ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది. ముఖ్యంగా పట్టణాల్లో దీని ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. నగర ప్రజలు అన్నింటికీ డిజిటల్ లావాదేవీలనే కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఈ ధోరణికి మరింత ఊతమిస్తోంది. చివరికి టెక్నాలజీ లేకుంటే అడుగు కూడా ముందుకు పడదేమోనని అనిపించే రోజుల్లో మనిషి బతికేస్తున్నాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫొటోలు, వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది.
Hey Bangalore! What's going on in your city? I am traveling to your city and what do I see the unlock, download, and search buttons in garbage bins! Sigh. Explain please. #mysterybuttons pic.twitter.com/K8MitUa11n
— Sapana Singh (@Sapanasinghj) July 11, 2023
ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక పబ్లిక్ ప్లేస్‌లోని చెత్తడబ్బాలలో ఇంటర్నెట్‌కు సంబంధించిన మూడు బటన్లు కనిపిస్తున్నాయి. ‘డౌన్‌లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్‌ల పేర్లతో ఉన్న ఈ బోర్డులు అందరినీ తెగ ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఈ బటన్లను ఇక్కడ ఎందుకు పడవేశారనే ఆలోచన అందరిలో కలుగుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఈ పట్టణంలో డిజిటల్ డిటాక్స్’ విషయమై ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు చెత్తకు, టెక్నాలజీకి సంబంధం ఏమిటంటున్నారు. కాగా ఈ ‘డౌన్‌లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్‌లు దేశంలోని కొన్ని పట్టణాల్లోని చెత్తడబ్బాల్లో కనిపించాయని సమాచారం.
సోషల్ మీడియాలో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ‘డౌన్‌లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్‌లు మొబైల్ వినియోగంలో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. డిజిటలైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఎవరో ఈ చర్యకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు.
Just spotted massive 'Unlock', 'Uninstall', and 'Download' buttons for the first time, lying in the trash bins. Wondering what secrets they hold. @DeccanHerald, any guesses? #ButtonsDiscovered @NewIndianXpress pic.twitter.com/NAA8KtAYob
— Balram Sharma (@Brsharma_In) July 11, 2023
ఇది కూడా చదవండి: విచిత్ర ఫ్యామిలీ: ఆ కుటుంబంలోని తొమ్మదిమందీ ఒకేరోజు పుట్టారు!
Comments
Please login to add a commentAdd a comment