low blood
-
Low blood pressure : ఈ చిట్కాలను పాటిస్తే మేలు!
ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు. మనుషుల్లో హైబీపీతో చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగే లోబీపీతో కూడా బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ రెండూ ప్రమాదకరమైనవే. ఈ నేపథ్యంలోబీపీని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఈనేపథ్యంలో బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ గురించి తెలుసుకుందాం.రక్తపోటు (బీపీ) ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. హైబీపీ పేషెంట్లతో పోలిస్తే లోబీపీ (హైపోటెన్షన్) పేషెంట్లు ఉన్నట్టుండి చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు. తరచుగా కళ్లు తిరిగి పడిపోతుంటారు. హైపోటెన్షన్ రోగుల్లో గుండె, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్త ప్రసరణ కాకపోవడం దీనికి కారణం కావచ్చు.లో బీపీతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. నెమ్మదిగా నవడం, తేలికపాటి యోగా, ధ్యానం లాంటివి చేయాలి. భారీ బరువులు ఎత్తడం, గంటల తరబడి పరుగెత్తడం లాంటివి చేయకూడదు. నీరసంగా అనిపించినా, ఎక్కువ చెమటలు పట్టినా జాగ్రత్త పడాలి. లో బీపీ పేషెంట్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేరు. ముఖ్యంగా వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే సాధ్యమైనంతవరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడానికి ప్రయత్నించాలి.తరచుగా నీరు తాగుతూ ఉండాలి. ఎండలోకి వెళ్లే ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లతోపాటు, బిస్కట్లు, చిన్నచిన్న తిరు తిండ్లు వెంట ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు. తులసి ఆకుల్లోని పొటాషియం , మెగ్నీషియం లాంటి పలు ఖనిజాలు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. తులసి ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది , యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును ఒక స్థాయిలో ఉంచుతాయి.సోడియం (ఉప్పు) ఆహారంలో తగినంతగాఉండేలా చూ సుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి.గ్రీన్ టీ: గ్రీన్ టీలో అనేక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ ఉన్నాయి. ఇవి లోబీపీకి బాగా పని చేస్తాయి. కాఫీ , కెఫిన్ పానీయాలు లో బీపీని తాత్కాలికంగా పెంచుతాయి.అలసట, తల తిరగడంతల తిరగడం, వికారం అధిక చెమట, స్పృహ కోల్పోవడం, చూపు మందగించడం, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
నిస్సత్తువ
- కేజీబీవీ విద్యార్థినులను వేధిస్తున్న రక్తహీనత - 31 మందిలో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ శాతం - 8,130 మందిలో సాధారణం కంటే తక్కువ అనంతపురం ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా పాఠశాలల విద్యార్థినుల్లో అధిక శాతం మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. కేజీబీవీల్లో చదువుతున్న అమ్మాయిల్లో సమస్య మరీ ఎక్కువగా ఉంది. తరచూ వైద్య పరీక్షలు చేసి.. రక్తహీనతను నివారించాల్సిన అధికారులు ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 6–18 ఏళ్ల బాలికల్లో హిమోగ్లోబిన్ శాతం 11.5 నుంచి 16 శాతం మధ్య ఉండాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క. అమ్మాయిల్లో 12 ఏళ్లు మొదలుకుని 18 ఏళ్లు వచ్చేసరికి శారీరకంగా పలు మార్పులు జరుగుతాయి. హార్మోన్ల పనితీరు చురుగ్గా అవుతుంది. పీరియడ్స్ క్రమం తప్పకుండా వస్తుంటాయి. ఈ పరిస్థితుల్లో వారు రోజూ పౌష్టికాహారం తీసుకోవాలి. హిమోగ్లోబిన్ శాతం తక్కువ కాకుండా చూసుకోవాలి. అయితే.. కేజీబీవీల విద్యార్థినుల పరిస్థితి చూస్తే ఆందోళన కలుగుతోంది. అనాథ, పేద, డ్రాపౌట్స్ బాలికల కోసం ఏర్పాటు చేసిన కేజీబీవీల నిర్వహణకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. వీటిల్లో చదువుతున్న బాలికలంతా నిరుపేదలే. వీరిని దృష్టిలో ఉంచుకుని పౌష్టికారంతో కూడిన ప్రత్యేక మెనూను రూపొందించారు. ఇది కచ్చితంగా అమలైతే రక్తహీనత సమస్యే ఉత్పన్నం కాదు. జిల్లా వ్యాప్తంగా 31 మంది కేజీబీవీ విద్యార్థినుల్లో ఏడు గ్రాముల కంటే తక్కువగా హిమోగ్లోబిన్ శాతం ఉంది. 8,130 మందిలో ఏడు కంటే పైన, సాధారణ కంటే తక్కువగా ఉంది. తరగతుల వారీగా చూస్తే ఏడు గ్రాములకంటే తక్కువ ఉన్న విద్యార్థినులు ఆరో తరగతిలో తొమ్మిది మంది, ఏడులో ఐదుగురు, ఎనిమిదో తరగతిలో తొమ్మిది మంది, టెన్త్లో ముగ్గురు ఉన్నారు. అలాగే 7–11 శాతం ఉన్న బాలికలు ఆరో తరగతిలో 1,640 మంది, ఏడులో 1,821 మంది, ఎనిమిదిలో 1,748 మంది, తొమ్మిదిలో 1,508 మంది, పదో తరగతిలో 1,413 మంది ఉన్నారు. ఈ లెక్కలు చూస్తుంటే అమ్మాయిలకు పౌష్టికాహారం అందడం లేదనే విషయం స్పష్టమవుతోంది. ఆరో తరగతిలో కొత్తగా చేరిన అమ్మాయిల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వారు పదో తరగతికి వచ్చేసరికి నాలుగేళ్లు పూర్తవుతుంది. పౌష్టికాహారం అందించి ఉంటే ఆలోపైనా వారి పరిస్థితి మెరుగుపడేది. కానీ అలా జరగలేదు. నిర్వహణ బిల్లులు సక్రమంగా ఇవ్వలేదన్న సాకుతో మెనూకు మంగâýæం పాడుతున్నారు. దీనిపై సర్వశిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ) ప్రాజెక్టు ఆఫీసర్ దశరథరామయ్యను వివరణ కోరగా.. విద్యార్థినుల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక కార్యక్రమం చేపడతామన్నారు. త్వరలోనే మరోసారి వైద్య పరీక్షలు చేయిస్తామని చెప్పారు. అలాగే మెనూ సక్రమంగా అమలు చేయని వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
రక్తహీనతపై అవగాహన
రామకృష్ణాపూర్ : పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సింగరేణి హెల్త్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో మంగళవారం రక్తహీనతపై అవగాహన కల్పించారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ లోకనాథ్రెడ్డి మాట్లాడుతూ రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గడం వల్ల రక్తహీనత ఏర్పడుతుందన్నారు. మగవారిలో 14 నుంచి 16 గ్రాములు, స్త్రీలలో 12 నుంచి 14 గ్రాములు, పిల్లల్లో 16 నుంచి 18 గ్రాముల హీమోగ్లోబిన్ రక్తంలో ఉండాలన్నారు. తినే ఆహారంలో ఇనుప ధాతువు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల రక్తహీనతను నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేషన్ సిబ్బంది రామ్మోహన్రావు తదితరులు పాల్గొన్నారు.