remedies
-
మలబద్ధకంతో మహాబాధ... నివారణకు ఇలా చేయండి!
మలబద్ధకం ఉన్నవారికి అది చాలా బాధాకరమైన సమస్యే అయినప్పటికీ... నిజానికి వారికి అదొక్కటే కాకుండా, దాని నుంచి వచ్చే ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఎన్నెన్నో. అందుకే ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే చాలా రకాల ఆరోగ్య అనర్థాల నుంచి కాపాడుకోవచ్చు. అందుకే దీని నివారణ అంటే చాలా రకాల జబ్బుల నివారణ అని అర్థం చేసుకోవాలి. మలబద్ధకం నివారణకు పాటించాల్సిన కొన్ని జాగ్రత్తలివి... పీచుపదార్థాలు (ఫైబర్) మలబద్ధకాన్ని సమర్థంగా నివారిస్తుంది. అన్ని రకాల ధాన్యాల్లోనూ పొట్టులో పీచు పదార్థాలు ఎక్కువ. అందుకే పొట్టు తీయని ధాన్యాలు... మరీ ముఖ్యంగా వరి విషయానికి వస్తే దంపుడు బియ్యం వంటివి మేలు చేస్తాయి. ఇక మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితో పాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచు పాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతో పాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది. చిక్కుళ్లలో ప్రొటీన్‌తోపాటు ఫైబర్ కూడా ఎక్కువే. ఇవి కండరాలకు బలాన్నివ్వడంతో పాటు మలబద్దకం నివారణకూ తోడ్పడుతుంది. ఇక పండ్ల విషయానికి వస్తే... పీచు ఎక్కువగా ఉండే బొ΄్పాయి, పుచ్చ, నారింజ వంటి పండ్లు మలబద్ధకాన్ని తేలిగ్గా నివారిస్తాయి. చక్కెర మోతాదులు తక్కువగానూ, పీచు ఎక్కువగానూ ఉండే పండ్లను డాక్టర్లు డయాబెటిస్ బాధితులకు తినమంటూ సూచిస్తారు. ఇవి మలబద్ధకంతో పాటు చాలా రకాల క్యాన్సర్లనూ నివారిస్తాయి. అయితే పళ్లరసాల రూపంలో తీసుకుంటే అందులో పీచుపదార్థాలు దాదాపుగా ఉండవు. అందుకే పండ్లను కొరికి తినడమే మంచిది. పీచుపదార్థాలతోపాటు తగినన్ని నీళ్లు తాగడం వల్ల కూడా విరేచనం సాఫీగా అవుతుంది. అందుకే రోజుకు కనీసం రెండు లీటర్ల (కనీసం పది గ్లాసుల)కు తగ్గకుండా నీళ్లు తాగడం మంచిది. మామూలు ధాన్యాల్లో కంటే తృణధాన్యాల్లో పీచు ఎక్కువ. వాటితోపాటు కాయగూరలు, ఆకుకూరలు, మొలకెత్తిన ధాన్యాల్లోనూ పీచుపాళ్లు ఎక్కువ. పీచు (ఫైబర్) సమృద్ధిగా ఉండే ఆహారాలతోపాటు తాజా పండ్లతో దీన్ని నివారించుకోవడం తేలికే. మొత్తం జీర్ణవ్యవస్థను ఆరోగ్యకరంగా ఉంచడంతోపాటు తేలిగ్గా విరేచనమయ్యేందుకు ఫైబర్ సహాయపడతుంది. అంతేకాకుండా... ఒంట్లోని చక్కెరను రక్తంలో నెమ్మదిగా కలిసేలా చేయడంతోపాటు కొలెస్ట్రాల్ వంటి కొవ్వులను అదుపులో ఉంచడానికీ ఫైబర్ సహాయం చేస్తుంది. -
జ్ఞాపకశక్తి తగ్గుతుందా?! ఈ చిట్కాలు పాటించండి!
శరీరానికి వ్యాయామం గురించి ఆలోచిస్తాం. అలాగే, జ్ఞాపకశక్తి బాగుండాలంటే మెదడుకూ వ్యాయామం అవసరం అని గ్రహించాలి. కండరాల కణాలు చురుగ్గా ఉండాలంటే మైండ్కూ వ్యాయామం త్పనిసరి. మైండ్‌కు బూస్ట్‌లా పనిచేసే సులువైన, సమర్ధవంతమైన వ్యాయామాలు ఇవి...ధ్యానంతో స్పష్టత: రోజూ ప్రశాంత వాతావరణంలో కూర్చొని పది నిమిషాలసేపు శ్వాస మీద ధ్యాస ఉంచుతూ ధ్యానం చేయాలి. దీని వల్ల మన ఆలోచనల్లో స్పష్టత లభిస్తుంది. ఫలితంగా మైండ్ చురుగ్గా పనిచేస్తుంది. పజిల్స్ నింపడం: క్రాస్‌వర్డ్స్, సుడోకో వంటి బ్రెయిన్ టీజర్స్ జ్ఞాపకశక్తికి పదునుపెడతాయి. ఎక్కడైనా జ్ఞాపకశక్తిలో సమస్యలు ఏర్పడినా త్వరగా పరిష్కారం లభిస్తుంది. పుస్తకపఠనం: ఆసక్తిని పెంచే రచనలు, వ్యాసాలు, మైండ్‌కి ఛాలెంజింగ్‌గా అనిపించే పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానానికి సంబంధించిన సామర్థ్యం పెరుగుతుంది. సాధన: ప్రస్తుత మీ మానసిక స్థితి ఎలా ఉందో గ్రహించడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. భావోద్వేగాలు, చుట్టూ ఉండే వాతావరణం మన మైండ్‌కు మరింత పదును పెట్టేలా ఉండాలి. శారీరక వ్యాయామం మైండ్‌కు బూస్ట్: రోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ పెరిగి మెదడు పనితీరు బాగుంటుంది. జ్ఞానసంబంధమైన సామర్థ్యం పెరుగుతుంది. యోగా వంటి సాధనలు కూడా మనోవికాసాన్ని పెంచుతాయి. నలుగురిలో కలవడం: సామాజిక కార్యకలాపాల్లో పాల్గొంటూ ఉండాలి. దీని వల్ల ఎదుటివారితో సంభాషణ, చర్చలు, ఆలోచనల విస్తృతి పెరుగుతుంది. భావోద్వేగాల పరంగా, మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. మెదడును ఎప్పుడూ చురుకుగా ఉండటానికి ప్రయత్నించాలి. బ్రెయిన్ ఎక్సర్‌సైజులతో, అవగాహనతో జ్ఞాపకశక్తికి ఎప్పుడూ పదునుపెడుతూ ఉండాలి. అది ఈ సమయం నుంచే మొదలుపెట్టండి. -
కీళ్ల నొప్పులకు కారణాలనేకం, కానీ అశ్రద్ధ పనికి రాదు!
40-50 ఏళ్ల వయసు దాటిన తరువాత స్త్రీ పురుషుల్లో కనిపించే ప్రధాన సమస్య కీళ్ల నొప్పులు. వయసుతోపాటు వచ్చేదేలే అని నిర్లక్ష్యం పనికి రాదు. తగిన వ్యాయామం, ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యలకు దూరంగా ఉండవచ్చు. మరోవైపు కొన్నిప్రత్యేక కారణాల రీత్యా యువతలో కూడా కీళ్ళ సమస్య కనిపించవచ్చు. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఈ కీళ్ల నొప్పులకు, కారణాలు, తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం. కీళ్ల నొప్పులకు కారణాలుఆర్థరైటిస్ (ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, గౌట్)గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు (సెప్టిక్ ఆర్థరైటిస్) గంటల తరబడి ఒకే చోట కూర్చుండి పోవడం, వ్యాయామం లేకపోవడం, తీవ్రమైన ఒత్తిడి, ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ (లూపస్, ఫైబ్రోమైయాల్జియా)కూర్చోవడం, లేదా నిలబడే తీరు సరిగ్గా లేకోవడం, లేదా బయోమెకానిక్స్వయస్సు-సంబంధిత దుస్తులు మరియు కన్నీటిమధుమేహం, థైరాయిడ్ లాంటి వ్యాధులుఅలాగే ఊబకాయం, సరైన జీవనశైలి, పేలవమైన భంగిమ, క్రీడలలో ఎక్కువగా పాల్గొనడం, కీళ్ల గాయాలు, జన్యుపరమైన కారణాలు, పుట్టుకతో వచ్చే పరిస్థితుల కారణంగా చిన్న వయసులో కూడా కీళ్ల నొప్పులు రావచ్చు. ఒక్కోసారి కేన్సర్‌లాంటి జబ్బులున్నపుడు కూడా కీళ్ల నొప్పులొస్తాయి.వైద్యుడిని ఎప్పుడు సందర్శించాలి?కీళ్ల నొప్పులకారణాన్ని గుర్తించి, తేలికపాటి వ్యాయామం, ఆహారంలో మార్పులతో చాలావరకు ఉపశమనం పొందవచ్చు. కానీ నొప్పి తీవ్రంగా ఉన్నపుడు, వాచినపుడు, నడవడంకష్టంగా మారినపుడు, అలాగే కీళ్ల నొప్పులతో మాటు జ్వరం వస్తే మాత్రం కచ్చితంగా వైద్యుణ్ని సంప్రదించాలి. ఎక్స్‌రే లాంటి కొన్ని పరీక్షల అనంతరం వ్యాధి నిర్ధారణ తగిన చికిత్స పొందవచ్చు.కీళ్ల నొప్పులకు ఉపశమనమిచ్చే ఆహారంఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు / చేప నూనెలునట్స్ అండ్ విడ్స్బ్రాసికా కూరగాయలు, కాయధాన్యాలు, బీన్స్పండ్లు, ఆలివ్ నూనె, వెల్లుల్లి , దంప కూరగాయలు, తృణధాన్యాలుకీళ్ల నొప్పులకు ఏ ఆహారాలు చెడ్డవి?ఉప్పు, చక్కెరపదార్థాలు,ప్రాసెస్ చేసిన ఆహారం, రెడ్‌మీట్,మద్యంగ్లూటెన్ ఆహారాలుఅధిక ప్రాసెస్ చేసిన ఆహారాలు, కొన్నిరకాల నూనెలు ఇదీ చదవండి: నటి భాగ్యశ్రీ వ్యాయామాలతో భుజాల నొప్పులు మాయం!సమంత రోజు ఎలా గడుస్తుందంటే...??? -
పీరియడ్స్‌లో భరించలేని నొప్పా? ఇవిగో చిట్కాలు
మహిళలు, యువతులు నెలసరి లేదా పీరియడ్ సమయంలో విపరీతమైన నొప్పితో అల్లాడిపోతూ ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే ఆ నాలుగు రోజులు వారికి నరకం కింద లెక్కే. రక్తస్రావంకూడా ఎక్కువగానే ఉంటుంది. నొప్పి భరించలేక, ఏమీ తినలేక, నానాయాతన పడుతుంటారు. మరి కొంతమందికి నొప్పితోపాటు తిమ్మిర్లు, కళ్లు తిరగడం లాంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే పీరియడ్‌కి ముందు కొన్ని వ్యాయామాలు, ఆహారంలో మార్పులతో ఈ పెయిన్నుంచి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది అంటున్నారు నిపుణులు అవేంటో చూద్దామా.నెలసరి సమయంలో వచ్చే నొప్పి, అసౌకర్యాన్ని నివారించేందుకు కొన్ని సాధారణ మందులతో పాటు, కొన్ని హోం రెమిడీస్ కూడా బాగా పనిచేస్తాయి. అలాగే గైనకాలజిస్ట్ సలహా మేరకు కొన్ని నొప్పి నివారణ మందులు కూడా తీసుకోవచ్చు.అల్లం: పీరియడ్ క్రాంప్స్‌కు అల్లం బెస్ట్ ఆప్షన్. అల్లంలో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో ఇబ్బందిని తగ్గిస్తాయి. గోరువెచ్చని నీటిలో అల్లం రసం, కొద్దిగా తేనె కలుపుకుని ఉదయాన్నే తాగొచ్చు.పసుపు: పసుపులో ఉండే కర్కుమిన్ అనే సహజ రసాయనం ఈ బాధల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. పీరియడ్స్‌కు 7 రోజుల ముందు ,3 రోజుల తర్వాత ఒక కర్కుమిన్ క్యాప్సూల్‌ను తీసుకోవడం మంచిదని ఒక అధ్యయనంలో తేలింది. మహిళల్లో విటమిన్ డి స్థాయిలను పెంచడానికి కర్కుమిన్ సహాయపడుతుంది. సోంపు: కాసిన్ని సోంపు గింజల్ని తిన్నా, లేదా వాటిని నీటిలో మరిగించి, ఆ నీటిని తాగొచ్చు. మొత్తం ఆహారాన్ని మానివేయడం కాకుండా, తేలిగ్గా జీర్ణమయ్యే ఆహరం తీసుకోవాలి.పండ్లు, ఆకుకూరల తోపాటు ముఖ్యంగా మెగ్నీషియం అధికంగా ఉండే నట్స్, బీన్స్ వంటివి ఎక్కువగా తినాలి. ఉప్పు, కారం, షుగర్, మద్యం, కార్బోనేటేడ్ పానీయాలు, కాఫీలకు దూరంగా ఉంటే మంచిది.ఉపశమనంపొత్తికడుపుమీద వేడినీటితో లేదా హీటింగ్ ప్యాడ్‌తో కాపడం పెట్టుకుంటే కండరాలు వదులై నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మసాజ్ థెరపీ కూడా బాగా పనిచేస్తుంది. అలాగే కొన్ని రకాల యోగాసనాలను అలవాటు చేసుకుంటే ఫలితముంటుంది. -
Low blood pressure : ఈ చిట్కాలను పాటిస్తే మేలు!
ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు. మనుషుల్లో హైబీపీతో చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగే లోబీపీతో కూడా బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ రెండూ ప్రమాదకరమైనవే. ఈ నేపథ్యంలోబీపీని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఈనేపథ్యంలో బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ గురించి తెలుసుకుందాం.రక్తపోటు (బీపీ) ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. హైబీపీ పేషెంట్లతో పోలిస్తే లోబీపీ (హైపోటెన్షన్) పేషెంట్లు ఉన్నట్టుండి చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు. తరచుగా కళ్లు తిరిగి పడిపోతుంటారు. హైపోటెన్షన్ రోగుల్లో గుండె, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్త ప్రసరణ కాకపోవడం దీనికి కారణం కావచ్చు.లో బీపీతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. నెమ్మదిగా నవడం, తేలికపాటి యోగా, ధ్యానం లాంటివి చేయాలి. భారీ బరువులు ఎత్తడం, గంటల తరబడి పరుగెత్తడం లాంటివి చేయకూడదు. నీరసంగా అనిపించినా, ఎక్కువ చెమటలు పట్టినా జాగ్రత్త పడాలి. లో బీపీ పేషెంట్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేరు. ముఖ్యంగా వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే సాధ్యమైనంతవరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడానికి ప్రయత్నించాలి.తరచుగా నీరు తాగుతూ ఉండాలి. ఎండలోకి వెళ్లే ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లతోపాటు, బిస్కట్లు, చిన్నచిన్న తిరు తిండ్లు వెంట ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు. తులసి ఆకుల్లోని పొటాషియం , మెగ్నీషియం లాంటి పలు ఖనిజాలు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. తులసి ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది , యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును ఒక స్థాయిలో ఉంచుతాయి.సోడియం (ఉప్పు) ఆహారంలో తగినంతగాఉండేలా చూ సుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి.గ్రీన్ టీ: గ్రీన్ టీలో అనేక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ ఉన్నాయి. ఇవి లోబీపీకి బాగా పని చేస్తాయి. కాఫీ , కెఫిన్ పానీయాలు లో బీపీని తాత్కాలికంగా పెంచుతాయి.అలసట, తల తిరగడంతల తిరగడం, వికారం అధిక చెమట, స్పృహ కోల్పోవడం, చూపు మందగించడం, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
జుట్టు రాలుతోందా? కారణాలేంటో తెలుసా? ఇలా చేయండి!
జుట్టు రాలకుండా జాగ్రత్త ఇలా...జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. అయితే మనం మామూలుగా ఎలాంటి వైద్యసహాయం లేకుండా నివారించగల సమస్యల్లో ప్రొటీన్ల లోపం, శారీరక ఒత్తిడి ముఖ్యమైనవి. ఇలాంటి సమస్యలను మనకు మనంగా కొన్ని జాగ్రత్తలతో నివారించవచ్చు. అలాంటి సమస్యలూ... వాటిని అరికట్టగలిగే మార్గాలూ..ప్రొటీన్ లోపాల వల్ల: చాలామందిలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం... వారు తగినంతగా ప్రొటీన్‌తో కూడిన ఆహారం తీసుకోక΄ోవడమే. ఈ ప్రొటీన్లే ప్రధానంగా జుట్టు పెరుగుదలకూ, దెబ్బతిన్న జుట్టు రిపేర్లకూ దోహదపడతాయి. అరికట్టడం ఇలా: ఇలా జుట్టు ఎక్కువగా రాలుతున్నవారు ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. చేపలు, గుడ్లు, మాంసాహారంలో పుష్కలంగా ప్రొటీన్లు ఉంటాయి. శాకాహారులైతే ఆకుకూరలు, గ్రీన్‌పీస్, నట్స్, శనగలు, పప్పుధాన్యాలు, సోయా తీసుకోవాలి. వీటిలో ప్రొటీన్లు చాలా ఎక్కువ. శారీరక ఒత్తిడి: మనం నిత్యం ఎదుర్కొనే శారీరక ఒత్తిడులు మనలో భౌతికంగా మార్పులు తెచ్చి జుట్టు రాలి΄ోయేలా చేస్తాయి. ఫలితంగా మాడుపైన జుట్టు పలచబడినట్లుగా కనిపిస్తుంది. ఈ దశలో రాలిన జుట్టు చివరి భాగంలోని తెల్లని పదార్థం పచ్చి పచ్చిగా కాకుండా, బాగా ఎండి΄ోయినట్లుగా ఉండటాన్ని మనం గమనించవచ్చు. నివారణ ఇది: ఇలా రాలిపోయిన జుట్టు సాధారణంగా ఒత్తిడి తొలిగాక మళ్లీ మొలుస్తుంది. అందుకే ఒత్తిడి తొలగించుకోడానికి రిలాక్సేషన్ టెక్నిక్స్ అవలంబించడం, బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేయడం, యోగా వంటివి ఉపకరిస్తాయి. -
Glowing Skin నిగ నిగ లాడే చర్మ కాంతికి, పాలు, అలోవెరా ఇంకా..
శీతాకాలపు గాలులు,మండే ఎండలు మన చర్మ కాంతిని పాడు చేస్తాయి. జీవరహితంగా తయారు కావడం, పొడిబారడం, ముఖంపై మొటిమలు అబ్బో.. ఈ సమస్యలు లిస్ట్ చాంతాండంత. అందుకే మాయిశ్చరైజర్లు , క్రీమ్‌లను ఆశ్రయిస్తారు చాలామంది. అలా కాకుండా ఏ కాలంలో అయినా, ఎలాంటి వాతావరణంలో అయినా సహజంగా మెరిసే చర్మాన్ని పొందడం ఎలాగో తెలుసా? కొబ్బరి నూనె.. బ్రౌన్ షుగర్ పొడిబారిన, నిస్తేజంగా ఉన్న చర్మానికి కొబ్బరి నూనె ఔషధంలా పనిచేస్తుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెను ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయాకారంలో మసాజ్ చేయాలి. మరుసటి రోజు ఉదయం ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు నూనెలో కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి, కలిపి, ముఖానికి అప్లై చేయాలి. దీని వల్ల నిస్తేజంగా ఉన్న చర్మం కాంతిమంతం అవుతుంది. అలోవెరా చర్మకాంతికి మహత్తరంగా పనిచేసే జాబితాలో మొదటి వరసలో ఉంటుంది అలోవెరా. ముడతల నివారణకు పనిచేస్తుంది. అలొవెరా ఆకునుంచి తీసిన జెల్‌ను ముఖానికి, మేనికి పట్టించి 20 నిమిషాల తర్వాత వేడినీటితో కడిగితే ΄÷డిబారడం సమస్య దరిచేరదు. పాలు నిస్తేజంగా ఉన్న చర్మానికి పాలు మెరుపును తీసుకువస్తాయి. దూదిని పాలలో ముంచి, ముఖానికి, మెడకు రాసి, ఆరిన తర్వాత కడిగేయాలి. ΄ాలు, తెనె, శనగపిండి కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొని 20 నిమిషాలు తర్వాత శుభ్రపరుచుకుంటే చర్మకాంతి మెరగవుతుంది. తేనె తేనెలో ఔషధ గుణాలు ఎక్కువ. పొడి చర్మ సమస్యకు నివారిణిగా పనిచేస్తుంది. వేళ్లతో తేనెను అద్దుకొని, ముఖానికి రాసుకొని, మృదువుగా మసాజ్ చేసి ఐదు నిమిషాలు వదిలేయాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. బొప్పాయి మృతకణాలను తొలగించడంలో బొప్పాయి ఎంతగానో సహాపడుతుంది. బొప్పాయి పండు చిన్న ముక్కను గుజ్జు చేయాలి. దీంతో తేనె వేసి కలిపి, ముఖానికి అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. నీళ్లు ప్రతి రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తాగుతుంటే చర్మంలో ఉండే హానికారకాలు తొలగిపోయి తాజాదనం లభిస్తుంది. -
2023లో జనం సెర్చ్‌చేసిన వ్యాధులు.. వంటింటి చిట్కాలు ఇవే!
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఇటువంటి సందర్భంలో గడచిన కాలాన్ని ఒకసారి నెమరువేసుకోవడం సహజం. ఈ ఏడాది గూగుల్‌లో కొన్ని వ్యాధులకు సంబంధించిన వివరాల కోసం కొందరు వెదికారు. అలాగే ఈ వ్యాధుల నివారణకు ఇంటి చిట్కాల కోసం కూడా శోధించారు. వీటిలో కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీలపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023లో చాలామంది గూగుల్‌లో సెర్చ్ చేసిన టాప్-5 వ్యాధులు లేమిటో వాటి నివారణకు ఉపయుక్తమయ్యే సులభ ఉపాయాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. అధిక కొలెస్ట్రాల్ ఈ సంవత్సరం చాలామంది అధిక కొలెస్ట్రాల్ నివారణకు ఇంటి చిట్కాల కోసం చాలా శోధించారు. నిజానికి, కొలెస్ట్రాల్ పెరగడం అనేది సాధారణ సమస్యగా మారుతోంది. ఈ కారణంగానే గుండె జబ్బులు పెరిగే అవకాశం ఉంది. అయితే కొన్ని గృహచిట్కాలు ధమనులలో పేరుకుపోయిన వ్యార్థాలను క్లియర్ చేసేందుకు దోహదపడతాయి. కొత్తిమీర నీరు, సెలెరీ టీ, ఫైబర్ అధికంగా ఉండే కొన్ని ఆహారాలు అధిక కొలెస్ట్రాల్‌ను నివారించడంలో ఉపయుక్తమవుతాయి. 2. మధుమేహం మధుమేహం అనేది జీవనశైలి వ్యాధి. దీనితో చాలామంది సతమతమవుతున్నారు. ఈ వ్యాధి నివారణకు చక్కెరను తీసుకోకూడదు. మధుమేహం నివారణకు కొన్ని ఇంటి చిట్కాలు దోహదపడతాయి. ఓట్స్ తీసుకోవడం లాంటివి మధుమేహాన్ని నియంత్రించేందుకు ఉపకరిస్తాయి. అలాగే ఉసిరి రసం, మెంతులు తీసుకోవడం కూడా మధుమేహం నియంత్రణకు సహాయపడుతుంది. 3. అధిక యూరిక్ యాసిడ్ అధిక యూరిక్ యాసిడ్ సమస్య నివారణకు ఆనపకాయ రసం లేదా బార్లీ నీటిని తాగడం ఉత్తమం. నీరు, పీచు సమృద్ధిగా ఉన్న ఆహారపదార్థాలను తీసుకోవడం యూరిక్ యాసిడ్ సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. 4. హై బీపీకి హోం రెమెడీ అధిక బీపీ నివారణకు చాలామంది గృహ వైద్యం కోసం గూగుల్‌లో శోధించారు. హైబీపీని అదుపులో ఉంచేందుకు తగినంత నీటిని తాగడం ఉత్తమం. అలాగే నిమ్మరసం, ఫెన్నెల్ టీ కూడా చక్కగా పనిచేస్తుంది. హైబీపీ నివారణకు ఈ ఎఫెక్టివ్ విధానాలను ప్రయత్నించవచ్చు. 5. ఊబకాయం ఊబకాయాన్ని తగ్గించడంలో కొన్ని హోం రెమెడీస్ ప్రభావవంతంగా పనిచేస్తాయి. బొప్పాయి తినడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. అంతే కాకుండా పసుపు కలిపిన నీరు తాగడం వల్ల కూడా ఊబకాయం అదుపులో ఉంటుంది. ఇది కూడా చదవండి: 2023లో కశ్మీర్‌ను ఎంతమంది సందర్శించారు? -
ఇలా చేస్తే..కేవలం 24 గంటల్లో జలుబును తగ్గించుకోవచ్చు
జలుబు వచ్చిందంటే ఓ పట్టాన వదలదు. ఇప్పటివరకు జలుబును తగ్గించేందుకు ఎలాంటి ఇన్స్టంట్ మెడిసిన్స్ లేవు. కొందరికి వారం రోజుల్లో తగ్గితే, మరికొందరికి నెల రోజులైనా తగ్గదు. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంది. పెద్దలకు ఏడాదిలో మూడు సార్లు, చిన్నపిల్లలకు అయితే ఏడాదిలో పది లేదా అంతకంటే ఎక్కువ సార్లు జలుబుతో బాధపడుతుంటారని ఓ అధ్యయనంలోవెల్లడైంది. ఎలాంటి మెడిసిన్స్ వాడకుండానే ఇంట్లోనే దొరికే వస్తువులతో కేవలం 24 గంటల్లో జలుబుకు చెక్ పెట్టొచ్చు ఇలా.. ►ఏ కాలంలో అయినా శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. చాలామంది చలికాలంలో సరిగా నీళ్లు తాగరు. ఇలా అస్సలు చేయకూడదు. జలుబు చేసినప్పుడు తేనెతో కలిపిన నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ► వేడి నీటిలో లేదా పాలలో ఒక టీ స్పూన్ పసుపు కలపి తాగండి. దీని వల్ల జలుబు, దగ్గు నుంచి మీకు ఉపశనం కలుగుతుంది. పసుపులో ఆంటీ బాక్టీరియల్ గుణాలు జలుబు, దగ్గు నుంచి కోలుకోవడంలో ఉపయోగపడతాయి. ► తేనె, నిమ్మరసం వాడటం వల్ల జలుబు, దగ్గు నుంచి త్వరగా కోలుకోవచ్చు. ఒక చెంచాడు నిమ్మరసం, రెండు చెంచాల తేనెను వేడి నీళ్లు లేదా వేడి పాలలో కలిపి తాగండి. ► అల్లం టీ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. జలుబు, దగ్గు ఉన్న సమయంలో మీరు అల్లం టీ తాగితే రిలీఫ్ గా ఉంటుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని అల్లం ముక్కలు తీసుకోని వాటిని నీటిలో లేదా పాలలో కలిపండి. తరువాత దాన్ని బాగా మరిగించి తాగండి. ► ఒక గ్లాసు నీళ్లలో పావు స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు కలిపిన నీళ్లతో బాగా పుక్కిలిస్తే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. జింక్ లాజెంజెస్ అనే పెప్పర్మెంట్స్ మార్కెట్లో దొరుకుతాయి. ఇవి జలుబును చాలా త్వరగా తగ్గించగలవు. ఇందులో బెర్రీ, లెమన్.. ఇలా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అయితే మీరు యాంటీబయాటిక్స్ వాడితే మాత్రం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించి వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. గుమ్మడి గింజలు, పప్పు ధాన్యాలు, బాదం, చేపలు వంటి వాటిల్లోనూ జింక్ అధికంగా ఉంటుంది. జలుబులో వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. ► బీట్రూట్ జ్యూస్‌లో డైటరీ నైట్రేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరపు నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అంతేకాకుండా శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. జలుబుతో బాధపడుతున్న 76మందిలో.. రోజుకు ఏడు కంటే ఎక్కువసార్లు బీట్రూట్ తాగిన వారిలో జలుబు లక్షణాలు తగ్గినట్లు ఓ అధ్యయనంలో తేలింది. ► టాబ్లెట్లల కంటే నాజిల్ స్ప్రేలు మెరుగ్గా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు. ఇవి జలుబు తాలూకూ బాక్టీరియాను చంపి ఇన్స్టంట్ రిలీఫ్ ఇవ్వగలదు. వీటితో పాటు జలుబు అటాక్ అయినప్పుడు సాధ్యమైనంత వరకు గోరువెచ్చని నీళ్లే తాగితే బెటర్. ఇక అన్నింటి కంటే ముఖ్యమైనది విశ్రాంతి. ట్యబ్లెట్స్ వేసుకున్నా, హోమ్ రెమిడీలు ట్రై చేసినా సరైన విశ్రాంతి తీసుకున్నప్పుడే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. -
మలబద్దకం.. లైట్ తీసుకుంటే బోలెడన్ని సమస్యలు
చాలామంది పైకి చెప్పుకోలేరు కానీ ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్యలలో మలబద్ధకం కూడా ఒకటి. చిత్రం ఏమిటంటే, దానిని అసలు ఒక సమస్యగా కూడా గుర్తించకపోవడం! మలబద్ధకాన్ని సీరియస్‌గా తీసుకోకపోతే మాత్రం శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీర్ఘకాల మలబద్ధకం వల్ల కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. అందువల్ల రోజువారీ మన అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటూ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మలబద్ధకంతో బాధపడే వారికి కడుపులో అసౌకర్యంగా... ఇబ్బందిగా ఉంటుంది. మలద్వారం కోసుకుపోవడం, రక్తస్రావం వంటి సమస్యలు ఎదురవుతాయి. కదలకుండా కూర్చునే జీవనశైలి, అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లు, జంక్ ఫుడ్, వేపుళ్లు, ప్రాసెస్డ్ ఫుడ్, తగినన్ని నీరు తాగకపోవడం, ఫైబర్ ఎక్కువగా తీసుకోకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, బలహీనమైన జీవక్రియలు, రాత్రిళ్లు ఆలస్యంగా తినడం లేదా అసలే తినకపోవడం వంటి కారణాల వల్ల మలబద్ధకం వచ్చే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాలం ఉంటే.. కిడ్నీ సమస్యలు, జీర్ణవ్యవస్థ సమస్యలు, పైల్స్, తలనొప్పి, గ్యాస్, ఆకలి లేకపోవడం, బలహీనత, వికారం, ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలు వంటి సమస్యలు మొదలవుతాయి. దీనిని నివారించడానికి ఎన్నో చికిత్సలు, ఔషధాలు ఉన్నాయి. మీ డైట్లో కొన్ని ఆహార పదార్థాలు చేర్చుకుంటే.. మలబద్ధకం నుంచి ఉపశమనం పొందవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ఆహారంలో మెంతులు మలబద్ధకం సమస్య ఉంటే.. చెంచాడు మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే తినండి లేదంటే పడుకునే ముందు గోరువెచ్చని నీటిలో చెంచాడు మెంతిపొడిని కలుపుకుని తాగడం వల్ల తెల్లారేసరికి సుఖ విరేచనం అవుతుంది. పండ్లు, కూరగాయలు ఉదయానే టిఫిన్ చేసిన తర్వాత, మధ్యాహ్నం భోజనానికి ముందు, సాయంత్రం మీకు ఇష్టమైన కూరగాయలతో చేసిన గ్లాసుడు వెజిటబుల్ జ్యూస్ తీసుకోవడం వల్ల మలబద్ధకం బారిన పడకుండా ఉంటారు. బచ్చలికూర, టొమాటో, బీట్రూట్, నిమ్మరసం, అల్లం కలిపి జ్యూస్‌ను తయారు చేసుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. తాజాపండ్లు ముఖ్యంగా బొప్పాయి పండు తినడం మంచిది. సబ్జానీళ్లు మలబద్ధకంతో బాధపడేవారు రోజూ ఉదయం నానబెట్టిన సబ్జా గింజలను చెంచాడు ఖాళీ కడుపుతో తీసుకుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. నానబెట్టిన బాదం పప్పులు, వాల్నట్, ఎండు ద్రాక్షలను తీసుకున్నా మంచిది. అంజీర్ అంజీర్‌లో విటమిన్ బి6 పుష్కలంగా ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. రాత్రిపూట నానబెట్టిన అంజీర పండ్లను ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మలబద్ధకం సమస్య తగ్గుతుంది. అంజీర్ పేగు కదలికలను సులభతరం చేస్తుంది. బొప్పాయి ప్రతి రోజూ ఉదయం 11 గంటల ప్రాంతంలో, భోజనానికి ముందు కప్పుడు బొప్పాయి ముక్కలు తీసుకుంటే మంచిది. అలాగే జామపండు ముక్కలు, దోసబద్దలు తీసుకున్నా మంచిదే. భోజనానికి అరగంట ముందు గ్లాసు మజ్జిగ, అర స్పూన్ అవిసెగింజలు తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. ఓట్స్ ఓట్స్‌లో బీటా–గ్లూకాన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది కరిగే ఫైబర్, ఇది కడుపు పనితీరును ప్రోత్సహిస్తుంది. ఓట్స్ ప్రేగులలో మంచి బ్యాక్టీరియాను పెంచడంలో కూడా సహాయపడతాయి. ఓట్స్ పేగుల పనితీరును ప్రోత్సహించడంలో, మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీంతో మలబద్ధకం సమస్య త్వరగా తగ్గుతుంది. నెయ్యి నెయ్యికి ఉండే.. సహజమైన జిడ్డు తత్త్వం పేగుల కదలికలను వేగవంతం చేస్తుంది. రోజూ ఆహారంలో నెయ్యి వేసుకని తింటే మలబద్ధకం నుంచి విముక్తి పొందచ్చు. జామపండ్లు, దోసకాయ, కాకరకాయ, చిక్కుళ్లు మలబద్ధకాన్ని నివారించడంలో ముందుంటాయి కాబట్టి అవి ఆహారంలో ఉండేలా చూసుకుంటే మంచిది. -
పళ్ళపై పసుపు మరకలు పోవాలంటే..
నవ్వుతోనే ముఖం ఆకట్టుకుంటుంది. తెల్లని పలువరుస ఆ నవ్వును ప్రభావితం చేస్తుంది. కానీ పళ్లపై పసుపు గారలు.. నోటి దుర్వాసన వల్ల నవ్వు సంగతి అటుంచి అసలు నోరు తెరవడానికే భయపడుతుంటారు ఆ సమస్యలున్న వాళ్లు. అలాంటి వాళ్లు ఈ హోం రెమిడ్సి పాటిస్తే చాలా ఈజీగా ఆ సమస్యకు చెక్ పెట్టొయొచ్చు. అవేంటంటే.. వీటికి ఓ చిన్న చిట్కాతో చెక్ పెట్టొచ్చు. రసం తీసిన నిమ్మతొక్కతో పళ్ళను రుద్దుకుంటే క్రమంగా పసుపు మరకలు పోవడమే కాదు.. నోటి దుర్వాసనా తగ్గుతుంది. అయితే నిమిషం కంటే ఎక్కువసేపు రుద్దకూడదు. ఎక్కువ రుద్దితే పళ్ళు బలహీనమవుతాయి. ఏదైనా అతి మంచిది కాదుకదా! సో.. తులసి ఆకులు- ఎండిన నారింజ తొక్కలు: ముందుగా 7 తులసి ఆకులను తీసుకుని మెత్తగా పేస్ట్ చేయాలి. ఎండిన నారింజ తొక్కను కొద్ది మొత్తంలో తీసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత రెండింటినీ కలిపి మెత్తగా పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని దంతాలపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇలా ప్రతి రోజు చేస్తుంటే త్వరితగతిన దంతాలు తెల్లగా మారతాయి. బేకింగ్‌సోడా నీరు: ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బేకింగ్‌సోడాల నీరు పోసి పేస్ట్‌లా చేసి దీన్ని పళ్లకు అప్లై చేసి రుద్దిన పసుపు మచ్చలు పోతాయి. అలాగే ఉప్పు నిమ్మరసం కూడా చక్కటి ఫలితం ఇస్తుంది. ఈ చక్కటి ఇంటి చిట్కాలను పాటించి స్థైర్యంగా నవ్వండి. (చదవండి: ఆపరేషన్ బ్యూటీ! అందం కోసం తీసుకునే ఇంజక్షన్లు మంచివేనా!) -
సింక్ వద్ద దోమలు, బొద్దింకలు వస్తున్నాయా? ఇలా చేయండి
ఇంటిప్స్ ►గ్లాసు నీళ్లల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్కను ముక్కలుగా తుంచి వేయాలి. దీనిలో బోరిక్ యాసిడ్ రెండు టీ స్పూన్లు వేసి మూడు గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ నీటిని సింక్‌లో పోస్తే బొద్దింకలు రావు. ► నిమ్మకాయలను శుభ్రంగా కడిగి తుడవాలి. వీటికి కొద్దిగా నూనె రాసి టిష్యూపేపర్ వేసిన బాక్స్‌లో పెట్టి రిఫ్రిజిరేటర్లో పెడితే ఎక్కువ రోజుల పాటు తాజాగా ఉంటాయి. ► గ్లాసు నీళ్లలో కొద్దిగా వెనిగర్ వేసి టూత్‌బ్రష్‌లను నానబెట్టాలి. అరగంట తరువాత గోరువెచ్చని నీటితో కడిగితే టూత్ బ్రష్‌లు శుభ్రపడతాయి. ► నిమ్మకాయ ముక్కలు, పుదీనా ఆకులు, వెనిగర్‌ను సమపాళ్లల్లో తీసుకుని ఐస్‌క్యూబ్ ట్రేలో పోసి రాత్రంతా రిఫ్రిజిరేటర్ లో పెట్టాలి. ఉదయం ఈ ఐస్‌క్యూబ్‌ను తీసి దుర్వాసన వస్తోన్న సింక్‌లో వేస్తే దుర్వాసన తొలగిపోతుంది. ► టొమాటో చుట్టూ గాటు పెట్టి మరుగుతున్న నీటిలో వేయాలి. నిమిషం తరువాత తీసేసి ఐస్‌వాటర్‌లో వేయాలి. తరువాత టొమాటోను పట్టుకుని లాగితే తొక్క సులభంగా వచ్చేస్తుంది. -
తమలపాకులతో జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టండిలా!
చిన్ని చిట్కాలతో కూరగాయాలను, పళ్లను పాడవకుండా రక్షించుకోవచ్చు. అలాగే ఇంట్లో అందుబాటులో దొరికే వాటితోనే చర్మాన్ని, హెయిర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. సులభమైన పద్ధతుల్లో ఆరోగ్యకరమైన చిట్కాలను ఫాలో అవుతూ మన, ఇంటిని, ఆరోగ్యాన్ని ఈజీగా రక్షించుకోవచ్చు. అందుకావల్సింది ఓపిక. దీంతో పాటు ఎలాంటి హానికరం కాని మంచి రెమిడీలు కాస్త అనుభవం గడించిన పెద్దలు లేదా ఆరోగ్య నిపుణుల సాయం ఉంటే చాలు. ఆకుకూరలు తాజగా ఉండాలంటే.. ఆకుకూరలు వాడిపోయినట్టుగా కనిపించినప్పుడు... వాటిని చల్లటినీటిలో వేయాలి. దీనిలో టేబుల్ స్పూను నిమ్మరసం వేసి కలిపి ఐదునిమిషాలు పక్కన పెట్టుకోవాలి. తరువాత నీటినుంచి తీసేయాలి. ఇలా చేస్తే ఆకుకూరలు తిరిగి తాజాగా కనిపిస్తాయి. యాపిల్ ముక్కలు కట్ చేసిన వెంటనే ఆ ముక్కలపైన కాసింత నిమ్మరసం పిండితే రంగు మారకుండా ఎక్కువ సమయం తాజాగా ఉంటాయి. జుట్టు రాలే సమస్య తగ్గాలంటే.. ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి. ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి. గంట తరువాత నీటితో కడిగేయాలి. ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది. జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది. అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది. ఇలా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది. (చదవండి: సబ్జాతో ఇలా చేస్తే ముఖం కాంతులీనుతుంది!) -
డార్క్ సర్కిల్స్‌తో బాధపడుతున్నారా? ఈ బ్యూటీ టూల్ ఉంటే చాలు
ముఖంలో కళ్లు ఎంత ప్రత్యేకమో అంతే సున్నితం. కళ్ల విషయంలో ఎప్పటికప్పుడు సురక్షితమైన జాగ్రత్తలు తప్పనిసరి. పైగా కళ్ల చుట్టూ నల్లటి వలయాలు, మచ్చలు ముడతలు వంటి సమస్యలను దూరం చేయాలంటే.. ఇక్కడ కనిపిస్తున్న మసాజర్‌ని వెంట ఉంచుకోవాల్సిందే.ఈ మాన్యువల్ ఐ అండ్ ఫేస్ మసాజర్.. కళ్లకు సంబంధించి పర్ఫెక్ట్ బ్యూటీ టూల్ అని చెప్పుకోవచ్చు. ముఖానికి కూడా చక్కటి మసాజ్‌ని అందిస్తుంది. ఇది ఐ బ్యాగ్స్‌ని దూరం చేయడంతో పాటు డార్క్ సర్కిల్స్‌ని తొలగించి కళ్లను, ముఖాన్ని అందంగా మారుస్తుంది.మసాజర్లోని బాల్ 360 డిగ్రీలు తిరుగుతూ సరికొత్త యవ్వనాన్ని అందిస్తుంది. కంటి చుట్టూ సున్నితంగా మసాజ్ చేస్తూ ముఖ కండరాలను రిలాక్స్ చేస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. నుదుటి మీద ఏర్పడే ముడతలను దూరం చేయడంతో పాటు.. పెదవులు, బుగ్గల మధ్య ఏర్పడే సన్నటి గీతలను పోగొడుతుంది. దీని ఎర్గోనామిక్ నాన్ – స్లిప్ హ్యాండిల్.. కాంపాక్ట్ డిజైన్ తో, స్కిన్ ఫ్రెండ్లీ టచ్‌తో.. ఏ వేళలోనైనా ఎక్కడైనా వినియోగించడానికి.. చాలా సులభంగా ఉంటుంది. ఈ టూల్ ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లగలిగేంత చిన్నది. తేలికైనది కూడా. ఇది చిన్న హ్యాండ్ బ్యాగ్‌లో లేదా కాస్మెటిక్ బ్యాగ్‌లో చక్కగా సరిపోతుంది. మెరుగైన ఫలితాలను పొందడానికి దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించాలి. ధర 199 డాలర్లు. అంటే 16,251 రూపాయలు. దీన్ని ప్రియమైన వారికి బహుమతిగానూ ఇవ్వచ్చు! -
మందులు వేసుకున్నా దగ్గు తగ్గడం లేదా? అయితే ఈ చిట్కాలు పాటించండి
హెల్త్ టిప్స్ ►నీళ్ళలో తులసి ఆకులు వేసి మరిగించి, ఆ తర్వాత మరిగిన తులసి నీటిని కాస్త చల్లార్చి తీసుకుంటే దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► కొంచెం గోరువెచ్చని నీళ్లలో కరక్కాయ పొడిని కలుపుకుని తాగినా, కరక్కాయ ముక్క బుగ్గన పెట్టుకుని ఆ రసాన్ని మింగుతూ ఉన్నాపొడి దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది. ► అర టీ స్పూన్ సొంఠి పొడి లో ఒక స్పూన్ తేనె కలిపి తీసుకున్నా దగ్గు నుంచి రిలీఫ్ లభిస్తుంది. ► టీ స్పూన్ తేనెలో 1 టీ స్పూన్ అల్లం రసం, 1 టీ స్పూన్ దానిమ్మరసం మూడింటిని బాగా కలిపి తీసుకోవాలి. ఇలా రోజుకి 2 లేదా మూడు సార్లు చేస్తే రిజల్ట్ మీకే తెలుస్తుంది. ► రెండు, మూడు రోజుల పాటు రెండు మిరియాల గింజలు, మెలమెల్లగా నములుతూ, ఆ రసం మింగితే దగ్గు తగ్గుతుంది. ► సీతాఫలం విత్తనాలు, ఆకులు మెత్తగా నూరి పట్టిస్తే, పేలు పోతాయి. ► అరటిపండు, తేనెతో కలిపి తీసుకంటే క్షయవ్యాధిగ్రస్తులకు మంచిది. ► నేరేడు ఆకులు నీటిలో మరిగించి, వడగట్టి, ఆ నీటిని పుక్కిలిస్తే నోటిపూతలు తగ్గుతాయి. ► వేప చెట్టు బెరడును పెనంపై బాగా కాల్చి, మెత్తగా పొడి చేయాలి. ఆ పొడికి కొద్దిగా కొబ్బరి నూనె చేర్చి, కురుపులపై రాస్తే ఉపశమనం వుంటుంది. ∙వేపాకు రసం, దానికి సమాన భాగంలో పెరుగు జోడించి, కాస్త నిమ్మరసం కలిపి తలకు పట్టిస్తే చుండ్రు తగ్గుతుంది. మీకు తెలుసా? ►వంట పూర్తయిన తర్వాత అంట్లను కొందరు వంటింటి షింకులోనే అలా ఉంచేస్తుంటారు. అలా చేయకండి. ఎప్పటికప్పుడు వాటిని శుభ్రం చేసుకోవడమో లేకపోతే బయట వేసుకోవడమో చేయండి. సింకులో గిన్నెలు పడి ఉండటం వల్ల వాటిలో బ్యాక్టీరియా చేరి దుర్వాసన రావడం ప్రారంభం అవుతుంది. వాటిని వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. ►సాధారణంగా చాలా మంది వంటింట్లోనే చెత్త డబ్బాను పెట్టుకుంటుంటారు. ఒకటి రెండు రోజులు గనుక అది అలాగే ఉండిపోతే సూక్ష్మ జీవులు చేరి కంపు రావడం ప్రారంభం అవుతుంది. కాబట్టి ఏ రోజుకారోజు చెత్తను తీసివేయండి. వెసులుబాటు ఉంటే గనుక అసలు దీన్ని వంటింటి బయట వైపు ఏర్పాటు చేసుకోవడం మంచిది. -
వడలు పులుసుపోకుండా ఉండాలంటే ఇలా చేయండి!
మనం చేసే కొన్ని రెసిపీలు ఎంత బాగా చేసినే ఏదో లోపంతో సరిగా రావు. ఒక్కోసారి బాగా వచ్చిన వంటకం కూడా దెబ్బేస్తుంది. అలాంటప్పుడూ పెద్దలు చెప్పే కొన్ని చిట్కాలు ఫాలో అయితే మన కుటుంబసభ్యులకు ఎలాంటి ఢోకా లేకుండా మంచి రుచికరంగా వండిపెట్టొచ్చు. ఆ వంటింటి చిట్కాలు ఏంటో చూద్దాం!. ఇలా చేయండి.. గోరు వెచ్చని పాలల్లో రెండు టీస్పూన్ల పెరుగు వేసి కలపాలి. పాలల్లో ఈ మిశ్రమం వేసి, వడలను వేసి ఐదారుగంటలు నానపెడితే పెరుగు చక్కగా తోడుకుంటుంది. ఇప్పుడు ఈ వడలకు తాలింపు వేసి తింటే పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. పెరుగు లేనప్పుడు ఇలా చేస్తే పెరుగు పులవకుండా పెరుగు వడలు రుచిగా వస్తాయి. వేడినీళ్లలో బేకింగ్ సోడా, కొద్దిగా నిమ్మరసం వేసి కలపాలి. ఈ నీటిలో టూత్ బ్రష్‌ను మునిగేలా వేస్టి ఇరవై నిమిషాలు నానబెట్టాలి. తరువాత సాధారణ నీటితో కడిగితే బ్రష్‌లో ఉన్న మురికి, బ్యాక్టీరియా పోతుంది. పదిరోజులకొకసారి బ్రష్‌లను ఇలా శుభ్రం చేసుకుంటే, దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి. రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్, రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిని కలపాలి. ఈ మిశ్రమంలో ముంచిన టిక్కాను, తరువాత గుడ్లసొనలో ముంచి డీప్‌ఫ్రై చేస్తే టిక్కా క్రిస్పీగా మరింత రుచిగా వస్తుంది. అప్పడాలు, వడియాలు, పల్లీలు, కరివేపాకు వంటివి నూనె ఎక్కువ పీల్చకుండా డీప్‌ఫ్రై చేయాలంటే.. ముందుగా వాటిని ఇనుప జాలీ గరిటలో వేసి గరిటను కాగిన నూనెలో ముంచుతూ పైకి లేపుతూ ఫ్రై చేయాలి. ఇలా చేస్తే నూనె తక్కువగా పీల్చడంతో పాటు క్రిస్పీగా, రుచిగా వస్తాయి. పకోడి, బజ్జీల పిండి కలిపేటప్పుడు పదార్ధాలన్నివేసి కలుపుకున్నాక... చివరల్లో వంటసోడా కలపాలి. ఇలా కలపడం వల్ల బజ్జీలు నూనె తక్కువగా పీల్చడంతోపాటు మంచి రంగులో కనిపిస్తాయి. (చదవండి: పచ్చసొన తినకపోతే ఏం జరుగతుందో తెలుసా?) -
కూరల్లో గ్రేవీ కోసం..చల్లటి నీళ్లు పోస్తున్నారా..!
కూరలు వండేటప్పుడే ఒక్కొసారి బాగా రావు. లేదా గ్రేవీ అంతా దగ్గరగా అయిపోవడం వంటివి జరుగుతాయి. అలాంటప్పుడు చిన్న చిన్న ఈ చిట్కాలు పాటిస్తే వాటినిపడేయాల్సిన అవసరం లేకుండా మంచిగా వాడుకోవచ్చు. అలాగే రుచి పోకుండా చేయొచ్చు కూడా. అవేంటో చూసేద్దామా!. గ్రేవి రుచికరంగా పోషకాలు పోకుండా ఉండాలంటే.. పాలకూరలో టీస్పూను పంచదార, కాసిన్ని నీళ్లుపోసి పది నిమిషాలపాటు మరిగించి, తరువాత చల్లటి నీటిలో వేయాలి. చల్లారాక గ్రైండ్ చేసి గ్రేవీల్లోకి వాడుకుంటే పాలకూరలోని పోషకాలు బయటకు పోకుండా ఉంటాయి. కూరల్లో గ్రేవీ కోసం కొన్నిసార్లు నీళ్లు పోస్తుంటాము. అయితే ఇలా పోసే నీళ్లను కాస్త మరిగించి పోస్తే కూర వేడికి వేడినీళ్లు చక్కగా సరిపోయి గ్రేవీ మరింత రుచికరంగా వస్తుంది. చల్లటి నీళ్లుపోస్తే ఆ నీరు కూర ఉష్ణోగ్రతలకు చేరుకోవడానికి సమయం పట్టి గ్రేవీ అంత రుచిగా రాదు. కారం ఎక్కువైతే.. ఆలు పరాటా చేసేటప్పుడు .. ఉడికించిన బంగాళదుంపలను ఇరవై నిమిషాలపాటు రిఫ్రిజిరేటర్లో ఉంచి చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారాక దుంపల తొక్కతీసి ఆలు పరోటా చేస్తే దుంపల మిశ్రమం అతుక్కోకుండా, జిగట లేకుండా పరాటాలు చక్కగా వస్తాయి. కూరలో కారం, మసాలా ఘాటు ఎక్కువైనప్పుడు, పెరుగు, ఫ్రెష్‌క్రీమ్, పాలు... వీటిలో ఏ ఒక్కటైనా కూరను బట్టి రెండు మూడు టే బుల్ స్పూన్లు వేసి కలిపితే ఘాటు తగ్గుతుంది. (చదవండి: ఆ పార్కులో మాటల్లేవ్! కేవలం నిశబ్దమే..మనుషులంతా విగ్రహాలే!) -
కాంతి వంతమైన ముఖం కోసం..బీట్రూట్తో ఇలా ట్రై చేయండి!
మన ఇంట్లో ఉండే వాటితోటే చక్కటి మేని సౌందర్యాన్ని, కురులు అందాన్ని పెంపొందించుకోవచ్చు. వాటి ముందు మార్కెట్లో దొరికే ఉత్పత్తులు కూడా పనికిరావనే చెప్పాలి. కాస్త ఓపికతో చేసుకుంటే ఇంట్లో వంటి వాటితోటే సహజ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ ఇంటి చిట్కాలు ఏంటో చూద్దాం! అందులో ముందుగా మనం జ్యూస్‌గానూ, కూరగాను ఉపయోగించే కాయగూర అయిన బీట్రూట్ ముఖ్య సౌందర్యానికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం. బీట్రూట్లో ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మానికి మంచి ప్రయోజనాలు ఉన్నాయి. అందం దృష్ట్యా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మంచి యాంజీ ఏజింగ్‌గా ఉంటుంది. ఇది మచ్చలను తగ్గించడంలో సహయపడుతుంది కూడా చర్మానికి రోజీ గ్లో ఇస్తుంది. మెరిసే మేని కాంతి కోసం బీట్రూట్ని ఎలా ఉపయోగించాలో చూద్దాం! తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లుపోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పదినిమిషాలు నానబెట్టాలి. పదినిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈనీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్‌లో కొద్దిగా నీళ్లు కలిపి, తలస్నానం చేసిన జుట్టుకు కుదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి. ఇలా చేయడం వల్ల తల స్నానం చేసిన తరువాత కూడా జుట్టుకు పట్టి ఉండే జిడ్డు వదులుతుంది. వారానికి ఒకసారి ఇలా చేయాలి. (చదవండి: మీ ముఖం తెల్లగా కాంతివంతంగా ఉండాలంటే..జీలకర్రతో..) -
ఇంటి చిట్కాలతో బ్లాక్ సర్కిల్స్‌కు చెక్ పెట్టండి
సాధారణంగా మనలో చాలామందికి కొన్నిసార్లు మోకాళ్లు, మోచేతుల వద్ద నల్లగా మారుతుంటుంది.దీంతో నలుగురిలోకి వెళ్లినప్పుడు ఆయా భాగాలు కనబడకుండా కవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొంత మందికి ఎన్ని జాగ్రత్తలు పాటించినా నల్లటి వలయాలు బాధిస్తుంటాయి. ఈ సమస్యకు సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టవచ్చు. అదెలా చూసేద్దాం. ►టీ స్పూన్ నిమ్మరసంలో స్పూన్ నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమంలో దూది ఉండను ముంచి చర్మం మీద రాయాలి. ఆరిన తర్వాత కడిగేయాలి. రోజూ ఈ విధంగా చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ►రోజ్‌వాటర్‌లో దూది ఉండను ముంచి, నలుపు ఉన్న చోట రాయాలి. అలాగే శనగపిండిలో కొన్ని చుక్కల రోజ్‌వాటర్ పోసి, పేస్ట్ చేసి రాయాలి. ఈ విధంగా రోజూ చేయాలి. ►అవకాడో పండును గుజ్జు చేయాలి. ఈ గుజ్జును కళ్లకింద ముఖమంతా రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవచ్చు. అవకాడోలో ఉన్న సహజ ఔషధ గుణం చర్మం పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. ► ఒక ఆలుగడ్డను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేయాలి. వాటిని నేరుగా మోచేతులు, మోకాళ్లపై రుద్దవచ్చు. లేదా వాటి రసం తీసి ఆయా భాగాలపై రాయాలి. తరువాత 30 నిమిషాలు ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారం రోజుల పాటు చేస్తు తప్పక ఫలితం కనిపిస్తుంది. ► ఒక టీస్పూన్ బొప్పాయిరసం, అంతే మొత్తంలో తేనె తీసుకుని బాగా కలిపి మిశ్రమంలా చేయాలి. దీన్ని రాస్తుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం పోతుంది. -
పాదాల వాపు ప్రమాదమా! ఆ వ్యాధులకు సంకేతమా!
సాధారణంగా ఏ బస్సులోనో చాలాసేపు కూర్చుని ప్రయాణం చేశాక... పాదాల్లో వాపురావడం చాలామందిలో కనిపించేదే. ఇది నిరపాయకరమైన వాపు. కానీ కొన్నిసార్లు అలా ఏ కారణం చేత ఆ వాపు వచ్చిందో తెలుసుకోడానికి డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ వాపు కొన్నిసార్లు ప్రమాదకరం కావచ్చు, అప్రమత్తంగా ఉండాల్సి రావచ్చు. పాదాలవాపు కనిపించినప్పుడు ఏయే అంశాలపై దృష్టిపెట్టాలన్న అవగాహన కోసమే ఈ కథనం. కాళ్లలో/పాదాల్లో వాపు కనిపించడాన్ని ‘ఎడిమా’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా సెల్యులైటిస్, డీప్‌వీన్ థ్రాంబోసిస్ అనే కండిషన్లతో పాటు హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్... ఈ మూడు కీలక అవయవాల పనితీరు తగ్గడం వల్ల ఇలా జరిగిందేమో చూడాలి. హైపోథైరాయిడిజమ్ వల్ల కూడా ఇలా జరగవచ్చు. దాంతోపాటు కొన్ని మందుల వాడకంతో పాటు, అసలు ఏ కారణమూ తెలియకుండా కూడా పాదాల్లో వాపు రావచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల... కిడ్నీ ఫెయిల్యూర్లో ముఖం మాత్రమే ఉబ్బుతుందని చాలామంది అనుకుంటారు. కానీ కాళ్లవాపూ కనిపిస్తుంది. ఇలాంటప్పుడు కిడ్నీ ఫెయిల్యూర్ నిర్ధారణకు రీనల్ ఫంక్షన్ టెస్ట్ అనే పరీక్ష చేయించి, దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. లివర్ ఫెయిల్యూర్ వల్ల... కాలేయ వైఫల్యంలోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. దీని నిర్ధారణ కోసం ‘లివర్ ఫంక్షన్ టెస్ట్ – ఎల్ఎఫ్టీ’ పరీక్ష చేయించి, సమస్య నిర్ధారణ అయినప్పుడు దానికి అనుగుణంగా చికిత్స అందించాల్సి ఉంటుంది. కాలి సిరల్లో లోపంతో... కొన్నిసార్లు కాళ్లలోని సిరలు చక్కగా పనిచేయకపోవడం వల్ల రక్తంలోని నీరు అక్కడే ఉండిపోయి, పాదాల వాపు రూపంలో బయటపడుతుంది. ఎక్కువసేపు నిల్చుని పనిచేసే వృత్తుల్లో ఉన్నవారిలో, ఊబకాయం ఉన్నవారిలో ఈ సమస్య ఎక్కువ. పిక్కల్లో నొప్పి, కాళ్లు బరువుగా అనిపించడం, అటు తర్వాత క్రమంగా కాళ్లపైనా, మడమ లోపలి వైపున నల్లటి మచ్చలు, కొంతకాలానికి కాలి సిరలు ఉబ్బి మెలికలు తిరిగి ఉన్నట్లుగా చర్మంలోంచి బయటికి కనిపించడంతో పాటు, అవి పచ్చగా లేక నల్లగా కనిపిస్తే, అది ‘వేరికోస్ వెయిన్స్’ లేదా ‘‘వీనస్ ఇన్సిఫిషియెన్సీ’ అనే కండిషన్ కావచ్చు. తొలిదశలో సాయంత్రం మాత్రమే ఉండే కాళ్లవాపు ఆ తర్వాత రోజంతా ఉంటుంది ∙ఇది కాకుండా సెల్యులైటిస్ అనే కండిషన్‌లోనూ కాళ్ల వాపు కనిపిస్తుంది. అంతేకాదు.. ఇలా వాపు వచ్చిన కారణంగా కాలు కాస్త మెరుపుతో కనిపిస్తుంది ∙దీనితో పాటు కాలి సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్లకనిపించే ‘డీప్ వీన్ థ్రాంబోసిస్ – (డీవీటీ)’ అనే కండిషన్లో కూడా కాలివాపు కనిపిస్తుంది ∙ఈ కండిషన్స్ అన్నింటి నిర్ధారణ కోసం కాలి సిరలకు వీనస్ డాప్లర్ టెస్ట్ అనే పరీక్ష చేయించాలి. ఇవేగాక... ఇతర సమస్యల్లో కూడా... ఇక్కడ పేర్కొన్న సమస్యలతో పాటు అనేక ఇతర సమస్యల వల్ల కూడా కాళ్ల/పాదాల వాపు రావచ్చు. కొన్ని ప్రోటీన్ల లోపం, మహిళల్లో కటి భాగంలో వచ్చే క్యాన్సర్లలో కూడా కాళ్ల వాపు రావచ్చు. కొందరు గర్భవతుల్లో కాలి సిరలు సామర్థ్యం తగ్గడం, కొన్నిసార్లు థైరాయిడ్ హార్మోన్ లోపించినప్పుడూ వాపు రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో జనరల్ ఫిజీషియన్‌ను సంప్రదించి, తగిన పరీక్షలు చేయించడం, తదనుగుణంగా చికిత్సలు అవసరం. గుండె పంపింగ్ తగ్గడం వల్ల... గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గినప్పుడు పాదాల వాపు కనిపిస్తుంది. ఒక్కోసారి రక్తపోటు పెరగడమూ జరుగుతుంది. గుండెజబ్బు కారణంగా రెండు కాళ్లలోనూ వాపు కనిపిస్తుంది. ముందుగా కాలి ముందు భాగంలోనూ... ఆ తర్వాత మడమ భాగంలో వాపు వస్తుంది. మొదట్లో నొప్పి ఉండదు. ఆయాసం, నడవలేకపోవడం జరగవచ్చు. ఈ లక్షణాలు కనిపిస్తే తక్షణం మెడికల్ స్పెషలిస్ట్ / గుండె వైద్య నిపుణులను కలవాలి. గుండెజబ్బు వల్లనే పాదాల వాపు వచ్చిందా అన్న విషయం తెలుసుకోవడం కోసం బీఎన్పీ అనే రక్తపరీక్ష చేయించి, ఈ విలువ 100 కంటే ఎక్కువగా ఉంటే గుండె సమస్య ఉందేమోనని అనుమానించాలి. అప్పుడు గుండె నిపుణుల ఆధ్వర్యంలో ఈసీజీ, ఎకోకార్డియోగ్రఫీ వంటి పరీక్షలు చేయించుకోవాలి. చికిత్స : ఇది గుండెజబ్బు కారణంగానే జరిగితే డైయూరెటిక్స్ అనే మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూత్రం రూపంలో దేహంలోంచి నీటిని బయటకు పంపిస్తాయి. అయితే గుండెజబ్బు ఉన్నప్పుడు మాత్రమే ఈ డైయూరెటిక్స్ వాడాలి, లేకపోతే అవి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. అంతేకాదు... గుండెజబ్బు కాకుండా ఇతర కారణాల వల్ల కాలి వాపు వచ్చి ఉంటే... ఆ మూల కారణాన్ని కనుగొనే అవకాశం ఉండక, ఇతరత్రా సమస్యలు రావచ్చు. ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం... ఊపిరితిత్తుల్లో రక్తపోటు పెరగడం వల్ల కూడా పాదాలకు వాపు వస్తుంది. ఊబకాయం ఉన్నవారిలో ఇది ఎక్కువ. ఈ కారణంగా సమస్య వస్తే... నిద్రలో పెద్దగా గురకపెట్టడం, నిద్రనుంచి అకస్మాత్తుగా లేవడం, నిద్రలో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడం కనిపిస్తాయి. వీరు తక్షణం డాక్టర్‌ను సంప్రదించాలి. లంగ్స్‌లో రక్తపోటు పెరగడాన్ని తెలుసుకోవడం కోసం డాక్టర్లు ఎకో పరీక్ష చేయిస్తారు. వయసు 40 దాటి, కాళ్ల వాపులు ఉన్నవారు ఒకసారి తప్పనిసరిగా ఎకో పరీక్ష చేయించడం మంచిది. చికిత్స : ఊపిరితిత్తుల్లో రక్తపోటు కారణంగా వచ్చే స్లీప్ ఆప్నియాకు తప్పనిసరిగా చికిత్స చేయించాలి. దాంతో స్లీప్ ఆప్నియా సమస్య తగ్గి, కాళ్ల వాపూ తగ్గుతుంది. జాగ్రత్తలు / ఫస్ట్‌లైన్ చికిత్స : చాలాసేపు నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వాపు ఉన్న కాళ్లపై ఎలాస్టిక్ స్టాకింగ్స్ తొడగాలి. ఈ జాగ్రత్తలతో కాలివాపును నివారించవచ్చు. స్టాకింగ్ సిరలకు అది మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల క్రమేణా రక్తం సజావుగా ప్రవహిస్తుంటుంది. ఈ దశలో నిర్లక్ష్యం చేసి, సమస్య ముదిరి ‘వేరికోస్ వెయిన్స్’గా పరిణమిస్తే, కాళ్లకు పుండ్లు వంటి దుష్ప్రభావాలు (కాంప్లికేషన్లు) రావచ్చు. ఆయా కండిషన్లకు అనుగుణంగా రేడియాలజీ చికిత్స, శస్త్రచికిత్సలు అవసరం కావచ్చు. కారణం తెలియకుండా... కొందరిలో, ముఖ్యంగా 40 ఏళ్ల మహిళల్లో కాళ్ల వాపుతో పాటు మరికొందరిలో ముఖం, చేతులు కూడా ఉబ్బడం జరగవచ్చు. ఇలా ఎందుకు జరుగుతుందన్న కారణం కొన్నిసార్లు తక్షణం తెలియకపోవచ్చు. వీరికి అన్ని పరీక్షలూ చేసి... నిర్దిష్టంగా ఎలాంటి కారణం లేదని తెలుసుకున్న తర్వాత డైయూరెటిక్స్ వాడాలి. ఆహారంలో ఉప్పు తక్కువగా తీసుకోవాలనీ డాక్టర్లు సూచిస్తారు. (చదవండి: మీకు మీరే నిజమైన స్నేహితుడు, మీరే అసలైన శత్రువు) -
జర్నీలో వాంతులు, వికారం రాకుండా ఉండాలంటే..ఇలా చేయండి!
కొంతమందికి బస్సులో లేదా రైలులో ప్రయాణిస్తున్నప్పుడు వికారంగా అనిపించడంతోపాటు తలనొప్పి, వాంతులు వస్తాయి. ఇలాంటి పరిస్థితిని మోషన్ సిక్నెస్ అంటారు. ఇది రాకుండా ఉండాలంటే లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చినప్పుడు టీ, కాఫీల వంటివి తాగకూడదు. అలాగే ఖాళీ కడుపుతో కూడా ఉండకూడదు. సులభంగా జీర్ణమయ్యే తేలికపాటి ఆహారాలని తీసుకోవాలి. నోటిలో ఒకటి రెండు యాలకులు పెట్టుకోవాలి. ఇది వికారం సమస్యని తొలగిస్తుంది. ప్రయాణం చేసేరోజు ఖాళీ కడుపుతో అర టీస్పూన్ నల్ల ఉప్పు, నిమ్మకాయ రసం, తేనె కలిపి తాగితే గ్యాస్‌కు సంబంధించిన సమస్యలు దరిచేరవు. ప్రయాణంలో నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పండ్లను తింటూ ఉండాలి. అరగ్లాసు నీటిలో చెంచాడు యాపిల్ సిడార్ వెనిగర్ కలిపి పరగడుపున తాగితే వాంతులు రావు. కిస్మిస్లలో జింక్, కాల్షియం, విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి మనకు ఎంతగానో మేలు చేస్తాయి. రాత్రిపూట కొన్ని కిస్మిస్లను తీసుకుని తినాలి. దీంతో మరుసటి రోజు ఉదయం విరేచనం సాఫీగా జరుగుతుంది. మలబద్దకం తగ్గుతుంది. దీంతో పైల్స్ సమస్య నుంచి బయట పడవచ్చు. రాత్రిపూట కిస్మిస్లను నీటిలో నానబెట్టి.. మరుసటి రోజు ఉదయం తిన్నా సమస్య నుంచి బయటపడచ్చు..ఒకటి రెండు జామాకులను తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని నీటిలో వేసి పది నిమిషాల పాటు మరిగించాలి. ఆ నీటిని వడకట్టి అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి హెర్బల్ టీ మాదిరిగా తాగాలి. రోజుకు ఇలా రెండు సార్లు తాగితే చాలు, స్త్రీలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పులు రాకుండా ఉంటాయి. షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. చర్మం కాంతిమంతంగా... మృదువుగా తయారవుతుంది. (చదవండి: అప్పుడే జుట్టు తెల్లబడుతుందా! ఇలా చేసి చూడండి!) -
అప్పుడే జుట్టు తెల్లబడుతుందా? ఐతే ఇలా చేసి చూడండి!
ఒకప్పుడు యాభైఏళ్లు దాటిన వారికే తెల్లజుట్టు వచ్చేది కానీ ఇప్పుడు చాలామందికి పాతికేళ్లకంటే ముందే తెల్లజుట్టు వచ్చేస్తోంది. దాంతో ఉన్న వయసు కంటే పెద్దగా కనిపించడం, దానిని కప్పి పుచ్చుకోవడానికి తలకు రకరకాల హెయిర్ డైలు, షాంపూలు వాడటం... వాటిలోని రసాయనాల ప్రభావంతో సైడ్ ఎఫెక్టులు రావడం... వీటన్నింటి బదులు అసలు చిన్న వయసులోనే తెల్లజుట్టు ఎందుకు వస్తుందో చెబుతూ...దానిని నివారించడానికి తగిన సూచనలు, సలహాలతో కూడిన కథనం ఇది. చిన్న వయసులోనే తెల్లజుట్టు రావడానికి గల అనేక కారణాలలో అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, జన్యుపరమైన కారణాలు ప్రధానం. డైట్లో పోషకాల కొరత ఉండకూడదు. తెల్లజుట్టు రాకుండా ఉండాలంటే విటమిన్ బి ఉండే ఆహారాలని పుష్కలంగా తినాలి. డైట్లో ఇవి కచ్చితంగా ఉండేవిధంగా చూసుకోవాలి. జుట్టు తెల్లగా మారుతుందంటే విటమిన్ బి లోపం ఉందని అర్థం చేసుకోండి. అంతేకాదు దీనివల్ల జుట్టు రాలడం, పొడి జుట్టు సమస్యలు కూడా ఎదురవుతాయి. రోజువారీ ఆహారంలో విటమిన్ బి ఉందా లేదా అన్నదానిపై శ్రద్ధ వహించాలి. ఎందుకంటే హెల్తీ ఫుడ్స్ ద్వారా జుట్టుకు పోషణ లభిస్తుంది. తెల్ల జుట్టును సహజంగా నల్లగా సరైన సమయంలో ఆహారంలో మార్పులు చేయకపోతే అది జుట్టుకు హాని కలిగిస్తుంది. విటమిన్ బి సమృద్ధిగా లభించే పాల ఉత్పత్తులను ఎక్కువగా తీసుకోవాలి. దీనితో పాటు విటమిన్ బి6, విటమిన్ బి12 కూడా ఉండే ఆహారాలని తినాలి. శరీరంలో విటమిన్ బి లోపం ఉంటే జుట్టుకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. బయోటిన్, ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కూడా చిన్న వయస్సులోనే జుట్టు నెరుస్తుంది. కాయధాన్యాలు, తృణధాన్యాలు, గింజలు, పాలు, పెరుగు, జున్ను, గుడ్డు, ఆకుకూరలు, గోధుమలు, పుట్టగొడుగులు, బఠానీ, పొద్దుతిరుగుడు గింజలు, అవకాడో, చేపలు, మాంసం, చిలగడదుంప, సోయాబీన్, బంగాళదుంప, బచ్చలికూర, అరటి, బ్రకోలీ, బీన్స్ ప్రతిరోజు డైట్లో ఉండేలా చూసువడం వల్ల తెల్లజుట్టు సమస్యను వాయిదా వేయచ్చు. గుడ్డులోని తెల్లసొన లేదా మజ్జిగతో కలిపి రుబ్బిన కరివేపాకు లేదా మెంతి ఆకు పేస్ట్‌ని తలకు ప్యాక్‌గా వేసుకోవాలి. రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. తలస్నానానికి తక్కువ గాఢత ఉన్న షాంపూలనే ఉపయోగించాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వల్ల తెల్లజుట్టు రాదు. వచ్చిన తెల్ల జుట్టు కాలక్రమేణా నల్లగా మారుతుంది. తెల్ల జుట్టు సమస్యను అద్భుతంగా పారదోలే వాటిలో కాఫీ పొడి ఒకటి. ఓ గ్లాసుడు నీళ్లలో ఒకటిన్నర చెంచాల కాఫీ పొడిని మరిగించి చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్లకు పట్టించాలి. వేళ్లను జుట్టు కుదుళ్లకు తగిలేలా మసాజ్ చేస్తుండాలి. ఇలా చేసిన 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. మీ తలకు సరిపడేటన్ని మందార ఆకులు తీసుకుని పేస్ట్ లా చేసుకుని అందులో కొబ్బరి నూనె కలిపి జుట్టుకి అప్లయ్ చేసి 2 గంటల తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల తెల్లజుట్టు సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. హెర్బల్ హెన్నాలో బీట్ రూట్ రసం కలిపి ప్యాక్ వేసుకున్నా జుట్టుకు మంచి రంగు వస్తుంది.హెన్నా పౌడర్ ను ఆముదంలో మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ పై నుంచి దించి చల్లారిన తర్వాత దానిని జుట్టు కుదుళ్లకు అంటుకునేలా రాయాలి. ఆ తర్వాత కుంకుడు కాయ లేదా శీకాయతో తలస్నానం చేయాలి. తెల్లజుట్టు ఉన్న వారు పెనంపై రెండు చెంచాల పసుపును వేసి వేడి చేసి నల్లగా మారేంత వరకు మాడ్చాలి. చల్లారిన తర్వాత దీనికి సరిపోయేంత కొబ్బరినూనె లేదా నువ్వులనూనెలో కలిపి తలకు పట్టించాలి. ఆ తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఎక్కువ కాలం నల్లగా ఉంటుంది. తల స్నానానికి గోరు వెచ్చని నీళ్లు మాత్రమే వాడాలి. (చదవండి: కొంబుచా హెల్త్ డ్రింక్! దీని ప్రయోజనాలకు ఫిదా అవ్వాల్సిందే!) -
సెలూన్‌కి వెళ్లే పని లేకుండా..మీ హెయిర్‌ని స్ట్రయిట్ చేసుకోండిలా..!
కర్లీ హెయిర్ అందమే వేరు. ఒక్కోసారి అది పొల్యూషన్ వల్లో మరే ఇతర కారణాల వల్లనో నిర్వీర్యంగా అయిపోతుంది. దువ్వినా దువ్వనట్లుగా చిందరవందరగా ఉంటుంది జుట్టు. వెంట్రుకలు రఫ్‌గా మారిపోయి చిక్కులు పడిపోతూ చాలా చిరాగ్గా అనిపిస్తుంది. అదీగాక కొందరికి స్ట్రయిట్‌గా కుచ్చుకుచ్చులుగా జాలు వారుతున్న జుట్టునే ఇష్టపడుతుంటారు. అందరూ సెలూన్‌కి వెళ్లి డబ్బులు పెట్టి మరి చేయించుకోవడం కుదరదు. ఒకవేళ చేయించినా మెయింటేన్ చేయించడం ఇబ్బంది. మళ్లీ మళ్లీ సెలూన్‌కి వెళ్తూ వారి చెప్పిన సెషన్లలో చేయించుకోవాల్సి కూడా ఉంటుంది. వాటన్నింటికి చెక్ పెట్టి జస్ట్ ఇంట్లో మనకు అందుబాటులో ఉండే వాటితోనే ప్యాక్‌లు వేసుకుంటే ఈజీగా జుట్టు స్ట్రయిట్ అవ్వడమే గాక జుట్టుకి మంచి గ్రోత్ ఉండి కనీసం జుట్టు రాలే సమస్య తగ్గుతుంది. నేచురల్‌గా చేసుకునే హోం ప్యాక్‌లు ఏంటంటే.. మనం ఇంట్లో ఉపయోగించే పాలే తీసుకోండి. జస్ల్ ఒక కప్పు పాలు ఓ గుడ్డు తీసుకోండి. మీ జుట్లు బాగా పొడవైతే ఇంకో కప్పు పాగు, మరో గుడ్డు తీసుకోండి. ఇక ఈ రెండిటిని బాగా మిక్స్ అయ్యేలా కలిపిం బ్రెష్‌తో జుట్టుకి ప్యాక్ వేసుకోండి. ఓ అరంగంట తర్వాతా మీకు నచ్చిన షాంపుతో కడిగేయండి. మీరే ఆశ్చర్యపోతారు ఎంత సిల్కిగా జాలు వారుతుంటుందో మీ జుట్టు. కలబంద గుజ్జు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుందని తెలిసిన విషయమే మీరు అరకప్పు కలబందను, అరకప్పు కొబ్బరి నూనెతో మిక్స్ చేసి గంటపాటు అలానే ఉంచి షాంపుతో కడిగేయండి. చిట్లిన జుట్టు సమస్య తగ్గడమే గాక స్ట్రయిట్ అవుతుంది. మరొకటి యాపిల్ సైడర్ వెనిగర్ సహజమైన క్లెన్సర్ అని పిలుస్తారు. జుట్టుకి అప్లై చేస్తే అది మురికిని పోగొట్టడమే కాకుండా జుట్టుని మృదువుగా చేస్తుంది. మూడు టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్‌ను రెండు కప్పుల నీటిలో కలపండి. ముందుగా మీ జుట్టుని షాంపుతో కడిగేసుకున్నాక ఈ మిశ్రమాన్ని అప్లే చేసి రెండు మూడు నిమిషాలు ఉంచి ఆ తర్వాత కడిగేసుకుండి. ఇలా తరుచుగా చేస్తే త్వరితగతిన మీ జుట్టు స్ట్రెయిట్ అవుతుంది. మొక్కజొన్న పిండి, కొబ్బరి పాల మిశ్రమాన్ని జుట్టుకి ప్యాక్‌లా వేసిన స్ట్రయిట్‌గా అవుతుంది. ఇవన్నీ వద్దు అంటే ఈ ప్యాక్‌ని ట్రై చేయండి ఇది జుట్టు ఆరోగ్యంగా ఉంచడమే గాక చక్కగా స్ట్రయిట్ అవ్వుతుంది. అప్పటికప్పుడూ పార్టీల సమయంలో మీ జుట్టు స్ట్రయిట్ అవ్వడానికి ఈ ప్యాక్ బాగా పనిచేస్తుంది. ముందుగా ఈ ప్యాక్‌కి కావాల్సినవి: బియ్యం ఒక కప్పు కొబ్బరి ముక్కలు పావు కప్పు నీరు కప్పు నానబెట్టిన మెంతులు 3 చెంచాలు అలోవేరా జెల్ కొద్దిగా ఆలివ్ ఆయిల్ ఓ చెంచా తయారీ విధానం: ముందుగా ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి నానబెట్టండి. ఆ తర్వాత ఆ బియ్యాన్ని కడగకుండా అలానే ఉడికించండి. ఆ తర్వాత మిక్సి జార్లోకో ఉడికించిన బియ్యం, కొబ్బరిముక్కలు, అలోవేరా జెల్ వేసి మిక్సీ పట్టుకోండి. మెత్తటి పేస్ట్‌లా ఉండాలి. ఆ తర్వాత ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి.. ఓ గంట పాటు ఉంచుకోండి. ఆ తర్వాత జుట్టుని మైల్డ్ షాంపుతో కడిగేయండి. ఆరిన తర్వాత చూస్తే జుట్టు స్ట్రైయిట్‌గా కుచ్చులా ఉంటుంది. ఇలా రెగ్యూలర్‌గా చేస్తే మాత్రం జుట్టు స్ట్రెయిట్ అయ్యి, ధృఢంగా ఉంటుంది. (చదవండి: ఏజెంట్ బ్యూటీ ధరించిన డ్రస్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే!) -
ఈ ప్యాక్స్‌తో..జుట్టురాలే సమస్యకు చెక్‌పెట్టండి!
హెయిర్ కేర్ జుట్టు పొడిబారి నిర్జీవంగా ఉంటే పెరుగు మంచి ఫలితాన్నిస్తుంది. ఒక కప్పు పుల్లటి పెరుగు తీసుకోవాలి. జుట్టును చిక్కులేకుండా దువ్వి పెరుగును ఒక్కొక్క స్పూన్ తల మీద వేస్త వేళ్లతో మర్దన చేయాలి. తలంతా ప్రతి వెంట్రుక కుదురుక పెరుగు పట్టాలన్నమాట. ఓ అరగంట తర్వాత వేడినీటితో తలస్నానం చేయాలి. వారానికోసారి ఇలా చేస్తుంటే జుట్టు చిట్లిపోకుండా మృదువుగా, ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుంది. వేళ్లతో తలంతా మర్దన చేసుకోవడం సాధ్యం కాకపోతే జుట్టు కుదుళ్లకు పెరుగును పట్టింన తర్వాత గుండ్రటి పళ్లున్న దువ్వెనతో పది నిమిషాల సేపు దువ్వితే సరిపోతుంది. జుట్టు రాలుతుంటే బంగాళదుంప రసం బాగా పని చేస్తుంది. బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. అరకప్పు రసంలో రెండు టేబుల్ స్పూన్ల కలబంద గుజ్జు కలిపి తలకు పట్టించాలి. జుట్టుకు పైన రాసి సరిపుచ్చకడదు. కేశాల మొదళ్లకు పట్టేలా రాసి పది నిమిషాల సేపు మర్దన చేయాలి. రెండు గంటల తర్వాత వేడి నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తుంటే జుట్టురాలడం తగ్గిపోతుంది. (చదవండి: నికోటిన్ పౌచ్‌లు తెలుసా!..దీంతో స్మోకింగ్ ఈజీగా మానేయగలరా?) -
ఆ చెట్టు ఆకులు తెల్ల జుట్టుకి చెక్ పెడితే..వాటి పువ్వులు ఏమో..
మందారం ఆకుల్ని నూరి షాంపూగా వాడితే జుత్తు బాగా పెరుగుతుంది. చుండ్రు నివారణలోనూ, తెల్ల వెంట్రుకల నిరోధకంలోనూ సాయమవుతుంది. కప్పు నీటిలో ఒక మందార పువ్వు వేసి మరిగించి ఆ నీళ్లను తాగితే రక్తంలో ఐరన్ పెరుగుతుంది. కరివేపాకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఓ 10 ఆకులతో పేస్ట్ తయారు చేసి మజ్జిగలో కలిపేసుకుని రోజూ తాగితే కాలేయం వ్యర్థపదార్థాల నుంచి రక్షణ పొందుతుంది. రోజూ ఓ 8 ఆకుల్ని మిరియాలతో కలిపి తింటే ముక్కులో వచ్చే అలర్జీలు తగ్గిపోతాయి. రోజూ రెండు మూడు పుదీనా ఆకుల్ని నమిలి మింగుతుంటే జీర్ణశక్తి పెరిగి, కడుపు ఉబ్బరం, తేన్పులు తగ్గుతాయి. శ్వాసకోశాల శక్తి పెరుగుతుంది. వేపాకు, యాంటీ సెప్టిక్గాన, క్రిమి సంహారిణిగానూ బాగా పనిచేస్తుంది. వేపాకు పొడిని నీళ్లల్లో కలిపి చల్లితే ఎన్నో రకాల క్రిమి కీటకాలు దూరంగా వెళ్లిపోతాయి. వేపాకుల్ని నీటిలో వేసి మరిగించి స్ప్రే చేస్తే దోమల బెడద తప్పుతుంది. వేపాకు పొడిని పేస్ట్‌గా చేసి వాడితే పలు రకాల చర్మ సమస్యలు, మొటిమలు, ఎగ్జిమాల బాధలు తప్పుతాయి. పసుపును పేస్ట్‌గా రోజూ ముఖానికి వాడితే, ముఖం మీద ఉండే సన్నని వెంట్రుకలు రాలిపోతాయి. అలాగే మొటిమలు, మచ్చలు కూడా మాయమవుతాయి. ఇది గొప్ప యాంటీ ఆక్సిడెంటు కాబట్టి రోజు మొత్తంలో ఒక టీ స్పను దాకా కడుపులోకి తీసుకోవచ్చు. (చదవండి: ఈ ఆహారం తింటే..చినుకుల్లో చింత ఉండదు)