గూగుల్‌ను ఇలా వాడుతున్నారా! | Google is using this | Sakshi
Sakshi News home page

గూగుల్‌ను ఇలా వాడుతున్నారా!

Published Wed, Oct 29 2014 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 3:30 PM

గూగుల్‌ను  ఇలా వాడుతున్నారా!

గూగుల్‌ను ఇలా వాడుతున్నారా!

‘గూగుల్’ సెర్చింజన్ అనేదానికి ఒక పర్యాయపదం. కేవలం సెర్చింజన్‌గా మాత్రమే గాకుండా ఎన్నో రకాల సేవలను అందిస్తున్నప్పటికీ గూగుల్‌కు సెర్చింజన్‌గానే ఎక్కువ గుర్తింపు ఉంది. అలాగే ఎన్నో సెర్చింజన్‌లు అందుబాటులో ఉన్నప్పటికీ గూగుల్‌కు మాత్రమే విశ్వసనీయత ఉంది. ఇంటర్నెట్ అందుబాటులో ఉండాలి కానీ ప్రతి చిన్న విషయానికీ గూగుల్ మీద ఆధారపడి సమాచారాన్ని విపులంగాతెలుసుకోవడం మనకు అలవాటే. ఇటువంటి నేపథ్యంలో గూగుల్ సెర్చ్‌లో కూడా కొన్ని  ట్రిక్స్ ఉన్నాయి. ఇవి ఎవరికీ తెలియనవి  ఏమీ కాదు. అయితే చాలా మందికి తెలియనివి. వీటిని ఉపయోగించుకొంటే మరింత సులభతరంగా,
సౌకర్యవంతంగా గూగుల్‌లో  సెర్చ్ చేయవచ్చు. మరి అవేమిటంటే...
 
సోర్స్ కోడ్


ఇంటర్నెట్ గురించి మనకు బ్రహ్మాండమైన అవగాహన ఉంది. దేని గురించి ఎక్కడ సమాచారం దొరుకుతుందో బాగా తెలుసు. అంటే సోర్స్ అడ్రస్ తెలుసు. ఇటువంటి సమయంలో టాపిక్  పేరుకు ముందు సోర్స్ కోడ్‌ను ఎంటర్ చేస్తే సెర్చ్ సులభతరం అవుతుంది. ఉదాహరణకు మనకు ఐన్‌స్టీన్ గురించి సమాచారం కావాలి, ఆయన గురించి డెయిలీ మెయిల్ వెబ్‌సైట్‌లో ఎక్కువ సమాచారం లభ్యమవుతుందని అనుకొందాం. అప్పుడు ఐన్‌స్టీన్‌ః డెయిలీమెయిల్‌డాట్‌కామ్ అంటూ ఇంగ్లిష్‌లో సెర్చ్‌చేస్తే ఆ సైట్‌లోని ఐన్‌స్టీన్ సంబంధిత సమాచారాన్ని సులభంగా పట్టేయవచ్చు.
 
మరచిపోతే స్టార్ వాడండి!

ఇంగ్లిష్‌లో ఏదైనా ఫ్రేజ్‌లేదా పదం పూర్తిగా గుర్తుకు రాని సమయంలో... ఆ పదం స్పెల్లింగ్ తప్పు అనిపిస్తుంటే అప్పుడు ‘స్టార్ సింబల్’ వాడటం మేలు. ఉదాహరణకు ఎంటర్‌చేస్తే రిజల్ట్స్‌ వంటి సజెస్టివ్స్ వస్తాయి. ప్రాక్టికల్‌గా వాడుతున్నప్పుడు ఈ స్టార్ సింబల్ ఉపయోగం అర్థమవుతుంది.
 
ఒకే తరహా వెబ్‌సైట్లను వెదకడం ఇలా...

 ఒక్కోసారి ఒక వెబ్‌సైట్ ఇచ్చే సమాచారం సరిపోదు. మరిన్ని వెబ్‌సైట్‌లలో గాలించి ఇన్ఫర్మేషన్‌ను సంపాదించాల్సి వస్తుంది. అందుకు కూడా గూగుల్ ఒక రకంగా సహాయపడుతుంది. ఉదాహరణకు తెలుగులో వార్తలను అందించే ట్చజుటజిజీ.ఛిౌఝ తరహా సైట్‌లు కావాలంటే   సెర్చ్ చేయవచ్చు.
 
ఆన్‌లైన్ డిక్షనరీల అవసరం తీరింది!


 కొన్ని రోజుల కిందటి వరకూ కూడా ఏదైనా అర్థం కాని ఇంగ్లిష్ పదానికి సంబంధించిన నిర్వచనం తెలుసుకోవాలంటే ఆక్స్‌ఫర్డ్ వాళ్ల వెబ్‌సైట్ వరకూ వెళ్లాల్సి ఉండేది. అయితే ఇప్పుడు అర్థం కాని పదం ఏదైనా గూగుల్‌సెర్చ్‌బాక్స్ లో ఎంటర్‌చేస్తే చాలు.. దాని నిర్వచనం, అర్థం మొదటిలైన్‌లోనే డిస్‌ప్లే అవుతుంది.
 
కొలమానం నుంచి ద్రవ్యమానం వరకూ!

 సెంటీమీటర్లను ఇంచెస్‌లోకి మార్చడం, పౌండ్లను రూపాయల్లో మార్చి చెప్పడం గూగుల్‌కు చాలా సులువైన విద్య. కొలమానం, ద్రవ్యమానాల్లో లెక్కలను చాలా సులువుగా చేసిపెడుతుంది. ద్రవ్యమానంలో అయితే రూపాయి మారకం విలువ విషయంలో అప్ టూ డేట్‌గా ఉంటూ గూగుల్ విలువలను చెబుతుంది.
 
ఫిజిక్స్, మ్యాథ్స్  లెక్కలు చేసిపెడుతుంది..
.
 
గూగుల్ ఒక సైంటిఫిక్ క్యాలిక్యులేటర్‌లా పనిచేస్తుంది. అత్యంత కష్టమనిపించే భౌతిక శాస్త్ర, గణిత శాస్త్ర లెక్కల విషయంలో సహాయకారిగా ఉంటుంది.
 
విమాన సమయాలు, సినిమాల షోల వివరాలు..

సినిమా షోల వివరాలను తెలుసుకోవడానికి ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లను వెదుక్కోనక్కర్లేదు. ఉదాహరణకు ‘టజిౌఠ్టీజీఝ్ఛట:  కీవర్డ్‌ను ఎంటర్ చేసి సినిమా పేరు టైప్ చేస్తే చాలు ‘పూజ’సినిమా ఏయే థియేటర్లలో ఆడుతోందో రిజల్ట్స్‌లో డిస్‌ప్లే అవుతాయి. ఇదే విధంగా విమానాల వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

 ఇలా గూగుల్ కేవలం సెర్చ్ ఇంజిన్‌గా మాత్రమే కాకుండా... ఇతర వెబ్‌సైట్‌లను వెతకాల్సిన అవసరాన్ని నిరోధిస్తూ, కొత్త వెబ్‌సైట్‌ల వివరాలను అందిస్తూ ఒక సమాచార అక్షయపాత్రలా పరిణామక్రమం చెందుతోంది.

 - జీవన్‌రెడ్డి .బి
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement