
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఇటువంటి సందర్భంలో గడచిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకోవడం సహజం. ఈ ఏడాది గూగుల్‌లో కొన్ని వ్యాధులకు సంబంధించిన వివరాల కోసం కొందరు వెదికారు. అలాగే ఈ వ్యాధుల నివారణకు ఇంటి చిట్కాల కోసం కూడా శోధించారు. వీటిలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023లో చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్-5 వ్యాధులు లేమిటో వాటి నివారణకు ఉపయుక్తమయ్యే సులభ ఉపాయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. అధిక కొలెస్ట్రాల్
ఈ సంవత్సరం చాలామంది అధిక కొలెస్ట్రాల్ నివారణకు ఇంటి చిట్కాల కోసం చాలా శోధించారు. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని గృహచిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి.
2. మధుమేహం
మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. దీనితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చక్కెరను తీసుకోకూడదు. మధుమేహం నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదపడతాయి. ఓట్స్ తీసుకోవడం లాంటివి మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. అలాగే ఉసిరి రసం, మెంతులు తీసుకోవడం కూడా మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది.
3. అధిక యూరిక్ యాసిడ్
అధిక యూరిక్ యాసిడ్ సమస్య నివారణకు ఆనపకాయ రసం లేదా బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నీరు, పీచు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.
4. హై బీపీకి హోం రెమెడీ
అధిక బీపీ నివారణకు చాలామంది గృహ వైద్యం కోసం గూగుల్‌లో శోధించారు. హైబీపీని అదుపులో ఉంచేందుకు తగినంత నీటిని తాగడం ఉత్తమం. అలాగే నిమ్మరసం, ఫెన్నెల్ టీ కూడా చక్కగా పనిచేస్తుంది. హైబీపీ నివారణకు ఈ ఎఫెక్టివ్ విధానాలను ప్రయత్నించవచ్చు.
5. ఊబకాయం
ఊబకాయాన్ని తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా పసుపు కలిపిన నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం అదుపులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: 2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు?