశించవచ్చని చెబుతున్నారు. వీటితో పాటు క్రూడాయిల్‌ధరలు, రూపాయి ట్రేడింగ్, విదేశీ ఇన్వెస్టర్లు వైఖరి అంశాలు ట్రేడింగ్‌ను ప్రభావితం చేయవచ్చని అంటున్నారు. ‘‘దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్ నిబంధనలను సరళతరం చేస్తున్నాయి. కరోనా తగ్గేంత వరకు సరళతర ద్రవ్య, పరపతి విధానాలనే అనుసరిస్తామని గతవారంలో ఆర్బీఐ భరోసానిచ్చింది. భారత ఈక్విటీలను కొనేందుకు విదేశీ ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడొచ్చని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఈ అంశాలన్నీ సూచీల రికార్డు ర్యాలీని కొనసాగించేలా ప్రోత్సహించవచ్చు’’ అని జియోజిత్ ఫైనాన్స్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. గత వారంలో సెన్సెక్స్ 677 పాయింట్లు, నిఫ్టీ 235 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. మార్కెట్‌ను ప్రభావితం చేసే అంశాలను మరింత లోతుగా పరిశీలిస్తే.., సెంటిమెంట్‌ను బలపరుస్తున్న అన్‌లాక్ ప్రక్రియ.. దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలను పొడిగిస్తూనే.. అనేక సడలింపులు ఇస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మే 31 నుంచే ‘అన్‌లాక్’ ప్రక్రియ ప్రారంభమైంది. మార్కెట్లు, మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తున్నాయి. నేటి(సోమవారం)నుంచి మెట్రో రైళ్లు 50% రవాణా సామర్థ్యంతో ప్రయాణించనున్నాయి. దేశ ఆర్థిక రాజధాని మహారాష్ట్ర కోవిడ్ నిబంధనలను ఐదు అంచెల్లో సడలించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. వీటితో పాటు అనేక రాష్ట్రాలు లాక్డౌన్లు, కర్ఫ్యూలను పొడిగిస్తూనే.. అనేక సడలింపులు ఇస్తున్నాయి. అన్‌లాక్ ప్రక్రియతో ఆర్థిక రికవరీ తిరిగి గాడిన పడవచ్చనే ఆశలు మార్కెట్లో సెంటిమెంట్‌ను బలపరుస్తున్నాయి. అంతర్జాతీయ పరిణామాలపై దృష్టి... అమెరికా శుక్రవారం మే నెల ఉద్యోగ గణాంకాలను వెల్లడించింది. యూఎస్ ఆర్థికవేత్తలు మేలో 6.50 లక్షల ఉద్యోగాల సృష్టి జరగొచ్చని ఆశించగా, 5.59 లక్షల ఉద్యోగాల కల్పన మాత్రమే జరిగింది. దీంతో ఫెడ్ రిజర్వ్ ద్రవ్య పాలసీని కఠినతరం చేయవచ్చనే ఆందోళనలు ఉపశమించాయి. జపాన్ ఈ మంగళవారం తొలి క్వార్టర్ జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. చైనా బుధవారం మే నెల ద్రవ్యోల్బణ, పీపీఐ డేటాను వెల్లడించనుంది. ఈసీబీ (యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్) గురువారం వడ్డీరేట్లను ప్రకటించనుంది. అదేరోజున(గురువారం) అమెరికా మే ద్రవ్యోల్బణ డేటాను, చైనా శుక్రవారం మే వాహన విక్రయ గణాంకాలను వెల్లడించనున్నాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను ప్రతిబింబింపజేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. రుతుపవనాలు, క్యూ4 ఫలితాలు... దేశంలోకి రుతుపవనాల రాక ఆలస్యమైనా.., ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు పడొచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. రుతుపవనాల రాకతో మార్కెట్లో సానుకూలతలు పెరగొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కార్పొరేట్ల ఆర్థిక ఫలితాల విడుదల విషయానికొస్తే.., ఇప్పటికే అధిక వెయిటేజీ షేర్లను కలిగిన కంపెనీలు ఫలితాలను వెల్లడించాయి. బాటా ఇండియా, గెయిల్, సెయిల్, భెల్, డీఎల్ఎఫ్ లాంటి కీలకమైన కంపెనీలు ఈ వారంలో ఆర్థిక ఫలితాలను ప్రకటించనున్నాయి. ఐఐపీ గణాంకాలు శుక్రవారం విడుదల... ఇదే వారంలో శుక్రవారం ఏప్రిల్ నెల పారిశ్రామికోత్పత్తి గణాంకాలు విడుదల కానున్నాయి. లో బేస్ కారణంగా వార్షిక ప్రాతిపదికన 186 శాతం వృద్ధి నమోదుకావచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. నాలుగు రోజుల్లో రూ.8,000 కోట్ల పెట్టుబడులు... భారత ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జూన్ నెల తొలి నాలుగురోజుల్లోనే ఏకంగా రూ.8,000 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. కరోనా కేసుల తగ్గుదల, కార్పొరేట్ల మెరుగైన ఆర్థిక ఫలితాలు కొనుగోళ్లను ప్రేరేపించాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. ఇక మేలో ఎఫ్ఐఐలు రూ.2,954 కోట్ల నిధులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు తెలిపాయి. -
Maharashtra: నేటి నుంచి లాక్డౌన్ సడలింపులు
సాక్షి, ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో పౌరులకు ఊరట కలిగించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నమోదవుతున్న కొత్త కరోనా రోగుల సంఖ్య, రికవరీ శాతాన్ని బట్టి లాక్డౌన్ నిబంధనలు సడలించింది. దీంతో గత సంవత్సరం మార్చి నుంచి స్తంభించిపోయిన వ్యాపార ఆర్థిక లావాదేవీలు, ఉపాధి కోసం జనాల పరుగులు పుంజుకుంటాయి. సడలించిన నిబంధనలు సోమవారం నుంచి అమలులోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అన్‌లాక్ ప్రటకనల గందరగోళం! రాష్ట్రంలో ఐదు దశల్లో అన్‌లాక్ ప్రక్రియ అమలు చేస్తున్నట్లు గురువారం సహాయ, పునరావాస శాఖ మంత్రి విజయ్ వడెట్టివార్ చేసిన ప్రకటన గందరగోళానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసిన రెండు గంటల్లోనే ముఖ్యమంత్రి కార్యాలయం లాక్డౌన్ ఇంకా కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇలా వేర్వేరు ప్రకటనలతో ప్రతిపక్షాలు ఘాటుగా స్పందించాయి. దీంతో తేరుకున్న వడెట్టివార్ సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అంతేగాకుండా ఈ వివాదస్పద ప్రకటనపై విజయ్ వడెట్టివార్ను ఉప ముఖ్యమంత్రి అజీత్ పవార్ కూడా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేసిన సంగతి విదితమే. ప్రభుత్వం పూర్తి సమన్వయంతో పనిచేస్తుందని, ఎన్ని పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పడిందనేది ముఖ్యం కాదని, ముఖ్యమంత్రి తీసుకునే అంతిమ నిర్ణయాన్నే అందరూ ఆమోదిస్తారని స్పష్టం చేశారు. లాక్డౌన్ ఎత్తివేసే అంశంపై ఆలోచిస్తున్నామని పవార్ వెల్లడించారు. చివరకు ఊహించిన విధంగానే లాక్డౌన్ నిబంధనలు పడలిస్తున్నట్లు శనివారం ప్రకటించింది. ఐదు ఫేజ్‌లుగా అన్‌లాక్ అన్‌లాక్ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఐదు ఫేజ్‌లుగా విభజించింది. ఐదు శాతం పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాలను మొదటి ఫేజ్‌గా గుర్తించింది. ఈ జిల్లాలను సోమవారం నుంచి పూర్తిగా అన్‌లాక్ చేసింది. ఇందులో రాష్ట్ర ఉప రాజధాని నాగ్‌పూర్ సహా 12 జిల్లాలున్నాయి. కానీ ముంబై, థానే, పుణే నగరాలకు పెద్దగా ఊరట లభించలేదు. ముంబై లోకల్ రైళ్లలో సామాన్య ప్రజలకు అమలులో ఉన్న నిషేధాన్ని అలాగే కొనసాగించింది. దీంతో ముంబైకర్లకు మళ్లీ నిరాశే మిగిలింది. ముంబై, థానేలో మాల్స్, నాట్యగృహాలు, సినిమా హాళ్లు పూర్తిగా మూసే ఉంటాయి. ప్రైవేటు కార్యాలయాల్లో 50 శాతం హాజరుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాని దీనిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం స్థానిక సంస్థలకు ఇచ్చింది. కానీ దీనిపై బీఎంసీ ఇంతవరకు ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. అలాగే కొత్త నిబంధనల ప్రకారం సాయంత్రం ఐదు గంటల తరువాత కర్ఫ్యూ కొనసాగనుంది. ఈ సమయంలో జనాలు ఇళ్ల నుంచి అనవసరంగా బయటకురావొద్దు. ఐదు ఫేజ్‌లు– జిల్లాలు ►ఫేజ్–1లో అన్ని నిబంధనలు రద్దు. ఇందులో నాగ్‌పూర్, అహ్మదాబాద్, చంద్రాపూర్, ధులే, గోందియా, జల్గావ్, జాల్నా, లాతూర్, నాందేడ్, యవత్మాల్ జిల్లాలున్నాయి. ►ఫేజ్–2లో అనేక నిబంధనలు రద్దు. ఇందులో హింగోలి, నందూర్బార్ జిల్లాలున్నాయి. ►ఫేజ్–3లో షాపులు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతి. ఇందులో ముంబై, థానే, నాసిక్, పాల్ఘర్, వర్ధా, అకోలా, అమరావతి, ఔరంగాబాద్, బీడ్, భండారా, గడ్చిరోలి, ఉస్మానాబాద్, పర్భణీ, షోలాపూర్, వాషిం జిల్లాలున్నాయి. ►ఫేజ్–4లో షాపులు సాయంత్రం 4 గంటల వరకు తెరిచి ఉంటాయి. ఇతర వ్యవహారాలకు అనుమతి లేదు. ఇందులో పుణే, బుల్డాణ, కోల్హాపూర్, రాయ్‌గడ్, రత్నగిరి, సాంగ్లీ, సాతారా, సిందుధుర్గ్ జిల్లాలున్నాయి. ►ఫేజ్–5లో సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల వరకు షాపులు తెరిచి ఉంటాయి. ఇందులో ఇంతవరకూ ఏ జిల్లాలు లేవు. ఐదు ఫేజ్‌లు ►ఫేజ్–1లో వారంలో కరోనా రోగులు 5 శాతానికంటే తక్కువ నమోదు కావాలి. ఆక్సీజన్ బెడ్లలో 25 శాతానికి కంటే తక్కువ రోగులుండాలి. ►ఫేజ్–2లో వారంలో 5 శాతానికంటే తక్కువ రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్లలో 25–40 శాతం రోగులుండాలి. ►ఫేజ్–3లో వారంలో 5–10 శాతం రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్లలో 40 శాతానికిపైగా రోగులుండాలి. ►ఫేజ్–4లో వారంలో 10–20 శాతం రోగులు నమోదు కావాలి. ఆక్సిజన్ బెడ్ల వినియోగం 60 శాతాని కంటే పైగా ఉండాలి. ►ఫేజ్–5లో వారంలో 20 శాతానికంటే ఎక్కువ రోగులు, ఆక్సిజన్ బెడ్లు 75 శాతానికిపైగా రోగులతో ఉండాలి. తాజా సడలింపులివీ.. ►అత్యవసర సేవలందించే షాపులు రోజు సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంటాయి. ►ఇతర షాపులు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు తెరిచి ఉంటాయి. శని, ఆదివారాలు మూసి ఉంటాయి. ►రెస్టారెంట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం నాలుగు గంటల వరకు 50 శాతం సిట్టింగ్‌తో నిర్వహించుకోవచ్చు. హోం డెలివరీ/ పార్సిల్ సేవలు కొనసాగించొచ్చు. ►సార్వజనిక మైదానాలు, ఉద్యాన వనాలు, వాకింగ్ ట్రాక్‌లు ఉదయం 5 నుంచి తొమ్మిది వరకు తెరిచి ఉంటాయి. ►వ్యాయామ శాలలు, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు సాయంత్రం 4 గంటల వరకు, 50 శాతం సిట్టింగు, ఏసీ షాపులు బంద్. ►సినిమాలు, సీరియళ్ల షూటింగులకు స్టూడియోల్లో సాయంత్రం 5 గంటల వరకు అనుమతి. ►సాంస్కృతిక కార్యక్రమాలకు సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 4 గంటల వరకు అనుమతి. 50 శాతం సిట్టింగ్. ►పెళ్లిలు, ఇతర శుభ కార్యాలకు ఫంక్షన్ హాలు సామర్థ్యాన్ని బట్టి 50 శాతం అనుమతి. అంత్యక్రియలకు కేవలం 20 మందికే అనుమతి. ►బెస్ట్ బస్సుల్లో వంద శాతం అనుమతి, స్టాండింగ్‌కు అనుమతి లేదు. ►అన్ని రకాల ఆన్లైన్ కోనుగోళ్లకు పూర్తి స్థాయిలో అనుమతి. -
Maharashtra: అన్‌లాక్ ప్రకటనపై సర్కారు యూటర్న్!
మహారాష్ట్రలో కరోనా కట్టడికి కఠినంగా లాక్డౌన్ అమలు అవుతోంది. అయితే ప్రజలకు ఊరటనిచ్చేలా శుక్రవారం నుంచి అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించబోతున్నట్లు స్వయంగా మంత్రి ప్రకటించడం.. ఆ వెంటనే ప్రభుత్వం నుంచి విరుద్ధ ప్రకటన వెలువడడంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. దీనిపై శుక్రవారం ఉదయం మరోసారి స్పష్టమైన ప్రకటన వెలువడింది. ముంబై: కరోనా కట్టడికి మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కొంత మేర కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో శుక్రవారం నుంచి ఆంక్షలను సడలించడానికి 5 స్థాయిల్లో అన్‌లాక్ ప్రణాళికను విధించాలని నిర్ణయించినట్లు మహారాష్ట్ర మంత్రి విజయ్ వాడేటివార్ గురువారం ఉదయం ప్రకటించారు. అయితే ఆయన నుంచి ప్రకటన వెలువడగానే మీడియా కథనాలు వచ్చాయి. దీంతో జనాలు హర్షం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సాయంత్రం పూట మహా సర్కార్ కీలక ప్రకటన చేసింది. తూచ్.. అటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఇది ఒక ప్రతిపాదన మాత్రమే అని రాష్ట్ర ప్రభుత్వం సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేసింది. కోవిడ్ -19 యొక్క రెండవ వేవ్ ఉధృతి ఇంకా తగ్గలేదని, ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం తీసుకోబోదని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఒక అధికారిక ప్రకటన కూడా విడుదల అయ్యింది. అయితే ఈ ప్రకటనపై విజయ్ వాడేటివార్ మరోసారి స్పందించారు. ఆక్సిజన్ బెడ్స్ లభ్యత, పాజిటివిటీ రేట్ తగ్గుదల పరిస్థితుల దృష్ట్యా లాక్డౌన్ ఎత్తివేతకు నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమేనని, అయితే దీనిపై అధికారికంగా ఒక స్పష్టత రాలేదని ఆయన చెప్పారు. ఇక భేటీలో అన్‌లాక్ ప్రక్రియపై నిర్ణయం తీసుకున్నప్పటికీ తుది నిర్ణయం మాత్రం సీఎం ఉద్దవ్ చేతుల్లోనే ఉంటుందని ప్రతిపక్ష నేత ఒకరు తెలిపారు. కాగా, మహారాష్ట్రలో బుధవారం 15 వేలకు పైగా కొత్త కేసులు, 285 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలోని 36 జిల్లాల్లో పాజిటివిటీ రేటు, ఆక్సిజన్ పడకల ఆక్యుపెన్సీ పరిస్థితి ఆధారంగా మహారాష్ట్ర ప్రభుత్వం అన్ లాక్ ప్రక్రియను అమలు చేయాలని కీలక సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. -
లాక్డౌన్ ఎత్తివేత?: అన్‌లాక్ వైపు ప్రభుత్వం మొగ్గు
బనశంకరి: రాష్ట్రంలో వారం నుంచి కోవిడ్–19 కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వం అన్‌లాక్ గురించి యోచిస్తోంది. రెండో దశ కోవిడ్ వికటాట్టహాసం చేసి భారీగా ప్రాణాలను బలిగొంటున్న తరుణంలో మే 10 నుంచి రెండో లాక్డౌన్ ఆరంభమైంది. జూన్ 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఒకనెల రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోగా కరోనా మెల్లగా అదుపులోకి వస్తోంది. బెంగళూరు కూడా కరోనా పీడ నుంచి కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వం అన్‌లాక్‌కు సన్నాహాలు చేస్తోంది. దిగ్బంధం వల్ల పారిశ్రామిక, ఆర్థిక వ్యవస్థలు దెబ్బతిన్నాయి. రాష్ట్ర ఖజానాకు భారీ గండి పడింది. దీంతో అన్‌లాక్ చేయడం యడియూరప్ప సర్కారుకు అనివార్యమైంది. జూన్ 7 నుంచి దశలవారీగా దిగ్బంధాన్ని సడలించి ఆర్థిక కార్యకలాపాలకు పచ్చజెండా ఊపడం తప్ప గత్యంతరం లేదని ఆర్థికశాఖ అధికారులు సర్కారుకు సూచించారు. పొడిగించాలని కమిటీ నివేదిక జూన్ 7వ తేదీ తరువాత రాష్ట్ర ప్రభుత్వం ఏమేం చేయాలి అనే అంశాలతో కోవిడ్ సాంకేతిక సలహా కమిటీ ప్రభుత్వానికి ఒక నివేదికను అందించింది. లాక్డౌన్ కొనసాగించాలా వద్దా, కొనసాగిస్తే ఎన్నిరోజులు, అన్‌లాక్ ఎలా ఉండాలి తదితర అంశాలను పేర్కొంది. ఈ నివేదిక ను ఆరోగ్య మంత్రి సుధాకర్‌కు సమితి అందజేసింది. నివేదికను కృష్ణాలో సీఎం యడియూరప్పకు ఆయన అందజేశారు. మరో 14 రోజుల పాటు లాక్డౌన్ పొడిగించాలని సమితి నివేదికలో సిఫార్సు చేసింది. దీని గురించి ఇరువురూ చర్చించారు. జూన్ 4, 5 తేదీల తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయిస్తామని సీఎం తెలిపారు. 2-3 వేలకు తగ్గినప్పుడే: అశోక్ కోవిడ్ సలహాసమితి నివేదిక ఆధారంగా లాక్డౌన్ పట్ల ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ తెలిపారు. విధానసౌధలో విలేకరులతో మాట్లాడుతూ కేసుల సంఖ్య ఆధారంగా తీర్మానం చేస్తామని అన్నారు. బెంగళూరులో నిత్యం 500 కంటే తక్కువ కోవిడ్ కేసులు నమోదు కావాలి, రాష్ట్రంలో వెయ్యి, మూడు వేల కేసుల స్థాయికి తగ్గినప్పుడే లాక్డౌన్ సడలింపుపై నిర్ణయానికి వస్తామన్నారు. దొడ్డబళ్లాపుర వద్ద అత్యాధునిక వసతులతో కోవిడ్ తాత్కాలిక ఆస్పత్రిని నిర్మించామని, ఇందులో 100 పడకలు ఉంటాయని, ఐసీయూ, వెంటిలేటర్ వసతి ఉందని తెలిపారు. -
మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ ఎత్తివేత
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో మే 31 నుంచి దశల వారీగా లాక్డౌన్ నియంత్రణలను సడలిస్తామని ఢిల్లీ సీఎం అరవింద్ క్రేజీవాల్ వెల్లడించారు. ఢిల్లీలో వైరస్ వ్యాప్తి కట్టడి చేయడంతో మే 31 నుంచి దశల వారీగా అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కరోనా కేసుల పాజిటివిటీ రేటు 2 శాతానికి తగ్గడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఎల్.జీ అనిల్ బైజల్‌ను కలిసిన తర్వాత మీడియాతో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మే 31 నుంచి వ్యాపారాలకు సడలింపులు ఇవ్వనున్నట్లు చెప్పారు. సోమవారం నుంచి ఒక వారం పాటు నగరంలో పరిశ్రమలు, నిర్మాణ కార్యకలాపాలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కరోనా బారినపడకుండా కాపాడటంతో పాటు వారు ఆకలితో చనిపోయే పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని అన్నారు. కరోనావైరస్ వ్యాప్తిని నియంత్రించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలను అనుమతిస్తూ వాటి మధ్య సమతుల్యతను పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు. నిపుణులు, ప్రజల అభిప్రాయం ఆధారంగా ప్రభుత్వం ప్రతి వారం అన్‌లాక్ ప్రక్రియను కొనసాగిస్తుందని అన్నారు. చదవండి: రూ.5 లక్షలు పరిహారం ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్ -
ఢిల్లీలో దశలవారీగా లాక్ డౌన్ సడలింపు
-
లాక్డౌన్ ఎత్తేస్తారట !
ముంబై:లాక్డౌన్ సడలింపుల దిశగా మహరాష్ట్ర సర్కారు అడుగులు వేస్తోంది. ఆ రాష్ట్రంలో క్రమంగా కేసులు తగ్గుముఖం పట్టడంతో పాటు మరణాలు తగ్గిపోతున్నాయి. మరోవైపు పాజిటివిటీ రేటు కూడా ప్రమాదకర స్థాయి కిందికి చేరుకుంది. దీంతో లాక్డౌన్ ఎత్తివేయాలనే యోచనలో అక్కడి ప్రభుత్వం ఉంది. అయితే ఒకేసారి లాక్డౌన్ నిబంధనలు మొత్తం సడలించరని.. దశల వారీగానే అన్‌లాక్ ప్రక్రియ ఉంటుందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే తెలిపారు. 30 నాటికి అన్‌లాక్ పూర్తి మహరాష్ట్రలో ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయన్నారు మంత్రి రాజేశ్‌తోపే. జూన్ 30 నాటికి అన్‌లాక్ పూర్తవుతుందని.. అయితే ఎప్పటి నుంచి అన్‌లాక్ ప్రారంభించాలనే అంశంపై ఇంకా క్లారిటీ రాలేదన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలు అన్‌లాక్‌పై చర్చించి నిర్ణయం తీసుకుంటారని మంత్రి అన్నారు. 4 దశల్లో మొత్తం నాలుగు దశల్లో అన్‌లాక్ అమలు చేయనున్నారు. మొదటి దశలో నిత్యవసర వస్తువులు అమ్మే షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించారు. అలా ఒకర్కో రంగానికి లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ మొత్తం నాలుగు దశలో సాధారణ పరిస్థితులు నెలకొనేలా చూస్తారు. అయితే ఆగష్టు నుంచి అక్టోబరు మధ్య కాలంలో థర్ఢ్ వేవ్ ముప్పు సూచనలు ఉన్నందున పూర్తి స్థాయి అన్‌లాక్ చేయోద్దంటున్నారు వైద్య నిపుణులు. క్రమంగా దేశవ్యాప్తంగా అంతులేని విషాదం సృష్టించిన కరోనా సెకండ్ వేవ్ మహరాష్ట్ర నుంచే మొదలైంది. రోజుకు వేల సంఖ్యలో కేసులు, వందల సంఖ్యలో మరణాలు రావడంతో అందరి కంటే ముందుగా మహారాష్ట్ర లాక్డౌన్ విధించింది. ఇప్పుడు అన్‌లాక్ ప్రక్రియ కూడా మహరాష్ట్ర నుంచే మొదలు కానుంది. దీంతో దేశం క్రమంగా అన్‌లాక్ దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది -
హైదరాబాద్ మెట్రో.. అదే తీరు!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో పూర్తిస్థాయిలో అన్‌లాక్ అయినా మెట్రో ప్రయాణికుల సంఖ్య మాత్రం అదే స్థాయిలో పెరగడంలేదు. లాక్‌డౌన్‌కు ముందు (ఈ ఏడాది మార్చి 22)తో పోలిస్తే ప్రస్తుతం మూడు రూట్లలో మెట్రో ప్రయాణికుల సంఖ్య 38 శాతం దాటకపోవడం గమనార్హం. ఎల్బీనగర్–మియాపూర్, జేబీఎస్–ఎంజీబీఎస్, నాగోల్–రాయదుర్గం మార్గాల్లో మార్చి నెలకు ముందు నిత్యం 3.5 లక్షల మంది జర్నీ చేసేవారు. ప్రస్తుతం మూడు మార్గాల్లో నిత్యం 1.33 లక్షల మంది మెట్రో జర్నీ చేస్తుండడం గమనార్హం. సువర్ణ ఆఫర్‌తో ప్రయాణికులకు ఛార్జీల్లో రాయితీతోపాటు స్మార్ట్‌కార్డులో రీఛార్జీపై క్యాష్‌బ్యాక్ ఆఫర్ అమలు చేస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్య అరకొరగానే పెరిగినట్లు స్పష్టమౌతోంది. ఆఫర్లు ప్రకటించినా.. దసరా, దీపావళి సందర్భంగా మెట్రోరైలు సంస్థ మెట్రో సువర్ణ ఆఫర్‌ను ప్రకటించింది. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఈ ఆఫర్లో భాగంగా ఛార్జీల్లో రాయితీ కల్పించడంతోపాటు.. స్మార్ట్‌కార్డ్ రీఛార్జీపై క్యాష్‌బ్యాక్‌ఆఫర్ అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 15 వరకు ఈ ఆఫర్లు అమలుకానున్నాయి. అయితే ఆఫర్ల ద్వారా మెట్రో ప్రయాణికుల సంఖ్యను లాక్డౌన్ ముందున్న సంఖ్యకు చేర్చేందుకు మెట్రో అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రయాణీకుల సంఖ్య పెరగకపోవడానికి కారణాలివే.. - సిటీజన్లలో కోవిడ్ భయాందోళనలు తొలగకపోవడం. కోవిడ్ సెకండ్‌వేవ్ మొదలౌతుందన్న ఆందోళన. - ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అమలవుతుండడం. - మెట్రో స్టేషన్ల వద్ద బైక్, కార్ల పార్కింగ్‌కు చెల్లించే ఛార్జీలు తడిసి మోపెడు కావడం. - మెట్రో స్టేషన్ల నుంచి సమీప కాలనీలకు, బస్తీలకు కనెక్టివిటీ లేకపోవడంతో ఆటో, క్యాబ్ ఛార్జీలతో జేబులు గుల్లకావడం. - వ్యక్తిగత వాహనాలపై వెళితే కోవిడ్ బారిన పడకుండా జాగ్రత్త పడొచ్చన్న భావన. - మెట్రో కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేస్తున్నప్పటికీ.. ఏసీ బోగీల్లో సులభంగా కోవిడ్ వ్యాప్తి చెందుతుందన్న భయాందోళనలు. క్రమంగా ప్రయాణికుల సంఖ్య పెరుగుతోంది నగరంలో మూడు మార్గాల్లో మెట్రో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. క్యాష్‌బ్యాక్ ఆఫర్, సువర్ణ ఆఫర్ సత్ఫలితాన్నిస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 18 ఏళ్లుగా మెట్రో సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నగరం మినహా నూతనంగా మెట్రో ప్రారంభమైన మిగతా మెట్రోసిటీలతో పోలిస్తే నగరంలో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు తాజా గణాంకాలు చూస్తే అర్థమౌతుంది. – ఎన్వీఎస్రెడ్డి, హెచ్ఎంఆర్, ఎండీ -
అన్‌లాక్ థియేటర్స్
థియేటర్లు రీ ఓపెన్ చేయొచ్చని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నెల ప్రారంభంలోనే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో చాలా చోట్ల థియేటర్స్‌ను ఓపెన్ చేశారు. కానీ తమిళనాడు ప్రభుత్వం మాత్రం థియేటర్స్ తెరవడానికి అనుమతి ఇవ్వలేదు. తాజాగా నవంబర్ 10 నుంచి మల్టీప్లెక్స్‌లు, థియేటర్స్ అన్నింటినీ అన్‌లాక్ చేయొచ్చని ప్రకటించింది. ఈ ప్రకటనతో థియేటర్స్ యజమానులు తాళాలు తీయడానికి రెడీ అవుతున్నారు. 50 శాతం సీటింగ్‌తో అనుమతి ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. -
ఇప్పట్లో థియేటర్‌కు వెళ్లే ఆలోచనే లేదు..!
న్యూఢిల్లీ: అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా అక్టోబరు 15 నుంచి సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు కేంద్రం వెసలుబాటు కల్పించినా.. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం ఇంకా ఆ దిశగా అడుగులు పడటం లేదు. మరికొన్ని రాష్ట్రాలు ఇందుకు అంగీకరించినా.. యాభై శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్ల నిర్వహణ కష్టతరమంటూ ఎగ్జిబిటర్లు తేల్చిచెప్తున్నారు. మరోవైపు.. కరోనా లాక్‌డౌన్‌తో వాయిదాపడ్డ సినిమాలను విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు. ఉత్తరాది, దక్షిణాది అనే తేడా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రాలను వెండితెర మీద ప్రదర్శించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. మరి, దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో ప్రేక్షకులు నిజంగానే థియేటర్‌కు వెళ్లి సినిమా చూడాలానుకుంటున్నారా? రానున్న రెండు నెలల్లో కొత్త సినిమాలు విడుదలైతే థియేటర్‌కు వెళ్లేందుకు ఎంత మంది సిద్ధంగా ఉన్నారు? అన్న అంశాలపై లోకల్ సర్కిల్స్ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.(చదవండి: నవంబర్ 30 వరకూ అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ అమలు) థియేటర్‌కు వెళ్లే ప్రసక్తే లేదు! ఈ ఆన్లైన్ సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 8274 మంది అభిప్రాయాలు సేకరించగా.. వారిలో కేవలం 7 శాతం మంది మాత్రమే థియేటర్లకు వెళ్లేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. వీరిలో 4 శాతం మంది కేవలం కొత్త సినిమా రిలీజ్ అయితే మాత్రమే వెళ్తామని చెప్పగా, 3 శాతం మంది.. కొత్త, పాత అనే తేడా లేకుండా థియేటర్లో ఏ సినిమా అయినా చూసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. ఇక అత్యధికంగా 74 శాతం మంది మాత్రం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా ఉండగా, 2 శాతం మంది కచ్చితమైన అభిప్రాయమేదీ వెల్లడించలేదని సర్వే పేర్కొంది. మిగిలిన 17 శాతం మంది మాత్రం థియేటర్లో సినిమా చూసే ఆలోచనే తమకు లేదని స్పష్టం చేసినట్లు తెలిపింది. కాగా లోకల్‌సర్కిల్స్ జూలైలో నిర్వహించిన సర్వేలో, 72 శాతం మంది, ఆగష్టునాటి సర్వేలో 77 శాతం మంది ప్రస్తుత పరిస్థితుల్లో తాము థియేటర్లకు వెళ్లేందుకు ఏమాత్రం సిద్ధంగాలేమని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది ఓటీటీ ప్లాట్‌ఫాంలవైపే మొగ్గుచూపుతున్నారని వెల్లడైంది. వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రానందున ఇంట్లోనే కూర్చుని సినిమా చూసేందుకు ఇష్టపడతున్నట్లు పేర్కొంది. కాగా కోవిడ్ లాక్డౌన్ కారణంగా, గత ఏడు నెలలుగా థియేటర్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో సినీరంగం కుదేలైంది. సినీ కార్మికులు, జూనియర్ ఆర్టిస్టులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో కొంతమంది తాత్కాలిక ఉపాధి మార్గాల వైపు మళ్లగా, మరికొంత మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇక కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం మంగళవారం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. కాగా మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ సహా ఈశాన్య రాష్ట్రాలు థియేటర్ల ఓపెనింగ్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉంటే కర్ణాటక, గుజరాత్, బెంగాల్, యూపీ, బిహార్, ఢిల్లీ తదితర 14 రాష్ట్రాల్లో థియేటర్లు తెరచుకున్నాయి. -
స్కూళ్లు మరింత ఆలస్యం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేనట్లే. ఆరం భం మరింత ఆలస్యమయ్యేట్టు ఉంది. అన్ లాక్ నిబంధనల పొడగింపుతో స్కూళ్ల పునః ప్రారంభంపై సందిగ్ధత నెలకొంది. అన్‌లాక్–5 నిబంధనలను నవంబర్ నెలాఖరు వరకు పొడగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గతంలో నవంబర్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని అధికారులు యోచించారు. పది రోజుల కిందట జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో.. దసరా తర్వాత మరోసారి సమావేశమై తుది నిర్ణయం తీసుకోవాలన్న ఆలోచనకు వచ్చారు. అయితే కేంద్రం జారీ చేసిన అన్‌లాక్–5 నిబంధనల్లో పాఠశాలల ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవచ్చని, అయితే కేంద్రం పేర్కొన్న నిబంధనలను పక్కాగా అమలు చేయాలని పేర్కొంది. క్షేత్రస్థాయి పరిస్థితులు అంచనా వేసిన తర్వాత విద్యాసంస్థల పునః ప్రారంభంపై నిర్ణయం తీసుకోవాలని, ఆన్లైన్/దూరవిద్యా బోధనకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల లిఖితపూర్వక అనుమతితోనే విద్యార్థులను పాఠశాలలకు అనుమతించాలని, హాజరును తప్పనిసరి చేయకూడదని స్పష్టం చేసింది. ఇప్పుడు కరోనా కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో అవే నిబంధనలను మరో నెల రోజులపాటు పొడిగించడంతో నవంబర్ మొదటివారంలో పాఠశాలలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించట్లేదు. ఇంజనీరింగ్ వంటి సాంకేతిక, వృత్తివిద్యా కోర్సుల తరగతులను డిసెంబర్ 1 లోగా ప్రారంభించుకోవచ్చని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) పేర్కొన్న సంగతి తెలిసిందే. డిగ్రీ తరగతుల ప్రారంభంపైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. -
నవంబర్ 30 వరకూ అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ అమలు
-
నవంబర్ 30 వరకూ అన్‌లాక్ 5.0 పొడిగింపు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తూ సెప్టెంబర్‌లో ప్రకటించిన అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పేర్కొంది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు నవంబర్ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఇంకా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు కఠినతరం చేయాలని పేర్కొంది. ప్రభుత్వం అనుమతించిన సేవలు మినహా అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత యధావిధిగా కొనసాగుతుంది. దశలవారీగా స్కూళ్లు, విద్యాసంస్ధలను తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. చదవండి : భారత్‌లో తగ్గుముఖం పట్టిన కరోనా -
పట్టాలెక్కని ‘పరిశ్రమ’
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మూలంగా రాష్ట్రం లో పారిశ్రామిక వృద్ధిరేటు గణనీయంగా తగ్గిపోయినట్లు రాష్ట్ర అర్థ గణాంక విభాగం నివేదికలు వెల్లడిస్తున్నాయి. ప్రధానంగా మాన్యుఫాక్చరింగ్, మైనింగ్, క్వారీ విభాగాల్లో ఉత్పత్తి తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో సిబ్బంది, కార్మికుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు క్షేత్రస్థాయి పరిశీలనలో వెల్లడవుతోంది. వ్యవసాయ, సేవా రంగాల తర్వాత పారిశ్రామిక రంగం ఎక్కువ మందికి (సుమారు 18 శా తం) ఉపాధి కల్పిస్తుండగా, కోవిడ్ మూలం గా పారిశ్రామిక రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 50– 60 శాతమే ఉత్పత్తి రాష్ట్రంలోని పారిశ్రామిక ఉత్పత్తి సామర్థ్యంతో పోలిస్తే కేవలం 50 నుంచి 60 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోందని పారిశ్రామిక వర్గాలు చెప్తున్నాయి. ఫార్మా, లైఫ్ సైన్సెస్‌తో పాటు ఆటోమొబైల్, మైన్స్, మినరల్స్, టెక్స్టైల్స్, స్టీలు, సిమెంట్ తదితర పరిశ్రమలు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నాయి. కోవిడ్ పరిస్థితుల్లో ఫార్మా, బల్క్ డ్రగ్ మినహా ఇతర కేటగిరీలకు చెందిన పరిశ్రమలు అన్నీ తీవ్రంగా ప్రభావితం అయ్యాయి. అన్‌లాక్ ప్రక్రియ తొలి విడతలోనే పరిశ్రమలకు నిబంధనలు సడలింపు ఇచ్చినా వివిధ కారణాలతో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో పట్టాలు ఎక్కడం లేదు. ముడిసరుకుల కొరత, రవాణా, మార్కెటింగ్ సమస్యలతో పాటు కొన్ని కేటగిరీలకు చెందిన పరిశ్రమల్లో కార్మికుల కొరత వల్ల పరిశ్రమలు పూర్తి సామర్థ్యంతో ఉత్పత్తి చేయడం లేదు. సిబ్బంది, కార్మికుల ఉపాధికి దెబ్బ లాక్డౌన్ మూలంగా మార్చి, ఏప్రిల్ మాసాల్లో అరకొర వేతనాలు చెల్లించిన పరిశ్రమల యాజమాన్యాలు ఆ తర్వాత ఉత్పత్తి తగ్గడాన్ని కారణంగా చూపిస్తూ సిబ్బంది, కార్మికుల సంఖ్యను తగ్గించాయి. ప్రతి ఏటా ఏప్రిల్‌లో కాంట్రాక్టు కార్మికులను రెన్యువల్ చేస్తూ వచ్చిన పరిశ్రమలు కోవిడ్ మూలంగా రెన్యువల్ ఊసెత్తకపోవడంతో పలువురు ఉపాధి కోల్పోయారు. వీరిలో అవసరమైన వారిని మాత్రమే తాత్కాలికంగా విధుల్లోకి తీసుకుంటుండగా, మరికొందరి వేతనాల్లో భారీగా కోత విధించారు. రూ.15వేల కంటే తక్కువ వేతనం ఉన్న వారిని మినహాయించి, ఇతర కేటగిరీలకు చెందిన కార్మికులు, సిబ్బంది వేతనాల్లో పరిశ్రమలు కోత విధిస్తున్నాయి. వేతన ఒప్పందాల్లో ‘డిఫర్మెంట్’ మూడేళ్లకు ఒకసారి వేతన ఒప్పందం జరగా ల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మరో రెండేళ్లపాటు నూతన ఒప్పందాలు వాయిదా వేస్తామని యాజమాన్యాలు సంకేతాలిస్తున్నాయి. ఇప్పటికే అమల్లో ఉన్న ఒప్పందాల్లోనూ డిఫర్‌మెంట్‌ను కోరుతూ కార్మిక సంఘాలు, సిబ్బందికి యాజమాన్యా లు లేఖలు రాస్తున్నాయి. ఒప్పందం మేరకు సిబ్బందిని పర్మినెంట్ చేయాల్సి ఉండగా వేచి చూడాలని చెప్తున్నాయి. తిరిగి వస్తున్న వలసకార్మికులు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల్లో బీహార్, యూపీ, మధ్యప్రదేశ్, ఒడిషా, పశ్చిమ బెంగాల్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల కార్మికులే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. లాక్డౌన్ పరిస్థితుల్లో సుమారు లక్షన్నర మందిని రాష్ట్ర ప్రభుత్వం స్వస్థలాలకు తరలించింది. ప్రస్తుతం పరిస్థితులు కొంత మేర కుదుటపడటంతో వీరు తిరిగి గతంలో తాము పనిచేసిన ప్రదేశాలకు చేరకుంటున్నారు. లోహ, ఫ్యాబ్రికేషన్, వాటి అనుబంధ పరిశ్రమల్లో వలస కార్మికులను రప్పించేందుకు యాజమాన్యాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. మరో ఆరు నెలల్లో సాధారణ పరిస్థితి పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారం భించేందుకు మరో ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది. వలస కార్మికులు తిరిగి ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి చేరుకుంటున్నారు. ఇటీవలి వర్షాలతో పారిశ్రామిక ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బోనస్ డిఫర్మెంట్ కోసం యాజమాన్యాలు ప్రయత్నిస్తున్నాయి. పరిశ్రమలు మళ్లీ పూర్వస్థితికి చేరుకుంటేనే కార్మికులు, సిబ్బందికి పూర్తిస్థాయిలో వేతనాలు, బోనస్ ఇవ్వడం సాధ్యమవుతుంది. – కె. సుధీర్‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య అసంఘటిత కార్మికులకు భద్రతలేదు అసంఘటిత కార్మికుల ఉపాధి, ఉద్యోగాలకు భద్రత లేకుండా పోయిం ది. ఉత్పత్తి తగ్గడా న్ని కారణంగా చూపుతూ వేతన ఒప్పందాలు మొదలుకుని, అన్ని రకాలైన డిఫర్మెంట్లకు యాజమాన్యాలు మొగ్గు చూపుతున్నాయి. ఉద్యోగులను తొలగించొద్దని ప్రభుత్వం చెప్తున్నా పరిస్థితి భిన్నంగా ఉంది. –బి.మల్లేశం, అధ్యక్షులు, సీఐటీయూ, సంగారెడ్డి జిల్లా -
పలు రాష్ర్టాల్లో తెరుచుకున్న థియేటర్లు
కరోనా నేపథ్యంలో దాదాపు ఏడు నెలలుగా మూతబడ్డ సినిమా థియేటర్లు అన్‌లాక్ 5.0లో భాగంగా నేడు(అక్టోబర్ 15)న తిరిగి తెరుచుకున్నాయి. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక సహా 15 రాష్ర్టాల్లో సినిమా థియేటర్లు తిరిగి ప్రారంభమయినట్టు సమాచారం. కరోనా నేపథ్యంలో థియేటర్లో కొన్ని మార్పులు చేశారు. ప్రేక్షకుడు ఒక సీటు వదిలి మరో సీటు కుర్చునే విధంగా సామాజిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. కూల్‌డ్రింక్, పాప్‌కార్న్ వంటి తినే పదార్థాలపై యూవీ కిరణాలతో క్రిమిరహితం చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. థియేటర్ లోపలికి అనుమతించడానికి ముందే ప్రేక్షకుల శరీర ఉష్ణోగ్రత పరీక్షిస్తున్నారు. సాధారణ టెంపరేచర్ ఉంటేనే లోపలికి పంపిస్తున్నారు. ఎప్పటికప్పడు శానిటైజేషన్ చేస్తూ సిబ్బంది తగన ఏర్పాట్లు చేశారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం వారి ఫోన్‌నంబర్లను కూడా నమోదు చేసుకున్నారు. కొత్తగా రిలీజ్ అవుతున్న సినిమాలతో పాటు ఇదివరకే విడుదలైన చిచోరే, కేథర్నాథ్, మలంగ్, తప్పడ్ వంటి చిత్రాలను కూడా వేస్తున్నారు. (సినిమా థియేటర్లను ఆదుకోవాలి) అక్టోబర్ 15 నుంచి దేశంలోని థియేటర్లను ఆయా రాష్ర్ట ప్రభుత్వాల అనుమతితో తెరుచుకోవచ్చని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు, కేరళ, ఛత్తీస్గడ్ వంటి రాష్ట్రాల్లో మాత్రం మల్టీపెక్సులు తెరిచేందుకు అక్కడి ప్రభుత్వాలు అనుమతివ్వలేదు. లాక్డౌన్ కాలానికి సంబంధించి థియేటర్ విద్యుత్ ఛార్జీలు మాఫీ చేయాలనే డిమాండ్‌తో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ రాష్ర్టాల్లో మాత్రం మల్టీపెక్సులు ఇంకా తెరుచుకోలేదు. దేశ వ్యాప్తంగా 3100 మల్టీపెక్సు థియేటర్లు ఉన్నా ప్రస్తుత కోవిడ్ నేపథ్యంలో కొన్ని థియేటర్లను మాత్రమే తెరిచారు. అంతేకాకుండా షో టైమింగ్‌లో కూడా మార్పులు చోటుచేసుకున్నాయి. చాలా థియేటర్లలో మధ్యాహ్నం 12 నుంచి 8 గంటల వరకు మాత్రమే స్ర్కీన్ టైమింగ్ ఉండేలా సరికొత్త నిబంధనలు విధించారు. (సినిమా హాళ్లు తెరవలేం) -
ఏపీలో అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్ విడుదల
సాక్షి, అమరావతి: ఇటివల కేంద్ర ప్రభుత్వం ఆన్‌లాక్ 5 మార్గదర్శకాలను ప్రకటించడంతో.. కరోనా నుంచి ప్రజల జీవన విధానం సాధారణ స్థితికి వచ్చింది. దాదాపు అన్ని రకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు యతావిధిగా సాగుతున్నాయి. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి రానున్న ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధిదంచిన అన్‌లాక్ 5.0 గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు, భౌతికదూరం తప్పనిసరి అని పేర్కొంది. సినిమాహాళ్లు, షాపింగ్ మాల్స్, షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రజారవాణాలో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. చదవండి: ఏపీ: కరోనా తగ్గుముఖం పట్టింది.. మాస్క్ లేకుంటే షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్‌లో ప్రవేశం నిరాకరించాలని తెలిపింది. కోవిడ్ నిబంధనలు అమలయ్యేలా పర్యవేక్షణకు ప్రత్యేక అధికారి ఉండేలా నిర్ణయించిన ప్రభుత్వం బస్టాండ్, రైల్వేస్టేషన్లలో మాస్క్‌లు ధరించేలా ప్రచారం నిర్వహించాలని, మైక్ అనౌన్స్మెంట్ ఏర్పాటు చేయాలని పేర్కొంది. సినిమా హాల్స్‌లో కోవిడ్ నిబంధనలపై టెలీ ఫిల్మ్ ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాని వెల్లడించింది. స్కూళ్లు, విద్యా సంస్థలు, పారిశ్రామిక కార్యకలాపాలు నిర్వహించే చోట కేంద్ర మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. విద్యార్థులు, అధ్యాపకులు ప్రతి పీరియడ్ తర్వాత శానిటైజేషన్ చేసుకునేలా యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని తెలిపింది. చదవండి: ఏపీ: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు -
31 వరకూ స్కూల్స్ మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ నేపథ్యంలో ఢిల్లీలో అన్ని స్కూల్స్ మూసివేత అక్టోబర్ 31 వరకూ కొనసాగుతుందని డిప్యూటీ ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా స్పష్టం చేశారు. దేశ రాజధానిలో ఈనెల 5 తర్వాత స్కూళ్లు తెరుస్తారని ఢిల్లీ ప్రభుత్వం గతంలో ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 31 వరకూ స్కూల్స్‌ను తెరవబోమని, ఆన్లైన్ క్లాసులు యథాతథంగా జరుగుతాయని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. ఓ తండ్రిగా పరిస్థితి తీవ్రతను తాను అర్థం చేసుకోగలనని, ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంతో రిస్క్ చేయడం సరైంది కాదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారని సిసోడియా ఆదివారం ట్వీట్ చేశారు. కాగా అక్టోబర్ 15 తర్వాత దశలవారీగా స్కూళ్లు, కాలేజీలు, విద్యాసంస్ధల పున:ప్రారంభంపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఓ నిర్ణయం తీసుకుంటాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించిన అన్‌లాక్ 5 మార్గదర్శకాల్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక స్కూల్స్‌ను తిరిగి తెరిస్తే విద్యార్ధులకు అటెండన్స్‌ను తప్పనిసరి చేయరాదని, తల్లితండ్రుల అనుమతితోనే విద్యార్ధులను స్కూళ్లకు రప్పించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను ప్రకటించడంతో మార్చి నుంచి విద్యాసంస్ధలన్నీ మూతపడ్డాయి. అయితే వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్ల పున:ప్రారంభంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
15 నుంచి థియేటర్లను ప్రారంభిస్తాం
చిక్కడపల్లి (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈనెల 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నా మని తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం పేర్కొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫునుంచి అనుమతులు లభించాల్సి ఉందని, ఇదే అంశంపై సోమవారం ఎఫ్డీసీ చైర్మన్, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, సీఎం కేసీఆర్‌లను కలసి వినతిపత్రాలను అందజేయనున్నట్లు తెలిపింది. ఆర్టీసీక్రాస్‌రోడ్డు లోని సుదర్శన్ 35 ఎంఎం థియేటర్లో తెలంగాణ థియేటర్ల యజమానుల సంఘం శని వారం ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ సంఘం కార్యదర్శి విజయేందర్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శి రాజ్‌గోపాల్ తాండ్ల మాట్లాడుతూ.. నష్టాల్లో ఉన్న తమకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. థియేటర్లు మూసివేసి ఉన్న నెలలకు ఫిక్స్ కరెంట్ ఛార్జీలను, ప్రాపర్టీ ట్యాక్స్‌లను తొలగించాలని కోరారు. భౌతిక దూరం పాటించడంలో భాగంగా థియేటర్లలో ఆల్టర్నేట్ సీట్లను ఏర్పాటు చేశామన్నారు. టికెట్ కౌంటర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. హ్యాండ్ శానిటైజర్లు ఏర్పాటు చేస్తున్నామని, పాత టికెట్ ధరలనే కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పార్కింగ్ చార్జీలను మళ్లీ కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రతినిధులు కె.సురేశ్, బాదం వెంకటకృష్ణ, గోపాల్‌రెడ్డి, సంధ్యా థియేటర్ మేనేజర్ మధుసూదన్, సుదర్శన్ థియేటర్ మేనేజర్ శ్రీనివాస్‌రెడ్డి, దేవి థియేటర్ మేనేజర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహన అమ్మకాలు అదుర్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహనాల విక్రయాలు సెప్టెంబర్‌లో పుంజుకున్నాయి. ప్రధాన కంపెనీల అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి. ఒక్క టీవీఎస్ మోటార్ విక్రయాలు మాత్రం స్వల్పంగా క్షీణతను చవిచూశాయి. దేశవ్యాప్తంగా అన్‌లాక్ ప్రక్రియ 5.0 ప్రారంభం కావడం, కోవిడ్ వ్యాప్తి భయాలతో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడం తదితర కారణాలు అమ్మకాలను పుంజుకునేలా చేశాయి. ఈ సెప్టెంబర్‌లో హీరో మోటోకార్ప్, హోండా మోటర్‌సైకిల్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీల మొత్తం విక్రయాలు 17,33,777 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే నెలలో నమోదైన 15,43, 353 యూనిట్లతో పోలిస్తే 1 శాతం ఎక్కువ. ఇదే ఏడాది ఆగస్ట్ నెల విక్రయాల(14,41041)తో పోలిస్తే 20 శాతం అధికమని గణాంకాలు చెబుతున్నాయి. అవుట్‌లుక్: కరోనా విజృంభిస్తున్న తరుణంలో ప్రజలు ఆరోగ్య భద్రత దృష్ట్యా వ్యక్తిగత రవాణాకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ ఏడాదిలో దేశవ్యాప్తంగా వర్షపాతం అంచనాలకు మించి నమోదైంది. ఈ నేపథ్యంలో ద్విచక్ర వాహనాలకు మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. పట్టణ ప్రాంతాల్లో డిమాండ్ కొంత స్తబ్ధుగా ఉంది. పండుగ సీజన్ సందర్భంగా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇది పట్టణ ప్రాంతంలోని విక్రయాల లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. -
అన్‌లాక్ 5.0 : రుపీకి జోష్
సాక్షి, ముంబై : అన్‌లాక్ 5.0 సడలింపులు, దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల నేపథ్యంలో దేశీయ కరెన్సీ రూపాయి బాగా పుంజుకుంది. డాలరు మారకంలో రూపాయి 63 పైసలు ఎగిసింది. బుధవారం 73.76 వద్ద ముగిసిన రూపాయి గురువారం ఆరంభంలోనే 22 పైసలు ఎగిసింది. ఆనంతరం మరింత లాభపడి 73.14 వద్ద ఉత్సాహంగా ముగిసింది. అటు దేశీయ కీలక సూచీలు ఆరంభం నుంచి భారీ లాభాలతో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 635 పాయింట్లకుపైగా ఎగిసి 38 700 ఎగువకు చేరింది. అటు నిఫ్టీ కూడా 173 పాయింట్ల లాభంతో 11500 సమీపంలో ఉంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఇండస్ ఇండ్, బజాజ్ ఫిన్, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్, టెక్ మహీంద్ర భారీగా లాభపడుతున్నాయి. అన్‌లాక్ 5.0లో భాగంగా అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో పీవీఆర్, ఐనాక్స్ లాంటి సినిమా రంగ షేర్లలో కొనుగోళ్ల సందడి నెలకొంది. -
15 నుంచి తెరుచుకోనున్న థియేటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోం శాఖ తాజాగా అన్‌లాక్–5 మార్గదర్శకాలను జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో మరిన్ని కార్యకలాపాలు ప్రారంభించేందుకు వీలుగా బుధవారం అన్‌లాక్–5 మార్గదర్శకాలను విడుదల చేసింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖతో విస్తృత సంప్రదింపులు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలను జారీ చేసింది. ఇందులో భాగంగా పాఠశాలలు, విద్యా, శిక్షణ సంస్థలు తెరిచే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. 50 శాతం సీట్ల సామర్థ్యంతో థియేటర్లు, మల్టీప్లెక్స్‌లకు అనుమతిచ్చింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలను యథాతథంగా కొనసాగించింది. అక్టోబర్ 15 నుంచి అనుమతించేవి.. ► 50 శాతం సీట్ల సామర్థ్యంతో సినిమా హాళ్లు, థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరుచుకోవచ్చు. దీనికోసం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రత్యేక నియమావళి జారీ చేస్తుంది. ► వాణిజ్య శాఖ జారీ చేసే ప్రత్యేక నియమావళి ఆధారంగా వాణిజ్య సంస్థలు (బిజినెస్ టు బిజినెస్) ఎగ్జిబిషన్లు తెరుచుకోవచ్చు. ► క్రీడాకారుల శిక్షణ కోసం ఉపయోగించే స్విమ్మింగ్ పూల్స్‌కు అనుమతి. దీనిపై క్రీడల మంత్రిత్వ శాఖ ప్రత్యేక ప్రామాణిక నియమావళి జారీ చేస్తుంది. ► ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఈ తరహా సంస్థలు తెరుచుకోవచ్చు. విద్యా సంస్థల ప్రారంభంపై మార్గదర్శకాలు.. ► అక్టోబర్ 15 తర్వాత పాఠశాలలు, కళాశాలలు, శిక్షణ సంస్థలను దశల వారీగా ప్రారంభించుకునే వెసులుబాటును కేంద్రం రాష్ట్రాలకు విడిచిపెట్టింది. అయితే ఆయా సంస్థలు కేంద్రం విధించిన షరతులను పాటించాలి. ► ఆన్లైన్ విద్య, దూరవిద్య కొనసాగాలి. హాజరు నిబంధనలు అమలు చేయరాదు. ► విద్యార్థులు పాఠశాలకు రాకుండా ఆన్లైన్ తరగతులకు హాజరు కావడానికి ఇష్టపడితే అందుకు వారిని అనుమతించాలి. ► తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతితో మాత్రమే పాఠశాలలు, శిక్షణ సంస్థలకు విద్యార్థులు హాజరుకావచ్చు. ► పాఠశాలలు, శిక్షణ సంస్థలను తెరిచేందుకు కేంద్ర విద్యా శాఖ జారీ చేసే నియమావళి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకు సంబంధించి నియమావళి తయారు చేసుకోవాలి. ► రాష్ట్రాల ప్రామాణిక నియమావళిని పాఠశాలలు తప్పనిసరిగా పాటించాలి. ► కరోనా పరిస్థితిని అంచనా వేసి కేంద్ర హోం శాఖతో సంప్రదించి కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు ప్రారంభించవచ్చు. ► సైన్స్ అండ్ టెక్నాలజీ స్ట్రీమ్‌లోని పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అక్టోబర్ 15 నుంచి ఉన్నత విద్యా సంస్థలు తెరిచేందుకు అనుమతిస్తారు. ఈ విషయంలో కేంద్ర నిధులతో పనిచేసే ఉన్నత విద్యా సంస్థల అధిపతి ఈ అవసరాన్ని గుర్తిస్తారు. రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ వర్సిటీలు తదితరాలపై రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయం. 50 శాతం భర్తీకి అనుమతి.. ► సామాజిక, విద్య, క్రీడలు, వినోదం, సాంస్కృతిక, మత, రాజకీయ వేడుకలు, ఇతర సమ్మేళనాలకు సంబంధించి ప్రస్తుత మార్గదర్శకాల ప్రకారం 100 మంది వరకు అనుమతించారు. అక్టోబర్ 15 తర్వాత కంటైన్మెంట్ జోన్ల వెలుపల 100 మందికి మించి ఇలాంటి సమావేశాల నిర్వహించే అనుమతిని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించింది. ఇందుకు ఈ నియమాలు పాటించాలి. ► హాల్ సామర్థ్యంలో గరిష్టంగా 50 శాతం భర్తీకి అనుమతిస్తారు. గరిష్టంగా 200 మందికి మించకూడదు. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం, థర్మల్ స్కానింగ్, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ వాడకం తప్పనిసరి. అంతర్జాతీయ ఆంక్షలు యథాతథం.. ► హోం శాఖ అనుమతించిన ప్రయాణాలు మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ఆంక్షలు యథాతథంగా కొనసాగుతాయి. ► కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. ► కంటైన్మెంట్ జోన్ల వెలుపల రాష్ట్రాలు కేంద్రంతో సంప్రదించకుండా లాక్డౌన్ విధించరాదు. -
అన్‌లాక్ 5.0 మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: అన్‌లాక్ 5.0లో భాగంగా కేంద్ర హోంశాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. దేశంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే చర్యల్లో భాగంగా మినహాయింపులు ఇచ్చే అంశాలను మార్గదర్శకాల్లో పేర్కొంది. సెప్టెంబర్ 30తో అన్‌లాక్ 4.0 గడువు ముగియడంతో మరిన్ని సడలింపులతో తాజా మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 50 శాతం సీట్లతో సినిమా థియేటర్లు, మల్లీ ప్లెక్సులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల అక్టోబర్ 15 నుంచి సినిమా థియేటర్లు/మల్టీప్లెక్సులు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది. క్రీడాకారుల కోసం స్విమ్మింగ్‌పూల్స్‌కు తెరిచేందుకు అనుమతినిచ్చింది. అంతేగాక, అక్టోబర్ 15 నుంచి స్కూళ్లు తెరిచే అంశంపై నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటును రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కల్పించింది. ఆన్లైన్ క్లాసులు కొనసాగించవచ్చని తెలిపింది. ఇక కోచింగ్ సెంటర్లు, కాలేజీలు దశల వారీగా తెరిచే అంశాన్ని రాష్ట్రాలకే వదిలేసింది. ఇక కంటైన్మెంట్ జోన్లలో అక్టోబర్ 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగనుంది. రాష్ట్రాల మధ్య రాకపోకల్లో ఎలాంటి నిబంధనలు లేవని కేంద్రం స్పష్టం చేసింది. (చదవండి: ఎలన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు) -
బ్రాండ్ ఫ్యాక్టరీ అన్‌లాక్ సేల్ మోడళ్లు సందడి
-
పలు రాష్ట్రాల్లో తెరుచుకోనున్న పాఠశాలలు
సాక్షి, న్యూఢిల్లీ: దాదాపు ఆరు నెలలు తర్వాత పలు రాష్ట్రాల్లో స్కూళ్లు తిరిగి తెరుచుకోనున్నాయి. 9,10, ఇంటర్మీడియెట్ విద్యాసంస్థలు సోమవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తరగతులు నిర్వహిస్తున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో మూతపడిన పాఠశాలలు కోవిడ్ నిబంధనల ప్రకారం జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్‌లో 21 నుంచి ఇక సర్కార్ బడుల టీచర్లు 50 శాతం మంది హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. ఆయా పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయులు సగం మంది చొప్పున రోజు మార్చి రోజు పాఠశాలలకు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కంటైన్మెంట్ జోన్లలో పాఠశాలలు మూసే ఉంటాయి. (చదవండి: కేసుల కంటే రికవరీలే ఎక్కువ) దేశంలో కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రకటించిన తరువాత మార్చి 25 నుంచి దేశంలోని పాఠశాలలు, కళాశాలలు మూసివేయబడ్డ సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, గత 24 గంటల్లో 92,605 కొత్త కేసులతో దేశంలో కరోనా వైరస్ కేసులు 54 లక్షలను అధిగమించిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది. -
అక్టోబర్ 1 నుంచి థియేటర్లు ఓపెన్?
న్యూఢిల్లీ: అన్‌లాక్ ప్రక్రియలో భాగంగా కేంద్రం.. కరోనా వల్ల మూతపడ్డ ఒక్కో రంగానికి విముక్తి కల్పిస్తూ వస్తోంది. కానీ థియేటర్లు తెరవడానికి మాత్రం వెనకడుగు వేస్తోంది. థియేటర్లను తెరిపించి తమ బతుకులను చీకటి నుంచి విముక్తి కల్పించండి అని కోరుతూ వస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మరోవైపు దీన్ని మాత్రమే నమ్ముకున్న చాలామంది బతుకులు రోడ్డున పడ్డాయి. అటు సినిమాలు షూట్ చేయడం పూర్తైన వాళ్లు మాత్రం వచ్చిన రేటుకు ఓటీటీలో రిలీజ్ చేసుకుంటున్నారు. రేపు పొద్దున కూడా ఇదే అలవాటైతే తమ పరిస్థితేంటని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నాళ్లు ఇలా ఉపాధి లేకుండా ప్రభుత్వ అంగీకారం కోసం ఎదురు చూస్తూ కూర్చోవాలని అసహనానికి లోనవుతున్నారు. (చదవండి: తాళాలు తెరవాలి.. ఉద్యోగాలు కాపాడాలి) ఈ క్రమంలో మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా థియేటర్లను తెరిచేందుకు అనుమతివ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మంగళవారం నాడు 'అన్‌లాక్ సినిమాస్ – సేవ్ జాబ్స్’ అంటూ వినతిపత్రాన్ని అందించింది. దీనిపై ఇప్పటివరకు కేంద్రం స్పందించనేలేదు, కానీ సోషల్ మీడియాలో మాత్రం దేశవ్యాప్తంగా అక్టోబర్ 1 నుంచి థియేటర్లు తెరుచుకోనున్నాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం నిబంధనలను కూడా సిద్ధం చేసిందని పుకార్లు లేపుతున్నారు అయితే ఈ వార్త అవాస్తవమని ప్రభుత్వ రంగ సంస్థ పీఐబీ(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్పష్టం చేసింది. ప్రభుత్వం ఇంతవరకు అలాంటి ప్రకటన చేయనేలేదని తేల్చి చెప్పింది. (చదవండి: సుధా మూర్తి కూరగాయలు అమ్మారా?) వాస్తవం: అక్టోబర్ 1 నుంచి థియేటర్లు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతివ్వలేదు. (ఈ వార్త రాసే సమయానికి ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు) -
9, 10, ఇంటర్ విద్యార్థులకు కేంద్రం మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: విద్యార్థులు పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి చదువుకోవాలంటే వారి తల్లిదండ్రుల రాతపూర్వక అనుమతి తప్పనిసరి అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తల్లిదండ్రుల అనుమతి మేరకే విద్యార్థులను పాఠశాలలు, కళాశాలల్లోకి అనుమతించాలని, కట్టడి ప్రాంతాల్లో (కంటైన్మెంట్ జోన్లలో) పాఠ శాలలు, జూనియర్ కాలేజీలు తెరవకూడదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ గురువారం ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. కంటైన్మెంట్ కాని ప్రాంతాల్లో 9, 10వ తరగతి విద్యార్థులకు స్కూళ్లు, జూనియర్ కాలేజీలను స్వచ్ఛందంగా పాక్షికంగా తెరుచు కోవచ్చని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేసేలా పాక్షికంగా ఆయా తరగతులకు సంబంధించిన స్కూళ్లు, కాలేజీలు ఈ నెల 21 నుంచి ప్రారంభించడానికి అనుమతి ఇస్తామని పేర్కొంది. అలాగే పూర్తిస్థాయిలో ఆయా తరగతులకు చెందిన పాఠశాలలు, జూనియర్ కాలేజీలు తెరవాల్సి వస్తే దానికి ఎలా సన్నద్ధం కావాలన్న దానిపైనా కేంద్రం ప్రణాళిక రచించింది. అంటే పాక్షికంగా తెరవడం, పూర్తిగా తెరవడానికి అవసరమైన రెండు ప్రణాళికలను ప్రకటించింది. పాక్షికంగా తెరవాల్సి వస్తే... ఆన్లైన్ లేదా దూర విద్యను ప్రోత్సహించాలి. 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు విద్యార్థులు తమ ఉపాధ్యాయుల నుంచి అనుమానాలను నివృత్తి చేసుకోవడానికే స్వచ్ఛంద ప్రాతిపదికన అనుమతిస్తారు. కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలి. మాస్క్‌లు తప్పనిసరి. 40 నుంచి 60 సెకన్లు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఆల్కహాల్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్లను వాడాలి. తుమ్ము, దగ్గు వస్తే మోచేయిని అడ్డుగా పెట్టుకోవాలి. ఆరోగ్యసేతు యాప్‌ను ఇన్ స్టాల్ చేసుకోవాలి. ప్రారంభించడానికి ముందు... నాన్ కంటైన్మెంట్ జోన్లలోని పాఠశాలలు, జూనియర్ కాలేజీలను మాత్రమే తెరవడానికి అనుమతిస్తారు. ప్రయోగశాలలు, తరగతి గదులు సహా ఇతర అన్ని ప్రాంతాలను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. బోధన, బోధనేతర సిబ్బందిని 50 శాతం వరకే రప్పించాలి. ఆన్లైన్ బోధన, టెలీ కాన్ఫరెన్స్ కోసమే వారు రావాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ హాజరుకు బదులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. సబ్బుతో పాటు చేతులు కడుక్కోవడానికి సౌకర్యాలు ఉండాలి. అవకాశముంటే బహిరంగ ప్రదేశాల్లో తరగతులు నిర్వహించుకునేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు. ప్రార్థనలు, క్రీడలు ఇతరత్రా గుమిగూడే కార్యకలాపాలు నిషేధం. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించడానికి రాష్ట్ర హెల్ప్‌లైన్ నంబర్లు, స్థానిక ఆరోగ్య అధికారుల నంబర్లను కనబడేలా ప్రదర్శించాలి. అధిక వయస్సున్నవారు, గర్భిణి ఉద్యోగులు, ఇతరత్రా అనారోగ్య సమస్యలున్నవారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. వారు విద్యార్థులతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండొద్దు. థర్మల్ గన్స్, ఆల్కహాల్ వైప్స్ లేదా సోడియం హైపోక్లోరైట్ సొల్యూషన్స్, సబ్బు వంటివి తగినంతగా ఉండాలి. ఆక్సిజన్ స్థాయిలను లెక్కించడానికి పల్స్ ఆక్సీమీటర్ తప్పనిసరిగా ఉంచాలి. తెరిచిన తరువాత... ప్రవేశద్వారం వద్ద తప్పనిసరిగా శానిటైజర్ ఉంచాలి. థర్మల్ స్క్రీనింగ్ చేపట్టాలి. ఎలాంటి కరోనా లక్షణం లేని ఉపాధ్యాయులు, ఉద్యోగులు, విద్యార్థులను మాత్రమే ప్రాంగణంలోకి అనుమతించాలి. ఎవరికైనా లక్షణాలుంటే సమీప ఆరోగ్య కేంద్రానికి పంపించాలి. సదరు వ్యక్తికి పాజిటివ్ ఉంటే వెంటనే ప్రాంగణాన్ని క్రిమిసంహారక మందులతో శుభ్రం చేయాలి. పార్కింగ్ స్థలాలలో, కారిడార్లలో, ఎలివేటర్లలో గుంపులు లేకుండా చూడాలి. సందర్శకుల ప్రవేశాన్ని పరిమితం చేయాలి. కుర్చీలు, డెస్క్‌ల మధ్య ఆరు అడుగుల దూరం ఉండేలా సీటింగ్ ఏర్పాటు ఉండాలి. నోట్‌బుక్స్, పెన్నులు, పెన్సిల్, ఎరేజర్, వాటర్ బాటిల్ వంటి వాటిని విద్యార్థులు పంచుకోకుండా చూడాలి. ప్రయోగశాలల్లో పరికరాలను ఉపయోగించడానికి ముందు, తరువాత తరచుగా శుభ్రం చేయాలి. క్యాంటీన్లు, మెస్‌లుంటే వాటిని మూసివేయాలి. రవాణా సౌకర్యం ఉంటే బస్సులు లేదా ఇతరత్రా వాహనాలను సోడియం హైపోక్లోరైట్‌తో శుభ్రం చేయాలి. తరచుగా తాకే తలుపులు, ఎలివేటర్ బటన్లు, కుర్చీలు, బెంచీలు తదితరమైన వాటిని శుభ్రపరచాలి. -
అన్‌లాక్ 4.0: ఏపీ సర్కార్ మార్గదర్శకాలు జారీ
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఈ నెల 30 వరకు విద్యాసంస్థల బంద్ కానున్నాయి. సెప్టెంబర్ 21 నుండి తొమ్మిదో తరగతి, టెన్త్, ఇంటర్ విద్యార్థులు పాఠశాలలు, కళాశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వగా, ఇందుకు తల్లిదండ్రుల రాత పూర్వక అంగీకారం తప్పనిసరి అని ప్రభుత్వం స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లకు 21 నుండి అనుమతి ఇచ్చారు. పీహెచ్డీ, పీజీ విద్యార్థులకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. (చదవండి: విశాఖలో సినిమా షూటింగ్‌ల జోష్..) ►సెప్టెంబర్ 20 నుండి పెళ్లిలకు 50 మంది అతిథులతో అనుమతి ►అంతక్రియలకు 20 మందికి అనుమతి ►సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్క్‌లకు అనుమతి నిరాకరణ ►సెప్టెంబర్ 21 నుండి ఓపెన్ ఏర్ థియేటర్స్ కు అనుమతి (చదవండి: 8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ) -
విశాఖలో సినిమా షూటింగ్‌ల జోష్..
సాక్షి, విశాఖపట్నం: మళ్లీ విశాఖలో సినిమా షూటింగ్ సందడి మొదలైంది. అన్‌లాక్‌తో నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టు లు కూడా విశాఖ వస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ప్రకటించడంతో కొంత జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరం అంటే ప్రకృతి అందాలకు నెలవు. నీటి సముద్రానికి పచ్చని కొండలు తోడవడంతో పర్యాటకులతో పాటు సినిమా షూటింగులో కూడా అనువైన ప్రాంతంగా మారింది. 1971 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినీ ఫ్రేమ్‌లో విశాఖను ఆవిష్కరించడంతో నగర అందాలు బయట ప్రపంచానికి తెలిశాయి. యారాడ, అప్పికొండ, ఆర్కే బీచ్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి... ఇలా భిన్న మైన ప్రకృతి అందాల తో కూడిన ఈ ప్రదేశాలు షూటింగ్ సీన్స్ సినిమాల్లో ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక సింహాచలం కొండ సెంటిమెంట్‌గా మారడంతో చాలా మంది నటులు కొన్ని సీన్లు అక్కడ తీయాలని పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి. (చదవండి: తెలుగు హీరోలకు మంచి రోజులు) మెగాస్టార్ చిరంజీవికి కొత్త కేరీర్ విశాఖ ఇచ్చిన అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చాలెంజ్, అభిలాష, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలతో విశాఖనగరం చిరంజీవి సినీ చరిత్రనే మార్చేసింది. సర్పయాగం, చామంతి లాంటి సినిమాలు రోజాకు కొత్త సినిమా జీవితాన్ని అందించాయి బాలకృష్ణ అయితే సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్ వంటి సినిమాలో సింహాచలం కేంద్రంగానే సెంటిమెంట్‌గా కొనసాగాయి. ఇక అరకు అందాల గురించి చెప్పనవసరం లేదు. ఆలాపన, స్టేషన్ మాస్టర్, కృష్ణ, ఒక్కడు, కృష్ణ గాడు వీర ప్రేమ కథ ఇలాంటి సినిమాలో ఇక్కడే పురుడు పోసుకున్నాయి. కోవిడ్ కారణంగా షూటింగ్ సందడి తగ్గింది. ముఖ్యంగా బీచ్‌ను అనుకునే రామానాయుడు స్టూడియోలో జరిగే ఒడిస్సా బెంగాలీ,అసామి లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా నిలిచాయి. ఈ దశలో దాదాపు ఐదు నెలల తర్వాత అన్‌లాక్ ప్రక్రియ మొదలవడంతో విశాఖలో సినిమా షూటింగ్ లు మొదలయ్యాయి. (చదవండి: పెళ్లి పీటలెక్కనున్న లేడీ కమెడియన్) ఐపీఎల్ అనే ఓ చిత్రానికి గత మూడు రోజులుగా ఆర్కే బీచ్, వుడా పార్క్ పరిసరాలలో జోరుగా షూటింగ్ జరుగుతుంది. విశాఖ పరిసరాలు షూటింగులకు అనువైన ప్రాంతాలని ఐపీఎల్ నటీనటులు పేర్కొన్నారు. విశాఖ అరకు పరిసరాల్లో తమ సినిమా షూటింగ్ కూడా కొనసాగిస్తున్నట్టు వివరించారు. విశాఖలో షూటింగ్‌లతో పాటు పర్యాటకులు తాకిడి కూడా పెరిగింది.నిజానికి ఇటీవల సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమ విశాఖ వస్తే అన్ని రకాల మౌలిక సదుపాయాలు రాయితీలు ఇస్తామని ప్రకటించారు. దీనిపై సినీరంగంలోని అన్ని వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేశాయి ఈ దశలో కోవిడ్ అన్‌లాక్ ఈ ప్రక్రియ మొదలు కావడంతో సినీ పరిశ్రమ నెమ్మదిగా విశాఖ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
8న సినీ ప్రముఖులతో కేంద్రం భేటీ
న్యూఢిల్లీ : కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ను ఎత్తివేసి ఆన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కావడంతో దేశంలోని అన్ని రంగాలు మెల్లమెల్లగా పునఃప్రారంభం అవుతున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్, ప్రార్థన మందిరాలు ఇప్పటికే తెరుచుకోగా మెట్రో సర్వీసులు మరి కొన్నిరోజుల్లో మొదలు కానున్నాయి. అయితే కేవలం విద్యా సంస్థలు, పార్కులు, సినిమా థియేటర్లు మాత్రమే ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రస్తుతం అన్‌లాక్ 4.0లో భాగంగా దేశంలో థియేటర్లు తెరుచుకోవడానికి అనుమతి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. (సినిమాను కాపాడండి) ఈ క్రమంలో సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్‌ల ప్రారంభంపై ఈ నెల 8న సినీ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కేంద్ర హోం శాఖ అధికారులు భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమావేశంలో థియేటర్లు తెరుచుకునే తేదీ, పాటించాల్సిన నిబంధనలపై చర్చించనుంది. ఈ సమావేశం అనంతరం థియేటర్లు తెరుచుకోవడానికి అవసరమైన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిబంధనలు పెట్టనుందనేది ఆసక్తిగా మారింది. (రాజ్‌నాథ్‌తో భేటీకి చైనా తీవ్ర ప్రయత్నం) కరోనా వైరస్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన రంగాల్లో సినిమా రంగం కూడా ఉంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా సుమారు ఐదు నెలలకు పైగా సినిమా థియేటర్లు మూతబడ్డాయి. దీని వల్ల విడుదలకు సిద్ధంగా ఉన్న ఎన్నో తెలుగు సినిమాలు వాయిద పడ్డాయి. చిన్న చిన్న సినిమాలు ఓటీటీ ద్వారా విడుదలైపోతున్నాయి. అయితే, భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన స్టార్ హీరోల సినిమాలను ఓటీటీ విడుదల చేసే ధైర్యం చేయలేకపోతున్నారు దర్శక నిర్మాతలు. థియేటర్లు తెరుచుకోవడానికి ప్రభుత్వం ఇచ్చే అనుమతుల కోసం వేచి చూస్తున్నారు. -
అన్‌లాక్ 4 : ఢిల్లీలో తెరుచుకోనున్న బార్లు
ఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్‌లాక్ -4 మార్గదర్శకాల ప్రకారం ఢిల్లీలో బార్లకు సెప్టెంబర్ 9 నుంచి ట్రయల్ బేసిస్ పద్దతిలో తెరవనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం గురువారం పేర్కొంది. ఢిల్లీలో బార్లకు అనుమతి ఇవ్వాలంటూ కేజ్రీవాల్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్‌ను ఇటీవలే కోరింది. కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాలను దృష్టిలో ఉంచుకొని కేజ్రీవాల్ ప్రభుత్వం కోరినట్లు ఢిల్లీలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు అనిల్ బైజల్ తెలిపారు. ఈ మేరకు సెప్టెంబర్ 9 నుంచి 30వరకు ట్రయల్ పద్దతిలో బార్లకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. బార్లతో పాటు హోటల్స్, రెస్టారెంట్లు, క్లబ్బుల్లో పరిమిత సంఖ్యలో మద్యం సరఫరాకు అనుమతి ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కేంద్రం విధించిన అన్‌లాక్-4 మార్గదర్శకాల ప్రకారమే బార్లలో మద్యం సరఫరా చేయనున్నట్లు తెలిపింది. గత శనివారం కేంద్రం విడుదల చేసిన అన్‌లాక్-4 మార్గదర్శకాల్లో ప్రధాన నగరాల్లోని మెట్రో సేవలను పునరుద్ధరించాలనే కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు షరతులతో కూడిన విధంగా బార్లను తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చింది. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం గోవా, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు బార్ అండ్ రెస్టారెంట్లు తెరిచేందుకు అనుమతులు ఇచ్చాయి. బార్లకు అనుమతులు ఇచ్చిన సందర్భంగా సెప్టెంబర్ 9 నుంచి 30 వరకు ఢిల్లీలోని వివిధ బార్లు అనుసరించాల్సిన మార్గదర్శకాలను ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.(చదవండి : తగ్గుతున్న పాజిటివ్ రేటు;భారత్‌కు ఊరట) ►కేంద్రం విధించిన అన్‌లాక్ -4 మార్గదర్శకాలను బార్లు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.. లేని పక్షంలో బార్ల లైసెన్స్ రద్దు చేసే అవకాశం ఉంటుంది. ►బార్లకు వచ్చే కస్టమర్లకు మాస్కులు ఉంటేనే లోనికి అనుమతించాలి. ►సీటింగ్ కెపాసిటీ 50శాతానికి తగ్గించి.. ప్రతి కస్టమర్ కనీస భౌతికదూరం పాటించేలా చూడాలి. ►బార్‌కు వచ్చే కస్టమర్లకు శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ స్మోకింగ్ జోన్ లేకుండా ఉంచాలి. -
7 నుంచి పట్టాలెక్కనున్న మెట్రో రైళ్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైళ్లు పట్టాలెక్కనున్నాయి. కేంద్రం విడుదల చేసిన నాలుగో విడత అన్‌లాక్ మార్గదర్శకాల మేరకు ఈ నెల ఏడో తేదీ నుంచి మెట్రో రైళ్లను అనుమతిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే బార్లు, క్లబ్బులపై మాత్రం లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను కొనసాగిస్తూ మిగతా చోట్ల అన్ లాక్–4 మార్గదర్శకాలను కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు లోబడి రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగో దశ అన్‌లాక్ మార్గదర్శకాలను మంగళవారం విడుదల చేసింది. కంటైన్మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ను సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించడంతోపాటు ఇతర ప్రాంతాల్లోనూ కొన్ని కార్యకలాపాల విషయంలో ఆంక్షలు కొనసాగుతాయని రాష్ట్ర సర్కార్ స్పష్టం చేసింది. పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు వంటి ప్రాంతాల్లో మూసివేత కొనసాగుతుంది. ఆన్లైన్, డిస్టెన్స్ విధానంలో బోధనకు అనుమతి కొనసాగించవచ్చు. అయితే సెప్టెంబర్ 21 నుంచి కంటైన్మెంట్ జోన్ల బయట కనీసం 50 శాతం మంది బోధన, బోధనేతర సిబ్బంది విధులకు హాజరుకావచ్చు. ఆ తరగతుల విద్యార్థులు వెళ్లొచ్చు కంటైన్మెంట్ జోన్ల వెలుపల 9 నుంచి 12 వ తరగతి వరకు విద్యార్థులు తాము చదివే స్కూళ్లకు వెళ్లి ఉపాధ్యాయుల వద్ద తమ అనుమానాలు నివృత్తి చేసుకోవచ్చు. అయితే దీనికి తల్లిదండ్రులు లేదా సంరక్షకులు లిఖితపూర్వకంగా తమ అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 21 నుంచి ఐటీఐలతో పాటు నైపుణ్య శిక్షణ కేంద్రాలకు అనుమతి ఇస్తారు. పీహెచ్డీ, పీజీ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో సాంకేతిక, వృత్తి విద్యా కోర్సులు చదివేవారు ప్రయోగశాలలకు వెళ్లేందుకు అనుమతి ఉంటుంది. వంద మందితో కార్యక్రమాలు సామాజిక, విద్యా, క్రీడ, వినోద, సాంస్కృతిక, మత, రాజకీయ పరమైన కార్యక్రమాలను వంద మందికి మించకుండా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ సెప్టెంబర్ 21 నుంచి నిర్వహించుకోవచ్చు. అయితే మాస్క్‌లు, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, శానిటైజర్ తదితర నిబంధనలు కచ్చితంగా పాటించాలి. అయితే వివాహానికి 50 మంది, అంత్యక్రియలకు 20 మంది పరిమితి మాత్రం సెప్టెంబర్ 20 వరకు కొనసాగుతుంది. 65 ఏళ్లకు పైబడిన వ్యక్తులు, అనారోగ్య సమస్యలున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు పిల్లలు ఇళ్లకే పరిమితం కావాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. -
కేంద్రంపై మాయావతి ప్రశంసలు
లక్నో : అన్‌లాక్-4లో భాగంగా కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతించారు. ఇవి రాజకీయ పార్టీలు, వ్యక్తులకు అతీతంగా ప్రజలందరికీ సర్వజన సమ్మతంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడ్డారు. 'కోవిడ్19 పోరులో భాగంగా అన్‌లాక్‌కు సంబంధించి కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలు ఏకీకృతంగా ఉన్నాయి. వాటిని స్వాగతిస్తున్నాం. బీఎస్పీ చాన్నాళ్లుగా ఈ డిమాండే చేస్తోంది. కరోనా ముసుగులో రాజకీయాలు చేయడం తగదని మేం ఎప్పటి నుంచో చెబుతున్నాం. కేంద్రం తాజాగా విడుదల చేసిన గైడ్‌లైన్స్ చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. దీని వల్ల ప్రజలకు మరిన్ని సౌకర్యాలు సైతం అందుతాయి' అంటూ మాయావతి పేర్కొన్నారు. (అందరూ స్వదేశీ యాప్‌లను వాడాలి: మోదీ) కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ అన్‌లాక్–4 మార్గదర్శకాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో భాగంగా పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి దశలవారీగా మెట్రో రైళ్లను నడపడానికి కేంద్రం అనుమతించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మాత్రం సెప్టెంబర్ 30వ తేదీ దాకా మూసే ఉంటాయని ప్రకటించింది. విద్యా సంస్థలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది. సెప్టెంబర్ 21 నుంచి 50 శాతం మించకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరుకావొచ్చని, 9 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్ కోసం హాజరుకావొచ్చని పేర్కొంది. (అన్‌లాక్ 4: 7 నుంచి మెట్రో..) -
7 న మెట్రో పునఃప్రారంభం, చర్యలివే!
న్యూఢిల్లీ: కరోనా దెబ్బతో దాదాపు ఐదు నెలలుగా స్తంభించిపోయిన ఢిల్లీ మెట్రో సర్వీసులు అన్‌లాక్-4 లో భాగంగా సెప్టెంబర్ 7 నుంచి పట్టాలెక్కనున్నాయి. అయితే, కోవిడ్ కేసుల్లో ఆరో స్థానంలో కొనసాగుతున్న దేశ రాజధానిలో మెట్రో పునఃప్రారంభం ఏమేరకు ప్రభావం చూపుతుందోనని అనుమానాలున్నాయి. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. మెట్రో సర్వీసుల్లో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ తెలిపారు. సామాజిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్కులు ధరించడం తప్పనిసరి చేశామని ఆదివారం మీడియాకు చెప్పారు. గతంలో మాదిరిగా ప్రయాణికులకు టోకెన్స్ జారీ చేయమని చెప్పారు. ఎంట్రీ వద్దనే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి అనుమతిస్తామని పేర్కొన్నారు. స్మార్ట్ కార్డులు, ఇతర డిజిటల్ పద్ధతుల్లో మాత్రమే పేమెంట్లు చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. దాంతోపాటు లిఫ్టుల్లో కూడా తక్కువ సంఖ్యలో ప్రయాణికులు వెళ్లేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగా స్టేషన్లలో మెట్రో రైలు నిలిచే సమయం పెంచుతామని తెలిపారు. కాగా, కోవిడ్ నియంత్రణలో భాగంగా మార్చి నెలలో ఢిల్లీ సర్వీసుల్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా దాదాపు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లినట్టు తెలిసింది. ఇక మెట్రో పునఃప్రారంభంపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆనందం వ్యక్తం చేశారు. (చదవండి: ఢిల్లీ మెట్రో స్టేషన్లో పాము హల్చల్) -
అన్‌లాక్–4: కేంద్రం మార్గదర్శకాలు
-
7 నుంచి దశలవారీగా మెట్రో రైళ్లు..
సాక్షి, న్యూఢిల్లీ: కంటైన్మెంట్ జోన్ల వెలుపల మరిన్ని కార్య కలాపాల పునరుద్ధరణకు వీలుగా కేంద్ర హోం శాఖ అన్‌లాక్–4 మార్గదర్శకాలను ప్రకటించింది. పలు నగరాలకు ప్రాణాధారంగా మారిన మెట్రో రైళ్లు ఎట్టకేలకు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి దశలవారీగా మెట్రో రైళ్లను నడపడానికి కేంద్రం అనుమతించింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు మాత్రం సెప్టెంబర్ 30వ తేదీ దాకా మూసే ఉంటాయని ప్రకటిం చింది. విద్యా సంస్థలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను స్వల్పంగా సడలించింది. సెప్టెంబర్ 21 నుంచి 50 శాతం మించకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది హాజరుకావొచ్చని, 9 నుంచి 12 తరగతుల మధ్య విద్యార్థులు స్వచ్ఛందంగా గైడెన్స్ కోసం హాజరుకావొచ్చని పేర్కొంది. బార్లను కూడా నిషేధిత జాబితా నుంచి కేంద్రం తొలగించింది. జూలై 29న జారీచేసిన అన్‌లాక్ 3 మార్గదర్శకాల్లో యోగా కేంద్రాలు, వ్యాయామ శాలలకు మినహాయింపు ఇవ్వగా.. ప్రస్తుతం నిషేధిత జాబితా నుంచి బార్లను తొలగించింది. శనివారం రాత్రి జారీచేసిన ఈ మార్గదర్శకాలు సెప్టెంబర్ 1 నుంచి దశలవారీగా అమల్లోకి రానున్నాయి. కొత్త మార్గదర్శకాలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి, వివిధ మంత్రిత్వ శాఖల నుంచి వచ్చిన అభిప్రాయాలు, విస్తృత సంప్రదింపుల తరువాత జారీచేసినట్టు కేంద్రం తెలిపింది. వివాహ వేడుకలకు కూడా సెప్టెంబర్ 21 నుంచి స్వల్పంగా ఆంక్షలు సడలించింది. అన్‌లాక్ 4 మార్గదర్శకాలు ఇవీ.. మెట్రో రైలు సర్వీసులను సెప్టెంబర్ 7 నుంచి దశలవారీగా పునరుద్ధరించేందుకు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, రైల్వే మంత్రిత్వ శాఖకు అనుమతించింది. దీనికి సంబంధించి, ప్రామాణిక నియమావళిని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జారీచేస్తుంది. – సామాజిక, విద్యా, క్రీడలు, వినోదం, సాంస్కతిక, మతపరమైన, రాజకీయపరమైన వేడుకలు, సమావేశాలు, ఇతర సమ్మేళనాలకు అనుమతించింది. అయితే వీటికి 100 మందికి మించి హాజరుకాకూడదన్న ఆంక్ష విధించింది. సెప్టెంబర్ 21 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. ఈ సమావేశాలకు హాజరయ్యేవారు ఫేస్ మాస్క్‌లు ధరించడం, సామాజిక దూరం పాటించడం తప్పనిసరి. థర్మల్ స్కానింగ్ అందుబాటులో ఉంచడం, హ్యాండ్ వాష్ లేదా శానిటైజర్ ఏర్పాటు చేయడం తప్పనిసరి. – సెప్టెంబరు 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లు తెరిచేందుకు కేంద్రం అనుమతించింది. – పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలు, కోచింగ్ సంస్థలు సాధారణ తరగతి కార్యకలాపాల కోసం 2020 సెప్టెంబర్ 30 వరకు మూసి ఉంటాయి. ఆన్లైన్ తరగతులు, దూరవిద్య తరగతులు కొనసాగుతాయి. – రాష్ట్రాలు కేంద్రాన్ని సంప్రదించకుండా ఎలాంటి లాక్డౌన్ (కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల) విధించకూడదు. సెప్టెంబరు 21 నుంచి అనుమతించేవిః – ఆన్లైన్ బోధన, టెలీ–కౌన్సెలింగ్, సంబంధిత పనుల కోసం 50 శాతానికి మించకుండా బోధన, బోధనేతర సిబ్బందిని పాఠశాలలకు పిలవడానికి రాష్ట్రాలు అనుమతించవచ్చు. – కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఉన్న ప్రాంతాల్లో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులు తమ పాఠశాలలను స్వచ్ఛంద ప్రాతిపదికన సందర్శించవచ్చు. వారి ఉపాధ్యాయుల నుంచి మార్గదర్శకత్వం తీసుకోవడానికి మాత్రమే అనుమతిస్తారు. ఇది వారి తల్లిదండ్రులు, సంరక్షకుల రాతపూర్వక సమ్మతికి లోబడి ఉంటుంది. – నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్సి్టట్యూట్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్సి్టట్యూట్స్ (ఐటిఐ), నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ మిషన్స్ లేదా భారత ప్రభుత్వ లేదా రాష్ట్ర ప్రభుత్వాల వద్ద నమోదు చేసుకున్న స్వల్పకాలిక శిక్షణా కేంద్రాలలో నైపుణ్యం లేదా వ్యవస్థాపకత శిక్షణకు అనుమతి ఉంటుంది. – నేషనల్ ఇన్సి్టట్యూట్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ (ఎన్ఐఈఎస్బీయూడీ), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (ఐఐఇ)లకు అనుమతి ఉంటుంది. – ప్రయోగశాల, ప్రయోగాత్మక పనులు అవసరమయ్యే సాంకేతిక, వృత్తిపరమైన కోర్సుల పీహెచ్డీ, పీజీ విద్యార్థులను అనుమతిస్తారు. కొన్నింటినికి ‘నో’... మరికొన్నింటిపై పరిమితులు – సినిమా హాళ్ళు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, థియేటర్లు (ఓపెన్ ఎయిర్ థియేటర్ మినహా), ఇలాంటి ప్రదేశాలకు అనుమతి లేదు. – హోం శాఖ అనుమతి ఇచ్చినవి మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలకు అనుమతి లేదు. – వివాహ వేడుకలకు సెప్టెంబరు 20 వరకు 50 మందికి మించి అనుమతించరాదు. సెప్టెంబరు 21 నుంచి 100 మంది వరకు అనుమతి ఉంటుంది. – అంత్యక్రియలకు సెప్టెంబరు 20 వరకు 20 మందికి మించరాదు. సెప్టెంబరు 21 నుంచి వంద మంది వరకు అనుమతిస్తారు. – కంటైన్మెంట్ జోన్లలో సెప్టెంబరు 30 వరకు లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయి. -
కరోనా: ఇదేం జర్నీ!!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ సమయంలో జర్నీ బెంబేలెత్తిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. వైరస్వ్యాప్తిని అడ్డుకొనేందుకు మాస్కు ఒక్కటే రక్షణ కవచం అని తెలిసినప్పటికీ కొంతమంది ప్రయాణీకులు బేఖాతరు చేస్తున్నారు. డ్రైవర్లు, కండక్టర్లలోనూ అదే నిర్లక్ష్యం కనిపిస్తోంది. మాస్కులు ఉన్నప్పటికీ వాటిని కేవలం అలంకారప్రాయంగా ధరిస్తున్నారు.లాక్డౌన్ నిబంధనలు సడలించడంతో గత 3 నెలలుగా దూరప్రాంతాలు బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. పరిమితంగానైనా ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నాయి. మొదట్లో ఈ బస్సులను ఉప్పల్, ఎల్బీనగర్, బీఎన్‌రెడ్డి నగర్, తదితర శివార్లకే పరిమితం చేశారు. ఆ తరవాత మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్ వంటి ప్రధాన స్టేషన్లకు కూడా బస్సులను అనుమతించారు. బస్సులు రోడ్డెక్కిన తొలి రోజుల్లో కోవిడ్ నిబంధనలు పటిష్టంగానే అమలు జరిగాయి. ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేశారు. బస్సు ఎక్కే ముందు ప్రతి ప్రయాణికుడు చేతులు శుభ్రం చేసుకొనేవిధంగా శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. మాస్కులేని వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకుండా గట్టి చర్యలు తీసుకున్నారు. ఈ మేరకు ఆర్టీసీ అధికారులు మైకుల ద్వారా ప్రచారం కూడా చేపట్టారు.కానీ క్రమంగా ఈ నిబంధనలన్నీ గాల్లో కలిసిపోయాయి. ఇటు ప్రయాణికులు, అటు ఆర్టీసీలోనూ నిర్లక్ష్యం చోటుచేసుకుంది. చివరకు కరోనా బాధితులు ప్రయాణం చేసినా పట్టించుకొనే పరిస్థితి లేకుండా పోయింది. మరోవైపు కరోనా బారిన పడకుండా కాపాడుకొనేందుకు ఎవరికి వారు స్వీయజాగ్రత్తలు పాటించడం ఒక్కటే శ్రీరామ రక్ష అని వైద్య నిపుణులు పదే పదే చెబుతున్నప్పటికీ ‘తమకేం కాదులే’ అని నిర్లక్ష్య ధోరణి అన్ని చోట్ల కనిపిస్తోంది. ఇందుకు ఆర్టీసీ బస్సులు కూడా ఏ మాత్రం మినహాయంపు కాదు. ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీనగర్, తదితర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగిస్తున్న బస్సులను పరిశీలించినప్పుడు ఈ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించింది. నిబంధనలు నీరుగార్చారు.... సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 3500 బస్సులు తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తాయి. 1.25 లక్షల మంది వివిధ ప్రాంతాలకు బయలుదేరుతారు.కానీ కరోనా నియంత్రణకు విధించిన లాక్డౌన్లో భాగంగా అన్ని సర్వీసులను నిలిపివేశారు. లాక్డౌన్ సడలింపుల అనంతరం తెలంగాణ జిల్లాలకు మాత్రమే బస్సులను పరిమితం చేశారు. దీంతో రోజుకు 800 నుంచి 1000 బస్సుల వరకు హైదరాబాద్ నుంచి జిల్లాలకు నడుస్తున్నాయి. మొదట్లో ప్రయాణికుల ఆదరణ పెద్దగా లేకపోయినప్పటికీ జూలై నుంచి క్రమంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక బస్సులో సగటున 50 మంది చొప్పున ప్రస్తుతం 40 వేల నుంచి 50 వేల మంది ప్రయాణికులు తెలంగాణలో ప్రయాణం చేస్తున్నారు. ఎక్కువ శాతం హైదరాబాద్ నుంచి జిల్లాలకు రాకపోకలు సాగిస్తున్న బస్సులకే డిమాండ్ బాగా ఉంది. కానీ ఇదే సమయంలో గత రెండు నెలలుగా కోవిడ్ ఉధృతి కూడా పెరిగింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్‌కే పరిమితమైన వైరస్ జిల్లాలను, గ్రామీణ ప్రాంతాలను సైతం చుట్టుముట్టింది పల్లెల్లోనూ పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. పట్టణాల్లో వందల్లో కోవిడ్ బాధితులు పెరుగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రయాణికుల్లో నిబంధనలు కచ్చితంగా అమలు కాకపోవడం ఆందోళన కలిగిస్తుందని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ మంది రాకపోకలు సాగించే మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌లో 8 చోట్ల కాలితో తాకి వినియోగించుకొనే శానిటైజర్లను ఏర్పాటు చేస్తే వాటిని గుర్తు తెలియని వాళ్లు తీసుకెళ్లారు. దీంతో ప్రస్తుతం మేనేజర్ కార్యాలయం వద్ద మాత్రం రెండు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ‘ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్లను వినియోగించాలని’ చెబుతున్నప్పటికీ కొంతమంది పట్టించుకోవడం లేదని ఎంజీబీఎస్ అధికారి ఒకరు చెప్పారు. జేబీఎస్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఇక ఎల్బీనగర్, ఉప్పల్, తదితర కూడళ్ల నుంచి రాకపోకలు సాగించే బస్సుల్లో మొదట ఆర్టీసీ సిబ్బందే ప్రయాణికులకు శానిటైజర్ ఇచ్చే వారు. ఇప్పుడు అలాంటి సదుపాయం కనిపించడం లేదు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే ఒత్తిడి కూడా లేకుండా పోయింది. అన్‌లాక్‌లో పెరగనున్న రాకపోకలు... సెప్టెంబర్ నుంచి నిబంధనలు మరింత సడలనున్నాయి. అన్‌లాక్‌లో భాగంగా అంతర్రాష్ట్ర సర్వీసులు ప్రారంభమవుతాయి. ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మధ్య చర్చలు ఒక కొలిక్కి వచ్చాయి. మిగతా రాష్ట్రాలతో కూడా రాకపోకలు పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ మెట్రో సర్వీసులతో పాటు, ఎంఎంటీఎస్ రైళ్లు, సిటీ బస్సులు కూడా అందుబాటులోకి వస్తే ప్రయాణికుల రాకపోకలు మరింత పెరుగుతాయి. సరిగ్గా ఇదే సమయంలో కరోనా కేసులు కూడా ఎక్కువగా నమోదవుతున్నాయి.‘‘ జిల్లాల్లో పాజిటివ్‌ల సంఖ్య ఎక్కువగా ఉంది. ప్రయాణికుల రాకపోకలు పెరగడం వల్ల కరోనా వ్యాప్తి కూడా పెరిగే అవకాశం ఉంది. హైదరాబాద్‌లో కొద్దిగా తగ్గుముఖం పడుతున్న వైరస్ ఉధృతి తిరిగి పుంజుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు’’ అని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ శ్రీ హర్ష చెప్పారు. జాగ్రత్తలు తప్పనిసరి.... ⇔ మాస్కులు ధరించడంతో పాటు, ప్రతి ప్రయాణికుడు శానిటైజర్ వెంట తీసుకెళ్లడం తప్పనిసరి. ⇔ బస్సు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు హ్యాండిల్ రాడ్ పట్టుకోక తప్పదు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా చేతులు శానిటైజ్ చేసుకోవలసిందే. ⇔ సీట్లో కూర్చున్న తరువాత కూడా చాలా మంది తరచుగా తమ ముందు ఉన్న సీట్ ఫ్రేమ్‌ను పట్టుకుంటారు.అలా పట్టుకోవలసి వచ్చినప్పుడు చేతులు శుభ్రం చేసుకోవడం మంచిది. ⇔ సీట్లో ఇద్దరు, ముగ్గురు అపరిచితులు కూర్చోవలసి వచ్చినప్పుడు మధ్యలో మాస్కు తీయకుండా ప్రయాణం పూర్తయ్యే వరకు పూర్తిగా ధరించి ఉండాల్సిందే. ⇔ డ్రైవర్లు, కండక్టర్లు మాస్కులు లేకుండా విధులు నిర్వహిస్తున్నప్పుడు ప్రయాణికులే వారిని అప్రమత్తం చేయడం మంచిది. -
అన్‌లాక్ 4.0: స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవు!
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను కేంద్ర ప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా అన్‌లాక్ చేస్తూ వస్తుంది. వచ్చే వారంలో అన్‌లాక్ 4.0 ప్రక్రియ మొదలు కానుంది. తాజాగా ఈ విషయానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరణనిచ్చారు. కేంద్ర హోంశాఖ ప్రకటించబోయే సడలింపులలో స్కూళ్లు ఉండవబోవని వెల్లడించారు. రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి పాఠశాలలు తెరిచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. (24 గంటల్లో.. 60,975 కరోనా కేసులు) అదేవిధంగా మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక రాష్ట్రాల నుంచి మెట్రో సేవలపై డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు, బస్సులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా సినిమా థియేటర్లు, బార్లు తెరవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కంటైన్మెంట్ జోన్లలలో ఆంక్షలు యధావిధిగా కొనసాగనున్నాయి. అన్‌లాక్ 4.0లో ఆంక్షలు వేటిపై ఉన్నాయన్న దానిని మాత్రమే కేంద్ర హోం శాఖ వివరించింది. చదవండి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెబ్సైట్ హ్యాక్ -
1 నుంచి మెట్రో సర్వీసులు
న్యూఢిల్లీ: సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి ప్రారంభంకానున్న అన్‌లాక్–4 ప్రక్రియలో మెట్రో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. అయితే, స్కూళ్లు, కాలేజీలను తెరిచే అవకాశాలు ఇప్పటికిప్పుడు లేవని అధికారవర్గాలంటున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి వాటిని ప్రారంభించేందుకు గల అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఇప్పటిదాకా మూతపడి ఉన్న బార్లు కూడా తెరుచుకోనున్నాయి. అయితే, కేవలం కౌంటర్‌పై మద్యం విక్రయాలను మాత్రమే అనుమతించేందుకు వీలుంది. బార్లో కూర్చుని మద్యం తాగేందుకు అవకాశం ఉండదు. మెట్రో రైళ్ల పునఃప్రారంభంపై వివిధ వర్గాలతో సంప్రదింపులు ముమ్మరంగా కొనసాగుతున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా.. టోకెన్లకు బదులు మెట్రో కార్డుల ద్వారానే ప్రయాణానికి అనుమతించడం, స్టేషన్లలో రైలు ఆగే సమయాన్ని పెంచడం వంటి మార్పులు ఉంటాయని సమాచారం. -
అన్‌లాక్ 3.0: యూటీలు, రాష్ట్రాలకు కేంద్రం లేఖ
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా అన్‌లాక్-3 ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ అంతర్రాష్ట్ర, రాష్ట్రాల మధ్య ప్రయాణాలపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షలు విధించడంపై కేంద్రం అసహనం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆయా జిల్లాల అధికారులు ప్రజల రాకపోకలు, వస్తువుల రవాణాపై ఇంకా నిషేధం కొనసాగించడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి చర్యల వల్ల ఆర్థిక కార్యకలాపాలకు భంగం కలగడంతో పాటుగా ఉద్యోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది. అంతర్రాష్ట్ర, రాష్ట్రాల మధ్య రాకపోకలు కొనసాగించవచ్చని ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసిందని, అయినప్పటికీ ఆంక్షలు విధిస్తే దీనిని ఉల్లంఘన చర్యగా భావించాల్సి ఉంటుందని హెచ్చరించింది. (అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల) ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా శనివారం కేంద్ర పాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. నిబంధనలు ఎత్తివేయాలంటూ విజ్ఞప్తి చేశారు. లాక్డౌన్ నిబంధనలు సడలించిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ- పర్మిట్ల పేరిట సరుకు రవాణాకు ఆటంకం కలిగించవద్దని కోరారు. ఒకవేళ ఇలాంటి ఆంక్షల గురించి మరోసారి తమ దృష్టికి వస్తే విపత్తు నిర్వహణ చట్టం-2005లోని నిబంధనల ప్రకారం ఉల్లంఘన చర్యగా పరగణించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కాగా ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి నేపథ్యంలో మార్చి 24 అర్ధరాత్రి నుంచి దేశ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. (అన్‌లాక్ 4.0: తెరుచుకోనున్న సినిమాహాళ్లు!) ఈ క్రమంలో పలు దఫాలుగా నిబంధనలు సడలించిన కేంద్ర ప్రభుత్వం మే రెండోవారంలో అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించింది. అయితే అన్‌లాక్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు పూర్తి స్వేచ్ఛను ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన హోం మంత్రిత్వ శాఖ ఇప్పుడు ఈ మేరకు లేఖ రాయడం గమనార్హం. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న అన్‌లాక్-3 ఆగష్టు 31తో ముగియనున్న తరుణంలో ఇన్నాళ్లుగా మూతపడ్డ థియేటర్లు, మార్కెట్లను కనీస జాగ్రత్తలు పాటిస్తూ తెరిచేందుకు కేంద్రం అనుమతించినున్నట్లు తెలుస్తోంది. ఇక దేశంలో గడచిన 24 గంటల్లో 69,878 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో కోవిడ్ బాధితుల సంఖ్య 29,75,702 కు చేరుకుంది. మొత్తంగా 55,794 కరోనాతో మరణించారు. ఇక దేశంలో ప్రస్తుతం 6,97,330 యాక్టివ్ కేసులున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా తీవ్రత దృష్ట్యా ఇప్పటికీ ప్రయాణాలపై ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో అజయ్ భల్లా ఈ మేరకు లేఖ రాసినట్లు తెలుస్తోంది. -
అన్‌లాక్ 3.0 : హోటళ్లు, మార్కెట్లకు అనుమతి
సాక్షి, న్యూఢిల్లీ : అన్‌లాక్ 3.0లో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్ల పునరుద్ధరణకు అనుమతించారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ అధ్యక్షతన బుధవారం జరిగిన ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ (డీడీఎంఏ) భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయోగాత్మకంగా కోవిడ్-19 నిబంధనలతో వారాంతపు సంతలను అనుమతిస్తామని డీడీఎంఏ పేర్కొంది. జిమ్‌లను తెరిచేందుకు మాత్రం అనుమతించలేదు. దేశ రాజధానిలో కరోనా వైరస్ నెమ్మదించిన క్రమంలో హోటళ్లు, జిమ్‌లు, వారాంతపు సంతలను అనుమతించాలని ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ) అనిల్ బైజల్‌కు ప్రతిపాదనలు పంపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్‌లాక్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్లను అనుమతిస్తూ నిర్ణయం తీసుకునే హక్కు తమకుందని ఆప్ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్‌కు పంపిన ప్రతిపాదనలో పేర్కొంది. ఢిల్లీలో కరోనా వైరస్ కేసుల సంఖ్య తగ్గడంతో నగర ప్రజలను వారి జీవనోపాధికి దూరంగా ఉంచరాదని రాష్ట్ర ప్రభుత్వం ఎల్జీని కోరింది. చదవండి : మెట్రో ఉద్యోగుల జీతభత్యాల్లో కోత -
అన్‌లాక్ 4.0: తెరుచుకోనున్న సినిమాహాళ్లు!
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్‌లాక్ 4.0లో భాగంగా త్వరలో సినిమా థియేటర్లు తెరుచుకోనున్నాయని సమాచారం. ఇప్పటికే అన్‌లాక్ దశలో భాగంగా రెస్టారెంట్లు, మాల్స్, జిమ్, యోగా కేంద్రాలకు ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి సినిమా హాళ్లు మూతపడటంతో చిత్రపరిశ్రమకు భారీ నష్టం వాటిల్లింది. ఆగస్టు చివరినాటికి అన్‌లాక్ 3.0 ముగియనున్న నేపథ్యంలో ప్రభుత్వం సినిమా థియేటర్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందని విశ్వసనీయ సమాచారం. సామాజిక దూరం, శానిటైజేషన్ వంటి నిబంధనలు పాటిస్తూ సినిమా హాళ్లు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉంది. సీట్ల మధ్య దూరం, సిటింగ్ సామర్థ్యం వంటి వాటిపై ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేయనుంది. (రియా సీబీఐకి తప్పక సహకరిస్తుంది) కరోనా వ్యాప్తి దృష్ట్యా టెంపరేషర్ కెపాసిటీ కూడా 24 డిగ్రీలు ఉండేలా దిశానిర్దేశం చేయనుంది. ఇప్పటికే 3డీ సినిమాలకు స్పెషల్ కళ్లజోడు ఉపయోగిస్తుండగా, ప్రస్తుతం సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు మాస్క్ ధరించాలన్న నిబంధన కూడా ఉండనుంది. ప్రతి స్క్రీనింగ్ తర్వాత సినిమా హాల్ ప్రాంగణాన్ని పూర్తిగా శానిటైజ్ చేయడం తప్పనిసరి చేసేలా థియేటర్ నిర్వాహకులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్‌లాక్‌లో భాగంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతిచ్చినందున సినిమా హాళ్లు కూడా తెరిచేందుకు ప్రభుత్వం అనుతివ్వాలని పలు థియేటర్ యాజమాన్యాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. కాంటాక్ట్‌లెస్ టికెటింగ్, రెగ్యులర్ శానిటైజేషన్‌తో సినిమా హాళ్లు తిరిగి తెరవడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి గైడ్‌లైన్స్‌ని విడుదలయ్యే అవకాశాలున్నాయని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. అయితే మల్టీప్లెక్స్‌లలో సినిమా హాళ్లపై ఆంక్షలు కొనసాగుతాయా లేదా అన్నదానిపై సందేహం నెలకొంది. (హీరో విజయ్ పారితోషికం తగ్గించుకున్నారా!) -
జూలైలో జాబ్‌లు పెరిగాయ్..!
ముంబై: కరోనా ప్రేరేపిత లాక్డౌన్ సడలింపుతో జూలైలో ఉద్యోగ నియమాకాలు పెరిగాయి. కేంద్రం అన్‌లాక్ ప్రక్రియను ప్రారంభించడంతో అనేక కీలక పరిశ్రమలు పునఃప్రారంభమయ్యాయి. ఫలితంగా కిందటి నెల జూన్‌లో పోలిస్తే ఈ జూలైలో ఉద్యోగ నియామకాలు పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన పోలిస్తే నియామకాలు భారీగా తగ్గాయి. ఆసక్తికరంగా మైట్రో నగరాల్లో కంటే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో నియామకాలు పెరగడం విశేషం. మీడియా–ఎంటర్టైన్మెంట్, నిర్మాణ, ఇంజనీరింగ్ రంగాల్లో అధికంగానూ.., బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీస్, ఇన్సూరెన్స్, అటో, టెలికం రంగాల్లో మోస్తారు నియమకాలు జరిగాయి. ఐటీ రంగంలో మాత్రం నియామకాలు అంతంగా మాత్రంగా ఉన్నాయి. నౌకరి జాజ్ ఇండెక్స్ ప్రకారం ఈ జూలైలో మొత్తం 1263 జాబ్ పోస్టింగ్‌లు నమోదయ్యాయి. కిందటి నెల జూన్‌లో జరిగిన 1208 పోస్టింగ్‌లతో పోలిస్తే 5శాతం వృది జరిగింది. అయితే గతేడాది ఇదే జూలైతో నియామకాలు 47శాతం క్షీణించాయి. ‘కిందటి నెలతో పోలిస్తే ఈ జూలైలో నియాయకాలు స్వల్పంగా పెరిగాయి. అయితే వార్షిక ప్రాతిపదికన 47శాతం క్షీణించాయి. రానున్నరోజుల్లో కేంద్రం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు ఆంక్షలను మరింత పరిమితం చేయవచ్చు. ఈ ఆగస్ట్‌లో ఉద్యోగాలు మరింత పెరిగే అవకాశం ఉంది’’ అని నౌక్రీ డాట్‌కామ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ పవన్ గోయల్ చెప్పారు. -
మాలీవుడ్; అన్ లాక్
సినిమా నిర్మాణం అంటే వందల రోజుల పని. వందల మంది కష్టం. ప్రస్తుతం సినిమా నిర్మాణానికి కరోనా అడ్డుపడుతోంది. ఇక ముందు షూటింగులు ఎలా చేయాలా? అని ఆలోచనలో పడ్డారు దర్శక–నిర్మాతలు. పాత పద్ధతి పనికిరాదన్నప్పుడు కొత్త ఆలోచన పుడుతుంది. కొత్త దారి తయారవుతుంది. మలయాళం ఇండస్ట్రీ కరోనా ఛాలెంజ్‌ను స్వీకరించింది. స్టూడియోల గేట్లు అన్ లాక్ చేసింది. మేకప్ కిట్స్ అన్ లాక్ చేసింది. కార్ వ్యాన్లు అన్ లాక్ అయ్యాయి. ఇలా ఇప్పటివరకూ లాక్ చేసినవాటిని ‘అన్ లాక్’ చేసి, కొన్ని సినిమాల షూటింగ్‌ను మొదలుపెట్టింది. కొన్నింటిని పూర్తి చేసింది కూడా. ఆ వివరాలు... సౌత్ ఇండస్ట్రీలలో మలయాళం ఇండస్ట్రీ కాస్త చిన్నది. ‘లోకల్ ఈజ్ ఇంటర్నేషనల్’ అనేది వాళ్ల నినాదం. ఎక్కువ శాతం సినిమాలు కేరళ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించేస్తారు. దాదాపు సినిమాలన్నీ తక్కువ బడ్జెట్ లో పూర్తి చేస్తారు. మరీ ముఖ్యంగా కథలో బలం ఉండటమే ప్రధానంగా చూస్తారు. గత నాలుగైదేళ్లలో పలు ఉత్తమ సినిమాలు అందించిన ఇండస్ట్రీ ఇది. ప్రముఖ హీరోలందరూ ఏడాదికి కనీసం మూడు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటారు. ఇంత విరివిగా సినిమాలు చేసే ఇండస్ట్రీకి (అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల లాగానే) కరోనా షాక్ తగిలింది. మూడు నెలలు సినిమాల నిర్మాణం ఆగిపోయింది. అయితే త్వరగా తేరుకొని, పని ప్రారంభించిన తొలి ఇండస్ట్రీ ఇదే కావడం విశేషం. తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీలతో పోల్చితే మలయాళ పరిశ్రమలో ఎక్కువగా షూటింగులు జరుగుతున్నాయి. కరోనా తర్వాత సగంలో ఆగిపోయిన సినిమాలను మళ్లీ మొదలుపెట్టడంతోపాటు కొత్త సినిమాలను కూడా ప్రకటించింది మాలీవుడ్. ప్రకటించడమే కాదు చిత్రీకరణ ప్రారంభించిది కూడా. లాక్ డౌన్ తర్వాత మొదలైన చిత్రాలు, వాటి విశేషాలు. లవ్ ‘అనురాగ కరిక్కిన్ వెళ్ళం, ఉండా’ వంటి హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు ఖాలీద్ రెహ్మాన్. ప్రస్తుతం షైన్ టామ్ చాకో, రాజిష విజయన్ ముఖ్య తారలుగా ఆయన ‘లవ్’ అనే చిత్రం తెరకెక్కించారు. లాక్ డౌన్ తర్వాత ప్రభుత్వం విధించిన గైడ్ లైన్స్ అనుసరిస్తూ ఈ షూటింగ్ ను ప్రారంభించారు. విశేషం ఏంటంటే.. ఈ సినిమా షూటింగ్ ని పూర్తి చేయడానికి నెల రోజులు కూడా తీసుకోలేదు. జూన్ 22న ప్రారంభించి, జులై 15 కల్లా షూటింగ్ పూర్తి చేసేశారు. సీ యూ సూన్ ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఉన్న ఉత్తమ నటుల్లో ఫాహద్ ఫాజిల్ ఒకరు. ఇటీవల ఆయన సినిమాలను దేశ వ్యాప్తంగా చూస్తున్నారు. తాజాగా లాక్ డౌన్ తర్వాత ఓ ప్రయోగం చేపట్టారు ఫాహద్. దర్శకుడు మహేష్ నారాయణ్ తో కలసి ఓ సినిమా చేశారు. సుమారు 75 నిమిషాలు నిడివి ఉండే ఓ సినిమాను ప్లాన్ చేశారు ఈ ఇద్దరూ. ‘సీ యూ సూన్’ టైటిల్‌తో ఈ సినిమాను పూర్తిగా ఐ ఫోన్లో చిత్రీకరించారు. ఇందులో ఫాహద్ తో పాటు పలువురు మలయాళ యంగ్ యాక్టర్స్ కూడా నటించారు. ఒక్కో యాక్టర్ షూటింగ్ పార్ట్ ఒక్కోసారి చేశారు. దీంతో ఎక్కువ మంది యాక్టర్స్ ఒకేసారి లొకేషన్లో కలుసుకునే అవకాశం కూడా తక్కువ. ఈ సినిమాను ఓటీటీ కోసమా థియేట్రికల్ రిలీజ్ కోసమా? ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. షూటింగ్ పూర్తయింది. ఏ సినిమా షూటింగ్ ప్రారంభించాలా? వద్దా? అనే చర్చ ఆ మధ్య కేరళ ఇండస్ట్రీ లోనూ జరిగింది. షూటింగ్ వద్దు అని కొంత మంది వాదిస్తే, షూటింగ్ వాయిదా వేస్తున్నంత కాలం ఇండస్ట్రీలో పని చేసేవాళ్లకు ఇబ్బందే అనేది ఇంకొందరి వాదన. అలాంటి వారిలో దర్శకుడు లిజో జోస్ పెల్లిసేరి ఒకరు. ‘అంగమలై డైరీస్, జల్లి కట్టు’ వంటి పాపులర్ చిత్రాలు తెరకెక్కించారు లిజో. లాక్ డౌన్ లో ‘ఏ’ అనే చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇదో రొమాంటిక్ సినిమా అని టాక్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని సమాచారం. హగల్ నటి, దర్శకురాలు రీమా కళింగల్, షరాఫుద్దీన్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు హర్ష ‘హగల్’ అనే చిత్రాన్ని కూడా లాక్ డౌన్ తర్వాతే ప్రకటించారు. ఈ సినిమాను దర్శకుడు ఆషిక్ అబు నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ జులైలో ప్రారంభం అయింది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. షూటింగులు జరుగుతున్నప్పటికీ కేరళలో తయారయే సినిమాల సంఖ్యతో పోలిస్తే ఇప్పుడు నిర్మాణంలో ఉన్నవి తక్కువే. అన్ని కథలూ తక్కువ మందితో, తక్కువ టీమ్ తో చెప్పేవి కావు. పరిస్థితులు చక్కబడి ఎప్పటిలాగానే సినిమాల షూటింగ్స్‌తో అన్ని ఇండస్ట్రీలు కళకళలాడాలని కోరుకుందాం. షూటింగ్‌కి రెడీ మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా షూటింగ్ కి రెడీ అయ్యారని సమాచారం. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో దుల్కర్ ఓ సినిమా చేయనున్నారు. రోషన్ ఆండ్రూ దర్శకత్వం వహించనున్నారు. పూర్తి స్థాయి పోలీస్ పాత్రలో తొలిసారి నటించనున్నారు దుల్కర్. ఈ సినిమా చిత్రీకరణ ఆగస్ట్ రెండో వారంలో ప్రారంభం కానుందని సమాచారం. థియేటర్ లోనే రిలీజ్ మలయాళ సూపర్ స్టార్స్ మమ్ముట్టి, మోహన్ లాల్ నటించిన కొన్ని చిత్రాల షూటింగ్ ఆల్రెడీ పూర్తయింది. అయితే ఓటీటీలో ఇవి విడుదలవుతాయి అని కొందరు అనుకున్నారు. కానీ అవి థియేటర్ లోనే రిలీజ్ అని చిత్రబందాలు పేర్కొన్నాయి. మోహన్ లాల్ నటించిన పీరియాడిక్ చిత్రం ’అరబికడలింటే సింహం : మరాక్కర’ మార్చిలో విడుదల కావాలి. కరోనా వల్ల వాయిదా పడింది. మమ్ముట్టి నటించిన ’వన్’ కూడా వేసవిలో విడుదల కావాలి. ఇందులో మమ్ముట్టి ముఖ్య మంత్రి పాత్రలో నటించారు. -
తెరుచుకున్న జిమ్‌లు, యోగా కేంద్రాలు
-
ఇలా చెమటోడ్చి ఎన్ని రోజులైందో...
హైదరాబాద్: నాలుగు నెలల తర్వాత జిమ్‌లో శ్రమించడం పట్ల ప్రపంచ చాంపియన్, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు సంతోషం వ్యక్తం చేసింది. అన్‌లాక్– 3 మార్గదర్శకాల్లో భాగంగా ఆగస్టు 5 నుంచి వ్యాయామశాలలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో... సింధు బుధవారం జిమ్‌లో చెమటోడ్చింది. పూర్తిస్థాయి జిమ్ సెషన్లో పాల్గొన్న ఆమె ట్విట్టర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. చాలా కాలం తర్వాత ఇలా కసరత్తులు చేయడం ఆనందంగా ఉందని పేర్కొంది. ట్రైనర్ సహాయంతో బరువులు ఎత్తడం, స్ట్రెచింగ్ వంటి వ్యాయామాలు చేసింది. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆటలకు అంతరాయం ఏర్ప డిన సంగతి తెలిసిందే. దీంతో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సెప్టెంబర్‌లో జరగాల్సిన నాలుగు టోర్నీలను రద్దు చేసింది. -
జిమ్‌లు రేపట్నుంచే..
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: నాలుగున్నర నెలల విరామం తర్వాత దేశవ్యాప్తంగా జిమ్‌లు, యోగా కేంద్రాలు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్‌లాక్–3.0లో వీటిని తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘యోగా కేంద్రాలు, జిమ్‌లలో కరోనా వ్యాప్తి నివారణ మార్గదర్శకాలను’ సోమవారం జారీ చేసింది. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని వారిని మాత్రమే యోగా కేంద్రాలు, జిమ్‌లలోకి అనుమతించాలని తేల్చిచెప్పింది. భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలోని యోగా కేంద్రాలు, జిమ్‌లు మూసి ఉంటాయి. ఈ జోన్ల వెలుపల ఉన్న వాటిని మాత్రమే తెరిచేందుకు అనుమతిస్తారు. మార్గదర్శకాలివే.. ► స్పాలు, స్టీమ్ బాత్, స్విమ్మింగ్ పూల్స్ మూసివేయాలి. ► యోగా సెంటర్లు, జిమ్‌లలో అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసుకోవాలి. వ్యక్తుల మధ్య కనీసం 4 మీటర్ల దూరం ఉండేలా రీడిజైనింగ్ చేయించాల్సి ఉంటుంది. ► జిమ్‌లో సెంట్రలైజ్డ్ ఏసీ లేదా సాధారణ ఏసీ ఉంటే గది ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య ఉంచాలి. వెంటిలేషన్ అధికంగా ఉండేలా చూడాలి. ► 65 ఏళ్ల వయసు పైబడినవారు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారు, గర్భిణులు, పదేళ్ల లోపు చిన్నారులు జిమ్‌లకు వెళ్లకపోవడమే మంచిది. ► హ్యాండ్ శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకున్న తర్వాతే ఎవరైనా యోగా సెంటర్/జిమ్ లోపలికి ప్రవేశించాలి. ప్రవేశ ద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ టెస్టు కూడా చేయించుకోవడం తప్పనిసరి. ► ఫేస్ మాస్కు/కవర్ ధరించిన వారిని మాత్రమే లోపలికి అనుమతించాలి. ► యోగా కేంద్రం/జిమ్‌లో ఉన్నంత సేపు ఆరోగ్యసేతు యాప్ ఉపయోగించాలి. ► జిమ్/యోగా కేంద్రంలో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందితో పాటు విజిటర్స్ తప్పకుండా ఫేస్ షీల్డ్‌లు ధరించాలి. ► కార్డియో, స్ట్రెంత్ ట్రైనింగ్ వంటి కఠినమైన వ్యాయామాలు చేసేముందు పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ స్థాయిలను పరీక్షించుకోవాలి. -
జిమ్స్ రీ ఓపెన్.. కేంద్రం మార్గదర్శకాలు
న్యూఢిల్లీ: కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దాంతో యోగా సెంటర్లు, జిమ్‌లు మూతపడ్డాయి. అయితే అన్‌లాక్ 3.0లో భాగంగా వీటిని తిరిగి ప్రారంభించేకుందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఈ నెల 5 నుంచి వీటిని తిరిగి ప్రారంభించవచ్చని తెలిపింది. ఈ మేరకు పాటించాల్సిన జాగ్రత్తల గురించి వివరించింది. జిమ్ ట్రైనర్లు, సిబ్బందితో సహా ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్క్ తప్పక ధరించాలని.. అంతేకాక జిమ్‌కు వచ్చే ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా ఉండాలని సూచించింది. అయితే కంటైన్మెంట్ జోన్లలోని యోగా ఇనిస్టిట్యూట్లు, జిమ్‌లు తెరిచేందుకు కేంద్రం ఇంకా అనుమతి ఇవ్వలేదు. అంతేకాక స్పాలు, స్మిమ్మింగ్ ఫూల్లు తెరవడానికి కూడా అనుమతిలేదు. జిమ్‌లు తెరుస్తున్న నేపథ్యంలో పాటించాల్సిన జాగ్రత్తలకు సంబంధించి కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. అవి... (లాక్డౌన్ ఎఫెక్ట్.. శరీరం సహకరించడం లేదు) 1. 65 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గర్భిణీ స్త్రీలు, పదేళ్లలోపు వయస్సు ఉన్న పిల్లలు మూసివేసిన ప్రదేశాలలోని జిమ్‌లను ఉపయోగించవద్దని కోరింది. 2. జిమ్ సెంటర్లలో అన్ని వేళలా ఫేస్ కవర్, మాస్క్ తప్పనిసరి. కానీ వ్యాయామం చేసేటప్పుడు, మాస్క్ వాడితే శ్వాస తీసుకోవడం కష్టం అవుతుంది కనుక విజర్ మాత్రమే ఉపయోగించవచ్చు. 3. ప్రతి ఒక్కరి మొబైల్లో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరి. 4. యోగా సెంటర్, జిమ్‌లో వ్యక్తుల మధ్య నాలుగు మీటర్ల దూరం ఉండాలి. పరికరాలను ఆరు అడుగుల దూరంలో ఉంచాలి. సాధ్యమైతే వాటిని ఆరుబయట ఉంచాలి. 5. గోడలపై సరైన గుర్తులతో భవనంలోకి ప్రవేశించడానికి, బయటకు వెళ్లడానికి నిర్దిష్ట మార్గాలను ఏర్పాటు చేయాలి. 6. ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ కోసం, ఉష్ణోగ్రతను 24-30 డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంచాలి. వీలైనంతవరకు తాజా గాలిని తీసుకోవాలి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం జిమ్, యోగా సెంటర్ గేట్లలో శానిటైజర్ డిస్పెన్సర్లు, థర్మల్ స్క్రీనింగ్ పరికరాలు తప్పనిసరిల. సిబ్బందితో సహా కరోనా లక్షణాలు లేని వ్యక్తులు మాత్రమే జిమ్‌లోనికి అనుమతించబడతారు. -
అన్‌లాక్ 3.0: స్పందనలో ఈ-పాస్‌లు
సాక్షి, విజయవాడ: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రప్రభుత్వం నెమ్మది నెమ్మదిగా సడలిస్తూ వస్తుంది. ప్రస్తుతం ఆన్‌లాక్ 3.o ని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 3 నిబంధనల ప్రకారం ఆంధ్రపప్రదేశ్ సరిహద్దు చెక్ పోస్టుల్లో ప్రభుత్వం సడలింపులు చేసింది. ఈ సందర్భంగా ట్రాన్స్ పోర్ట్ అండ్ ఆర్ అండ్ బీ ప్రిన్సిపాల్ సెక్రటరీ కృష్ణబాబు మాట్లాడుతూ, ‘ఏపీకి వచ్చే వారు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ- పాస్ మొబైల్, ఈ మెయిల్‌కి వస్తుంది. దానిని చెక్ పోస్టులో నమోదు చేయించుకుని ఏపీలోకి రావచ్చు. ఈ నమోదు, వచ్చేవారి సంఖ్యను గుర్తించేందుకు మాత్రమే . ఆ తర్వాత ఆరోగ్య కార్యకర్తలు వారి ఆరోగ్యంపై దృష్టి ఉంచుతారు. రేపటి (ఆదివారం) నుంచి ఈ విధానం అమలులోకి వస్తుంది’ అని తెలిపారు. చదవండి: నేడు తెరుచుకోనున్న ద్వారక ద్వారాలు -
కర్ఫ్యూ ఎత్తివేత
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట పడకపోగా, పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరిగిపోతుండడంతో పాఠశాలలు, కళాశాలలు, శిక్షణా సంస్థలు, సినిమా థియేటర్లు, బార్లు, భారీ సభలకు ఇప్పుడే అనుమతి ఇవ్వకూడదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో రైళ్లకు సైతం ఎర్రజెండా చూపింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలతో విస్తృత సంప్రదింపుల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. అన్‌లాక్–3 మార్గదర్శకాలను కేంద్ర హోంశాఖ బుధవారం జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల పలు కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు ఆమోదం తెలిపింది. ఆగస్టు 5వ తేదీ నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలకు అనుమతి ఇవ్వనున్నట్టు మార్గదర్శకాల్లో వెల్లడించింది. రాజకీయ, సామాజిక, మతపరమైన సమావేశాలకు అనుమతి లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రాత్రిపూట కర్ఫ్యూను ఆగస్టు 1 నుంచి పూర్తిగా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. సినిమా హాళ్లు, బార్లు, సమావేశ మందిరాలకు ఎప్పటి నుంచి అనుమతి ఇచ్చేది తెలియజేస్తూ ప్రత్యేక ప్రకటన జారీ చేస్తామని పేర్కొంది. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలను కఠినంగా అమలు చేయనున్నట్లు వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ఆంక్షలు వీటిపైనే.. ► పాఠశాలలు, కళాశాలలు, విద్యా, శిక్షణా సంస్థలు ఆగస్టు 31 వరకు మూసి ఉంటాయి. ఆన్లైన్, డిస్టెన్స్ లెర్నింగ్‌కు అనుమతి ఉంటుంది. దీన్ని మరింతగా ప్రోత్సహించాలి. ► సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులు, ఎంటర్టైన్మెంట్ థియేటర్లు, బార్లు, ఆడిటోరియమ్స్, అసెంబ్లీ హాల్స్, ఇదే కోవలోకి వచ్చే ఇతరత్రా అన్నీ మూసి ఉంటాయి. ► యోగా కేంద్రాలు, జిమ్‌లను ఆగస్టు 5 నుంచి తెరిచేందుకు అనుమతిస్తారు. ఇందుకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేకంగా ప్రామాణిక నిర్వాహక నియమావళిని(ఎస్ఓపీ) జారీ చేస్తుంది. ► హోంశాఖ అనుమతించినవి(వందేభారత్ మిషన్) మినహా అంతర్జాతీయ విమాన ప్రయాణాలు ఉండవు. ► ఆగస్టు 31 వరకు మెట్రో రైళ్లకు అనుమతి లేదు. ► సామాజిక, రాజకీయ, క్రీడా, వినోదాత్మక, బోధన, సాంస్కృతిక, మతపరమైన వేడుకలు, భారీ సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదు. ► ఆయా కార్యకలపాలకు అనుమతికి సంబంధించి తేదీలు, ప్రామాణిక నిర్వాహక నియమావళి(ఎస్ఓపీ) ప్రత్యేకంగా ప్రకటిస్తారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు పంచాయతీ, మున్సిపల్, సబ్‌డివిజన్, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు, ఎట్ హోం వేడుకలకు అనుమతి ఉంటుంది. ఈ వేడుకల సందర్భంగా మాస్క్ ధరించడం, భౌతిక దూరం వంటి నిబంధనలు కచ్చితంగా పాటించాలి. హెల్త్ ప్రొటోకాల్స్ పాటించాలి. కంటైన్మెంట్ జోన్ల వరకే నిబంధనలు కంటైన్మెంట్ జోన్లలో లాక్డౌన్ నిబంధనలు ఆగస్టు 31వ తేదీ వరకు కొనసాగుతాయి. కంటైన్మెంట్ జోన్లను జిల్లా అధికార యంత్రాంగం గుర్తిస్తుంది. ఆయా జోన్లలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. కానీ, ఇతరత్రా రాకపోకలకు అనుమతి లేదు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల బఫర్ జోన్లను కూడా గుర్తిస్తారు. ► కరోనా వైరస్ కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవచ్చు. అయితే రాష్ట్రంలో గానీ, రాష్ట్రాల మధ్య గానీ రాకపోకలపై ఆంక్షలు విధించరాదు. ఈ ప్రయాణాలకు ఎలాంటి అనుమతులు అక్కర్లేదు. ► 65 ఏళ్ల వయసు పైబడిన వారు, పదేళ్ల లోపు చిన్నారులు, ఇతర వ్యాధులు ఉన్నవారు, గర్భిణులు ఆరోగ్య అవసరాలకు మినహా బయటకు రాకూడదు. ► వివాహ సంబంధిత వేడుకలకు 50 మందికి మించి అనుమతి లేదు. ► అంత్యక్రియలకు 20 మంది కంటే ఎక్కువ మంది హాజరు కాకూడదు. ► బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, పొగ తాగడం, పాన్, గుట్కా తీసుకోవడం నిషిద్ధం. ► అన్‌లాక్–3 మార్గదర్శకాలు ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. -
అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల
న్యూఢిలీ : కరోనా లాక్డౌన్ నిబంధనలను దశల వారీగా సడలిస్తున్న కేంద్ర ప్రభుత్వం తాజాగా అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీచేసింది. జూలై 31తో అన్‌లాక్ 2.0 గడువు ముగియనుండటంతో.. కేంద్రం తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది. అన్‌లాక్ 3.0లో రాత్రిపూట ఉన్న కర్ఫ్యూను పూర్తిగా తొలగించారు. అయితే కంటైన్మెంట్ జోన్లలో ఆగస్టు 31వరకు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయనున్నట్టు కేంద్రం స్పష్టం చేసింది. మార్గదర్శకాలు.. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఆగస్టు 31 వరకు మూసివేత ఆగస్టు 5 నుంచి యోగా సెంటర్లు, జిమ్‌లకు అనుమతి సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్స్, మెట్రో రైలు మూసివేత కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది) సాధారణ అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు కంటైన్మెంట్ జోన్లలో అంక్షలు కొనసాగింపు భౌతిక దూరం, వైద్య నిబంధనలు పాటిస్తూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవచ్చు. సామాజిక, రాజకీయ, క్రీడా, వినోద, మత పరమైన సమావేశాలపై నిషేధం కొనసాగింపు(అయితే పరిస్థితులను అంచనా వేసి వీటి అనుమతులపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్రం తెలిపింది) -
ఆగస్టు 1న విడుదల!
న్యూఢిల్లీ దేశవ్యాప్తంగా కోవిడ్–19 ఆంక్షల్ని మరింత సడలించడంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెల 31వతేదీతో అన్‌లాక్ 2.0 ప్రక్రియ ముగియనున్నందున అన్‌లాక్ 3.0 మార్గదర్శకాల రూపకల్పనలో నిమగ్నమైంది. సినిమా హాళ్లు, జిమ్‌లు తెరిచేందుకు ఉన్న అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి. 50% సీటింగ్ సామర్థ్యం, శానిటైజేషన్‌కి వీలుగా రెండు షోల మధ్య సుదీర్ఘ విరామం లాంటి జాగ్రత్తలతో థియేటర్లను ప్రారంభించడానికి యజమానులు సుముఖంగా ఉన్నారు. అయితే సీట్ల మధ్య భౌతిక దూరం పాటించడం, కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా తొలుత 25% సీటింగ్‌తో థియేటర్లు ప్రారంభించేందుకు అనుమతించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖ హోంశాఖకు సూచించింది. (క్రికెట్ మ్యాచ్‌కు ప్రేక్షకులు షురూ) ఏసీ థియేటర్లలో తలుపులన్నీ మూసి ఉండడం వల్ల ప్రేక్షకుల్లో ఏ ఒక్కరికైనా కరోనా ఉంటే పరిస్థితి ఏమిటనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఆయా రాష్ట్రాల్లో కరోనా పరిస్థితుల్ని అంచనా వేసి అక్కడ ప్రభుత్వాలే థియేటర్లు, జిమ్‌లు తెరవడానికి అనుమతినిచ్చేలా చర్యలు చేపట్టనున్నట్లు భావిస్తున్నారు. అన్‌లాక్ 3.0 సడలింపులను ఆగస్టు 1వ తేదీ నుంచి అమలులోకి తెచ్చేలా కేంద్ర హోంశాఖ సన్నాహాలు చేస్తోంది. (కరోనా కథలు) క్యూలు నివారిస్తే.. ► సినిమా హాళ్లు, జిమ్‌లను 25 శాతం సీటింగ్ కెపాసిటితో అనుమతించడంపై కేంద్ర సమాచార ప్రసారశాఖ హోంశాఖకు ప్రతిపాదనలు అందచేసింది. థియేటర్ల యజమానులతో చర్చించి కేంద్ర సమాచారశాఖ వీటిని రూపొందించింది. థియేటర్లలో విశ్రాంతి సమయంలో ఫలహారశాలల మధ్య క్యూలను నివారించడం ద్వారా చిత్ర ప్రదర్శనను ఆహ్లాదకరంగా మార్చేలా చర్యలు తీసుకోవాలని యజమానులు కోరుతున్నారు. మాస్కులతో వ్యాయామాలా? ► సుదీర్ఘ విరామం తరువాత జిమ్‌లు తెరించేందుకు అనుమతించాలని కేంద్రం భావిస్తున్నప్పటికీ అందుకు అనుగుణంగా తీసుకోవాల్సిన సురక్షిత చర్యలపై సందిగ్ధం నెలకొంది. మాస్కులు ధరించి ఎక్సర్సైజులు చేయడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. స్కూళ్లు, మెట్రోలు లేనట్లే.. ! అన్‌లాక్ 3.0లో పాఠశాలలు, మెట్రో రైళ్లను అనుమతించే అవకాశాలు కనిపించడం లేదు. మెట్రో రైళ్లలో భౌతిక దూరం పాటించడం సాధ్యం కాదు కాబట్టి ప్రస్తుతం వాటిని నడిపే ఆలోచన చేయడం లేదు. ఇక పాఠశాలలకు సంబంధించి యాజమాన్యాలు, తల్లిదండ్రులతో కేంద్ర మానవ వనరుల శాఖ పలు దఫాలు సంప్రదింపులు జరిపింది. తల్లిదండ్రులెవరూ ఇప్పట్లో స్కూళ్లు తెరవడానికి సుముఖంగా లేరని కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ పేర్కొన్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పాఠశాలలను పునఃప్రారంభించేందుకు అనుమతించే అవకాశం లేదని భావిస్తున్నారు. -
27న ముఖ్యమంత్రులతో మోదీ భేటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 27వ తేదీన అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా తాజా పరిస్థితి, బాధితులకు అందుతున్న వైద్య సేవలు, రాష్ట్రాల సన్నద్ధత, వైరస్ నియంత్రణ చర్యలు, అన్‌లాక్ 3.0పై చర్చించనున్నట్లు సమాచారం. భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. -
సినిమాను థియేటర్లో చూడటం..
‘‘లాక్డౌన్ సమయంలో దాదాపు అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. ప్రస్తుతం అన్‌లాక్ ప్రక్రియ మొదలయింది. ఆగస్ట్ చివరి వారంలో థియేటర్స్‌లో సినిమాల ప్రదర్శన ప్రారంభం అవుతుందనుకుంటున్నాం’’ అని ప్రముఖ మల్టీప్లెక్స్ చైన్ల (పీవీఆర్, ఐనాక్స్, సినీపోలిస్ వంటి సంస్థలు) సీఈవోలు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే థియేటర్స్ ప్రారంభం అయితే ఎలా నడిపించాలనుకుంటున్నారో వంటì అంశాలను పొందుపరిచి వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖలకు, ప్రధానమంత్రి ఆఫీస్‌కి లేఖ రాశారు. అందులోని సారాంశం ఈ విధంగా. ► థియేటర్స్‌కి వచ్చేవాళ్లకు మాస్క్ తప్పనిసరి చేస్తాం. లోపలికి వచ్చే ముందు తప్పకుండా ఉష్ణోగ్రత చూసే లోపలికి అనుమతించడం జరుగుతుంది. ► ఇక నుంచి మొత్తం డిజిటల్ విధానంలో పనులు జరిగేలా చూస్తాం. పేపర్ టికెటింగ్‌ను పూర్తిగా నిషేధిస్తాం. ఎస్ఎంఎస్, బార్కోడ్ స్కానింగ్ పద్ధతిని పాటిస్తాం. ► ఒక సీట్‌కి మరో సీట్‌కి మధ్య గ్యాప్ ఉండేలా జాగ్రత్తపడతాం. ► మల్టీప్లెక్స్‌లో ఏ రెండు షోలు ఒకేసారి ప్రారంభం కాకుండా చూసుకుంటాం. దానివల్ల అన్ని స్క్రీన్స్‌లో ఇంటర్వెల్ ఒకేసారి కాకుండా వేరే వేరే టైమ్‌లో ఉంటుంది. ఇలా అయితే రద్దీ ఏర్పడే అవకాశం తక్కువ. ► ప్రతీ షోకి మధ్యలో కనీసం 15 నిమిషాల నుంచి అర్ధగంట విరామం ఉంటుంది. ఈ సమయంలో మొత్తం సీటింగ్ శానిటైజ్ చేయడానికి వీలవుతుంది. ► మల్టీప్లెక్స్‌లో వీలైనన్ని శానిటైజర్లు ఏర్పాటు చేస్తాం. ఇటువంటి విషయాలను ఇందులో ప్రస్తావించారు. ‘‘సినిమా చూడటానికి వచ్చే ప్రతీ ప్రేక్షకుడి భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాం. ప్రేక్షకులకు నమ్మకం కలిగించే వాతావరణం సృష్టించాలనుకుంటున్నాం. అలాగే ఒక్క పెద్ద సినిమా వస్తే మళ్లీ ప్రేక్షకులు థియేటర్స్‌కి వస్తారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కొన్ని సినిమాలు థియేటర్స్‌కి రాకుండానే ఓటీటీలకు వెళ్లిపోయాయి. అదో కొత్త పరిణామం. ప్రస్తుతం అందరం కష్ట సమయంలో ఉన్నాం. సినిమా థియేటర్ల వ్యాపారం ఏడాదికి పన్నెండు వేల కోట్లు ఉంటుంది. ప్రస్తుతం థియేటర్స్ మూతబడటంతో నెలకు సుమారు వెయ్యి కోట్ల నష్టం ఏర్పడుతోంది. కానీ మళ్లీ అంతా సాధారణ స్థితికి వస్తుంది. ఎందుకంటే సినిమాను థియేటర్లో చూడటం అనేది మన డీఎన్ఏలోనే ఉంది. అదో సామూహిక అనుభవం’’ అని పేర్కొన్నారు ఆయా సంస్థల ప్రతినిధులు. -
బెంగళూరులో అన్‌లాక్ 2
సాక్షి, బెంగళూరు: బెంగళూరులో ఆర్థిక కార్యకలాపాలు జరగాల్సి ఉంది. ఇలాంటి సందర్భంలో మళ్లీ లాక్డౌన్ విస్తరణ అనేది సాధ్యం కాని పని, మళ్లీ పొడిగించడం ఉండబోదని ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప స్పష్టంచేశారు. బుధవారం నుంచి లాక్డౌన్ ఎత్తివేస్తున్నట్లు, అన్ని కార్యకలాపాలు యథావిధిగా సాగుతాయని తెలిపారు. కేవలం కంటైన్మెంట్ జోన్లలో మాత్రమే కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు లాక్డౌన్ ఒక్కటే పరిష్కారం కాదని, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం మరిచిపోవద్దని సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన మాట్లాడారు. పొరుగు రాష్ట్రాల నుంచి అనేక మంది ప్రజలు వస్తుండడంతో కర్ణాటకలో కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టీఎం విజయ్ భాస్కర్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా రాత్రి కర్ఫ్యూ రాత్రి 9 నుంచి 5 గంటల వరకు కొనసాగుతుందన్నారు. అదే విధంగా ఆదివారాల్లో లాక్డౌన్ ఉంటుందని పేర్కొన్నారు. అన్‌లాక్ 2.0 నిబంధనలు జూలై 22 ఉదయం 5 గంటల నుంచి జూలై 31 వరకు అమలులో ఉంటాయని ఆయన తెలిపారు. (తగ్గిన మరణాల రేటు) 80 శాతం రోగులకు లక్షణాల్లేవు ప్రతి కోవిడ్ రోగితో సంప్రదింపులు జరిపిన కనీసం 45 మందికి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. ఇకముందు కేవలం 24 గంటల్లో కరోనా పరీక్షల ఫలితాలు వచ్చేలా చేస్తామన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 80 శాతం మంది రోగులకు ఎలాంటి లక్షణాలే కనిపించడం లేదని, ఇలాంటి సందర్భంలో కోవిడ్ కేర్ సెంటర్లో మాత్రమే కాకుండా హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. బెంగళూరులో 11,230 పడకలను కరోనా చికిత్స కోసం సిద్ధం చేసినట్లు, అంబులెన్సుల కొరత లేదని తెలిపారు. రోగులు అధైర్యపడొద్దని కోరారు. ప్రతి 100 మందిలో 98 మంది కరోనా రోగులు సంపూర్ణంగా కోలుకుంటున్నారని ఎవరూ భయపడి ఆత్మహత్యలు చేసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. -
ఏపీలో అన్‌లాక్ 2.0 అమలు ఉత్తర్వులు జారీ
సాక్షి, ఏపీ సచివాలయం : ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లాక్ 2.0 అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర హోం శాఖ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులు వెలువరించింది. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు అమలు చేయాలని.. అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కాగా, కరోనా లాక్డౌన్ ఆంక్షలను దశలవారీగా సడలించే ప్రక్రియలో భాగంగా కేంద్రం ఇటీవల అన్‌లాక్ 2.0 మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి 31 వరకు అన్‌లాక్ 2.0 అమల్లో ఉంటుందని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.(చదవండి : అన్‌లాక్–2 మార్గదర్శకాలు ఇవే..) -
నవంబర్ వరకు ఉచిత రేషన్ : మోదీ
న్యూఢిల్లీ : ప్రధాని గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకాన్ని పొడిగిస్తున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. నవంబర్ ఆఖరు వరకు ఉచిత రేషన్ కొనసాగించనున్నట్టు వెల్లడించారు. జూలై నుంచి నవంబర్ వరకు 80 కోట్ల మందికి రేషన్ ఇస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరికి నెలకు 5 కిలోల బియ్యంతోపాటుగా, కిలో పప్పు అందజేస్తామని తెలిపారు. దేశంలో వన్ నేషన్-వన్ రేషన్ కార్డు విధానాన్ని తీసుకోస్తున్నట్టు వెల్లడించారు. ఇది వలస కూలీలకు, వారి కుటుంబాలకు మేలు చేస్తుందన్నారు. రేపటి నుంచి అన్‌లాక్ 2.0 నిబంధనలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మంగళవారం ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కరోనా కేసులు పెరుగుతన్న నేపథ్యంలో కంటైన్మెంట్ జోన్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ..‘కరోనాతో పోరాటం చేస్తూ అన్‌లాక్ 2.0 లోకి ప్రవేశించాం. రానున్న కాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయి. అందువల్ల వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనాతో చనిపోతున్నవారి సంఖ్యను చూస్తే.. ప్రపంచంలో భారత్ పరిస్థితి మెరుగ్గా ఉంది. సరైన సమయంలో లాక్డౌన్ పెట్టడం వల్ల కరోనా అదుపులో ఉంది. లాక్డౌన్ వల్ల లక్షలాది మంది ప్రాణాలు కాపాడాం. కానీ అన్‌లాక్ 1.0 ప్రారంభమైనప్పటి నుంచి కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొద్దిరోజుల నుంచి మాస్కులు ధరించడంలో ప్రజల్లో నిర్లక్ష్యం కనిపిస్తోంది. లాక్డౌన్ సమయంలో ప్రజలు నిబంధనలను చాలా కఠినంగా పాటించారు. మళ్లీ ఒకసారి రాష్ట్రప్రభుత్వాలు నిబంధనలను కఠినంగా చేయాల్సిన అవసరం ఉంది. ఒక దేశ ప్రధాని మాస్కు పెట్టుకోలేదని రూ.13వేలు జరిమానా విధించారు. మన ప్రభుత్వాలు కూడా ఇదే స్ఫూర్తితో కఠినంగా వ్యవహరించాలి. దేశంలో ఏ ఒక్కరూ చట్టానికి అతీతులు కారు. లాక్డౌన్ సందర్భంగా ఏ ఒక్కరూ ఆకలితో ఉండకూడదని ప్రభుత్వాలు పనిచేశాయి. దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా రేషన్ అందించాం. గత కొన్ని నెలలుగా రైతులు బ్యాంక్ ఖాతాల్లో నేరుగా రూ. 18 వేల కోట్లు జమ చేశాం. రాబోయేది పండగల సీజన్ కావున ప్రజలకు అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఈ క్రమంలోనే దీపావళి వరకు 80 కోట్ల మందికి పేదలకు ఉచితంగా రేషన్ ఇస్తాం. 5 కిలోల బియ్యంతోపాటు కిలో పప్పు అందజేస్తాం.గరీబ్ కల్యాణ్ యోజన పొడిగింపు కోసం రూ.90వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పన్ను చెల్లించే ప్రతి భారతీయుడి వల్లే... ఈరోజు ఇంతమంది పేదలకు సాయం చేయగలుగుతున్నాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఆర్థిక కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలి’అని తెలిపారు. -
అన్‌లాక్-2 మార్గదర్శకాలు విడుదల
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్‌ను కేంద్రం ప్రభుత్వం దశలవారీగా సడలిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం అన్‌లాక్-2 విధివిధానాలు ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ పలు మార్గదర్శకాలు విడదల చేసింది. జూలై 31వరకు అన్‌లాక్-2 నిబంధనలు అమల్లో ఉంటాయని తెలిపింది. కంటైన్మెంట్ జోన్లలో జులై 31 వరకు లాక్డౌన్ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. కంటైన్మెంట్ జోన్లలో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతించనున్నట్లు స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటలవరకు కర్ఫ్యూ కొనసాగుతుందని తెలిపింది. స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు, ఆధ్యాత్మిక కార్యకలాపాలపై జూలై 31 వరకు నిషేధం కోనసాగుతుందని వెల్లడించింది. (100 రోజుల లాక్డౌన్.. ఏం జరిగింది?) కేంద్ర, రాష్ట్ర శిక్షణా సంస్థలకు జులై 15 నుంచి కార్యకలాపాలకు అవకాశం ఇవ్వనున్నట్లు పేర్కొంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతుందని వెల్లడించింది.హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం కల్పించనున్నట్టు స్పష్టం చేసింది. మెట్రోరైళ్లు, థియేటర్లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్ కూడా జులై 31 వరకు మూసివేత కొనసాగుతుందని తెలిపింది. -
రేపటితో ముగియనున్న అన్‌లాక్ 1.0
-
లాకులెత్తారు!
న్యూఢిల్లీ: రెండు నెలలకు పైగా కొనసాగుతున్న ‘లాక్డౌన్’ నుంచి వ్యూహాత్మక ‘అన్‌లాక్’ దిశగా దేశం మరో అడుగు వేసింది. మార్చి 25 తరువాత తొలిసారి దేశవ్యాప్తంగా సోమవారం పలు ప్రాంతాల్లో ప్రార్థనాలయాలు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, కార్యాలయాలు తెరుచుకున్నాయి. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం ప్రకటించిన కఠిన నిబంధనల మధ్య ఆయా ప్రదేశాల్లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రార్థనాలయాలు, మాల్స్‌లో ప్రవేశానికి సంబంధించి.. పరిమిత సంఖ్యలో వ్యక్తులను లోనికి అనుమతించడం, భౌతిక దూరం, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనిసరి చేయడం, ఆ ప్రదేశమంతా ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయడం, ప్రవేశ ప్రాంతాలు సహా ఇతర ముఖ్య ప్రదేశాల్లో శానిటైజర్లను అందుబాటులో ఉంచడం.. తదితర నిబంధనలను పాటించారు. అయోధ్యలోని రామజన్మభూమి, ఉడిపిలోని మూకాంబికా దేవాలయం, ఢిల్లీలోని జామామసీదు, అమృతసర్‌లోని స్వర్ణ దేవాలయం మొదలైనవి తెరుచుకున్నాయి. షాపింగ్ మాల్స్‌కి ఊహించిన స్థాయిలో వినియోగదారులు రాలేదు. కరోనా భయం, లాక్‌డౌన్‌తో ఆర్థిక ఇబ్బందులు అందుకు కారణంగా భావిస్తున్నారు. రెస్టారెంట్లలోనూ అరకొరగానే ఆహార ప్రియులు కనిపించారు. వెయిటర్లు ఫేస్ షీల్డ్‌లు ధరించి సర్వీస్ చేశారు. టేబుళ్లను దూరం దూరంగా ఏర్పాటు చేశారు. రెస్టారెంట్లలో డిజిటల్ మెన్యూస్, డిజిటల్ పేమెంట్స్‌కు ప్రాధాన్యమిచ్చారు. కాగా, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాల్లో ప్రార్థనాలయాలు, మాల్స్‌ను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతించలేదు. -
అన్‌లాక్ ఇలా..
సాక్షి, హైదరాబాద్ : సాధారణంగా ఏదైనా రెస్టారెంట్‌కు కుటుం బంతో కలసి వెళ్లినప్పుడు మనం ఏం చేస్తాం? మెనూ కార్డు తీసుకొని ఆర్డర్ ఇచ్చేందుకు ఇంటిల్లిపాదీ దాన్ని తరచితరచి చూస్తాం. ఆపై మనం పక్కనపెట్టిన కార్డును పక్క టేబుల్‌పై ఉన్న కస్టమర్లకు వెయిటర్లు ఇవ్వడమూ చూస్తుంటాం. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇకపై మెనూ కార్డు చేతులు మారే పరిస్థితికి తెరపడనుంది. ప్లాస్టిక్ మెనూ కార్డు స్థానంలో డిస్పోజబుల్ (ఒకసారి వినియోగించి పారేసే) మెనూ కార్డు దర్శనమివ్వనుంది. వీలైతే కాంటాక్ట్‌లెస్ ఆర్డర్ల విధానం అమల్లోకి రానుంది. హోటళ్లు, రెస్టారెంట్లలోని ఏసీల్లో ఉష్ణోగ్రత కేవలం 24–30 డిగ్రీల సెల్సియస్‌కే పరిమితం కానుంది. హోటళ్లు, షాపింగ్ మాళ్లను సందర్శించే వినియోగదారుల కోసం ఈ మేరకు కొత్త నిబంధనలు ఎదురుచూస్తున్నాయి. దేశంలో కరోనా లాక్డౌన్ కారణంగా దాదాపు 80 రోజు లుగా మూతపడిన వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాళ్లను ఈ నెల 8 నుంచి తిరిగి తెరిచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం తాజాగా సడలింపుల మార్గదర్శకాలను ప్రకటించింది. షాపింగ్ మాళ్లు, వాణిజ్య కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లకు కేటగిరీలవారీగా నిబంధనలు విధించింది. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది. సుదీర్ఘ విరామం తర్వాత తెరుస్తున్నందున ముందుగా శానిటైజేషన్ చేశాకే ఉద్యోగులు, సిబ్బందిని లోనికి అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే... కరోనా వ్యాప్తిని నిలువరించడంలో కీలకమైన భౌతికదూరం పాటించడంతోపాటు ప్రతి వ్యక్తి మాస్కు తప్పనిసరిగా ధరించాలని, ఏవైనా వస్తువులు తాకినప్పుడు లేదా పనికి ముందు, తర్వాత తప్పకుండా చేతులను శానిటైజర్/హ్యాండ్‌వాష్/సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రపర్చుకోవాలని కేంద్రం సూచించింది. ప్రతి వాణిజ్య కార్యాలయం, హోటల్, రెస్టారెంట్, షాపింగ్ మాల్లో యాజమాన్యం, సిబ్బంది తప్పనిసరిగా మాస్కు ధరించి భౌతికదూరం పాటించాలని, వినియోగదారులను తాకకుండా జాగ్రత్త పడాలని పేర్కొంది. విధులకు వచ్చే ఉద్యోగులు, సిబ్బందితోపాటు వినియోగదారులకు థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించాలని, జ్వరం, దగ్గు తదితర లక్షణాలతో వచ్చే వారి గురించి వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందికి లేదా 104 టోల్‌ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించింది. కేటగిరీలవారీగా కేంద్రం మార్గదర్శకాలు ఇవీ... హోటళ్లు, అనుబంధ యూనిట్లు... ► గర్భిణులు, పదేళ్లలోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన వారిని అనుమతించొద్దు. ►పనిచేసే సిబ్బంది తప్పకుండా మాస్కులు ధరించడంతోపాటు చేతికి గ్లౌజులు తొడుక్కోవాలి. ►కస్టమర్లు క్యూలలో నిల్చొనేటప్పుడు తప్పకుండా 6 అడుగుల భౌతికదూరం ఉండేలా ఏర్పాట్లు చేయాలి. ►రిసెప్షన్ వద్ద శానిటైజర్లు, వాష్ ఏరియాల్లో తప్పకుండా హ్యాండ్‌వాష్‌లు ఏర్పాటు చేయాలి. ► హోటల్‌కు వచ్చే అతిథుల వివరాలను పూర్తిగా నమోదు చేసుకోవాలి. అందుకు ప్రత్యేకంగా రిజిస్టర్ ఏర్పాటు చేయాలి. కార్యాలయాల్లో... ► ఎక్కువ మంది సిబ్బంది ఉండే కార్యాలయాలు సిబ్బందిని ఒకేసారి కాకుండా విడతలుగా లేదా వర్క్ ఫ్రం హోంకు అవకాశం ఇవ్వాలి. ► ప్రతి ఉద్యోగికి థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడంతోపాటు మాస్కు వేసుకునేలా చేడాలి. ► లిఫ్ట్‌ల వాడకాన్ని పూర్తిగా తగ్గించాలి. కార్యాలయం ప్రవేశంలోనే శానిటైజర్లు ఏర్పాటు చేసి వాటితో శుభ్రం చేసుకునేలా అవగాహన కల్పించాలి. ► శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నవారిని, జలుబు, దగ్గు తదితర లక్షణాలున్నవారికి ప్రవేశం అనుమతించవద్దు. ► మీటింగ్‌లను వీలైనంత తగ్గించుకొని ఆన్లైన్ పద్ధతిలో ఆదేశాలు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలి. ► వాలెట్ పార్కింగ్ సిబ్బంది పూర్తి జాగ్రత్తతో ఉండేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రెస్టారెంట్లలో... ► కస్టమర్ల్ల సీటింగ్ స్పేస్ విశాలంగా ఉండేలా, వ్యక్తుల మధ్య ఫిజికల్ డిస్టెన్స్ పాటించేలా ఏర్పాట్లు చేయాలి. ► 50% సీటింగ్ సామర్థ్యానికి మించి వినియోగదారులను అనుమతించకూడదు. ► వృద్ధులు, చిన్నపిల్లల్ని అనుమతించవద్దు. ► డిస్పోజబుల్ మెనూలను వాడాలి. ఒకరు వాడిన మెనూను మరొకరు వాడకుండా చూడాలి. ► బట్ట న్యాప్కిన్లకు బదులు వినియోగదారులకు కాగితపు న్యాప్కిన్లు ఇవ్వాలి. ► కాంటాక్ట్‌లెస్ అర్డర్లతోపాటు డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ప్రోత్సహించాలి. ► ప్రధానంగా పార్శిల్ కౌంటర్లను ఏర్పాటు చేయాలి. టేక్ అవేను ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి. ► డోర్ డెలివరీ చేసే సిబ్బందికి తరచూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయడంతోపాటు శానిటైజర్ వినియోగాన్ని విస్తృతంగా వాడేలా చూడాలి. ► సెంట్రలైజ్డ్ ఏసీ వాడకాన్ని తగ్గించి బయటిగాలి వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ► కస్టమర్లు వచ్చి వెళ్లిన వెంటనే శానిటైజేషన్ చేయాలి. షాపింగ్ మాల్స్‌లో... ► లోనికి వచ్చే ఉద్యోగులు మొదలు కస్టమర్లకు ప్రవేశద్వారం వద్ద థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించి శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకునే ఏర్పాట్లు చేయాలి. ► షాపింగ్‌మాల్ సామర్థ్యంలో సగం మందికే ప్రవేశం కల్పించాలి. ► ప్రతి కస్టమర్ ఎడం పాటించేలా చూసేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలి. ► ఉద్యోగులు, సిబ్బంది చేతికి గ్లౌజులు వేసుకున్నాకే కస్టమర్లకు వస్తువులు అందించాలి. ► పిల్లల ఆట ప్రాంగణాలను తెరవకూడదు. ► లిఫ్ట్ వినియోగాన్ని తగ్గించి ఎస్కలేటర్లను ప్రోత్సహించాలి. కస్టమర్ల తాకిడిని బట్టి వీలైనప్పుడల్లా షాపింగ్ మాల్‌ను సోడియం హైపోక్లోరైడ్ లాంటి ద్రావణంతో శానిటైజ్ చేయాలి. -
లాభాలు అన్‌లాక్
అన్‌లాక్ (లాక్డౌన్ సడలింపులు) నిబంధనలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నివ్వడంతో సోమవారం స్టాక్‌మార్కెట్ భారీగా లాభపడింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో జీడీపీ 11 ఏళ్ల కనిష్టానికి పడిపోయినా, మే నెల తయారీ రంగం అంతంతమాత్రంగానే ఉన్నా, మార్కెట్ ముందుకే దూసుకుపోయింది. అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండటం, నైరుతి రుతుపవనాలు సకాలంలోనే వస్తాయని, ఈ ఏడాది వర్షాలు విస్తారంగా కురుస్తాయన్న తీపికబురు సానుకూల ప్రభావం చూపించాయి. సెన్సెక్స్ 33,000 పాయింట్లు, నిఫ్టీ 9,800 పాయింట్ల ఎగువకు ఎగబాకాయి. ఇంట్రాడేలో 1,250 పాయింట్ల మేర ఎగసిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 879 పాయింట్ల లాభంతో 33,304 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 246 పాయింట్ల లాభంతో 9,826 పాయింట్ల వద్దకు చేరింది. ఈ రెండు సూచీలు చెరో 2.5 శాతం మేర పెరిగాయి. స్టాక్ సూచీలు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ లాభపడ్డాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,250 పాయింట్లు, నిఫ్టీ 352 పాయింట్ల మేర పెరిగాయి. ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ, ఇంధన రంగ షేర్లలో జోరుగా కొనుగోళ్లు జరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభపడ్డాయి. మరిన్ని విశేషాలు... ► బజాజ్ ఫైనాన్స్ 11 శాతం లాభంతో రూ.2,160 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేరు ఇదే. ► సెన్సెక్స్‌లో ఐదు షేర్లు మినహా మిగిలిన 25 షేర్లు లాభాలు సాధించాయి. ఎల్ అండ్ టీ, హీరో మోటొకార్ప్, సన్ ఫార్మా, నెస్లే ఇండియా, ఆల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు నష్టపోయాయి. ► దాదాపు 50కు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగబాకాయి. దివీస్ ల్యాబ్స్, బయోకాన్, సిప్లా, ఎస్కార్ట్స్, అదానీ గ్రీన్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మే నెల అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉన్నా, వాహన షేర్లు దూసుకుపోయాయి. ► ఈ నెల 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లతోపాటు, షాపింగ్ మాల్స్‌ను తెరవడానికి కేంద్రం అనుమతిచ్చింది. దీంతో హోటళ్ల షేర్లు 20% వరకూ పెరిగాయి. చాలెట్ హోటల్స్, ఇండియన్‌హోటల్స్, ఈఐహెచ్, ఈఐహెచ్ వంటివి వీటిలో ఉన్నాయి. రూ. 3 లక్షల కోట్లు ఎగసిన సంపద మార్కెట్ జోరుతో ఇన్వెస్టర్ల సంపద రూ. 3 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో నమోదైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ రూ. 3 లక్షల కోట్లు ఎగసి రూ.130.10 లక్షల కోట్లకు పెరిగింది. లాభాలు ఎందుకంటే... ► అన్‌లాక్ 1.0 కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని చోట్లా అన్ని కార్యకలాపాలను దశలవారీగా ఆరంభించడానికి కేంద్రం పచ్చజెండా ఊపడంతో స్టాక్ మార్కెట్లో కొనుగోళ్ల సునామీ నెలకొంది. లాక్డౌన్ 5.0 జూన్ 30 వరకూ పొడిగించినా, చెప్పుకోదగ్గ సడలింపులను కేంద్రం ఇచ్చింది. దాదాపు 2 నెలల లాక్డౌన్ తర్వాత ఆర్థిక వ్యవస్థలో కార్యకలాపాలు పుంజుకోనుండటం.. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది. ► విస్తారంగా వర్షాలు... ఈ ఏడాది భారత్‌లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. కరోనా వైరస్ కల్లోలంతో ఆర్థిక వ్యవస్థ కుదేలైనప్పటికీ, విస్తారమైన వర్షాలతో వ్యవసాయ దిగుబడులు భారీగా రాగలవన్న అంచనాలతో మార్కెట్ కళకళలాడింది. ► చైనాలో పుంజుకున్న రికవరీ.. చైనాలో రికవరీ పుంజుకుందని గణాంకాలు వెల్ల డించడం సానుకూలత చూపించింది. ► చైనాపై కొత్త ఆంక్షలు లేవ్... హాంకాంగ్‌పై మరింత పట్టు బిగించేందుకు జాతీయ భద్రతా చట్టాన్ని చైనా తెచ్చిన నేపథ్యంలో చైనాపై మరిన్ని ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తారనే అంచనాలున్నాయి. ఈ అంచనాలకు భిన్నంగా కొత్త ఆంక్షలను ట్రంప్ విధించలేదు. ► బలపడిన రూపాయి రూపాయి విలువ 8 పైసలు పుంజుకుంది. ► త్వరలోనే వ్యాక్సిన్.. కరోనా వైరస్ కట్టడికి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రాగలదన్న ఆశలు నెలకొన్నాయి. -
సూపర్ ఫీచర్లతో లెనోవో కొత్త స్మార్ట్‌ఫోన్
సాక్షి, న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ తయారీదారు లెనోవో తన నూతన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. జెడ్ సిరీస్‌లో మిడ్‌రేంజ్‌లో 'జెడ్5' పేరుతో మంగళవారం బీజింగ్‌లో విడుదల చేసింది. 64/128 జీబీ స్టోరేజ్ అరోరా బ్లూ, బ్లాక్, ఇండిగో బ్లూ కలర్ ఆప్షన్స్‌లో ఇవి లభ్యంకానుంది. 64జీబీ వెర్షన్ 1399 యువాన్ (రూ .14,670 సుమారు) 128 జీబీ వెర్షన్ 1799 యువాన్ (రూ .18,870)గా నిర్ణయించింది. ఇది ప్రీబుకింగ్ ప్రస్తుతం చైనా మార్కెట్లో అందుబాటులో వుండగా, జూన్ 12 నుండి విక్రయానికి లభ్యం కానుంది. ఆకట్టుకునే రంగులతోపాటు అద్భుత డిజైన్తోప్రీమియం లుక్ వచ్చేలా ఈ డివైస్‌ను డిజూన్ చేసింది. దీనికి ఫేస్ అన్‌లాక్ సదుపాయాన్ని కూడా జోడించింది. లెనోవో జెడ్5 ఫీచర్లు 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2246 x 1080 స్క్రీన్ రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్ 6జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, 16+8 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3300 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ -
ఆధార్ లాక్ ఇక సులభం!
నెహ్రూనగర్ (గుంటూరు): దేశంలో ఇప్పుడు ప్రభుత్వ/ప్రైవేటు రంగాలకు సంబంధించి ఏ సర్వీసు పొందాలన్నా ఆధార్ తప్పనిసరి. మొబైల్ సిమ్ కార్డు నుంచి పాన్‌కార్డు వరకూ ఈ ఆధార్ ఆధారమైంది. ఈ కార్డులో పౌరుని వ్యక్తిగత సమాచారం మొత్తం నిక్షిప్తమై ఉంటుంది. మన వ్యక్తిగత రుజువుకు ఆధార్ మించింది లేదు. దీంతో మనం కూడా ప్రతీదానికి ఆధార్‌నే ఇస్తున్నాం. ఇందులో మన కంటిపాప, వేలిముద్రలు, చిరునామా వంటి వివరాలన్ని నిక్షిప్తమై ఉంటాయి. మీ ఆధార్ దుర్వినియోగం అవుతున్నట్లు అనుమానంగా ఉందా...? అయితే మీ ఆధార్ ఎప్పుడు ఎక్కడ ఎలా వాడారో తెలుసుకునే అవకాశం ఆధార్ కార్డు జారీ చేసే సంస్థ కల్పించింది. ఈ సమాచారం మీ కోసం. ఆధార్ అధికారిక వెబ్సైట్ ద్వారా... మీ ఆధార్ ఎలా ఎక్కడ వినియోగించారో తెలుసుకునేందుకు ఆధార్ అధికారిక వెబ్సైట్ https://resident.uidai.gov.in/ లాగిన్ అవ్వాలి. కనిపించే ముఖచిత్రంలో ఆధార్ సర్వీసెస్ అని కుడివైపు ఓ కాలం కనిపిస్తుంది. ఆ కాలం కింది భాగంలో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అని ఓ ట్యాగ్ కనిపిస్తుంది. అక్కడ క్లిక్ చేస్తే, మరో విండో ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపించే పేజీలో మీ యూఐడీ నంబరు, క్యాప్చ కోడ్ నమోదు చేయాలి. జనరేట్ ఓటీపీ క్లిక్ చేస్తే.. మీ రిజిస్టర్ మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత పేజీలో మీకు ఎటువంటి సమాచారం కావాలో మీకు కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. బయోమెట్రిక్ డెమోగ్రాఫిక్ లాంటివి, ప్రస్తుత తేదీ నుంచి గరిష్టంగా ఆరు నెలల కిందట వరకు మీరు ఆధార్‌ను ఎలా ఎక్కడ వాడారో తెలుసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ ఎంటర్ చేయాలి.. లేకుంటే మీకు ఎర్రర్ చూపించే అవకాశం ఉంది. అక్కడ వివరాలు నమోదు చేశాక చివరి కాలంలో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మొత్తం వివరాలు వస్తాయి. మీరు ఏ రోజు, ఏ సమయానికి, ఎలాంటి పనికోసం మీ ఆధార్‌ను ఇచ్చారనే వివరాలు కనిపిస్తాయి. ఆధార్ వాడిన కంపెనీ లేదా ఏజెన్సీ పేర్లు మాత్రం చూపించదు. దానికి సంబంధించిన వివరాలు మాత్రమే చూపిస్తుంది. అనుమానం వస్తే లాక్ చేసుకోవచ్చు మీ ఆధార్ ఎక్కడో తప్పుగా వాడుతున్నారన్న అనుమానం వస్తే లాక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా అనుమానం వస్తే మీ ఆధార్, వివరాలు మీరు అనుమతిస్తేనే అవతలి వాళ్లు వాడుకునేలా చేయవచ్చు. ఇందుకోసం ఆన్లైన్లో ఆధార్ అధికారిక వైబ్సైట్లో ఆధార్ వివరాలు లాక్ చేయవచ్చు. ఏదైనా ఏజెన్సీ/సంస్థ ఆ వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అన్‌లాక్ చేసుకునే అవకాశం ఉంటుంది. -
ఐదు ప్రయత్నాల్లో అన్ లాక్!
లండన్ : ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వారిలో ఎక్కువ మంది తమ ఫోన్లకు ప్యాటర్న్ లాక్‌లు పెట్టుకుంటూ ఉంటారు. ప్యాటర్న్లాక్ ఉన్న ఫోన్లను ఇతరులెవరైనా కేవలం ఐదంటే ఐదే సార్లు ప్రయత్నించి అన్ లాక్ చేయగలరట. సరళంగా ఉండే ప్యాటర్న్‌ల కంటే క్లిష్టంగా ఉండే ప్యాటర్న్‌లను అన్ లాక్ చేయడం చాలా సులభమట. అయితే ఇది కంప్యూటర్ విజన్ అల్గారిథమ్ సాఫ్ట్వేర్ ఉంటేనే సాధ్యం. అలాగే ఫోన్‌ను యజమాని అన్ లాక్ చేస్తున్నప్పుడు దుండగులు అతని వేళ్ల కదలికలను దూరం నుంచైనా వీడియో తీసి ఉండాలి. ఇక అంతే! తర్వాత ఎప్పుడైనా యజమాని ఫోన్ దుండగుల చేతుల్లోకి వెళ్లినప్పుడు ఈజీగా అన్ లాక్ చేయగలరట. బ్రిటన్ , చైనా శాస్త్రవేత్తల పరిశోధనలో ఇది వెల్లడైంది.