టెక్ దిగ్గజం గూగుల్ రకరకాల కొత్త ఫీచర్‌ల గురించి ప్రకటించింది. అందులో ‘ఆస్క్ ఫొటోస్’ ఒకటి. అడ్వాన్స్‌డ్ జెమిని ఏఐ మోడల్‌తో వస్తున్న ఈ ఫీచర్‌ను యూజర్‌లు తమ ఫొటో కలెక్షన్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. యూజర్‌లు తమ గ్యాలరీని విస్తరించినప్పుడు వారికి అవసరమైన ఫొటోను కనుక్కోవడం కష్టంగా ఉండవచ్చు.
దీన్ని దృష్టిలో పెట్టుకొని స్పెసిఫిక్ ఫొటోను త్వరగా కనిపెట్టడానికి ‘ఆస్క్ ఫొటోస్’ ఫీచర్ ఉపయోగపడుతుంది. కీవర్డ్ కాంబినేషన్స్‌తో పనిలేదు. ప్రాంప్ట్ చాలు. ఉదాహరణకు... ‘షో మీ ది బెస్ట్ ఫొటో ఫ్రమ్ ఈచ్ నేషనల్ పార్క్ ఐ హ్యావ్ విజిటెడ్’ అని ప్రాంప్ట్ ఇస్తే సంబంధిత ఇమేజ్‌లను చూపిస్తుంది. ఈ ఏఐ ఫీచర్ ప్రత్యేకత ఏమిటంటే.... యూజర్‌లు తమ ఫొటోల గురించి వివరంగా అడగవచ్చు.
హువావే వాచ్ ఫిట్ 3
డిస్‌ప్లే: 1.82 అంగుళాలు
రిజల్యూషన్: 480“408 పిక్సెల్స్
బరువు: 26 గ్రా
బ్యాటరీ: 400 ఎంఏహెచ్
- ఆటోమెటిక్‌ప్రాంప్ట్స్ – ట్రాక్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్, వెదర్ వార్నింగ్స్ డిస్‌ప్లే
ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు సంగీతం..
ఇన్‌స్టాగ్రామ్‌ప్రొఫైల్‌కు పర్సనలైజ్‌డ్ టచ్ ఇవ్వడానికి, మ్యూజిక్ ద్వారా మన మూడ్‌ను రెఫ్లెక్ట్ చేయడానికి ఉపకరించే లేటెస్ట్ ఫీచర్ ఇది. దీని కోసం...
– ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను అప్‌డేట్ చేయాలి
– ప్రొఫైల్ స్క్రీన్‌తో యాక్సెస్ కావడానికి బాటమ్ రైట్ కార్నర్‌లోనిప్రొఫైల్ పిక్చర్ ట్యాప్ చేయాలి
– ఎడిట్‌ప్రొఫైల్–ట్యాప్
– మ్యూజిక్–ట్యాప్
– పాటను ఎంపిక చేసుకోవడానికి ప్రొఫైల్ సాంగ్ సెక్షన్‌లో ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేయాలి.
షావోమీ ప్యాడ్ 6ఎస్ ప్రో 12.4..
డిస్‌ప్లే: 12.40 అంగుళాలు
ఫ్రంట్ కెమెరా: 32 ఎంపీ
బ్యాటరీ: 10000 ఎంఏహెచ్ రిఫ్రెష్ రేట్: 144 హెచ్‌జడ్
మెమోరీ: 256జీబి 8జీబి ర్యామ్/ 256జీబి 12జీబి ర్యామ్/ 512జీబి 12జీబి ర్యామ్
డ్రీమ్ స్క్రీన్..
‘డ్రీమ్ స్క్రీన్’ అనే కొత్తఫీచర్‌ని పరీక్షిస్తోంది యూట్యూబ్. ఏఐ ద్వారా ‘షార్ట్స్’కు బ్యాక్‌డ్రాప్‌ను జెనరేట్ చేసే ఫీచర్ ఇది. యూజర్‌లు డ్రీమ్ స్క్రీన్‌కు యాక్సెస్ ΄÷ందిన తరువాత బ్యాక్‌గ్రౌండ్‌లో తమకు ఏమి కావాలో వివరిస్తూప్రాంప్ట్ ఇవ్వవచ్చు.
ఉదా: ఒక ద్వీపంలో ఫ్యాన్సీ హోటల్. ఇమేజ్ జనరేట్ అయిన తరువాత వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌కు జత చేయవచ్చు. ఈ ప్రయోగాత్మక ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన ‘షార్ట్స్’ క్రియేటర్స్ మాత్రమే అందుబాటులో ఉంది.
ఇవి చదవండి: Aria: ‘మా కలలు, కన్నీళ్లు, కష్టాలు.. ఈ ఆల్బమ్‌లో ఉంటాయి’
Comments
Please login to add a commentAdd a comment