పారిస్: ప్రధాని నరేంద్ర మోదీ ఐదురోజుల విదేశీ పర్యటన సందర్భంగా సోమవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని మోదీని కౌగిలించుకుని స్వాగతించారు. తన ప్రాన్స్ పర్యటనకు సంబంధించి ప్రధాని మోదీ తాజాగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారం ‘ఎక్స్’లో ఒక పోస్టు చేశారు.
Here are highlights from the memorable welcome in Paris yesterday. pic.twitter.com/lgsWBlZqCl
— Narendra Modi (@narendramodi) February 11, 2025
‘తన స్నేహితుడు, అధ్యక్షుడు మాక్రాన్‌ను పారిస్‌లో కలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని మోదీ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. మాక్రాన్ పారిస్‌లో అందించిన విందులో ప్రధాని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను కూడా ప్రధాని మోదీ కలుసుకున్నారు. ప్రధాని మోదీ మంగళవారం ఉదయం ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు. ‘సోమవారం పారిస్‌లో జరిగిన చిరస్మరణీయ స్వాగతానికి సంబంధించిన వీడియో’ అని దానిలో రాశారు.
Un chaleureux accueil à Paris !
Le froid n'a pas découragé la communauté indienne de venir montrer son affection ce soir. Je suis reconnaissant à notre diaspora, et fier de ses accomplissements ! pic.twitter.com/rQSsI5njfN— Narendra Modi (@narendramodi) February 10, 2025
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ పారిస్‌లో అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో చర్చలు జరిపారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక పోస్ట్‌లో తెలిపింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక ట్వీట్‌లో‘పారిస్‌లో అద్భుతమైన స్వాగతం లభించింది. వాతావరణం ఎంతో చల్లగా ఉన్నప్పటికీ, ఇక్కడి భారతీయులు ఆప్యాయతను చూపించారు. అందుకు వారికి కృతజ్ఞతలు చెబుతున్నాను. వారు సాధించిన విజయాలకు గర్విస్తున్నాను. ప్రపంచ నేతలు, ప్రపంచ సాంకేతిక సీఈఓల ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు సహ అధ్యక్షత వహించడానికి ఎదురు చూస్తున్నాను’ అని మోదీ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Mahakumbh: స్టేషన్‌లో రద్దీ.. ఏసీ కోచ్ అద్దాలు బద్దలు కొట్టి..
Comments
Please login to add a commentAdd a comment