low bp patients
-
Low blood pressure : ఈ చిట్కాలను పాటిస్తే మేలు!
ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల చాలామంది బీపీతో బాధపడుతున్నారు. మనుషుల్లో హైబీపీతో చాలా సమస్యలకు దారి తీస్తుంది. అలాగే లోబీపీతో కూడా బాధపడుతున్నారు. వాస్తవానికి ఈ రెండూ ప్రమాదకరమైనవే. ఈ నేపథ్యంలోబీపీని నియంత్రణలో ఉంచుకోవడం చాలా అవసరం. ఈనేపథ్యంలో బీపీ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, టిప్స్ గురించి తెలుసుకుందాం.రక్తపోటు (బీపీ) ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. హైబీపీ పేషెంట్లతో పోలిస్తే లోబీపీ (హైపోటెన్షన్) పేషెంట్లు ఉన్నట్టుండి చాలా నీరసంగా అయిపోతూ ఉంటారు. తరచుగా కళ్లు తిరిగి పడిపోతుంటారు. హైపోటెన్షన్ రోగుల్లో గుండె, మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు తగినంత రక్త ప్రసరణ కాకపోవడం దీనికి కారణం కావచ్చు.లో బీపీతో బాధపడుతున్నవారు క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. నెమ్మదిగా నవడం, తేలికపాటి యోగా, ధ్యానం లాంటివి చేయాలి. భారీ బరువులు ఎత్తడం, గంటల తరబడి పరుగెత్తడం లాంటివి చేయకూడదు. నీరసంగా అనిపించినా, ఎక్కువ చెమటలు పట్టినా జాగ్రత్త పడాలి. లో బీపీ పేషెంట్లు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేరు. ముఖ్యంగా వేసవికాలంలో అప్రమత్తంగా ఉండాలి. అందుకే సాధ్యమైనంతవరకు సాధారణ ఉష్ణోగ్రతలో ఉండడానికి ప్రయత్నించాలి.తరచుగా నీరు తాగుతూ ఉండాలి. ఎండలోకి వెళ్లే ముందు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నీళ్లతోపాటు, బిస్కట్లు, చిన్నచిన్న తిరు తిండ్లు వెంట ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముందుగా వచ్చే ప్రమాదాలను నివారించవచ్చు. తులసి ఆకుల్లోని పొటాషియం , మెగ్నీషియం లాంటి పలు ఖనిజాలు రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో సహాయపడతాయి. తులసి ఆకుల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది , యూజినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రక్తపోటును ఒక స్థాయిలో ఉంచుతాయి.సోడియం (ఉప్పు) ఆహారంలో తగినంతగాఉండేలా చూ సుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా ఒక టీస్పూన్ ఉప్పు కలపాలి.గ్రీన్ టీ: గ్రీన్ టీలో అనేక యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ ఉన్నాయి. ఇవి లోబీపీకి బాగా పని చేస్తాయి. కాఫీ , కెఫిన్ పానీయాలు లో బీపీని తాత్కాలికంగా పెంచుతాయి.అలసట, తల తిరగడంతల తిరగడం, వికారం అధిక చెమట, స్పృహ కోల్పోవడం, చూపు మందగించడం, శ్వాస వేగంగా తీసుకోవడం, గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. -
మీలో ఈ లక్షణాలు ఉంటే లోబీపీ ఉన్నట్లే.. లేట్ చేస్తే ప్రాణాంతకమే!
ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో తక్కువ రక్తపోటు కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారంపర్యంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం,సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో, చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. లో బీపీ అనేది మనిషి సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉంటే అది లో బీపీగా పరిగణిస్తారు. చాలా మంది తక్కువ రక్తపోటు సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఊహించకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు, గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు ఇలా ఉంటాయి ►మైకము,అలసట ► తలనొప్పి ► కళ్ళు తిరగడం ► కడుపులో తిమ్మిరి ► హృదయ స్పందన రేటు పెరగడం ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లో బీపీ ఎందుకు వస్తుంది? లోబీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. డీ హైడ్రేషన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం, విటమిన్ బీ12 లోపం, అడ్రినలైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసీమియా, వేసో వ్యాగల్ రియాక్షన్లు, పోస్టురల్ హైపో టెన్షన్, హై బీపీ కోసం మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, డ్రగ్స్ వాడకం కారణంగా లోబీపీ వచ్చే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించండి హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య. అయితే దానిని నుండి బయటపడటం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు.దీనికోసం ఏం చేయాలంటే.. ►తగినంత నీరు తాగాలి ► ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ► క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ► ఆల్కహాల్, పొగత్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోండి ► మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీ డాక్టర్‌తో మాట్లాడండి. ► ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకొండి ► తక్కునగా ఎక్కువసార్లు భోజనం చేయండి లో బీపీ వస్తే ఏం చేయాలి? రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి. 5నిమిషాల్లో బీపీ నార్మల్ లోబీపీతో కళ్లు తిరిగి పడిపోవడం, మైకం కమ్మినప్పుడు వెంటనే ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ సైంధవ లవణం(Himalayan rock salt ) కలుపుకొని తాగితే బీపీ వెంటనే నార్మల్ అవుతుంది. ఇది టేస్ట్‌లో కొంచెం ఉప్పగా, తీపిగా ఉంటుంది.సైంధవ లవణంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని కంట్లోల్ చేసి, నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, అయోడిన్, ఆక్సిజన్ వంటి అనేక పోషక విలువలు సైంధవ లవణంలో ఉన్నాయి. -
ఆకస్మిక మైకం.. తరచు తలనొప్పా?
ఈ రెండూ లోబీపీకి ప్రధాన సూచన కావొచ్చు. తక్కువ ఆక్సిజన్ స్థాయి కారణంగా ఒక్కోసారి అపస్మారక స్థితి ఏర్పడవచ్చు. మెడ మీద గట్టిగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఆగీ ఆగీ నొప్పి కూడా రావొచ్చు. అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులోని మరో లక్షణం ఏమిటంటే, శరీరం ఒక్కసారిగా చెమటలు పట్టడం, శరీరంలో వేడి జ్వరంలా పెరిగిపోవడం, అలసిపోయినట్లుగా కుప్పకూలిపోవడం సంభవిస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వల్ల అలసట కనిపిస్తుంది. ఆహారం జీర్ణం కాక వికారంగా అనిపిస్తుంది. వాంతులు, వికారం, విపరీతమైన అలసట వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లోబీపీ ఉంటే మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది. లోబీపీ ఉంటే ఏం చేయాలి లోబీపీ అకస్మాత్తుగా జరగదు. శరీరంలో ఏ సమస్య వచ్చినా బీపీ తగ్గుతుంది. ఇది డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. రక్తస్రావం అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేము. శరీరంలోని ఏ భాగంలో అయినా మార్పులు సంభవిస్తే రక్తప్రసరణలో తేడా వచ్చి బీపీ పడిపోతుంది. మితిమీరిన ఆలోచనలు, ఒత్తిడితో కూడిన జీవితం బీపీలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మధుమేహం వల్ల కూడా ఇది జరగవచ్చు. అలాంటప్పుడు తగిన చికిత్సను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి. (చదవండి: మాంసం తినే బ్యాక్టీరియా!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!) -
పెళ్లికి ముందు.. వధువు హఠాన్మరణం
సాక్షి, బెంగళూరు: రోస్ వేడుకలో వధువు కుప్పకూలి మరణించింది. ఉడుపి కోళలగిరి హవంజెలో జరిగింది. హవంజెకీ చెందిన జోస్నా లూయిస్ (24)కు గురువారం పెళ్లి జరగాల్సిఉంది. పెళ్లికి ముందు రోజు క్రైస్తవ సంప్రదాయం ప్రకారం బుధవారం రాత్రి 8:30 గంటలకు బంధువుల ఇంటిలో రోస్ వేడుక నిర్వహించారు. ఈ వేడుకలో ఆమె స్పృహ తప్పి పడిపోగా స్థానిక ఆస్పత్రికి తరతలించారు. గురువారం తెల్లవారుజామున ఆమె మృతి చెందింది. లో బీపీనే కారణమని బంధువులు తెలిపారు. చదవండి: (కుమార్తె ప్రేమవివాహం.. ఆటోతో ఢీకొట్టి.. చనిపోయాడనుకొని..) -
లో బీపీ రోగులకు సర్జరీ ప్రాణాంతకం
లోబీపీతో బాధ పడుతున్న రోగులకు శస్త్రచికిత్స నిర్వహిస్తే అది వారి ప్రాణాలకే ముప్పుగా పరిణమించవచ్చని పరిశోధకులు అంటున్నారు. అధిక రక్తపోటు కూడా ప్రాణానికి హాని కరమే అయినా, దానివల్ల శస్త్రచికిత్స తరువాత ప్రాణానికి పెద్దగా హాని కలగదని నాటింగ్‌హామ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శస్త్రచికిత్స చేయడానికి ముందు నుంచి అది పూర్తై కొంతకాలం వరకు రోగుల్లో ఉండే ఇబ్బందుల్ని అనేక అంశాల ఆధారంగా పరిశోధకులు విశ్లేషించారు. వివిధ శస్త్రచికిత్సలు చేసుకున్న దాదాపు రెండున్నర లక్షల మంది రోగుల్ని పరిశీలించి నివేదిక వెలువరించారు. ఈ నివేదిక ప్రకారం... శస్త్రచికిత్స అనంతరం రోగులపై అధిక రక్తపోటు ప్రభావం పెద్దగా లేదు. అయితే తక్కువ రక్తపోటు ఉన్నవారిలో 40 శాతం మందికి ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. మరీ తక్కువ రక్తపోటు ఉన్నవారికి 2.5రెట్లు ఎక్కువగా ప్రాణహాని ఉంది. అందువల్ల శస్త్ర చికిత్సలు చేయించుకున్న రోగులు రక్తపోటును సరైన స్థాయిలో నియంత్రణలో ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.