ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో తక్కువ రక్తపోటు కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారంపర్యంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం,సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో, చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. లో బీపీ అనేది మనిషి సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉంటే అది లో బీపీగా పరిగణిస్తారు.
చాలా మంది తక్కువ రక్తపోటు సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఊహించకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు, గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి.
లక్షణాలు ఇలా ఉంటాయి
►మైకము,అలసట
► తలనొప్పి
► కళ్ళు తిరగడం
► కడుపులో తిమ్మిరి
► హృదయ స్పందన రేటు పెరగడం
► శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
లో బీపీ ఎందుకు వస్తుంది?
లోబీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. డీ హైడ్రేషన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం, విటమిన్ బీ12 లోపం, అడ్రినలైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసీమియా, వేసో వ్యాగల్ రియాక్షన్‌లు, పోస్టురల్ హైపో టెన్షన్, హై బీపీ కోసం మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, డ్రగ్స్ వాడకం కారణంగా లోబీపీ వచ్చే అవకాశం ఉంది.
ఈ జాగ్రత్తలు పాటించండి
హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య. అయితే దానిని నుండి బయటపడటం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు.దీనికోసం ఏం చేయాలంటే..
►తగినంత నీరు తాగాలి
► ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి
► క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
► ఆల్కహాల్, పొగత్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోండి
► మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీ డాక్టర్‌తో మాట్లాడండి.
► ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకొండి
► తక్కునగా ఎక్కువసార్లు భోజనం చేయండి
లో బీపీ వస్తే ఏం చేయాలి?
రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి.
5నిమిషాల్లో బీపీ నార్మల్
లోబీపీతో కళ్లు తిరిగి పడిపోవడం, మైకం కమ్మినప్పుడు వెంటనే ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ సైంధవ లవణం(Himalayan rock salt ) కలుపుకొని తాగితే బీపీ వెంటనే నార్మల్ అవుతుంది. ఇది టేస్ట్‌లో కొంచెం ఉప్పగా, తీపిగా ఉంటుంది.సైంధవ లవణంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని కంట్లోల్ చేసి, నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, అయోడిన్, ఆక్సిజన్ వంటి అనేక పోషక విలువలు సైంధవ లవణంలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment