search
-
విశాలమైన ఇళ్ల కొనుగోలు.. టైర్–2 జోరు
కరోనా నేపథ్యంలో మొదలైన వర్క్ ఫ్రం హోమ్ (Work form Home) నేటికీ కొనసాగుతుండటంతో ‘టైర్–2’ (tier 2 cities) ద్వితీయ శ్రేణి పట్టణాల్లోని ప్రాపర్టీలకు డిమాండ్ ఏర్పడింది. ప్రధాన నగరంలో ఇరుకు ఇళ్ల మధ్య ఉండటం బదులు శివారు ప్రాంతాలకు, హరిత భవనాలు, విస్తీర్ణం ఎక్కువగా ఉండే గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపు తున్నారు. -సాక్షి, సిటీబ్యూరోకరోనా రెండో దశ ఉధృతి నేపథ్యంలో సూరత్, జైపూర్, పాట్నా, మోహాలీ, లక్నో, కోయంబత్తూరు వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఆన్లైన్లో ప్రాపర్టీల శోధన గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయని హౌసింగ్.కామ్ ఇండియన్ రెసిడెన్షియల్ ఇండెక్స్ ఫర్ ఆన్లైన్ సెర్చ్(ఐఆర్ఐఎస్) తెలిపింది. ఆయా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో గృహ కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారని పేర్కొంది. నోయిడాలోని నోయిడా ఎక్స్టెన్షన్, ముంబై లోని మీరా రోడ్ ఈస్ట్, అంధేరి వెస్ట్, బోరివలీ వెస్ట్, బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతాలు ఈ ఏడాది దేశీయ నివాస సముదాయ మార్కెట్‌ను లీడ్ చేస్తాయని తెలిపింది.మారిన అభిరుచులు.. ఆన్లైన్లో రూ.2 కోట్లకు పైబడిన ప్రాపర్టీల శోధన ఒకటిన్నర శాతం వృద్ధి చెందిందని పేర్కొంది. గతంలో ప్రాపర్టీ కొనుగోలు చేయాలంటే ధర, వసతులు ప్రధాన అంశాలుగా ఉండేవి. కరోనా తర్వాత నుంచి గృహ కొనుగోలుదారుల ఎంపికలో మార్పులొచ్చాయి. వైద్య సదుపాయాలకు ఎంత దూరంలో ఉంది? భద్రత ఎంత? అనే వాటికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపింది.గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వైద్య సదుపాయాలు, భద్రత, ఓపెన్ స్పేస్ ఎక్కువగా ఉన్న ప్రాజెక్ట్‌లకు డిమాండ్ ఉంటుందని హౌసింగ్.కామ్ గ్రూప్ సీఈఓ ధ్రువ్ అగర్వాలా తెలిపారు. 3 బీహెచ్‌కే, ఆపై పడక గదుల గృహాల్లో అంతకు క్రితం ఏడాదితో పోలిస్తే 2021లో 15 శాతం వృద్ధి నమోదయ్యిందని పేర్కొన్నారు. అదే సమయంలో గతేడాది పెద్ద సైజు ప్లాట్లలో 42 శాతం పెరుగుదల కనిపించింది.అద్దెలకు గిరాకీ.. ప్రాజెక్ట్‌ల ఆలస్యం, దివాలా డెవలపర్లు వంటి ప్రతికూల వాతావరణంలోనూ నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లో ప్రాపర్టీ శోధనలు గణనీయమైన స్థాయిలో పెరిగింది. నోయిడా ఎక్స్టెన్షన్ ప్రాంతం ఆన్లైన్ ప్రాపర్టీ సెర్చింగ్‌లో ప్రథమ స్థానంలో నిలిచింది. కేంద్రం, ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వాలు ఈ రీజియన్‌లో పలు మౌలిక సదుపాయ ప్రాజెక్ట్‌లను ప్రకటించడం, ధరలు అందుబాటులో ఉండటం వంటివి ఈ రీజియన్‌లో ప్రాపర్టీల వృద్ధికి కారణమని తెలిపింది.ఐటీ, ఫార్మా కంపెనీలు ఉద్యోగ నియామకాలను పెంచడంతో ముంబై, బెంగళూరు, ఢిల్లీ మార్కెట్లలో అద్దెలకు గిరాకీ పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధికి మరీ ముఖ్యంగా నివాస సముదాయ మార్కెట్లో ముంబై, బెంగళూరు, హైదరాబాద్ అత్యంత కీలకంగా కానున్నాయని అంచనా వేసింది. -
కేరళను ఊపేసిన ఘటన! ఒక్క ఆవు కోసం ముగ్గురు మహిళలు..
మేతకు వెళ్లిన ఆవు తిరిగి రాలేదని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం వెళితే సాయంత్రానికి దారి తప్పారు. సిగ్నల్ లేదు. ఎటు చూసినా ఏనుగులు. రాత్రంతా అడవిలోనే. వారికోసం అగ్నిమాపకదళం, పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, గ్రామస్తులు తెగించి అడవిలోకి వెళ్లారు. ‘ఒక్క ఆవు కోసమా ఇదంతా’ అని దాని ఓనరమ్మను అడిగితే ‘నాకున్న ఏకైక ఆస్తి అదేనయ్యా’ అంది. కేరళను ఊపేసిన ఈ ఘటన వివరాలు.ఆ ఆవు పేరు మాలూ. ఎర్నాకుళం జిల్లాలోని కొత్తమంగళం ప్రాంతంలోని అట్టికాలం అనే అడివంచు పల్లెలో మాయా అనే 46 ఏళ్ల స్త్రీ దాని యజమాని. దాని మీద వచ్చే రాబడే ఆ ఇంటికి ఆధారం. రోజూ అడవిలోకి మేతకు వెళ్లి సాయంత్రానికి ఇల్లు చేరడం మాలూ అలవాటు. మొన్న బుధవారం (నవంబర్ 27) అది అడవిలోకి వెళ్లి తిరిగి రాలేదు. సాయంత్రం వరకూ చూసిన మాయా తన ఆవు అడవిలో తప్పిపోయిందని ఆందోళన చెందింది. గురువారం మధ్యాహ్నం వరకూ అటూ ఇటూ వెతికి అడవిలోకి వెళ్లడానికి ఇరుగూ పొరుగునూ తోడు అడిగింది. పాపం మాయా ఆందోళన చూసిన పారుకుట్టి (64), డార్లీ (56) సరే మేమూ వస్తాం అన్నారు. వారికి అడవి కొట్టిన పిండి. మధ్యాహ్నం వాళ్లు ముగ్గురూ మాలూను వెతుకుతూ కొత్తమంగళం అడవిలోకి వెళ్లారు.అడవి ఒక్కలాగా ఉండదుఅడవిలోపలికి వెళ్లిన ఆ ముగ్గురు స్త్రీలు చాలా దూరం వెళ్లారు. సాయంత్రం నాలుగు వరకూ వాళ్లు సిగ్నల్స్ దొరికేంత దూరం వెళ్లారు. ఆ తర్వాత ఆవు కనిపించక వెనక్కు తిరిగేసరికి ఏనుగుల మంద. కొత్తమంగళం అడవుల్లో ఏనుగులు జాస్తి. వాటి నుంచి తప్పించుకోవడానికి ఆ ముగ్గురూ రెండోదారి పట్టేసరికి అక్కడ కూడా ఏనుగుల మందే. దాంతో భయపడి మూడోదారిలోకి మళ్లారు. కాని ఈసారి ఒంటరి ఏనుగు కనిపించింది. ఏనుగుల మంద కంటే ఒంటరి ఏనుగు చాలా ప్రమాదం. వారు దారి మార్చుకుని నాలుగో దారి పట్టేసరికి దారి తప్పారు. అడవి లోపల తన రంగులు మార్చుకుంటూ ఉంటుందని ఆటవీ శాఖ వారు అంటారు. లోపల అడవంతా ఒక్కలాగే ఉంటూ కనికట్టు చేస్తుంది. అలా తెలిసిన దారే అనుకుని తెలియని దారిలో అడుగుపెట్టి వారు దారి తప్పారు.మొదలైన అన్వేషణఊళ్లోని ముగ్గురు స్త్రీలు అడవిలోకి వెళ్లి తప్పిపోయారనే సరికి అట్టికాలంలో గగ్గోలు రేగింది. వెంటనే కబురు మీడియాకు చేరేసరికి వార్తలు మొదలైపోయాయి. తక్షణం ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసులు రంగంలోకి దిగారు. ఫైర్ అండ సేఫ్టీ వాళ్లు 15 మంది ఒక టీమ్ చొప్పున నాలుగు బృందాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు 50 మంది, వీరితో కలిసి తోడుగా వెళ్లిన గ్రామస్తులు, డ్రోన్లు... ఒక సినిమాకు తక్కువ కాకుండా అన్వేషణ మొదలైంది. ‘అడవిలో ఆ సమయంలో వెళ్లడం ప్రమాదం. ఏనుగులు చూశాయంటే అటాక్ చేసి చంపేస్తాయి. మా టీమ్‌లు రెండు వెనక్కు వచ్చేశాయి. ఒక టీమ్ ఒక షెల్టర్‌లో రాత్రి గడిపి తెల్లవారు జామున వెతకాల్సి వచ్చింది’ అని ఫారెస్ట్ అధికారి తెలిపారు.స్మగ్లర్లు అనుకునిఆ ముగ్గురు స్త్రీలు 15 గంటల అన్వేషణ తర్వాత శుక్రవారం ఉదయం 7.30 గంటలకు రెస్క్యూటీమ్‌కు కనిపించారు. కాని వాస్తవంగా వారు ఆ రాత్రే దొరకాల్సింది. ‘మేము ఆ ముగ్గురు స్త్రీలను వెతుకుతూ మమ్మల్ని గుర్తించడానికి అక్కడక్కడా మంటలు వేశాం. ఏనుగులను చెల్లాచెదురు చేయడానికి టపాకాయలు కాల్చాం. టార్చ్లైట్ల వెలుతురు కూడా దూరం వరకూ వేశాం’ అని అటవీ అధికారి చెప్పారు. ‘అయితే మేము ఆ టార్చ్‌లైట్‌ను దూరం నుంచి చూశాం. అడవిలోకి వచ్చిన వారు పోలీసులో, స్మగ్లర్లో ఎలా తెలుస్తుంది. ఆ సమయంలో స్మగ్లర్లకు దొరికితే అంతే సంగతులు. అందుకే మేం లైట్ వెలుగులు చూసినా చప్పుడు చేయకుండా ఉండిపోయాం’ అని ఆ ముగ్గురు స్త్రీలు చెప్పారు.వారు అడవిని జయించారుగతంలో తెలుగులో రచయిత కేశవరెడ్డి ‘అతడు అడవిని జయించాడు’ అనే నవల రాశారు. ఆ నవలలో తన పంది తప్పిపోతే ఒక వృద్ధుడు అడవిలోకి వెళతాడు రాత్రిపూట. అనేక ప్రమాదాలు జయించి తిరిగి వస్తాడు. ఈ ఘటనలో కూడా ఈ ముగ్గురూ అనేక ప్రమాదాలు దాటి తిరిగి వచ్చారు. వారి కోసం అంబులెన్సులు, వైద్య సహాయం సిద్ధంగా ఉంచినా వాటి అవసరం రాలేదు.మరి ఇంతకీ మాలూ అనే ఆ ఆవు?వీరిని వెతకడానికి పెద్ద హడావిడి నడుస్తున్నప్పుడే అంటే గురువారం సాయంత్రం అది ఇంటి దగ్గరకు వచ్చి అంబా అంది. కొడుకు దానిని కట్టేసి తల్లి కోసం అడవిలోకి పరిగెత్తాడు. అదన్నమాట. (చదవండి: -
డ్రోన్ల సాయంతో నరభక్షక తోడేళ్ల గాలింపు
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌లో నరమాంస భక్షక తోడేళ్ల కోసం గాలింపు కొనసాగుతోంది. వాటిని పట్టుకునేందుకు పోలీసులు, జిల్లా అటవీ శాఖ అధికారులు డ్రోన్లను ఉపయోగించి మరీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా బహ్రైచ్ డివిజన్ సర్కిల్ అధికారి అభిషేక్ సింగ్ మాట్లాడుతూ డ్రోన్ల సాయంతో తోడేళ్ల జాడలు లభించాయన్నారు. జిల్లా అటవీశాఖ అధికారితో పాటు మొత్తం బృందమంతా సెర్చ్ ఆపరేషన్‌లో నిమగ్నమై ఉందన్నారు. ఒకట్రెండు రోజుల్లో తోడేళ్లను పట్టుకుంటామన్నారు. గత కొన్ని నెలలుగా బహ్రైచ్‌లో స్థానికులను తోడేళ్లు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. నరమాంస భక్షక తోడేళ్లు ఈ ప్రాంతంలో ఇప్పటివరకు 8 మందిని చంపాయి. అధికారులు ఇప్పటి వరకు నాలుగు తోడేళ్లను పట్టుకోగా, మరో రెండు తోడేళ్లను పట్టుకునేందుకు అన్వేషణ కొనసాగుతోంది. తోడేళ్లను రక్షించడానికి, పట్టుకోవడానికి పీఎసీకి చెందిన 200 బృందాలు, రెవెన్యూ శాఖకు చెందిన 32 బృందాలు, అటవీ శాఖకు చెందిన 25 బృందాలు రంగంలోకి దిగాయి.మహసీ తహసీల్‌లోని హార్ది, ఖైరీఘాట్ పరిధిలోని దాదాపు 50 గ్రామాల ప్రజలు తోడేళ్ల భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. తోడేళ్లను పట్టుకునేందుకు మూడు థర్మల్ డ్రోన్లు, నాలుగు కేజ్‌లు, నెట్, ఆరు ట్రాపింగ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. తాజాగా హార్ది పోలీస్ స్టేషన్ పరిధిలో తోడేలు మరోసారి దాడి చేసింది. ఇంట్లో తల్లితో కలిసి పడుకున్న ఏడేళ్ల చిన్నారిపై తోడేలు దాడి చేసింది. ఈ ఘటన మజ్రా జంగిల్ పూర్వా గ్రామంలో చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన ఆ తోడేలు చిన్నారి మెడను నోటకరచుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా, ఆ చిన్నారి అరుపు విని కుటుంబ సభ్యులు నిద్ర నుంచి లేచారు. దీంతో ఆ తోడేలు పొలాల్లోకి పరుగెత్తింది. -
పఠాన్‌కోట్‌లో అనుమానితులు.. భద్రతా సంస్థలు అప్రమత్తం
జమ్ముకశ్మీర్‌లో ఇటీవలి కాలంతో తరచూ ఉగ్రవాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. భారత్- పాక్ సరిహద్దుల్లోనూ ఇలాంటి ఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా సరిహద్దు గ్రామాల్లో 48 గంటల్లో తొమ్మిది మంది అనుమానితులు కనిపించడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి.తొలుత బమియల్ నియోజకవర్గంలోని చోడియా గ్రామంలో ఒక మహిళ ముగ్గురు అనుమానితులను చూశారు. అదే గ్రామంలో ఇద్దరు అనుమానితులు కనిపించారు. ఇదేవిధంగా జమ్ము-కథువా సరిహద్దుకు ఆనుకుని ఉన్న చక్రాల్ గ్రామంలో ఇద్దరు యువకులు.. నలుగురు అనుమానితులను గమనించారు. దీంతో వీరు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, బీఎస్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శాటిలైట్తోనూ, డ్రోన్ల ద్వారా కూడా ఆ ప్రాంతంలో అణువణువునా గాలిస్తున్నారు. భద్రతా సంస్థల అధికారులు ఆ ప్రాంతంలో క్యాంప్ నిర్వహిస్తున్నారు.చక్రాల్ గ్రామానికి చెందిన రఘువీర్ సింగ్, రిషు కుమార్ అనే యువకులు తమకు నలుగురు అనుమానితులు కనిపించినట్లు పోలీసులకు తెలిపారు. వారంతా నల్లటి దుస్తులు ధరించి, ముఖాలకు మాస్క్‌లు పెట్టుకుని, చెరుకు తోటల్లో దాక్కున్నారని పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు, ఆపరేషన్ గ్రూప్ కమాండో, బీఎస్ఎఫ్ సిబ్బంది సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇది సాయంత్రం వరకు కొనసాగింది. అయితే నిందితుల జాడ ఇంకా లభించలేదు. మరోవైపు పంజాబ్ పోలీస్ బోర్డర్ రేంజ్ డీఐజీ తాజాగా ఆర్మీ అధికారులతో సమావేశమై పలు భద్రతా అంశాలపై చర్చించారు. -
సునామీలో కొట్టుకుపోయిన భార్య, 13 ఏళ్లుగా వెతుకులాట!
మనకు అత్యంత ప్రియమైన వాళ్లను ఏదైన దుర్ఘటనలో కోల్పోతే ఆ బాధ మాటలకందనిది. ఇది అలాంటి ఇలాంటి ఆవేదన కాదు. అందులోనూ తల్లి బిడ్డలు, భార్యభర్తల్లో ఎవ్వరైన కానరాని లోకలకు వెళ్తే ఆ బాధ అంత తేలిగ్గా మర్చిపోలేంది. బతుకున్నన్ని రోజులు ఆ శోకాన్ని మోస్తుంటాం. అయితే కొన్నేళ్లుకు మాములు మనుషులుగా అవుతాం. రాను రాను వారి జ్ఞాపకాలతో కాలం వెళ్లదీసే ప్రయత్నం చేస్తాం. కానీ జపాన్‌కి చెందిన వ్యక్తిని చూస్తే ఓ దుర్ఘటనలో గల్లంతైన వ్యక్తి కోసం ఇంతలా కళ్లల్లో ఒత్తులు వేసుకుని అన్వేషిస్తారా అని ఆశ్యర్యపోతారా. ప్రేమంటే ఇది కదా అనే ఫీల్ వస్తుంది. ఎవరతను? అతడి గాథ ఏంటంటే..జపనీస్ వ్యక్తి యసువో టకామట్సుకి 2011లో సంభవించిన ప్రకృతి విపత్తు భార్యను దూరం చేసి, తీరని ఎడబాటు మిగిల్చింది. అయితే ఆ భయానక సునామీలో భార్య కోల్పోయినప్పటికీ ఇప్పటి వరకు ఆమె అవశేషాలు కనిపించలేదు. ఆమెకు అంత్యక్రియలు మంచిగా చేయాలనే ఆశతో ఆ నాటి నుంచి నేటి వరకు ఆమె అవశేషాల కోసం తీవ్రంగా గాలిస్తున్నాడు. నిజానికి ఆ సునామీలో సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక యుసువో భార్య యుకో ఓ బ్యాంకులో పనిచేస్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. ఆమె ఎగిసిన రాకాసి అలల తాకిడికి కొట్టుకుపోయింది. దీంతో తకామాట్సు ఆమె అవశేషాల కోసం ఒక వాలంటీర్ సహాయంతో అన్వేషించడం మొదలుపెట్టాడు. అంతేగాదు తన భార్య అవశేషాలు దొరక్కపోతాయా..? అని డైవింగ్ నేర్చుకుని మరీ మురికినీటిలో ముమ్మరంగా గాలిస్తున్నాడు. మంచు జలాలతో అపారమైన సవాళ్లు ఉన్నప్పటికీ తన భార్య అవశేషాల కోసం ఆ ఇరువురు వెతకడం విశేషం. ఇక యుకో చివరిగా తన భర్త కోసం ఫోన్లో రెండు సందేశాలను పంపింది. ఒకటి పంపేలోపు దుర్ఘటన భారిన పడగా ఇంకొకటి ఈ ఘటనకు కొద్ది క్షణాల ముందు పంపించింది. ఆమె చివరి సందేశం మీరు బాగున్నారా..? ఇంటికి వెళ్లాలనుకుంటున్నా అని పంపించింది. పంపాలనుకున్న సందేశం.. సునామీ అత్యంత వినాశకరమైనద అని నాటి దుర్ఘటనను వివరించే యత్నం చేసింది. కాగా, తకామట్సు ఈ అన్వేషణ ఫలించడం కష్టమని తెలుసు కానీ తాను చేయగలిగింది ఏమన్నా ఉందంటే ఆమె అవశేషాల కోసం అన్వేషించడం మాత్రమే అని ఆవేదనగా చెప్పాడు. అంతేగాదు ఈ సముద్రంలో వెతుకుతూ ఉంటే తాను ఆమెకు దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ దంపతులు ప్రేమకు అసలైన అర్థం ఇచ్చారు కదా..!. అంతేగాదు భార్యభర్తలు ఒకరికొకరుగా ఉండటం అనే పదానికి అసలైన భాష్యం ఇచ్చారు ఈ ఇరువురు.(చదవండి: ప్రధాని మోదీకి రాఖీ కట్టేందుకు సరిహద్దులు దాటి వచ్చే పాక్ సోదరి ఎవరో తెలుసా..) -
చచ్చిన ఎలుకల కోసం రైల్వే పైలెట్ ప్రాజెక్ట్
చచ్చిన ఎలుకలను కనుగొనేందుకు భారతీయ రైల్వే వివిధ స్టేషన్లలో బోరెస్కోపిక్ కెమెరాలను వినియోగించనుంది. ఇది వినడానికి కాస్త వింతగా అనిపించినా ప్రయాణికులు, రైల్వే ఉద్యోగుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్ట్‌గా దీనిని ముంబైలో ప్రారంభించినట్లు రైల్వే అధికారి ఒకరు తెలిపారు.రైల్వే స్టేషన్లలోని వెయిటింగ్ హాల్, ఆఫీసు, క్యాంటీన్లోని మూలల్లో ఎలుకలు చనిపోతుంటాయని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ మీడియాకు తెలిపారు. చచ్చిన ఎలుకల నుంచి దుర్వాసన వస్తుండటంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఇబ్బంది పడుతుంటారు. దీనికి సంబంధించిన ఫిర్యాదులు తరచుగా అందుతుండటంతో చచ్చిన ఎలుకలను వెతికేందుకు సెంట్రల్ రైల్వే రెండు అత్యాధునిక బోరోస్కోపిక్ కెమెరాలను కొనుగోలు చేసింది.బోరోస్కోపిక్ కెమెరా అతి చిన్న ప్రదేశంలోకి కూడా వెళుతుంది. సాధారణంగా చూడలేని ప్రాంతాన్ని కూడా స్కాన్ చేసి చూపిస్తుంది. దీని సాయంతో ఆయా ప్రాంతాల్లో స్కాన్ చేసి చచ్చిన ఎలుకలను గుర్తిస్తారు. తరువాత వాటిని అక్కడి నుంచి తొలగిస్తారు. ఈ కెమెరాలను ప్రయోగపూర్వకంగా ఉపయోగించినప్పుడు స్టేషన్ లాబీ, టాయిలెట్, వాష్‌రూమ్ సీలింగ్ వెనుక కొన్ని చచ్చిన ఎలుకలు కనిపించాయి. అనంతరం ఆ ఎలుకలను తొలగించారు. ప్రస్తుతానికి ముంబై స్టేషన్లో రెండు కెమెరాలు అమర్చినట్లు ముఖ్య ప్రజాసంబంధాల అధికారి తెలిపారు. త్వరలో ఇతర స్టేషన్లలోనూ ఇటువంటి కెమెరాలు ఏర్పాటు చేయనున్నామన్నారు. -
కశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నం విఫలం
జమ్ముకశ్మీర్‌లోని బట్టాల్ సెక్టార్‌లోకి చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత ఆర్మీ సిబ్బంది భగ్నం చేసింది. ఈ సందర్భంగా ఓ జవాను తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.ఘటన జరిగిన ప్రాంతంలో దట్టమైన పొగమంచు నెలకొన్న కారణంగా విజిబులిటీ సున్నాగా ఉంది. అటువంటి పరిస్థితిలోనూ ఇండియన్ ఆర్మీ ఎంతో సమర్థవంతంగా సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. జమ్ము ప్రాంతంలో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరుగుతున్నాయి. భారత ఆర్మీ ఎప్పటికప్పుడు ఉగ్రవాదుల చర్యలను తిప్పికొడుతూనే ఉంది. ఈ క్రమంలో ఈరోజు(మంగళవారం) మరోసారి బట్టాల్ ప్రాంతంలో పాక్ ఉగ్రవాదులు చొరబాటుకు యత్నించారు.తెల్లవారుజామున మూడు గంటలకు ఆర్మీ బృందం ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొందరు పాక్ ఉగ్రవాదులు అర్థరాత్రి నుంచి కశ్మీర్లో చొరబడేందుకు ప్రయత్నిస్తున్నారు. అప్రమత్తమైన భారత ఆర్మీ దళాలు ఉగ్రవాదుల చొరబాటుయత్నాలను భగ్నం చేశాయి.ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపధ్యంలో ఒక సైనికుడు గాయపడ్డారు. -
లాటరీ టిక్కెట్ కొన్నాడు.. లక్షల బహుమతి మరిచాడు!
పంజాబ్‌లోని ఫజిల్కాలో ఓ వింత ఉదంతం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి లాటరీని గెలుచుకున్నాడు. అయితే దీనికి సంబంధించిన బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు అతను రాకపోవడం విశేషం. ఈ లాటరీని పంజాబ్ స్టేట్ మంత్లీ లాటరీ డ్రా నిర్వహిస్తుంది. ఈ లాటరీలో బహుమతి మొత్తం రూ.7 లక్షలు. ఈ లాటరీలో ఫాజిల్కాకు చెందిన ఒక వ్యక్తి విజేతగా నిలిచాడు. లాటరీ టిక్కెట్ల విక్రేత బాబీ బవేజా మాట్లాడుతూ తన వద్ద ఫాజిల్కాకు చెందిన వ్యక్తి లాటరీని కొనుగోలు చేశాడని, ఆ టికెట్ నంబర్ 688558 అని, దానికి మొదటి బహుమతిగా రూ.7 లక్షలు వచ్చిందని తెలిపారు. విజేతను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అతని చిరునామా తెలుసుకుని, అందరికీ ఆ విషయాన్ని తెలియజేసి, అతనికి రూ.7 లక్షల రివార్డు ఇస్తామని బాబీ బవేజా తెలిపారు. గతంలో తన దగ్గర లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసి పెద్ద మొత్తంలో సొమ్ము గెలుచుకున్నవారు ఉన్నారని పేర్కొన్నారు. వీరిలో రూ. 5 కోట్లు, రూ. 2.5 కోట్లు, రూ. ఒక కోటి, రూ. 51 లక్షలు, రూ. 25 లక్షలు ఇలా భారీ మొత్తాలను గెలుచుకున్నవారున్నారని వివరించారు. అయితే లాటరీ విజేత బహుమతి మొత్తాన్ని అందుకునేందుకు తమ దగ్గరకు రాకపోవడం విచిత్రంగా ఉందన్నారు. కాగా దేశంలోని 13 రాష్ట్రాల్లో లాటరీకి అధికారిక గుర్తింపు ఉంది. వాటిలో పంజాబ్ కూడా ఒకటి. ఈ రాష్ట్రంలో లాటరీ డ్రాను ప్రభుత్వం నిర్వహిస్తుంది. -
2023లో జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఇటువంటి సందర్భంలో గడచిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకోవడం సహజం. ఈ ఏడాది గూగుల్‌లో కొన్ని వ్యాధులకు సంబంధించిన వివరాల కోసం కొందరు వెదికారు. అలాగే ఈ వ్యాధుల నివారణకు ఇంటి చిట్కాల కోసం కూడా శోధించారు. వీటిలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023లో చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్-5 వ్యాధులు లేమిటో వాటి నివారణకు ఉపయుక్తమయ్యే సులభ ఉపాయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక కొలెస్ట్రాల్ ఈ సంవత్సరం చాలామంది అధిక కొలెస్ట్రాల్ నివారణకు ఇంటి చిట్కాల కోసం చాలా శోధించారు. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని గృహచిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి. 2. మధుమేహం మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. దీనితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చక్కెరను తీసుకోకూడదు. మధుమేహం నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదపడతాయి. ఓట్స్ తీసుకోవడం లాంటివి మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. అలాగే ఉసిరి రసం, మెంతులు తీసుకోవడం కూడా మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది. 3. అధిక యూరిక్ యాసిడ్ అధిక యూరిక్ యాసిడ్ సమస్య నివారణకు ఆనపకాయ రసం లేదా బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నీరు, పీచు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 4. హై బీపీకి హోం రెమెడీ అధిక బీపీ నివారణకు చాలామంది గృహ వైద్యం కోసం గూగుల్‌లో శోధించారు. హైబీపీని అదుపులో ఉంచేందుకు తగినంత నీటిని తాగడం ఉత్తమం. అలాగే నిమ్మరసం, ఫెన్నెల్ టీ కూడా చక్కగా పనిచేస్తుంది. హైబీపీ నివారణకు ఈ ఎఫెక్టివ్ విధానాలను ప్రయత్నించవచ్చు. 5. ఊబకాయం ఊబకాయాన్ని తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా పసుపు కలిపిన నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం అదుపులో ఉంటుంది. ఇది కూడా చదవండి: 2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు? -
జన్మనిచ్చిన తల్లికై తపిస్తున్న ఓ కూతురి గాథ వింటే..కన్నీళ్లు ఆగవు..!
కొన్ని గాథలు ఆశ్చర్యకరంగానూ, భావోద్వేగంగానూ ఉంటాయి. ఆ కథలు సుఖాంత అనుకునేలోపు కొనసాగింపు వెతుక్కుంటూ వస్తుంటే..కొత్త మలుపుతో రసవత్తరంగా ఉంటుది. కానీ సుఖాంతమైతే బావుండనని మాత్రం అనిపిస్తుంది. అలాంటి తపించే కథే స్విస్ మహిళ గాధ. ఆమె పుట్టింది భారత్‌లో, పెరిగింది స్విస్ దంపతులు వద్ద. తన కన్నవాళ్లు వాళ్లు కాదని తెలిసి ఉద్వేగానికి గురైంది. తను జన్మమూలలను వెతుక్కుంటూ భారత్‌కి వచ్చింది. తన తల్లి ఆచూకీ కోసం తపిస్తున్న ఉద్వేగభరితమైన కథ!. విద్యా ఫిలిప్పన్ ఫిబ్రవరి 8, 1996న భారత్‌లో జన్మించింది. ఐతే ఆమె తల్లి పుట్టిన వెంటనే మదర్ థెరిసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీలో వదిలేసింది. అక్కడ నుంచి ఆమెను 1997లో స్విస్ దంపతులు దత్తత తీసుకున్నారు. ఆ తర్వాత విద్యా ఫిలిప్పన్ స్విట్జర్లాండ్‌కు వెళ్లిపోయింది. అయితే తనను పెంచుతున్న తల్లిదండ్రులు తన వాళ్లు కాదని తెలిసి ఒక్కసారిగా ఉద్వేగం చెందింది. తనకు జన్మనిచ్చిన తల్లిది భారత్ అని తెలిసి వెంటనే తనను వదిలేసిన మదర్ థెరిస్సా మిషనరీస్ ఆఫ్ ఛారిటీని సందర్శించింది. అక్కడ ఆమె తల్లిది ముంబైలోని దహిసర్ ప్రాంతామని తెలుసుకుంది. కానీ విద్యా తల్లి అక్కడ ఇచ్చిన చిరునామా ఇప్పుడు ఉనికిలో లేదు. దీంతో ఆమెకు సామాజిక కార్యకర్త అడాప్టీ రైట్స్ కౌన్సిల్ డైరెక్టర్ అడ్వకేట్ అంజలి పవార్ సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ విషయంలో మిషనరీ స్వచ్ఛంద సంస్థ కూడా కొంతసాయం చేసింది. వేగంగా నగరాలుగా మారుతున్న తరుణంలో విద్యా తల్లి ఇచ్చిన చిరునామాని ట్రైస్ చేయడం సాధ్యం కాలేదు విద్యాకు. దీంతో సామాజిక కార్యకర్త విద్యా ఫిలిప్పన్ తల్లిని కనుగొనేలా సాయం చేయాలని దహిసర్ ప్రజలను కోరారు. ఆమె తల్లి ఇంటి పేరు కాంబ్లీ అని ఉంది. కాబట్టి ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్లు గురించి ఏమైన తెలిస్తే తమకు తెలియజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు విద్యా ఫిలిప్పన్ మాట్లాడుతూ..నా తల్లికి 20 సంవత్సరాలు వయసులో తనకు జన్మనిచ్చిందని, ఆమె కోసం తాను పదేళ్లుగా వెతుకుతున్నానని ఆవేదనగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తాను తన తల్లి ఆచూకీ కోసం తన భర్తతో కలిసి భారతదేశానికి వచ్చాను. నా కుటుంబం ఇంటిపేరు కాంబ్లీ అని ముంబైలోని వ్యక్తులు మా అమ్మ ఆచూకీని కనుగొంటే గనుక తనకు సమాచారం అందించాలని వేడుకున్నారు. ఏ కారణాల రీత్యా ఆ తల్లి పేగుబంధాన్ని వదలాల్సిన పరిస్థితి ఏర్పడిందో గానీ కనీసం ఇప్పటికైనా ఆ విధి కరుణించి ఆ తల్లి కూతుళ్లను కలిపితే బావుండను కదూ. ముఖ్యంగా జన్మనిచ్చిన తల్లి కోసం తపనపడుతున్న ఆ విద్యా ఫిలిప్పన్కు నిరాశ ఎదరవ్వకుండా ఆ తల్లి ఆయురారోగ్యాలతో జీవించి ఉంటే బావుండు. (చదవండి: కిడ్నీ దానం చేస్తే ఆ వ్యక్తి ఇదివరకటిలా బతకడం కుదరదా? ప్రమాదమా!) -
‘ఇంకా చనిపోలేదు..’
టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్ అక్టోబరు 2022లో ఎక్స్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి సంస్థ ఆదాయం తగ్గుతోందని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ సోషల్ మీడియా సంస్థకు పోటీగా మెటా ఆధ్వర్యంలో థ్రెడ్స్, ఇన్స్టాగ్రామ్ వచ్చిన తర్వాత క్రమంగా ఎక్స్‌కు వినియోగదారులు తగ్గిపోతున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. దాంతోపాటు ఎలాన్‌మస్క్ తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు కూడా కంపెనీకి వ్యతిరేకంగా మారుతున్నట్లు తెలిసింది. ఎక్స్‌ను చేజిక్కుంచుకున్న తర్వాత మస్క్ సుమారు 80 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగించాడు. అందుకు అనుగునంగా గూగుల్ సెర్చ్‌లో వైరల్‌గా మారిన ‘ట్విటర్ ఈజ్ డైయింగ్’ ట్యాగ్‌లైన్‌పై టెక్‌క్రంచ్, వోక్స్, బ్లూమ్‌బర్గ్ వంటి ప్రముఖ కంపెనీలు ఎన్నో కథనాలు ప్రచురించాయి. అయితే తాజాగా గూగుల్సెర్చ్ల్లో ఎక్స్ ప్రథమస్థానంలో నిలిచింది. టాప్ 100 ఆర్గానిక్ సెర్చ్‌ల ద్వారా ట్రాఫిక్ జనరేట్ చేసిన ప్లాట్‌ఫారమ్‌ల్లో ఎక్స్ మొదటిస్థానంలో ఉందని సంస్థ తెలిపింది. ‘ఎక్స్ ట్రాఫిక్ అప్డేట్! గూగుల్ సెర్చ్‌ల ద్వారా కస్టమర్ ట్రాఫిక్ సంపాదించడంలో ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ను భారీ తేడాతో అధిగమించాం’అని ఎక్స్ ఖాతాలో పేర్కొంది. అందుకు స్పందించిన మస్క్ ‘మేము ఇంకా చనిపోలేదని ఊహించండి’ అంటూ నవ్వతున్న ఎమోజీని షేర్ చేశారు. ఫేస్బుక్ 491.7 మిలియన్ సెర్చ్‌లు, ఇన్స్టాగ్రామ్ 548.3 మిలియన్ సెర్చ్‌లతో పోలిస్తే ఎక్స్ 640.6 మిలియన్ సెర్చ్‌లతో టాప్‌లో నిలిచింది. Guess we’re not dead yet 😂 https://t.co/gokmvwFMiw — Elon Musk (@elonmusk) November 23, 2023 -
బ్యాంకుల్లో మిగిలిపోయిన డిపాజిట్లు.. మీవీ ఉన్నాయా? ఆర్బీఐ పోర్టల్‌లో చెక్ చేయండి..
ముంబై: అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలను అన్వేషించేందుకు, క్లెయిమ్ చేసుకునేందుకు తోడ్పడేలా కేంద్రీకృత వెబ్ పోర్టల్ ఉడ్గమ్ (అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ – గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్)ను గురువారం రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ ప్రారంభించారు. వివిధ బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా ఉండిపోయిన తమ డిపాజిట్లన్నింటి గురించిన వివరాలను కస్టమర్లు ఒకే చోట తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (రెబిట్), ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ (ఐఎఫ్‌టీఏఎస్), భాగస్వామ్య బ్యాంకులు కలిసి దీన్ని రూపొందించాయి. ప్రస్తుతం ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ధన్లక్ష్మి బ్యాంక్, సౌతిండియా బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ ఇండియా, సిటీబ్యాంక్ వంటి ఏడు బ్యాంకుల్లోని అన్క్లెయిమ్డ్ డిపాజిట్ల వివరాలు ఈ పోర్టల్‌లో ఉన్నాయి. ఇతర బ్యాంకుల వివరాలను కూడా అక్టోబర్ 15 నాటికి దశలవారీగా అందుబాటులోకి తేనున్నట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి దాదాపు రూ. 35,000 కోట్ల అన్క్లెయిమ్డ్ డిపాజిట్లను ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్బీఐకి బదలాయించాయి. సిసలైన యజమానులు, లబ్ధిదారులకు ఆయా డిపాజిట్లను అందించాలనే ఉద్దేశంతో ఆర్బీఐ పలు చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్: అత్యధిక వడ్డీ స్కీమ్ గడువు పొడిగింపు -
చెత్త డబ్బాలో ‘సెర్చ్’,‘అన్‌లాక్’,‘డౌన్లోడ్’.. ఎందుకిదంతా జరుగుతోంది?
ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటలైజ్ అయిపోయింది. ముఖ్యంగా పట్టణాల్లో దీని ప్రభావం విపరీతంగా కనిపిస్తోంది. నగర ప్రజలు అన్నింటికీ డిజిటల్ లావాదేవీలనే కొనసాగిస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ ఈ ధోరణికి మరింత ఊతమిస్తోంది. చివరికి టెక్నాలజీ లేకుంటే అడుగు కూడా ముందుకు పడదేమోనని అనిపించే రోజుల్లో మనిషి బతికేస్తున్నాడు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఫొటోలు, వీడియో అందరినీ ఆలోచింపజేస్తోంది. Hey Bangalore! What's going on in your city? I am traveling to your city and what do I see the unlock, download, and search buttons in garbage bins! Sigh. Explain please. #mysterybuttons pic.twitter.com/K8MitUa11n — Sapana Singh (@Sapanasinghj) July 11, 2023 ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఒక పబ్లిక్ ప్లేస్‌లోని చెత్తడబ్బాలలో ఇంటర్నెట్కు సంబంధించిన మూడు బటన్లు కనిపిస్తున్నాయి. ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్ల పేర్లతో ఉన్న ఈ బోర్డులు అందరినీ తెగ ఆలోచింపజేస్తున్నాయి. అయితే ఈ బటన్లను ఇక్కడ ఎందుకు పడవేశారనే ఆలోచన అందరిలో కలుగుతోంది. దీనిని చూసిన నెటిజన్లు ‘ఈ పట్టణంలో డిజిటల్ డిటాక్స్’ విషయమై ఆలోచిస్తున్నారా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు చెత్తకు, టెక్నాలజీకి సంబంధం ఏమిటంటున్నారు. కాగా ఈ ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్లు దేశంలోని కొన్ని పట్టణాల్లోని చెత్తడబ్బాల్లో కనిపించాయని సమాచారం. సోషల్ మీడియాలో ఈ ఉదంతం చర్చనీయాంశంగా మారింది. కాగా ఈ ‘డౌన్లోడ్’, ‘అన్‌లాక్’, ‘సెర్చ్’ బటన్లు మొబైల్ వినియోగంలో ఎంతగానో ఉపయోగపడుతుంటాయి. డిజిటలైజేషన్‌ను వ్యతిరేకిస్తూ ఎవరో ఈ చర్యకు పాల్పడుతున్నారని పలువురు అంటున్నారు. Just spotted massive 'Unlock', 'Uninstall', and 'Download' buttons for the first time, lying in the trash bins. Wondering what secrets they hold. @DeccanHerald, any guesses? #ButtonsDiscovered @NewIndianXpress pic.twitter.com/NAA8KtAYob — Balram Sharma (@Brsharma_In) July 11, 2023 ఇది కూడా చదవండి: విచిత్ర ఫ్యామిలీ: ఆ కుటుంబంలోని తొమ్మదిమందీ ఒకేరోజు పుట్టారు! -
భర్తను చంపి విలాసవంతమైన జైళ్ల కోసం గూగుల్‌లో వెతికిన భార్య
అమెరికా: అమెరికాలో తన భర్త హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మహిళ చేసిన తప్పుని కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో మరిన్ని తప్పిదాలు చేసింది. ఫలితంగా ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెడుతోంది. నేరారోపణ ఎదుర్కొంటున్న సమయంలో ఆమె చేసిన గూగుల్ సెర్చులు చూస్తే ఎంతటి వారైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. తాజాగా ఆమె కేసు విచారణ చేస్తున్న న్యాయస్థానం కూడా ఆమె గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి నివ్వెరపోయింది. సైలెంటుగా చంపి.. 2022, మార్చి నెలలో కౌరీ రిచిన్స్ అనే ఒక మహిళ తన భర్త ఎరిక్ రిచిన్స్ హత్య కేసులో ఆరోపణలను ఎదుర్కుంటోంది. ఎరిక్ చనిపోయిన రోజున తనకు వోడ్కా తాగాలనుందని అడిగితే స్వయంగా తానే ఒక పెగ్ వోడ్కా కలిపి ఇచ్చానని, తర్వాత కొద్దిసేపటికి చూస్తే చలనం లేకుండా పడి ఉన్నాడని, ముట్టుకుంటే అతని శరీరం చాలా చల్లగా కూడా ఉందని పోలీసులకి ఫిర్యాదు చేసింది కౌరీ. తీగ లాగితే.. అయితే పోలీసులు మృతదేహాన్ని పరీక్షల నిమిత్తం పంపించగా అతని శరీరంలోకి ప్రమాదకరమైన ఫెంటానైల్ అధిక డోసేజులు ఇంజెక్ట్ చేయడం కారణంగానే ఎరిక్ చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. తర్వాత పోలీసుల సహజశైలిలో విచారణ చేస్తే అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. దీనితో కౌరీపైన కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు పోలీసులు. కేసు ఇంకా విచారణ దశలోనే ఉండగా ఆమె గూగుల్‌లో తనకున్న అనేక సందేహాలను వెతకడం ప్రారంభించింది. సెర్చ్ హిస్టరీ.. కౌరీ రిచిన్స్ గూగుల్‌లో ఏమేమి వెతికిందంటే.. ఉటా శిక్షా స్మృతులు ఎలా ఉంటాయి? జీవిత బీమా కంపెనీలు డబ్బులివ్వడానికి ఎంత సమయం పడుతుంది? అమెరికాలో ధనిక మహిళలను ఉంచడానికి విలాసవంతమైన జైళ్లున్నాయా? చనిపోయిన వ్యక్తి మరణానికి కారణాలు ఆలస్యమైతే పరిస్థితి ఏంటి? చనిపోయిన వ్యక్తి మరణానికి కారణం మార్చితే పరిస్థితి ఏమిటి? విచారణ ఎదుర్కునే సమయంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి? పోలీసులు లై డిటెక్టర్ పరీక్షలు నిర్వహించే తీరు ఎలా ఉంటుంది? అని ఇలా ఆమెకున్న కొన్ని అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి గూగుల్ ని ఆశ్రయించింది. బయట ఉంటే ప్రమాదం.. ఇప్పుడిదే సెర్చ్ హిస్టరీ ఆమెను కటకటాల వెనక్కు నెట్టింది. సోమవారం జరిగిన నేర విచారణలో న్యాయస్థానం ఆమె సెర్చ్ హిస్టరీ చూసిన తర్వాత ఆమె సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నంలో ఉందని ఆమె వలన సమాజానికి కూడా ప్రమాదం పొంచి ఉందని చెప్పి వెంటనే ఆమెను కస్టడీలోకి తీసుకోవాలని ఆదేశించారు. ఇది కూడా చదవండి: శిక్ష పడినా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తా.. -
గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారా?.. డేంజర్లో పడ్డట్టే.. డాక్టర్ల వార్నింగ్ ఇదే..
లబ్బీపేట (విజయవాడ తూర్పు): సాధారణంగా ఒంట్లో నలతగా ఉంటే ఏం చేస్తాం.. డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్యను చెప్పుకుంటాం. బాధితుడు చెప్పిన లక్షణాల ఆధారంగా ఆయన అందుకు అవసరమైన మందులు రాసి వాడమంటారు. ఆ తర్వాత ఫార్మసీకి వెళ్లి వాటిని కొనుక్కుని వాడుతుంటాం. ఇది రివాజు. కానీ, ఇప్పుడు నయా ట్రెండ్ మొదలైంది. డాక్టర్ స్థానంలో గూగుల్ వచ్చి చేరింది. జనాలకు ఏ ఇబ్బంది వచ్చినా ముందుగా గూగుల్‌లో ఆ లక్షణాలను సెర్చ్ చేసేసి అది ఏ రోగమో తెలుసుకుని ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్లి తమకు ఫలానా రోగం ఉంది.. వైద్యం చేయమంటున్నారు. కరోనా తదనంతర కాలంలో యువత, విద్యావంతుల్లో ఈ తరహా సంస్కృతి పెరిగిపోతోందని వైద్యులంటున్నారు. ఈ సిండ్రోమ్‌ను ‘ఇంటర్నెట్ డిరైవ్డ్ ఇన్ఫర్మేషన్ అబ్స్ట్రక్షన్ ట్రీట్మెంట్’ అని సంబోధిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. ఆరోగ్యంపట్ల అతిగా ఆదుర్దా పడడం.. అనవసరంగా దీని గురించి నెట్లో సెర్చ్ చేయడం ఈ సిండ్రోమ్ ప్రధాన లక్షణం. ఈ సమస్యతో బాధపడుతున్న వారు ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నారు. అంతేకాదు.. వైద్యుడు మందులు రాసిన తర్వాత కూడా వాటి గురించి గూగుల్‌లో వెతుకుతున్నారు. అక్కడ చూపించే దుష్ఫలితాలను చూసి మందులు వాడకుండా మానేస్తున్నారని.. ఇలాంటివి కోవిడ్ సమయంలో ఎక్కువగా జరిగినట్లు వైద్యులంటున్నారు. ఇంటర్నెట్ బాగా విస్తృతమవడంతో ప్రజల్లో కూడా ఈ తరహా వెతుకులాట ఎక్కువైందని వారు అభిప్రాయపడుతున్నారు. కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు ఇక ఇలా ప్రతి విషయాన్ని గూగుల్‌లో సెర్చ్ చేయడం ద్వారా ప్రజలు కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. మందులు, జబ్బు విషయంలో ఏదైనా సందేహం ఉంటే వైద్యుడిని అడిగి నివృత్తి చేసుకోవాలే కానీ, గూగుల్‌లో వెతకడం సరైన విధానం కాదని వారంటున్నారు. ఒక రకం మందు లక్ష మంది వాడితే వారిలో ఒకరికో ఇద్దరికో దుష్ఫలితాలు కనపడినా గూగుల్‌లో పెడుతుంటారని, దానిని చూసి మందు వాడకుంటే, జబ్బు ముదిరి ప్రాణాల మీదకు వస్తుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చివరికి జ్వరానికి వాడే క్రోసిన్‌కు కూడా దుష్ఫలితాలు ఉన్నట్లు గూగుల్‌లో చూస్తారని, వైద్యులు అంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదని మానసిక వైద్యులు సూచిస్తున్నారు. అవసరం మేరకు టెక్నాలజీని వాడుకోవాలి ఇంటర్నెట్ టెక్నాలజీని అవసరం మేరకు మాత్రమే వాడుకోవాలి. అంతేకానీ, జబ్బు చేసినప్పుడు వైద్యుడిని సంప్రదించకుండా గూగుల్‌లో చూసి మందులు వాడటం, గూగుల్‌లో చూసి జబ్బును నిర్ధారించడం సరైన పద్ధతి కాదు. అలాగే, వైద్యుడు రాసిన మందులను సైతం గూగుల్‌లో సెర్చ్‌చేసి, అక్కడున్న దుష్ఫలితాలను చూసి మందులు వాడటం మానేస్తున్నారు. దీంతో జబ్బు ముదిరి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కోవిడ్ సమయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువుగా చూశాం. ఏదైనా సమస్య ఉంటే వైద్యుడిని సంప్రదించి పరిష్కరించుకోవాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్ట్, విజయవాడ జబ్బును నిర్ధారించేది వైద్యుడే ఏదైనా సమస్యతో వైద్యుని వద్దకు వచ్చే రోగి, తనకున్న రోగం ఏమిటో చెప్పేస్తున్నారు. గూగుల్‌లో చూశామండి.. దానికి చికిత్స అందించమని అడుగుతున్నారు. అసలు లక్షణాలు చెప్పమంటే ఏదేదో చెబుతున్నారు. ఇది సరైన విధానం కాదు. గూగుల్‌లో అంతా ఖచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పలేం. ఎవరి అనుభవాలనైనా దానిలో షేర్ చేసుకోవచ్చు. వాటిని చూసి తమకూ అలా జరుగుతుందని భావించడం సరైన విధానం కాదు. పారాసిటమాల్ మందుకు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నట్లు గూగుల్‌లో చూపుతుంది. కానీ, వైద్యులు దానిని కామన్ మందుగా సిఫార్సు చేస్తారు. గూగుల్‌తో కొత్త సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. – డాక్టర్ విశాల్‌రెడ్డి ఇండ్ల, మానసిక వైద్య నిపుణులు -
గూగుల్ బార్డ్ అంటే సెర్చ్ మాత్రమే కాదు.. అంతకు మించి..
గూగుల్ బార్డ్ ఏఐ అంటే కేవలం సెర్చ్ మాత్రమే కాదని, అంతకు మించి అని గూగుల్ స్పష్టం చేసింది. చాట్ జీపీటీకి పోటీగా బార్డ్‌ను గత నెలలో గూగుల్ ఆవిష్కరించింది. బార్డ్ ప్రకటన తర్వాత గూగుల్‌లోని ఉద్యోగులు కంపెనీతో పాటు సీఈవో సుందర్ పిచాయ్‌ను ఎగతాళి చేశారు. సీఎన్‌బీసీ నుంచి వెలువడిన ఆడియో ప్రకారం.. ఇటీవల కంపెనీలో ఆల్ హాండ్స్ మీటింగ్ జరగింది. ఈ సందర్భంగా బార్డ్‌కు సంబంధించిన సమస్యలపై కంపెనీ అంతర్గత ఫోరమ్ డోరీ నుంచి వచ్చిన ప్రశ్నలకు కంపెనీ ఎగ్జిక్యూటివ్‌లు సమాధానాలు ఇచ్చారు. చదవండి: ఈ-మెయిల్ యాప్‌ను బ్లాక్ చేసిన యాపిల్.. కారణం ఇదే.. బార్డ్ ప్రోడక్ట్ లీడ్ జాక్ క్రావ్జిక్ మాట్లాడుతూ ఈ బార్డ్ ఏఐ కేవలం సెర్చ్ కోసం మాత్రమే కాదని స్పష్టం చేశారు. ఇది సెర్చ్‌కు ఏఐని జోడించిన ఒక ప్రయోగం అన్నారు. దీన్ని ఉపయోగిస్తున్నప్పుడు ఇది మనకు ఓ సహచరుడిగా ఉంటూ మన సృజనాత్మకతను, ఉత్సాహాన్ని పెంపొందిస్తుందని వివరించారు. అయితే దీన్ని కేవలం సెర్చ్ లాగా ఉపయోగించకుండా యూజర్లను ఆపలేమని కూడా ఆయన స్పష్టం చేశారు. చదవండి: మైక్రోసాఫ్ట్ కిచిడీ రెడీ! బిల్ గేట్స్‌కు స్మృతి ఇరానీ వంట పాఠాలు కేవలం సెర్చ్ కోసమే దీన్ని ఉపయోగించాలనుకునే వారికి గూగుల్ ఇప్పటికీ సేవలందిస్తోందన్నారు. ఇలా బార్డ్‌ను సెర్చ్ కోసం వినియోగించేవారి కోసం ‘సెర్చ్ ఇట్’ అనే కొత్త ఫంక్షన్‌ని కూడా ఇందులో అంతర్గతంగా రూపొందించినట్లు చెప్పారు. బార్డ్ అనేది సాధారణ సెర్చ్ కంటే చాలా విభిన్నమైనదని సెర్చ్ ఇంజినీరింగ్ విభాగం వైస్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ రీడ్ పేర్కొన్నారు. చదవండి: బంగారు నగలపై కేంద్రం కొత్త రూల్.. ఇకపై ఇది తప్పనిసరి! -
మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజు విస్తృత సోదాలు..
సాక్షి, హైదరాబాద్: స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు హైదరాబాద్‌లోని మార్గదర్శి ప్రధాన కార్యాలయంలో మూడో రోజూ విస్తృత సోదాలు నిర్వహించారు. పంచనామా రిపోర్ట్ తీసుకునేందుకు మార్గదర్శి సిబ్బంది నిరాకరించారు. దీంతో రిపోర్టును గోడకు అధికారులు అతికించారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు సేకరించారు. మార్గదర్శి నిబంధనలకు విరుద్దంగా ఫిక్స్డ్ డిపాజిట్లు సేకరించినట్లు అధికారులు గుర్తించారు. ఇతర గ్రూప్ ఆఫ్ కంపెనీలకు నిధుల మళ్లింపుపై దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇతర కంపెనీల్లో పెట్టుబడులు, నిధుల మళ్లింపుపై ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే మార్గదర్శి కార్యాలయాల్లో మూడు విడతలు సోదాలు నిర్వహించిన స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు తనిఖీల్లో లభ్యమైన సమాచారం ఆధారంగా హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఎంత మంది డిపాజిట్ చేశారన్న వివరాలను వెల్లడించకుండా మార్గదర్శి గుట్టుగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ప్రజల సొమ్మును ఇతర సంస్థలకు మళ్లించినట్లు పక్కా ఆధారాలు లభ్యమైన తరువాతే హైదరాబాద్‌లోని కార్యాలయంలో సోదాలు చేపట్టినట్లు అధికార వర్గాల పేర్కొన్నాయి. చదవండి: గడప గడపకు మన ప్రభుత్వంపై సీఎం జగన్ సమీక్ష -
వివాహిత మిస్సింగ్.. కారణం ఆ ఇద్దరేనా?..
తాళ్లరేవు(కాకినాడ జిల్లా): వారం రోజుల క్రితం నుంచి కనిపించకుండా పోయిన వివాహిత మంథా సాయి శ్రీజ ఆచూకీ కోసం కోరంగి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. కోరంగి ఎస్సై టి.శివకుమార్ కథనం ప్రకారం.. నీలపల్లికి చెందిన శ్రీజ రెండేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. భార్యాభర్తల మధ్య స్పర్థలు రావడంతో కాకినాడ దిశ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా శ్రీజకు వెంకీ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. తదనంతరం సాయి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారితో కూడా శ్రీజకు కొంత కాలంగా మనస్పర్థలు వచ్చాయి. చదవండి: వివాహేతర సంబంధం.. రోజూ కలవడం కుదరదని.. ప్రియురాలి భర్తకు.. ఈ నేపథ్యంలో వారి వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఆమె అదృశ్యమైంది. తనకు వైజాగ్‌లోని ఒక కళాపరిషత్‌లో ఉద్యోగం వచ్చిందని, కొంత కాలం తరువాత తిరిగి వస్తానని చెప్పిన తమ కుమార్తె.. బ్యాగ్, కొంత నగదు తీసుకుని వెళ్లిందని ఆమె తల్లిదండ్రులు చెప్పారు. అయితే సూసైడ్ నోట్ ఆధారంగా యానాం, కోరంగి వద్ద గోదావరిలో పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆమె ఆచూకీ లభ్యం కాలేదు. ఇద్దరి యువకుల కారణంగా తమ కుమార్తె జీవితం నాశనమైందని శ్రీజ తల్లిదండ్రులు బోరున విలపించారు. వారి వేధింపుల వల్లే సూసైడ్ నోట్ రాసి, కనిపించకుండా పోయిందని ఆరోపించారు. వారిని తక్షణమే అరెస్టు చేసి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
గాలింపు చర్యలు ముమ్మరం
శ్రీనగర్: అమర్నాథ్ ఆలయం సమీపంలో అకస్మాత్తుగా సంభవించిన వరదల్లో ఆచూకీ తెలియకుండా పోయిన వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. అన్వేషణ, సహాయక చర్యల కోసం ఆర్మీకి చెందిన పర్వత గస్తీ బృందాలను, డ్రోన్లు, జాగిలాలు, అత్యాధునిక పరికరాలను వినియోగిస్తున్నారు. శనివారం ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 16 మృతదేహాలను బాల్టాల్ బేస్ క్యాంప్‌నకు తరలించినట్లు బీఎస్ఎఫ్ తెలిపింది. టెంట్లు, సామూహిక వంటశాలల మీదుగా పోటెత్తిన వరద, బురదమట్టి కారణంగా గాయపడిన 25 మంది ఆస్పత్రులకు తరలించారు. మరోవైపు, గుహాలయం సమీపంలో చిక్కుకుపోయిన మొత్తం 15వేల మందినీ దిగువనున్న పంజ్తరణి బేస్ క్యాంపునకు సురక్షితంగా తరలించారు. 11వ బ్యాచ్‌లోని 6వేల మంది యాత్రికులు శనివారం జమ్మూ నుంచి అమర్నాథ్ దిశగా బయలుదేరారని అధికారులు తెలిపారు. అమర్నాథ్లో శుక్రవారం సాయంత్రం 4.30–6.30 గంటల ప్రాంతంలో నమోదైంది 31 మి.మీ. వర్షపాతమేనని వాతావరణ విభాగం తెలిపింది. గంట వ్యవధిలో 100 మి.మీ. వాన నమోదైన సందర్భాల్లోనే కుండపోత వర్షంగా పరిగణిస్తామంది. అకస్మాత్తు వరదలకు ఎగువనున్న పర్వత భాగాల్లో కురిసిన వానలే కారణం కావచ్చని పేర్కొంది. -
కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా..? తస్మాత్ జాగ్రత్త..!
మీ బ్యాంక్ అకౌంట్ గురించి తెలుసుకోవాలని కస్టమర్ కేర్‌కు కాల్ చేస్తున్నారా? అందుకోసం గూగుల్‌లో దొరికిన బ్యాంక్ కస్టమర్ కేర్ నెంబర్‌కు కాల్ చేస్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త అమెరికాలో అకౌంటెంట్‌గా పనిచేసి నావీ ముంబైలో స్ధిరపడ్డ 73ఏళ్ల వృద్దుడు ఎస్బీఐ కస్టమర్ కేర్‌కు కాల్ చేసి రూ.4.02లక్షల్ని పోగొట్టుకున్నాడు.నావీ ముంబై ఖర్ఖర్ పోలీసుల కథనం ప్రకారం..నావీ ముంబైలో ఉండే వృద్దుడు తన డెబిట్ కార్డును యాక్టీవేట్ చేయాలని అనుకున్నాడు. వెంటనే గత నెల డిసెంబర్ 25న గూగుల్‌లో సెర్చ్‌చేసి 'ఎస్బీఐ డెబిట్ కార్డ్ హెల్ప్' అని ట్యాగ్ చేసిన నెంబర్‌కు కాల్ చేశాడు. అవతలి నుంచి 'మై నేమే ఈజ్ మనీష్ గుప్తా..హౌ కెన్ ఐ హెల్ప్ యూ' అంటూ మాట కలిపాడు. దీంతో వృద్దుడు తన బ్యాంక్ డెబిట్‌కార్డ్‌ను యాక్టీవేట్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు, అందుకు సాయం చేయాలని కోరాడు. మనీష్ గుప్తా..అతని ఫోన్‌కు రిమోట్యాక్సెస్ ఇవ్వాలని, ఎనీ డెస్క్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేయాలని సూచించాడు. మనీష్ చెప్పినట్లే ఎనీడెస్క్ ఓపెన్ చేశాడు. వెంటనే నిందితుడు బాధితుడి అకౌంట్ డీటెయిల్స్ ను సేకరించాడు. అనంతరం బ్యాంక్ డెబిట్ కార్డ్ యాక్టీవేషన్ చేసే సమయంలో సర్వర్ చాలా స్లోగా ఉందని, డిసెంబర్ 27న ప్రాసెస్ చేస్తానని నమ్మించాడు. నిందితుడు చెప్పిన మాటలు నిజమేనని బాధితుడు నమ్మాడు. సీన్ కట్ చేస్తే సదరు సైబర్ నేరస్తుడు బాధితుడి అకౌంట్ నుంచి పలు మార్లు ట్రాన్సాక్షన్లు నిర్వహించి మొత్తం రూ.4.02 లక్షల్ని కాజేశాడు. అదే సమయంలో తన బ్యాంక్ అకౌంట్లో డబ్బులు మాయమైనట్లు గుర్తించిన బాధితుడు షాక్ తిన్నాడు. పోలీసుల్ని ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని కోరాడు. చదవండి: ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్రం తీపికబురు..! -
గూగుల్ మ్యాప్స్‌లోనే కాదు..వాట్సాప్‌లో కూడా వెతికేయచ్చు..! ఎలాగంటే..?
WhatsApp To Let You Search Hotels, Grocery, Clothing Stores In The App: స్మార్ట్‌ఫోన్ రాకతో పలు విషయాలు మరింత సులువుగా మారాయి. వివిధ యాప్స్ మనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. మనకు తెలియని అడ్రస్‌ను, దగ్గరలోని షాపు వివరాలను తెలుసుకోవడానికి గూగుల్ తీసుకొచ్చిన యాప్ గూగుల్ మ్యాప్స్ ఎంతగానో ఉపయోగపడింది. యూజర్లకే కాకుండా ఆయా వాణిజ్య , వర్తక వ్యాపారులకు కూడా గూగుల్ మ్యాప్స్ సహాయపడింది. కాగా గూగుల్ మ్యాప్స్ తరహా ఫీచర్‌ను వాట్సాప్ కూడా త్వరలోనే తెచ్చేందుకు ప్రయత్నాలను చేస్తోంది. గూగుల్ మ్యాప్స్ తరహాలో వెతికేయెచ్చు..! మెటా యాజమాన్యంలోని ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్, వ్యాపారుల కోసం వాట్సాప్ బిజినెస్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. వాట్సాప్ బిజినెస్ యాప్‌లో ఇప్పటికే ఎంతో మంది వ్యాపారులు రిజిస్టర్ అయ్యారు. దీంతో రాబోయే రోజుల్లో సమీపంలో ఆయా వ్యాపారుల గురించి తెలియజేసే సెర్చ్ ఆప్షన్‌ను వాట్సాప్‌లో రానుంది. బిజినెస్ నియర్ బై..! బ్రెజిల్‌లోని సావో పాలో నగరంలో ఇప్పటికే కొంతమంది వ్యక్తుల కోసం ‘బిజినెస్ నియర్‌బై’ ఫీచర్‌ను వాట్సాప్ విడుదల చేసింది. ఈ ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇది భవిష్యత్తులో యూజర్ల అందరికీ వచ్చే అవకాశం ఉందని వాట్సాప్ ట్రాకర్, డబ్ల్యూబెటాఇన్ఫో పేర్కొంది. ఈ కొత్త కూల్ ఫీచర్ ఐవోస్, ఆండ్రాయిడ్ వినియోగదారులకు అందుబాటులో ఉండనుంది. ఈ ఫీచర్ సహయంతో యూజర్లు దగ్గరలోని హోటళ్లు,కిరాణా, బట్టల దుకాణాలు మొదలైన వాటిని వెతకవచ్చును. చదవండి: ఇన్‌స్టాగ్రామ్‌లో మరో సరికొత్త ఫీచర్.. హైలెట్స్ ఆఫ్ ది ఇయర్..! -
ఒమిక్రాన్ వేరియంట్ టెన్షన్.. ఆ 121 మంది ఎక్కడ?
సాక్షి,మహారాణిపేట(విశాఖ దక్షిణ): కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పుతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. విదేశాల నుంచి వచ్చిన 121 మంది విమాన ప్రయాణికుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన 34 ఏళ్ల వయస్సు గల యువకుడికి ఒమిక్రాన్ నిర్ధారణ కావడంతో విమానాశ్రయంలో పరీక్షలు ముమ్మరం చేసింది. ఈ యువకుడు విజయనగరం జిల్లాకు చెందిన వాడైనా మధురవాడలో ఉండడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని జిల్లా యంత్రాంగం స్పెషల్ బ్రాంచి పోలీసులను కోరింది. కేంద్ర విమానయాన శాఖ పంపిన జాబితా ప్రకారం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు బయటపడుతుండడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా వైద్యారోగ్యశాఖ, రెవెన్యూ, పోలీసు, జీవీఎంసీ, పర్యాటక శాఖ అధికారులు చర్యలకు దిగారు. విమానాశ్రయంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నెల ఒకటి నుంచి 13వ తేదీ వరకు వివిధ దేశాల నుంచి 2825 మంది విశాఖ చేరుకున్నారు. వీరిలో 2704మంది ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయగా.. నెగిటివ్ వచ్చింది. ఇంకా 121 మంది ఎక్కడ ఉన్నారో తెలియక వైద్య ఆరోగ్య శాఖ అయోమయంలో పడింది. విమాన యాన శాఖ ఇచ్చిన జాబితాల ప్రకారం గాలిస్తున్నారు. ఆరోగ్య శాఖ, పోలీసు శాఖ రంగంలో దిగి తనిఖీలు ముమ్మరం చేశారు. చిరునామా వివరాలు పూర్తిగా లేకపోవడం, ఫోన్లు స్విచ్చాఫ్ చేయడం వల్ల వారి ఆచూకీ కనిపెట్టలేకపోతున్నారు. గత రెండు రోజుల కిందట 296 మంది ఆచూకీ లభించలేదు. వీరిలో ఆది, సోమవారాల్లో 175 మంది ఆచూకీ తెలియడంతో వారికి పరీక్షలు నిర్వహించారు. మిగతా వారి కోసం వెతుకుతున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుపతిరావు తెలిపారు. ఈ విషయాన్ని ఆయన కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున దృష్టికి కూడా తీసుకెళ్లారు. విమానాశ్రయంలో పరీక్షలు విదేశాల నుంచి వచ్చిన వారికి పరీక్షలు నిర్వహించడం కోసం విమానాశ్రయంలో మూడు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక వైద్యుడు, నర్సు, ఏఎన్ఎం, ఇతర సిబ్బంది ఈ బృందంలో ఉంటున్నారు. ప్రయాణికులకు తొలుత కరోనా పరీక్షలు చేస్తున్నారు. తర్వాత ఒమిక్రాన్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ప్రయాణికుల పూర్తి వివరాలు సేకరించి, బయటకు పంపుతున్నారు. మాస్క్ పెట్టుకోకపోతే రూ.100 జరిమానా మధురవాడ ఏరియాలో హోమ్ ఐసోలేషన్‌లో 34 ఏళ్ల వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇప్పుడు ఈ వ్యక్తికి నెగిటివ్ వచ్చింది. అయినా రెండు వారాల పాటు ఐసోలేషన్‌లో ఉండమన్నాం. ఆ ఇంటి చుట్టూ ఎవరిని లోపలికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశాం. బయట తిరిగే వ్యక్తులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. లేనిపక్షంలో రూ.100 జరిమానా విధిస్తాం. భౌతిక దూరం పాటించాలి. ఇందులో ఎవరిని ఉపేక్షించే ప్రసక్తి లేదు. – డాక్టర్ ఎ.మల్లికార్జున, కలెక్టర్, విశాఖపట్నం చదవండి: రైతు బిడ్డగా కొత్త జీవితం.. తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలని.. -
నెటిజెన్స్ గూగుల్ లో ఎక్కువ సెర్చ్ చేసిన కేటగిరీలు ఇవే!
నియర్ మి ఫుడ్ షెల్టర్ నియర్ మి, కోవిడ్ టెస్ట్ నియర్ మి, లిక్కర్ షాప్స్ నియర్ మి, నైట్ షెల్టర్ నియర్ మి, గ్రాసరీ స్టోర్స్ నియర్ మి, జిమ్ ఎక్విప్మెంట్ నియర్ మి, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్ నియర్ మి, లాప్టాప్ షాప్ నియర్ మి, ఫర్నీచర్ స్టోర్ నియర్ మి.. మొదలైన అవసరాల గురించి ఆరా తీసారు. హౌ టు హౌ టు మేక్ పనీర్, హౌటు ఇంక్రీజ్ ఇమ్యూనిటీ, హౌ టు మేక్ డల్గోనా కాఫీ, హౌ టు లింక్ పాన్ విత్ ఆధార్, హౌ టు మేక్ శానిటైజర్ ఎట్ హోం, హౌ టు రీచార్జ్ ఫాస్టాగ్, హౌ టు ప్రివెంట్ కరోనా వైరస్, హౌ టు అప్లై ఈ–పాస్, హౌ టు మేక్ జిలేబీ, హౌ టు మేక్ కేక్ ఎట్ హోం వంటివాటితోపాటు..హౌ టు బీ యాంటీ రేసిస్ట్? కూడా ఉంది. పోయిన ఏడాది జూన్ వరకు ‘మిలియనీర్ కావడం ఎలా? అనే ప్రశ్నను సంధించిన నెటిజన్లు.. అమెరికాలో నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపడంతో ‘హౌ టు బీ యాంటీ రేసిస్ట్’ సెర్చ్ దాన్ని ఆక్రమించేసింది. ఆ సంఘటన చాలా దేశాల్లో ప్రభావం చూపింది. దీంతో రేసిస్ట్ అంటే ఏంటీ? యాంటీ రేసిస్ట్ ఎలా ఉండాలి అనే అన్వేషణ గూగుల్ సెర్చ్‌లో టాప్‌కి చేరింది. ఇదేగాక సిస్టమిక్ రేసిజం గురించి కూడా జల్లెడ పట్టారు జనులు. హౌ టు ఎస్టాబ్లిష్ బిజినెస్ కరోనా ఎన్నో రకాల కొలువులను ఫైర్ చేసింది. దాంతో ఆ నిరుద్యోగులంతా బిజినెస్ వైపు దృష్టి మళ్లించారు. ఈ క్రమంలో తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు ఏంటీ? ఏ బిజినెస్ అయితే బావుంటుంది? వంటి ఐడియాల కోసం ఆత్రపడ్డారు. వాట్ ఈజ్ దిస్.. వాట్ ఈజ్ కరోనా వైరస్, వాట్ ఈజ్ బినోద్లను అధికంగా సెర్చ్ చేశారు. గత ఏడాది ఆగస్టు నుంచి చాలామంది హాష్ ట్యాగ్ బినోద్‌తో మీమ్స్‌ను షేర్ చేసారు. వీటి తరువాత వాట్ ఈజ్ ప్లాస్మా థెరపీ, వాట్ ఈజ్ సీఏఏలు ఉన్నాయి. గతేడాది ప్రారంభంలో సిటిజన్ షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ) గురించీ పెద్దసంఖ్యలో వెదికారు. సూర్యగ్రహణం నేపథ్యంలో ‘రింగ్ ఆఫ్ ఫైర్’కు సంబంధించి మరింత తెలుసుకునే ఆరాటం చూపారు. అసోంలో ఎన్ఆర్సీ (ది నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్) అమలు చేస్తున్నట్లు ప్రకటించేటప్పటికి ఉత్తర భారత దేశంలోని రాష్ట్రాలు ఎన్ఆర్సీ గురించి తెలుసుకునే ప్రయత్నమూ చేశాయి. వాట్ ఈజ్ హంటా వైరస్ కరోనా వల్ల చైనా అంటేనే హడలిపోతున్న ప్రపంచాన్ని అక్కడి ‘హంటా వైరస్’ ఉనికి భయంతో చంపేసేలా చేస్తోంది. హంటా గురించి విన్న ప్రజలు అమ్మో ఇది కూడా కరోనాలా వ్యాపిస్తుందేమోనని ముందు జాగ్రత్తగా దాని మీద శోధన స్టార్ట్ చేశారు.. హంటా వైరస్ అంటే ఏంటీ? అది ఎలా వ్యాపిస్తుంది? అంటూ. మొబైల్ గేమింగ్.. లాక్డౌన్ ప్రారంభమయ్యాక 45 శాతం మంది భారతీయులు మొబైల్ గేమ్స్‌లో మునిగిపోయారు. వాళ్లంతా గేమ్స్‌తోనే కాలక్షేపం చేసినట్లు ఇన్‌మొబి యాడ్టెక్ సంస్థ సర్వేలో వెల్లడైంది. ఏకధాటిగా కనీసం గంట పాటు ఒక దగ్గరే కూర్చుని గేమ్‌లు ఆడినట్లు సర్వే తెలిపింది. ఇదీ కరోనా కాలంలో చిగురించిన ఆసక్తులు,ఆన్లైన్లో పెరిగిన అన్వేషణలు, జరిగిన కాలక్షేపాలు, తెలుసుకున్న విషయాలు, వివరాల చిట్టా! వీళ్లే టాప్ అమెరికా ఎన్నికల నేపథ్యంలో జో బైడెన్, 2018లో ఓ ఆత్మహత్య కేసులో అర్ణబ్ గోస్వామి అరెస్టు అవ్వడంతో అతని గురించి తెలుసుకునేందుకు ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఆ తరువాత స్థానంలో కనికా కపూర్, కిమ్ జాంగ్– ఉన్, అమితాబ్ బచ్చన్, రషీద్ ఖాన్, రియా చక్రవర్తి, కమలా హ్యారిస్, అంకితా లోఖాండే, కంగనా రనౌత్‌ల అప్డేట్స్ వివరాల అన్వేషణా ఉంది. వాట్ ఈజ్ ఫార్మర్ బిల్ 2020 భారత ప్రభుత్వం రైతుల అభ్యున్నతికోసం కొత్త వ్యవసాయ చట్టాలను ప్రవేశ పెట్టడం.. వాటిని హర్యాణా, పంజాబ్ రైతులు తీవ్రంగా వ్యతిరేకించడం, అంతేగాక దేశవ్యాప్తంగా ఉన్న రైతులు, అనేక రాజకీయ పార్టీలు ఈ చట్టాలను వ్యతిరేకించడంతో కొత్త వ్యవసాయ చట్టాల్లో ఏముందో తెలుసుకునేందుకు సెర్చ్ చేశారు. సెప్టెంబర్ నెల మధ్యకాలంలో అరవై వేలకుపైగా నెటిజన్లు ‘వాట్ ఈజ్ ఫార్మర్ బిల్ 2020’ ఇన్ ఇండియా పేరుతో వెతికారు. చదవండి: అమేజింగ్ బేబీ మల్టీ ఫంక్షన్ కుకర్ -
తవ్వేకొద్దీ అక్రమాస్తులు
విశాఖ క్రైం: ఏసీబీ అధికారులు తవ్వేకొద్దీ అవినీతి జలగల అక్రమాస్తులు వెలుగుచూస్తున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీఆర్వోలు కాండ్రేగుల సంజీవ్‌కుమార్, పోలిశెట్టి వెంకటేశ్వరరావు, జీవీఎంసీ అధికారి మునికోటి నాగేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు దాడులు చేసి అక్రమాస్తులు గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వీరి అక్రమార్జనపై అధికారులు మరింత లోతుగా దృష్టి సారిస్తున్నారు. అందులో భాగంగా సంజీవ్‌కుమార్ బినామీలు బగ్గు సుబ్రహ్మణ్య మల్లిఖార్జునరావు, సామ ఉదయనాగరాజును ఏసీబీ డీఎస్పీ రామకృష్ణప్రసాద్ నేతృత్వంలో సీఐలు గణేష్, అప్పారావు ఆదివారం ఉదయం నుంచి విచారించారు. విచారణలో కీలకమైన ఒక ల్యాప్‌టాప్ స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటికే వీరి అక్రమార్జన రూ.వంద కోట్లకు పైగా ఉంటుందని అధికారులు గుర్తించారు. తాజాగా గుర్తించిన అక్రమాస్తులివీ - సంజీవ్‌కుమార్ బినామీగా వ్యవహరించిన బగ్గు సుబ్రహ్మణ్య మల్లిఖర్జురావు(ఒకప్పుడు బిల్డర్) పేరు మీద ఆదిత్యవర్థన్ డెవలప్మెంట్ అనే సంస్థ పేరిట కొత్తవలస సమీప గంగువాడ గ్రామంలో 200 ఎకరాలు వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు గుర్తించారు. - సుమారు రూ.ఆరు కోట్లకు పైగా వ్యాపార లావాదేవీలు జరిగినట్లు లాప్‌ట్యాప్‌లో గుర్తించారు. దీంతో లాప్‌ట్యాప్‌ను సీజ్ చేశారు. - చెతన్యనగర్లో ఉన్న శ్రీసాయి ఆదిత్య నిలయం –1లోని 303 ప్లాట్ పి.విజయ పేరు మీద ఉంది. అయితే ఈ ప్లాట్‌లో సోమవారం సోదాలు చేయనున్నారు. సంజీవ్‌కుమార్ అక్రమార్జనకు తతంగం అంతా ఇక్కడి నుంచే జరిగిందని అధికారులు భావిస్తున్నారు. - రెల్వే న్యూ కాలనీలో సుజన కనస్ట్రక్షన్ పేరు మీద బినామీలతో సంజీవ్‌కుమార్ అక్రమ వ్యాపారం నడిపిస్తున్నాడు. - అదేవిధంగా సంజీవ్‌కుమార్ వినియోగిస్తున్న కారులో నుంచి పలు విలువైన డాక్యుమెంట్లతోపాటు పాస్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నారు. - ఎన్టీపీసీ వద్ద సంజీవ్‌కుమార్ పేరు మీద ఒక ఎకరం భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. - సంజీవ్‌కుమార్ వద్ద ఉన్న ఫిస్టల్ బటన్ నొక్కితే రెగ్యులర్‌గా మంటలు వస్తున్నాయి. ఈ ఫిస్టల్తోపాటు బటన్ చాకు స్వాధీనం చేసుకున్నారు. - మునికోటి నాగేశ్వరరావు భార్య పేరుమీద ఆమె తల్లిదండ్రులు కానుకగా 339 గజాల స్థలం ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. దీని విలువ మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.10 కోట్లు ఉంటుందని నిర్థారించారు. - అదేవిధంగా అతని బావమరిది యాసిడ్ శ్రీను వద్ద సుమారు రూ.85 లక్షలు విలువచేసే ఆస్తులు గుర్తించారు. లాకర్లలో భారీగా అక్రమాస్తులు! సంజీవ్‌కుమార్‌కు సంబంధించిన బ్యాంక్ లాకర్లు ఎస్బీహెచ్, ఐఓబీ, ఆంధ్రాబ్యాంక్, కో ఆపరేటివ్ బ్యాంక్, ధనలక్ష్మి బ్యాంక్‌లలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటిని సోమవారం తెరవనున్నారు. ఇవి తెరిస్తే మరిన్ని అక్రమాస్తులకు సంబంధించిన వివరాలు, బంగారు ఆభరణాలు వెలుగుచూసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. వీఆర్వో పోలిశెట్టి వెంకటేశ్వరావుకు సంబంధించి ఎన్ఏడీలోని యాక్సెస్ బ్యాంక్‌లో ఉన్న లాకర్లు తెరిచారు. అందులో 790 గ్రాముల బంగారం, కిలో వెండి ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మార్చి 16 వరకు రిమాండ్ ఆదాయానికి మించిన ఆస్తులు కలిగిన కేసులో అరెస్ట్ అయిన వీఆర్వోలు సంజీవ్‌కుమార్, వెంకటేశ్వరావు, జీవీఎంసీ విద్యుత్ విభాగం మజ్దూర్ ఉద్యోగి నాగేశ్వరరావులను శనివారం శనివారం మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఉంచి ఆదివారం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16వరకు వీరికి న్యాయమూర్తి రిమాండ్ విధించారు. అయితే సంజీవ్‌కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నప్పుడు ఆయనకు బీపీ పెరగడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంకోజీపాలెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రిమాండ్‌కు తరలిస్తారు. సంజీవ్‌కుమార్ బినామీ సుబ్రహ్మణ్య మల్లికార్జునరావును విచారిస్తున్న సీఐ అప్పారావు -
పీఎన్బీ స్కాం..17 చోట్ల సోదాలు
ముంబై : పంజాబ్ నేషనల్ బ్యాంకు స్కాంకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం ముంబైలోని 17 చోట్ల సోదాలు నిర్వహించారు. షెల్ కంపెనీలతో సంబంధం ఉన్న నాలుగు బడా సంస్థల కార్యాలయాల్లో కూడా సోదాలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, గీతాంజలి గ్రూప్ అధినేత మెహుల్ చోక్సీలకు 120 షెల్ కంపెనీలతో సంబంధం ఉన్నట్లు సెర్చ్ ఆపరేషన్‌లో బయటపడింది. వీటిలో79 కంపెనీలకు మెహుల్ చోక్సీ, 41 షెల్ కంపెనీలకు నీరవ్ మోదీ యజమానులుగా ఉన్నట్లు తేలింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి డబ్బులు తీసుకుని ఈ షెల్ కంపెనీలకు తరలించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన నీరమ్ మోదీ, మెహుల్ చోక్సీ, వారి కుటుంబసభ్యులు ఈ సంవత్సరం జనవరి నెలలో దేశం విడిచి పారిపోయిన సంగతి తెల్సిందే. ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఇద్దరు మాజీ బ్యాంకు ఉద్యోగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారిస్తున్నసంగతి తెల్సిందే. ప్రభుత్వ రంగ బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకునకు రూ.11,300 కోట్ల రుణాలు ఎగవేసి వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ కుంభకోణానికి తెరలేపాడు.