ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు. మనుషుల్లో హైబీపీతో చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగే లోబీపీతో కూడా బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ రెండూ ప్రమాదకరమైనవే. ఈ నేపథ్యంలోబీపీని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఈనేపథ్యంలో బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ గురించి తెలుసుకుందాం.
రక్తపోటు (బీపీ) ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. హైబీపీ పేషెంట్లతో పోలిస్తే లోబీపీ (హైపోటెన్షన్) పేషెంట్లు ఉన్నట్టుండి చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు. తరచుగా కళ్లు తిరిగి పడిపోతుంటారు. హైపోటెన్షన్ రోగుల్లో గుండె, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్త ప్రసరణ కాకపోవడం దీనికి కారణం కావచ్చు.
లో బీపీతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. నెమ్మదిగా నవడం, తేలికపాటి యోగా, ధ్యానం లాంటివి చేయాలి. భారీ బరువులు ఎత్తడం, గంటల తరబడి పరుగెత్తడం లాంటివి చేయకూడదు. నీరసంగా అనిపించినా, ఎక్కువ చెమటలు పట్టినా జాగ్రత్త పడాలి.
లో బీపీ పేషెంట్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేరు. ముఖ్యంగా వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే సాధ్యమైనంతవరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడానికి ప్రయత్నించాలి.
తరచుగా నీరు తాగుతూ ఉండాలి. ఎండలోకి వెళ్లే ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లతోపాటు, బిస్కట్లు, చిన్నచిన్న తిరు తిండ్లు వెంట ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు.
తులసి ఆకుల్లోని పొటాషియం , మెగ్నీషియం లాంటి పలు ఖనిజాలు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. తులసి ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది , యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును ఒక స్థాయిలో ఉంచుతాయి.
సోడియం (ఉప్పు) ఆహారంలో తగినంతగాఉండేలా చూ సుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి.
గ్రీన్ టీ: గ్రీన్ టీలో అనేక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ ఉన్నాయి. ఇవి లోబీపీకి బాగా పని చేస్తాయి. కాఫీ , కెఫిన్ పానీయాలు లో బీపీని తాత్కాలికంగా పెంచుతాయి.
అలసట, తల తిరగడంతల తిరగడం, వికారం అధిక చెమట, స్పృహ కోల్పోవడం, చూపు మందగించడం, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment