Bp
-
నిద్ర కరువైతే అనారోగ్యం..!
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవనశైలిలో మార్పులు, అధికంగా మొబైల్ వాడడం, టీవీ ఎక్కువగా చూడడం వల్ల అధికశాతం మంది నిద్రలేమి బారిన పడుతున్నారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం, జంక్ఫుడ్స్ ఎక్కువగా తినడం, రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం, రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల తగినంత నిద్ర ఉండదు. దీని వల్ల వారు బీపీ, సుగర్, ఊబకాయం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది నిద్ర లేకపోతే ఏంజరుగుతుంది? అని తేలికగా తీసుకుంటారు.అర్ధరాత్రి వరకు చాలా మంది నిద్రపోరు. దీని వల్ల అనేక సమస్యల బారిన పడతారు. నిద్రలేమి వల్ల ఓఎస్ఏ (అబ్‌్సట్రక్ట్రివ్ స్లీప్ అస్నియా) అనే సమస్యకు గురవుతారు. ఈ సమస్య ఉన్న వ్యక్తి శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోవడం, ఊపిరి లోతుగా తీసుకోవడం (అల్పశ్వాస) జరుగుతుంది. అదేవిధంగా పెద్దగా గురక పెట్టడం, శ్వాస పునఃప్రారంభం అయినప్పడు ఉక్కిరిబిక్కిరి అయి వింత శబ్దాలు రావడం, పగటి సమయంలో మధ్యమధ్య కునుకుపాట్లు పడుతూ ఉండడం, అలసటగాను, మత్తుగాను ఉంటుంది. మద్యం తాగడం, పొగతాగడం, స్థూలకాయం వల్ల ఓఎస్ఏ సమస్య తీవ్రతరం అవుతుంది. చిన్నపిల్లల్లో అయితే ఎదుగుదల ఉండదు. మానసిక సమస్యల బారిన పడతారు.నెలకు 1000 మంది వరకు నిద్ర లేమి సమస్య బారిన పడుతున్నారు. 6నుంచి 7 గంటల నిద్ర అవసరం ప్రతి వ్యక్తి రోజులో 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఇలా నిద్ర పోవడం వల్ల హార్మోన్స్ తయారవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. పనిచేయడానికి అవసరమైన శక్తి తయారవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జాగ్రత్తలు నిద్రలేమి సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. కనీసం రోజులో 6 గంటలు నిద్ర పోవాలి. నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గాని సంప్రదించాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. పానీపూరీ, చాట్, పిజ్జా, బర్గర్లు వంటివి ఎక్కువగా తినకూడదు.ఎక్కువ మందికి నిద్రలేమి సమస్య చాలామంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నా రు. అయితే ఈసమస్యకు ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియదు. పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గానీ సంప్రదించాలి. ఆరోగ్యంగా జీవించడం కోసం రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగించకూడదు. అదేవిధంగా టీవీ కూడా గంటల తరబడి చూడకూడదు. - డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
క్యాస్ట్రాల్ ఇండియాపై అరామ్కో కన్ను
న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న లూబ్రికెంట్స్ తయారీ దిగ్గజం క్యాస్ట్రాల్ ఇండియా కౌంటర్‌కు మరోసారి డిమాండ్ పెరిగింది. దీంతో బీఎస్ఈలో షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 246 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 10 శాతం ఎగసి రూ. 245 వద్ద నిలిచింది. ఒక దశలో 13.4 శాతం దూసుకెళ్లి రూ. 252 వద్ద గరిష్టానికి చేరింది.ఎన్ఎస్ఈలో 7.39 కోట్ల షేర్లు, బీఎస్ఈలో 23.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. బీపీ(గతంలో బ్రిటిష్ పెట్రోలియం)కు చెందిన లూబ్రికెంట్ బిజినెస్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్కో కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు షేరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు క్యాస్ట్రాల్ ఇండియా బలపడింది. 10 బిలియన్ డాలర్లు.. క్యాస్ట్రాల్ బ్రాండుతో బీపీ.. లూబ్రికెంట్స్ విక్రయించే సంగతి తెలిసిందే. బీపీ ఇటీవల పునర్వ్యవస్థీకరణలో భాగంగా లూబ్రికెంట్స్ విభాగం విలువను దాదాపు 10 బిలియన్ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలుస్తోంది! కాగా.. వాల్వోలైన్ లూబ్రికెంట్స్ యూనిట్‌తో క్యాస్ట్రాల్ ఆస్తులను జత చేసే యోచనలో అరామ్కో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.2023లో 2.65 బిలియన్ డాలర్లకు వాల్వోలైన్‌ను అరామ్కో కొనుగోలు చేసింది. భారత్, చైనా, ఆగ్నేయ ఆసియాలో అదనపు రిఫైనింగ్, కెమికల్స్ బిజినెస్‌ల కొనుగోలుకి చూస్తున్నట్లు అరామ్కో గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్ ఇండియా కొనుగోలుపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు. -
బీపీకి ఆయుర్వేద ఔషధం.. త్వరలో అందుబాటులోకి..
రక్తపోటు.. బ్లడ్‌ప్రెజర్.. దీనిని వాడుక బాషలో బీపీగా వ్యవహరిస్తుంటారు. దేశంలో ప్రతి నాల్గవ వ్యక్తి రక్తపోటుతో బాధపడుతున్నాడని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి. అటు హైబీపీ, ఇటు లోబీపీ.. రెండూ ప్రమారకమైనవేనని వైద్యులు చెబుతుంటారు. రక్తపోటు విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అది పక్షవాతానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తుంటారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో గల జాతీయ ఆయుర్వేద సంస్థాన్ రక్తపోటుపోటుపై పరిశోధనలు నిర్వహించింది.జాతీయ ఆయుర్వేద సంస్థాన్(National Institute of Ayurveda) పదేళ్ల పరిశోధనల అనంతరం రక్తపోటు నియంత్రణకు ఔషధాన్ని తయారు చేసింది. దీనికి క్లినికల్ ట్రయల్స్ కూడా నిర్వహించింది. ఈ ఔషధం ఎటువంటి దుష్ప్రభావాలను కలుగజేయదని ట్రయల్స్‌లో తేలిందని సంస్థాన్ పరిశోధనకులు తెలిపారు. ఈ ఔషధాన్ని తొమ్మిది రకాల వనమూలికలను కలిపి తయారు చేశారు. ఈ ఔషధం క్లినికల్ ట్రయల్ పూర్తయిందని, పేటెంట్ పొందిన తరువాత అందరికీ అందుబాటులోకి వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థాన్ హెచ్ఓడీ డాక్టర్ సుదీప్త రథ్ మాట్లాడుతూ తమ వైద్యుల బృందం రక్తపోటును అదుపులో ఉంచేందుకు ఆయుర్వేద గుళికలను రూపొందించిందని తెలిపారు. ఈ గుళికలు క్లినికల్ ట్రయల్స్ సమయంలో ప్రభావవంతంగా పనిచేశాయని, ఎటువంటి దుష్ప్రభావాలు కూడా కనిపించలేదన్నారు. ఈ ఔషధానికి పేటెంట్(Patent) పొందిన వెంటనే, దానిలో ఉపయోగించిన మూలికలను బహిర్గతం చేస్తామన్నారు. కాగా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం దేశ జనాభాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు 22.6 శాతంగా ఉన్నారు. పురుషులలో ఈ రేటు మహిళల కంటే కొంచెం ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లోని ప్రజలలో రక్తపోటు(blood pressure) ప్రభావం అధికంగా ఉంది. అధిక రక్తపోటు కారణంగా, ఛాతీ నొప్పి, తీవ్రమైన అనారోగ్యం, గుండెపోటు వచ్చే అవకాశాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.ఇది కూడా చదవండి: Anti Valentine week : నేటి నుంచి భగ్న ప్రేమికులు చేసే పనిదే.. -
అలా చూస్తూ ఉంటే బీపీ వచ్చేస్తుంది
సాక్షి, అమరావతి: ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో వినోదం, వ్యాపార ప్రకటనలు, ప్రచారాల్లో రీల్స్, షార్ట్ వీడియోస్ హవా నడుస్తోంది. పిల్లలు, కుర్రకారు, పెద్దలు కూడా మొబైల్ రీల్స్ చూడటానికి గంటల సమయం కేటాయిస్తున్నారు.కొంచెం ఖాళీ సమయం దొరికితే చాలు మొబైల్లో ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా యాప్‌లు ఓపెన్ చేయడం.. అందులో వచ్చే షార్ట్ వీడియోస్, రీల్స్ చూస్తూ ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులకు షేర్ చేయడం ఓ దైనందిన కార్యక్రమం అయిపోయింది. ఇది రాన్రాను ఓ వ్యసనంలా మారి, విలువైన సమయాన్ని హరించడంతో పాటు, అధిక రక్తపోటు (బీపీ) ముప్పు తెస్తోందని చైనాలోని హెబేయ్ మెడికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 4,318 మంది యువత, మధ్య వయసు వారిపై చేసిన అధ్యయనంలో వెల్లడైన వివరాలను తాజాగా బీఎమ్సీ జర్నల్‌లో ప్రచురించారు.తొమ్మిది నెలల పాటు విశ్లేషణ ఈ శాస్త్రవేత్తలు 2023 జనవరి నుంచి సెప్టెంబరు వరకు మెడికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించుకున్న 4,318 మంది యువకులు, మధ్య వయస్కుల ఆరోగ్య రికార్డులను విశ్లేషించారు. 2,245 మంది పురుషులు, 1893 మంది స్త్రీలపై ఈ అధ్యయనం చేశారు. వారికి పలు రకాల పరీక్షలు నిర్వహించి, రాత్రిళ్లు నిద్రపోయే ముందు స్మార్ట్ ఫోన్లల్లో ఎంత సేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తున్నారనే అంశాన్ని పరిశీలించారు. రాత్రిళ్లు ఎక్కుసేపు రీల్స్, షార్ట్ వీడియోలు చూస్తూ గడిపే యువత, మధ్య వయసు వారిలో బీపీ బారినపడే ప్రమాదం పెరుగుతున్నట్లు నిర్ధారించారు. రీల్స్, షార్ట్ వీడియోలు చూసే సమయాన్ని వీలైనంత తగ్గించాలని, ఈ వ్యసనాన్ని పూర్తిగా వీడితే మంచిదని సూచించారు. దీంతోపాటు శరీర బరువును అదుపులో పెట్టుకోవడం, రక్తంలో కొవ్వు, చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలని సూచించారు. -
నలిగిపోతున్ననాలుగో సింహం
పోలీస్ అధికారులు విధులకు ఒకవేళంటూ ఉండదు. లా అండ్ ఆర్డర్లో ఉండే సిబ్బందికి ఉరుకులుపరుగులు మరీ ఎక్కువ. శాంతిభద్రతల పరిరక్షణ, బందోబస్తులు, కేసుల దర్యాప్తు, కోర్టులకు హాజరుకావడం..ఉన్నతాధికారుల సమీక్షలకు వెళ్లడం..ఇలా బహుళ డ్యూటీలు చేస్తుండాలి. ఏఆర్, టీజీఎస్పీ సిబ్బంది విధుల్లోనూ తిప్పలు తప్పవు. పండుగలు, సభలు, సమావేశాలు, వీఐపీల బందోబస్తులంటూ గంటల తరబడి నిలబడక తప్పదు. ఇలా శారీరకంగా, మానసికంగానూ శ్రమ ఎక్కువే. ఈ ప్రభావం అంతా పోలీసుల ఆరోగ్యంపై వివిధ జబ్బుల రూపంలో చూపుతోంది. బీపీ, షుగర్‌తో మొదలై క్రమంగా పలు ప్రమాదకర జబ్బులకు దారితీస్తోంది. 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 21 వరకు ఆరోగ్య భద్రత అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం..6,347 మంది కేన్సర్ చికిత్స తీసుకున్నారు. రెండో స్థానంలో కిడ్నీ రోగులు ఉన్నారు. 4,922 మంది నెఫ్రాలజీ చికి త్స తీసుకున్నారు. యూరాలజీ సమస్యలతోనూ ఎక్కువ మందే బాధపడుతున్నారు. గుండె జబ్బుల కారణంగా 2,875 మంది ఆస్పత్రులపాలయ్యారు. మానసిక ఒత్తిడిసైతం అధికంగానే ఉంటోంది. కొన్నిసార్లు బీపీ పెరగడంతో న్యూరో సమస్యలు వస్తున్నాయి. న్యూరాలజీకి సంబంధించి 1,937 మంది చికిత్స పొందారు. వేతనం నుంచి కార్పస్ ఫండ్‌కు నిధులు ఆరోగ్య భద్రత కార్పస్ ఫండ్ కోసంకానిస్టేబుల్ నుంచి ఎస్సై ర్యాంకు వరకుకేటగిరీ–1 కింద నెలకు రూ.200 చొప్పున,ఇన్స్పెక్టర్ నుంచి డీజీపీ ర్యాంకు వరకుకేటగిరీ–2 కింద అధికారుల వేతనంలో నెలకు రూ.250 చొప్పున జమ చేస్తున్నారు. ఇలా పోలీస్‌శాఖలోని 68 వేల మంది సిబ్బంది నుంచి ఈ కార్పస్ ఫండ్ నిధులు జమ అవుతుంటాయి. కేన్సర్..లేదంటే కిడ్నీ సమస్యలతో పోలీసుల సతమతంసాక్షి, హైదరాబాద్: కేన్సర్..లేదంటే కిడ్నీ జబ్బుల బారిన పడే పోలీసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఐదేళ్ల గణాంకాలు పరిశీలిస్తే..ఈ విషయం స్పష్టమవుతోంది. పోలీస్‌శాఖలోని దాదాపు 40 శాతం మందికిపైగా సిబ్బందికి బీపీ, షుగర్ రావడం సర్వసాధారణంగా మారింది. పనిఒత్తిడి, సమయం తప్పిన ఆహారంతోనూ అనారోగ్య సమస్యలకు దారితీస్తోంది. పోలీస్ అధికారులు, సిబ్బంది..వారి కుటుంబీలకు ఆరోగ్య భద్రత పథకం కింద పలు నెట్వర్క్ ఆస్పత్రులలో వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్య భద్రత కింద 2019 నుంచి ఈ ఏడాది అక్టోబర్ 21 వరకు పోలీస్ అధికారులు, సిబ్బంది, మినిస్టీరియల్ సిబ్బంది కలిపి మొత్తం 1,04,014 మంది పలు రోగాలకు చికిత్సలు పొందారు. వీరి వైద్యం కోసం రూ.446.3 కోట్లు ఖర్చు చేశారు. పోలీస్ సిబ్బంది తల్లిదండ్రుల్లో 45,923 మంది చికిత్సకు రూ.318.03 కోట్లు ఖర్చు చేశారు. వైద్యంతోపాటు సిబ్బంది ఆరోగ్య పరిరక్షణలో భాగంగా తెలంగాణ పోలీస్‌శాఖ నుంచి ఆరోగ్య భద్రత కింద ప్రతి రెండేళ్లకు ఒకసారి ఉచిత ఆరోగ్యశిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు.ఓపీ పేషెంట్లకు సబ్సిడీ ధరలకే వైద్య పరీక్షలు చేసేలా రాష్ట్రవ్యాప్తంగా ఎనిమిది రకాల డయాగ్నొస్టిక్ సెంటర్లతో ఆరోగ్య భద్రత ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఆరోగ్య భద్రత కింద లబ్దిదారుల సంఖ్యతోపాటు వైద్యఖర్చులు పెరగడంతో ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం నుంచి రావా ల్సిన రీయింబర్స్మెంట్ నిధులు సైతం పేరుకుపోతున్నాయి. 2021 నుంచి రీయింబర్స్మెంట్ సకాలంలో జరగడం లేదు. దాదాపు రూ.200 కోట్ల వరకు ఆరోగ్య భద్రత నిధులు పెండింగ్ ఉండగా.. ఇటీవలే 30 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. రీయింబర్స్మెంట్ నిధుల పెండింగ్ కారణంగా కొన్ని సార్లు ఆస్పత్రులు వైద్యం అందించేందుకు ఇబ్బంది పెడుతున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఎప్పటికప్పుడు పోలీస్ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుంటూ సిబ్బందికి సకాలంలో వైద్యం అందేలా ఏర్పాట్లు చేస్తున్నారు.ఇవీ జబ్బులకు ప్రధాన కారణాలు» పోలీస్ అంటే 24 గంటలపాటువిధి నిర్వహణ తప్పని ఉద్యోగం.పోలీస్స్టేషన్లలో శాంతిభద్రతల విధులు మొదలు ఏ ప్రత్యేక బలగంలో ఉన్నా.. ఒత్తిడి తప్పనిసరి అవుతోంది. » ఎండ, వాన, చలి,దుమ్మూధూళి, కాలుష్యంఇలా పలు రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేయడం సైతం జబ్బులకు కారణమవుతోంది. » బందోబస్తు విధుల్లో ఉన్నా.. ట్రాఫిక్ విధుల్లో ఉన్నా..గంటల తరబడి నిలబడక తప్పని పరిస్థితి. » ఆహార నియమాలవిషయంలో శ్రద్ధ తీసుకోవాలని ఉన్నా.. తీసుకునేలా పరిస్థితులు లేకపోవడం సైతం అనారోగ్యానికి కారణం అవుతోంది. » శాంతిభద్రతల విధుల్లో ఒక్కోసారి తగినంత విశ్రాంతి తీసుకోవడం సాధ్యం కాని పరిస్థితులుఉండడం సైతం శారీరకశ్రమను పెంచుతోంది. -
సొరకాయతో లాభాలెన్నో, బరువు కూడా తగ్గొచ్చు
మనం తినే ఆహారంలో తీగజాతి, దుంప ఇలా అన్ని రకాల కూరలు, ఆకుకూరలను చేర్చుకోవాలి. ముఖ్యంగా వర్షాలు పడుతున్నాయి. దీంతో కూరగాయల తోటలు పచ్చగా కళకళలాడుతున్నాయి. బీర, సొరకాయలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. ఈరోజు సొరకాయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సొరకాయతో శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం.సొరకాయలో విటమిన్ బీ, విటమిన్ సీ, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, మాంగనీస్ వంటి ఎన్నో రకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో నీరు ,కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గడానికి బాగా పనిచేస్తుంది. ఎండాకాలంలో అయితే శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి సొరకాయ ఎంతగానో సహాయపడుతు సొరకాయతో పప్పు చట్నీ, సాంబార్, కర్రీ, ఇలా ఎన్నో వంటలను చేసి తినొచ్చు. ఇంకా సూప్‌లు లేదా స్మూతీ వంటి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. సొరకాయ జ్యూస్ న్యాచురల్ క్లెన్సర్‌గా పనిచేస్తుంది.సొరకాయతో ప్రయోజనాలురక్తపోటు నియంత్రణలో ఉంటుంది. సొరకాయలో మెండుగా ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు చాలా మంచిది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతుంది.సొరకాయతో గుండె ఆరోగ్యంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉన్న ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. సొరకాయలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరానికి శక్తినిస్తుంది. మెగ్నీషియంతో కండరాలు బలపడతాయి. కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి కూడా సొరకాయ సహాయపడుతుంది. సొరకాయలో కూడా విటమిన్ సీి మెండుగా ఉంటుంది. ఎన్నో అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు, ఇతర రోగాలను అడ్డుకుంటుంది. -
పార్టనర్‌కి బీపీ ఉంటే..వచ్చే అవకాశం ఉందా..?
బీపీ, ఘుగర్ వంటి వ్యాధులు ఒకరి నుంచి మరొకరకి సంక్రమించే వ్యాధులు కాకపోయినప్పటికీ భార్యభర్తలో ఎవరో ఒకరికి ఉంటే మరొకరికి ఆటోమెటిక్‌గా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. భాగస్వామికి గనుకు రక్తపోటు ఉంటే..సదరు వ్యక్తిని కూడా కచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. నిపుణులు జరిపిన తాజా అధ్యయనాల్లో ఇది నిర్థారణ అయ్యింది కూడా. చైనా, ఇంగ్లండ్, భారత్, అమెరికా వంటి దేశాల్లోని జంటలపై చేసిన పరిశోధనలో అధిక బిపీ ఉన్న పురుషులను చేసుకున్న స్త్రీలు కూడా రక్తపోటుకి గురవ్వుతున్నట్లు గమనించారు. భాగస్వామి నుంచి రక్తపోటు నేరుగా సంక్రమించకపోయినా పరోక్షంగా ఇది వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. నిజానికి ఈ రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్‌తో సహా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇది తీసుకునే ఆహారం, జీవనశైలి, ఒత్తిడి తదితర కారకాలచే ప్రభావితమవుతుందని వివరించారు నిపుణులు. భాగస్వామి ఎదుర్కొంటున్న రక్తపోటు, ఒత్తిడి అనేవి వారితో కలిసి జీవిస్తున్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. వారికేమవుతుందన్న ఆందోళన వారిని ఒత్తిడికి గురయ్యేలా చేస్తుంది. దీన్ని 'సంరక్షకుల ఒత్తిడిగా' పేర్కొనవచ్చని అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఎంత సేపు తమ భాగస్వామికి ఏమవుతుందనే అప్రమత్తత వారిలో తెలియని ఒత్తిడిని కలుగ చేసి, ఆందోళనకు గురి అయ్యేలా చేస్తుంది. దీంతో క్రమేణ వారు కూడా ఈ బీపీ బారినపడతారని వివరించారు. అందుకు దారితీసే కారణాలు..జీవనశైలి..జంటలు తరుచుగా జీవనశైలి అలవాట్లను పంచుకుంటారు. ఇవి రక్తపోటులో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఇద్దరిలో ఎవరో ఒకరు అనారోగ్యకరమైన జీవనశైలి ఫాలో అయితే అది మరొకరిని ఆటోమేటిగ్గా ప్రభావితం చేస్తుంది. భావోద్వేగ కోణం..తనకు ఇష్టమైన వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళన చెందడం భావోద్వేగ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ఆందోళన ఒత్తడికి దారితీసి రక్తపోటు వచ్చేందుకు కారణమవుతుంది. అంతేగాదు భాగస్వామి ఆరోగ్యం పట్ల ఆందోళన కారణంగా చాలా మానసిక ఒత్తిడికి లోనవ్వుతారు. దీని వల్ల కలిగే అపార్థాలు లేదా సంఘర్షణలు ఇద్దరి మధ్య కమ్యూనికేషన్‌కి అంతరాయం ఏర్పడి భావోద్వేగానికి గురవ్వడం జరుగుతుంది. ఒకరకంగా మానసికంగా కుంగిబాటుకు గురయ్యి వారు కూడా ఈ దీర్ఘకాలిక వ్యాధి బారిన పడతారని చెబుతున్నారు నిపుణులు.ఏం చేయాలంటే..ఆరోగ్యకరమైన రీతీలో రక్తపోటుని మెరుగ్గా నిర్వహించాలంటే జంటలు పాటించాల్సినవి ఇవే..రోజూవారిగా తీసుకోవాల్సిన పరిమాణంలో ఉప్పు తీసుకోవడం, సమతుల్య ఆహారాన్ని నిర్వహించడంశారీరక కార్యకలాపాల్లో కలిసి పనిచేయడంధూమపానం, మధ్యపానం మానుకోవడంఅనారోగ్యకరమైన ఆహారాన్ని తినకుండా ఉండటంయోగా, ధ్యానం కలిసి సాధన చేయడంపుస్తకాలు చదవడం లేదా కలిసి సంగీతం వినడంఆరోగ్యకరమైన జీవనశైలితో ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటే ఈ రక్తపోటు నుంచి సులభంగా బయటపడొచ్చు. ఆరోగ్యంగా నిండు నూరేళ్ల జీవితాన్ని ఆస్వాధించగలుగుతారు భార్యభర్తలు.(చదవండి: ఉల్లిపాయలు తీసుకోకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయంటే..!) -
రక్తం, గుండె..: ఈ వైద్య లెక్కల్ని ఎపుడైనా గమనించారా!
‘ఆరోగ్యమే..మహాభాగ్యం’ ఈ భాగ్యాన్ని దక్కించుకునేందుకు అందరూ కష్టపడుతూ ఉంటారు. చక్కటి జీవనశైలి, సమతుల ఆహారం, ఒత్తిడి, ఆందోళన జీవితం కోసం ఆరాట పడతారు. అయితే మానవ శరీర ఆరోగ్యానికి కావాల్సిన ప్రామాణికాలు ఏంటి? ఈ విషయంలో పురుషులకు, స్త్రీలకు మధ్య తేడా ఉంటుందా? మనిషి పల్స్ రేటు, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, ఊపిరి వేగం, బరువు ఈ ఐదింటిని ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంచి ఆరోగ్యం అనేది పూర్తి శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు స్థితి. ఆరోగ్యం అంటే బలమైన రోగనిరోధకశక్తి, ఆహారం, అరుగుదల, రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర, ఎలాంటి అనారోగ్యం, ఆందోళన, ఒత్తిడి, శారీరక బాధలు లేని ప్రశాంతమైన జీవితం. స్త్రీలైనా, పురుషులైనా ఏవో కొన్ని తప్ప దాదాపు ఇవే ప్రమాణికాలు వర్తిస్తాయి. అదే మహిళల్లో అదనంగా రుతు సమస్యలు, గర్భధారణ సమస్యలు లేకుండా ఉండటం కూడా చాలా కీలకం.ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన వైద్య ప్రామాణికాలురక్తపోటు 120/80 ఉండాలి. పల్స్ 70-100 ఉండాలి. ఉష్ణోగ్రత 36.8-37 ఉండాలి.శ్వాసక్రియ రేటు 12-16 ఉండాలి. పురుషుల్లో హిమోగ్లోబిన్ 13.5-18 వరకు, అదే స్త్రీలలో అయితే 11.50-16 ఉండాలి.కొలెస్ట్రాల్ 130-200, పొటాషియం 3.5-5, సోడియం 135-145 ఉండాలి.ట్రై గ్లిజరైడ్స్ 220 లోపు ఉండాలి. శరీరంలో రక్తం పరిమాణం 5-6 లీటర్లు ఉండాలి.షుగర్ తినక ముందు పిల్లలకు 70-130, పెద్దలకు 70-110 మధ్య ఉండాలి.ఐరన్ 8-15 మి.గ్రా. ఉండాలి.తెల్ల రక్త కణాలు 4000-11000, ప్లేట్లెట్స్ 1.50 లక్షల నుంచి 4 లక్షలుఎర్ర రక్త కణాలు 4.5 - 6 మిలియన్లు ఉండాలి.క్యాల్షియం 8.6-10.3, విటమిన్ డీ-3 స్థాయి 20-511, విటమిన్ బి12 లెవల్స్ 200-900 వరకు ఉండాలి. -
పెయిన్‌కిల్లర్స్ అబ్యూజ్..! పెయిన్ తగ్గించడమా? ప్రాణసంకటమా?
మోకాళ్లూ, వెన్నుపూసల అరుగుదలకు కారణమయ్యే ఆర్థరైటిస్, స్పాండిలోసిస్ వంటి సమస్యలూ, కొన్ని ఇన్ఫెక్షన్ల తర్వాత కలిగే బాధలూ, నొక్కుకుపోయే నరాలతో కలిగే నొప్పుల తీవ్రత వర్ణించడానికి అలవి కాదు. భరించలేని నొప్పి కలుగుతుంటే ఒకే ఒక మాత్ర వేయగానే ఉపశమనంతో కలిగే హాయి కూడా అంతా ఇంతా కాదు. అందుకే నొప్పి నివారణ మాత్రలకు కొందరు అలవాటు పడతారు. పెయిన్ కిల్లర్స్ అదేపనిగా వాడితే మూత్రపిండాలు దెబ్బతినడంతో పాటు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. వాటి గురించి తెలుసుకుని, పెయిన్ కిల్లర్స్‌ను విచక్షణతో వాడాలనే అవగాహన కోసం ఈ కథనం.భరించలేనంత నొప్పి తీవ్రమైన బాధను కలగజేస్తుంది. ఆ నొప్పిని తగ్గించే మందును అదేపనిగా వాడుతూ ఉంటే అంతకు మించిన కీడు తెచ్చిపెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కొందరు మొదటిసారి డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు రాసిచ్చిన మందుల్ని పదే పదే వేసుకుంటూ ఉంటారు. దాంతో కొంతకాలానికి కొన్ని అనర్థాలు రావచ్చంటూ హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.నొప్పి నివారణ మందులతో కలిగే దుష్పరిణామాలు... పొట్టలోపలి పొరలపైన : నొప్పి నివారణ మందులు వేసుకోగానే కడుపు లోపలి పొరలపై మందు దుష్ప్రభావం పడవచ్చు. దాంతో కడుపులో గడబిడ (స్టమక్ అప్సెట్), వికారం, ఛాతీలో మంట, కొన్నిసార్లు నీళ్లవిరేచనాలు లేదా మలబద్దకం వంటివి కలగవచ్చు. నొప్పినివారణ మందుల వాడకం దీర్ఘకాలం పాటు కొనసాగితే పొట్టలోకి తెరచుకునే సన్నటి రక్తనాళాల చివరలతో పాటు కడుపులోని పొరలు దెబ్బతినడం వల్ల కడుపులో పుండ్లు (స్టమక్ అల్సర్స్) రావచ్చు.అందుకే నొప్పి నివారణ మాత్రలను పరగడపున వేసుకోవద్దని డాక్టర్లు స్పష్టంగా చెబుతారు. ముందుగా కడుపులో రక్షణ పొరను ఏర్పరచే పాంట్రపొజాల్ వంటి మందులను పరగడపున వాడాక లేదా ఏదైనా తిన్న తర్వాతనే పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలని డాక్టర్లు సూచిస్తుంటారు.హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో: హైబీపీతో బాధపడే కొందరిలో పెయిన్ కిల్లర్స్ వల్ల రక్తపోటు మరింత పెరగడంతో ప్రధాన రక్తనాళాల చివరన ఉండే అతి సన్నటి రక్తనాళాలు దెబ్బతినే ప్రమాదముంటుంది. దాంతో గుండె పనితీరుపై ఒత్తిడి పెరగడం కారణంగా గుండెజబ్బులు రావచ్చు.కాలేయంపై దుష్ప్రభావం: ఒంటిలోకి చేరే ప్రతి పదార్థంలోని విషాలను (టాక్సిన్స్‌ను) మొదట విరిచేసి, వాటిని వేరుచేసేది కాలేయమే. ఆ తర్వాత వడపోత ప్రక్రియ మూత్రపిండాల సహాయంతో జరుగుతుంది. అందుకే ఒంటిలోకి చేరగానే పెయిన్ కిల్లర్స్ దుష్ప్రభావం తొలుత కాలేయం మీదే పడుతుంది.కిడ్నీలపైన: కడుపులోకి చేరే అన్ని రకాల పదార్థాలు రక్తంలో కలిశాక వాటిని వడపోసే ప్రక్రియను మూత్రపిండాలు నిర్వహిస్తాయి. దాంతో పెయిన్‌కిల్లర్ టాబ్లెట్స్లోని హానికర విషపదార్థాల ప్రభావాలు వడపోత సమయంలో మూత్రపిండాలపైన నేరుగా పడతాయి. అందుకే పెయిన్‌కిల్లర్స్ దుష్ప్రభావాలు కిడ్నీలపైనే ఎక్కువ. ఆ కారణంగానే... మిగతా దుష్ప్రభావాలతో పోలిస్తే... పెయిన్ కిల్లర్స్ కిడ్నీలను దెబ్బతీస్తాయనే అవగాహన చాలామందిలో ఎక్కువ.నొప్పినివారణ మందులు అతి సన్నటి రక్తనాళాలను దెబ్బతీసే ప్రమాదం ఉన్నందునా... అలాగే రక్తాన్ని వడపోసే అతి సన్నటి రక్తనాళాల చివర్లు కిడ్నీలో ఉన్న కారణాన ఇవి దెబ్బతినే ప్రమాదం ఎక్కువ. రక్తం వడపోత కార్యక్రమం పూర్తిగా సజావుగా జరగాలంటే కిడ్నీల సామర్థ్యంలో కనీసం 30 శాతమైన సరిగా పనిచేయడం తప్పనిసరి.నొప్పి నివారణ మందులు కిడ్నీల సామర్థ్యాన్ని దెబ్బతీయడం వల్ల ‘ఎనాల్జిసిక్ నెఫ్రోపతి’ అనే జబ్బుతో పాటు దీర్ఘకాలిక వాడకం ‘క్రానిక్ కిడ్నీ డిసీజ్–సీకేడీ’కి దారితీసే ప్రమాదం ఉంది. అయితే కిడ్నీలు దెబ్బతింటూ పోతున్నా, వాటి పనితీరు మందగించే వరకు ఆ విషయమే బాధితుల ఎరుకలోకి రాదు.రక్తం పైన: ఏ మందు తీసుకున్నా అది అన్ని అవయవాలకు చేరి, తన ప్రభావం చూపడానికి ముందర రక్తంలో ఇంకడం తప్పనిసరి. అప్పుడు రక్తం గడ్డకట్టడానికి ఉపయోగపడే ప్లేట్‌లెట్స్‌పై దుష్ప్రభావం పడినప్పుడు కోయాగ్యులోపతి వంటి ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.చివరగా... తీవ్రమైన నొప్పిని కలిగించే ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్, కొన్ని రకాల క్యాన్సర్లు, స్పాండిలోసిస్ వంటì వ్యాధుల చికిత్సల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఔషధాల తయారీలోనూ గణనీయమైన పురోగతి కారణంగా గతం కంటే మెరుగైన, తక్కువ సైడ్ఎఫెక్ట్స్ ఉన్న మందులు అందుబాటులోకి వచ్చాయి.వీటితో ఉపశమనం మరింత త్వరితం. దుష్ప్రభావాలూ తక్కువే. అందుకే డాక్టర్లు అప్పుడెప్పుడో రాసిన మందుల చీటీలోని నొప్పి నివారణ మాత్రలను వాడకుండా మరోసారి డాక్టర్‌ను సంప్రదించాలి. దాంతో నొప్పి తగ్గడంతో పాటు దేహంలోని అనేక కీలకమైన అవయవాలను రక్షించుకోవడమూ సాధ్యపడుతుంది.దుష్ప్రభావాల లక్షణాలూ లేదా సూచనలివి...– ఆకలి లేకపోవడం లేదా అకస్మాత్తుగా బరువు పెరగడం, మలం నల్లగా రావడం, తీవ్రమైన కడుపునొప్పి నొప్పితో మూత్ర విసర్జన జరగడం లేదా మూత్రం చిక్కగా లేదా ఏ రంగూ లేకుండా ఉండటం – చూపు లేదా వినికిడి సమస్య రావడం ∙వీటిల్లో ఏది కనిపించినా వెంటనే డాక్టర్‌ను సంప్రదించి తాము వాడుతున్న నొప్పి నివారణ మందుల వివరాలు, తమ లక్షణాలను డాక్టర్‌కు తెలపాలి.దుష్ప్రభావాలను తగ్గించే కొన్ని జాగ్రత్తలివి...నొప్పి నివారణ మందులు వాడాల్సి వచ్చినప్పుడు వాటి దుష్పరిణామాలను వీలైనంతగా తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలంటూ డాక్టర్లు సూచిస్తుంటారు. అవి... – పరగడుపున నొప్పి నివారణ మందుల్ని వాడకూడదు. – అవి వేసుకున్న తర్వాత మామూలు కంటే కాస్త ఎక్కువ నీరు తాగడం మేలు. – కొన్ని రోజులు వాడాక నొప్పి తగ్గకపోతే మళ్లీ డాక్టర్ సలహా తర్వాతే వాటిని కొనసాగించాలి. – పెయిన్ కిల్లర్స్ వాడేవారు డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటూ తరచూ మూత్రపిండాలు, బీపీ, గుండె పనితీరును తరచూ పరీక్షింపజేసుకుంటూ ఉండాలి.ఇవి చదవండి: కిడ్నీ వ్యాధిని జయించాడు -
సెల్‌ఫోన్‌తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్ – డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో రక్తపోటు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82 శాతం మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్‌లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలని సూచిస్తున్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12 శాతం ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్‌ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్‌ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్‌ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్‌పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
బీపీతో హార్ట్ఎటాక్
సాక్షి, హైదరాబాద్: బీపీతో గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. భారత్‌లో ఏటా అధిక రక్తప్రసరణతో వచ్చే గుండెపోటు, పక్షవాతంతో 16 లక్షల మంది చనిపోతున్నారు. ప్రపంచంలో సంభవించే మరణాలకు మొదటి ప్రధాన కారణం బీపీ ఎక్కువగా ఉండటమే. రెండో కారణం శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, మూడోది డయేరియా, నాలుగోది ఎయిడ్స్, ఐదోది టీబీ, ఆరోది మలేరియా అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎంఆర్), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఉమ్మడి నివేదిక తేలి్చచెప్పింది. ఆయా సంస్థలు బీపీని కట్టడి చేసే విధానంపై నివేదిక రూపొందించాయి.2017లో ప్రారంభమైన ఇండియన్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్ (ఐహెచ్‌సీఐ)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ కొనియాడింది. 2025 నాటికి దేశంలో బీపీ రోగుల సంఖ్యను 25 శాతం తగ్గించాలని నిర్ణయించింది. ఐహెచ్‌సీఐ కార్యక్రమాన్ని ఈ మూడు సంస్థలు సంయుక్తంగా చేపట్టాయి. 25 రాష్ట్రాల్లోని 141 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. 21,579 ఆరోగ్య కేంద్రాల్లో 30 కోట్ల మందిని ఈ కార్యక్రమం పరిధిలోకి వచ్చారు. 19 రాష్ట్రాల్లో బీపీ నియంత్రణ ప్రొటోకాల్ తయారుచేశారు. ఈ కార్యక్రమం మొదటి దశ తెలంగాణ, పంజాబ్, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ప్రారంభమైంది.18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ... భారత్‌లో 18 ఏళ్లు పైబడిన ప్రతీ నలుగురిలో ఒకరికి బీపీ ఉంది. అలా 20 కోట్ల మంది బీపీతో బాధపడుతున్నారు. అందులో సగం మందికి బీపీ ఉన్నట్లే తెలియదు. కేవలం 10 శాతం మందే బీపీని అదుపులో ఉంచుకుంటున్నారు. 18 ఏళ్లు పైబడిన ప్రతీ ఒక్కరికీ బీపీ చెక్ చేయాలని ఆ నివేదిక పేర్కొంది. 2025 నాటికి 4.5 కోట్ల మంది బీపీని అదుపులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నివేదికలోని ముఖ్యాంశాలు... ⇒ ఐహెచ్‌సీఐ కార్యక్రమం అమలయ్యే చోట నర్సులు, డాక్టర్లు ప్రత్యేకంగా ఉంటారు. అయితే, తెలంగాణ, మహారాష్ట్రల్లో మాత్రమే ప్రత్యేకంగా ఉన్నారు. ⇒ తెలంగాణలో ఈ విధానం అమలులో ఉన్నందున ఏఎన్ఎంలు ఇళ్లకు వెళ్లి బీపీ చెక్ చేస్తున్నారు. ఫోన్ ద్వారా కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ⇒ ఈ కార్యక్రమం కోసం సగటున ఒక వ్యక్తికి ఏడాదికి రూ. 200 మాత్రమే మందుల కోసం ఖర్చవుతుంది. ⇒ బాధితులు ప్రొటోకాల్‌లో ఉన్న మందులను ఒక నెల అడ్వాన్స్‌లో ఉంచుకోవాలి. ⇒ తెలంగాణ, పంజాబ్, మధ్యప్రదేశ్‌లలో 6 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయి. కేరళలో నెల రోజులు, మహారాష్ట్రలో 2 నెలల స్టాక్ ఉంది. బీపీ రోగులు వ్యాయామం చేయాలి బీపీ రోగులు పొగాకు, మద్యం మానుకోవాలి. ఉప్పు ఒక స్పూన్కు తగ్గించుకోవాలి. ప్రతీ వారం రెండున్నర గంటల వ్యాయామం చేయాలి. రోజుకు నాలుగైదు సార్లు పండ్లు, కూరగాయలు తినాలి. తెలంగాణలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ బీపీ చెక్ చేయాలన్న నియమం పెట్టుకున్నారు. కొన్ని రాష్ట్రాల్లో 30 ఏళ్లు పైబడిన వారికే బీపీ చూస్తారు. బీపీ ఉంటే ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దు. మందులు తప్పనిసరిగా వాడాలి. –డాక్టర్ కిరణ్ మాదల, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ బోధనా వైద్యుల సంఘం -
డైట్లో ఇది చేర్చుకుంటే..మందులతో పనిలేకుండానే బీపీ మాయం!
డైట్ల ఫైబర్ కంటెంట్ ఉన్న ఆహారపదార్థాలను చేర్చుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయ్యింది. ఫైబర్ కంటెంట్ ఉన్న పదార్థాలు తీసుకుంటే..శరీరానికి ఉపయోగపడే గట్ బ్యాక్టీరియా అందిస్తుంది. అలాగే గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి ప్రమాదాలను తగ్గిస్తుందని పరిశోధన పేర్కొంది. అంతేగాదు ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు ఎలా రక్తపోటుని తగ్గిస్తాయో సవివరంగా పేర్కోంది. ఏం చెబుతోందంటే.. మోనాష్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన అధ్యయనంలో మహిళలు, పురుషులు బీపీని తగ్గించడానికి తినాల్సిన డైటరీ ఫైబర్(ఎక్కువ ఫైబర్ ఉన్నవి) కొద్ది మొత్తంలో అందించారు. ఇలా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉన్న పదార్థాలు తిన్న వారిలో రక్తపోటు తగ్గడమే గాక హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు తేలింది. మందులతో సంబంధంల లేకుండా బీపీ గణనీయంగా తగ్గడం గుర్తించామనని అన్నారు పరిశోధకులు. అంతేగాదు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ బీపీ ఎక్కువ ఉన్న మహిళలు ఉదాహరణకు 140/90 mmHg లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారికి రోజుకి సుమారు 28% పైబర్ తీసుకోవాలని సూచించింది. అదే పురుషులకైతే రోజుకి 38 గ్రాముల వరకు తీసుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల ప్రతి అదనపు 5 గ్రా సిస్టోలిక్ బీపీ 2.8 mmHgకి, డయాస్టోలిక్ బీపీ 2.1 mmHgకి తగ్గుతుందని అంచనా వేసింది. ఈ పైబర్ కంటెంట్ ముఖ్యంగా శరీరానికి అత్యంత అవసరమైన గట్ మైక్రోబయోమ్‌ని అందించి తద్వారా బీపీకి దోహదపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూన్ రెగ్యులేటరీ యాసిడీలను ఉత్పత్తి చేసేలా అనుమతిస్తుందని తెలిపారు. ఈ అధ్యయనం హైపర్ టెన్షన్ మేనేజ్మెంట్ కోసం డైటరీ ఫైబర్‌కి ప్రాధాన్యత ఇవ్వడం గురించి హైలెట్ చేసిందని పరిశోధకుడు మార్క్స్ చెప్పారు. తాము రోగులకు ట్రీట్మెంట్లో భాగంగా అధిక ఫైబర్ ఉన్న పదార్థాలను ఇచ్చాక రక్తపోటు తగ్గి హృదయ నాళాలను మెరుగ్గా ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా పాశ్చాత్యుల ఆహారంలో పుష్కలంగా పీచు పదార్థాలు ఉండవని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎస్ఎఫ్) పేర్కొంది. అలాగే పెద్దలు సగటు ఆహారంలో కనీసం 15 గ్రాముల చొప్పున ఫైబర్ తీసుకోవాలని పేర్కొంది. ఇక్కడ ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేందుకు ఈ సింపుల్ చిట్కాలు ఫాలోకండి సాధారణ నియమంగా, ప్రతి భోజనంలో కనీసం ఒక తృణధాన్యాలు (ఉదా., బియ్యం, మొక్కజొన్న, ఓట్స్, క్వినోవా, బుల్గుర్) చేర్చండి హోల్‌గ్రెయిన్ బ్రెడ్‌ను ఎంచుకోండి (ఒక స్లైస్‌లో అత్యధిక మొత్తంలో పీచు ఉంటుంది) తెల్ల బియ్యంతో కాకుండా బ్రౌన్ రైస్‌తో ఉడికించాలి సలాడ్లకు బీన్స్ జోడించండి - దీనిలో ప్రతి ½ కప్పు సర్వింగ్‌లో 7 నుంచి 8 గ్రా ఫైబర్ ఉంటుంది వారానికి రెండు లేదా మూడు సార్లు, సూప్‌లు, కూరలు వంటి వాటిలో మాంసానికి బదులుగా చిక్కుళ్ళు (ఉదా., పప్పులు, బఠానీలు, బీన్స్, చిక్పీస్, వేరుశెనగలు) వేయండి. రోజుకు కనీసం ఐదు పండ్లు లేదా కూరగాయలను తినే యత్నం చేయండి తృణధాన్యాలకు పండ్లను జోడించడం మరింత మంచిది. పండ్ల రసాల కంటే పండు పలంగా తినడానికే ప్రయత్నించండి. ఇలా చేస్తే శరీరానికి అవసరమయ్య ఫైబర్ అంది రక్తపోటుని నియంత్రణలో ఉంచుతుంది లేదా మందుల అవసరం లేకుండానే రక్తపోటు తగ్గిపోవడం జరుగుతుంది. (చదవండి: పప్పు మంచిదని తినేస్తున్నారా..?ఐతే వీళ్లు మాత్రం..) -
జంట జబ్బులను జయిస్తున్నారు
సాక్షి, అమరావతి: ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ దేశంలోనే మిన్నగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఫ్యామిలీ డాక్టర్ విధానం, వైఎస్సార్ విలేజ్ క్లినిక్‌లు, జగనన్న ఆరోగ్య సురక్ష లాంటి విప్లవాత్మక కార్యక్రమాల ద్వారా ప్రజల వద్దకే వైద్య సేవలను చేరువ చేసి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరిస్తోంది. ఈ క్రమంలో జంట జబ్బులైన మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) బాధితుల్లో 84% మందిపై వైద్య పర్యవేక్షణ ఉంచి, వారిలో జబ్బులు అదుపులో ఉండేలా కాలానుగుణంగా మందులు అందిస్తూ..ఇతర చికిత్సలు చేపడుతూ దేశంలోనే తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ విషయాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా వీరిలో 24% (1.81 కోట్ల మంది) మాత్రమే వైద్య సంరక్షణలో ఉన్నారు. ఏపీ తర్వాత గోవాలో మొత్తం బాధితుల్లో 80% మంది, మధ్యప్రదేశ్‌లో 60% మంది వైద్య సంరక్షణలో ఉన్నట్లు పేర్కొంది. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో 37.51 లక్షల మంది జంట జబ్బుల బాధితులు ఉండగా..వీరిలో 31.44 లక్షల మంది వైద్య సేవలు పొందుతున్నట్లు కేంద్రం తెలిపింది. ప్రమాదకర జబ్బుల బారినపడకుండా... దేశంలో మధుమేహం, రక్తపోటు, ఇతర దీర్ఘకాలిక జబ్బుల కారణంగా 64.9% మరణాలు సంభవిస్తున్నాయి. ఈ సమస్యలున్న బాధితులు క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ, పరీక్షలు చేయించుకుని, మందులు సక్రమంగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర జబ్బుల బారినపడే అవకాశాలున్నాయి. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేయడమే 20% పక్షవాతం కేసులకు ప్రధాన కారణమని వైద్యులు చెబుతుంటారు. అలాగే, గుండె, మెదడు సంబంధిత జబ్బుల బారినపడే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తుంటారు. మధుమేహాన్ని నిర్లక్ష్యం చేస్తే కిడ్నీ, ఇతర తీవ్రమైన సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతుంటారు. ఈ క్రమంలో ప్రజలకు మెరుగైన వైద్య సంరక్షణ అందించేలా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రవేశపెట్టారు. ఈ విధానంలో పీహెచ్సీ వైద్యులు నెలలో 2 రోజులు తమ పరిధిలోని అన్ని గ్రామాలను సందర్శిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రత్యేకంగా యాప్ రూపొందించి సచివాలయాల వారీగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల వివరాలను మ్యాప్ చేసి వారికి సక్రమంగా వైద్య సేవలు అందుతున్నాయో లేదో, మందులు ఇస్తున్నారో లేదో పర్యవేక్షిస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి ప్రజల ఆరోగ్య సమస్యలు గుర్తించి వాటిని పరిష్కరించే లక్ష్యంతో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం అమలు చేస్తున్నారు. ప్రత్యేకంగా డ్యాష్ బోర్డ్ ఎన్సీడీ బాధితులకు ఫాలో అప్ వైద్య సేవల పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా ఒక డ్యాష్ బోర్డ్‌ను వైద్య శాఖ ఏర్పాటు చేసింది. డ్యాష్ బోర్డు ద్వారా ఫలానా గ్రామానికి వైద్యుడు వెళ్లినప్పుడు ఆ గ్రామంలో బాధితులందరికీ వైద్యం చేశాడో లేదో పర్యవేక్షిస్తున్నారు. వైద్యులు గ్రామానికి రాని రోజుల్లో విలేజ్ క్లినిక్స్‌లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన సీహెచ్‌వోలు బాధితులకు వైద్యం అందిస్తున్నారు. క్లినిక్స్‌లో టెలీమెడిసిన్ సౌకర్యం ఉండటంతో అవసరమున్న సందర్భాల్లో హబ్‌లోని స్పెషాలిటీ వైద్యుడితో మాట్లాడించి వైద్య సేవలు అందిస్తున్నారు. -
హైబీపీతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు మృతి
కల్వకుర్తి టౌన్: విధి నిర్వాహణలో పోలీస్‌స్టేషన్ వాచ్ ఇన్చార్జి కుప్పకూలి పడిపోయి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం కల్వకుర్తిలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ వివరాల ప్రకారం.. పట్టణ పోలీస్‌స్టేషన్‌లో మూడు నెలల క్రితం డ్యూటీలో చేరిన శ్రీనివాస్ (51) వాచ్ ఇన్చార్జిగా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 9గంటల సమయంలో విధుల్లో ఉన్న ఆయనకు బీపీ తగ్గడంతో కిందపడిపోయాడు. వెంటనే అతన్ని కల్వకుర్తి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువ అయినట్లు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని శ్రీనివాస్ స్వస్థలం నాగర్‌కర్నూల్ మండలం తూడుకుర్తికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. అయనకు భార్య, కూతురు ఉంది. పోలీసుల నివాళి డ్యూటీలో శ్రీనివాస్ చాలా నిబద్ధతో పనిచేసే వాడని కల్వకుర్తి డీఎస్పీ పార్థసారథి తెలిపారు. శ్రీనివాస్ చిత్రపటానికి సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిసిపూలమాలలు వేసి నివాళులు అరి్పంచారు. బాధిత కుటుంబాన్ని డిపార్టుమెంట్ తరుపున ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో సీఐ ఆంజనేయులు, ఎస్ఐలు రమేష్, రాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
బీపీని కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? రోజూ మాత్రలు వేసుకోనవసరం లేదా..?
ఇప్పుడు ఎవర్నీ కదలించినా బీపీ ఉందని చెబుతుంటారు. నిజానికి అంతమందికి బీపీ ఉందా? కరెక్ట్‌గానే వైద్యులు చెక్ చేస్తున్నారా?. అస్సలు బీపీకి ప్రతి రోజు మాత్రలు వేసుకోవాల్సిందేనా? అధ్యయనాలు ఏం చెబుతున్నాయి తదితరాల గురించే ఈ కథనం!. రక్తపోటు లేదా బీపీ అనేది సర్వసాధారణమైన వ్యాధిలా అయిపోయింది. దేని గురించి అయినా ఆస్పత్రికి వెళ్తే..ముందుగా బీపీ చెక్ చేయడం కామన్ కూడా. నిజంగా కరెక్ట్‌గానే చెక్ చేస్తున్నారా? అంటే?. అదంతా అవాస్తమనే చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. ఏటా 10 లక్షల మందికిపైగా అధిక రక్తపోటు ఉందని నిర్థారణ అవుతోంది. కానీ ఇదంతా వాస్తవం కాదని, వేలాది మందికిపైగా బీపీని తప్పుగా నిర్ధారణ అవుతున్నట్లు కొలంబస్‌లోని ఒహియో స్టేట్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ మేరకు కొలంబస్‌లోని ఒహియా యూనివర్సిటీ పరిశోధకులు అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అండ్ అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజిస్ట్‌లతో కలసి జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ బీపీ పరీక్షలు చాలా తప్పు విధానంలో నిర్వహిస్తున్నట్లు పరిశోధనల్లో తేలింది. అందుకోసం ఒహియో పరిశోధకులు దాదాపు 150 సముహాల వారిగా పెద్దవాళ్లను తీసుకుని జరిపిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. రోగిని ఆమోదయోగ్యమైన కూర్చిలో కూర్చొబెట్టి గుండె స్థానానికి సమాంతర స్థాయిలో చేయిని ఉంచి రీడింగ్‌ని తీసుకోవాలి కానీ అలా జరగడం లేదని పరిశోధనల్లో తేలింది. చాలమంది పేషెంట్లకు తప్పుగా బీపీని రికార్డు చేస్తున్నారని. ఇది అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఒకవేళ పేషెంట్‌కి బీపీ నార్మల్‌గా ఉన్నా..ట్యాబ్లెట్లు ఇస్తే అది అధిక రక్తపోటుకి లేదా వివిధ దుష్ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. తమ అధ్యయనంలో చాలామందికి తప్పుగా బీపీని గుర్తించారని, పైగా అధికంగా మందులను కూడా వైద్యులు సూచించినట్లు వెల్లడైందని పరిశోధకులు తెలిపారు. ఈ కారణాల వల్లే యూఎస్‌లో దాదాపు సగం మందికి పైగా పెద్దలు అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. చాలావరకు బీపీకి మందులను కూడా విపరీతంగా వాడాల్సిన అవసరం లేకుండా ఆరోగ్యకరమైన రీతిలో తగ్గించుకోవచ్చని తెలిపారు పరిశోధకుఉల. తప్పుగా బీపీని రికార్డు చేయడం, దీనికి తోడు మందులను వాడించటం వల్ల చాలమంది ప్రజలు వివిధ రకాల అనారోగ్యాల బారిన పడుతున్నట్ల తెలిపారు. ఇక మందులు బీపీకి అదేపనిగా వాడాల్సిన అవసరం లేదా? విరామం ఇవ్వొచ్చా అంటే? అంతలా అవసరం లేదనే చెబుతున్నాయి అధ్యయనాలు. అంతేగాదు త్వరలో కంటిన్యూగా మందులు వాడాలసిన అవసరం లేకుండానే సరికొత్త ఔషధాన్ని అందుబాటులోకి తేనట్లు కూడా చెప్పుకొచ్చారు. బీపీకి రోజూ మందులు వేసుకోనక్కర్లేదా? బీపీ అనేది దీర్ఘకాలిక వ్యాధి. దీనికి ప్రతిరోజు టెన్షన్‌గా ఓ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే అందరికీ తెసిందే. అందులోనూ హైబీపీ అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. రోజూకి కనీసం ఒకటి నుంచి రెండు ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిందే. కానీ పరిశోధకులు కనిపెట్టిన ఈ కొత్త రకం ఔషధం 'జిలేబేసిరాన్' ఆ సమస్యలన్నింటికి చెక్ పెడుతుందట. కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు హైబీపీని సమర్ధవంతంగా నియంత్రించడమే గాక ప్రభావంతంగా పనిచేస్తుంది. దీని వల్ల తరుచుగా మందులు వేసుకోవడం, దాని వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల నుంచి రోగులకు ఉపశమనం లభించినట్లు అవుతుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ రక్తపోటు అదుపులో లేకపోతే రోగులు స్ట్రోక్, గుండెపోటు లేదా హృదయనాళాలకు సంబంధిత రుగ్మతల బారినపడి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల పేషెంట్లు బీపీ ట్యాబ్లెట్న్ కంప్లసరీ తమ పక్కనే పెట్టుకుంటుంటారు, టెన్షన్‌గా రోజూ వేసేసుకుంటారు. ఇక ఆ ఇబ్బంది నుంచి బయటపడొచ్చు ఈ సరికొత్త డ్రగ్‌తో. ఇది సమర్థవంతంగా హైబీపి నియంత్రించి సమ స్థాయలో ఉండేలా చేస్తుంది. మనం కనీసం మూడు నుంచి ఆరు నెలల వరకు మాత్రలు లేకుండా గడపొచ్చు. (చదవండి: మధుమేహాన్ని ఎలా నియంత్రించాలి? గ్లూకోజ్ స్థాయిలు పెరగకూడదంటే..) -
మీలో ఈ లక్షణాలు ఉంటే లోబీపీ ఉన్నట్లే.. లేట్ చేస్తే ప్రాణాంతకమే!
ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో తక్కువ రక్తపోటు కూడా ఒకటి. దీనినే హైపోటెన్షన్ అని కూడా అంటారు. వంశపారంపర్యంగా, సరైన ఆహారం తీసుకోకపోవడం,సరైన రక్త ప్రసరణ లేకపోవడంతో, చాలా మందికి కాలక్రమేణా తక్కువ రక్తపోటు సమస్య ఏర్పడుతుంది. లో బీపీ అనేది మనిషి సాధారణ రక్తపోటు కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు. సాధారణంగా రక్తపోటు 120/80 mmHg ఉంటుంది. ఇంతకంటే తక్కువగా ఉంటే అది లో బీపీగా పరిగణిస్తారు. చాలా మంది తక్కువ రక్తపోటు సమస్యను చాలా తేలికగా తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో ఊహించకుండా ఒక్కసారిగా కుప్పకూలిపోవచ్చు. అంతేకాకుండా గుండెపోటు, గుండెకు సంబంధించిన అనేక తీవ్రమైన సమస్యలకు కూడా దారి తీసే అవకాశాలు ఉంటాయి. లక్షణాలు ఇలా ఉంటాయి ►మైకము,అలసట ► తలనొప్పి ► కళ్ళు తిరగడం ► కడుపులో తిమ్మిరి ► హృదయ స్పందన రేటు పెరగడం ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లో బీపీ ఎందుకు వస్తుంది? లోబీపీ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. డీ హైడ్రేషన్, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, గుండెలో రక్తం గడ్డకట్టడం, విటమిన్ బీ12 లోపం, అడ్రినలైన్ హార్మోన్ సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం, సెప్టిసీమియా, వేసో వ్యాగల్ రియాక్షన్లు, పోస్టురల్ హైపో టెన్షన్, హై బీపీ కోసం మందులు వేసుకోవడం, ఆల్కహాల్ ఎక్కువగా తాగడం, డ్రగ్స్ వాడకం కారణంగా లోబీపీ వచ్చే అవకాశం ఉంది. ఈ జాగ్రత్తలు పాటించండి హైపోటెన్షన్ అనేది తీవ్రమైన సమస్య. అయితే దానిని నుండి బయటపడటం కష్టమేమి కాదు. తీసుకునే ఆహారం, జీవనశైలిని మార్చుకోవటం ద్వారా, లో బీపీ సమస్యను సులభంగా నివారించవచ్చు.దీనికోసం ఏం చేయాలంటే.. ►తగినంత నీరు తాగాలి ► ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి ► క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ► ఆల్కహాల్, పొగత్రాగడం వంటి అలవాట్లు ఉంటే మానుకోండి ► మీరు ఏదైనా మందులు తీసుకుంటుంటే, వాటి సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీ డాక్టర్‌తో మాట్లాడండి. ► ఆహారంలో కొంచెం ఎక్కువ ఉప్పు తీసుకొండి ► తక్కునగా ఎక్కువసార్లు భోజనం చేయండి లో బీపీ వస్తే ఏం చేయాలి? రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి. 5నిమిషాల్లో బీపీ నార్మల్ లోబీపీతో కళ్లు తిరిగి పడిపోవడం, మైకం కమ్మినప్పుడు వెంటనే ఒక గ్లాస్ నీటిలో అర టీస్పూన్ సైంధవ లవణం(Himalayan rock salt ) కలుపుకొని తాగితే బీపీ వెంటనే నార్మల్ అవుతుంది. ఇది టేస్ట్‌లో కొంచెం ఉప్పగా, తీపిగా ఉంటుంది.సైంధవ లవణంలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది బీపీని కంట్లోల్ చేసి, నార్మల్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి కావాల్సిన కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సల్ఫర్, జింక్, అయోడిన్, ఆక్సిజన్ వంటి అనేక పోషక విలువలు సైంధవ లవణంలో ఉన్నాయి. -
చేపలు తింటున్నారా? దానిలోని ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల..
మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుతం చాలామంది అధిక బీపీతో బాధపడుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ సమస్య ఎక్కువగా వస్తుండటం విచారకరం. ‘అధిక రక్తపోటు’ శరీరంలో గుండె సమస్యలను పెంచుతుంది. అయితే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా ఈ సమస్యని నియంత్రించవచ్చు. అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లయితే ఎక్కువ ఉప్పు, తీపి, కొవ్వు పదార్థాలను తినకూడదు. ఇలాంటివి తినడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఆహారంలో కొన్ని పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు చేర్చినట్లయితే రక్తపోటును నియంత్రించవచ్చు. అవేంటో తెలుసుకుందాం. ►గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. ► ఆధునిక కాలంలో మారిన జీవన పరిస్థితుల వల్ల చాలామందిలో కిడ్నీలలో రాళ్లు ఏర్పడుతున్నాయి. దీనికి కారణాలు అనేకం. కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు పడతారు. ఇందుకోసం కొన్ని చిట్కాలు ► తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ► కిడ్నీలో రాళ్లను తొలగించడంలో టొమాటో రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ పరిస్థితిలో రెండు టమోటాలు బాగా కడిగి వాటిని మెత్తగా రుబ్బుకోవాలి. ఈ జ్యూస్‌లో ఉప్పు, మిరియాల పొడి కలుపుకుని తాగాలి. కావాలంటే ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది కిడ్నీలోని స్టోన్స్‌ను తొలగించడంలో చక్కగా పనిచేస్తుంది. ► పెరుగును ఒక గిన్నెలో తీసుకుని అందులో చెంచా నిమ్మరసం వేసి రుచికి తగినట్లుగా ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. -
ప్రెగ్నెన్సీలో వచ్చిన బీపీ,షుగర్.. డెలీవరీ తర్వాత తగ్గుతాయా?
ప్రెగ్నెన్సీ టైమ్‌లో వచ్చిన బీపీ, షుగర్.. డెలివరీ తర్వాత తగ్గుతాయా? నాకు ఇప్పుడు ఆరో నెల. బీపీ, షుగర్ రెండూ వచ్చాయి. అందుకే భయంగా ఉంది. – ఎన్. శ్రీలీల, చెన్నై ప్రెగ్నెన్సీలో అధికంగా బరువు పెరిగినా, పోషకాహారం.. జీవన శైలి సరిగ్గా లేకపోయినా హార్మోన్స్, వయసు కారణంతో ఈరోజుల్లో చాలామంది గర్భిణీలకు ఆరవ నెల, ఏడవ నెల నుంచి బీపీ, సుగర్లు వస్తున్నాయి. దీనిని జెస్టేషనల్ హైపర్‌టెన్షన్, జెస్టేషనల్ డయాబెటిస్ (జీడీఎమ్)అంటాం. డెలివరీ అయిన ఆరువారాలకు జీడీఎమ్ నార్మల్ లెవెల్‌కి వస్తుంది. అందుకే డెలివరీ అయిన ఆరువారాలకు ఓజీటీటీ అనే టెస్ట్ చేస్తారు. ఇది నార్మల్‌గా ఉంటే తర్వాత డయాబెటిక్ కేర్ అవసరం లేదు. కానీ సంవత్సరానికి ఒకసారి హెచ్‌బీఏ1సీ / ఎఫ్బీఎస్ టెస్ట్‌ను చేయించుకుంటూ ఫాలో అప్‌లో ఉండాలి. జీడీఎమ్ ఉన్నవారిలో తర్వాత టైప్ 2 డయాబెటిస్ రావడానికి 40 శాతం ఎక్కువ చాన్సెస్ ఉంటాయి. బీఎమ్ఐ 30 కన్నా ఎక్కువ ఉన్నా.. మీకు ఆరవ నెలలోపు జీడీఎమ్ వచ్చినా.. కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉన్నా.. డెలివరీ తరువాత అయిదేళ్లలోపు మీకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే చాన్స్ ఉంటుంది. అందుకే డెలివరీ తరువాత క్రమం తప్పకుండా ఫాలో అప్‌లో ఉండాలి. చక్కటి డైట్ కూడా ఫాలో కావాలి. - డా.భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్ -
టెట్ పరీక్షలో విషాదం.. గర్భిణి మృతి
సాక్షి, సంగారెడ్డి: టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లి గర్భిణి ఎగ్జామ్ సెంటర్లో మృతి చెందిన పటాన్చెరు మండలం పరిధిలో జరిగింది. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించరనే భయంతో.. రాధిక అనే అభ్యర్థిని పరీక్షకు త్వరగా చేరుకోవాలని ప్రయత్నించింది. గచ్చిబౌలిలో రాధిక, అరుణ్ దంపతులు నివాసముంటున్నారు. రాధిక 8 నెలల గర్భంతో ఉంది. ఇస్నాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఆమెకు సెంటర్ పడింది. బైక్ పై ప్రయాణమై ఇస్నాపూర్ కు చేరుకున్నారు. ఈ క్రమంలో పరీక్షకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో.. ఎగ్జామ్ సెంటర్ వద్ద ఆమె వేగంగా పరిగెత్తింది. సెంటర్‌కు చేరుకున్న వెంటనే ఆమెకు బీపీ ఎక్కువై చెమట్లు పట్టేశాయి. పరీక్ష సెంటర్లోనే కుప్పకూలి పడిపోయింది. హుటాహుటిన రాధికను పటాన్చెరు ప్రభుత్వ ఆస్పత్రికి ఆమె భర్త అరుణ్ తీసుకెళ్లారు. అయితే అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. వీరిద్దిరికి ఇదివరకే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. -
ఆకస్మిక మైకం.. తరచు తలనొప్పా?
ఈ రెండూ లోబీపీకి ప్రధాన సూచన కావొచ్చు. తక్కువ ఆక్సిజన్ స్థాయి కారణంగా ఒక్కోసారి అపస్మారక స్థితి ఏర్పడవచ్చు. మెడ మీద గట్టిగా పట్టుకున్నట్లు అనిపిస్తుంది. ఆ ప్రాంతంలో ఆగీ ఆగీ నొప్పి కూడా రావొచ్చు. అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవటం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇందులోని మరో లక్షణం ఏమిటంటే, శరీరం ఒక్కసారిగా చెమటలు పట్టడం, శరీరంలో వేడి జ్వరంలా పెరిగిపోవడం, అలసిపోయినట్లుగా కుప్పకూలిపోవడం సంభవిస్తుంది. హృదయ స్పందన రేటు పెరుగుతుంది. సక్రమంగా గుండె కొట్టుకోకపోవడం వల్ల అలసట కనిపిస్తుంది. ఆహారం జీర్ణం కాక వికారంగా అనిపిస్తుంది. వాంతులు, వికారం, విపరీతమైన అలసట వల్ల ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. లోబీపీ ఉంటే మూత్ర విసర్జన కూడా తగ్గుతుంది. లోబీపీ ఉంటే ఏం చేయాలి లోబీపీ అకస్మాత్తుగా జరగదు. శరీరంలో ఏ సమస్య వచ్చినా బీపీ తగ్గుతుంది. ఇది డీహైడ్రేషన్, గుండె సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. రక్తస్రావం అయ్యే అవకాశాన్ని కొట్టిపారేయలేము. శరీరంలోని ఏ భాగంలో అయినా మార్పులు సంభవిస్తే రక్తప్రసరణలో తేడా వచ్చి బీపీ పడిపోతుంది. మితిమీరిన ఆలోచనలు, ఒత్తిడితో కూడిన జీవితం బీపీలో హెచ్చుతగ్గులు ఉంటాయి. మధుమేహం వల్ల కూడా ఇది జరగవచ్చు. అలాంటప్పుడు తగిన చికిత్సను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. రక్తపోటులో ఆకస్మిక తగ్గుదలకు సరైన చికిత్స అవసరం. ఆ సమయంలో స్వీయ చికిత్స కంటే ఆసుపత్రిని సందర్శించడం మంచిది. ఒక గంటలోపు ఆసుపత్రికి రావడం వల్ల ప్రమాదకర పరిణామాలను నివారించవచ్చు. అక్కడ లోబీపీకి కారణాన్ని గుర్తించి చికిత్స అందిస్తారు. మనం పైన చెప్పుకున్నట్టుగా... లోబీపీ లక్షణాలు కనిపించగానే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించాలి. వారి సలహా మేరకు మీ జీవనశైలిని సరిచేసుకోవాలి. తగిన పోషకాహారం, తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామాలు తప్పనిసరిగా మీ దినచర్యలో చేర్చుకోవాలి. (చదవండి: మాంసం తినే బ్యాక్టీరియా!.. దీని బారిన పడితే..అంతే సంగతులు!) -
కళ్లల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తున్నాయా? బీపీ చెక్ చేసుకున్నారా?
హై బీపీ లేదా హైపర్ టెన్షన్... ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న ముఖ్య ఆరోగ్య సమస్య. ఒకరకంగా చెప్పాలంటే ఇది సైలెంట్ కిల్లర్ కూడా. ఎందుకంటే బీపీ అదుపులో లేకపోతే నేరుగా గుండెపైనే ప్రభావం పడుతుంది. గుండెపోటు, స్ట్రోక్, మూత్రపిండాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీపీని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం, హెచ్చు తగ్గులుంటే తగిన మందులు వాడటం అవసరం. ఎందుకంటే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా, ఇది చాప కింది నీరులా అంతర్గత అవయవాలపై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. రక్తపోటు ఉన్నవారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉప్పు తగ్గించడం వాటిలో ముఖ్యమైనది. అధిక రక్తపోటును గుర్తించడానికి ఉత్తమ మార్గం క్రమం తప్పకుండా బీపీ చెక్ చేయించుకోవడం. రక్తపోటు ఎక్కువగా ఉంటే కొన్ని లక్షణాలు బయటపడతాయి. కళ్ళల్లో కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఎలాంటి లక్షణాలు? రక్తపోటు అధికమైతే మీ కళ్ళల్లో ఎర్రటి మచ్చలు కనిపిస్తాయి. ఇది రక్తనాళాల విచ్ఛిన్నం వల్ల జరుగుతుంది. కళ్ళు ఎర్రగా కనిపిస్తే బీపీ చెక్ చేసుకోవడం చాలా అవసరం. అధిక రక్తపోటు వల్ల దృష్టి సమస్యలు కూడా వస్తాయి. అందువల్ల కళ్లు ఎర్రగా కనిపిస్తుంటే ఓసారి బీపీ చెక్ చేయించుకోవాలని గుర్తుంచుకోండి. కళ్ళల్లో కనిపించే ఈ సంకేతాలు కాకుండా బీపీ అధికమైనప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవి ఏమిటంటే ... ►ఛాతీలో నొప్పి పెట్టడం ► శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం ► మూత్రంలో రక్తం కనిపించడం ►ఛాతీ, మెడ, చెవుల్లో ఇబ్బందిగా అనిపించడం ► తలనొప్పి తీవ్రంగా రావడం ► చిన్న చిన్న పనులు చేసినా తీవ్రమైన అలసట. -
రోజుకొక పెగ్గేసినా..అనర్థమే
సాక్షి, అమరావతి: ప్రతిరోజూ ఒక పెగ్గు చొప్పున తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే ఏం కాదు అనుకుంటే.. అది పొరపాటేనని ఓ అధ్యయనం హెచ్చరించింది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించిన ఇటలీ, అమెరికాకు చెందిన ఓ మల్టీ నేషనల్ టీమ్ అధ్యయనం ప్రకారం.. తక్కువ మోతాదులో మద్యం సేవించే వారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుందని, అధిక రక్తపోటు బారినపడుతున్నారని వెల్లడైంది. 1997 నుంచి 2021 మధ్య కాలంలో జపాన్, అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో మద్యపానం వల్ల సంభవించే పర్యవసానాలపై ఏడు అధ్యయనాలు నిర్వహించారు. 20 నుంచి 70 ఏళ్ల వయసుతో పాటు అధిక రక్తపోటు లేని 19,548 మందిపై అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా 4 నుంచి 12 ఏళ్ల అనంతరం వీరి రక్తపోటు స్థాయిల్లో నిరంతర పెరుగుదలను కనుగొన్నారు. రోజుకు సగటున 12 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో ఐదేళ్లలో సిస్టోలిక్ రక్తపోటు 1.25 ఎంఎం హెచ్‌జీ పెరిగినట్టు గుర్తించారు. రోజుకు సగటున 48 గ్రాముల మద్యం సేవించే వ్యక్తుల్లో సిస్టోలిక్ రక్తపోటు 4.9 ఎంఎం హెచ్‌జీ పెరిగినట్లు తేలింది.. ఒక్క రక్తపోటే కాదు.. అనేక సమస్యలు మద్యాన్ని ఎక్కువా.. తక్కువా.. అని కాదు.. ఏ పరిమాణంలో తీసుకున్నా ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. ఎక్కువ పరిమాణంలో తాగే వారిలో వేగంగా, తక్కువ పరిమాణంలో తాగేవారిలో ఆలస్యంగా ప్రభావాలుంటాయి. రక్తపోటుతో పాటు కాలేయం, గుండె, మెదడుతో పాటు శరీరంలో మద్యపానానికి ప్రభావమవ్వని భాగం ఉండదు. ఆధునిక జీవనశైలి వల్ల మధుమేహం, రక్తపోటు, ఊబకాయం ఇలా అనేక రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. వీటికి మద్యపానం తోడైతే వేగంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. మితంగా మద్యపానం ఆరోగ్యానికి మంచిదేనని గతంలో కొన్ని అధ్యయనాలు వచ్చినా.. అవి అవాస్తవమని తర్వాతి రోజుల్లో కొట్టిపడేశారు. – డాక్టర్ కె.సుధాకర్, ప్రిన్సిపల్, సిద్ధార్థ వైద్య కళాశాల విజయవాడ -
కిడ్నీలపై.. జంట భూతాల ప్రభావం
శరీరంలో అత్యంత కీలకమైన కిడ్నీలను రెండు జీవనశైలి వ్యాధులు భూతాల్లా పట్టుకున్నాయి. వాటి బారిన పడి కిడ్నీలు దెబ్బతిని ఆస్పత్రులకు వస్తున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. ఆ భూతాలే మధుమేహం, రక్తపోటు. ఈ రెండూ అదుపులో లేకపోవడంతో వాటి ప్రభావం కిడ్నీలపై పడుతోంది. క్రమంగా అవి చెడిపోతున్నాయి. కిడ్నీ వ్యాధులకు మిగతా కొన్ని కారణాలు కూడా ఉన్నప్పటికీ, 85 శాతం వ్యాధిగ్రస్తుల్లో మధుమేహం, రక్తపోటు బాధితులే ఉన్నారు. ఇటీవల వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం ఈ వ్యాధుల నియంత్రణకు తోడ్పడుతోంది. వైద్యులు గ్రామాలకు వెళ్లిన సమయంలో ప్రజలో వీటిపై అవగాహన కల్పిస్తున్నారు. ఇలా ఫ్యామిలీ డాక్టర్ విధానం గ్రామీణ ప్రాంతాల వారికి వరంలా మారింది. – లబ్బీపేట (విజయవాడ తూర్పు) అవగాహన లేకనే.. అవగాహన లేమి, అదుపులో లేని మధుమేహం, రక్తపోటు, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ వినియోగం కిడ్నీ వ్యాధులకు దారి తీస్తుంది. కిడ్నీ వ్యాధులను నిర్లక్ష్యం చేస్తే చివరకు డయాలసిస్, ఆ తర్వాత కిడ్నీ మార్పిడి చేయించుకోవాల్సి వస్తుంది. ఇదంతా అత్యంత వ్యయప్రయాసలతో కూడిన వ్యవహారం. అందువల్ల ముందు జాగ్రత్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. కిడ్నీ వ్యాధుల్లో కొందరిలో ముందుగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఏ లక్షణాలూ కనిపించకుండానే డయాలసిస్ అవసరం అయ్యేంత పరిస్థితికి దారితీస్తున్నాయి. కిడ్నీ వ్యాధులకు గురయ్యే వారిలో 45 శాతం మందికి మధుమేహం కారణం కాగా, మరో 55 శాతం మందికి అధిక రక్తపోటు, ఇతర కారణాలుగా చెబుతున్నారు. యూరిన్ ఆల్బుమిన్, సీరమ్ క్రియాటిన్, స్కానింగ్ వంటి చిన్నపాటి పరీక్షలతో కిడ్నీ పని తీరును తెలుసుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది. అక్యుట్ ఫెయిల్యూర్, క్రానిక్ ఫెయిల్యూర్. అక్యుట్ ఫెయిల్యూర్‌ను సరైన చికిత్సతో సాధారణ స్థితికి తేవచ్చు. క్రానిక్లో అలా చేయలేం. ఫ్యామిలీ డాక్టర్ ఓ వరం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్ విధానం గ్రామీణులకు వరంలా మారింది. నెలలో రెండు రోజులు గ్రామాలకే వెళ్లి పరీక్షలు చేయడంతో కిడ్నీ వ్యాధుల లక్షణాలను ముందుగానే గుర్తించగలుగుతున్నారు. కిడ్నీ వ్యాధి ఉన్నట్లు సందేహం ఉన్న వారికి పీహెచ్‌సీలకు పంపించి పరీక్షలు చేయిస్తున్నారు. దీంతో ఏమాత్రం చిన్నపాటి లక్షణాలు గుర్తించినా ఫెయిల్యూర్‌కు దారితీయకుండా కాపాడుకోగలుగుతున్నారు. నిపుణుల వద్దకు వెళ్లి మెరుగైన వైద్యం పొందుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు కారణాలు ♦ అదుపులో లేని మధుమేహం, రక్తపోటు ♦ గ్లొమెరుల్లోనెఫ్రిటిస్ ♦ ఎడిపికెడి–పొలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ (ఇది వంశపారంపర్యంగా వస్తుంది) ♦ ఆటో ఇమ్యూన్ జబ్బులు ♦ ఊబకాయం, ధూమపానం ♦ విచ్చలవిడిగా నొప్పి నివారణ మాత్రలు వాడటం.. దీర్ఘకాలం పాటు గ్యాస్ మాత్రల వినియోగం ♦ దీర్ఘకాలంలో గుండె, ఇతర జబ్బులు ♦ మాంసాహార ప్రొటీన్ అధికంగా తీసుకోవడం కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు.. ♦ ఆయాసం, అలసట ♦ కాళ్ల వాపులు, ముఖం వాపు ♦ మూత్రం తగ్గిపోవడం ♦ ఎముకలు, కండరాల నొప్పులు వంటి లక్షణాలు ఉంటాయి ♦ కొందరిలో ఎలాంటి లక్షణాలు లేకుండా డయాలసిస్ స్టేజ్‌కి చేరవచ్చు నిర్ధారణ ఇలా: కిడ్నీ వ్యాధులను సీరమ్ క్రియాటిన్, యూరిన్ ఆల్బూమిన్, పొట్ట అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షల ద్వారా తెలుసుకుంటున్నారు -
బీపీ, షుగర్ రాకుండా ఉండటానికి ముందు జాగ్రత్త
-
బీపీ కంట్రోల్ లో లేకపోతే మీకు ఈ సమస్యలు తప్పవు
-
కాటేస్తున్న కాలుష్యం
సాక్షి, అమరావతి : ప్రపంచవ్యాప్తంగా 99 శాతం మంది ప్రజలు కలుషితమైన గాలిని పీలుస్తున్నారు. ఒక్క ఏడాదిలో 66.67 లక్షల మంది శ్వాసకోశ వ్యాధుల బారిన పడి మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న 20 నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నివేదిక వెల్లడించింది. అవన్నీ ఉత్తర భారత దేశ నగరాలే కావడం గమనార్హం. గాలి కాలుష్యంపై డబ్ల్యూహెచ్‌వో 2022లో నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం క్యూబిక్ మీటర్ గాలిలో కలుషిత పదార్థాలు 2.5 మైక్రో గ్రాములకు మించకూడదు. అయితే అన్ని దేశాల్లో గాలిలో కలుషిత పదార్థాల తీవ్రత నిర్దేశించిన ప్రమాణాల కంటే నాలుగైదు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. కలుషితమైన గాలిని పీల్చడం వల్ల శ్వాసకోశ వ్యాధుల బారిన పడి తీవ్రమైన రక్తపోటుతో 2019లో ఏకంగా 66.67 లక్షల మంది మరణించినట్లు వెల్లడైంది. పట్టణాల్లో ప్రమాదకర స్థాయిలో.. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాలు, నగరాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉంది. ప్రపంచంలో గాలి కాలుష్య తీవ్రత అధికంగా ఉన్న నగరాల్లో పాకిస్తాన్‌లోని లాహోర్ మొదటి స్థానంలో నిలవగా చైనాలోని హటన్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్ ఆళ్వార్ జిల్లాలోని బివాడీ కాలుష్య తీవ్రత అత్యధికంగా ఉన్న నగరాల్లో మూడో స్థానంలో నిలిచింది. కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయిలో ఉన్న నగరాల్లో ఢిల్లీ నాలుగో స్థానంలో ఉండగా న్యూఢిల్లీ తొమ్మిదో స్థానంలో ఉంది. పరిశ్రమలు, వాహనాల పొగ.. గడ్డి కాల్చివేతతో వాహనాల రద్దీ అధికంగా ఉండటం వల్ల వాటి నుంచి వెలువడే పొగ... ప్రమాణాలు పాటించని పరిశ్రమలు... వ్యర్థాలను అడ్డగోలుగా కాల్చేయడం... నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేయడం.. పంట కోతల తర్వాత గడ్డిని పొలాల్లోనే కాల్చేయడం వల్ల ఓజోన్ పొరకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కార్బన్ మోనాక్సైడ్, సల్ఫర్ డయాౖMð్సడ్, నైట్రోజన్ డయాక్సైడ్ లాంటి విష వాయువుల విడుదలతో గాలి కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరుకుంటున్నట్లు డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. -
మీ ఫోన్ లోనే బీపీ చెక్ చేసుకోవచ్చు.. ఎలాగో తెలుసుకోండి
-
పెరుగుతున్న నాన్ కమ్యునికబుల్ జబ్బులు.. 63 శాతం మరణాలకు ఇవే కారణం!
సాక్షి, అమరావతి: ఏం చేస్తున్నారు.. ఏం తింటున్నారు.. ఉదయం లేచిన దగ్గర్నుంచి పడుకొనే వరక మీ దినచర్య, ఆహారాన్ని జాగ్రత్తగా గమనించండి. అవసరమైన మార్పులు చేసుకోండి... మీ జీవిత కాలాన్ని పెంచుకోండి.. అంటోంది కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. జీవన శైలి, ఆహార అలవాట్ల వల్లే దేశంలో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయని, 63 శాతం మరణాలు వీటి వల్లే కలుగుతున్నాయని హెచ్చరిస్తోంది. ముఖ్యంగా గుండె పోటుతో పాటు బీపీ, సుగర్, క్యాన్సర్ వ్యాధులకు ప్రధాన కారణం ప్రజల జీవన శైలేనని ఈ మంత్రిత్వ శాఖ 2021–22 వార్షిక నివేదికలో పేర్కొంది. నాన్ కమ్యునికబుల్ జబ్బులతో పాటు గుండెపోటుతో ఆకస్మిక మరణాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటిని నివారించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజలు కూడా జీవనశైలితో పాటు ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని సూచించింది. ఈ వ్యాధుల నివారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరంతరం స్క్రీనింగ్ చేస్తున్నాయి. అయినా ప్రతి సంవత్సరం బీపీ, సుగర్, గుండె జబ్బులు, క్యాన్సర్ జబ్బుల రోగుల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. ప్రజలు కూడా ఈ జబ్బులకు కారకాలైన వాటికి దూరంగా ఉండాలని, దిన చర్యలో మార్పులు చేసుకొని, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. నాన్ కమ్యునికబుల్ వ్యాధులు 21వ శతాబ్దంలో కొత్త సవాళ్లను విసురుతున్నాయని పేర్కొంది. పట్టణీకరణతో పాటు జీవనశైలిలో మార్పులకు దారి తీసిందని, కొత్త కొత్త ఆహారపు మార్కెట్లు రావడం, వాటికి ప్రజలు ఆకర్షితులు కావడం, వాటికి తోడు పొగాకు, మద్యం సేవించడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి నాన్ కమ్యునికబుల్ వ్యాధులతో పాటు, గుండెపోటుతో అకాల మరణాలకు దారితీస్తున్నాయని నివేదిక తెలిపింది. రాష్ట్రంలో 3.53 కోట్ల మందికి స్క్రీనింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 సంవత్సరాలకు పైబడిన జనాభాలో 92 శాతం మందికి నాన్ కమ్యునికబుల్ వ్యాధుల స్క్రీనింగ్‌ను పూర్తి చేశారు. ఇప్పటివరకు 3,53,44,041 మంది జనాభాకు పరీక్షలు చేశారు. గుండె జబ్బులు, రక్తపోటు, సుగర్, శ్వాస సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వంటి జబ్బులున్నట్లు పరీక్షల్లో తేలిన వారికి అవసరమైన చికిత్స అందిస్తున్నారు. వ్యాధుల నివారణోపాయాలు ♦ జీవన శైలిలో మార్పులు చేసుకోవాలి ♦ శారీరక శ్రమను పెంచాలి ♦ మద్యం, పొగాకుకు దూరంగా ఉండాలి ♦ పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి ♦ ఉప్పు వినియోగాన్ని తగ్గించాలి. ఆహారంలో రోజుకు 5 గ్రాములకంటే తక్కువ ఉప్పు తీసుకోవాలి ♦ ఏరేటెడ్ డ్రింక్స్, వేయించిన ఆహారాన్ని తీసుకోకూడదు ♦ పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలు శారీరక శ్రమలో పాల్గొనాలి ♦ 5 ఏళ్ల నుంచి ఏడేళ్ల లోపు పిల్లలకు ప్రతిరోజు కనీసం 60 నిమిషాలు శారీరక శ్రమ అవసరం. దేశంలో 2020–21లో నాన్ కమ్యునికబుల్ వ్యాధులు స్క్రీనింగ్, చికిత్స వివరాలు -
అధిక కొలెస్ట్రాల్ లక్షణాలని గుర్తించండి ఇలా...
ఆహారంలో ఉప్పు తక్కువ తీసుకుంటున్నా, మీకు బీపీ పెరుగుతోందా? కాళ్లూ చేతులు తిమ్మిర్లుగా ఉంటున్నాయా? గోళ్ల రంగు మారుతోందా? ఇవన్నీ వ్యాధి లక్షణాలే. అయితే భయపడవద్దు. అది ఏమంత ప్రమాదకరమైనది కాకపోవచ్చు కానీ, తేలిగ్గా కూడా తీసుకోకూడదు. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి నిదర్శనం అది. కొలెస్ట్రాల్ దానంతట అది ప్రమాదకరమైనది కాదు కానీ, ఇతర వ్యాధులకు దారితీస్తుంది. అందువల్ల దానిని నిర్లక్ష్యం చేయద్దు. అసలు మన శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఏ లక్షణాలుంటాయో అవగాహన కోసం. సాధారణంగా కొలెస్ట్రాల్ పేరు వినగానే అది చాలా చెడ్డదని అనుకుంటారు. కానీ ఇందులో రెండు రకాల కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. మంచి కొలస్ట్రాల్ శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను తయారు చేయడానికి సహాయపడుతుంది. కానీ చెడు కొలెస్ట్రాల్ పరిమాణం పెరిగినప్పుడు రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోయి రక్తం గడ్డకట్టడానికి దారితీస్తుంది. ఇది రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఈ ప్రమాదాలను నివారించడానికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. మంచి జీవనశైలిని అనుసరించాలి. కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అవి... 1. అధిక రక్తపోటు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే అది నేరుగా రక్తపోటుకు దారితీస్తుంది. రక్తంలో కొవ్వు శాతం ఎంత పెరిగితే రక్తపోటు అంతగా పెరుగుతుంది కాబట్టి కారణం తెలియకుండానే బీపీ పెరిగిపోతుంటే కొలెస్ట్రాల్ ఉందేమో అని అనుమానించాల్సి ఉంటుంది. 2. కాళ్లు, చేతులు తిమ్మిర్లు పాదాలు మొద్దుబారడం: కాళ్లు చేతులు తిమ్మిరికి గురి కావడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతంగా గుర్తించాలి. ధమనులలో రక్త ప్రసరణ, ఆక్సిజన్ సరఫరాలో అవరోధం ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. ΄ాదాలలో నొప్పి, తిమ్మిరి కారణంగా రక్త సరఫరా సరిగ్గా జరగదు. 3. గోర్ల రంగులో మార్పు: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు ధమనులలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది సిరల్లో రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది. చేతివేళ్లు, కాలి వేళ్లకు సరైన రక్త సరఫరా లేకపోవడం వల్ల అవి లేత గులాబీ రంగులోకి లేదా పసుపు రంగులోకి మారుతాయి. ఉండవలసిన దానికన్నా అధిక కొవ్వు ఉండటం వల్ల ఇలా జరుగుతుందని గుర్తించాలి. మధుమేహం ఉంటే కొలెస్ట్రాల్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందువల్ల మధుమేహం ఉన్న వాళ్లు మూడు నెలలకొకసారి రక్తంలో సరాసరి చక్కెర శాతం ఎంత ఉందో తెలుసుకునే పరీక్షతో΄ాటు కొలెస్ట్రాల్ ΄ాళ్లను తెలుసుకునే పరీక్ష కూడా చేయించుకుని దానిని అదుపు చేసేందుకు తగిన మందులు తీసుకోవాలి. -
జియో–బీపీ బంకుల్లో ఈ20 పెట్రోల్
న్యూఢిల్లీ: జియో–బీపీ పెట్రోల్ బంకుల్లో కొత్తగా ఈ20 పెట్రోల్ లభించనుంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శ ప్రణాళికకు అనుగుణంగా దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు సంస్థ తెలిపింది. ఈ తరహా ఇంధనంలో 80 శాతం పెట్రోల్, 20 శాతం ఇథనాల్ ఉంటుంది. ముడిచమురు దిగుమతులను అలాగే కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ఇది తోడ్పడుతుంది. ఈ20 పెట్రోల్‌కు అనుగుణంగా ఉండే వాహనాల్లో ఈ ఇంధనాన్ని వాడవచ్చని జియో–బీపీ పేర్కొంది. ఇంధనాల విక్రయం కోసం దేశీ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్ సంస్థ బీపీ కలిసి రిలయన్స్ బీపీ మొబిలిటీ పేరిట జాయింట్ వెంచర్ ఏర్పాటు చేశాయి. ఇది జియో–బీపీ బ్రాండ్ పేరిట కార్యకలాపాలు సాగిస్తోంది. ఈ జేవీకి దేశవ్యాప్తంగా 1,510 ఎనర్జీ స్టేషన్లు ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం చార్జింగ్, రిఫ్రెష్మెంట్లు వంటి సదుపాయాలు కూడా అందిస్తోంది. -
Health: ఆహారంలో ఉప్పు తగ్గిస్తేనే... లేదంటే ఈ ముప్పు తప్పదు!
వృద్ధాప్యంలో తామెవరో తమకే తెలియకుండా పోవడం... తమ సొంతవాళ్లను మాత్రమే కాదు... సొంత ఇంటినీ మరచిపోవడం ఎంత దురదృష్టకరం. అయితే ముందునుంచీ జాగ్రత్తపడితే అలాంటి దురవస్థ రాకుండా కాపాడుకోవడం అంత కష్టం కాదు. చాలా ఈజీగా అనుసరించదగిన ఈ కింది సూచనలు పాటిస్తే చాలు... బీపీ కంట్రోల్లో ఉంచుకోవాలి బ్లడ్‌ప్రెషర్‌ను తరచూ చెక్ చేయించుకోవడం మంచిది. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు రక్తపోటు ఎక్కువగా ఉండటం అన్న అంశం మతిమరపు(డిమెన్షియా)ను పెంచుతుంది. అది పరోక్షంగా అల్జీమర్స్‌కు దారితీయవచ్చు. అందుకే నిత్యం మన బీపీని అదుపులో ఉంచుకోవడం మేలు. బ్లడ్ ప్రెషర్ నియంత్రణతో పాటు అల్జీమర్స్ నివారణకూ ఆహారంలో ఉప్పు తగ్గించడం చాలా ఉపకరిస్తుంది. కండరాల కదలికలు చురుగ్గా ఉన్నవారితో పోలిస్తే... మందకొడి కదలికలు ఉన్నవారిలో అల్జీమర్స్ వచ్చే అవకాశాలు 60 శాతం వరకు ఎక్కువగా ఉంటాయని ఓ అధ్యయనంలో తెలిసింది. నడక మంచిదే రోజూ 30 – 45 నిమిషాల పాటు నడక అల్జీమర్స్‌నే కాదు... ఆరోగ్యానికి అన్ని రకాలుగా మంచి చేస్తుంది. అందుకే ఇమ్యూనిటీని పెంచి ఎన్నో వ్యాధుల నివారణలతో పాటు పూర్తి ఆరోగ్యానికి దోహదం చేసే నడకను రోజూ కొనసాగించడం చాలా మంచిది. వ్యాయామం శరీరానికి మాత్రమే కాదు... మనసుకు కల్పించడం కూడా అల్జీమర్స్ నివారణకు తోడ్పడుతుంది. అందుకే రోజూ పత్రికల్లో లేదా సోషల్ మీడియాలో కనిపించే పజిల్స్, సుడోకూ, గళ్లనుడికట్టు వంటి మెదడుకు మేత కల్పించే అంశాలు ప్రాక్టీస్ చేస్తుండటం మేలు. సృజనాత్మకంగా ఆలోచిస్తే.. సృజనాత్మకంగా ఆలోచించేవారికి అల్జీమర్స్ అవకాశం కాస్త తక్కువ. అందుకే మంచి ఊహాకల్పనలతో సృజనాత్మకంగా ఆలోచిస్తూ ఉండటం... ఆహ్లాదంగా, ఆనందంగా ఉంచడంతో పాటు అల్జీమర్స్‌నూ నివారిస్తుంది. అందుకే ఇష్టమైన, అభిరుచి ఉన్న కళలను ప్రాక్టీస్ చేస్తుండటం ఎంతో మేలు. నోట్: ఇది ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి మాత్రమే అందించిన కథనం. వైద్యుడిని సంప్రదిస్తే సమస్యకు తగిన పరిష్కారం లభిస్తుంది. చదవండి: ADHD: చురుకైన పిల్లాడని మురిసిపోకండి! ఈ లక్షణాలు ఉంటే.. తలనొప్పి.. ఛాతిలో నొప్పి.. పాదాలు- అరిచేతులు చల్లగా అవుతున్నాయా? ఇవి తిన్నా, తాగినా.. -
Health Tips: బీపీ పెరగడానికి కారణాలేంటి? ఎలా కంట్రోల్ చేసుకోవాలి?
కొందరు ఉప్పును తగ్గించి తింటారు.. కొందరైతే అసలు ఉప్పే వాడరు. ఏ కొంచెం తిన్నా ఎక్కడ బీపీ పెరిగి పోతుందేమో అన్న భయంతో తినరు. ఉప్పులేని చప్పిడి తిండి తింటారు అయినా కూడ బీపీ కంట్రోల్ కాదు. సహజంగా బీపీ పెరగడానికి ప్రధాన కారణం జీవన శైలి. వేళకు తినకపోవడం, ప్రతీ చిన్న విషయానికి అతిగా రియాక్ట్ కావడం, సరిగా నిద్రపోకపోవడం, అధిక భావోద్వేగాలు బీపీని పెంచుతాయి. ముఖ్యంగా మానసిక ఒత్తిడి బీపీకి దారితీస్తుంది. అలాగే అస్తవ్యస్థ తిండి అలవాట్లు, సిగరెట్లు, మద్యం కూడా ఒక కారణం. ఇలా చేయండి ► ప్రస్తుత పరిస్థితుల్లో 35 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ బీపీని ప్రతీ 3 నెలలకు ఒక సారి చెక్ చేయించుకోవాలి. ►130/90 కంటే రక్తపోటు అధికంగా ఉంటే డాక్టర్ సహాయం తీసుకుని తగిన చికిత్స తీసుకోవాలి. ►ఒక వేళ బీపీ ఉందని తేలితే జీవన శైలిలో తగిన మార్పులు కచ్చితంగా చేసుకోవాల్సిందే. ►కచ్చితంగా నడక లేదా వ్యాయామం చేయాలి. ►మానసిక ఆందోళనలకు దూరంగా ఉండాలి. ►ధ్యానం చేసి మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆహారంలో మార్పులు చేసుకోవాలి. ►ఎప్పటికప్పుడు బీపీ ని చెక్ చేసుకుని, రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగకుండా చూసుకోవాలి. ఇవి తగ్గించండి ►అధిక ఉప్పు వాడకాన్ని తగ్గించాలి. ►చక్కెర వినియోగాన్ని కూడా తగ్గిస్తే మంచిది. ► సిగరెట్ అలవాటు ఉంటే మానేస్తే మంచిది. ►మద్యపానం అలవాటు ఉంటే మితంగా తీసుకోవాలి. ఇవి తినండి.. ఇలా చేయండి ఒంట్లో బాలేదంటే దానర్థం శరీరంలో ఎక్కడో తేడా ఉందని అర్థం. మన శరీరానికి ఈ కిందికి కచ్చితంగా అవసరం ఉందని గుర్తించాలి. ► పండ్లు, పచ్చి కూరగాయలు, సలాడ్స్, గింజలు, గింజ ధాన్యాలు ►తేనె, గోరువెచ్చని నీళ్ళు ►రోజు వారీ వాకింగ్ చేయాలి ►కుటుంబ సభ్యులతో ప్రేమ, అనుబంధాలు ►మిత్రులతో స్నేహం ►సూర్యరశ్మి, చెట్లు, మంచి గాలి, ప్రక్రృతి ►మంచి పుస్తకాలు ఈ జాగ్రత్తలు తీసుకుని బీపీ నార్మల్ స్థాయిలో ఉంచుకోలగలిగితే బీపీ పెద్ద ప్రమాదంగా మారకుండా ఉంటుంది. ఉప్పు గురించి అతిగా ఆలోచించవద్దు... ఒకవైపు భయం, మరో వైపు తిండి రుచించక పోవడం ఎక్కడ టపా కట్టేస్తామో అనే టెన్షన్. అసలూ మన శరీరమే ఉప్పుతో ఉంది మనం తాగే నీటిలో ఉప్పే ఉంది ఉప్పు లేని పదార్థాలు ఎక్కడున్నాయి? అసలు ఈ భూమే నీటిలో ఉంది. సముద్రం అంటే ఉప్పేగా. ఆ సముద్రాలు సూర్యుని వేడికి ఆవిరై పైకి వెళ్ళి మేఘాలుగా తయారై కింద వర్షిస్తాయి. వాటిని ఫిల్టర్ చేసుకుని మనం తాగుతున్నాము. కానీ భూమి కింద ఉన్న నీరంతా ఉప్పునీరే. బోరుబావుల్లో కూడ ఉప్పు ఉంది. గాలిలో ఉప్పు ఉంది పళ్ళలో కూడా ఉప్పే ఉంది. ఉప్పు లేనిదేదీ లేదు, మనకు చెమట పట్టినప్పుడు అది నోటిని తాకితే ఉప్పగా ఉంటుంది. ఎందుకూ మనం ఉప్పు తిన్నా, తినకున్నా శరీరంలో ఉప్పు ఉంది. అన్నీంటా ఉంది ఉప్పు. మనం చేయాల్సింది నీటిని బాగా మరిగించి చల్లార్చి ఫిల్టర్ చేసుకొని తాగితే కొంతలో కొంతైనా శరీరంలో ఉప్పు ఇనుము కొంచెం తగ్గుతుంది. బీపీ వెనక్కు తగ్గుముఖం పడుతుంది. కానీ కొంతమంది ఈ కరోనా భయంతో వేడినీళ్ళే తాగుతారు. అది తప్పు. వేడినీళ్లు తాగటం వలన లోపల సన్నటి నరాలు దెబ్బతింటాయి. మెదడు నరాలు, కంటి నరాలు కూడా దెబ్బతింటాయి. అంతే కాదు శరీరలో మాంసం ఉడికి పోతుంది. ఫిట్టుగా ఉన్న బాడీ లూజ్ అయిపోతుంది బలం తగ్గుతుంది కాబట్టి వేడిని చల్లార్చి తినాలి తాగాలి. చాలామంది టీని కూడా వేడి వేడిగా తాగేస్తారు. అలా తాగకూడదు. కాస్త చల్లబడినాక తాగాలి. మరిగించిన దానిలో ఉప్పు తగ్గుతుంది అవిరియై బయటకు వెళ్ళిపోతుంది. కొంతమంది పచ్చి కూరలు కాయలు తింటుంటారు. కొందరు సగమే ఉడికించి తింటారు. అలా తింటే డైరెక్ట్‌గా ఉప్పునే తిన్నట్టు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి. ►ఉదయాన్నే వాకింగ్ చేయాలి, ఎందుకంటే చెట్ల నుండి ఔషధాలు విడుదల అవుతాయి. చెట్లు రాత్రి వేళ చెడుగాలిని పీల్చుకొని ఉదయం నాలుగు గంటలనుండీ అమృతానికి సంబం ధించిన ఔషధాలను విడుదల చేస్తాయి అవీ ఉదయం 4 నుండి 630 వరకు ఉంటుంది. ఆ చెట్లనుండి వచ్చే రసాయన గాలిని పీల్చుకొవాలి కానీ మనవాళ్ళు పొద్దున్నే వ్యాపారాలకని డుగ్ డుగ్ డుగ్ అనీ బయల్దేరుతారు. అప్పుడు పొల్యూషన్ పామై అమృత గడియల్లో విడుదలైన ఆ ఔషదాలు చెట్లరసాల గాలీ చెడిపోతాయి. ►ఇక దానికేమి చెయ్యలేము కానీ కనీసం ఇంటిముందర అయినా వాకింగ్ చేస్తే చెమట రూపంలో శరీరం నుండి ఉప్పు బయటకు వెళ్ళిపోతుంది. తర్వాత శుభ్రంగా స్నానం చేస్తే ఒళ్ళు తేలికగా ఉంటుంది. ►ఉప్పు తగ్గడం వలన మళ్లీ గాలితో మన శరీరంలోకి ఉప్పు స్టోరేజ్ అవుతుంది అందుకనీ ప్రాణాయామం చెయ్యాలి. దానివలన ఎంతో మేలు జరుగుతుంది ఉడికినవే తాగాలి తినాలి, వేడివి కాదు సుమా చల్లార్చుకొని తినాలి. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
మధ్యాహ్నం పూట పడుకుంటున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
మధ్యాహ్నం పూట ఒక గంట పాటు నిద్రించడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. అలాగే మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుందని, శరీరం చురుగ్గా ఉండటానికి తోడ్పడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక హైబీపీని కంట్రోల్ చేయడంలోనూ మధ్యాహ్నం నిద్ర సహాయపడుతుందట. మధ్యాహ్నం నిద్ర గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందట. అదే సమయంలో కొవ్వును కరిగించడానికి మధ్యాహ్నం నిద్ర మెరుగ్గా పనిచేస్తుంది. అలాగే మధ్యాహ్నం నిద్ర హార్మోన్ల సమతుల్యత పెరుగుతుందట. దీంతో మధుమేహం, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడొచ్చునని నిపుణలు చెబుతున్నారు. అయితే ఈ ఆరోగ్య ప్రయోజనాలు కలగాలంటే కొన్ని విధానాలు పాటించాలి. సరిగ్గా భోజనం చేసిన వెంటనే పడుకోవాలి. పది నుంచి ముప్పై నిమిషాల పాటు మాత్రమే నిద్రించాలి. ఎడమవైపుకి తిరిగి తలకింద చేయి పెట్టుకొని పడుకోవాలి. -
ప్రైవేటీకరణలో బీపీసీఎల్, కేంద్రం కీలక నిర్ణయం!
పెట్టుబడి దారుల్ని ఆకర్షించడంలో భారత్ పెట్రోలియం కార్ప్ లిమిటెడ్ (బీపీసీఎల్)విఫలమైంది. అందుకే భారత్ పెట్రోలియంలో పావు భాగాన్ని అమ్మేందుకే కేంద్రం మొగ్గుచూపుతుందంటూ కేంద్రానికి చెందిన ఇద్దరు కీలక అధికారులు చెప్పారంటూ ఓ నివేదిక వెలుగులోకి వచ్చాయి. కేంద్రం బీపీసీఎల్ మొత్తం 52.98శాతం వాటా అమ్మాలని భావించింది. బిడ్లను ఆహ్వానించింది. అయితే ఈ బిడ్లలో ఊహించిన దానికంటే ధర తక్కువ పలికింది. దీంతో కేంద్రం ముందస్తు అమ్మాలనుకున్న వాటా కంటే 20శాతం నుంచి 25శాతం వాటా అమ్మే ప్రక్రియను కేంద్రం పరిశిలిస్తోందని పేరు వెల్లడించేందుకు నిరాకరించిన ఇద్దరు ప్రభుత్వ అధికారులు రాయిటర్స్‌తో చెప్పారు. నత్తనడకనే.. బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి సంబంధించి పెద్దగా పురోగతి లేదని అధికార వర్గాలు అంటున్నాయి.చాలా వరకు బిడ్డర్లు ఈ డీల్‌కు సరిపడా నిధులను సమకూర్చుకునేందుకు తగిన భాగస్వాములను ఎంపిక చేసుకోలేకపోయినట్టు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత వాతావరణానికి తోడు.. ఇంధన మార్కెట్లలోని ఆటుపోట్లను కారణంగా పేర్కొంటున్నాయి. పైగా విక్రయానికి సంబంధించి ఎన్నో అంశాలపై సందేహాల నివృత్తికి సమయం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆసక్తి కలిగిన బిడ్డర్లు బీపీసీఎల్‌కు సంబంధించి ఆర్థిక డేటాను గతేడాది ఏప్రిల్‌లనే పొందినట్టు వెల్లడించాయి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఆయా అంశాలపై చర్చలకు చాలా సమయం పట్టినట్టు వివరించాయి. కరోనా రాక ముందు వరకు అంటే 2020 ఫిబ్రవరి నాటికి బీపీసీఎల్‌ను ఎయిర్ ఇండియా కంటే ముందే విక్రయించగలమన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది. ఎయిర్ఇండియా తీవ్ర నష్టాల్లో నడుస్తుంటే.. బీపీసీఎల్ లాభాల వర్షం కురిపిస్తున్న కంపెనీ కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయగా దిగ్గజ ఇంధనరంగ కంపెనీలకు అదిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుకూల మార్గం అవుతుందని అభిప్రాయపడింది. కానీ కరోనా రాకతో అవన్నీ తారుమారయ్యాయి. అధిక వ్యయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున.. ఒకవైపు పన్నుల రూపంలో ఆదాయం పెరిగినా కానీ, పెట్టుబడుల ఉపంసంహరణ రూపంలో ఆదాయానికి తొర్ర పడితే జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 6.8 శాతాన్ని ఎలా అధిగమించగలదో చూడాల్సి ఉంది. -
మధుమేహం, నొప్పుల మాత్రల అత్యధిక వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో జంటజబ్బులు మధుమేహం, రక్తపోటు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఇందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగిస్తున్న మందులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. 2021–22లో మధుమేహ వ్యాధిగ్రస్తులు వాడే మెట్ఫార్మిన్ మాత్రలు ఏకంగా 18.10 కోట్లు వినియోగించారు. రక్తపోటు బాధితులు వాడే అటెనోలాల్ 10.72 కోట్లు, ఆమ్లోడిపైన్ 9.45 కోట్లు చొప్పున వినియోగించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అటెనోలాల్ మాత్రల వినియోగం 2020–21తో పోలిస్తే 4.15 కోట్ల మేర పెరిగింది. ఇవి కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వినియోగమైనవి మాత్రమే. ఇక ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్ షాపుల్లో వినియోగించిన వారు ఉంటారు. కరోనా వైరస్ సోకిన కొందరిలో వైరస్ ప్యాంక్రియాస్ (క్లోమం)పై దాడిచేయడం, చికిత్స సమయంలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ వాడటం కారణంగా బ్లడ్ షుగర్ లెవల్స్ పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. మధుమేహం మాత్రల వినియోగం పెరగడానికి మారుతున్న జీవనశైలికి తోడు కరోనా కూడా ఓ కారణం అయి ఉండొచ్చని వారు విశ్లేషిస్తున్నారు. అవసరానికి తగ్గట్టుగా 2021–22లో ప్రభుత్వాస్పత్రులకు మందులు, సర్జికల్స్ సరఫరాకు ప్రభుత్వం రూ.410 కోట్లు ఖర్చు చేసింది. ప్రభుత్వాస్పత్రుల్లో అవసరానికి తగ్గట్టుగా ప్రభుత్వం అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచింది. డబ్ల్యూహెచ్‌వో, గుడ్ మాన్యుఫ్యాక్ఛరింగ్ ప్రాక్టీస్ (జీఎంపీ) నిబంధనలకు లోబడి 480 రకాల మందులు ఆస్పత్రుల్లో ఉంటున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో 229 రకాల మందులు మాత్రమే అందుబాటులో ఉండేవి. రెండో స్థానంలో పెయిన్ కిల్లర్ మాత్రలు ప్రభుత్వాస్పత్రుల్లో మధుమేహం మాత్రల వినియోగం అనంతరం రెండో స్థానంలో పెయిన్ కిల్లర్ మాత్రలు నిలిచాయి. నొప్పి నివారణకు వాడే డైక్లోఫినాక్ మాత్రలు 17.65 కోట్లు వినియోగించారు. 2020–21లో మూడోస్థానంలో ఉన్న ఈ మాత్రల వినియోగం 2021–22లో రెండోస్థానానికి పెరిగింది. అదేవిధంగా కరోనా వ్యాప్తి నేపథ్యంలో చిన్నపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు సూచనలున్నా ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా పారాసిట్మల్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గడిచిన రెండేళ్లలో ఈ మాత్రలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. అయితే కరోనా తొలిదశ వ్యాప్తితో పోలిస్తే రెండోదశలో పారాసిట్మల్ మాత్రల వినియోగం ప్రభుత్వాస్పత్రుల్లో కొంతమేర తగ్గింది. 2020–21లో 18 కోట్ల మాత్రలు వినియోగించగా... 2021–22లో 16.78 కోట్లు వినియోగించారు. -
కాఫీ ఎక్కువైతే.. కంగారే!
పొద్దున లేవగానే కాఫీ చుక్క గొంతులో పడనిదే రోజు గడవదు చాలామందికి. కానీ అదే కాఫీ పరిమితి మించితే మాత్రం కంగారు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మం నుంచి కంటి దాకా ఎన్నో సమస్యలనూ కాఫీ తెచ్చిపెడుతుందని ఈ అంశంపై పరిశోధనలు చేసిన ఈస్తటిక్ క్లినిక్ ఫౌండర్ డాక్టర్ అహ్మద్ ఎల్ మాంటసర్ హెచ్చరిస్తున్నారు. మరి ఆ సమస్యలేంటి.. వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగంటే.. వయసు పెరిగిపోద్ది.. బాగా వర్క్ ప్రెషర్తోనో, ఇంకేదో ఒత్తిడితోనో కాఫీ తెగ తాగేస్తూ ఉంటాం. చిత్రమేంటంటే.. కాఫీ ఎక్కువైతే కిడ్నీలు కార్టిసాల్ అనే హార్మోన్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయట. మరి ఈ కార్టిసాల్‌తో మన చర్మంలోని గ్రంధుల నుంచి నూనె స్రావాలు పెరుగుతాయని.. చర్మ రంధ్రాలు మూసుకుపోయి.. మొటిమలు, ఇతర సమస్యలు వస్తాయని మాంటసర్ చెప్తున్నారు. దీనికితోడు ఆల్కహాల్ తరహాలోనే కెఫీన్ అధికంగా తీసుకుంటే.. డీహైడ్రేషన్‌కు దారితీస్తుందని, చర్మం పొడిబారి కాంతివిహీనంగా మారుతుందని అంటున్నారు. అంటే.. ఈ సమస్యలతో ఎవరైనా వారి వయసుకు మించి కనబడతారని వివరిస్తున్నారు. – సాధారణంగా రోజూ తాగే నీటితోపాటు.. ప్రతి కప్పు కాఫీకి మరో గ్లాసు నీళ్లు అదనంగా తాగాలని హార్మోన్ స్పెషలిస్టు సోఫీ షాటర్ సూచిస్తున్నారు. దానివల్ల సమస్య కొంత ఉపశమిస్తుందని అంటున్నారు. రిలీఫ్ కాదు.. చిరాకు.. కాఫీ ఎక్కువైతే శరీరంలో అడ్రినల్ హార్మోన్ ఉత్పత్తి పెరుగుతుందని.. దీనితో రక్తపోటు పెరిగి, నిద్రలేమికి దారితీస్తుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. సరిగా నిద్ర లేకపోవడం వల్ల మానసిక సమస్యలకు కారణమవుతుంది. కాఫీ అలవాటు ఎక్కువగా ఉన్నవారిలో 33శాతం మందికి నిద్ర సమస్య వస్తోందని పరిశోధనల్లో వెల్లడైంది కూడా. ఇక అధిక కెఫీన్ వల్ల మెదడుకు రక్త సరఫరా తగ్గి.. మానసిక ఆందోళన పెరుగుతుందని, ఏకాగ్రత తగ్గిపోతుందని నిపుణులు చెప్తున్నారు. – కాఫీ అలవాటును నియంత్రించుకోవాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిద్ర పోవడానికి రెండు, మూడు గంటల ముందు నుంచీ కాఫీకి దూరంగా ఉండాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. స్ట్రోక్.. మైగ్రేన్ ప్రమాదం కూడా.. కాఫీలోని కెఫీన్‌కు వ్యసనంగా మారే లక్షణం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు. కాఫీ తీసుకున్నప్పుడు మెదడు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో రక్తనాళాలు సంకోచానికి గురవుతాయని.. తాగడం ఆపేసినప్పుడు వ్యాకోచించి తలనొప్పి వస్తుందని అంటున్నారు. ఇది కొందరిలో మైగ్రేన్‌కు దారితీస్తుందని వివరిస్తున్నారు. అందువల్లే తలనొప్పి అనిపించినప్పుడల్లా కాఫీ తాగుతూ.. అదో అలవాటుగా మారుతుందని పేర్కొంటున్నారు. కొందరిలో రక్తంలో షుగర్ లెవల్స్ పెరగడం, కండరాలు మెలితిప్పినట్టు, తిమ్మిరిగా అనిపించడం, చేతులు వణకడం..వంటివీ తలెత్తుతాయని అంటున్నారు. – ఇప్పటికే అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు కాఫీ వినియోగాన్ని తగ్గించాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకుంటే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు. కంటి సమస్యలకూ దారి.. అధిక కెఫీన్ రక్తపోటును పెంచడం వల్ల.. కళ్లకు రక్తాన్ని సరఫరా చేసే సన్నని రక్తనాళాలు దెబ్బతిని, కంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కొందరిలో రెటీనా దెబ్బతినే ప్రమాదమూ ఉంటుందని అంటున్నారు. – రోజుకు మూడు కప్పులకు మించి కాఫీ తాగితే.. కంటి సమస్యలను కొని తెచ్చుకోవడమేనని, తగ్గిస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. –సాక్షి, సెంట్రల్‌డెస్క్ -
‘హృదయ’ వేదన! చిన్న వయసులోనే ఆగుతున్న శ్వాస.. కారణలివే!
గాంధారి మండలం గుజ్జుల్ తండాకు చెందిన జగ్గు అనే వ్యక్తి ఛాతీలో నొప్పంటూ కుప్పకూలిపోయాడు.. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. జగ్గును బతికించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వైద్యుడు లక్ష్మణ్ సైతం గుండెపోటుకు గురై అక్కడికక్కడే తనువు చాలించారు. వైద్యం కోసం వేరే ఆస్పత్రికి తరలించే క్రమంలో పేషెంట్ కూడా మృత్యు ఒడికి చేరాడు. ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనలు గాంధారిలో విషాదాన్ని నింపాయి. ఇలా రోజూ ఎందరో గుండెపోటుకు గురై మృత్యువాతపడుతున్నారు. సాక్షి, కామారెడ్డి: అన్ని రంగాల్లో పెరిగిన పో టీ, మారిన ఆహారపు అలవాట్లు ప్రజల జీవన ప్రమాణాలపై ప్రభావం చూపుతున్నాయి. శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడంతో ఆరోగ్యం దెబ్బతింటోంది. రక్తపోటు గుండెపోటుకు దారితీస్తోంది. సకాలంలో గు ర్తించకపోవడం, సరైన సమయంలో వైద్యం అందకపోవడంతో పలువురు మృత్యుఒడికి చేరుతున్నారు. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో అధిక రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతూ చాలా మంది గుండె సమస్యల బారిన పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో అధిక రక్తపోటుతో బాధపడుతున్నవారు 33,137 మంది, నిజామాబాద్ జిల్లాలో 60 వేల మంది వరకు ఉన్నారు. అంటే ఉమ్మడి జిల్లాలో 90 వేల పైచిలుకు మంది రక్తపోటుతో బాధపడుతున్నారు. అలాగే మధుమేహం బారిన పడిన వారు కామారెడ్డి జిల్లాలో 17,690 మంది ఉండగా, నిజామాబాద్ జిల్లాలో దాదాపు 30 వేల మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మధుమేహం బాధితులు 47 వేలు దాటారు. ఒత్తిళ్లు, ఆహారపు అలవాట్లతో.. పొగ పీల్చడం, అతిగా మద్యం సేవించడం, అనవసరపు ఒత్తిళ్లు, జంక్ ఫుడ్ తినడం వంటి వాటితో రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఒత్తిళ్లను అధిగమించాలి ముఖ్యంగా యువత సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, సరిపడా నిద్రలేకపోవడం, జంక్‌ఫుడ్ తినడం, మద్యం సేవించ డం, స్థూలకాయం, ఒత్తిడి వంటి వాటితో గుండె జబ్బులబారిన పడుతున్నారు. సరైన వ్యాయామం లేకపోవడం కూడా ఇబ్బంది కలిగిస్తోంది. – సురేశ్, ఎండీ, జనరల్ ఫిజీషియన్, కామారెడ్డి -
World Diabetes Day: డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలివే...
నేడు వరల్డ్ డయాబెటిస్ డే.. ప్రపంచవ్యాప్తంగా గడిచిన 40 ఏళ్లలో షుగర్ బాధితుల సంఖ్య నాలుగింతలు పెరిగిందంటే అదెంత ఎక్కువో అర్థం చేసుకోవచ్చు. మనదేశంలో డయాబెటిస్ బాధితులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మొదటి ఐదు స్థానాల్లో వరసగా కేరళ – 7.5% (మన జాతీయ సగటు కూడా 7.5%), తమిళనాడు –6.6%, ఆంధ్రప్రదేశ్ – 6.6%, తెలంగాణ – 4.8%, కర్ణాటక – 4.6% డయాబెటిస్ బాధితులు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత ఎక్కువగా పెరగనుందనే నిపుణుల అంచనా. ఈ నేపథ్యంలో ఈ నెల 14న ‘ప్రపంచ డయాబెటిస్ డే’ సందర్భంగా డయాబెటిస్ కట్టడి గురించి మరోమారు చర్చించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది థీమ్... ‘‘డయాబెటిక్ బాధితుల ఆరోగ్య రక్షణ బాటలో... ఇప్పుడు కాకపోతే మరెప్పుడు? (యాక్సెస్ టు డయాబెటిస్ కేర్... ఇఫ్ నాట్ నౌ, వెన్?)’’. ఈ దృక్కోణంతో డయాబెటిస్‌పై అవగాహన కోసం ఈ కథనం. మధుమేహం (డయాబెటిస్)లో ఎన్నో రకాలు. మనకు ప్రధానంగా చెప్పుకునేవి మూడే. టైప్–1, టైప్–2, గర్భవతుల్లో వచ్చే జెస్టేషనల్ డయాబెటిస్. ఇవిగాక... లేటెంట్ ఆటోఇమ్యూన్ డయాబెటిస్ ఇన్ అడల్ట్స్ (లాడా), మెచ్యురిటీ ఆన్సెట్ ఆఫ్ ద యంగ్ (మోడీ), నియోనేటల్ డయాబెటిస్, వోల్ఫ్రామ్ సిండ్రోమ్, ఆల్స్ట్రామ్ సిండ్రోమ్, టైప్–3 డయాబెటిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్ డయాబెటిస్ అంటూ అనేక రకాలు ఉన్నాయి. అన్నిట్లోనూ ప్రధానంగా బాధించేది టైప్–2 డయాబెటిస్ కాబట్టి దాన్ని గురించి వివరంగా తెలుసుకుందాం. డయాబెటిస్‌కు ముందస్తు లక్షణాలివే... ►తరచుగా మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడం ►మూత్ర విసర్జన సమయంలో మూత్రం ఎప్పటిలా పూర్తిగా పారదర్శకంగా కాకుండా మబ్బుగా (క్లౌడీ)గా ఉండటంతో పాటు, ఒక రకమైన పండ్ల వాసనలాంటిది రావడం. ►కంటి చూపు మందగించడం/మసకచూపు. ►ఆకస్మికంగా బరువు పెరగడం లేదా బరువు తగ్గడం. ►నీరసం ∙ఎక్కువగా ఆకలి వేయడం, విపరీతమైన దాహం, నోరూ, గొంతూ ఎండిపోతున్నట్లుగా అనిపించడం. ►చేతులూ– కాళ్లలో స్పర్శ తెలియకపోవడం. ►చర్మంపై ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటివి డయాబెటిస్ వచ్చే ముందర కనిపిస్తాయి. అలాగే మహిళల్లో... ∙చర్మం పొడిబారడం, దురదలు తరచూ మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు. ఇవేగాక... కొందరిలో చర్మ వ్యాధులు, కాస్తంత వినికిడి లోపం, డిప్రెషన్, మానసిక అశాంతి, తరచూ మూడ్స్ మారిపోతూ ఉండటం, దంత సమస్యలు, నుదురు, మెడ, చంకలు, గజ్జలు లాంటి ప్రాంతాల్లో చర్మం రంగు మారి దళసరికావడం. వయసు 35 – 40కి పైబడినవారిలో పై లక్షణాలు కనిపిస్తుంటే వాటిని డయాబెటిస్ హెచ్చరికలుగా భావించి, డాక్టర్‌ను సంప్రదించాలి. అసలు డయాబెటిస్ అంటే... నిజానికి రక్తంలో చక్కెర మోతాదులు పెరగడమే ‘డయాబెటిస్’ అని చాలామంది అనుకుంటారు. నిజానికి అదో చిహ్నం మాత్రమే. డయాబెటిస్ రావడానికి ముందు దేహంలో చాలా మార్పులు జరుగుతాయి. వాటన్నింటినీ కలుపుకుని డయాబెటిస్ అనవచ్చు. మనకు అర్థమయ్యే తేలిక భాషలో డయాబెటిస్ గురించి చెప్పుకుందాం. ►మనం చేసే పనులకు శక్తి కావాలి. ఆ శక్తినిచ్చేదే గ్లూకోజ్. ►మనం తిన్న ఆహారం గ్లూకోజ్‌గా మారుతుంది. అప్పుడది ఇన్పులిన్ సహాయంతో గ్లైకోజెన్‌గా మారి కాలేయంలో, కండరాలలో నిల్వ ఉంటుంది. మనకు మళ్లీ శక్తి అవసరమైనప్పుడు గ్లూకగాన్ అనే హార్మోన్ స్రవించి, ఆ గ్లూకోజ్/చక్కెరను బయటకు తెస్తుంది. ►అలా రాగానే... దాన్ని కండరాల్లోని కణాలకు అందేలా చేయడంతో పాటు, పని పూర్తయ్యాక రక్తంలో మిగిలిపోయిన చక్కెరను మళ్లీ కాలేయంలో నిల్వ ఉంచేలా చేసేందుకు ‘ఇన్సులిన్’ అనే హార్మోన్ అవసరమవుతుంది. ►ఈ ఇన్సులిన్‌ను ప్యాంక్రియాస్ ఉత్పత్తి చేస్తుంది. ►డయాబెటిస్ అంటే అందరూ రక్తంలో చక్కెర మిగిలిపోవడం అనో లేదా ఇన్సులిన్ ఉత్పత్తికాకపోవడం లేదా ఉత్పత్తి అయిన ఇన్సులిన్ సరిపోక రక్తంలో చక్కెర వృథా అయిపోవడం, అది మరింతగా పెరిగినప్పుడు మూత్రంలో వెళ్లడం అనుకుంటారు. కానీ నిజానికి ఇన్సులిన్ ఉత్పత్తి అయినప్పటికీ... శక్తి వనరు అయిన గ్లూకోజ్‌ను కండరాలకు సరిగా అందించలేదు. దీన్నే ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ అంటారు. నిజానికి రక్తంలో మిగిలిపోయిన చక్కెరతో మొదట్లో పెద్దగా హాని జరగదు. కాకపోతే రక్తం సహజంగా చిక్కగా ఉంటుంది. దానికి తోడు దానిలో కలిసే చక్కెరతో అది మరింత చిక్కబడి, ఉండలు (క్లాట్స్) ఏర్పడటం, ఆ చిక్కబారిన రక్తాన్ని పంప్ చేయడం కోసం మరింత ఎక్కువ ఒత్తిడి అవసరమై హైబీపీ రావడం వంటి పరిణామాలు జరుగుతాయి. దానివల్ల దేహానికి హాని చేకూరుతుంది. ఈ క్రమంలో డయాబెటిస్ దేహంలోని అన్ని అవయవాలపై తన దుష్ప్రభావం చూపుతుంది. ఇవీ డయాబెటిస్ దుష్ప్రభావంతో జరిగే వాటిల్లో కొన్ని మాత్రమే. అందుబాటులోకి రానున్న కొత్త చికిత్సలు ►ఇప్పటివరకూ డయాబెటిస్ బాధితులకు మెట్ఫార్మిన్, సల్ఫోనైల్ యూరియా, ఆల్ఫా అకార్బో ఇన్హిబిటర్స్, డీపీపీ4–గ్లిపిన్స్, జీఎల్పీ–1 అనలాగ్‌లతో పాటు ఇన్సులిన్ వంటివీ...వాటినీ వ్యాధి తీవ్రతను బట్టి వాటిని రెండు, మూడు, నాలుగు మాత్రల మోతాదుల్లో ఇస్తుంటారు. ఇటీవల తెలియవచ్చిన కొన్ని అత్యాధునికమైన అంశాల ఆధారంగా రోగి నుంచి రోగికి చికిత్సలు మార్చుతూ వేర్వేరు రకాల వైద్యాలు అందిస్తున్నారు. కారణాలను బట్టి వ్యక్తిగతమైన చికిత్స బాధితుల్లో డయాబెటిస్‌కు కారణమైన అంశం... అది ఒత్తిడి కావచ్చు లేదా అధికమోతాదుల్లో తినడం, వ్యాయామం లేకపోవడం లేదా మరో అంశం కావచ్చు. వాటి ఆధారంగా కొన్ని ‘ఇన్ఫ్లమేటరీ టెండెన్సీస్’ రావడాన్ని గమనించి, డాక్టర్లు... ఆ ‘ఇన్ఫ్లమేటరీ గుణాలు’ తగ్గేలా మందులు ఇవ్వనున్నారు. ►ఎన్‌క్యాప్సులేటెడ్ బీటా సెల్ రీప్లేస్మెంట్ థెరపీ: ఇది టైప్–1 డయాబెటిస్‌కు అందుబాటులోకి రానున్న చికిత్స. ప్యాంక్రియాస్‌లో రెండు రకాల కణాలుంటాయి. మొదటివి ఆల్ఫా సెల్స్. ఇవి గ్లూకగాన్ను ఉత్పత్తి చేయడంలో తోడ్పడతాయి. రెండో రకం కణాలు బీటా సెల్స్. ఇవి ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసేవి. ఈ చికిత్సలో ఇతర రోగుల నుంచి బీటా సెల్స్‌ను సేకరించి, వాటిని రోగి ప్యాంక్రియాస్ వద్ద ప్రవేశపెడతారు. అవి క్రమంగా క్రియాశీలమవుతాయి. అవి... పేషెంట్ రక్తంలో ఎంత మోతాదులో చక్కెర విడుదల అవుతుందో గమనించి, దాన్ని నియంత్రించడానికి సరిగ్గా ఎంత కావాలో అంతే ఇన్సులిన్ విడుదల అయ్యేలా చేస్తాయి. దాదాపుగా ఇదే రకమైన చికిత్సనే మరో పద్ధతిలో టైప్–2 డయాబెటిస్ రోగులకూ అందుబాటులోకి త్వరలో రానుంది. ఈ ప్రక్రియలో.. చురుగ్గా ఉన్న బీటా సెల్స్‌ను బయటకు తీసి, వాటిని కృత్రిమ కణవిభజన ప్రక్రియ ద్వారా పెరిగేలా చేసి రోగి శరీరంలోకి ప్రవేశపెడతారు. ►నానో పార్టిక్యూలేట్ ఆధారిత చికిత్స : ఇది మరీ మరీ సరికొత్తది. ఇందులో మందు మోతాదు చాలా తక్కువ పాళ్లలో కణాల్లోకి ప్రవేశించడమే గాక, అదక్కడ చాలాకాలం ఉండి, కణం తాను వినియోగించుకోవాల్సిన చక్కెరను సమర్థంగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇలాంటి సరికొత్త చికిత్సలు బాధితుల పాలిట ఆశారేఖగా కనిపిస్తున్నాయి. డాక్టర్ ప్రభుకుమార్ చల్లగాలి సీనియర్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ -
Covid: జీవితాన్ని కడగండ్లపాలు చేస్తున్న కొత్త జబ్బులు..
సాక్షి, బనశంకరి (కర్ణాటక): జీవితాన్ని కడగండ్లపాలు చేసే ఇతర జబ్బులకు కూడా కోవిడ్ రక్కసి కారణమవుతోంది. గత ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కేవలం 6 నెలల్లో రాష్ట్రంలో 59, 632 మంది డయాబెటిస్, రక్తపోటు (బీపీ) రోగాల బారినపడినట్లు జాతీయ డయాబెటిస్ నియంత్రణ కార్యక్రమంలో వెల్లడైంది. కొత్తగా షుగర్ జబ్బు కనబడిన రోగుల్లో 35 నుంచి 40 శాతం మంది కోవిడ్‌కు గురైనవారిగా తేలింది. జీవనంలో మార్పులకు తోడు కోవిడ్ సోకడం వల్ల షుగర్, బీపీ ప్రమాదం పెరిగింది. తీవ్రమైన కోవిడ్ బారినపడినవారికి చికిత్సలో స్టెరాయిడ్స్ ఔషధాలను ఇస్తారు. దీంతో దేహంలో షుగర్ భారీగా పెరిగి మధుమేహానికి దారి తీస్తోందని నిపుణులు తెలిపారు. కొత్త ప్రమాదాలు.. ఇప్పటికే కర్ణాటకలో లక్షలాది మంది మధుమేహ, బీపీ రోగులు ఉన్నారు. కొత్తగా వచ్చినవారు వీరికి అదనం. నగర ప్రదేశాలకు పరిమితం కాదని, పల్లెల్లోని వారు, అక్కడి నుంచి వలస వచ్చిన వారిలో కూడా బీపీ, షుగర్ కనిపించాయి. కోవిడ్ రోగుల్లో 30 నుంచి 40 శాతం మందిలో మధుమేహం, బీపీ కనపించినట్లు ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు తెలిపారు. కోవిడ్ సోకినప్పటికీ తీవ్రం కాకుండా సత్వర చికిత్స తీసుకోవడం, ఆరోగ్యకర జీవన రీతులతో షుగర్, బీపీ రాకుండా చూసుకోవచ్చని పేర్కొన్నారు. -
వయసు పెరిగాకే డయాబెటిస్, బీపీ వస్తుందా? కానే కాదు..
వయసు పెరిగాకే డయాబెటిస్, బీపీ వంటి వ్యాధులు వస్తాయనే నమ్మకాన్ని సడలిస్తూ చిన్నారుల్లోనూ డయాబెటిస్ ఇప్పటికే విస్త్రుతంగా వ్యాపిస్తోంది. అదే విధంగా ఇప్పుడు రక్తపోటు (బీపీ) కూడా వయసులకు అతీతంగా విజృంభిస్తోందని తాజాగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. అంతేకాదు.. అధిక శాతం మంది చిన్నారులు బీఎంఐ లాంటి జీవనశైలి వ్యాధులతో బాధపడుతున్నారని, 13% మంది చిన్నారులు శ్వాససంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని తేల్చింది. టీనేజ్‌పై.. రక్తపోటు.. దేశవ్యాప్తంగా 64,165 మంది తల్లిదండ్రులను హీల్ఫా స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్ సంప్రదించడంతో పాటుగా వారి 318 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులకు సవివరంగా ఆరోగ్య పరీక్షలను నిర్వహించి ఓ సమగ్ర అధ్యయనాన్ని విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్నాటక మహారాష్ట్రలలో 18 నెలల పాటు ఈ అధ్యయనం జరిగింది. హీల్ఫా హెల్త్ రిపోర్డ్ కార్డ్ ప్రకారం, ప్రస్తుతం, పిల్లల్లో అత్యధిక రక్తపోటు అనేది పెరుగుతున్న ఆరోగ్య సమస్యగా మారుతోంది. పరీక్షలలో పాల్గొన్న వారిలో... 17% మంది విద్యార్థులు రక్తపోటు సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీరిలో 8% బాలికలు, 9% బాలురు పెరిగిన రక్తపోటుతో బాధపడుతున్నారు. బీపీ సమస్యలు పిల్లల్లో పెరగడం అనేది అత్యంత ఆందోళన కరమైన అంశమే అయినప్పటికీ, మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే ఎక్కువ శాతం మంది పిల్లలు అధిక/స్వల్ప బీఎంఐ సంబంధిత సమస్యలతో బాధపడుతుండటం. పరీక్షించిన బాలురులో దాదాపు 71% మంది బీఎంఐ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, 60% మంది బాలికలు ఈ సమస్యతో బాధపడుతున్నారు. కారణాలెన్నో.. పెరుగుతున్న కాలుష్యం, శ్వాస సంబంధిత వ్యాయామాలు చేయకపోవడం, తరచుగా పొగ బారిన పడుతుండటంతో చిన్నారుల శ్వాస సంబంధిత వ్యవస్ధలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. టీనేజర్లలో ఈ సమస్యను గుర్తించకపోవడం వల్ల పరిస్థితులు దిగజారే ప్రమాదాలూ ఉన్నాయి ‘‘మా పరీక్షల ఫలితాల ప్రకారం, కేవలం 0.0018% మన చిన్నారులు మాత్రమే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారు.ఓ దేశంగా 26.5 కోట్ల జనాభాలో కేవలం 4885 మంది మాత్రమే సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉన్నారు. ఇది ప్రమాదఘంటికలను మోగిస్తుంది. ప్రభుత్వంతో పాటుగా తల్లిదండ్రులు, ఈ దిశగా ఆలోచన చేయడంతో పాటుగా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది’’ అని హీల్ఫా ఫౌండర్, సీఎస్ఓ రాజ్ జనపరెడ్డి అన్నారు. ‘భావి భారత చిన్నారుల ఆరోగ్య స్ధితి పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల, ప్రిన్సిపాల్స్ ప్రభుత్వాలకు సైతం రియాల్టీ చెక్‌గా హీల్ఫా హెల్త్ రిపోర్ట్ కార్డ్ నిలుస్తుంది. 130 కోట్ల జనాభా కలిగిన దేశంలో 41% మంది ప్రజలు 18 సంవత్సరాల లోపు వారు. మనం అత్యధికంగా పనిచేసే జనాభా దిశగా వెళ్తున్నాం కానీ ,అలాగే అనారోగ్యవంతమైన సమాజం దిశగా వెళ్తున్నాం’’ అని అన్నారాయన. జాగ్రత్తలతో చెక్.. ఆరోగ్యవంతమైన వాతావరణం సృష్టించడం ద్వారా మాత్రమే బీపీ సంబంధిత సమస్యలను అడ్డుకోగలం. చిన్నారుల జీవనశైలి అలవాట్లు , ఆహారం, వ్యాయామాలు, స్క్రీన్ టైమ్‌ను అత్యవసరంగా సమీక్షించాల్సిన అవసరం ఉందని రాజ్ జనపరెడ్డి అంటున్నారు. అలాగే చిన్నారులకు మూడు సంవత్సరాల వయసు దాటిన తరువాత సంవత్సరానికో సారి తప్పనిసరిగా రక్తపోటు పరీక్షలను చేయించడం అవసరమన్నారు. -
బ్లూస్మార్ట్‌తో జియో–బీపీ జట్టు
న్యూఢిల్లీ: పెద్ద యెత్తున దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం విద్యుత్ వాహన సేవల సంస్థ బ్లూస్మార్ట్‌తో జియో–బీపీ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం బ్లూస్మార్ట్ కార్యకలాపాలు ఉన్న నగరాల్లో ఈవీ చార్జింగ్ మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రణాళికలు, అభివృద్ధి, నిర్వహణ తదితర అంశాల్లో రెండు సంస్థలు కలిసి పనిచేయనున్నాయి. దేశీ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటన్‌కు చెందిన బీపీ కలిసి సంయుక్తంగా జియో–బీపీని జాయింట్ వెంచర్‌గా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముందుగా దేశ రాజధాని ప్రాంతంలో (ఎన్సీఆర్) వీటిని ఏర్పాటు చేయనున్నట్లు జియో–బీపీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పే ఈ స్టేషన్ల కనీస చార్జింగ్ సామర్థ్యం 30 వాహనాలుగా ఉంటుందని వివరించింది. ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా రవాణా సేవలు అందించే బ్లూస్మార్ట్ తమ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా ఇతర ప్రధాన నగరాల్లో కూడా విస్తరించే ప్రణాళికల్లో ఉంది. బ్రిటన్, జర్మనీ దేశాల్లో ఈవీ చార్జింగ్ నెట్వర్క్ విషయంలో బీపీకి గల అనుభవం .. దేశీయంగా చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో జియోకి తోడ్పడగలదని జియో–బీపీ సీఈవో హరీష్ సి మెహతా తెలిపారు. దేశీయంగా ప్రపంచస్థాయి ఈవీ చార్జింగ్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ అందించడంలో తమ సామర్థ్యాలకు జియో–బీపీతో ఒప్పందమే నిదర్శనమని బ్లూస్మార్ట్ సహ వ్యవస్థాపకుడు,సీఈవో అన్మోల్ జగ్గీ తెలిపారు. -
ఎర్రటి బెండకాయలు.. లాభాలెన్నో.. ధర ఎంతంటే!
బెండకాయలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయన్నది నిపుణుల మాట. రక్తహీనతను నివారించడంలోనూ.. చక్కెర స్థాయిని నియంత్రించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి. అదే విధంగా జీర్ణకోశానికి మేలు చేస్తాయి. కంటి ఆరోగ్యాన్ని, ఎముకల దారుఢ్యాన్ని మెరుగుపరచడంలోనూ బెండకాయల పాత్ర మరువలేనిది. ఇన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయి గనుకే చాలా మంది బెండకాయలతో చేసిన వంటకాలను ఇష్టపడతారు. ఒకే తరహాలో కాకుండా కూరలు, వేపుళ్లు, పులుసు.. ఇలా రకారకాలుగా ట్రై చేస్తూ ఎప్పటికప్పుడు భిన్న రుచులను ఆస్వాదిస్తారు. కొన్ని ప్రాంతాల్లో అయితే.. బెండకాయలను పచ్చిగాను, ఊరవేసుకుని కూడా తింటారు. ఎర్ర బెండీలు.. భలే భలే.. ఇక బెండకాయలను భారత్‌తో పాటు దాదాపు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లోనూ సాగు చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే, సాధారణంగా ఆకుపచ్చని రంగులో ఉండే బెండకాయలే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. కానీ, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ రైతు.. ఎర్రని బెండకాయలు పండిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. మిస్రిలాల్ రాజ్‌పుత్ ఈ కొత్తరకం సాగుతో అందరిలోనూ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. వారణాసిలోని వ్యవసాయ యూనివర్సిటీ నుంచి కిలో ఎర్ర బెండీ గింజలు తీసుకువచ్చిన ఆయన.. 40 రోజుల్లోనే పంట చేతికి వచ్చిందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం గురించి మిస్రిలాల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ‘‘ సాధారణమైన ఆకుపచ్చ రంగులో కాకుండా ఎరుపు రంగులో ఉండే బెండీలను పండించడం కొత్తగా అనిపిస్తోంది. వీటిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బీపీ సమస్యలు, షుగర్ పేషెంట్లు, కొలెస్ట్రాల్‌తో బాధపడే వారికి ఇవి ఉపయుక్తంగా ఉంటాయి. జూలై మొదటి వారంలో ఎర్రటి బిండీ విత్తనాలను నాటాను. ఎటువంటి క్రిమిసంహారకాలు వాడకుండానే వీటిని పండించాను’’ అని రెడ్ లేడీఫింగర్ గురించి చెప్పుకొచ్చారు. చదవండి: National Nutrition Week 2021: రోజూ ఉదయం ఈ డ్రింక్స్ తాగితే.. సాధారణ బెండకాయలు అయితే, మామూలు బెండకాయలకంటే వీటి ధర మాత్రం 5- 7 రెట్లు ఎక్కువగా ఉంటుందని మిస్రీలాల్ చెబుతున్నారు. కొన్ని సూపర్మార్కెట్లలో ఎర్ర బెండీల ధర అరకేజీకి కనిష్టంగా రూ. 70- 80, గరిష్టంగా.. 300- 400 రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు. ఇక సాగు విషయానికొస్తే.. ఎకరా స్థలంలో ఒక పంటకు 70- 80 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆయన తెలిపారు. సాధారణంగా బెండకాయల్లో ఉండే పోషకాలు ►బెండకాయల్లో స్వల్పంగా పిండి పదార్థాలు, ప్రొటీన్లు ఉంటాయి. ►విటమిన్–ఎ, విటమిన్–బి1, బి2, బి3, బి9, విటమిన్–సి, విటమిన్–ఇ, విటమిన్–కె వంటి విటమిన్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి ఖనిజ లవణాలు ఉంటాయని ప్రతీతి. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
కరోనాను జయించిన వందేళ్ల బామ్మ
హైదరాబాద్: కరోనాను జయించిన ఈ బామ్మ పేరు ఆండాళ్లమ్మ. సరూర్‌నగర్‌లోని వికాస్‌నగర్‌లో నివసిస్తున్న ఈమె శత వసంతాలు పూర్తి చేసుకుంది. కొద్దిగా వినికిడి సమస్య మినహా బీపీ, షుగర్ వంటి అనారోగ్య ఇబ్బందులు లేకపోవటం గమనార్హం. మహారాష్ట్రలో ఉండే మనుమరాలు, ఆమె భర్తకు కరోనా సోకటంతో హైదరాబాద్ తీసుకొచ్చి వైద్యం చేయించారు. ఈ క్రమంలో ఇటీవల ఆండాళ్లమ్మ కోవిడ్ బారినపడ్డారు. అయితే కరోనా వచ్చిందని తెలిసినా ఆమె ఏమాత్రం భయపడలేదు. మనోనిబ్బరంతో డాక్టర్లు సూచించిన విధంగా మందులు వాడి కరోనాను జయించింది. ఆమె ధైర్యంగా ఉండటమే కాక, కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది. ఇలా వందేళ్ల వయసులోనూ కరో నాను జయించిన బామ్మను చూసి చుట్టుపక్కల వారు అభినందిస్తున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకోవాలంటున్నారు. చదవండి: కోవిడ్-19 రోగులకు ఆక్సీమీటర్లు ఎందుకు అవసరం? -
కేజీ–డీ6 గ్యాస్ కోసం గట్టి పోటీ
న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బీపీకి చెందిన కేజీ–డీ6 బ్లాక్‌లో ఉత్పత్తి చేసే గ్యాస్ కోసం ఇటీవల నిర్వహించిన వేలంలో బిడ్డింగ్ తీవ్ర స్థాయిలో జరిగింది. దాదాపు 14 సంస్థలు సుమారు ఏడున్నర గంటల పాటు బిడ్డింగ్‌లో పాల్గొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, గెయిల్ గ్యాస్, అదానీ టోటల్, టోరెంట్ గ్యాస్, షెల్, ఐజీఎస్ తదితర సంస్థలతో పాటు రిలయన్స్‌కి చెందిన ఓ2సీ వ్యాపార విభాగం వీటిలో ఉన్నాయి. కేజీ–డీ6 బ్లాక్‌లోని కొత్త క్షేత్రాల నుంచి అదనంగా ఉత్పత్తి చేసే సహజ వాయువుకు సంబంధించి మే 5న ఈ వేలం నిర్వహించారు. 3–5 ఏళ్ల పాటు రోజుకు 5.5 మిలియన్ ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) గ్యాస్‌ను వేలం వేశారు. అంతిమంగా రిలయన్స్ ఓ2సీ అత్యధికంగా 3.2 ఎంసీఎండీ గ్యాస్‌ను దక్కించుకుంది. రిలయన్స్–బీపీ జాయింట్ వెంచర్ సంస్థ ఐజీఎస్ 1 ఎంసీఎండీ, అదానీ గ్యాస్ 0.15 ఎంసీఎండీ, ఐఆర్ఎం ఎనర్జీ 0.10 ఎంసీఎండీ, గెయిల్ (రోజుకు 30,000 ఘనపు మీటర్లు), టోరెంట్ గ్యాస్ (రోజుకు 20,000 ఘనపు మీటర్లు) మిగతా సహజ వాయువును దక్కించుకున్నాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ (డీజీహెచ్) ఆమోదించిన థర్డ్ పార్టీ స్వతంత్ర ప్లాట్‌ఫాంపై రిలయన్స్–బీపీ గ్యాస్ వేలం నిర్వహించడం ఇది మూడోసారి. క్రిసిల్ రిస్క్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సొల్యూషన్స్ (క్రిస్) రూపొందించిన ఈ ఆన్లైన్ బిడ్డింగ్ ప్లాట్‌ఫాంను ఈ ఏడాది ఫిబ్రవరితో పాటు 2019లో నిర్వహించిన వేలానికి కూడా ఉపయోగించారు. కేజీ–డీ6 బ్లాక్‌లోని కొత్త క్షేత్రాలకు సంబంధించి 3 విడతలుగా నిర్వహించిన వేలంలో రిలయన్స్–బీపీ మొత్తం 18 ఎంసీఎండీ గ్యాస్ విక్రయించింది. -
‘‘బీపీ, షుగర్ ఉన్నాయి.. ప్లీజ్ నన్ను గెలిపించండి’’
సాక్షి, చెన్నై: ఆరోగ్యశాఖను తన భుజస్కంధాలపై మోస్తున్న మంత్రే తనకు ఉన్న బీపీ, షుగర్ వంటి అనారోగ్య సమస్యలను గుర్తు చేస్తూ ప్రచారంలో పడడం సర్వత్రా విస్మయంలోకి నెట్టింది. పుదుకోట్టై జిల్లా నుంచి విరాళిమలై నుంచి విజయభాస్కర్ ఇప్పటికే రెండు సార్లు గెలిచారు. ఆరోగ్య మంత్రిగా అత్యధిక సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి విజయభాస్కర్. కరోనా కాలంలో ఆయన సేవలు ప్రశంస నీయం. తాజాగా అదే విరాళిమలై నుంచి మళ్లీ పోటీలో విజయభాస్కర్ ఉన్నారు. అయితే, సెంటిమెంట్‌తో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నంలో ఆయన తన ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు చర్చకు విస్మయానికి దారి తీసింది. తనకు బీపీ, షుగర్ వంటి సమస్యలు ఉన్నాయని, తనను ఆదరించాలన్నట్టు ఆయన ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్లడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిపై వ్యంగ్యాస్త్రాలు, సెటైర్లు వేసే వాళ్లు పెరిగారు. దీంతో గురువారం విజయభాస్కర్ ఓ మీడియాతో మాట్లాడుతూ, వివరణ ఇచ్చుకున్నారు. తానేమీ సెంటిమెంట్‌తో ఓట్ల కోసం పాకులాడడం లేదన్నారు. వాస్తవిక జీవితంలో తనకు ఉన్న సమస్యలను గుర్తు చేయడంలో తప్పులేదన్నారు. ఈ నియోజకవర్గంలో తాను అడగాల్సిన అవసరం లేదని, తన ముఖం కనిపిస్తే చాలు ఓట్లు వేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్లు ఎక్కువేనని పేర్కొన్నారు. తాను ఏ మేరకు సేవల్ని అందించానో వివరిస్తూ ఓ చోట చేసిన ప్రసంగాన్ని వక్రీకరించినట్టు పేర్కొన్నారు. వాస్తవిక జీవితంలో వి శ్రాంతి లేకుండా సేవల్ని అందించానని, అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఓ చోట బీపీ, షుగర్ గురించి మాట్లాడనే గానీ, ఇందులో తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. ఈ ప్రచారం పుణ్యమా అని ఆరోగ్యమంత్రి అనారోగ్య మంత్రయ్యాడంటూ వ్యంగ్యాస్త్రాలు హోరెత్తడం గమనార్హం. చదవండి: ఓటుకు నోటు ఇవ్వలేను.. మీరే నాకివ్వండి -
టెన్షన్.. టెన్షన్
రక్తపోటు, మధుమేహం.. రెండూ రెండే. తొలుత ఒకటి వస్తే.. కొద్ది రోజులకే రెండవది వచ్చి జతవుతోంది. వీటితో సతమతమవుతున్న వారు సగటున ప్రతి ఇంట్లో ఒకరుంటున్నారు. ఈ విషయాన్ని త్వరగా తెలుసుకోకపోతే భారీ నష్టమే వాటిల్లుతుంది. సాక్షి, అమరావతి: జీవన శైలి జబ్బుల్లో అత్యంత ప్రమాదకారిగా నిపుణులు హెచ్చరిస్తున్న హైపర్ టెన్షన్ (రక్తపోటు), మధుమేహం ఇప్పుడు రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. ఈ రెండు జబ్బులు కవలలని చెబుతుంటారు. దేశంలోనే ఎక్కువగా జీవనశైలి జబ్బుల బాధితులున్న రాష్ట్రాల్లో ఏపీ తరచూ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటోంది. గతంలో 45 ఏళ్లు దాటిన వారే ఈ జబ్బుల బారిన పడే ప్రమాదం ఉండేది. గడిచిన దశాబ్ద కాలంగా 30 ఏళ్లు నిండీ నిండక మునుపే ఈ రెండు జబ్బులు యువతను కమ్మేస్తున్నాయి. వారికి తెలియకుండానే జబ్బు బాధితులుగా మార్చేస్తున్నాయి. మహిళల్లోనూ ఎక్కువ మంది హైపర్ టెన్షన్ బారిన పడ్డట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. పెరుగుతున్న బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ► హైపర్ టెన్షన్ కారణంగా గత ఐదేళ్లతో పోలిస్తే ఇప్పుడు 30 శాతం బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. మద్యం సేవించడం వల్ల ఎక్కువ మంది యువకులు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ► రాష్ట్రంలో 30 ఏళ్ల వయసు దాటిన మహిళలు 2.33 కోట్ల మంది ఉండగా, అందులో 25.3 శాతం మంది అంటే 58,99,960 మంది మహిళలు హైపర్ టెన్షన్ బాధితులే. ► రాష్ట్రంలో 30 ఏళ్ల వయసు దాటిన పురుషులు 2.38 కోట్ల మంది ఉండగా, వీరిలో 29 శాతం మంది అంటే 69,04,204 మంది హైపర్‌టెన్షన్ వలలో చిక్కుకొని ఉన్నారు. ► మధుమేహం బారిన పడిన మహిళలు 19.5 శాతం మంది అంటే 45,47,400 మంది ఉన్నారు. పురుషుల్లో 21.8 శాతం మంది అంటే 51.90,056 మంది మధుమేహంతో బాధ పడుతున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పు రావాలి ప్రధానంగా ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. ఉప్పు వాడకం తగ్గించాలి. చిరు ధాన్యాల వాడకం పెంచాలి. ప్రధానంగా హైపర్ టెన్షన్, మధుమేహం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. ఎలాంటి వ్యాయామం లేకుండా ఎక్కువ మోతాదులో బియ్యం వాడకం మంచిది కాదు. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పుడు ఎన్సీడీ (అసాంక్రమిక వ్యాధుల) స్క్రీనింగ్ జరుగుతోంది. ప్రాథమిక దశలోనే తెలుసుకుంటే మంచిది. – డా.బి.చంద్రశేఖర్‌రెడ్డి, ప్రముఖ న్యూరో ఫిజీషియన్ -
రక్తపోటును తగ్గించే పెరుగు!
మనం తోడేసిన పాలు పెరుగుగా మారడానికి మనకు మేలు చేసే ఒక రకం బ్యాక్టీరియానే అన్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పాలను పెరుగుగా మార్చే బ్యాక్టీరియా పుష్కలంగా ఉన్న పదార్థాలను ‘ప్రోబయాటిక్’ ఉత్పాదనలుగా మార్కెట్లో అమ్ముతున్న విషయమూ మనకు కొత్త కాదు. ప్రోబయాటిక్స్ ఉన్న ఆహారాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయన్న విషయాన్ని ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు కొద్దికాలం కిందట ఒక అధ్యయనంలో తెలుసుకున్నారు. ఈ సంగతి ఆస్ట్రేలియా నుంచి వెలువడే హెల్త్ జర్నల్ ‘హైపర్‌టెన్షన్’లోనూ ప్రచురితమైంది. ఒకవేళ మీకు హైబీపీ లేకపోయినా పరవాలేదు. పెరుగూ, ఒకింత పులిసిన అట్ల వంటి టిఫిన్లు పుష్కలంగా తీసుకుంటూ ఉంటే ఇందులోని ప్రోబయాటిక్ బ్యాక్టీరియా రక్తపోటును చాలావరకు నివారిస్తుంది. ఫలితంగా గుండెజబ్బులూ, పక్షవాతం ప్రమాదాలూ చాలావరకు నివారించుకోవచ్చు. -
రక్తపోటు మందుతో దీర్ఘాయువు?
రక్తపోటు నివారణకు ఉపయోగించే మందు ఆయువును పెంచేం దుకు దోహదపడుతుందని జపాన్‌లోని ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మెటోలజోన్ అనే ఈ మందును వాడినప్పుడు కణస్థాయిలో ఆయువును పెంచే ప్రక్రియలు జరుగుతాయని, ఏలిక పాములపై ఈ మందు ప్రయోగించామని, ఇవే ఫలితాలు మానవుల్లోనూ ఇస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మైటోకాండ్రియా మన వయసు పెరిగే కొద్దీ సక్రమంగా పనిచేయదు. మైటోకాండ్రియాను మరమ్మతు చేసి ఆయువు పెంచేందుకు చాలాకాలంగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. మైటోకాండ్రియా సక్రమంగా పనిచేయకపోతే శరీర వ్యవస్థలో మరమ్మతు చేసేందుకు ఓ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ ప్రక్రియను మందుల ద్వారా ప్రారంభిస్తే మైటోకాండ్రియా సక్రమంగా పనిచేసి మనం ఎక్కువ కాలం సమస్యల్లేకుండా బతకొచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. దీంతో ఒసాకా వర్సిటీ శాస్త్రవేత్తలు ఏలికపాములపై జరిపిన పరిశోధనలకు ప్రాధాన్యమేర్పడింది. మైటోకాండ్రియా మరమ్మ తు ప్రక్రియ మొదలైనప్పుడు ఏలికపాము కాస్తా వెలుగులు చిమ్మేలా జన్యుమార్పులు చేసి.. పలు వ్యాధుల చికిత్సకు ఉపయోగించే మందులను వాటిపై ప్రయోగించారు. మెటోలజోన్ అనే రక్తపోటు మందు వాడినప్పుడు ఏలికపాముల్లో మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియ ప్రారంభమైందని, వాటి జీవన కాలమూ పెరిగిందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త కేజ్ నకాడై తెలి పారు. మైటోకాండ్రియా మరమ్మతు ప్రక్రియకు ఉపయోగపడే హెచ్ఎస్పీఏ–6 జన్యువు ఉత్తేజితం అవుతున్నట్లు తెలిసింది. చలిలో వ్యాయామం.. వేగంగా కరిగేను కొవ్వు! చలి ఎక్కువవుతున్న కొద్దీ మనలో చాలామంది దుప్పట్లు కప్పేసుకుంటాం. ఉదయా న్నే చేసే వ్యాయామానికి సెలవులు ప్రకటించుకుంటాం. కానీ చలి వాతావరణంలో వ్యాయామం చేయడం వల్ల కొవ్వు వేగంగా కరుగుతుందని చెబుతోంది కెనెడాలోని లారెన్షియన్ యూనివర్సిటీ పరిశోధన. మీరెప్పుడైనా హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ (హెచ్ఐఐటీ) గురించి తెలుసా..? వ్యాయామం చేసే తీరులో ఇదో పద్ధతి. కొన్ని నిమిషాల పాటు తీవ్రస్థాయిలో వ్యాయామం చేయడం ఆ తర్వాత కొంత విరామం.. తక్కువ తీవ్రతతో కూడిన వ్యాయామం ఇలా సాగుతుంది ఈ హెచ్ఐఐటీ. కొవ్వులను వేగంగా కరిగించేందుకు ఇది మేలైన వ్యాయామం అని ఇటీవల ప్రాచుర్యం పొందింది. ఈ వ్యాయామంపై ఉష్ణోగ్రతల ప్రభావం ఏంటన్నది తెలుసుకునేందుకు లారెన్షియన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. పరిసరాల ఉష్ణోగ్రత 21ల డిగ్రీ సెల్సియస్‌గా ఉన్నప్పుడు హెచ్ఐఐటీ చేస్తున్న వారితో పోలిస్తే సున్నా డిగ్రీ సెల్సియస్‌లో అంటే నీరు గడ్డకట్టే పరిస్థితుల్లో వ్యాయామం చేసే వారిలో కొవ్వులు ఆక్సీకరణం చెందే వేగం దాదాపు 3.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలిసింది. జీవక్రియల విషయంలోనూ చలి వాతావరణంలో చేపట్టిన హెచ్ఐఐటీ ప్రభావశీలంగా ఉందని, రక్తంలో చక్కెర మోతాదుల నియంత్రణకు, కొవ్వులు కరిగేందుకు, హానికారక ట్రైగ్లిజరైడ్స్ తగ్గేందుకూ ఇది ఉపయోగపడిందని శాస్త్రవేత్తలు తెలిపారు. -
భారత్‌లో బీపీ గ్రూప్ విస్తరణ
న్యూఢిల్లీ: ఇంధన రంగంలో ఉన్న యూకే దిగ్గజం బీపీ గ్రూప్.. భారత్‌లో ఇంధన రిటైల్, మొబిలిటీ సొల్యూషన్స్‌లో విస్తరించనుంది. భారత్‌ను అసాధారణ మార్కెట్‌గా అభివర్ణించడమేగాక, నమ్మశక్యం కాని రీతిలో అభివృద్ధి చెందుతోందని వ్యాఖ్యానించింది. అయితే సహజ వాయువును జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బెర్నార్డ్ లూనీ కోరారు. సెరావీక్ నిర్వహించిన ఇండియా ఎనర్జీ ఫోరంలో ఆయన మాట్లాడారు. ‘రిలయన్స్ ఇండస్ట్రీస్ భాగస్వామ్యంతో వచ్చే ఐదేళ్లలో 5,500 రిటైల్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాం. పెట్రోల్, డీజిల్ విక్రయంతోపాటు ఎలక్ట్రిక్ వాహనాలకు చార్జింగ్ సౌకర్యం కూడా వీటిలో ఉంటుంది. ఆర్ఐఎల్ భాగస్వామ్యంతో..: నెట్వర్క్ విస్తరణలో భాగంగా 80,000 ఉద్యోగాలను సృష్టిస్తాం అని లూనీ వివరించారు. ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీతో బీపీకి లోతైన, విశ్వసనీయ బంధం ఉందన్నారు. కాగా, ప్రస్తుతం ఆర్ఐఎల్కు 1,400 పెట్రోల్ బంకులు, 31 విమాన ఇంధన కేంద్రాలు ఉన్నాయి. ఆర్ఐఎల్–బీపీల సంయుక్త భాగస్వామ్య కంపెనీ వీటిని చేజిక్కించుకుని విస్తరించనుంది. ఐదేళ్లలో విమాన ఇంధన కేంద్రాలు మరో 14 రానున్నాయి. జేవీలో ఆర్ఐఎల్కు 51% వాటా ఉంది. 49% వాటాకు బీపీ గ్రూప్ రూ.7,000 కోట్లదాకా వెచ్చించింది. కేజీ బేసిన్ డీ6 బ్లాక్‌లో చమురు వెలికితీతకై ఇరు సంస్థలు రూ.37,000 కోట్లు పెట్టుబడి చేయనున్నాయి. ఇదిలావుంటే టోటల్ సీఈవో పాట్రిక్ పౌయన్నె మాట్లాడుతూ ఇంధన వినియోగంలో ప్రపంచ సగటుతో పోలిస్తే భారత్‌లో 30 శాతమే ఉందన్నారు. ఇక్కడ అపార అవకాశాలున్నాయని చెప్పారు. ఎల్ఎన్జీ ఇంపోర్ట్ టెర్మినల్, సిటీ గ్యాస్, రెనివేబుల్ ఎనర్జీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు చేస్తున్నట్టు వెల్లడించారు. -
రిలయన్స్-బీపీ జాయింట్ వెంచర్ లాంచ్
సాక్షి, ముంబై:ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) ఇంధన రిటైల్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ (బీపీ) భాగస్వామ్యంతో జాయింట్ వెంచర్ ను లాంచ్ చేసింది. రిలయన్స్ బీపీ మొబిలిటీ లిమిటెడ్ (ఆర్‌బీఎంఎల్) పేరుతో దీన్ని ప్రారంభించినట్లు గురువారం ప్రకటించింది. గత ఆగస్టులోనే జాయింట్ వెంచర్ కంపెనీ రూపొందించే ప్రణాళికను రిలయన్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త కంపెనీలో 51శాతం రిలయన్స్ సొంతం కాగా, మిగిలిన 49 శాతం వాటా బీపీ యాజమాన్యంలో ఉంటుంది. ఇందుకు ఏడు వేల కోట్ల రూపాయలను బీపీ చెల్లించనుందని ఆర్ఐఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. రవాణా ఇంధనాల మార్కెటింగ్‌కు అవసరమైన చట్టబద్ధమైన ఆమోదాలను ఆర్‌బీఎంఎల్ సాధించిందనీ ప్రస్తుత రిటైల్ అవులెట్లో సేవలు తక్షణమే అమలు చేయడం ప్రారంభిస్తుందని తెలిపింది. త్వరలోనే దీన్ని “జియో-బిపి” గా మార్చనున్నామని రిలయన్స్ వెల్లడించింది. ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతదేశ ఇంధనాలు, మొబిలిటీ మార్కెట్లలో అగ్రభాగాన నిలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బీపీ తెలిపింది. 21 రాష్ట్రాలలో మిలియన్ల వినియోగదారుల ద్వారా రిలయన్స్ ఉనికిని మరింత పెంచుతుందని పేర్కొంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపారాన్ని నిర్మించడానికి ఇదొక ప్రత్యేకమైన అవకాశమని బీపీ సీఈవో బెర్నార్డ్ లూనీ వ్యాఖ్యానించారు. తాజా భాగస్వామ్యంతో ఆయిల్ మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్ మరింత దూసుకెళ్తుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా రిటైల్, ఏవియేషన్ ఇంధనాలలో బీపీతో బలమైన, విలువైన భాగస్వామ్యకొనసాగుతుందన్నారు. అలాగే సర్వీస్ స్టేషన్లలో సిబ్బంది సంఖ్య నాలుగు రెట్లు పెరగనుందని పేర్కొన్నారు. 20 వేల నుంచి 80వేల వరకు ఈ సంఖ్య పెరుగుతుందని చెప్పారు. రాబోయే సంవత్సరాల్లో 30 నుండి 45 విమానాశ్రయాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ బంకులు ఉండగా, ఇపుడు మొత్తం 5,500 పెట్రోల్ బంకులను జాయింట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తేవాలనేది లక్ష్యం. వీటి ద్వారా ఇండియన్ కస్టమర్స్‌కు అధిక-నాణ్యత, తక్కువ కార్బన ఉద్గారాల విభిన్న ఇంధనాలు, ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్, ఇతర సేవలను అందించనున్నట్లు ఆర్ఐఎల్ పేర్కొంది. ప్రస్తుతం రిలయన్స్ పెట్రోల్ విమానయాన ఇంధన నెట్ వర్క్‌లో బీపీ భాగస్వామ్యం కానుంది. తాజా ఒప్పందంతో జియో- బీపీ బ్రాండ్ జాయింట్ వెంచర్ భారత్‌లో చమురు, మొబిలిటీ మార్కెట్లో లీడర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తోంది. రాబోయే 20 ఏళ్లలో భారతదేశం ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంధన మార్కెట్ అవుతుందని, దేశంలో కార్ల సంఖ్య దాదాపు ఆరు రెట్లు పెరుగుతుందని అంచనా. -
ఆ రెండూ దొరకట్లేదు..
సాక్షి, హైదరాబాద్: కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో.. వైరస్‌ను కట్టడి చేసేందుకు దోహదం చేసే మాస్కులు, శానిటైజర్లు, హ్యాండ్‌వాష్, డెటాల్ తదితర ఉత్పత్తుల రేట్లు గణనీయంగా పెరిగాయి. మరోవైపు కృతిమ కొరత కూడా సృష్టిస్తూ రేట్లు పెంచి యథేచ్ఛగా అమ్మకాలు జరుపుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. లాక్‌డౌన్‌ను మరికొన్ని రోజులు పొడిగిస్తారనే ప్రచారంతో రక్తపోటు, మధుమేహానికి సంబంధించిన మాత్రలు విపరీతంగా అమ్ముడుపోతున్నాయి. ఇక అజిత్రోమైసిన్, హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలకు ఎక్కడ లేని డిమాండ్ పెరిగింది. అజిత్రోమైసిన్ మాత్ర రూ.22 ఉండగా, ఇప్పుడు రూ.30–32 వరకు పలుకుతోంది. మాస్కులకు కటకట.. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపుతుండటం.. వైరస్ నియంత్రణకు నిరంతరం చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు, ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. దీంతో మార్కెట్లో మాస్కులకు తీవ్ర కొరత ఏర్పడింది. ఇక ఎన్–95 మాస్కుల ధరలకైతే రెక్కలొచ్చాయి. నెల రోజుల క్రితం వరకు రూ.75 ఉన్న ఈ మాస్కు ధర ప్రస్తుతం రూ.350 నుంచి 400కు చేరింది. మామూలు మాస్కుల ధర రూ.3–5 నుంచి 25–30 వరకు పెరిగింది. ఇక హ్యాండ్‌వాష్‌లు అంతంతగానే లభ్యమవుతున్నాయి. హ్యాండ్‌వాష్‌కు ఉపయోగించే శానిటైజర్లు, డెటాల్, శావిలియన్ సబ్బులు కూడా దొరకడంలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు నకిలీ శానిటైజర్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. కరోనా భయంతో ఉన్న ప్రజలను మోసగించేందుకు నకిలీ శానిటైజర్ల తయారీ ముఠాలు రంగంలోకి దిగాయి. పోలీసులు ఈ ముఠా గుట్టు రట్టు చేయడంతో నకిలీ శానిటైజర్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. నకిలీ శానిటైజర్ల వాడకంతో చేతులకు బొబ్బలు వస్తున్నట్లు గుర్తించినందున జాగ్రత్త వ్యవహరించాలని సూచించింది. మరోవైపు ప్రముఖ కంపెనీలు విక్రయించే శానిటైజర్ల కొరత తీవ్రంగా ఉంది. దీనికితోడు లాక్‌డౌన్‌తో సరుకు రవాణా నిలిచిపోవడం, ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపడంతో ప్రస్తుతం మార్కెట్లో శానిటైజర్లు మచ్చుకైనా కనిపించట్లేదు. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అమ్మకాలు బంద్ హైడ్రాక్సీ క్లోరోక్విన్, హెచ్సీక్యూఎస్ టాబ్లెట్ల అమ్మకాలను ప్రభుత్వం దాదాపు నిలిపేసింది. శ్వాసకోస, మలేరియా రోగుల కోసం వినియోగించే ఈ మాత్రలే ప్రస్తుతం కరోనా బాధితుల కోసం ఉపయోగిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఉపద్రవం ముంచుకొస్తే ఈ మాత్రల కొరత రాకుండా ముందస్తు జాగ్రత్త పడుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే హోల్‌సేల్ డీలర్ల నుంచే కాకుండా మెడికల్ షాపుల నిర్వాహకుల వద్ద ఉన్న ఈ మాత్రలను వెనక్కి తీసుకుంటున్నట్లు సమాచారం. పైగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందులు విచ్చలవిడిగా వాడితే గుండె సంబంధిత వ్యాధులు, గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని, డాక్టర్ల సలహా మేరకు మాత్రమే వాడాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదిలావుండగా, బీపీ, షుగర్ పేషెంట్లు మాత్రం ముందుచూపుతో మూడు నెలలకు సరిపడా మందులు కొనుగోలు చేసి పెట్టుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఈ రోగుల మాత్రలు ఇట్టే అమ్ముడుపోతున్నట్లు మందుల దుకాణాల యజమానులు చెబుతున్నారు. ఆసక్తికరమైన విషయమేమంటే.. కండోమ్‌ల అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. లాక్డౌన్ నేపథ్యంలో 15 రోజులు ఎవరూ గడప దాటి బయటకు వెళ్లలేని పరిస్థితి లేకపోవడంతో అంతా ఇంటికి పరిమితమయ్యారు. కరోనాకు ముందు మార్కెట్లో కండోమ్‌ల అమ్మకాలు విరివిగా ఉండేవి. ప్రస్తుతం వీటిని అడిగేవారే కరువయ్యారని ఓ మెడికల్ షాప్ నిర్వాహకుడు చెప్పారు. -
గిర్రున తిప్పే వర్టిగో!
కొందరు తమకు తరచూ తల తిరుగుతోందనీ, పడిపోతున్న ఫీలింగ్ ఉందని అంటుంటారు. ఇంగ్లిష్‌లో గిడ్డీనెస్, డిజ్జీనెస్గా మనం చెప్పుకునే లక్షణాలను కలిగించే ఆ వ్యాధినే వైద్యపరిభాషలో ‘వర్టిగో’ అంటారు. మనందరి జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా అనుభవించే ఈ కండిషన్‌పై అవగాహన కోసమే ఈ కథనం. కళ్లు తిరగడం / తల తిరగడం రూపంలో కనిపించే వర్టిగో పురుషుల్లో కంటే మహిళల్లోనే ఎక్కువ. వర్టిగో అనుభవాలు చిత్రవిచిత్రాలు... తల/కళ్లు తిరగడం (వర్టిగో) సమయంలో కలిగే అనుభూతులు వేర్వేరు రోగుల్లో వేర్వేరుగానూ, చిత్రవిచిత్రంగా ఉంటాయి.ఉదాహణకు... ►కొందరిలో గాల్లో అలా కొట్టుకుపోతున్నట్లుగా ఫీలవుతారు ►కొందరు తలకిందులుగా లోయలో/బావిలో పడిపోతున్నట్లుగా ఫీలవుతారు ►కొందరు భవనం పైనుంచి కిందికి పడిపోతున్నట్లు అనుభూతి చెందుతారు ►మంచంపై పడుకుని ఉంటే... కొందరిలో కాళ్లు ఉన్న భాగం పైకి లేచిపోతున్నట్లు ఫీలవుతారు ►కొందరు నిటారుగానే ఉన్నా... తాము ఒక కోణంలో ఒంగుతున్నట్లు భ్రమిస్తూ... చక్కగా/నిటారుగా అయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు ►తమ చుట్టూ ఉన్న ఫొటోలూ, ఫ్యాన్లు, టీవీ, టేబుల్ వంటి వస్తువులు తమ చుట్టూ తిరుగుతున్న ఫీలింగ్ కలుగుతుంది ►కొందరు రంగులరాట్నంలో తిరుగుతున్న అనుభూతి పొందుతారు. వర్టిగో ప్రధానంగా రెండు విధాలు... 1. పెరిఫెరల్ వర్టిగో 2. సెంట్రల్ వర్టిగో పెరిఫెరల్ వర్టిగో ఇది అంత ప్రమాదకరం కాదు. అయితే... దీన్లో కళ్లు తిరగడం తాలూకు తీవ్రత చాలా ఎక్కువ. ఒక్కోసారి దీనివల్ల తన ప్రాణం పోతుందేమో అన్నంతగా రోగి భయపడతాడు. చెవి లోపలి భాగం (ఇన్నర్ ఇయర్) నుంచి మెదడుకు సంకేతాలు చేరవేసే నరానికి దెబ్బ తగిలినా, దానికి ఇన్ఫెక్షన్ కలిగినా ఈ పెరిఫరల్ వర్టిగో కనిపించే అవకాశం ఉంది. లోపలి చెవిలో ఉండే భాగాన్ని ల్యాబిరింథ్ అంటారు. దీనికి ఏమాత్రం దెబ్బతగిలినా ఇలాంటి సమస్యే వస్తుంది. దాన్ని ‘ల్యాబిరింథైటిస్’ అంటారు. ఇక లోపలి చెవి నుంచి మెదడును కనెక్ట్ చేసే నరాన్ని వెస్టిబ్యులార్ నర్వ్ అంటారు. ఒకవేళ నరానికి ఏదైనా దెబ్బతగిలి ఇలాంటి అనుభూతి కలిగితే దాన్ని ‘న్యూరోనైటిస్’ అంటారు. లోపలి చెవిలో ఒకరకమైన ద్రవపదార్థం ఉంటుంది. ఒక్కోసారి ఆ ద్రవంలో ఏవైనా పార్టికల్స్ వచ్చినా పెరిఫెరల్ వర్టిగో కనిపిస్తుంది. దీన్నే ‘బినైన్ పొజీషనల్ వర్టిగో’ అని అంటారు. టినిటస్: కొందరిలో కళ్లు తిరిగే లక్షణంతో పాటు చెవిలో గుయ్... మనే శబ్దం వినిపిస్తుంది. పెరిఫెరల్ వర్టిగో చికిత్సనే ఈ సమస్యలోనూ తీసుకుంటే తగ్గిపోతుంది. సెంట్రల్ వర్టిగో... పెరిఫెరల్ వర్టిగోతో పోలిస్తే ఈ సెంట్రల్ వర్టిగో ఒకింత ప్రమాదకరం. అయితే సెంట్రల్ వర్టిగోలో కళ్లు తిరిగే తీవ్రత మాత్రం పెరిఫెరల్ వర్టిగోతో పోలిస్తే కాస్తంత తక్కువ. మెదడు లోపలి భాగాన్ని బ్రెయిన్ స్టెమ్ అంటారు. ఈ బ్రెయిన్ స్టెమ్‌కు రక్తప్రసరణ తగ్గినందువల్ల ‘సెంట్రల్ వర్టిగో’ వస్తుంది. సాధారణ ప్రజలకు ఏది పెరిఫెరల్ వర్టిగో, ఏది సెంట్రల్ వర్టిగో అని గుర్తుపట్టడం కష్టమే. అయినా కొన్ని లక్షణాలతో గుర్తుపట్టేందుకు అవకాశం ఉంది. చికిత్స: సమయానికి చికిత్స తీసుకుంటే వర్టిగో పూర్తిగా తగ్గుతుంది. జలుబు, ఇన్ఫెక్షన్ వంటివి వచ్చినప్పుడు అవి తగ్గేలా జాగ్రత్త తీసుకోవాలి. రోగికి కనిపించే వర్టిగోను డాక్టర్లు ‘సెంట్రల్ వర్టిగో’ అని భావిస్తే వెంటనే సీటీస్కాన్, ఎమ్మారై బ్రెయిన్, ఎమ్మార్ యాంజియో బ్రెయిన్ అనే పరీక్షలు చేసి బ్రెయిన్ స్టెమ్‌లో ఎక్కడ డ్యామేజీ ఉందో తెలుసుకుని వెంటనే తగిన చికిత్స తీసుకోవాలి. ►బ్యాలెన్స్‌ను మెరుగుపరిచే వ్యాయామాలు ►మాన్యువర్స్ ►ట్యూమర్స్ వంటివి ఉన్నప్పుడు శస్త్రచికిత్స ►మెడికల్ మేనేజ్మెంట్ ►కొన్ని సందర్భాల్లో మందులు వాడితే తగ్గిపోతుంది. వర్టిగోను నివారించుకోండిలా... ►సాధారణంగా బీపీ, షుగర్ ఉన్న వాళ్లలో సెంట్రల్ వర్టిగో వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. బీపీని క్రమం తప్పకుండా చెక్ చేయించుకొని, అదుపులో పెట్టుకోవాలి. శరీరంలో చక్కెర మోతాదులను క్రమం తప్పకుండా చెక్ చేయించుకుని పరగడుపు 100– భోజనం తర్వాత 160 కంటే ఎక్కువ ఉంటే తక్షణం డాక్టర్‌ను కలిసి దాన్ని అదుపులో ఉంచుకోడానికి మందులు తీసుకోవాలి. ►పొగతాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లు ఉంటే సెంట్రల్ వర్టిగో వచ్చేందుకు అవకాశాలెక్కువ. అందుకే ఆ అలవాట్లుంటే వాటిని తక్షణం మానేయాలి. ►జీవన విధానాల్లో మార్పులు (లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్) చేసుకుని ఆరోగ్యకరమైన అలవాట్లను కలిగి ఉండాలి. రోజూ క్రమం తప్పకుండా నడక, వ్యాయామం చేయాలి. ►శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉంటే తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్లు పాలు, మీగడ, వెన్న, నెయ్యి, స్వీట్స్ వంటి చాలా పరిమితంగా తీసుకోవాలి. ►ఆకుకూరలు, కాయగూరలు ఎక్కువగా తీసుకోవాలి. రోజూ తాజా పళ్లు తినాలి. కారణాలు ►బినైన్ పొజిషనల్ ప్రాక్సిమల్ వర్టిగో. మీనియర్స్ డిసీజ్, మైగ్రేన్ వర్టిగో, తలకు గాయం కావడం కొన్ని మందులు వాడటం (ఓటో టాక్సిసిటీ)వల్ల, వెస్టిబ్యులార్ నరంలో ట్యూమర్లు, పక్షవాతం సెంట్రల్ వర్టిగోను ఇలా గుర్తుపట్టవచ్చు... ►కళ్లు తిరగడంతోపాటు మాట తడబడటం ►మింగడం కష్టం కావడం ఒకే వస్తువు రెండుగా కనిపించడం ►చూపు మసకబారడం ►మూతి వంకరపోవడం ►కాళ్లూ, చేతులు చచ్చుపడినట్లు అనిపించడం... ఇలాంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని సెంట్రల్ వర్టిగోగా గుర్తించి వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాలి. డాక్టర్ ఇ.సి. వినయ కుమార్ హెచ్ఓడి – ఈఎన్టి సర్జన్, అపోలో హాస్పిటల్స్, హైదరాబాద్ -
బీపీ షుగర్ ఉంటే క్రమం తప్పక పరీక్షలు చేయించాలి
నా వయస్సు 66 ఏళ్లు. నాకు గత పదిహేనేళ్లుగా షుగర్, బీపీతో బాధపడుతున్నాను. ఈమధ్య నా ముఖం బాగా ఉబ్బింది. పొట్ట నొప్పి కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి మూత్రపిండాల్లో సమస్య ఉందన్నారు. కిడ్నీలు ముప్ఫయి శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన దాన్ని మళ్లీ బాగు చేయలేమని కూడా చెప్పారు. నాకు వచ్చిన సమస్య ఏమిటి? నా మూత్రపిండాలు మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి. షుగర్, బీపీ... ఈ రెండు సమస్యలు ఉన్నవారిలో చాలామందికి కొంతకాలం తర్వాత మూత్రపిండాలపై వాటి దుష్ప్రభావం పడి అవి దెబ్బతినడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అందువల్లనే బీపీ, షుగర్... ఈ రెండూ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని చికిత్సలో తగు మార్పులు (అంటే... మందులు, వాటి మోతాదుల్లో మార్పులు) చేయించుకోవాల్సి ఉంటుంది. బహుశా మీరు ఈ పరీక్షలు తరచూ చేయించకపోవడం వల్లనో లేదా మీకు ఈ సమస్యల దుష్ప్రభావాల ఫలితాలపై అవగాహన లేకపోవడం వల్లనో ఇప్పటికే ముప్పయి శాతం డ్యామేజీ జరిగిపోయి ఉంవడచ్చు. ఇప్పుడు బాగా ఉన్న మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే మీరు మీ బీపీ, షుగర్లను ఎపుపడూ అదుపులో పెట్టుకోవడం అవసరం. అందుకోసం వైద్యులను తరచూ సంప్రదిస్తూ క్రమం తప్పకుండా పీరియాడికల్ చెక్–అప్ చేయించుకోవడం అవసరం. ఇలా రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుని మరింత నష్టం జరగకుండా చూసుకోవచ్చు. -
జియో-బీపీ పేరుతో రిలయన్స్ పెట్రోలు బంకులు
సాక్షి, ముంబై: ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన ఇంధన రిటైల్ వ్యాపారాన్ని బ్రిటిష్ ఇంధన ప్రధాన సంస్థ బీపీతో తుది ఒప్పందాన్ని ఖరారు చేసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో ప్రాధమిక ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఆర్ఐఎల్, బీసీ సోమవారం ఒక ఖచ్చితమైన ఒప్పందంపై సంతకం చేశాయని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. జియో-బీపీ బ్రాండ్ ఇంధన మార్కెటింగ్, మొబిలిటీ సొల్యూషన్స్ ద్వారా వేగంగా అభివృద్ది చెందుతున్న భారత మార్కెట్ మరింత అభివృద్ది చెందనుందని ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తెలిపారు. రెగ్యులేటరీ, ఇతర ఆమోదాలకు లోబడి, 2020 మొదటి భాగంలో జియో-బీపీ జాయింట్ వెంచర్ ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ జాయింట్ వెంచర్లో ఆర్ఐఎల్ 51 శాతం, బీపీ 49 శాతం వాటా ఉంటుంది. ఈ వాటా కోసం బీపీ రూ.7,000 కోట్లను వెచ్చించనుంది. ప్రస్తుతం ఆర్ఐఎల్కు దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ బంకులు ఉన్నాయి. వీటితో కలిపి మొత్తం 5,500 పెట్రోల్ బంకులను జాయింట్ వెంచర్ ద్వారా అందుబాటులోకి తేవాలని లక్ష్యం. ఈ జాయింట్ వెంచర్ ద్వారా భారతీయ వినియోగదారులకు అధిక-నాణ్యత విభిన్న ఇంధనాలు, ఇతర సేవలను అందించనున్నామని ఆర్ఐఎల్ తెలిపింది. కాగా ముకేష్ అంబానీ నేతృత్వంలోని మరో సంస్థ రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) కెనడాకు చెందిన బ్రూక్‌ఫీల్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, దాని టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్రస్ట్‌లోని సంస్థాగత భాగస్వాముల నుండి రూ .25,215 కోట్ల పెట్టుబడులను సాధించిన సంగతి తెలిసిందే. -
బీపీ, షుగర్ రోగులకు ఐడీ నంబర్
సాక్షి, హైదరాబాద్: బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు యూనిక్ ఐడీ నంబర్ కేటాయించాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) నిర్ణయించింది. ప్రతి వ్యక్తికి ప్రత్యేక నంబర్‌తో కూడిన బుక్ అందజేస్తారు. ఈ బుక్‌లో యూనిక్ ఐడీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) కోడ్, జిల్లా, గ్రామం కోడ్స్ ఉంటాయి. ఇప్పటికే బుక్స్ సిద్ధం కాగా, త్వరలోనే పంపిణీ చేయనున్నారు. యూనిక్ ఐడీ నంబర్ల వినియోగంపై ప్రస్తుతం ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలకు శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో రోగికి ఒక్కో బుక్ ఇచ్చి, అందులోని యూనిక్ ఐడీ నంబర్‌తో రోగుల వివరాలను అనుసంధానించి ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారికి అందిస్తున్న వైద్యం, ఉచితంగా పంపిణీ చేస్తున్న మందులు, ఇతర విషయాలు బుక్‌లోనూ, ఆన్లైన్లో నమో దుచేస్తారు. దీంతో వ్యాధిగ్రస్తులు జాగ్రత్తలు తీసుకోవడానికి వీలుంటుంది. ఒకవేళ ఏదైనా చికిత్స కోసం వెళితే ఈ యూనిక్ ఐడీ నంబర్ ఆధారంగా డాక్టర్లు వైద్యం చేసే అవకాశముంది. 5.14 లక్షల మందికి నంబర్లు.. రాష్ట్రంలో సిద్దిపేట, జనగామ, కరీంనగర్, మహబూబాబాద్, సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లో నాన్–కమ్యూనికబుల్ డిసీజ్ (ఎన్సీడీ) సర్వే పూర్తయింది. ఈ జిల్లాల్లో 30 ఏళ్లు పైబడిన 35 లక్షల మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేయించారు. ఇందులో 2.14 లక్షల మందికి డయాబెటిస్, సుమారు 3 లక్షల మందికి బీపీ ఉన్నట్టు గుర్తించారు. తమకు షుగర్, బీపీ ఉందని వీరిలో సుమారు 50 శాతం మందికి సర్వే నిర్వహించే వరకూ తెలియదు. మిగిలిన జిల్లాల్లో సర్వే కొనసాగుతోంది. క్షేత్రస్థాయి ఆరో గ్య కార్యకర్తలు గుర్తించిన అనుమానిత కేసులకు పీహెచ్సీ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయాల్సి ఉంది. సర్వే పూర్తైన 12 జిల్లాల్లో మరోసారి సర్వే చేయనున్నట్టు చెబుతున్నారు. తొలి దశలో కొన్ని చోట్ల పాత పేషెంట్ల వివరాలు నమోదు చేయలేదు. వీరికి కూడా యూనిక్ ఐడీ నంబర్ ఇస్తారు. త్వరలో అందరి హెల్త్ ప్రొఫైల్.. రాష్ట్రంలో ప్రతీ ఒక్కరి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ తన నియోజకవర్గంలో హెల్త్ ప్రొఫైల్‌పై మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెల్త్ ప్రొఫైల్ చేపట్టే అంశంపై అధికారులకు ఆదేశాలు రానున్నాయి. ముందుగా సీఎం నియోజకవర్గం నుంచి ప్రారంభించి దశల వారీగా రాష్ట్రం మొత్తం అమలు చేయనున్నారు.మొత్తం వైద్య ఆరోగ్య శాఖతోపాటు హెల్త్ ప్రొఫైల్‌పై ముఖ్యమంత్రి త్వరలో సమీక్ష చేసే అవకాశముంది. -
హైబీపీ వల్ల ముప్పేమిటి?
నా వయసు 52 ఏళ్లు. ఇంతవరకు ఎప్పుడూ బీపీ చూసుకోలేదు. కానీ ఇటీవల చూసుకున్నప్పుడు నా బీపీ 150 / 98 ఉంది. దాంతో డాక్టర్‌గారు కనీసం నాలుగైదు బీపీ సార్లు చూసుకొని, రీడింగ్స్ నోట్ చేసుకొని వారం తర్వాత రమన్నారు. అంతకుముందు ఎలాంటి ఆలోచనా లేదు కానీ... ఆ మాట చెప్పినప్పటి నుంచి నాకెందుకో ఆందోళనగా ఉంది. బీపీ పెరిగితే వచ్చే సమస్యలపై అవగాహన కలిగేలా నాకు సమగ్రంగా వివరించండి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న రక్తపోటు కండిషన్ విపరీతంగా పెరుగుతోంది. రక్తపోటు పెరగడానికి కారణాలు చాలావరకు నిర్దిష్టంగా తెలియవు. ఇలా కారణం తెలియని బీపీని ‘ఇడిపోపథిక్ హైపర్‌టెన్షన్’ అంటారు. కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక శ్రమ తక్కువగా ఉండే కూర్చుని చేసే వృత్తుల్లో ఉండటం, రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి, ఊబకాయం వంటి అంశాలు దీనికి కారణమని ఊహిస్తున్నారు. రక్తపోటు వచ్చినవారిలోలో దాదాపు 90 శాతం ఇడియోపథిక్ హైపర్‌టెన్షన్ కేసులే ఉంటాయి. అయితే మిగతా 10 శాతం మందిలో రక్తపోటు పెరగడానికి నిర్దిష్టంగా కారణం ఉంటుంది. ఇలా కారణం తెలిసిన రక్తపోటును సెకండరీ హైపర్‌టెన్షన్ అంటారు. కారణం తెలియకుండా వచ్చే ఇడియోపథిక్ హైపర్టెన్షన్స్ కంటే నిర్దిష్ట కారణంతో వచ్చే సెకండరీ హైపర్టెన్షన్లతో చాలా ప్రమాదం. ఇలాంటి సెకండరీ హైపర్టెన్షన్లతో వచ్చే రక్తపోటును అదుపులో పెట్టేందుకు చాలాసార్లు మూడు నుంచి నాలుగు రకాల మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏడు నుంచి ఎనిమిది రకాలు కూడా వాడాల్సి రావచ్చు. సాధారణ ఇడియోపథిక్ రక్తపోటుతో మూత్రపిండాలు దెబ్బతినే పరిస్థితి కాస్తంత అరుదుగా వస్తుంది. కానీ సెకండరీ హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. రక్తపోటు ఉన్నట్లు అనుమానించేవారు చేయించుకోవాల్సిన సాధారణ పరీక్షలు ►పూర్తిస్థాయి మూత్ర పరీక్ష ( కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) ►రక్తంలో పొటాషియమ్ స్థాయి ►బ్లడ్ యూరియా అండ్ క్రియాటిన్ లెవెల్స్ ►ఈసీజీ ►కిడ్నీ సైజ్‌ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ పరీక్ష ►రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అత్యధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరం. అవి... ►24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్ పాళ్లు తెలుసుకునే పరీక్ష. (మూత్రంలో పోయే ప్రోటీన్ల సంఖ్యను ఇటీవల కేవలం ఒక శాంపుల్తోనే తెలుసుకునే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి) ►కిడ్నీ బయాప్సీ ►మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ ►బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ►రీనల్ యాంజియోగ్రామ్ కొన్ని ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరం ►కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి.. ►డయాబెటిస్ పేషెంట్లు అందరిలో.. ►కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారిలో .. ►రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారు ►ముప్ఫయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి.. ►తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందిపడే వారికి.. రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు: ►గుండెపోటు రావడం, గుండె ఫెయిల్యూర్ ►కిడ్నీ దెబ్బతినడం ►పక్షవాతం ►జీవన వ్యవధి (లైఫ్ స్పాన్) తగ్గడం ►కిడ్నీ దెబ్బతింటే డయాలసిస్ వంటివి చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియలు కావడం పై అంశాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రక్తపోటు ఉన్నవారు తమ హైబీపీని అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో మేలు. రక్తపోటును నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ఒత్తిడిని తగ్గించుకోవాలి. ►తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ►ఆహారంలో ఉప్పు పాళ్లను తగ్గించాలి. ►ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం... పచ్చళ్లు, అప్పడాల వంటి వాటికి దూరంగా ఉండాలి. ►డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మాత్రలనూ (ఓవర్ ద కౌంటర్ తీసుకుని) ఉపయోగించకూడదు. ►రక్తపోటు ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడూ 130 / 80 ఉండేలా క్రమం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. నాకు హైబీపీ ఉన్నట్లా లేనట్లా? నా వయసు 45 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పిగా ఉండటంతో పాటు ఇటీవల బాగా తలతిరుగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ముందుకు పడిపోతానేమో అన్నంత ఆందోళనగా ఉంటోంది. నా లక్షణాలు చూసిన కొంతమంది మిత్రులు నీకు ’హైబీపీ ఉందేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకో’ అంటున్నారు. వారు చెబుతున్నదాన్ని బట్టి నాకు మరింత ఆందోళన పెరుగుతోంది. దాంతో బీపీ లేకపోయినా హైబీపీ ఉన్నట్లుగా చూపిస్తుందేమో అని భయంగానూ ఉంది. ఇంతకూ నాకు హైబీపీ ఉన్నట్లా లేనట్టా? హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. మనలో రక్తపోటు పెరగడం వల్ల ఎండ్ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే మన భంగిమ (పోష్చర్)ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ఒకేసారి మనలో రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అలాంటి సమయాల్లోనూ మీరు చెప్పినట్లుగా ముందుకు పడిపోతారేమో లాంటి ఫీలింగ్, గిడ్డీనెస్ కలగవచ్చు. బీపీలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు చెప్పిన లక్షణాలు కనిపించినప్పటికీ, అవి బీవీ వల్లనే అని కూడా నిర్దిష్టంగా చెప్పలేం. సాధారణంగా బీపీ వల్ల ఉదయం వేళల్లో తలనొప్పి కనిపించనప్పటికీ, మరెన్నో ఆరోగ్య సమస్యలలోనూ తలనొప్పి ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన గిడ్డీనెస్ సమస్యకూ వర్టిగో, సింకోప్ లాంటి మరెన్నో సమస్యలు కారణం కావచ్చు. అందుకని కేవలం లక్షణాల ఆధారంగానే బీపీ నిర్ధారణ చేయడం సరికాదు. అందుకే మీరు నిర్భయంగా ఒకసారి డాక్టర్‌ను కలవండి. వారు కూడా కేవలం ఒక్క పరీక్షలోనే హైబీపీ నిర్ధారణ చేయరు. అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచి, ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేసి, దానికి తగిన చికిత్స సూచిస్తారు. మీరు ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి. డా. నవోదయ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
అకస్మాత్తుగా కాలూ– చేయి బలహీనం...కారణమేమిటి?
నా వయసు 30 ఏళ్లు. ఒకరోజు నాకు ఎడమ కాలు, చేయి కదిలించడం కష్టంగా అనిపించింది. అనుమానం వచ్చి డాక్టర్‌ను కలిశాను. ఆయన ఎమ్మారై చేయించారు. మెదడులో ఒకచోట క్లాట్ ఏర్పడినట్లు తెలిసింది. దాంతో నేను, మా కుటుంబసభ్యులం చాలా ఆందోళనకు గురవుతున్నాం. నాకు ఎందుకిలా జరిగింది? దీనివల్ల ఎలాంటి సమస్యలు ఎదురుకావచ్చు? పరిష్కారం ఏమిటి? పరిస్థితి తీవ్రతరం కాకముందే మీ సమస్యకు కారణం దొరకడం మీ అదృష్టం. చాలా రకాల కారణాలతో మెదడులో రక్తనాళాలు చిట్లిపోతుంటాయి. తలకు గాయం కావడం వల్ల, రక్తపోటు పెరగడం వల్ల, వంశపారంపర్య కారణాల వల్ల ఈ విధంగా జరుగవచ్చు. మీరు ఈదే సమయంలో మీకు తెలియకుండానే ఎప్పుడో తలకు గాయం అయి ఉండవచ్చు లేదా వంశపారంపర్యంగా వచ్చే బలహీన రక్తనాళాల వ్యాధి (ఆర్టిరియో వీనస్ మాల్ఫార్మేషన్) కారణంగా ఇది జరిగి ఉండవచ్చు. ఎడమకాలు, చేయి కదిలించడం సాధ్యం కాని స్థితి అనికాకుండా కష్టంగా తోచిందని మీరు చెబుతున్నందున మీ మెదడులో పెద్దవైన ధమనులు కాకుండా రక్తకేశనాళికల్లో ఈ క్లాట్ ఏర్పడి ఉండవచ్చు.ప్రధానంగా మెదడుకు రక్తం సరఫరాచేసే ధమనుల్లో అడ్డంకులు ఏర్పడి రక్తం అందకపోవడం (ఇస్కిమిక్) లేదా మెదడులోని భాగాలకు వెళ్లే సన్నని రక్తకేశనాళికలు చిట్లిపోవడం (హేమరేజిక్) కారణాల వల్ల మెదడులో క్లాట్స్ ఏర్పడతాయి. కొన్నిసార్లు శరీరంలోని వేరే ప్రాంతంలో ఏర్పడిన క్లాట్స్ రక్తప్రవాహంలో వెళ్లి మెదడులోని సన్నని ధమనల్లో చిక్కుకుపోతాయి. ఈ స్థితిని సెరిబ్రోవాస్క్యులార్ యాక్సిడెంట్ అంటాం. మెదడులో క్లాట్ ఏవిధంగా ఏర్పడనప్పటికీ దాని పరిణామాలు మాత్రం ఒకేవిధంగా ఉంటాయి. మెదడులోని వివిధ భాగాలు వేర్వేరు బాధ్యతను నిర్వహిస్తూ శరీరంలోని వేర్వేరు అవయవాలు నియంత్రిస్తుంటాయి. అందువల్ల క్లాట్స్ ఏర్పడిన భాగం తాలూకు మెదడు తన విధులను నిర్వహించడంలో లోటుపాట్లు ఏర్పడతాయి. మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా నిలిచిపోయి అక్కడి కణాలు పనిచేయడం నిలిచిపోతుంది. అందువల్ల మెదడులో ఆ భాగాలు శరీరంలో నియంత్రించే అంగాలు చచ్చుబడతాయి. నాడుల పనితీరు తీవ్రంగా దెబ్బతింటుంది. మెదడు క్లాట్ ఏర్పడిన ప్రదేశం, ఆ క్లాట్ పరిమాణాన్ని బట్టి శరీరంలో వివిధ భాగాల్లో ఆ ప్రభవ లక్షణాలు వ్యక్తం అవుతుంటాయి. హఠాత్తుగా పక్షవాత లక్షణాలు కనిపించవచ్చు. అవికూడా శరీరంలో ఒకవైపునే ఏర్పడతాయి. మెదడులోని కుడిభాగం... శరీరంలోని ఎడమభాగాన్నీ, మెదడులోని ఎడమభాగం... శరీరంలోని కుడి భాగాన్ని నియంత్రిస్తుంటుంది. మీ ఎడమ కాలు, చేయి అదుపుతప్పాయని అంటున్నారు కాబట్టి మీ మెదడులో కుడిభాగంలో క్లాట్స్ ఏర్పడి ఉంటాయి. మీరు వెంటనే చికిత్స చేయించుకోవాలి. మెదడుక్లాట్స్కు ఇప్పుడు చక్కటి చికిత్స అందుబాటులో ఉంది. మీరు చెప్పినదాన్నిబట్టి మీ క్లాట్ ఉన్నట్లు అనిపిస్తోంది. మందులతోనే దాన్ని కరిగించే అవకాశం ఉంది. ఒకవేళ మందులతో క్లాట్ కరగకపోతే బ్రెయిన్ సర్జరీ ద్వారా క్లాట్‌ను పూర్తిగా తొలగించి, శాశ్వత పరిష్కారం ఏర్పరచవచ్చు. కాబట్టి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకండి. రక్తపోటు వల్లనో, వంశపారంపర్య కారణాల వల్లనో మీకు ఇది జరిగి ఉంటే భవిష్యత్తులో మెదడులోని ధమనులు హఠాత్తుగా చిట్లిపోయి, మెదడు కణజాలంలోకి రక్తస్రావం అయి, మెదడులోని ఆ భాగం పనిచేయడం నిలిచిపోయి పక్షవాతానికి దారితీసే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి వీలైనంత తొందరగా న్యూరోసర్జన్‌ను సంప్రదించండి. డాక్టర్ జి. వేణుగోపాల్, సీనియర్ న్యూరోసర్జన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట హైదరాబాద్ -
డౌట్ ఉంటే చెప్పేస్తుంది
బీపీ సొంతంగా చెక్ చేసుకోవచ్చు. సుగర్‌ను కూడా. అలాగే గర్భధారణ జరిగిందీ లేనిదీ తెలిపే ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. త్వరలో ఎవరికి వారు బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షను చేసుకునే పరికరం కూడా రాబోతోంది! కొత్తపరికరం దుర్గాపూర్ (కోల్‌కతా)లోని ‘నిట్’ (నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) విద్యార్థులు కనిపెట్టిన ఈ వినూత్న పరికరంలో చెకప్ స్ట్రిప్ ఉంటుంది. స్ట్రిప్ ధర 150 నుంచి 200 రూపాయల వరకు ఉండే అవకాశాలున్నాయి. వేలినుంచి ఒక రక్తపు చుక్కను తీసి పేపర్‌తో తయారై ఉండే ఆ స్ట్రిప్ మీద ఉంచి, దానికి చిన్న చుక్క ‘రీజెంట్’ను (పరీక్షక పదార్థం) కలిపి విశ్లేషించినప్పుడు వచ్చే ఫలితాన్ని బట్టి బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నదీ, లేనిదీ, భవిష్యత్తులో రాబోయే అవకాశం ఏమైనా ఉందా అన్నదీ తెలిసిపోతుంది. స్త్రీ దేహంలో క్యాన్సర్ కారకాలను గుర్తించే ‘హర్2’ అనే యాంటిజెన్ పరిమాణాన్ని ఈ పరికరం గుర్తిస్తుంది. ఆరోగ్యంగా ఉన్న స్త్రీ దేహంలో ఈ ‘హర్2’ మోతాదు 15 నానో గ్రాములు/ఎం.ఎల్. కన్నా తక్కువగా ఉంటుంది. అది కనుక 15 నానో గ్రాముల్ని మించి ఉంటే తక్షణం వెళ్లి బ్రెస్ట్ క్యాన్సర్ పరీక్షను చేయించుకోవడం అవసరం. కచ్చితమైన ఫలితాలను ఇస్తున్న ఈ పరికరాన్ని ‘నిట్’లోని బయోటెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ మోనీదీప ఘోష్ నేతృత్వంలో ఇన్స్టిట్యూట్ విద్యార్థులు రూపొందించారు. దుర్గాపూర్‌లోని సెంట్రల్ మెకానికల్ ఇంజనీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి కూడా వీళ్లకు సహకారం అందించింది.పరికరం ఉత్పత్తి వ్యయం పదివేల రూపాయల వరకు ఉండగా, ఎక్కువ సంఖ్యలో మార్కెట్లోకి వస్తే కనుక ఒక్కో స్ట్రిప్‌ను 50 రూపాయలకు కూడా అందించే వీలుంటుందని మోనీదీప చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల యాభై వేల మందిలో బ్రెస్ట్ క్యాన్సర్ బయపడుతోందని ఆమె తెలిపారు. అన్నట్లు ఆ పరికరానికి ఇంకా పేరు పెట్టలేదు. -
హైబీపీ, డయాబెటిస్ ఉన్నాయా..? కిడ్నీ పరీక్షలు తప్పనిసరి
మన శరీరంలో మూత్రపిండాలను (కిడ్నీలను) చాలా సంక్లిష్టమైన అవయవాలుగా చెప్పుకోవచ్చు. అవి శరీరంలోని విషతుల్యమైన పదార్థాలను మూత్రం ద్వారా వడపోస్తాయి. హార్మోన్లను, ఎంజైములను కూడా విడుదల చేస్తుంటాయి. చిక్కుడు గింజ ఆకారంలో ఉండే మూత్రపిండాల్లో ఎడమవైపుది కొంచెం పెద్దగా కుడివైపు దానికంటే కొంచెం ఎగువగా ఉంటుంది. దాదాపు 150 గ్రాముల వరకు బరువుండే మూత్రపిండాలు 11–14 సెం.మీ పొడవు, 6 సెం.మీ వెడల్పు, 4 సెం.మీ మందంగా ఉంటాయి. రక్తంలోని వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలది ప్రధాన పాత్ర.అధిక రక్తపోటు (హైబీపీ), మధుమేహం (డయాబెటిస్)తో బాధపడేవారికి మూత్రపిండాలు వైఫల్యం చెందే ప్రమాదం ఎక్కువ. కాబట్టి ఎప్పటికప్పుడు కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకుంటూ ఉండటం తప్పనిసరి.మూత్రపిండాలకు సంబంధించి నాలుగు రకాల సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. 1 కిడ్నీ ఇన్ఫెక్షన్స్ 2 కిడ్నీ స్టోన్స్ 3 కిడ్నీ ఫెయిల్యూర్ 4 కిడ్నీ ట్యూమర్స్ అండ్ క్యాన్సర్స్ ♦ మహిళల్లో ఎక్కువగా కనిపించే బ్యాక్టీరియల్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ కిడ్నీలకు వరకు పాకి ఇన్ఫెక్షన్లకు గురిచేస్తుంటాయి. యాంటీబయాటిక్ కోర్సులతో ఈ సమస్య తొలగిపోతుంది. ♦ పురుషుల్లో ఎక్కువగా కనిపించే మూత్రపిండాల్లో వచ్చే రాళ్లలో అనేక రకాలుండటంతో పాటు ఇసుకరేణువు పరిమాణం దగ్గర్నుంచి గోల్ఫ్‌బాల్ సైజు వరకూ ఉంటాయి. తీవ్రమైన నొప్పి, బాధను కలిగించే ఈ రాళ్లకు సైజును బట్టి అనేక రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ♦ అధిక బరువు, పొగతాగడం, మద్యం, రక్తపోటు, చక్కెరపాళ్లు అదుపులో లేకపోవడం వల్ల ఆ దుష్ప్రభావాలతో కిడ్నీలు విఫలమైనప్పుడే కిడ్నీ సమస్యల లక్షణాలు బయటపడుతుంటాయి. కాబట్టి దీన్ని ఒక సైలెంట్ డిసీజ్‌గా చెప్పుకోవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్‌కు డయాలసిస్, కిడ్నీ మార్పిడి (ట్రాన్స్‌ప్లాంటేషన్) చికిత్స పద్ధతులు తప్పనిసరి. ♦ పుట్టుకతో వచ్చే కిడ్నీ సమస్యల్లో పిల్లలకు స్నానం చేయించేటప్పుడు లేదా డాక్టర్ దగ్గరకు చెకప్స్ కోసం వెళ్లినప్పుడు కణుతులు బయటపడుతుంటాయి. కణితి పరిమాణాన్ని బట్టి మూత్రంలో రక్తం, కడుపునొప్పి, జ్వరం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, అజీర్ణం, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. నెఫ్రోబ్లాస్టోమా లేదా విల్మ్స్ ట్యూమర్స్‌గా చెప్పకునే మూత్రపిండాల్లో కణుతులు పిల్లల్లో 4, 5 ఏళ్ల వయసులో బయటపడుతుంటాయి. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లో ఎక్కువగా కనిపించే ఈ కణుతులను పూర్తిగా నయం చేయడం సాధ్యమే. ప్రమాదకరమైన కణుతులు రీనల్‌సెల్ కార్సినోమా (ఆర్సీసీ) అనే ఒక రకం కణితి పెద్ద వయసులో కనిపిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తులకు, ఇతర భాగాలకు వ్యాపించే గుణం ఈ క్యాన్సర్‌కు ఎక్కువ. ఒక్కొక్కసారి ఇలా వ్యాప్తిచెందిన (మెటాస్టాసిస్ అయిన) భాగాల ద్వారా కూడా ఈ క్యాన్సర్‌ను గుర్తించడం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి రెండు మూత్రపిండాలలో కూడా ఈ కణుతులు ఉండవచ్చు. అనేక సబ్టైపులలో ఉండే ఈ క్యాన్సర్ ఇతర కిడ్నీ సంబంధిత పరీక్షలతో, ఆల్ట్రాసౌండ్ వంటి పరీక్షలతో కనుగొనడం జరుగుతుంది. వయసు పైబడే కొద్దీ ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఎక్కువ. అయితే పొగతాగే అలవాటు ఉన్నవారిలో చాలా చిన్నవయసు వారిలోనే ఈ క్యాన్సర్ నమోదవుతున్నట్లు అనేక అధ్యయనాలు / సర్వేలు తెలుపుతున్నాయి. అందుకే ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి పట్టణాల్లో ఈ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. పొగతాగడం, మద్యం అలవాటు ఉండటం, అధిక బరువు వంటి వాటితో పాటు జన్యుపరివర్తనాలు (జీన్ మ్యుటేషన్స్) కూడా ఈ క్యాన్సర్‌కు ప్రధాన కారకాలు అవుతాయి. పరీక్షలు లక్షణాలు కనిపించనప్పుడు శారీరక పరీక్షలు చేయడం (ఫిజికల్ ఎగ్జామ్స్), రక్తపరీక్షలు (బ్లడ్ టెస్ట్స్), మూత్రపరీక్షలు (యూరిన్ టెస్ట్స్), ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎమ్మారై, క్యాల్షియమ్ లెవెల్స్ తెలిపే పరీక్షలతో పాటు, ఒక్కోసారి ఈ క్యాన్సర్ బయటపడే సరికే ఊపిరితిత్తులకు, ఎముకలకు క్యాన్సర్ పాకి ఉండవచ్చు. కాబట్టి డాక్టర్లు ఛాతీ ఎక్స్‌రేతో పాటు బోన్స్కాన్స్ కూడా చేయిస్తూ ఉంటారు. చికిత్స కిడ్నీ మొత్తంగా తీసేయాల్సిన శస్త్రచికిత్సతో పాటు క్యాన్సర్ రకాన్ని బట్టి కీమో, రేడియో థెరపీలను ఇస్తారు. కిడ్నీలనిప్పుడు లాపరోస్కోపిక్ పద్ధతిలోనూ తొలగిస్తున్నారు. క్యాన్సర్ కాని కణుతులకు కూడా సైజుని బట్టి రకరకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఈ కణుతులు ఎక్కువగా ఉన్నా లేదా మూత్రపిండాలలో చాలా పెద్దగా ఉన్న సందర్భాల్లో కూడా కిడ్నీలను తొలగించాల్సి రావచ్చు. కిడ్నీ ట్యూమర్ స్టేజ్ మీద ఆధారపడి శస్త్రచికిత్సని మూడు రకాలుగా చేస్తూ ఉంటారు. రాడికల్ నెఫ్రోక్టమీ: ఎక్కువగా చేసే ఈ సర్జరీలో మూత్రపిండంతో పాటు అడ్రినల్ గ్లాండ్స్, లింఫ్ నాళాలలను, కణజాలాన్ని మొత్తంగా తీసివేయడం జరుగుతుంది. కణితి పరిమాణం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ సర్జరీని చేస్తారు. సింపుల్ నెఫ్రొక్టమీ: స్టేజ్ – 1 : కిడ్నీ క్యాన్సర్‌కు ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తీసివేయడం జరుగుతుంది. పార్షియల్ నెఫ్రోక్టమీ: పుట్టు్టకతో ఒకే ఒక మూత్రపిండం ఉండి, దానిలో కణితి కనిపించినప్పుడు, కణితి ఉన్నంత వరకు మాత్రమే తీసివేయడం జరుగుతుంది. ♦ ఒక్కోసారి రెండు మూత్రపిండాల్లోనూ కణుతులు ఏర్పడినప్పుడు కూడా ఇలా కణుతులు ఉన్నంత మేరకు మాత్రమే వాటిని తీసేయడం జరుగుతుంది. ♦ కణితిని తొలిదశలోనే గుర్తించి, ఒక్క మూత్రపిండాన్ని మాత్రమే తొలగించినప్పుడు, శస్త్రచికిత్స అయిన కొద్దిరోజుల్లోనే వారు సాధారణ జీవితాన్ని గడపగలుగుతారు. రెండు మూత్రపిండాలను తీసేసినా, ఒక్కటి ♦ తీసేశాక రెండోది సరిగా పనిచేయకపోయినా వారికి డయాలసిస్ చేస్తూ, వీలైనంత త్వరగా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించాల్సి ఉంటుంది. ♦ చికిత్స అయిపోయిన తర్వాత కూడా ఫాలో అప్ తప్పనిసరి. సీటీ స్కాన్, ఛాతీ ఎక్స్‌రే వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. ♦ మూత్రంలో రక్తం కనిపిస్తే అశ్రద్ధ చేయకుండా ఉండటంతో పాటు పొగతాగడం, మద్యం వంటి అలవాట్లు ఉంటే వాటికి దూరంగా ఉంటుండటం వల్ల మూత్రపిండాలను కొంతవరకైనా కాపాడుకోగలిగిన వారమవుతాం. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు!
అప్పటివరకూ లేని బీపీ డాక్టర్ దగ్గరకు వెళ్లి పరీక్ష చేయించుకున్నప్పుడు మాత్రమే వస్తోందా? ఇలా మీకు మాత్రమే కాదు.. దేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఇలాంటి చిత్రమైన అనుభవమే ఎదురవుతోంది. ఇంట్లో, ఆఫీసులో లేదా ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఉన్న బీపీ.. డాక్టర్ దగ్గరకు వెళ్లేసరికి నార్మల్ అయిపోతోందా? దేశంలో 18 శాతం మందికి ఇలాగే అవుతోంది. ఇంతకీ ఏమిటిది? లేని బీపీ ఉన్నట్లు.. ఉన్న బీపీ లేనట్లు.. సైలెంట్ కిల్లర్‌గా మారుతున్న హైపర్‌టెన్షన్ తీరుతెన్నులపై ఇండియా హార్ట్ స్టడీ(ఐహెచ్ఎస్) ఇటీవల దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో 9 నెలలపాటు అధ్యయనం నిర్వహించింది. ఇందులో 1,233 మంది వైద్యులు పాల్గొన్నారు. ఇండియా హార్ట్ స్టడీ ముఖ్య పరిశోధకుడు, బీహెచ్ఎంఆర్సీ చైర్మన్ అండ్ డీన్ అకడమిక్ రీసెర్చ్ డాక్టర్ ఉపేంద్రకౌల్, కార్డియోవాస్క్యులర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మాస్ట్రీచ్ డాక్టర్ విల్లెం వెర్బెక్, అపోలో ఆస్పత్రి కార్డియాలజిస్ట్ డాక్టర్ సునీల్‌కపూర్, ఉస్మానియా ఆస్పత్రి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ మనీషాసహాయ్ల బృందం బుధవారం నగరంలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ వివరాలను విడుదల చేసింది. ‘ఏపీ, తెలంగాణతోపాటు మొత్తం 15 రాష్ట్రాల్లో 23,253 మందికి స్క్రీనింగ్ నిర్వహించాం. వీరిలో 18,918 మంది రక్తపోటును రికార్డు చేశాం. వారంపాటు రోజుకు నాలుగుసార్లు ఇటు క్లినిక్‌తో పాటు అటు ఇంట్లోనూ టెస్ట్ చేయగా.. ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి’ అని వైద్యులు తెలిపారు. వైట్‌కోట్.. మాస్క్డ్: అప్పటివరకూ బీపీ లేని వ్యక్తి వైద్యుడి వద్దకు వచ్చినప్పుడు ఆ పరిసరాలు అవి చూసి ఆందోళనకు గురవడంతో పరీక్షలో బీపీ ఉన్నట్లు తేలుతోంది. దీన్ని వైట్‌కోట్ హైపర్‌టెన్షన్ అని అంటారు. దీని వల్ల బీపీ ఉన్నట్లుగా భావించి.. వైద్యుడు మందులు రాస్తున్నాడు.. బీపీ లేకున్నా మందులు వాడటం వల్ల రోగుల ఆరోగ్యం దెబ్బతింటోంది.. దేశవ్యాప్తంగా వైట్‌కోట్ హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నవారి శాతం 23గా ఉండగా.. తెలంగాణలో అది 35.9 శాతంగా ఉన్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది. అలాగే ఉన్న బీపీ లేనట్లుగా కనిపించే మాస్్కడ్ హైపర్ టెన్షన్ రాష్ట్రంలో 14.3% మందిలో ఉన్నట్లు తేలింది. సాధారణంగా హృదయ స్పందన రేటు నిమిషానికి 72 ఉండాలి.. అయితే.. భారతీయుల్లో అది 80గా ఉందని వైద్యులు తెలిపారు. ఉదయంతో పోలిస్తే.. సాయంత్రం బీపీ ఎక్కువగా ఉంటోందని చెప్పారు. 41% మందికి తమకు అధిక రక్తపోటు ఉన్న సంగతే తెలియదట.. సరైన వ్యాధి నిర్ధరణ జరగకపోవడం, నిర్లక్ష్యం వంటి వాటి వల్ల గుండెతోపాటు మూత్రపిండాలూ దెబ్బతింటున్నాయని వైద్యులు తెలిపారు. అందుకే బీపీ ఉన్నట్లు సరిగా నిర్ధా రణ కావాలంటే కనీసం వరుసగా నాలుగైదు రోజుల పాటు పరీక్షించుకుని నిర్ధారించుకోవడం ఉత్తమమని వైద్యులు ప్రకటిస్తున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
వీడియో సెల్ఫీతో రక్తపోటు తెలిసిపోతుంది!
రక్తపోటు తెలుసుకోవాలంటే ఇప్పుడు నానా అవస్థలు పడాల్సి ఉంటుంది. త్వరలోనే ఈ సమస్యలు తీరిపోతాయి. ఎందుకంటారా? కేవలం ఒక్క వీడియో సెల్ఫీతో రక్తపోటును లెక్క వేయగల సరికొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది మరి. అధిక రక్తపోటు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఓ తీవ్ర సమస్యగా మారిపోతున్న ఈ తరుణంలో ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తూండటం గమనార్హం. చేతి మణికట్టుకు బిగించుకోగల పరికరాలతో బీపీ చూసుకునే అవకాశమున్నప్పటికీ అవి ఎల్లప్పుడు మన చేతికి అంటిపెట్టుకుని ఉన్న అవకాశం తక్కువ. ఈ నేపథ్యంలో టొరంటో యూనివర్శిటీ శాస్త్రవేత్త కాంగ్ లీ ఈ వీడియో సెల్ఫీ టెక్నాలజీని అభివద్ధి చేశారు. చర్మం లోపలి చిత్రాలు తీయగల సాఫ్ట్‌వేర్‌తో తాము ముందుగా కొంతమంది ముఖాల వీడియోలు తీశామని.. రెండు నిమిషాల ఈ వీడియోల ద్వారా సేకరించిన రక్తపోటు వివరాలకు.. భౌతికంగా సేకరించిన వివరాలను సరిపోల్చి ఈ సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. మెషీన్ లెర్నింగ్ పద్ధతులను వాడటం ద్వారా ఈ సాఫ్ట్వేర్ మన ముఖంలోని రక్తప్రసరణలో వచ్చే మార్పులను గుర్తించి.. దాని ఆధారంగా రక్తపోటును లెక్కకట్టగలదు. ఈ పద్ధతి ద్వారా వచ్చే వివరాలు 95 శాతం కచ్చితత్వంతో ఉన్నట్లు తమ అధ్యయనాల్లో తెలిసిందని కాంగ్ లీ తెలిపారు. మరిన్ని పరిశోధనల ద్వారా ఈ ఫలితాలను నిర్ధారించుకోగలిగితే.. సమీప భవిష్యత్తులోనే అరనిమిషం వీడియో సెల్ఫీ మీ రక్తపోటు వివరాలను అందించవచ్చునని అంటున్నారు కాంగ్ లీ. -
రిలయన్స్, బీపీ కీలక ఒప్పందం
సాక్షి, న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్) తన బ్రిటిష్ భాగస్వామి బీపీ పీఎల్సీతో కలిసి కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. తద్వారా రానున్న అయిదేళ్లలో 5500 పెట్రోల్ పంప్ ఔట్లెట్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ఆర్ఐఎల్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వీటితోపాటు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌ను భారత్‌లోని విమానయాన సంస్థలకు విక్రయించాలని ప్రణాళికలు రచించాయి. ఈ మేరకు ఆర్ఐఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముకేశ్ అంబానీ, బీపీ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బాబ్ డాడ్లీ ఒప్పంద పత్రాలపై మంగళవారం ముంబైలో సంతకాలు చేశారు. తుది ఒప్పందం 2019, రెగ్యులేటరీ, ఇతన అనుమతులకు నిబంధనలకు లోబడి, లావాదేవీ 2020 మొదటి అర్ధభాగంలో పూర్తవుతుందని భావిస్తున్నామిన ఆర్ఐఎల్ వెల్లడించింది. రీటైల్ వ్యాపారాన్ని ఇప్పటికే ఉన్న రిలయన్స్ బంకుల ఆధారంగా నిర్మించనున్నారు. సరికొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేయనున్నామనీ, రీటైల్ సర్వీస్ స్టేషన్ నెట్‌వర్క్‌ద్వారా , వైమానిక ఇంధన వ్యాపారాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తామని సంయుక్తంగా ప్రకటించాయి. కొత్త జాయింట్ వెంచర్ కంపెనీలో ఆర్ఐఎల్ 51శాతం వాటాను, బిపి 49శాతం వాటాను వాటాను కలిగి ఉంటాయి. ఈ ఉమ్మడి సంస్థ ఆధర్యంలో 5,500 ఇంధన రిటైల్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని కంపెనీలు యోచిస్తున్నాయి. ఈ జాయింట్ వెంచర్లో ఆర్ఐఎల్ ఏవియేషన్ ఇంధనాల వ్యాపారం కూడా ఉంటుంది, ఈ జాయింట్ వెంచర్ ద్వారా తన మార్కెట్ వాటాను రెట్టింపు చేయాలని ఆర్ఐఎల్ యోచిస్తోంది. దేశంలో గ్యాస్ వనరులను అభివృద్ధి చేయడంలో తమ బలమైన భాగస్వామ్యం ఇప్పుడు ఇంధన రిటైలింగ్, విమాన ఇంధనాలకు కూడా విస్తరిస్తామని రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. వినియోగదారులకు దేశవ్యాప్తంగా ప్రపంచస్థాయి సేవలను మరింత పెంచడంలో తమ నిబద్ధతను ఈ ఒప్పందం ప్రతిబింబిస్తుందన్నారు. 2020 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వృద్ధి మార్కెట్‌గా అవతరించనుందని బాబ్ డాడ్లీ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పెద్ద పెట్టుబడిదారుగా ఉన్న తాము ఈ వృద్ధికి తోడ్పడేందుకు మరింత ఆకర్షణీయమైన, వ్యూహాత్మక అవకాశాలవైపు చూస్తున్నామన్నారు. కాగా ఆర్ఐఎల్ ఇప్పటికే దేశంలో 1300 ఇంధన రిటైల్ పంపులను స్వతంత్రంగా నడుపుతుండగా, బీపీకి అక్టోబర్ 2016 లో భారతదేశంలో 3,500 ఇంధన రిటైల్ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి లైసెన్స్ లభించింది. భారతదేశంలో 5 వేల పెట్రోల్ పంపులను తెరవడానికి ఆర్ఐఎల్కు లైసెన్సులు ఉన్నాయి. -
లోబిపి ఉంటే...
హైపోటెన్షన్ రక్తప్రసరణ వేగాన్ని తగ్గిస్తుంది. దీనినే లో బిపి అంటాం. ఆహార మార్పుతో దీనిని చక్కదిద్దవచ్చని పరిశోధకులు అంటున్నారు. ♦ వారం రోజుల పాటు ఉదయం ఒకకప్పు, సాయంత్రం ఒక కప్పు పచ్చిబీట్రూట్ రసం తాగితే తేడా స్పష్టంగా తెలుస్తుంది. దానిమ్మ రసం కూడా రక్తప్రసరణను క్రమబద్ధీకరించడంలో బాగా పని చేస్తుంది. ♦ వారం రోజుల పాటు తాజాపండ్లను మాత్రమే ఆహారంగా తీసుకుంటే బిపి క్రమబద్ధం కావడంతోపాటు వ్యవస్థ మొత్తం శక్తిమంతం అవుతుంది. రోజుకు మూడుసార్లూ తాజా పండ్లనే తీసుకోవాలి. ఐదు గంటల వ్యవధిలో పూర్తిస్థాయి భోజనానికి సరిపడిన మోతాదులో పండ్లను తినాలి. తర్వాత రెండు లేదా మూడు వారాలపాటు పండ్లతోపాటు పాలు తీసుకోవాలి. ఆ తర్వాత పండ్లను మరికొంత తగ్గించి గింజలు, చిరుధాన్యాలు, పచ్చికూరగాయలను కూడా చేర్చాలి. ఇలా చేయడం వల్ల సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఇలా మూడునెలలకొక కోర్సు ఫుడ్‌హ్యాబిట్ పాటిస్తుంటే మంచిది. -
చక్కెరొచ్చింది... రక్తం పోటెత్తింది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీపీ, షుగర్ వంటి జీవనశైలి వ్యాధులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. అయితే, గ్రామాల్లో అనేకమందికి తమకు బీపీగానీ, షుగర్‌గానీ ఉన్నట్లు తెలియకపోవడంతో ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ఈ నేపథ్యంలో జీవనశైలి వ్యాధిగ్రస్తులను ముందే గుర్తించి ప్రాణాపాయం నుంచి రక్షించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ‘నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కేన్సర్, డయాబెటీస్, కార్డియోవస్కులర్ డిసీజ్ అండ్ స్ట్రోక్ (ఎన్‌పీసీడీసీఎస్)’ను ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ సమాచారాన్ని తక్షణమే ట్యాబ్‌లలో అప్లోడ్ చేస్తున్నారు. వేగంగా సర్వే నిర్వహిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమస్థానంలో ఉంది. జీవనశైలి వ్యాధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈ నెల మూడో తేదీ వరకు చేపట్టిన సర్వే అంశాల్లోని నివేదికను విడుదల చేసింది. 12 జిల్లాలు 32 లక్షల మంది బీపీ, షుగర్ బాధితుల వివరాలు తెలుసుకునేందుకు రాష్ట్రంలో 12 జిల్లాల్లో వైద్య పరీక్షలు ప్రారంభించారు. జనగాం, సిద్ధిపేట, కరీంనగర్, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల, భూపాలపల్లి, వరంగల్ రూరల్, మెదక్, సంగారెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, వరంగల్ అర్బన్ జిల్లాల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం 1.04 కోట్ల జనాభా ఉంది. అందులో 30 ఏళ్లకుపైబడిన వయస్సుగలవారు 38.73 లక్షలమంది ఉన్నారు. 32.02 లక్షల(83%) మందికి స్క్రీనింగ్ పరీక్షలు జరిగాయి. వారిలో 3.86 లక్షలమందిని గుర్తించి ఆసుపత్రులకు రిఫర్ చేశారు. పాతవారితో కలిపి మొత్తంగా 2.73 లక్షల మందికి బీపీ, 1.69 లక్షల మందికి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారించారు. అంటే 4.42 లక్షల మందికి బీపీ, షుగర్ ఉన్నట్లు తేలింది. వారిలో కొందరికి బీపీ, షుగర్ రెండూ ఉండటం గమనార్హం. అంటే 30 ఏళ్లకుపైబడిన వారిలో ఈ 12 జిల్లాల్లో 13 శాతం మంది బీపీ, షుగర్ వ్యాధులతో బాధపడుతున్నట్లు నిర్ధారణ జరిగింది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లాలో బీపీ, షుగర్ ఈ 12 జిల్లాల్లో అత్యధికంగా సంగారెడ్డి జిల్లాల్లో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. ఆ జిల్లాలో 5.12 లక్షలమందికి స్క్రీనింగ్ చేయగా, 65 వేలమందికి బీపీ, 34 వేల మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారణ చేశారు. అత్యంత తక్కువగా భూపాలపల్లి, వరంగల్ రూరల్ జిల్లాల్లో బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు తేలింది. భూపాలపల్లి జిల్లాలో 2.38 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా, అందులో 3,453 మందికి బీపీ, 3112 మందికి షుగర్ ఉన్నట్లు నిర్దారించారు. వరంగల్ రూరల్ జిల్లాలో 2.14 లక్షల మందికి స్క్రీనింగ్ చేయగా, అందులో 4,531 మందికి బీపీ, 4 వేల మందికి షుగర్ ఉన్నట్లు నిర్ధారించారు. జూన్ ఒకటి నుంచి మిగిలిన జిల్లాల్లోనూ జీవనశైలి వ్యాధులపై సర్వే చేయనున్నారు. -
తమకు బీపీ ఉన్నట్లు సగం మందికి తెలియదు!
న్యూఢిల్లీ: రక్తపోటు బాధితుల్లో దాదాపు సగం మందికి తమకు ఆ సమస్య ఉన్నట్లే తెలియదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేవలం 45 శాతం మందికి మాత్రమే తమ రక్తపోటు స్థాయిపై అవగాహన ఉన్నట్లు తేలింది. పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ), హార్వర్డ్ టీహెచ్ ఛాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హైడల్‌బర్గ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్, బర్మింగ్‌హామ్ యూనివర్సిటీ, గొట్టిన్‌జెన్ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోని 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల్లో నేషనల్ హెల్త్ అండ్ ఫ్యామిలీ సర్వే సేకరించిన డేటా ఆధారంగా వారు ఈ అంచనాకు వచ్చారు. ఈ సర్వే కోసం 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసున్న 7,31,864 మందిని పరిశీలించారు. ప్రతి నలుగురిలో ముగ్గురు ఇప్పటివరకు బీపీ పరీక్షలు చేయించుకోలేదని అధ్యయనంలో గుర్తించారు. 13 శాతం మంది మాత్రం తాము రక్తపోటుకి మందులు వాడుతున్నామని చెప్పగా.. మరో 8 శాతం మంది మాత్రం తమ బీపీ కంట్రోల్లోనే ఉంటుందని పేర్కొన్నారు. ఇక 5.3 శాతం మంది మహిళలు, 10.9 శాతం మంది పురుషులు మాత్రమే తమ బీపీని నియంత్రణలో ఉంచుకుంటున్నట్లు వెల్లడించారు. రక్తపోటుపై అవగాహన ఉన్న వారు అత్యధికంగా పుదుచ్చేరిలో ఉండగా (80.5 శాతం).. అత్యల్పంగా ఛత్తీస్‌గఢ్‌లో (22.1 శాతం) ఉన్నారు. ఈ అధ్యయన వివరాలు పీఎల్వోఎస్ మెడిసన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
యువత @హైరిస్క్
లబ్బీపేట(విజయవాడతూర్పు)/మచిలీపట్నంసబర్బన్: ‘ప్రైవేటు బ్యాంకులో పనిచేసే 35 ఏళ్ల యువకుడు ఇటీవల నీరసంగా ఉంటుండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. రక్తపోటు అధికంగా ఉండటంతో పాటు, మూత్రపిండాల్లో ఫిల్టర్స్ పదిశాతం వరకూ దెబ్బతిన్నట్లు వైద్యులు చెప్పారు. ఐదేళ్ల నుంచి రక్తపోటు ఉన్నా గుర్తించక పోవడంతో ఆ ప్రభావం మూత్రపిండాలపై చూపినట్లు పేర్కొన్నారు.’‘ఇరిగేషన్‌శాఖలో పనిచేసే ఓ ఉద్యోగికి 28 ఏళ్లు. తరచూ కళ్లు తిరిగినట్లు ఉండటంతో ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నారు. అతని శరీరంలో చక్కెర స్థాయి 160 ఉండటంతో పాటు, హెచ్‌బీఏ1సీ 10కి చేరింది. మరికొంతకాలం ఇదే పరిస్థితి ఉంటే గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉండేదని వైద్యులు తెలిపారు.’ ఇలా వీరిద్దరే కాదు..రాజధానిలో అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంటభూతాల బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నగరంలోని ఆస్పత్రిల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్థారణ అవుతుంది. చిన్నవయస్సులోనే సోకుతున్న వ్యాధుల పట్ల అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో మనిషి జీవిత కాలంలో పది నుంచి పదిహేనేళ్లు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వేలో సైతం రాజధాని జిల్లాలో మధుమేహం, రక్తపోటు కారణంగా గుండెజబ్బులు పెరుగుతున్నట్లు తేలింది. 25 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 12 శాతం మంది సుగర్తోనూ.. 14 శాతం మంది బీపీతోనూ బాధపడుతున్నట్లు సర్వేలో తేటతెల్లమైంది. జంట వ్యాధులకు కారణాలివే.. జీవనశైలిలో మార్పులు చోటుచేసుకోవడం, మాంసాహారం, కార్పోహైడ్రేడ్స్ ఎక్కువుగా ఉంటే జంక్ఫుడ్స్ తీసుకోవడం, శారీరక శ్రమ లేక పోవడం కారణంగా తేలింది. అంతేకాకుండా ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా రక్తపోటు పెరగడానికి కారణంగా సర్వేలో తేలింది. రాజధాని ప్రాంత ఉద్యోగుల్లో 70 శాతం మంది ఒత్తిడికి గురవడం కూడా చిన్నవయస్సులోనే రక్తపోటు, బీపీకి కారణాలుగా చెపుతున్నారు. ఏమి చేయాలి.. ♦ జంట వ్యాధులను అరికట్టేందుకు ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ♦ విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగా చేయడం మంచిది. ♦ ఆహారంలో కార్బోహైడ్రేడ్స్ తక్కువుగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్‌ఫుడ్స్‌ను తగ్గిస్తే మంచిది. ♦ పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం, తాజా పళ్లు, తాజా కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తినాలి. ♦ శరీరంలో బీపీ, చక్కెర స్థాయిలు, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ♦ ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం. ♦ ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. ప్రమాదకర స్థాయిలో ‘చక్కెర’ కృష్ణా జిల్లాలో మధుమేహం(సుగర్) వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది. ప్రతి పది మందిలో నలుగురు వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మచిలీపట్నం, పెడన నియోజకవర్గాల్లో హైరిస్క్ సుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నట్లు సర్వేలో స్పష్టమైంది. ఈ రెండు నియోజకవర్గాల్లో సుమారు 4.50 లక్షల మంది జనాభా ఉండగా సుమారు 1.50 లక్షల మంది సుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. వీరిలో లక్ష మందికి పైగా హైరిస్క్ సుగర్‌తో పోరాడుతున్నారు. -
నాలుక పట్టేసి మాట ముద్దగా వస్తోంది...
న్యూరాలజీ కౌన్సెలింగ్ మా పెద్దనాన్నగారి వయసు 48 ఏళ్లు. ఆర్నెల్ల క్రితం నుంచి ఆయనకు నాలుక పట్టేసినట్లుగా ఉండి, మాట ముద్దముద్దగా వస్తోంది. కుడివైపు భాగమంతా చచ్చుబడినట్లుగా మారుతోంది. చికిత్స తీసుకున్నా ప్రయోజనం లేదంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి పరిష్కారం చెప్పండి. – ఎల్. వెంకటేశ్వరరావు, నల్లగొండ మాట సరిగా రాకపోవడం, చూపులో తేడా రావడం, శరీరంలోని ఒకవైపు భాగం బలహీనపడటం, నడుస్తున్నప్పుడు బ్యాలెన్స్ లేకపోవడం... వంటి అకస్మాత్తుగా కనిపించే లక్షణాలన్నీ పక్షవాత సూచనలుగా పరిగణించాలి. అయితే దీన్ని నిర్ధారణ చేయడానికి సీటీ/ఎమ్మారై స్కాన్ పరీక్ష అవసరం. సాధారణంగా తొలిసారి కొద్దిపాటి పక్షవాతం వచ్చిన 30 శాతం మందిలో, ఏడాదిలో రెండోసారి తీవ్రంగా వచ్చేందుకు అవకాశం ఉంది. ప్రత్యేకంగా దీనికోసం రక్తాన్ని పలుచబార్చే మందులైన యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్, స్టాటిన్స్ వంటివి తీసుకోని వారిలో ఇది తీవ్రంగా రావచ్చు. దీనితో పాటు పక్షవాతానికి ఆస్కారమిచ్చే రిస్క్ ఫ్యాక్టర్లు అయిన బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, గుండెజబ్బులు, హోమోసిస్టిన్ లేదా గురక వంటివి రోగికి ఉండి, వాటిని నియంత్రించకపోతే పక్షవాతం వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మీ బంధువుకు వెంటనే అన్ని రకాల పరీక్షలు చేయించి, వ్యాధి విషయంలో తగిన నిర్వహణ చర్యలు (మేనేజ్మెంట్ ఆఫ్ డిసీజ్) తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ బంధువుకు మళ్లీ పక్షవాతం (స్ట్రోక్) వస్తే అది వైకల్యాన్ని తెస్తుంది. కాబట్టి మీరు వెంటనే మీ దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. రెండోసారి స్ట్రోక్‌ను నివారించేందుకు తగిన మందులు క్రమం తప్పకుండా వాడండి. కాళ్లలో మంటలూ – తిమ్మిర్లు... ఎందుకిలా? నా వయసు 53 ఏళ్లు. రెండేళ్ల నుంచి నా కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు చాలా బాధపెడుతున్నాయి. నాకు బీపీ, షుగర్ వ్యాధులు లేవు. ఎటువంటి చెడు అలవాట్లు కూడా లేవు. అయినా నాకు ఎందుకీ సమస్య. నాకు తగిన పరిష్కారం చూపగలరు. – ఎమ్. రామ్మోహన్రావు, నెమ్మికల్ కాళ్లలో మంటలు, పోట్లు, తిమ్మిర్లు, కాలి చివర మొద్దుబారడం వంటి లక్షణాలు నరాల నుంచి వెన్నుపాము వరకు వచ్చే సమస్యలకు ఒక సూచన. ఈ సమస్య పెరుగుతూ పోతే చేతులకు కూడా వస్తుంది. అలాగే నడకలో మార్పు, మలమూత్ర విసర్జనపై నియంత్రణ కోల్పోవడం, అంగస్తంభనలో కూడా ఇబ్బందులు ఉండవచ్చు. వీటినే పెరిఫెరల్ న్యూరోపతి అంటారు. డయాబెటిస్, విటమిన్ బి12, బి1, ఫోలిక్ యాసిడ్, ప్యాంటథెనిక్ యాసిడ్ లోపాలు ఈ సమస్యకు ప్రధాన కారణాలు. కొన్నిసార్లు లెప్రసీ, హెచ్ఐవీ, హెపటైటిస్–బి అండ్ హెపటైటిస్ సి వైరస్ ల వంటివి కూడా ఈ సమస్యకు దారితీయవచ్చు. సాధారణంగా 30 శాతం మందిలో ఏ కారణం లేకుండా కూడా ఈ సమస్య వస్తుంది. ఇలాంటివారిలో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. పై లక్షణాలను నియంత్రించడానికి గాబాపెంటిన్, ప్రీగాబాలిన్, అమీట్రిప్టిలిన్, డ్యూలోక్సెటిన్ మందులతో పాటు, మీ కండిషన్‌కు ఏ అంశం కారణమో దానికి కూడా వైద్యం చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంటే ఉదాహరణకు బీ12 లోపం వల్ల ఈ కండిషన్ ఏర్పడిందనుకోండి. అప్పుడు దాన్ని భర్తీ చేయడం కోసం ఆ విటమిన్‌ను సమకూర్చాలన్నమాట. మీరు చెబుతున్న లక్షణాలున్నప్పుడు అరికాళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే చిన్న పుండ్లు కూడా తీవ్రంగా ఇబ్బంది పెడతాయి. కొన్నిసార్లు రక్తప్రసరణలో ఇబ్బందులు, వెన్నుపాము జబ్బులు కూడా ఇలాంటి లక్షణాలను కలిగించవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. నా తలనొప్పే వంశపారంపర్యంగా మా అబ్బాయికీ వస్తోందా? నా వయసు 36 ఏళ్లు. గత రెండు దశాబ్దాలుగా నాకు ప్రతినెలా తలనొప్పి వస్తోంది. అలా నెలలో నాలుగైదుసార్లు వస్తోంది. ఈ తలనొప్పితో నేను నా రోజువారీ పనులేవీ చేసుకోలేకపోతున్నాను. ఇప్పుడు మా అబ్బాయిని కూడా అదే సమస్య వేధిస్తోంది. ఇప్పుడు వాడి వయసు ఎనిమిదేళ్లు. నా సమస్య వంశపారంపర్యంగా వాడికి సంక్రమించిందా? దయచేసి మా సమస్యను వివరించండి. – డి. కామేశ్వరి, కాకినాడ మీ చెబుతున్న లక్షణాలను బట్టి మీరు మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. తరచూ తలనొప్పి రావడం, దాంతోపాటు వాంతులు, వెలుగును చూడటంలో ఇబ్బంది పడటం, పెద్ద శబ్దాలను తట్టుకోలేకపోవడం, చీకటి గదిలో కాసేపు నిద్రపోయాక తలనొప్పి ఉపశమించడం లాంటి లక్షణాలు ఉంటే అది మైగ్రేన్ కావచ్చు. మీకు మైగ్రేన్ తలనొప్పిని ప్రేరేపించే అంశం ఏమిటో చూడండి. అంటే... సూర్యకాంతికి ఎక్స్పోజ్ కావడం, ఘాటైన వాసనలు, పర్ఫ్యూమ్స్ లేదా సుగంధద్రవ్యాల వాసన, సమయానికి భోజనం చేయకపోవడం, నిద్రలేమి, మీరు తీసుకునే ఆహారపదార్థాలలో నిర్దిష్టంగా ఏదైనా సరిపడక వెంటనే తలనొప్పి రావడం (ఉదాహరణకు చీజ్, ఆరెంజ్, అరటిపండ్లు, అజినమోటో వంటి చైనా ఉప్పు, చాక్లెట్లు వంటివి) జరుగుతుంటే వెంటనే దాన్ని తీసుకోవడం ఆపేయండి. దాంతో తలనొప్పిని నివారించవచ్చు. మీకు వచ్చే తలనొప్పిని నివారించే టోపిరమేట్, డైవల్‌ప్రోయేట్, ఫ్లునరిజిన్, ప్రొపనలాల్ వంటి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వాటిని తీసుకుంటే 70 శాతం వరకు మళ్లీ వచ్చే అవకాశం నివారితమవుతుంది. మీరు చెప్పినట్టే మైగ్రేన్ కుటుంబసభ్యుల్లో వంశపారంపర్యంగా రావచ్చు. అయితే మీ అబ్బాయిలో కనిపించే లక్షణాలు కంటి చూపునకు సంబంధించినవా లేక మెదడుకు సంబంధించినవా అని పరీక్షించాల్సిన అవసరం ఉంది. ఒకసారి మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించండి. కళ్లు తిరిగి పడిపోతున్నట్లుగా ఉంది... కారణం ఏమిటి? నా వయసు 47 ఏళ్లు. నాకు గత రెండేళ్ల నుంచి అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయి. మందులు వాడినప్పుడు తగ్గి మళ్లీ మళ్లీ ఈ సమస్య వస్తోంది. అలా అవుతున్నప్పుడు నాకు భయమేస్తోంది. దీనికి పూర్తిగా పరిష్కారం లేదా? – కె. రాధాకుమారి, శ్రీకాకుళం మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ సమస్య ‘వర్టిగో’ అని చెప్పవచ్చు. మనల్ని సరిగ్గా అంటే బ్యాలెన్స్డ్గా నిలబెట్టే ప్రధాన భాగం చిన్నమెదడు, చెవిలోపల ఉన్న ‘వెస్టిబ్యులార్ నరం’. చిన్నమెదడుకు వచ్చే జబ్బుల వల్ల మీరు పేర్కొన్న వర్టిగో లక్షణాలతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉండవచ్చు. అంటే చూపులో, మాటలో, నడకలో, స్పర్శలో, బలంలో మార్పులు ఉంటే తక్షణం న్యూరాలజిస్ట్‌ను సంప్రదించాలి. అలాగే కళ్లు తిరగడం అనేది తల తిప్పినప్పుడు కొద్ది క్షణాల పాటు ఉండి, వెంటనే తగ్గిపోవడం, వినికిడి తగ్గడం, చెవిలో హోరు శబ్దం రావడం... ఇవి చెవి నరానికి సంబంధించిన జబ్బు తాలూకు లక్షణాలు. దీనికి తక్షణ ఉపశమనానికి బీటాహిస్టిన్, సిన్నరజిన్ లాంటి మందులు ఉపయోపడతాయి. కొన్నిసార్లు ఇది మళ్లీ మళ్లీ వస్తుంది. అలా తరచుగా వచ్చేవారికి వెస్టిబ్యులార్ ఎక్సర్సైజెస్, ఎప్లేస్ మెథడ్ ద్వారా చికిత్స అవసరం. అప్పటికీ ఫలితం కనిపించకపోతే చెవి నరానికి కొన్ని ఇంజెక్షన్లు ఇవ్వడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. వర్టిగో అనేది కాస్త ఇబ్బంది పెడుతుంది గానీ ఏమాత్రం ప్రమాదకరం కాదు. కాబట్టి మీరు అనవసరంగా ఆందోళన పడకండి. – డాక్టర్ బి. చంద్రశేఖర్‌రెడ్డి, చీఫ్ న్యూరోఫిజీషియన్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్ -
తొమ్మిది పదుల యువకుడు
పశ్చిమగోదావరి ,తాడేపల్లిగూడెం రూరల్: ఆవేశ పడితే బీపీ.. శారీరక వ్యాయామం లేకపోతే సుగర్.. కాస్త ఎక్కువగా నడిస్తే కీళ్ల నొప్పులు.. ఇవి నేటి ఆధునిక మానవుడిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధులు. కానీ వీటికి భిన్నంగా పట్టణంలోని రెండో వార్డుకు చెందిన కవల కృష్ణమూర్తి(91) నిలుస్తున్నారు. తొమ్మిదో తరగతి చదివిన కృష్ణమూర్తి తొమ్మిది పదుల వయస్సు పైబడినప్పటికీ తన పనులు తాను చేసుకుంటూనే కళ్లజో డు లేకుండా వార్తా పత్రికలు చదవడం విశేషం. వయస్సు పైబడే కొలదీ వచ్చే బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటివి ఏమీ ఆయన దరి చేరలేదు. వయస్సు పైబడినప్పటికీ నిత్య యవ్వనుడిగానే ఆయనను పేర్కొనవచ్చు. తన ఆరోగ్య రహస్యంపై ఆయనను ప్రశ్నిస్తే మాత్రంఇలా చెప్పుకొచ్చారు. ఆహారం విషయంలో సమయ పాలన పాటించడం, ఎటువంటి చెడు అలవాట్లు లేకపోవడమే కారణమంటున్నారు. ఆయన ప్రస్తుత దినచర్య విషయానికొస్తే... ఉదయం రెండు ఇడ్లీలు తిని తొమ్మిది గంటలకు ఇంటి వద్ద బయల్దేరి నెమ్మదిగా అదే వార్డు యర్రా నారాయణస్వామి మున్సిపల్ పాఠశాల ఆవరణలోని గ్రంథాలయానికి రావడం వార్తా దినపత్రికలను చదవడం. తదుపరి మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం5 గంటలకు భోజనం. ఇదే ఆయన ఆహార పట్టిక. తొమ్మిది పదుల వయస్సు పైబడిన వృద్ధాప్యంలోనూ కనీసం కళ్లజోడు కూడా లేకుండా వార్తాపత్రికలను మొదటి నుంచి చివరి పేజీ అక్షరం వదలకుండా అవలీలగా చదివేస్తారు. ఈ వయస్సులో కనీసం బీపీ, సుగర్, కీళ్లనొప్పులు వంటి ఆరోగ్య సమస్యలు ఆయన దరి చేరకపోవడం విశేషం. -
వినిపించే బీపీ.. నిలబెట్టి సర్జరీ..
సాక్షి, హైదరాబాద్ : వైద్య రంగంలో అందుబాటులోకి వచ్చిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి..? మార్కెట్లో లభిస్తున్న సరికొత్త మెడికల్ ఉత్పత్తులు ఏవి? వాటిని ఎలా వినియోగించాలి? ఇలాంటి అనేక అంశాల గురించి భావివైద్యులకు పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిందే ప్రతిష్టాత్మక ‘మెడికాల్’హాస్పిటల్ నీడ్ ఎక్స్పో–2018. శుక్రవారం హైటెక్స్‌లో మెడికాల్ ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) తెలంగాణ అధ్యక్షుడు టి.నర్సింగారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై ఎక్స్పోను ప్రారంభించారు. దేశవిదేశాలకు చెందిన సుమారు వంద కంపెనీలు వివిధ రకాల ఆపరేషన్ టేబుళ్లు, లైట్లు, సీజర్లు, అనెస్థీషియా యంత్రాలతోపాటు పల్స్ ఆక్సోమీటర్లు, వెంటిలేటర్లు, గైనకాలజీ ఎగ్జామినేషన్ టేబుళ్లు, ఆర్థో, న్యూరో, ల్యాప్రోస్కోపిక్, కార్డియో థొరాసిక్ సర్జికల్, ఈసీజీ మిషన్లు, మానిటర్లు, పీడియాట్రిక్ వార్మర్లు, అత్యాధునిక హైడ్రాలిక్ పడకలు, రకరకాల డిస్పోజల్స్, మైక్రోస్కోపులు, గ్లౌజులు, మాస్కులు ఇలా ఐదు వేల రకాల సర్జికల్, నాన్ సర్జికల్ వైద్య పరికరాలను ప్రదర్శించాయి. భావి వైద్యులు, నర్సింగ్ విద్యార్థులు ఈ పరికరాలను చూసి.. వాటి వినియోగం గురించి తెలుసుకునేందుకు ఎక్స్‌పోకు భారీగా తరలివచ్చారు. టేబుల్‌పై నిలబెట్టి సర్జరీ.. సాధారణంగా రోగులను ఆపరేషన్ థియేటర్లోని టేబుల్‌పై పడుకోబెట్టి సర్జరీ చేస్తారు. కానీ ఊబకాయంతో బాధపడుతున్న రోగులను మాత్రం టేబుల్‌పై నిలబెట్టి బెరియాట్రిక్ సర్జరీ చేస్తారు. వీరి కోసం స్టాన్ కంపెనీ ప్రత్యేకంగా ఓటీ టేబుల్‌ను తయారు చేసింది. దీన్ని వైద్యుడు తనకు ఎలా కావాలంటే అలా ఉపయోగించుకోవచ్చు. దీని ధర రూ. 8.5 లక్షల వరకు ఉంది. వైద్యుడి పర్యవేక్షణ అవసరం లేకుండా.. శ్వాస కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగికి వెంటిలేటర్ సహాయంతో కృత్రిమ శ్వాసను అందిస్తుంటారు. రోగికి దీనిని అమర్చిన తర్వాత వైద్యులు, నర్సులు అక్కడే ఉండి మానిటర్ చేస్తుంటారు. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ‘హామిల్టన్ సి–3’రోబోటిక్ వెంటిలేటర్‌ను ఒకసారి రోగికి అమర్చితే చాలు.. ఆ తర్వాత వైద్యుల పర్యవేక్షణ అవసరం లేకుండా ఆటోమేటిక్‌గా వెంటిలేషన్ సపోర్ట్‌ను అందిస్తుంది. రోగి ఆరోగ్య పరిస్థితిపై దానికదే ఓ అంచనాకు వస్తుంది. ఆ మేరకు శ్వాసను అందిస్తుంది. స్విట్జర్లాండ్ నుంచి దిగుమతి అవుతున్న ఈ మిషన్ ఖరీదు రూ.20 లక్షల వరకు ఉంటుంది. అంధుల కోసం ప్రత్యేక బీపీ మిషన్.. ప్రస్తుతం మార్కెట్లో చాలా రకాల డిజిటల్ బీపీ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. ఇంట్లోనే ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకునేందుకు వీలుగా అక్యుర కంపెనీ అందుబాటులోకి తెచ్చిన డిజిటల్ బీపీ మిషన్.. బీపీని మానిటర్‌పై నమోదు చేయడంతో పాటు ఆ విషయాన్ని వాయిస్ రూపంలో ప్రకటిస్తుంది. చదువురాని, కంటి చూపులేని రోగులకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీని ధర రూ.4,700. శ్రమించకుండానే బాడీ మసాజ్.. మనిషి పరిపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ శరీరానికి తగిన వ్యాయామం అవసరం. చాలా మంది వాకింగ్, రన్నింగ్, యోగా వంటివి సాధన చేస్తుంటారు. అయితే ఉదయాన్నే నిద్ర లేచి కిలోమీటర్ల కొద్దీ నడిచే ఓపిక, సమయం చాలా మందికి ఉండటం లేదు. ఇలాంటి వారి కోసం ఫుల్‌బాడీ మసాజ్ చైర్ అందుబాటులోకి వచ్చింది. చైర్లో అరగంట కూర్చుంటే చాలు బాడీమసాజ్ పూర్తయినట్లే. దీని కోసం రూ.3.5 లక్షల నుంచి రూ.5.5 లక్షల వరకు విలువ చేసే చైర్లు అందుబాటులో ఉన్నాయి. -
ఎన్ఈసీ క్షేత్రం నుంచి నికో ఔట్..
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలోని ‘ఎన్ఈసీ(నార్త్ ఈస్ట్ కోస్ట్)– 25’ చమురు క్షేత్రంలో నికో రిసోర్సెస్ సంస్థకున్న వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్(ఆర్ఐఎల్), బ్రిటిష్ పెట్రోలియం(బీపీ)లు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీనిలో నికో రిసోర్సెస్‌కు 10 శాతం వాటా ఉంది. ఈ విషయాన్ని తన క్యూ3 ఫలితాల వెల్లడి సందర్బంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. ఈ చమురు క్షేత్రంలో ప్రస్తుతం ఆర్ఐఎల్కు 60 శాతం, బీపీ పీఎల్‌సీకి 30 శాతం చొప్పున వాటాలున్నాయి. ఈ వాటాల నిష్పత్తి ఆధారంగా నికో 10 శాతం వాటాను ఈ రెండు కంపెనీలు కొనుగోలు చేస్తాయి. ఈ చమురు క్షేత్రంలో 1.032 ట్రిలియన్ ఘనపుటడుగుల నిక్షేపాలున్నాయని అంచనా. కెనడాకు చెందిన నికో కంపెనీ నగదు సమస్యలతో సతమతమవుతోంది. అందుకే ఎన్ఈసీ–25లో వాటాను విక్రయిస్తోంది. కేజీ బేసిన్లో తనకున్న 10 శాతం వాటాను కూడా విక్రయానికి పెట్టింది. అయితే ఇంత వరకూ సరైన కొనుగోలుదారు దొరకలేదు. -
హలో మాస్టారూ..మీకు బీపీ ఉందా?
నీకు బీపీ వస్తే.. నీ పీఏ వణుకుతాడేమో.. నాకు బీపీ వస్తే.. ఏపీ మొత్తం వణుకుద్ది.. ఇలా బీపీ మీద సినిమాల్లో బోలెడన్ని డైలాగులు.. ఈ బీపీ అన్నది మనలోనూ.. మన సినిమాల్లోనూ ఓ భాగమైపోయింది. ఎవడికైనా కోపం ఎక్కువైతే.. వాడికి బీపీ ఎక్కువరా అనేస్తాం.. ఇంతకీ ఇప్పుడీ బీపీ బాగోతం మనకెందుకంటే.. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015–16లో దేశంలోని రక్తపోటు బాధితుల లెక్కలను తీశారు. తొలిసారిగా ఈ సర్వేలో వీరి సంఖ్యను గణించారు. పలురకాల కోణాల్లో దాన్ని విశ్లేషించారు కూడా.. దీని ప్రకారం సంపన్న వర్గాల్లో బీపీ ఎక్కువట.. ఇక్కడ మహిళల్లో 13 శాతం మందికి.. పురుషుల్లో 18 శాతం మందికి బీపీ ఉంది. దేశ సగటుతో పోలిస్తే.. ఇది ఎక్కువ. దేశంలోని పురుషుల్లో 15 శాతం మందికి బీపీ ఉండగా.. మహిళల్లో అది 11%. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని పురుషుల్లో 14 శాతం మంది రక్తపోటుతో బాధపడుతుండగా.. పట్టణాలకొచ్చేసరికి అది కాస్త పెరిగి 17 శాతంగా ఉంది. మహిళల్లో ఇది గ్రామాల్లో 10%, పట్టణాల్లో 12 శాతంగా ఉంది. రాష్ట్రాల పరంగా చూస్తే.. అత్యధికంగా సిక్కింలో 31 శాతం మంది మగవారు రక్తపోటుతో బాధపడుతున్నారు. అదే అతివల విషయానికొస్తే..సిక్కిం, అస్సాంలో 18 శాతం మంది బీపీ బాధితులేనట. తెలంగాణలో 20% , ఏపీలో 18 శాతం పురుషులకు బీపీ ఉంటే.. రెండు రాష్ట్రాల్లోని మహిళల్లో అది 13 శాతంగా ఉంది. వీటితోపాటు మతాలవారీగా కూడా రక్తపోటు బాధితుల లెక్కలేశారు. దీని ప్రకారం సిక్కుల్లో బీపీ ఎక్కువని తేల్చారు. గుండెపోటు వంటి హృదయ సంబంధిత మరణాల్లో 50 శాతం వాటికి కారణం ఈ రక్తపోటేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే. – సాక్షి, తెలంగాణ డెస్క్ -
జంట వ్యాధులతో గజగజ
నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రజలను జంట భూతాలు (మధుమేహం, బీపీ) పీక్కుతింటున్నాయి. వారికి తెలియకుండానే వారి శరీరంలోని అవయవాలను క్షీణింపజేస్తున్నాయి. ఇటీవల కాలంలో యువతపైన కూడా తమ ప్రభావం చూపుతున్నాయి. రానున్న కాలంలో మరింత ప్రమాదం పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. లబ్బీపేట(విజయవాడతూర్పు): ప్రైవేటు బ్యాంకులో పనిచేసే 35 ఏళ్ల యువకుడు ఇటీవల ఎక్కువ నీరసంగా ఉండటంతో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. రక్తపోటు అధికంగా ఉండడంతో పాటు, మూత్రపిండాల్లో ఫిల్టర్స్ పదిశాతం వరకూ దెబ్బ తిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ఐదేళ్ల నుంచి రక్తపోటు ఉన్నా గుర్తించక పోవడంతో ఆ ప్రభావం మూత్ర పిండాలపై చూపింది. ప్రస్తుతం రక్తపోటు క్రానిక్ (దీర్ఘకాలిక వ్యాధిగా)డీసీజ్‌గా మారినట్లు వైద్యులు తెలిపారు. ♦ ఇరిగేషన్‌శాఖలో పనిచేసే 28 ఏళ్లు ఉద్యోగి తరచూ కళ్లు తిరిగినట్లు ఉండటంతో ఇటీవల వైద్యుడి వద్దకు వెళ్లి పరీక్షలు చేయించుకున్నాడు. అతని శరీరంలో చక్కెర స్థాయి 160 ఉండటంతో పాటు, హెచ్‌బీఏ 1సీ 10కి చేరింది. మరికొంతకాలం ఇదే పరిస్థితి ఉంటే గుండె, కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు వైద్యులు హెచ్చరించారు. ♦ ఇలా వీరిద్దరే కాదు.. నగరంలో అనేక మంది రెండు పదుల వయస్సులోనే రక్తపోటు, మధుమేహం అనే జంట భూతాల బారిన పడుతున్నారు. నగరంలోని ఆస్పత్రుల్లో గుండె, కిడ్నీ సమస్యలతో చికిత్స పొందుతున్న వారిలో 80 శాతం మందికి ఈ రెండు వ్యాధులే కారణమని నిర్ధారణ అవుతుంది. చిన్న వయస్సులోనే సోకుతున్న వ్యాధులపై అప్రమత్తం కాకుంటే రానున్న రోజుల్లో మనిషి జీవిత కాలంలో పది నుంచి పదిహేనేళ్లు తగ్గిపోయే ప్రమాదం పొంచి ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వ నిర్వహించిన సర్వే ప్రకారం జిల్లాలో వయస్సు 30 సంవత్సరాలు దాటిన వారిలో 12 శాతం మంది మధుమేహం, 10.5 శాతం మంది బీపీతో భాదపడుతున్నట్లు తేలింది. జంట వ్యాధులకు కారణాలివే జీవనశైలిలో మార్పులు, మాంసాహారం, కార్బోహైడ్రేడ్స్ ఎక్కువుగా ఉండే జంక్ ఫుడ్స్ తీసుకోవడం, శారీరక శ్రమ లేక పోవడం కారణంగా తేలింది. అంతేకాకుండా ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడం కూడా రక్తపోటు పెరగడానికి కారణంగా గుర్తించారు. రాజధాని ప్రాంత ఉద్యోగుల్లో 70 శాతం మంది ఒత్తిడికి గురవడం కూడా చిన్న వయస్సులోనే రక్తపోటు, బీపీకి కారణాలుగా చెబుతున్నారు. వీటిని అరికట్టేందుకు ఏం చేయాలంటే.. ♦ జంట వ్యాధులను అరికట్టేందుకు ప్రతిరోజూ 45 నిమిషాల చొప్పున వారంలో ఐదు రోజుల పాటు వ్యాయామం, వాకింగ్ లాంటివి తప్పక చేయాలి. ♦ విధి నిర్వహణలో, జీవితంలో ఎదుర్కొనే ఒత్తిళ్లను అధిగమించేందుకు యోగ చేయడం మంచిది. ♦ ఆహారంలో కార్బోహైడ్రేడ్స్ తక్కువుగా ఉండేలా చూసుకోవాలి, మాంసాహారం, జంక్ ఫుడ్స్‌ను తగ్గించాలి. ♦ పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. తాజా పళ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువుగా తినాలి. ♦ శరీరంలో బీపీ, చక్కెర స్థాయి, కొలస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకునేలా తరచూ పరీక్షలు చేయించుకోవాలి. ♦ ప్రతి మనిషి నెలకు 500 గ్రాములకు మించి వంట నూనెలు వాడరాదు. అధికంగా నూనెలు వినియోగించడం చాలా ప్రమాదకరం. ♦ ఒకే నూనె కాకుండా మార్చి మార్చి వాడటం మంచిది. ముందు చూపే మేలు చిన్న వయస్సులోనే మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులకు గురైన వారిని నిత్యం చూస్తున్నాం. పదేళ్లలో వాటి ప్ర భావం గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాలపై పడుతుంది. కాళ్లు, శరీరంపై పుళ్లుపడి మానక పోవడం వంటి సమస్యలతో ఎక్కువ మంది మా వద్దకు వస్తున్నారు. అలాంటి వారికి శస్త్ర చికిత్స చేసి సాధారణ స్థితికి తెస్తున్నాం. వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వ్యాయామం, ఆహార నియమాలు ముఖ్యం. – డాక్టర్ కె.వేణుగోపాలరెడ్డి, మధుమేహ వ్యాధి నిపుణుడు -
ఉప్పుతిప్పలు..!
ఉప్పు ఉఫ్ఫున ఆరోగ్యాన్ని ఊదేస్తుందట. ఉప్పు చప్పున బీపీని తెచ్చేస్తుందట. ఇప్పుడు ఉప్పు గురించి ఉన్న ప్రచారాలివి. మరి ఇందులో వాస్తవమెంత? అపోహ ఎంత? నిజంగానే ఉప్పు తెల్లటి విషమా? ఉపయోగపడే విషయమేమీ ఉప్పులో లేదా? ఉప్పు ఇచ్చే ఆరోగ్యాలూ... ఉప్పు తెచ్చే అనర్థాలను సాక్షాత్తూ ఆ ఉప్పే తన ఆత్మకథగా చెప్పుకుంటే ఏం చెబుతుంది? తనపై ఉన్న అనేకానేక దురభిప్రాయాలను తొలగిస్తే ఎలా ఉంటుందన్న అంశమే ఈ ప్రత్యేక కథనం. ►రక్తనాళాల చివరన క్యాపిల్లరీస్ వెంట్రుకంత సన్నగా ఉంటాయి. దాంతో హైబీపీ వంటివి ఉన్నవారు ఉప్పు ఎక్కువగా వాడితే అధిక ఒత్తిడికి అవి చిట్లిపోవచ్చు. ►రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కాళ్లవాపుల వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉప్పు చాలా తక్కువగా వాడాలి. ►డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. మీరు పలికే తొలి తెలుగు పద్యానికి తొలి పదం నేనే. ‘ఉప్పుకప్పురంబు’తోనే కదా ఎవ్వరైనా తొలి పద్యం పలికేది. నేను మీ అందరి పౌరుషానికి ఒక చిహ్నం. అందుకే ఆత్మగౌరవంతో, పౌరుషంతో ఎవరైనా స్పందించకపోతే ‘ఏం ్ఞఉప్పూ కారం తినడం లేదా’ అంటారు. మరి అలాంటప్పుడు ఎందుకు నన్ను ఆడిపోసుకోవడం? మీ ఆహార పదార్థంలోని ‘ఉప్పూ కారం’ జంటలోనూ నేనే ముందు. తీపి మినహా ప్రతివంటలో భాగస్వామ్యం నాకే చెందు. నా ప్రాధాన్యం, నా ప్రాథమ్యం వదిలి ఇక నన్ను తినడం వల్ల మీకు వచ్చే ఆ ‘ఉప్పు ముప్పు’ గురించి చెప్పమంటారా? అమృతాన్నైనా అతిగా వాడితే అనర్థమే కదా. అందుకే ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే మాట పుట్టింది. అప్పుడు తప్పంతా నామీదే వేసేస్తే ఎలా? మీ మెదడు సందేశాల వార్తాహారి నేనే... మీలోని ప్రతి అవయవానికీ ఫలానా పని చేయమంటూ మెదడునుంచే ఆజ్ఞలూ, ఆదేశాలూ జారి అవుతుంటాయని తెలుసుకదా. వాటిని మోసుకుపోయే లవణాల్లో ప్రధానమైనదాన్ని నేనే. నాలోని సోడియమ్తో పాటు పొటాషియమ్, మెగ్నీషియమ్ వంటి ఇతర మిత్రులూ ఆ ఆదేశాలను మోసుకుపోయినా... అందులో ఎక్కువగా నేనే తీసుకెళ్తుంటా. నాలోని అయాన్ల సహాయంతోనే మన నాడీ వ్యవస్థలోని నరాల నుంచి వివిధ అవయవాలకు ఆ ఆదేశాలన్నీ అందుతుంటాయి. ఆ ఆదేశాలకు అనుగుణంగానే మన వివిధ అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. అందుకే నరాలన్నీ సక్రమంగా పనిచేయాలంటే నేను కావాల్సిందే. అందుకే మీ అవయవాలన్నీ సరిగా పనిచేసేంత పరిమిత మోతాదుల్లో నన్ను వాడుకోండి. అర్ధరాత్రి అకస్మాత్తుగా మీకెప్పుడైనా పిక్క పట్టేసిందా? మీరు హాయిగా ఆదమరచి నిద్రపోతుంటారు. కానీ మెదడు నుంచి ఆదేశాలను చేరవేసే నా పనిని నేను నిర్విరామంగా చేసుకుంటూ పోతుంటాను. అదెలా? ముందు చెప్పినట్టుగా నాలోని అయాన్ల ద్వారా. ఆ అయాన్లకు వాహకం నీళ్లు. ఏదైనా కారణంతో ఆ నీళ్లూ, ఈ నేనూ తగ్గామనుకోండి. అకస్మాత్తుగా పిక్క పట్టేస్తుంది. ఎంతో నొప్పితో మిమ్మల్ని నిద్రలేపేస్తుంది. ఆ బాధ చాలా సేపు కొనసాగుతుంది. మజిల్ క్రాంప్ అని పిలిచే ఈ నొప్పీ, బాధా కేవలం పిక్కకు మాత్రమే కాదు... ఒంట్లోని ఏ కండరానికైనా రావచ్చు. కారణం... నేను మజిల్ కంట్రాక్షన్ అనే ప్రక్రియ ద్వారా మీ కండరాల కదలికలకు నేను అవసరం. మీ కాళ్లూ చేతులు బాగా కదులుతున్నాయంటే అది నా వల్లే. అంతెందుకు మీరు క్రికెట్ ఆడారా? మీ ఒంట్లో నీళ్లు బాగా తగ్గినప్పుడు మీతో పాటు చాలా మంది క్రీడాకారులు క్రాంప్స్ కారణంగా ఆటలాడలేని పరిస్థితి వస్తుంది. అలా జరగగానే మీరు గ్రహించాల్సిందొకటే. మీ ఒంట్లో నీళ్లు... నేనూ... నా మిత్రులైన ఇతర లవణాలూ తగ్గాయని. డీహైడ్రేషన్ కారణంగా నీరూ, నేనూ, నా ప్రాణమిత్రుల్లాంటి లవణ మిత్రులు సరిగా అందకపోతే ఒక్కోసారి ప్రాణాలే పోవచ్చు. నేను తగ్గితే ప్రాణాపాయం కూడా... నేనూ, నా మిత్రులైన నీరూ లవణాలూ తగ్గి మీరు డీ–హైడ్రేషన్‌కు గురైనప్పుడు (మరీ ముఖ్యంగా వేసవిలో) నీళ్లలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార వేసి, ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ తయారు చేసి, తక్షణ చికిత్సగా అందిస్తారు. ఇంకా చెప్పనా! నేను మీ ఒంట్లోని నీటి పాళ్లను నియంత్రిస్తుంటాను. అంతెందుకు... నన్నో శత్రువులా చూస్తూ నన్ను పట్టుబట్టి తగ్గించుకుంటే దాంతో నేనే గనకా మీలో ఉండాల్సిన మోతాదులో లేకపోతే మీకు ‘హైపోనేట్రీమియా’ అనే మెడికల్ కండిషన్ రావచ్చు. అప్పుడు ఆసుపత్రిలో అందునా ఐసీయూలో చేర్చి మరీ నేను లోపించినందుకు మీకు చికిత్స అందించాల్సి రావచ్చు. మరి నాతో అనర్థాలేమీ లేవా? ఎందుకు లేవూ? ఉన్నాయి. కాకపోతే అవి నేరుగా నా వల్లనే కాదు. నేను మితిమీరడం వల్ల. అన్ని రక్తనాళాల చివరల్లో అత్యంత సన్నగా ఉండే నాళాలుంటాయి. అవి వెంట్రుక కంటే సన్నగా ఉంటాయి. అందుకే వాటిని తెలుగులో రక్త‘కేశ’నాళికలంటారు. ఇంగ్లిష్‌లో క్యాపిల్లరీస్ అంటారు. వెంట్రుకంత సన్నగా ఉండటం వల్ల వీటి గోడలు చాలా పలుచగా ఉంటాయి. దాంతో రక్తపు అధిక ఒత్తిడికి అవి చిట్లిపోవచ్చు. ఇలాంటి ప్రమాదం ప్రధానంగా కిడ్నీల విషయంలో ఎక్కువగా చూస్తుంటాం. అదే గుండె గోడల్లో జరిగితే వల్ల గుండెకు సంబంధించిన సమస్యలు, మెదడుకు జరిగితే పక్షవాతం (స్ట్రోక్) వచ్చే అవకాశం ఉంది. అందుకే నా మోతాదును తగ్గించాలని డాక్టర్లు మొదలుకొని అందరూ సలహా ఇస్తుంటారు. అందుకే రక్తపోటు, డయాబెటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి సమస్యలు ఉన్నవారు నన్ను చాలా తక్కువగా తీసుకోవాలంటూ సలహా ఇస్తుంటారు. స్వతహాగానే నేను ఎక్కువగా ఉండే పదార్థాలివి... నేనెక్కువైతే ప్రమాదమని తెలిసింది కదా. అందుకే నేను ఎక్కువగా ఉండే ఆహారాలేమిటో తెలుసుకొని వాటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. మామూలు వాళ్లతో పోలిస్తే రక్తపోటు, గుండెజబ్బులు, డయాబెటిస్, కిడ్నీ సమస్యలు, కాళ్లవాపులు వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు నేనెక్కవ పాళ్లలో ఉండే ఆహారాన్ని పరిహరించాల్సిందే. అవి... ∙అప్పడాలు, ∙పచ్చళ్లు, ∙బేకరీ ఐటమ్స్, ∙సాస్, ∙నిల్వ ఉంచే ఫ్రోజెన్ ఫుడ్స్, ఫాస్ట్ఫుడ్స్, ∙స్మోక్డ్ మాసాహారం, ∙చీజ్, ∙సలాడ్స్, ∙సాల్టెడ్ చిప్స్ వంటి నిల్వ ఉంచే చిరుతిండ్లు, ∙దీర్ఘకాలం నిల్వ ఉంచేందుకు వీలుగా (షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉండేలా) రూపొందించిన శ్నాక్స్. వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నా నియంత్రణలో చాలా బాధ్యత కిడ్నీదే! నా వల్ల కలిగే కీడెంతో, మేలెంతో తెలిసింది కదా. మోతాదుకు మించితేనే నా వల్ల ప్రమాదమని అర్థమైంది కదా. ఈ విషయం తెలియని వాళ్లు నన్ను తగ్గించేందకు చాలా పరిమితంగా నన్ను వాడుతుంటారు. దాంతో వాళ్ల ఒంట్లో నా పాళ్లు తగ్గాయనుకోండి. ఆ పరిస్థితిని గుర్తించి చక్కబెట్టే బాధ్యత మూత్రపిండాలది. శరీరంలో ఉప్పు తగ్గినట్లుగా కిడ్నీలకు ‘ఉప్పందుతుంది’. దాంతో అవి తమ బాధ్యతను మొదలుపెడతాయి. శరీరంలోంచి మూత్రం ద్వారా నేను అనగా ఉప్పు బయటికి పోయి ముప్పు రాకూడదంటూ అవి నన్ను అడ్డుకుంటాయి. తమ దగ్గర ఉండాల్సిన బ్యాలెన్స్ కంటే ఎక్కువగా ఉన్న ఉప్పును తమ వద్ద నిల్వ చేసి ఉంచి శరీరానికి అందిస్తుంటాయి. అదే శరీరంలో ఉప్పు పాళ్లు పెరగగానే మళ్లీ యథావిధిగా మూత్రం ద్వారా బయటకు పంపిస్తాయి. అందుకే చాలా మంది ఇంట్లో తినే తిండిలో నా పాళ్లను తగ్గించినా అప్పుడప్పుడూ వాళ్లు బయటతినే పదార్థాల్లో లభ్యమైన నన్ను జాగ్రత్తగా పోగు చేసి శరీరానికి అందిస్తూ నా కొరత తీరుస్తాయి కిడ్నీలు. కొందరిలో ‘సోడియమ్ సెన్సిటివిటీ’ అనే గుణం ఉంటుంది. ఆ గుణం ఉన్నవారు నన్ను ఎంత పరిమితంగా తీసుకున్నా వారిలో రక్తపోటు పెరిగి ప్రమాదాలకు దారి తీయవచ్చు. ఉప్పుసంహారం.. సారీ... ఉపసంహారం... ఇదీ నా కథ. నేను అనగా ఉప్పు వల్ల ముప్పుతో పాటు నేను తగ్గితే ప్రమాదమూ ఉంది. ఉప్పుతో బీపీ పెరిగే మాటా నిజమే. అది గ్రహించే గాంధీగారు ఉప్పు సత్యాగ్రహం చేస్తే... బ్రిటిష్ వాళ్లకు బీపీ పెరిగి రాజకీయారోగ్యం క్షీణించి మనల్ని వదిలిపోయారు. దరిమిలా తేలేదేమిటంటే... నన్ను వాడుకోవాల్సిన రీతిలో వాడుకుంటే నేనెప్పుడూ ఉపయోగమే. నాతోనూ ఉంది కొంత మేలు. అది మీరు గ్రహిస్తే చాలు. ఉప్పు విషయంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లవాపులు (అనసార్కా/ఎడిమా) ఉన్నవారికి మాత్రమే ఉప్పు చాలా పరిమితంగా తగ్గించాలి. ఒకవేళ ఏదైనా కుటుంబంలో హైబీపీ, డయాబెటిస్, గుండెజబ్బులు, కిడ్నీ ఫెయిల్యూర్, కాళ్లవాపులు ఉన్నవారు ఉన్న కుటుంబంలో ప్రత్యేకంగా ఆ జబ్బుతో బాధపడేవారు (అంటే మెడికల్ రీజన్‌తో మాత్రమే ఉప్పు తగ్గించాలి తప్ప... ఇంట్లోని పిల్లలకూ కాదు. పిల్లలు మామూలుగానే ఉప్పు వాడేలా చూడాలి. పెద్ద వయసు వారిలో ఏ ఆరోగ్య సమస్యా లేనప్పుడు ఉప్పు పరిమితంగానే వాడాలి తప్ప అస్సలు మానేయకూడదు. అలా వాళ్లలో సోడియమ్ తగ్గడం వల్ల ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. గర్భిణులూ జాగ్రత్త... కొందరు ఉప్పు తగ్గించి తినాలనే వారు చాలా పరిమితంగా ఉప్పు వాడుతుంటారు. అలాంటి కుటుంబంలో ఉండే గర్భవతులు ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మిగతావారి విషయం ఎలా ఉన్నా గర్భవతులు రోజుకు 2 నుంచి 6 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకు మించి తీసుకోవడం కూడా ప్రమాదమే అని గుర్తుంచుకోవాలి. గర్భవతుల్లో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కడుపులోని బిడ్డ బరువు బాగా తగ్గి అండర్‌వెయిట్ బేబీగా పుట్టవచ్చు. లో బర్త్ వెయిట్ పిల్లల్లో అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. పైగా గర్భిణులు 2 గ్రా. నుంచి 6 గ్రా. ఉప్పు కూడా తీసుకోకపోతే బిడ్డలో మానసిక వికాసం కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఉప్పును ఎంత మోతాదులో వాడాలి? ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సిఫార్సు ప్రకారం : డబ్ల్యూహెచ్ఓ సిఫార్సుల ప్రకారం ఒక వ్యక్తి ఒక రోజుకు గరిష్టంగా 4.2 గ్రాములకు మించనివ్వకుండా ఉప్పు తీసుకోవచ్చు. (ఒక టీ స్పూన్లో 5 గ్రాముల పరిమాణం పడుతుంది). ∙అలాగే ఒక వ్యక్తి ఒక రోజుకు కనీసం 1.5 గ్రాముల ఉప్పు తీసుకోవాలి. అంతకంటే తగ్గడం వల్ల అతడికి అవసరమైన సోడియమ్ పరిమాణానికి, జీవక్రియలకు విఘాతం కలగవచ్చు. ∙ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వారి వయసును బట్టి వాళ్లకు అవసరమైన ఉప్పు వివరాలివి... ∙1 నుంచి 3 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 2 గ్రాముల ఉప్పు ∙ 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 3 గ్రాముల ఉప్పు ∙7 నుంచి 10 ఏళ్ల పిల్లల్లో ... రోజుకు 5 గ్రాముల ఉప్పు ∙11 ఏళ్లు మించిన పిల్లలకు రోజుకు 6 గ్రాముల ఉప్పు... కావాలి. ఒంట్లో ఉప్పు బాగా తగ్గితే కనిపించే లక్షణాలు : శరీరంలో ఉప్పు పాళ్లు బాగా తగ్గితే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. శరీరంలో సోడియమ్ పాళ్లు తగ్గడం వల్ల ఆ లక్షణాలు కనిపిస్తాయి. అవి... తీవ్రమైన అలసట (ఫెటీగ్) ∙తలనొప్పి (హెడ్ఏక్) ∙కండరాలు బిగుసుకుపోవడం (మజిల్ క్రాంప్స్) ఒంట్లో ఉప్పు పాళ్లు బాగా పెరిగితే కనిపించే లక్షణాలు: ∙విపరీతమైన దాహం ∙కింది నుంచి గాలి అపానవాయువు రూపంలో పోవడం. -
గ్యాస్ ధరపై న్యాయపోరాట విరమణ!
రిలయన్స్, బీపీ నిర్ణయం న్యూఢిల్లీ: గ్యాస్ ధర సమీక్ష, నిర్ణయం అంశాలు ఆలస్యం అవుతుండడాన్ని సవాలుచేస్తూ, ప్రారంభించిన న్యాయపోరాటం నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆ సంస్థ– బ్రిటిష్ భాగస్వామి బీపీలు వెనక్కు తగ్గాయి. మూడేళ్ల క్రితం ఆయా అంశాలను సవాలు చేస్తూ, రెండు సంస్థలూ ఆర్బిటేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. రిలయన్స్ చీఫ్ ముఖేశ్ అంబానీ, బీపీ సీఈఓ బోబ్ డూడ్లేలు ఈ నెల 15 ఉదయం ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఇంతక్రితమే రెండు సంస్థలూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ ముందు తమ పిటిషన్ ఉపసంహరణ పిటిషన్ దాఖలు చేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రక్రియ వచ్చే కొద్ది వారాల్లో పూర్తవుతుందని కూడా తెలుస్తోంది. ఫలితం ఇదీ... ప్రధాని మోదీతో సమావేశమైన తర్వాత రోజు ముఖేశ్ అంబానీ, బోబ్ డూడ్లేలు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ కంపెనీల భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 బ్లాక్ పరిధి సముద్ర గర్భంలో తిరిగి గ్యాస్ ఉత్పత్తి, నూతన గ్యాస్ అన్వేషణ క్షేత్రాల అభివృద్ధిపర్చడంపై 8 సంవత్సరాల వ్యవధిలో 6 బిలియన్ డాలర్లు (రూ.40,000కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించారు. తాజా ఆర్బిట్రేషన్ ప్రక్రియ విరమణ వల్ల ఆయా కొత్త క్షేత్రాల నుంచి తాము ఉత్పత్తి చేసిన సహజ వాయువు గ్యాస్‌పై మార్కెటింగ్, ప్రైసింగ్ స్వేచ్ఛకు రెండు కంపెనీలకు వీలు కలుగనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. 2015 జనవరిలో ఒకసారి మోడీతో బీపీ సీఈఓ సమాశమయ్యారు. సముద్ర గర్భం వంటి క్లిష్ట ప్రాంతాల్లో ఇప్పటికే అభివృద్ధి చేసిన గ్యాస్ క్షేత్రాలకు గ్యాస్ ప్రైస్ ప్రీమియంను కొనసాగించాలని కోరారు. లేకపోతే తమ పెట్టుబడుల విషయలో పునఃసమీక్ష పరిస్థితి ఏర్పడుతుందనీ వివరించారు. దీనికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. అయితే ప్రభుత్వ గ్యాస్ ధర విధానంపై ఎటువంటి న్యాయ పోరాటాన్నీ కొనసాగించరాదని ప్రభుత్వం షరతు పెట్టిందని వార్తలు వెలువడ్డాయి. అయితే ఇప్పటికి న్యాయపోరాటం ఉపసంహరణపై రెండు సంస్థల మధ్యా ఒక అవగాహన కుదిరినట్లు సమాచారం. -
రిలయన్స్– బీపీ పెట్టుబడులు 40,000 కోట్లు
♦ కేజీ డీ6లో నూతన గ్యాస్ క్షేత్రాల అభివృద్ధి ♦ 30–35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ఉత్పత్తి ♦ సంయుక్తంగా పెట్రోల్ పంపులు ♦ మరిన్ని అంశాల్లో సహకారానికి అంగీకారం న్యూఢిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్ఐఎల్), బ్రిటిష్ పెట్రోలియం (బీపీ) పీఎల్సీ తమ బంధాన్ని మరింత పటిష్టం చేసుకోనున్నాయి. మరిన్ని అంశాల్లో కలసి సాగాలని నిర్ణయించుకున్నాయి. కొన్నేళ్ల విరామం తర్వాత ఇరు సంస్థలు కలసి కృష్ణా గోదావరి (కేజీ) బేసిన్‌లోని డీ6 బ్లాక్ పరిధిలో తిరిగి గ్యాస్ ఉత్పత్తి, నూతన గ్యాస్ అన్వేషణ క్షేత్రాలను అభివృద్ధిపర్చడంపై 8 సంవత్సరాల వ్యవధిలో 6 బిలియన్ డాలర్లు (రూ.40,000కోట్లు) పెట్టుబడులు పెట్టనున్నట్టు ప్రకటించాయి. గురువారం ఢిల్లీలో బీపీ సీఈవో బాబ్ డుడ్లేతో కలసి ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ తమ భాగస్వామ్యంపై మీడియాకు వివరాలు వెల్లడించారు. సంయుక్తంగా రిటైల్ పెట్రోల్ పంపుల ఏర్పాటు, విమాన ఇంధన (ఏటీఎఫ్) మార్కెటింగ్తోపాటు నూతన వ్యాపార అవకాశాలైన సంప్రదాయ, సంప్రదాయేతర ఇంధన వాణిజ్యం, మార్కెటింగ్ అంశాల్లో వ్యూహాత్మక సహకారానికి తాము అంగీకారానికి వచ్చినట్టు ముకేశ్ అంబానీ తెలిపారు. విధానాల్లో మార్పులు కొత్త వనరుల అభివృద్ధికి తమకు అవకాశం కల్పించినట్టు చెప్పారు. కేజీ డీ6 బ్లాక్‌లోని ఆర్–సిరీస్ గ్యాస్ క్షేత్రం అభివృద్ధి పురోగతికి, 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులకు తమ మధ్య అంగీకారం కుదిరిందన్నారు. 2020–22 నాటికి కేజీ డీ6 బ్లాక్ నుంచి నిత్యం 30–35 ఎంఎంఎస్‌సీఎండీల గ్యాస్ ఉత్పత్తి చేయనున్నట్టు చెప్పారు. ఇది అప్పటి దేశ గ్యాస్ అవసరాల్లో 10 శాతం మేర తీరుస్తుందని, 20 బిలియన్ డాలర్ల మేర దిగుమతులను నివారిస్తుందన్నారు. ఇంధన ట్రేడింగ్, కర్బన ఉద్గారాల ట్రేడింగ్ అవకాశాలనూ అందిపుచ్చుకుంటామన్నారు. ఆర్బిట్రేషన్ కేసులతో ఇబ్బందేమీ లేదు పలు అంశాలపై ప్రభుత్వంతో కొనసాగుతున్న ఆర్బిట్రేషన్ ప్రక్రియ తమ కొత్త పెట్టుబడులపై ప్రభావం చూపబోదని ఓ ప్రశ్నకు సమాధానంగా ఆర్ఐఎల్ చైర్మన్ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. ఓఎన్జీసీ బావుల్లోని గ్యాస్ తోడేయడంపై ఆర్ఐఎల్ 1.55 బిలియన్ డాలర్లు (రూ.10,000 కోట్లు) పరిహారం చెల్లించాలని కేంద్రం ఆర్ఐఎల్కు నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనితోపాటు మరో మూడు ఆర్బిట్రేషన్ కేసులు ఆర్ఐఎల్, ప్రభుత్వానికి మధ్య నడుస్తున్నాయి. ‘‘ఇక్కడే కాదు కేసులన్నవి ప్రపంచమంతటా ఉన్నవే. దీనికి పారదర్శకమైన పరిష్కారం లభిస్తుందని బలంగా నమ్ముతున్నాను’’ అని డుడ్లే సైతం ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయా సమస్యలన్నీ తగిన రీతిన పరిష్కారం అవుతాయని అభిప్రాయపడ్డారు. స్వేచ్ఛాయుత ధరల విధానం ఉండాలి: డుడ్లే బీపీ 2011లో 7.2 బిలియన్ డాలర్లతో కేజీ డీ6, మరో 20 బ్లాకుల్లో 30 శాతం వాటా తీసుకుందని ఆ సంస్థ సీఈవో డుడ్లే తెలిపారు. వీటితో పాటు ఆర్ సిరీస్, డీ–55 ఆవిష్కరణల నుంచి గ్యాస్ ఉత్పత్తిని పెంచేందుకు గాను ఇన్వెస్ట్ చేయనున్నట్టు చెప్పారు. భారత మార్కెట్ ‘ఫ్రీ మార్కెట్ ప్రైసింగ్’ (ధరలను మార్కెట్‌కు విడిచిపెట్టడం) విధానం వైపు అడుగులు వేయాలని కోరారు. పర్యావరణానికి అనుకూల సహజ వాయువు విషయంలో స్వేచ్ఛాయుత మార్కెట్ ధరలకు మద్దతిత్చే విధానాలు అవసరమన్నారు. కాగా, ఈ పర్యటనలో భాగంగా డుడ్లే ప్రధాని మోదీ, పెట్రోలియం మంత్రి ప్రధాన్‌లను కలిశారు. సహజవాయువు ధరల విధానాన్ని సమీక్షించాలని, సముద్రంలో మరీ లోతైన ప్రాంతాల్లో ఉత్పత్తి చేసే గ్యాస్‌కు అధిక రేటు ఉండాలని బీపీ కోరుతోంది. ఇంధన రిటైల్‌లో పెట్టుబడులు పెట్టండి రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ పీఎల్‌సీలను ఇంధ న రిటైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కేంద్రం కోరింది. ఆర్ఐఎల్కు ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,400 పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్లు ఉన్నాయి. బీపీ గతేడాదే పెట్రోల్ స్టేషన్ల ఏర్పాటుకు కేంద్రం నుంచి అనుమతి పొందింది. గురువారం బీపీ సీఈవో బాబ్ డుడ్లే, ఆర్ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీలతో కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ 80 నిమిషాల పాటు సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. రిటైల్ రంగంలోనూ పెట్టుబడులు పెట్టాలని బీపీ, రిలయన్స్ సంస్థలను ఆహ్వానించినట్టు ప్రధాన్ సమావేశం అనంతరం ట్వీటర్లో పోస్ట్ చేశారు. -
8ఏళ్ల తర్వాత రిలయన్స్ కీలక ప్రకటన
న్యూఢిల్లీ : ఎనిమిదేళ్ల విరామం అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు ఓ కీలక ప్రకటన చేసింది. కేజీ-డీ6 బ్లాక్ లో కొత్త గ్యాస్ ఫీల్డ్స్ ను అభివృద్ధి చేయడం కోసం రూ.40వేల కోట్లను పెట్టుబడులుగా పెట్టనున్నట్టు తమ భాగస్వామ్య చమురు సంస్థ బీపీతో కలిసి ప్రకటించింది. ఈ రెండు సంస్థలు కలిసి సాధారణ, అసాధారణ రీతిలో ఇంధన వర్తకానికి కొత్త అవకాశాల కోసం వ్యూహాత్మక సహకారం అందించుకోవాలని నిర్ణయించినట్టు రిలయన్స్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు. బీపీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ కలిసి పెట్రోల్ బంకులు కూడా ఏర్పాటుచేయనున్నట్టు పేర్కొన్నారు. కొత్త వనరులను అభివృద్ధి చేసుకోవడానికి మార్చిన తమ విధానాలు సహకరిస్తాయని బీపీ సీఈవో బాబ్ డూడ్లీ చెప్పారు. బీపీ-రిలయన్స్ కలిసి కేజీ-డీ6 బ్లాక్ లో ఆర్-సిరీస్ గ్యాస్ ఫీల్డ్ అభివృద్ధి కోసం అంగీకరించినట్టు, దీనికి 6 బిలియన్ డాలర్లు పెట్టుబులు పెట్టనున్నట్టు డూడ్లీ కూడా తెలిపారు. ఈ గ్యాస్ ప్రాజెక్ట్ తో దేశీయ దిగుమతులను 10 శాతం తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. రిలయన్స్-బీపీ కలిసి చాలా ఏళ్ల తర్వాత 40వేల కోట్లను పెట్టుబడులుగా పెడుతున్నట్టు అంబానీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. ఇంధనం, కర్బన్ ఉద్గారాల ట్రేడింగ్ లో కొత్త అవకాశాలను వెలికి తీయడానికి ఇదో కొత్త, చరిత్రాత్మకమైన సహకారమని అభివర్ణించారు. ముఖేష్ అంబానీ, బాబ్ డూడ్లీ సమావేశ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు నేటి మార్కెట్లో 2.2 శాతం మేర పైకి ఎగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ నష్టాల్లో నమోదైనప్పటికీ, రిలయన్స్ మాత్రం లాభాలు పండించింది. -
నాలుక్కాళ్ల యాంటీ డిప్రెసెంట్!
డాగ్టర్ పెట్‌డాగ్స్ ఇంటికే కాదు... వొంటికి కూడా కాపలానే. శారీరక, మానసిక అనారోగ్యాలు దరి చేరకుండా యజమానులను కాపాడుతుంటాయి. పెట్స్‌ను పెంచుకోవడం వల్ల డిప్రెషన్ దూరం అవుతుందని, బీపీ అదుపులో ఉంటుందని సైకాలజిస్టులు చెబుతుంటారు. అంతేకాదు... ఇంటిలో కుక్క ఉంటే యాంటీ డిప్రెసెంట్లు వాడవలసిన అవసరమే ఉండదని పరిశోధనలు చెబుతున్నాయి. అంటే పెట్ డాగ్... నాలుగు కాళ్ల యాంటీ డిప్రెసెంట్ అన్నమాట. ఇప్పుడు మానసిక వ్యాధుల చికిత్సలో అంటే నర్సింగ్ హోమ్స్‌లో దీర్ఘకాలిక చికిత్స తీసుకునే వాళ్లకోసం విజిటింగ్ డాగ్టర్స్ వస్తున్నాయి. మానసిక సమస్యలతో బాధపడే పిల్లలను రోజూ కాసేపు నిర్ణీత సమయంలో పెట్‌డాగ్స్‌తో ఆడుకోనిచ్చే ఒక థెరపీ సెషన్‌నే ప్రారంభించేశారు మానసిక వైద్యులు. ఈ సంసార జంఝాటం మాకొద్దు.. మేమిప్పుడప్పుడే పెళ్లి చేసుకోం అనీ, అసలు పెళ్లే వద్దు అనీ భీష్మించుకునే ముదురు ‘బ్రహ్మచారి’ణులకు పెట్‌డాగ్స్‌ను ప్రెజెంట్ చేస్తే చాలు.. బుద్ధిగా దారిలోకొచ్చేస్తారట. ఒంటరితనంతో బాధపడే వృద్ధులకు పెట్‌డాగ్ తోడుంటే చాలు.. వాళ్లు మరికొంతకాలం హాయిగా బతికేస్తారట. సామాజిక కార్యకర్తలలా పెట్‌డాగ్స్ కూడా సామాజిక శ్రేయోభిలాషులలా కృషి చేస్తాయి. -
కోపమూ ఉపకరణమే!
ఆత్మీయం నవరసాలలో కోపం ఒకటి. కోపం లేని మనిషి ఉండడు. రుషులలో కూడా కోపం ఉంటుంది. అందుకు దుర్వాస మహర్షే మంచి ఉదాహరణ. కోపానికి ప్రధాన కారణం ఓరిమి లేకపోవడం, అవతలివారి అవగుణాలు వెతుక్కుంటూ పోవడమే! అయితే అలా వెతికే ముందు ‘‘నేను ఎన్నో తప్పులు చేసాను, కాబట్టి ఇతరుల మీద కోప్పడడానికి నాకేం అధికారం ఉంది ? అసలు నేను ఏ తప్పూ చేయనివాడినా?’’ అన్న ప్రశ్న వేసుకుంటే కోపం రాదు. ఒక్కొక్కసారి కోపం రావడానికి ఏదో పరిస్థితి కారణమవుతుంది. అది మాటామాటా పెరిగి పోయి ఎంతదూరమైనా వెళుతుంది. దానిని అదుపు చేసుకోలేకపోతే చాలా తీవ్ర పరిణామాలు సంభవిస్తాయి. అయితే కోపమే లేకపోతే వ్యవస్థను చక్కబెట్టడం కుదరదు. రేపు మీరు ఒక పెద్ద అధికారి అవుతారు. మీకు కోపమే లేదనుకోండి. వ్యవస్థను చక్కబెట్టడం సాధ్యం కాదు. దాన్ని చక్కదిద్దడానికి ఒక్కోసారి కోపాన్ని నటించాలి. దాన్ని ఒక ఉపకరణంగా, సాధనంగా వాడుకోవాలి. అలాకాకుండా అనవసర సందర్భాల్లో కోప్పడితే అది వినాశనానికి కారణమవుతుంది. ఒక్కోసారి మనం కోపం అవతలి వారి మీద ప్రభావం చూపినా, చూపకపోయినా, ఆ కోపాన్ని ప్రదర్శించిన మన మీద మాత్రం తప్పక ప్రభావం చూపిస్తుంది. అందుకే కోపమంత శత్రువు లోకంలో మరొకటిలేదు. లోపలినుంచి ఉబికి వస్తున్న కోపాన్ని తీసేయడం చేతకాకపోతే దాన్నుంచే ఎన్నో అవగుణాలు పుడతాయి. మానసిక పరమైన ఈర్ష్య, ద్వేషం, పగ, ప్రతీకారం వంటివే గాక, బీపీ, యాంగ్జయిటీ వంటి జబ్బులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. అందుకే కోపం అనే అవలక్షణాన్ని ఓర్పు, సహనం, వివేకం, శాంతం అనే మంచి లక్షణాలతో అదుపులో ఉంచుకోవాలని పెద్దలు చెబుతారు. -
వైఎస్ఆర్సీపీ నేత ప్రసాద్‌రెడ్డి మృతి
కొలిమిగుండ్ల: వైఎస్ఆర్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కొలిమిగుండ్ల సింగిల్ విండో అధ్యక్షుడు అంబటి శివప్రసాద్‌రెడ్డి(51) అనారోగ్యంతో మృతి చెందారు. చింతలాయపల్లె గ్రామానికి చెందిన ఇతను నియోజకవర్గ పార్టీ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి అత్యంత సన్నిహితులు. శుక్రవారం ఉదయం లోబీపీతో అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబీకులు తాడిపత్రి వైద్యశాలకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఈయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలకు వివాహమైంది. శనివారం గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. పలువురు నివాళి: ప్రసాద్‌రెడ్డి మరణ వార్త తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హైదరాబాద్ నుంచి నేరుగా రాత్రి 8 గంటలకు చింతలాయిపల్లెకు చేరుకొని నివాళులర్పించారు. నియోజకవర్గ నేత ఎర్రబోతుల వెంకటరెడ్డి, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ఉదయ్‌భాస్కరరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు మొలక రాజారెడ్డి, మాజీ అధ్యక్షుడు లాయర్ మహేశ్వరరెడ్డి, నాయకులు కాటసాని చంద్రశేఖరరెడ్డి, తాడిపత్రి నియోజకవర్గ నేత పేరం నాగిరెడ్డి, అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి వీఆర్ వెంకటేశ్వరెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు నరసింహుడు, హనుమంతుగుండం సొసైటీ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సత్తిగారి రామిరెడ్డి, రామసుబ్బయ్యతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలు నివాళులు అర్పించారు. -
పెద్ద ఆయిల్ కంపెనీ వచ్చేస్తోంది!
• చమురు పిఎస్‌యుల విలీనం దిశగా అడుగులు • పూర్తయితే రోజ్‌నెఫ్ట్, బిపి బలాదూర్ • బడ్జెట్లో ప్రతిపాదించిన ప్రభుత్వం న్యూఢిల్లీ: దేశీయ చమురు అవసరాలు తీర్చగలిగేలా, అంతర్జాతీయ చమురు దిగ్గజాలైన రోజ్‌నెఫ్ట్, బిపి, చెవరాన్ను తలదన్నేలా ఒక భారీ చమురు కంపెనీ ఏర్పాటు చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇందుకోసం ప్రస్తుతం దేశంలో ఉన్న 13 చమురు పిఎస్యులన్నింటినీ, లేదా కొన్నింటినీ విలీనం చేయాలని భావిస్తోంది. నిజానికి ఇలాంటి భారీ దిగ్గజ చమురు కంపెనీ ఏర్పాటు చేయాలని పుష్కర కాలం నుంచి ప్రతిపాదనలున్నాయి. అప్పట్లో నాటి చమురు శాఖా మంత్రి మణిశంకర్ అయ్యర్ తొలిసారి ఈ ప్రతిపాదన చేశారు. హెచ్‌పీసీఎల్, బిపీసీఎల్ను ఓఎన్జీసితో, ఓఐఎల్‌ను ఐఒసితో విలీనం చేసి రెండు దిగ్గజ కంపెనీలను ఏర్పాటు చేయాలని 2004లో అప్పటి చమురు మంత్రి అయ్యర్ ప్రతిపాదించారు. దీంతోపాటు పిఎస్‌యుల అనుబంధ సంస్థలను మాతృ సంస్థతో విలీనం చేయాలన్నారు. అయితే ఆ సమయంలో చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతుండడంతో విలీనం ప్రతిపాదనల వద్దే నిలిచిపోయింది. ఈ ప్రతిపాదనలనకు కార్యరూపాన్ని తాజా బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. అంతర్జాతీయ చమురు దిగ్గజాలను, దేశీయంగా ఉన్న భారీ ప్రైవేట్ చమురు సంస్థలను దీటుగా ఎదుర్కొనే ఒక దిగ్గజ చమురు పిఎస్‌యు ఏర్పాటుపై సన్నాహాలు జరుపుతున్నామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. దేశీ ప్రభుత్వ రంగంలో ప్రస్తుతం చమురు ఉత్పతి సంస్థలు ఓఎన్జీసి, ఓఐఎల్, మార్కెటింగ్ సంస్థలు బిపిసిఎల్, హెచ్‌పిసిఎల్, సహజవాయువు రవాణా సంస్థ గెయిల్, ఇంజనీరింగ్ కార్యకలాపాలు నిర్వహించే ఇంజనీర్స్ఇండియా తదితర కంపెనీలున్నాయి. క్షీణించిన చమురు ధరల వల్ల ఎదురవుతున్న నష్టాలను తట్టుకొని, ప్రపంచస్థాయిలో పోటీ పడే ఒక పెద్ద సంస్థ ఏర్పాటు చేయాలని కొన్ని నెలల క్రితమే ప్రభుత్వం యోచన ఆరంభించింది. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలోని టాప్ ఎనిమిది చమురు కంపెనీల సామూహిక మార్కెట్ విలువ 8000 కోట్ల డాలర్లు. తాజాగా ఏర్పాటు చేయప్రతిపాదిస్తున్న కంపెనీ మార్కెట్ క్యాప్ రష్యాకు చెందిన రోజ్‌నెఫ్ట్, అంబానీకి చెందిన రిలయన్స్ మార్కెట్ విలువ కన్నా చాలా ఎక్కువగా ఉండనుంది. ఇంచుమించు ఈ కంపెనీ మార్కెట్క్యాప్ బ్రిటన్‌కు చెందిన బిపి సంస్థ మార్కెట్ విలువకు దగ్గరగా ఉంటుందని అంచనా. 2015–16లో అన్ని చమురు పిఎస్‌యులు కలిసి రూ. 45,500 కోట్ల రూపాయల లాభాన్ని, రూ. 9.32 లక్షల కోట్లరూపాయల ఆదాయాన్ని నమోదు చేశాయి. కన్సాలిడేషన్లతో పిఎస్‌యుల బలోపేతం కొనుగోళ్లు, విలీనాలు, కన్సాలిడేషన్ల ద్వారా దేశీయ పిఎస్‌యులను బలోపేతం చేసే అవకాశం ఉంటుందని జైట్లీ అభిప్రాయపడ్డారు. చమురు, సహజవాయు రంగంలో ఇలాంటి కన్సాలిడేషన్, విలీనానికి అవకాశాలున్నాయని ఆయన చెప్పారు. పిఎస్‌యులను బలోపేతం చేసినప్పుడే అవి భారీ రిస్కులను ఎదుర్కొనే సత్తా పొందుతాయని, భారీ పెట్టుబడి నిర్ణయాలు తీసుకోగలుగుతాయని అన్నారు. అయితే పీఎస్‌యుల పునర్యవస్థీకరణపై ఏర్పాటైన హైలెవల్ కమిటీ ఇలాంటి విలీన ప్రతిపాదనను వ్యతిరేకించింది. ఇలా ఏకీకృత కంపెనీ ఏర్పాటు చేసే బదులు ఉన్న వాటికి మరింత స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని సూచించింది. ఇందుకోసం పీఎస్‌యుల్లో ప్రభుత్వ వాటాలను ఒక ట్రస్ట్‌కు బదిలీ చేసి నిర్వహించేలా చూడాలని పేర్కొంది. ప్రపంచం చమురు రంగంలో ధరలు క్షీణించినప్పుడు జరిగిన విలీనాలన్నీ వ్యయాలు తగ్గించుకునేందుకు జరిగినవేనని కమిటీ అభిప్రాయపడింది. ప్రస్తుత దేశీయ చమురు పిఎస్‌యుల్లో ఒఎన్‌జిసి అతిపెద్ద ఉత్పత్తిదారు కాగా ఐఓసి అతిపెద్ద రిఫైనరీ, గెయిల్ అతిపెద్ద గ్యాస్ పైప్‌లైన్ సొంతదారు. -
త్వరలో భారీ ఆరోగ్య పథకం
న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారీ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనుంది. అంటువ్యాధులు కాని ఐదు ఉమ్మడి వ్యాధుల నియంత్రణకు సంబంధించి ఓ భారీ ఆరోగ్య పథకాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేయనుంది. ఇందులో భాగంగా మొదటి దశలో మార్చి 31 లోగా దేశవ్యాప్తంగా వంద జిల్లాల్లో వెయ్యి ఆరోగ్య ఉపకేంద్రాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ ఐదు ఉమ్మడి వ్యాధుల్లో అధిక రక్తపోటు, మధుమేహం, నోటి, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వ్యాధులకు పరీక్షలు నిర్వహించనున్నారు. జాతీయ ఆరోగ్య పథకం కింద జనాభా ఆధారంగా వ్యాధి నివారణ, వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నియంత్రణ చర్యలను తీసుకుంటున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పథకాన్ని వచ్చే నెల 4 తేదీన కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా ప్రారంభించే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆర్థిక వేదిక నివేదిక ప్రకారం 2012 నుంచి 2030 వరకు ఈ ఐదు రోగాలకు భారత్ రూ. 311.94 లక్షల కోట్ల వ్యయాన్ని కోల్పోనుంది. -
బీపీ కూపీ...
దీన్ని సెలైంట్కిల్లర్ అని కూడా అంటారు. దీని మీద తప్పకుండా సర్జికల్ ఎటాక్ చేయాలి. ఆచి... తూచి జాగ్రత్తగా బీపీని ఎటాక్ చేయాలి. రక్తపోటు పెరిగేకొద్దీ కష్టం, నష్టం పెరుగుతాయి. అందుకే ఈ బీపీ కూపీ లాగాల్సిందే. మంచి చెడు తెలుసుకోవాల్సిందే. ఇంక దేనికి వెయిటింగ్? స్టార్ట్ రీడింగ్. లేకపోతే... బీపీ పెరుగుతుంది. అసలు బీపీ అంటే ఏమిటో తెలుసుకుందాం. రక్తం ఒకచోటి నుంచి మరోచోటికి ప్రవహించాలంటే రక్తనాళాల్లో అది కొంత ఒత్తిడితో ప్రవహించాల్సిందే. దాన్నే బ్లడ్ ప్రెషర్ అంటారు. సాధారణ బీపీ 130 / 80 ఉండాలన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో మొదటి విలువను సిస్టోలిక్ బీపీ అని, రెండో విలువను డయాస్టోలిక్ బీపీ అని అంటారు. రక్తనాళాల్లో ప్రవహింపజేసేందుకు రక్తానికి కాస్త ఒత్తిడి కావాలి. లేకపోతే రక్తం ముందుకు సాగదు. గుండె స్పందనల వల్ల ఈ ఒత్తిడి కలుగుతుంది. ఈ గుండె స్పందనలు రెండు దశల్లో సాగుతుంటాయి. మొదట... సైనో ఏట్రియల్ నోడ్ అనే భాగం నుంచి నుంచి ఎలక్ట్రిక్ కరెంటు వెలువడుతుంది. వెంటనే గుండె మూసుకుపోతుంది. అప్పుడు గుండె పై గదుల్లో ఉండే రక్తం మైట్రల్‌వాల్వ్, ట్రైకస్పిడ్ వాల్వ్ నుంచి కింది గదుల్లోకి దూసుకుపోతుంది. దీన్ని డయాస్టోల్ అంటారు. గుండె స్పందనలో ఇది కాస్త సుదీర్ఘంగా జరిగే ప్రక్రియ. ఆ తర్వాత గుండె స్పందనలోని రెండవది చోటుచేసుకుంటుంది. ఇందులో ట్రైకస్పిడ్, మైట్రల్ వాల్వ్‌లు మూసుకుపోయి రక్తన్ని వెనక్కురాకుండా ఆపడంతో పాటు పల్మునరీ, అయోర్టిక్ వాల్వ్‌లు తెరచుకొని రక్తనాళాల్లోకి రక్తం ముందుకు వెళ్తుంది. దీన్నే సిస్టోల్ అంటారు. ఇలా డయాస్టోల్, సిస్టోల్ కదలికలు వెంటవెంటనే జరుగుతూ గుండె రక్తాన్ని పంప్ చేస్తూ, రక్తనాళాల్లో అది కొంత ఒత్తిడితో సాగే ప్రక్రియ. అనుక్షణం జరుగుతుంది. అందరికీ ఒకటే విలువా? పదిహేను నుంచి నలభై ఏళ్ల వరకు వయసున్న వారిని అనేకమందిని పరిశీలించాక ఈ ప్రామాణిక విలువను నిర్ధారణ చేశారు. చిన్నపిల్లల్లో ఈ విలువ మరికాస్త తక్కువగా ఉంటుంది. మహిళల్లోనూ తక్కువగానే ఉంటుంది. అంటే... 110 / 70 ఉంటుంది. అందరికీ 130 / 80 ప్రామాణికం అనుకోకండి. అదే నమ్మి కాస్త ఎక్కువగా ఉంటే హైబీపీ వచ్చిందేమోనని బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగని డాక్టర్‌ను సంప్రదించకుండా నిర్లక్ష్యంగానూ ఉండకూడదు. 45 ఏళ్లు దాటాక వయసును బట్టి బీపీ కాస్త ఎక్కువగా ఉండవచ్చు. కానీ పైవిలువ 140 దాటినా, కింది విలువ 90 దాటినా తప్పనిసరిగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మీ బీపీ విలువ ఏమిటో డాక్టర్‌ను నిర్ణయించనివ్వండి. మరీ బీపీ ఎక్కువ ఉంటే తప్ప ఒక రీడింగ్తోనూ ఒక నిర్ధారణకు రాకండి. కనీసం రెండు రీడింగ్స్ అయినా పరిగణనలోకి తీసుకోండి. బీపీ వల్ల కలిగే అనర్థాలివి... బీపీ పెరగకుండా చూసుకోండి. పెరిగితే బ్రెయిన్ హేమరేజ్ రావచ్చు. మొదట్లో బీపీ పెరుగుతున్న కొద్దీ తలనొప్పి మాత్రమే ఉంటుంది. కానీ అదేపనిగా పెరుగుతూ పోతే మెదడు రక్తనాళాల గోడలు చిట్లి రక్తం బయటకు వచ్చి మెదడులో చేరుతుంది. దీన్నే ఇంట్రాసెరెబ్రల్ బ్లీడ్ అంటారు. ఇలా చేరే రక్తం పరిమాణాన్ని బట్టి రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. అంటే... తక్కువ పరిమాణంలో అయితే ఒకవైపు కాలూ, చేయి చచ్చుబడటం మూతి వంకరపోవడం జరగవచ్చు. అయితే ఇలాంటి పరిస్థితి వచ్చినా రోగి స్పృహలోనే ఉంటాడు. రక్తస్రావం పరిమాణం పెరుగుతున్నకొద్దీ ముందు పేర్కొన్న లక్షణాలతో పాటు రోగి స్పృహ కోల్పోయే ప్రమాదం ఉంది. హైపర్‌టెన్షన్ ఎన్‌కెఫలోపతి: బీపీ ఒక్కసారిగా పెరిగి 200 / 120కి చేరినప్పుడు మెదడులోని అతి చిన్న రక్తనాళాలు చిట్లి రక్తం మెదడులోకి చేరుకోవచ్చు. దీనివల్ల రోగికి తలనొప్పితో పాటు ఫిట్స్ రావడం, కాలూ చేయి పడిపోవడం, స్పృహ కోల్పోవడం జరుగవచ్చు. సీటీ స్కాన్ బ్రెయిన్ ద్వారా దీన్ని నిర్ధారణ చేస్తారు. ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ (టీఐఏ) : దీర్ఘకాలంగా బీపీ నియంత్రణ లేకుండా ఉంటూ... మైల్డ్ నుంచి మోడరేట్ స్టేజ్‌లో ఉన్నవారిలో, మెదడులోని రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం వంటి పరిస్థితి రావచ్చు. అలాంటి పరిస్థితే వస్తే మెదడులో రక్తప్రసరణ తగ్గిపోవడం వల్ల ఒక పక్క కాలూ చేయి పడిపోవడం, స్పృహ కోల్పోవడం, తూలుతూ నడవడం జరుగుతుంది. అయితే ఈ పరిస్థితి కొద్ది నిముషాల్లోనే బాగైపోతుంది. దీన్నే ట్రాన్సియెంట్ ఇస్కిమిక్ ఎటాక్ అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సీటీ స్కాన్ (బ్రెయిన్) పరీక్ష చేస్తే నార్మల్ రావచ్చు. దీనికి చికిత్స ఇవ్వడం చాలా ముఖ్యం. ఎందుకంటే... మున్ముందు రాబోయే పక్షవాతానికి ఇది నిదర్శనం. ఇలాంటి లక్షణాలను ముందుగానే గుర్తించి చికిత్స తీసుకుంటే పక్షవాతం రాకుండా నివారించవచ్చు. ఇస్కిమిక్ స్ట్రోక్ : దీన్నే తెలుగులో పక్షవాతం అంటారు. బీపీ హైబీపీ రూపంలో నెలల తరబడి, ఏళ్ల తరబడి అలాగే నియంత్రణ లేకుండా ఉంటే... పక్షవాతం వచ్చే అవకాశం ఉంది. మెదడులో ఉన్న రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల అవి మూసుకుపోయి రక్తనాళాల నుంచి మెదడుకు రక్తప్రసరణ ఆగిపోయినప్పుడు మెదడులో అవి రక్తం చేరవేయాల్సిన సెంటర్స్ దెబ్బతింటాయి. శరీరంలోని ఏ ప్రాంతాన్ని నియంత్రించే భాగానికి మెదడులో రక్తప్రసరణ ఆగిందో... ఆ భాగం దెబ్బతింటుంది. దెబ్బతిన్న ప్రదేశాన్ని బట్టి కాలూ చేయి పడిపోవడం, చూపు మందగించడం, మూతివంకరపోవడం, తూలుతూ నడవటం, మాట మారడం జరగవచ్చు. ఇస్కిమిక్ మైలోపతి : ఈ కండిషన్ ఉన్నవారిలో వెన్నుపాములో ఉండే రక్తనాళాలు బ్లాక్ అయినందువల్ల వెన్నుపాము దెబ్బతింటుంది. దీనివల్ల అకస్మాత్తుగా రెండు కాళ్లూ చచ్చుపడిపోవచ్చు. ఇస్కిమిక్ రెటినోపతి: నియంత్రణలో లేకుండా బీపీ ఎక్కువకాలం ఉన్నవారిలో కంట్లో ఉన్న రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల కొందరిలో చూపు తగ్గవచ్చు. ఈ కండిషన్‌ను ఇస్కిమిక్ రెటినోపతి అంటారు. హైపర్టెన్సివ్ నెఫ్రోపతి : హైబీపీతో కిడ్నీలు దెబ్బతిని హైపర్టెన్సివ్ నెఫ్రోపతి అనే సమస్య రావచ్చు.కేవలం హైబీపీని నియంత్రణలో ఉంచడం వల్ల పైన పేర్కొన్న అన్ని రకాల జబ్బులను నియంత్రణలో ఉంచడం సాధ్యమే అవుతుంది. కాబట్టి వ్యాధులు వచ్చిన తర్వాత చికిత్స కంటే... ముందుగానే బీపీని నియంత్రించుకోండి. వ్యాధుల నుంచి నివారణ పొందండి. చివరగా ఒక్క మాట హైబీపీ, డయాబెటిస్ మంచి ఫ్రెండ్స్. డయాబెటిస్ ఉందంటే బీపీ రావచ్చు. అందుకే డయాబెటిస్ ఉందంటే బీపీ ఉందనే అనుకోవాలి. మనిషికి ప్రకృతి రెండు కళ్లు ఇచ్చింది. బహుశా హైబీపీని ఒక కంటా... డయాబెటిస్‌ను మరో కంటా కనిపెట్టుకొమ్మనేనేమో! తీవ్రతను బట్టి హైబీపీ వర్గీకరణ బ్లడ్‌ప్రెషర్ విలువ 140 / 90 కంటే ఎక్కువ ఉంటే దాన్ని హైబీపీగా చెప్పవచ్చు. మైల్డ్ హైబీపీ : 140 / 90 నుంచి 150 / 90 ఉన్న పరిస్థితిని మైల్డ్ హైబీపీ అంటారు. మోడరేట్ హైబీపీ : 160 /90 లేదా 160 / 100 నుంచి 170 / 100 లేదా 180 / 100 వరకు విలువలు ఉంటే దాన్ని ఒక మోస్తరు హై-బీపీ (మోడరేట్ హైబీపీ)గా చెబుతారు. సివియర్ హైబీపీ : 190 / 100 నుంచి 190 / 110 వరకు ఉంటే దాన్ని తీవ్రమైన హైబీపీ (సివియర్ హైబీపీ) అని చెప్పవచ్చు. యాగ్జిలరేటెడ్ హైపర్‌టెన్షన్ : 200 / 120 నుంచి 210/ 120 ఉంటే దాన్ని మరింత తీవ్రమైన హైబీపీ (యాగ్జిలరేటెడ్ హైపర్‌టెన్షన్) అని చెప్పవచ్చు. హైబీపీ అనర్థాలివి! బీపీ ఉండాల్సిన లిమిట్ కంటే కాస్త ఎక్కువగా ఉందనుకోండి. దాన్ని మైల్డ్ అంటారు. మైల్డ్ హైబీపీ ఉన్నవారికి ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. కానీ ఒక హద్దు దాటితే అది మోడరేట్ బీపీ అంటారు. మోడరేట్ హైబీపీ నుంచి లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. తలనొప్పి, తలదిమ్ముగా ఉండటం, కళ్లు తిరగడం, తల తిరగడం, కొంతమందిలో చూపులో తేడా రావడం, వాంతులు కావడం జరుగుతుంది. ఇక ఆ హద్దు కూడా దాటిందంటే... సివియర్ హైబీపీ లేదా యాగ్జిలరేటెడ్ బీపీ. బీపీ సివియర్ స్థాయికి పెరిగి విశ్వరూపం చూపిస్తే... పక్షవాతం రావచ్చు. కొందరిలో మాట తడబడటం, ముఖంలో ఒక వైపు వంకర కావడం, ఒక పక్క కాలూ చేయీ వంకర కావడం జరుగుతుంది. ఒక్కోసారి మాట పూర్తిగా పోవడం జరగవచ్చు. మెదడుకు కలిగే నష్టంతో పరిణామమిది. బీపీని అదుపులో పెట్టుకోవడం ఇలా... ఆహారంలో ఉప్పును తగ్గించుకోవడం. ఉప్పు ఎక్కువగా ఉండే అప్పడాలు, పచ్చళ్లను తగ్గించడం.కొవ్వులు ఎక్కుగా ఉండే పాల ఉత్పాదనలు, మీగడ, వెన్న, నెయ్యి, స్వీట్స్, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలను తగ్గించుకోవడంఒత్తిడికి గురి కాకుండా చూసుకోవడం రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం తాజా ఆకుకూరలతో ఉండే ఆహారాన్ని తీసుకోవడం.ఉడికించిన ఆహారాన్ని తీసుకోండి. నూనెలో వేయించిన ఆహారాన్ని తగ్గించండి. చిప్స్. ఫ్రైస్, క్రిస్ప్స్, పిజ్జాలు, బర్గర్ల వంటి ఫాస్ట్ఫుడ్స్ తప్పక తగ్గించుకోవాలి. ఎప్పుడైనా ఒకసారి, అదీ చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవచ్చు. బీట్రూట్ తినడం వల్ల హైబీపీ కొంతవరకు తగ్గవచ్చు. హైబీపీ... ఏం తింటే తగ్గుతుంది! హైబీపీతో బాధపడుతున్నప్పుడు ఏమేమి తినకూడదో తెలుసుకుని జాగ్రత్త పడుతుంటారు. అయితే ఏమేమి తినాలో, ఏమేమి తినవచ్చో తెలుసుకోవడమూ అంతే ముఖ్యం. ఆహారంలో పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ ఎక్కువ ఉంటూ సోడియం తక్కువగా ఉండాలి. ఇవి అధికంగా ఉన్న బ్లడ్ ప్రెషర్ని సహజంగా అదుపుచేస్తాయి. ఇవి ఎందులో ఉంటాయంటే... అరటిపండు, ఆపిల్, ఆప్రికాట్, ఖర్జూరం, ద్రాక్ష, మామిడిపండు, పుచ్చకాయ, కర్బూజ, కమలాలు, పీచ్ పండ్లు తీసుకోవాలి. పండ్లను రసం తీసి తాగడం కంటే పీచుతోపాటు తినడం మంచిది. ఇక కూరగాయలను చూస్తే క్యారట్, పచ్చి బఠాణి, దోసకాయ, కీరదోస, సొరకాయ, బంగాళాదుంప, పాలకూర, గెనుసుగడ్డ (చిలగడ దుంప), టొమాటో, పెరుగులో సోడియం తక్కువగా, పొటాషియం, మెగ్నీషియం వంటి సూక్ష్మపోషకాలు ఎక్కువగా ఉంటాయి. డాక్టర్ అనిల్ కోటంరెడ్డి వెల్నెస్ కన్సల్టెంట్, కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్ -
60 శాతం మందికి ఆ రోగం ఉన్నట్లే తెలియదు!
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరం హైబీపీకి కేంద్ర బిందువుగా మారుతోంది. నగరంలో 18-40 ఏళ్ల వారిలో 36 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 18-20 శాతం మంది అధిక రక్త పోటుతో బాధపడుతున్నట్లు తేలింది. నగరంలో ఏటా వెలుగు చూస్తున్న హృద్రోగ మరణాల్లో అత్యధికం హైబీపీ వల్లే న మోదవుతున్నట్లు కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వేలో తేలింది. మారిన జీవనశైలి, ఆహార అలవాట్లు, అతిగా మద్యపానం, ధూమపానం, ఊబకాయం, పని ఒత్తిడి వెరసి గుండె పని తీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గుండె, మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్న హైబీపీపై కార్డియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా ఇటీవల దేశవ్యాప్తంగా ‘బిగ్ బీపీ క్యాంపెయిన్’పేరుతో ఎనిమిది గంటల పాటు సర్వే నిర్వహించింది. 1.80 లక్షల మందిని పరీక్షించింది. ఇందులో భాగంగా నగరంలోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, మహాత్మా గాంధీ బస్టేషన్, ఐఎస్ సదన్, జూబ్లీహిల్స్ అపోలో, డీఆర్డీవో అపోలో, మాదాపూర్‌లతో పాటు మరో 65 కేంద్రాల్లో క్యాంప్‌లు ఏర్పాటు చేసింది. 19,846 మందిని పరీక్షించి, వీరిలో 11,245 శాంపిల్స్‌ను విశ్లేషించింది. బాధితుల్లో 36 శాతం మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు గుర్తించింది. 60 ఏళ్ల వారితో పోలిస్తే 18-40 ఏళ్లలోపు వారే మూడు రెట్లు ఎక్కువగా అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లు తేలింది. ఆసక్తి కర అంశమైమంటే బాధితుల్లో 60 శాతం మందికి తమకు అధిక రక్తపోటు సమస్య ఉన్నట్లు తెలియదు. మందులు వాడుతున్న 42 శాతం మం దిలో బీపీ కంట్రోల్లో ఉండటం లేదు. ఇప్పటి నుంచే జాగ్రత్త పడక పోతే 2025 నాటికి ఈ సంఖ్య జనాభాలో మూడు వంతుల మం ది హైబీపీ బారిన పడే ప్రమాదం లేక పోలేదు. మహిళల్లోనూ ఇదే ఒరవడి...: ఇటీవల ఐటీ అనుబంధ రంగాల్లో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. పురుషులతో పోటీ పడి పనిచేస్తున్నారు. ఇటు ఇంటి పనుల్లోనూ, అటు ఆఫీసు పనుల్లోనూ వీరు క్షణం తీరికలేకుండా గడుపుతున్నారు. జీవనశైలి వల్ల రుతుక్రమంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రతి వంద మంది హృద్రోగ బాధితుల్లో 65 శాతం మంది పురుషులు ఉంటే, 35 శాతం మంది మహిళలు ఉంటున్నారు. పురుషులతో పోలిస్తే మహిళల్లోనే ఆకస్మిక మరణాల రేటు ఎక్కువ . అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ ఆకస్మిక మరణాల శాతం 1.2 శాతం ఉంటే, గ్రేటర్లో మాత్రం 4.9 శాతం ఉన్నట్లు సర్వేలో తేలింది. మహిళల ఆరోగ్యంపై శ్రద్ద చూపక పోవ డం, వైద్య ఖర్చుకు వెనకాడటం, నొప్పి వచ్చిన తర్వాత చాలా ఆలస్యంగా ఆస్పత్రికి తీసుకు వెళ్తుండటం కూడా ఇందుకు ఓ కారణమని వై ద్యులు అభిప్రాయపడుతున్నారు. -
పచ్చదనంతో డయాబెటిస్ దూరం!
న్యూఢిల్లీ: పచ్చదనం కలిగిన పరిసరాల్లో నివసిస్తున్న వారు మధుమేహం, రక్తపోటు లాంటి వ్యాధులకు దూరంగా ఉన్నట్లేనని ఓ పరిశోధనలో తేలింది. అమెరికాకు చెందిన 65 ఏళ్ల వయస్సు దాటిన రెండున్నర లక్షల మంది మెడికల్ రికార్డులను 2010-11లో సేకరించారు. ఈ రిపోర్టులను, వారు నివసించే పరిసరాలను నాసా ఉపగ్రహ చిత్రాల సహాయంతో పరీక్షించి ఈ విషయం వెల్లడించారు. పచ్చదనం ఉన్న పరిసరాల్లో జీవించేవారు మిగతావారితో పోలిస్తే అధికంగా సంపాదిస్తున్నారని పరిశోధకులు తెలిపారు. ‘ఈ పరిసరాల్లో నివసించే వ్యక్తులకు అధిక కొవ్వు, మధుమేహం, రక్తపోటు సమస్యలు చాలా తక్కువగా వస్తున్నాయి. మధుమేహం 14 శాతం, రక్తపోటు 13 శాతం, కొవ్వు సమస్యలు 10 శాతం వ రకు తగ్గాయి’ అని మియామి యూనివర్సిటీ పరిశోధకులు స్కాట్ బ్రౌన్ తెలిపారు. -
ఏఈఈ రవీంద్రుడు మృతి
► మూడ్రోజుల తరువాత వెలుగులోకి.. ► ఉబ్బిపోయిన మృతదేహం అనంతపురం : అనంతపురంలో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ విద్య సంక్షేమ మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యూడీసీ)లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఏఈ)గా పని చేసే పల్లా రవీంద్రుడు (50) మరణించారు. తన గదిలో మూడ్రోజుల కిందట ఆయన మరణించగా శుక్రవారం సాయంత్రం కొనుగొన్నారు. వైఎస్సార్ జిల్లాకు చెందిన రవీంద్రుడు రెండేళ్ల కిందట అనంతపురం జిల్లాకు బదిలీపై వచ్చారు. అవివాహితుడు. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఆయన హౌసింగ్ బోర్డులోని ఓ అద్దె గదిలో ఉండేవారు. ఇటీవల గిల్డ్ ఆఫ్ సర్వీస్ స్కూల్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లోకి మారారు. ఈ నెల 23న కాంట్రాక్టర్ నల్లయ్యతో కలసి ఉరవకొండకు క్యాంపు వెళ్లారు. అక్కడ నిర్మాణ పనులు చూసుకుని మధ్యాహ్నం గదికి చేరుకున్నారు. అంతే అప్పటి నుంచి బయటకు రాలేదు. గదికి రెండు తలుపులు ఉండగా రెండింటికీ లోపలే గడియ పెట్టుకున్నాడు. ఆయన మొబైల్‌కు కార్యాలయ అధికారులు, సిబ్బంది, స్నేహితులు, కాంట్రాక్టర్లు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. రింగ్ అవుతున్నా...రిసీవ్ చేయలేదు. వెలుగులోకి వచ్చింది ఇలా... వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు సమీపంలో షిరిడీ సాయిబాబా ఆలయాన్ని రవీంద్రుడు నిర్మించారు. ఆలయ నిర్వహణకు కొందరిని నియమించాడు. అయితే ఆ ఆలయానికి కొన్ని నెలలుగా కరెంటు బిల్లులు చెల్లించలేదు. ఈ క్రమంలో నిర్వాహకులు 23 నుంచి పలుమార్లు రవీంద్రుడికి ఫోన్ చేశారు. స్పందన లేదు. ఈ క్రమంలో శుక్రవారం గురుప్రసాద్ అనే వ్యక్తి జమ్మలమడుగు నుంచి నేరుగా అనంతపురంలోని రవీంద్రుడి గదికి చేరుకున్నాడు. గడియ పెట్టుకోవడంతో ఎంతసేపు పిలిచినా స్పందించలేదు. తర్వాత కిటీలో నుంచి తొంగిచూడగా ఆయన రక్తపుమడుగులో పడి ఉన్నాడు. వెంటనే అపార్టుమెంట్ యజమానికి సమాచారం అందించాడు. ఆయన వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. సీఐ శుభకుమార్ తమ సిబ్బందితో వచ్చి వాకిలిని బలవంతంగా తొలిగించి లోపలికి వెళ్లారు. మృతదేహం బాగా ఉబ్బిపోయి భరించలేనంతగా వాసన వస్తోంది. మృతదేహం నుంచి అధికంగా రక్తస్రావమైంది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక మార్చురీకి తరలించారు. ఏమై ఉంటుంది..? రవీంద్రుడు కొంతకాలంగా బీపీ, షుగర్, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నాడు. ఎండ తీవ్రత నెలకొన్న పరిస్థితుల్లో క్యాంపునకు వెళ్లిన ఆయన తిరిగి వచ్చిన తర్వాత అనారోగ్యంతో బాధపడినట్లు తెలిసింది. ఈ క్రమంలో స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో తీవ్ర అనారోగ్యానికి గురై మరణించారా, లే ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయని సీఐ తెలిపారు. -
మూత్రనాళ ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలకు దెబ్బ!
హోమియో కౌన్సెలింగ్ నా వయసు 55 సంవత్సరాలు. నాకు బీపీ, షుగర్ ఉన్నాయి. వీటికి తోడు ఈ మధ్య భుజం నొప్పి తరచు బాధిస్తుండడంతో డాక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన ఎమ్మారై చేసి, పెరి ఆర్థరైటిస్ అని నిర్థారించారు. హోమియోపతిలో దీనికి చికిత్స ఉందా? -బాలకృష్ణ, తెనాలి శరీరంలోని కీళ్లన్నింటిలోకీ ఎక్కువగా కదిలేది భుజంకీళ్లే. దాదాపు మనం చేతులతో చేసే ప్రతిపనిలోనూ భుజం కీలును ఉపయోగించాల్సి వస్తుంది. భుజం కీళ్లు కూడా మోకాలు, తుంటికీళ్లవంటివే. ఇలాంటికీళ్లను బంతిగిన్నె కీళ్లు అంటారు. ఈ కీళ్లను గుళిక అనే పల్చటి పొర కప్పి ఉంచుతుంది. కీళ్లు అటూ ఇటూ కదిలించడానికి కావలసిన కండరాలు ఈ గుళిక బయట ఉంటాయి. భుజంలో ఉండే ఎముకలను ఒకదానినొటి కలిపే లిగమెంట్లు ఉంటాయి. ఇవి భుజం ఎముకల చుట్టూ ఒక గుండ్రని పొరను ఏర్పాటు చేస్తాయి. ఈ ప్రదేశంలో వాపు వచ్చినప్పుడు భుజం ఎముకలని సులువుగా కదల్చలేము. అప్పుడు భుజం పనితనం తగ్గడంతోపాటు నొప్పి రావచ్చు. భుజ నిర్మాణం చూసినట్లయితే చేతిపై ఎముక చివరిభాగంలో కార్టిలేజ్ ఉంటుంది. ఇది భుజపు ఎముక చివరగా ఉండే ఒక సాకెట్‌లా ఉండే గ్లినాయిడ్‌లో అమరి ఉంటుంది. ఈ కప్ లాంటి అమరికలో చేతి కీలు అన్ని పక్కలకు సులువుగా కదులుతుంటుంది. ఈ నిర్మాణంలో భుజపుటెముక స్థిరంగా ఉండి కండరాలు, టాండన్స్ సహాయంతో చేతి కీలును గ ట్టిగా పట్టి ఉంచుతూ భుజం కదలికకు సహకరిస్తుంది. కారణాలు: భుజానికి దెబ్బ తగలడం, భుజం కప్ ప్రాంతంలో చీలిక రావడం, భుజపుటెముక ఇన్ఫెక్షన్కు గురికావడం, భుజంపై చేతికీళ్లలోని కార్టిలేజ్‌లో మార్పు రావడం, మెడ ఎముకలకు సంబంధించిన సమస్యలు, అతి మూత్ర వ్యాధి లేదా చక్కెర వ్యాధి, భుజానికి లేదా గుండెకు శస్త్ర చికిత్స జరగడం. లక్షణాలు: భుజంలో నొప్పి, భుజం కదలికలు తగ్గడం, భుజం బిగపట్టినట్లుగా ఉండటం, చేతిని పైకి ఎత్తలేకపోవటం, చేతిలో వస్తువులను పట్టుకోవాలన్నా, రాయాల న్నా, భుజం నొప్పి రావడం, సమస్య తీవ్రమైతే చేతిని తల వెనక భాగానికి ఆన్చడమూ కష్టమవుతుంది. వ్యాధి నిర్ధారణ: ఎమ్మారై స్కాన్, టీ3, టీ4, టీఎస్‌హెచ్, ఎఫ్బీఎస్, సుగర్ టెస్ట్, ఎక్స్‌రే, ఆర్బీఎస్. హోమియో చికిత్స: రోగి శారీరక, మానసిక తత్వాన్ని అనుసరించి లక్షణాలను బట్టి హోమియో చికిత్స ఉంటుంది. బెలడోనా, ఫై మెట్, రస్టాక్స్, లెడమ్పాల్, ఆర్నికా, సాంగ్యునేరియా, కాల్బికమ్లతో ఆపరేషన్ లేకుండా నయం చేయవచ్చు. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో) స్టార్ హోమియోపతి హైదరాబాద్ నెఫ్రాలజీ కౌన్సెలింగ్ నా వయసు 23. నాకు గత కొంతకాలంగా మూత్రవిసర్జన సమయంలో మంట వస్తోంది. గతంలో ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వైద్యులను సంప్రదిస్తే మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పి మందులు ఇచ్చారు. మూడు రోజుల పాటు మందులు వాడిన తర్వాత సమస్య పూర్తిగా తగ్గిపోయింది. అప్పుడు వైద్యులు రాసిచ్చిన మందులు ఇప్పుడు వాడవచ్చా? ఇప్పుడు మళ్లీ వైద్యులను సంప్రదించాలా? దయచేసి నా సమస్యకు సరైన పరిష్కారం చూపించండి. - ఒక సోదరి మూత్రనాళ ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో మూత్రవిసర్జన సమయంలో మంట వస్తుంటుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్ను నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించి సరైన చికిత్స తీసుకోండి. చాలామంది ఇలాంటి సమస్య వచ్చినా ఎవరితో చెప్పుకోలేక ఇబ్బంది పడుతూ వైద్యులను సంప్రదించకుండా అలాగే ఉంటారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే సమస్య తీవ్రత పెరగవచ్చు. గతంలో వైద్యులు రాసిన మందులు ఇప్పుడు వాడకపోవడమే మంచిది. ఎందుకంటే మీకు గతంలో వచ్చిన సమస్యకు, ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యకు వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి మీరు వైద్యులను సంప్రదించి, వారి సూచన మేరకు మందులు వాడండి. నా వయస్సు 54 సంవత్సరాలు. నాకు 10 సంవత్సరాలుగా షుగర్ ఉంది. ఈ మధ్యన కాస్త ప్రయాణం చేస్తే చాలు... కాళ్లు వాస్తున్నాయి. నా బ్లడ్ టెస్టులో క్రియాటినిన్ 10 మి.గ్రా./డెసిలీటర్ యూరియా 28 మి.గ్రా. డెసిలేటర్ ఉంది. యూరిన్ పరీక్షలో ప్రొటీన్ 3 ప్లస్ అని తెలిపారు. నాకు షుగర్ వల్ల కిడ్నీ సమస్య ఉందా? ఇప్పుడు ఎలా జాగ్రత్త పడాలి. - జి.వి.ఎల్.బి.రాజేశ్వరి, మాగులూరు మీకు యూరిన్‌లో ప్రొటీన్ ఎక్కువగా పోతోందని తెలుస్తోంది. (డైయూరిటిక్ నెఫ్రోపతి). మొదటిది షుగర్ వల్లా లేదా కిడ్నీ లేదా ఇతర కారణాల వల్ల తెలుసుకోవాలి. మీరు షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు బ్లడ్ షుగర్ 140 మి.గ్రా. లోపు; తిన్న తరువాత 160 మి.గ్రా. ఉండేటట్లు చూసుకోవాలి. యూరిన్‌లో వెళ్లిపోయే ప్రొటీన్‌ని తగ్గించడానికి డాక్టర్ సలహా మేరకు మీరు మందులు వాడాలి. ఇవి కాకుండా ఉప్పును తగ్గించాలి. రోజుకి రెండు గ్రాముల కన్నా ఎక్కువ ఉప్పును తీసుకోకూడదు. పొగతాగడానికి, మద్యానికి దూరంగా ఉండాలి.పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్లు వాడకూడదు. డాక్టర్ ఊర్మిళ ఆనంద్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ యశోద హస్పిటల్స్ సికింద్రాబాద్ డర్మటాలజీ కౌన్సెలింగ్ నేను రోజూ ఆఫీసుకు బైక్ మీద వెళ్తుంటాను. నేను గమనించిన అంశం ఏమిటంటే... చలికాలంలో బైక్ కు ఉండే ముందు బ్రేక్స్‌కు, క్లచ్కూ నా వేళ్లు అనుకునే ప్రదేశంలోనూ, హ్యాండిల్ మీద నా అరచేయి అనుకునే చోటా చర్మం బాగా బిరుసుగా, గట్టిగా కాయలాగా మారిపోతోంది. ఆ ప్రదేశం మళ్లీ నునుపుగా మారేందుకు తగిన సలహా ఇవ్వగలరు. - మానస్, హైదరాబాద్ చలికాలంలో చర్మంలోని తేమ బయటకు వెళ్లిపోవడం వల్ల మీరు చెప్పినట్లుగా చర్మం కొన్నిచోట్ల బిరుసుగానూ, గరుకుగానూ మారిపోతుంది. ఇక చర్మం పైన కాస్తంత ఒత్తిడి పడటం, ఒరుసుకుపోతున్నట్లుగా ఉండే ప్రదేశాల్లో అది మందంగా మారిపోవడం కూడా మామూలే. ఇలా చర్మం మందంగా మారే ప్రక్రియను వైద్యపరిభాషలో ‘క్యలాసిటీ’స్ అంటారు. మామూలు వాడుక భాషలో దీన్నే కాయకాయడం అంటారు. ఇది తగ్గడానికి అనుసరించాల్సిన మార్గాలు చర్మంపై కాయ కాసే చోట తేమను సంరక్షించే షియా బటర్, గ్లిజరిన్, వైట్ సాఫ్ట్ పారఫిన్ వంటి వాటిలో దైనినైనా రోజుకు మూడు నుంచి నాలుగుసార్లు రాయాలి. కార్టికో స్టెరాయిడ్స్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ పైపూత మందులను కాయ కాసిన చోట పది రోజుల పాటు రాయాలి. ఈ కాయలు (క్యలాసిటీస్) మరీ గట్టిగా ఉంటే ‘పేరింగ్’ అనే ప్రక్రియ ద్వారా వాటిని తొలగించవచ్చు. నా మడమలు విపరీతంగా పగులుతున్నాయి. మడమ నేలకు ఆనించాలంటేనే కష్టంగా ఉంటోంది. ఒక్కోసారి రక్తం కూడా వస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - రవికుమార్, నేలకొండపల్లి చలికాలంలో ఇది చాలా సాధారణ సమస్య. కొన్నిసార్లు ప్లాంటార్ సోరియాసిస్, హైపర్కెరటోసిస్తో పాటు కొన్ని రకాల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కారణంగా కాళ్లలో చాలా లోతైన పగుళ్లతో పాటు, రక్తస్రావమూ కనిపించవచ్చు. కాళ్లు పగిలి ఉన్న చోట క్రమం తప్పకుండా పారఫిన్ ఆయిల్, గ్లిజరిన్, స్క్వాలీన్ వంటివి రాయండి. క్లోబెటసాల్ ప్రాపియోనేట్, శాల్సిలిక్ యాసిడ్ కాంబినేషన్ క్రీములను రెండు వారాల పాటు ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం రాయండి. ప్రతిరోజూ సాక్స్ ధరించండి. పగుళ్లతో గరుకుగా మారిన చోట సున్నితంగా రుద్దండి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ చీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి హైదరాబాద్ -
బేరియాట్రిక్ సర్జరీతో...
మందులు వాడకుండానే బీపీ, షుగర్ అదుపులోకి వస్తాయా? హోమియో కౌన్సెలింగ్ మా అమ్మగారి వయసు 65 సంవత్సరాలు. ఆమె గత కొద్దికాలంగా విపరీతంగా తుమ్ములు, జలుబు, ఆయాసంతో సరిగా ఊపిరి ఆడకపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. డాక్టర్‌కు చూపిస్తే ఆస్తమా అయి ఉండవచ్చన్నారు. ఈ వయసు వారిలో కూడా ఆస్తమా వస్తుందా? ఒకవేళ ఆమెకు ఆస్తమానే అయితే దానికి హోమియోలో మందులున్నాయా? దయచేసి సలహా చెప్పగలరు. - డి.ఎల్.అనూరాధ, కొత్తగూడెం దీర్ఘకాలిక శ్వాసకోశ సమస్యకే ఆస్తమా అని పేరు. ఊపిరితిత్తులలో గాలి పోయే మార్గానికి అడ్డంకులు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. శ్వాసకోశ మార్గంలో వాపు, శ్వాసకోశ మార్గం కుచించుకుపోవడం వల్ల ఆస్తమా వస్తుంది. కారణాలు: చల్లటి వాతావరణం, దుమ్ము, ధూళి, పొగ, ఫంగస్, వాతావరణ కాలుష్యం, వైరల్ ఇన్ఫెక్షన్లు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, పెంపుడు జంతువులు, రసాయనాలు, ఘాటు వాసనలు. ఎలా వస్తుందంటే..? ఆస్తమా వ్యాధి ప్రధానంగా అలర్జీకి సంబంధించింది. కొంతమందిలో ఇది వంశపారంపర్యంగా కూడా సంక్రమించవచ్చు. కొంతమందిలో వ్యాధినిరోధక శక్తిని కలిగించే యాంటీబాడీలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి సరిపడని యాంటీజెన్లు శరీరంలోనికి ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీలు వాటితో పోరాటం చేసి శరీరాన్ని రక్షించే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో కణాల నుండి వెలువడే రసాయనాల వల్ల శ్వాసనాళాల్లోకి శ్లేష్మం చేరుతుంది. దాంతో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుంది. లక్షణాలు: ఎడతెరపిలేని దగ్గు, పిల్లికూతలు, ఆయాసం, జ్వరం. జలుబు, శ్వాస తీసుకోలేకపోవడం, మానసిక ఆందోళన. నిర్ధారణ: వంశానుగత చరిత్ర, అలర్జీకి సంబంధించిన పరీక్షలు, ముక్కు, గొంతు, ఛాతీ పరీక్షలు, స్పైరోమెట్రీ, ఛాతీ ఎక్స్‌రే. జాగ్రత్తలు: రోజూ వ్యాయామం చేయడం, పోషకాహారం తీసుకోవడం, ఎక్కువ శారీరక శ్రమ లేకుండా చూసుకోవడం, మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం, దుమ్ము, ధూళి, పొగ, కాలుష్యానికి, ఒంటికి సరిపడని ఆహారానికి దూరంగా ఉండటం, చల్లని వాతావరణ ంలో తిరగకుండా ఉండటం. పాజిటివ్ హోమియో చికిత్స: ఆస్తమాకు హోమియోపతిలో చాలా మంచి మందులున్నాయి. రోగి శారీరక, మానసిక లక్షణాలను బట్టి, శరీర తత్వాన్ని బట్టి నిపుణులైన వైద్యుని ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా మందులు వాడటం ద్వారా ఆస్తమాను అదుపులో ఉంచుకోవచ్చు. మీరు వెంటనే మీ అమ్మగారిని మంచి హోమియోవైద్యుని దగ్గరకు తీసుకెళ్లండి. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ నా వయసు 44 ఏళ్లు. 110 కిలోల బరువు ఉంటాను. నాకు బీపీ, షుగర్ అదుపులోకి రావడం లేదు. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం లేదు. బేరియాట్రిక్ సర్జరీ ద్వారా బరువు తగ్గవచ్చని నా స్నేహితులు సలహా ఇస్తున్నారు. ఒకవేళ నేను బేరియాట్రిక్ సర్జరీ చేయించుకుంటే, ఆ శస్త్రచికిత్స తర్వాత మందులు వాడకుండానే బీపీ, షుగర్లు అదుపులోకి వస్తాయా? దయచేసి నా సమస్యకు పరిష్కారం చూపించగలరు. - కె.ఎల్.ఎన్. రాజు, వరంగల్ మీరు మీ వయసు, బరువు తెలిపారు గానీ... మీ ఎత్తు తెలపలేదు. బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) అనే ప్రమాణాలను బట్టి చూసినప్పుడు, మీ బరువు వల్ల మీకు హాని జరిగే అవకాశాలు ఎక్కువని తేలితే బేరియాట్రిక్ సర్జరీ నిర్వహిస్తాం. బేరియాట్రిక్ సర్జరీ అంటే కడుపుపై పెద్ద పెద్ద కోతలు పెట్టి ఆపరేషన్ చేస్తారని మీరు భయపడుతున్నట్లు తెలుస్తోంది. కానీ ప్రస్తుతం అత్యాధునిక కీహోల్ విధానంలో తక్కువ కోతతో బేరియాట్రిక్ సర్జరీ నిర్వహించవచ్చు. ఈ విధానం చాలా సురక్షితం. కీహోల్ సర్జరీ ద్వారా ఆపరేషన్ చేస్తే, రెండు రోజుల్లోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేస్తారు. సర్జరీ తర్వాత మీరు బరువు తగ్గడంతో పాటు, మీ బీపీ, షుగర్ కూడా అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ మధుమేహం పూర్తిగా అదుపులోకి రాకపోయినా మందులు వాడటం చాలా వరకు తగ్గుతుంది. మీ బీఎంఐతో పాటు ఇతర ఆరోగ్యపరిస్థితులను బట్టి మీకు బేరియాట్రిక్ సర్జరీ అవసరమా, కాదా అని వైద్యులు నిర్ధారణ చేస్తారు. ఒకవేళ మీకు బేరియాట్రిక్ సర్జరీ తప్పనిసరి అయితే అత్యాధునిక సదుపాయాలు, నిష్ణాతులైన వైద్యులు అందుబాటులో ఉన్న ఆసుపత్రిలో మాత్రమే శస్త్రచికిత్స చేయించుకోండి. ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 68 ఏళ్లు. నాకు గత రెండేళ్లుగా మోకాళ్లలో నొప్పి ఉంది. ఇటీవల ఇది చాలా ఎక్కువైంది. ఇప్పుడు నడవడం కూడా కష్టమవుతోంది. ఒకవేళ మోకాలి మార్పిడి చికిత్స చేయించుకోవాలంటే ఎంత ఖర్చవుతుంది? తగిన సలహా ఇవ్వండి. - మంజరి, వనపర్తి మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీకు ఆస్టియోఆర్థరైటిస్ సమస్య ఉన్నట్లుగా తెలుస్తోంది. వయసు పెరుగుతున్న కొద్దీ సమస్య తీవ్రమవుతూ పోతుంది. ముందుగా మీరు మీ దగ్గర్లోని ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించి ఎక్స్-రే తీయించుకోండి. ఈ సమస్యకు తొలిదశలో నొప్పి నివారణ మందులు, కాండ్రోప్రొటెక్టివ్ డ్రగ్స్ అనే మందులు వాడతారు. ఫిజియోథెరపీ వ్యాయామాలూ సూచిస్తారు. అప్పటికీ నొప్పి తగ్గకపోతే మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స (టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ) అవసరమవుతుంది. మోకాలి మార్పిడి సర్జరీకి సుమారు 1.5 లక్షల రూపాయల నుంచి 1.8 లక్షల వరకు ఖర్చవుతుంది. మోకాలి కీలు మార్పిడి కోసం ఉపయోగించే మెటీరియల్ మీద ఖర్చు ఆధారపడి ఉంటుంది. నా వయసు 29 ఏళ్లు. బైక్ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, నా కుడి మణికట్టులో కొద్ది నెలలుగా తీవ్రమైన నొప్పి వస్తోంది. దాంతో ఏ పనీ చేయలేకపోతున్నాను. దాన్ని కొద్దిపాటి ఒత్తిడితో వంచినప్పుడు క్లిక్‌మనే శబ్దం వచ్చి నొప్పి వస్తోంది. దయచేసి నాకు తగిన పరిష్కారం చెప్పండి. - సోమరాజు, రాజోలు మణికట్టులో 15 ఎముకలు ఉంటాయి. రిస్ట్ అనేది ఎన్నో లిగమెంట్లతో కూడిన సంక్లిష్టమైన నిర్మాణం. కొన్ని చిన్న ఎముకలు విరిగినప్పుడు ఆ విషయమే మనకు తెలియదు. ఉదాహరణకు స్కాఫాయిడ్ అనే ఎముక మనం మణికట్టును గుండ్రగా తిప్పడానికి ఉపయోగపడుతుంది. దీంతోపాటు కొన్ని రకాల ఎముకలు విరిగిన విషయం సాధారణ ఎక్స్‌రేలో తెలియపోవచ్చు కూడా. అయితే కొన్నిసార్లు రెండు, మూడు వారాల తర్వాత చేసే రిపీటెడ్ ఎక్స్‌రేలో తెలుస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలు స్కాఫాయిడ్ ఎముక విరిగినట్లు సూచిస్తున్నాయి. మీ సమస్య టీనోసైనోవైటిస్ లేదా రిపిటీటివ్ స్ట్రెయిన్ ఇంజ్యురీ కూడా కావచ్చు. కాబట్టి ఒకసారి ‘ఆర్థోపెడిక్ సర్జన్’ను కలిసి తగిన ఎక్స్-రే పరీక్షలు చేయించుకోండి. -
ఎన్ఈసీ గ్యాస్ బ్లాక్‌లో విక్రయానికి నికో వాటాలు
న్యూఢిల్లీ: నిధుల కొరతతో అల్లాడుతున్న నికో రిసోర్సెస్ .. ఎన్ఈసీ-25 గ్యాస్ బ్లాక్ నుంచి వైదొలగాలని నిర్ణయించింది. ఇందులో తనకున్న 10 శాతం వాటాలను భాగస్వామ్య సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీకి విక్రయించనున్నట్లు 2016 రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా తెలిపింది. ఎన్ఈసీ-25 బ్లాక్‌లో 60% వాటాలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన ఆపరేటర్‌గా ఉంది. బీపీకి 30%, నికో రిసోర్సెస్‌కు 10% వాటాలున్నాయి. ఒడిషాలో తీరానికి దగ్గర్లోని ఎన్ఈసీ-25 బ్లాక్‌లో సుమారు 1.032 లక్షల కోట్ల ఘనపుటడుగుల గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయని అంచనా. ఆర్థిక కష్టాల్లో ఉన్న నికో.. సమస్యల నుంచి గట్టెక్కేందుకు కేజీ-డీ6 చమురు, గ్యాస్ క్షేత్రంలో కూడా తనకున్న వాటాలను విక్రయించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఇంట్లో బార్లీ ఉడికితే.. ఆరోగ్యమే..!
తిండి గోల బి.పి నియంత్రణలో ఉండాలన్నా, కిడ్నీలో రాళ్లు కరగాలన్నా, మూత్రం సాఫీగా అవ్వాలన్నా... బార్లీ నీళ్లు తాగమని వైద్యులు సూచిస్తుంటారు. ఆరోగ్యంగా ఉండాలంటే బార్లీ ఇంట ఉండాల్సిందే అనిపించేంతటి ఘన చరిత్రను బార్లీ సొంతం చేసుకుంది. ఇంచుమించు గోధుమల్లాగే కనిపించే బార్లీకి 13 వేల ఏళ్ల ఘనచరిత్ర ఉంది. అయితే, ముందుగా ఈ గింజను వంటకాలలో వాడింది మాత్రం టిబెటెన్లు. అటు తర్వాత మధ్య యూరప్‌కి ఈ పంట పాకింది. ఆఫ్రికన్లు కూడా బార్లీ పంటను విస్తృతంగా సాగుచేస్తున్నారు. బార్లీ గింజకు ఉండే గట్టిదనం వల్ల పై పొట్టు అంత సులువుగా రాదు. దీంతో దీనిని ముత్యంతో పోల్చారు విదేశీయులు. జపాన్ నూడుల్స్‌లోనూ, రష్యా వంటకాలలోనూ, మద్యపానీయాల తయారీలోనూ బార్లీ గింజలను విరివిగా ఉపయోగిస్తుంటారు. బార్లీ పంట వర్షాభావ పరిస్థితులను తట్టుకొని పెరుగుతుంది. రసాయనాల వాడకం ఉండదు. పొట్టుతోనూ, పొట్టు తీసినవి, పిండి, ఫ్లాక్స్గానూ బార్లీ మనకు అందుబాటులోకి వచ్చింది. ఉడకడానికి ఎక్కువ సమయం పట్టే బార్లీలో పీచుతో పాటు పోషకవిలువలు సమృద్ధిగా ఉన్నాయి. అన్ని ఔషధ గుణాలు ఉన్నాయి -
టీనేజర్లకు ఇంటర్నెట్ ముప్పు!
న్యూయార్క్ : ఇంటర్నెట్ అధికంగా వినియోగించే టీనేజీ వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఓ రీసెర్చ్‌లో తేలింది. వారంలో 14 గంటలకు మించి బ్రౌజింగ్ చేసే పిల్లలలో స్థూలకాయం, బీపీ లాంటి సమస్యలు వస్తాయట. ముఖ్యంగా వారానికి 25 గంటలకు మించి ఇంటర్నెట్ వాడితే వారి ఆరోగ్యం మరింత దెబ్బతీంటుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన హెన్రీఫోర్డ్ హాస్పిటల్ వైద్యుడు ఆండ్రియా కాస్సిడీ తెలిపారు. బ్రౌజింగ్ చేసే 335 మంది టీనేజర్లను తమ రీసెర్చ్‌లో భాగంగా పరీక్షించి ఈ విషయాలు వెల్లడించినట్లు వివరించారు. 50 ప్రశ్నలకు పైగా ఉన్న ప్రశ్నాపత్రాన్ని వారికిచ్చి టెస్ట్ చేసి, వారి బీపీ లెవల్స్ స్థాయి బ్యాలెన్స్ తప్పాయని తెలుసుకున్నారట. 335 మంది పిల్లలకుగానూ 134 మంది పిల్లలు ఇంటర్నెట్‌పైనే ఎక్కువ సమయాన్ని వెచ్చించేవారు. ఈ యూజర్లలో 26 మందికి టీనేజీలోపే బీపీ వచ్చినట్లు కనుగొన్నామని ఆండ్రియా కాస్సిడీ పేర్కొన్నారు. బ్రౌజింగ్ ఎక్కువ చేసే వారిలో 43 శాతం యూజర్లు అధిక బరువు కలిగి ఉన్నారని, ఇతర యూజర్లలో కేవలం 26 శాతం మందిలో ఈ సమస్యలున్నాయన్నారు. తల్లిదండ్రులు పిల్లల ఇంటర్నెట్ వినియోగంపై కొన్ని పరిమితులు విధించాలని తమ రీసెర్చ్ ద్వారా అభిప్రాయపడ్డారు. రోజులో కేవలం రెండు గంటలలోపు బ్రౌజింగ్ చేసే అవకాశం కల్పించాలని, అలాగే వారానికి కేవలం ఐదు రోజులు మాత్రమే ఇంటర్నెట్ వాడేలా చూడాలని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆండ్రియా కాస్సిడీ సూచించారు. -
భార్యా భర్త మధ్యలో హై బీపీ
శంకర్‌దాదా ఎంబీబిఎస్ సినిమాలో చిరంజీవి పట్టించిన ఆటకి టెన్షన్ పెరిగిపోయి, కల్లు తాగిన కోతిలా ఎగురుతుంటాడు పరేశ్ రావల్ . ఆయనకి హై బీపీ. అందుకనే లాఫింగ్ క్లబ్బులో మెంబరైపోతాడు కూడా. సినిమాలో అయితే చెల్లింది గానీ, హై బీపీ లాఫింగ్ మ్యాటర్ కాదు. డాక్టర్లు, సైకియాట్రిస్టులు చెబుతున్న విషయం ఏంటంటే... కోపం పెరగడం వల్ల బీపీ పెరగడం తక్కువే. కానీ, బీపీ పెరగడం వల్ల చిరాకులు, కస్సుబుస్సులు, చిటపటలు, చిర్రుబుర్రులు పటపటలు... సర్వసాధారణం. ఈ మోడర్న్ టైమ్స్‌లో భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గడానికి హై బీపీ కూడా ఒక కారణం అవొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై బీపీ ప్రాణం తీయగలదన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రాణంలాంటి బంధాన్ని కూడా చంపుతుందని వైద్య పరిశోధనల్లో ఇప్పుడిప్పుడే తెలుస్తున్న విషయం. సో... భార్యాభర్తలు చిరాకు పడుతున్నారంటే ప్రేమ తగ్గి కాదు... బీపీ పెరిగి అయుండొచ్చు. దంపతులిద్దరూ ధుమధుమలాడుతూ కనిపిస్తున్నారా? చీటికీ మాటికీ చిటపటలాడుతూ టపాసుల్లా పేలుతున్నారా? ఇద్దరి మధ్య కీచులాటలు నిత్యకృత్యమయ్యాయా?... ఒకసారి బీపీ చెక్ చేయించుకోండి. బీపీ పెరిగితే ధుమధుమలు, చిటపటలు పెరగవచ్చు. కస్సుబుస్సుల మాట ఎలా ఉన్నా కంటినరాలు దెబ్బతినడం, కిడ్నీ సమస్యలు, గుండెజబ్బులు, పోటెత్తిన నెత్తురు మెదడులో ప్రవహించి పక్షవాతం సైతం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తనాళాల్లో నెత్తురు పోటెత్తాల్సిందే! అయితే, అది నిలకడగా ఉంటేనే ఆరోగ్య లక్షణం. అలా కాకుండా, రక్తనాళాల్లో నెత్తుటి ఉధృతిని సామాన్య భాషలో బీపీ అంటారు. నిజానికది హై బీపీ. వైద్య పరిభాషలో హైపర్‌టెన్షన్... ఈ హైపర్‌టెన్షన్ వస్తే ఆరోగ్యానికి ఎంత చేటు తెచ్చిపెడుతుందోననే టెన్షన్ ఉండాల్సిందే! ఎందుకంటే ఒక్కోసారి అది ప్రాణాంతకం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యల్లో హై బీపీ ఒకటి. కేవలం ైెహ బీపీ వల్ల తలెత్తే సమస్యల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఏటా 75 లక్షల నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా. బీపీ పెరిగే వారిలో దాదాపు 96 శాతం మందికి ఎలాంటి లక్షణాలు కనిపించవు. బీపీ అదుపు తప్పేంతగా పెరిగితే గుండె, కిడ్నీలు, మెదడు, కళ్లు దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. తరచుగా బీపీని తనిఖీ చేసుకుంటూ, తగిన జాగ్రత్తలు పాటిస్తే, దీనివల్ల తలెత్తే గుండెపోటు, పక్షవాతం వంటి ప్రాణాంతక సమస్యలను నివారించుకోవచ్చు. ఏది సాధారణం..? ఏది అసాధారణం..? శరీరంలో రక్తప్రసరణ జరిగేటప్పుడు రక్తనాళాలపై కలిగే ఒత్తిడినే రక్తపోటు అంటారు. విశ్రాంత స్థితిలో రక్తపోటు చూసేటప్పుడు సిస్టాలిక్ పీడనం 120, డయాస్టాలిక్ పీడనం 80 వరకు (120/80) ఉంటే రక్తపోటు సాధారణంగా ఉన్నట్లు లెక్క. అంతకు మించి పెరిగితే అధిక రక్తపోటుగా (హైబీపీ) పరిగణిస్తారు. సాధారణ స్థితి కంటే తక్కువగా ఉంటే, అల్ప రక్తపోటుగా (లో బీపీ) పరిగణిస్తారు. అయితే, శరీరంలో రక్తపోటు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. ఇది నిమిష నిమిషానికీ మారుతూనే ఉంటుంది. ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఈ హెచ్చుతగ్గులు ఒక క్రమ పద్ధతిలో నమోదవుతాయి. మధ్యాహ్నం వేళ రక్తపోటు సాధారణ స్థితి కంటే కాస్త ఎక్కువగా, రాత్రివేళ కాస్త తక్కువగా ఉంటుంది. రాత్రివేళ రక్తపోటు నెమ్మదించకుంటే, దానిని భవిష్యత్ అనారోగ్య సూచనగా పరిగణించాల్సి ఉంటుంది. ఎందుకు పెరుగుతుంది? చాలావరకు బీపీ ఎందుకు పెరుగుతుందనే దానికి కచ్చితమైన కారణాలు తెలియవు. శారీరక శ్రమకు ఆస్కారం లేని పనులు చేసేవారికి, నిరంతరం ఒత్తిడి ఎదుర్కొనే వారికి, స్థూలకాయులకు, పొగరాయుళ్లకు బీపీ పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జన్యుపరమైన కారణాల వల్ల కూడా కొందరు హై బీపీ బారిన పడవచ్చు. నిర్దిష్ట కారణాలు కనిపించకుండానే, రక్తపోటు పెరగడాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటారు. నిర్దిష్టమైన కారణంతో వచ్చే రక్తపోటును సెకండరీ హైపర్ టెన్షన్ అంటారు. కారణం తెలియకుండా వచ్చే ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ కంటే, నిర్దిష్టమైన కారణంతో కనిపించే సెకండరీ హైపర్ టెన్షన్‌తోనే ప్రమాదం ఎక్కువ. సెకండరీ హై బీపీకి కారణమైన జబ్బును నయం చేయడం ద్వారా హై బీపీని నయం చేయవచ్చు. ఉప్పుతో ముప్పు హై బీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఎందుకంటే, ఉప్పు ద్వారా రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరిన సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల రక్తనాళాల్లో రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోతుంది. ఫలితంగా రక్తపోటు అదుపు తప్పి పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం, బ్రెయిన్ హెమరేజ్ వంటి ప్రమాదకర, ప్రాణాంతక పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అలాగే, శరీరంలో కొవ్వు పెరిగినా రక్తనాళాలపై వెలుపలి నుంచి ఒత్తిడి పడి ఇలాంటి పరిస్థితే తలెత్తుతుంది. చక్కెరతోనూ చిక్కులు ఉప్పే కాదు, చక్కెర కూడా బీపీ పెరిగేలా చేస్తుంది. శరీరంలోకి చక్కెరలు ఎక్కువగా చేరితే, వాటికి ప్రతిస్పందనగా శరీరంలో ఇన్సులిన్, లెప్టిన్ హార్మోన్ల ఉత్పత్తి పెరుగుతుంది. ఇవి పెరిగితే, రక్తపోటు సహజంగానే పెరుగుతుంది. చక్కెరల్లో ముఖ్యంగా సుక్రోజ్ కంటే కూల్‌డ్రింక్స్‌లో ఉండే ఫ్రుక్టోజ్ ఎక్కువగా చేటు తెచ్చిపెడుతుందని అంతర్జాతీయ పరిశోధనలు చెబుతున్నాయి. రక్తనాళాలకు చేటు రక్తపోటు మితిమీరి పెరిగితే రక్తనాళాల్లో ఒత్తిడి సహజంగానే పెరుగుతుంది. హై బీపీ ఉన్నవారిలో రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదమూ లేకపోలేదు. బీపీ తీవ్రత పెరిగితే తలనొప్పి, తల దిమ్ముగా ఉండటం, కళ్లు తిరగడం, తల తిరగడం, కొందరిలో చూపులో తేడా రావడం, వాంతులు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తపోటు విపరీతంగా పెరిగితే అది పక్షవాతానికి దారితీసి మాట తడబడటం, ముఖంలో ఒకవైపు వంకరపోవడం, ఒకపక్క కాలు చేయి వంకరపోవడం, ఒక్కోసారి మాట సైతం పూర్తిగా పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హై బీపీ వల్ల కళ్లు, ఊపిరితిత్తులు, లివర్, స్ప్లీన్, జీర్ణాశయం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. అలాంటప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం, ఛాతీనొప్పి, ఆయాసం, పాదాలకు నీరుచేరడం, మూత్రవిసర్జన తగ్గడం, జీర్ణశక్తి మందగించడం, ఫిట్స్, ముక్కు నుంచి రక్తస్రావం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బీపీ అకస్మాత్తుగా పెరగడం వల్ల మాత్రమే కాదు, దీర్ఘకాలంగా ఒక మోస్తరు హై బీపీ కొనసాగినా నరాలకు అదే స్థాయిలో చేటు తెచ్చిపెడుతుంది. పిల్లల్లోనూ హై బీపీ హై బీపీ... పెద్దల సమస్య మాత్రమే కాదు. ఇటీవలి కాలంలో కొద్దిమంది పిల్లల్లోనూ ఈ సమస్య కనిపిస్తోంది. చిన్నారుల్లో సాధారణంగా పెద్దల కంటే రక్తపోటు తక్కువగానే ఉంటుంది. ఏడాది లోపు శిశువుల్లో రక్తపోటు 75/50 నుంచి 100/70 వరకు, ఐదేళ్ల లోపు చిన్నారులకు 80/50 నుంచి 110/80 వరకు, పన్నెండేళ్ల లోపు పిల్లలకు 85/50 నుంచి 120/80 వరకు, పద్దెనిమిదేళ్ల లోపు వారికి 95/60 నుంచి 140/90 వరకు ఉండటాన్ని సాధారణ రక్తపోటుగా పరిగణిస్తారు. అంతకు మించితే, హై బీపీగానే గుర్తించాల్సి ఉంటుంది. స్థూలకాయం, క్యాల్షియం జీవక్రియల్లో మార్పులు, రెనిన్ హార్మోన్లో మార్పులు వంటివి పిల్లల్లో హై బీపీకి కారణమవుతున్నాయి. ఇవి కాకుండా, కుటుంబంలో ఎవరికైనా హై బీపీ ఉన్నట్లయితే, పిల్లల్లోనూ ప్రైమరీ హైపర్ టెన్షన్‌కు కారణమవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. మూత్రపిండాల సమస్యలు, మెదడుకు సంబంధించిన జబ్బులు, గుండె జబ్బులు, ఎండోక్రైన్ గ్రంథులకు సంబంధించిన జబ్బులు, రక్తనాళాలకు చెందిన సమస్యలు, కొన్నిరకాల మందుల వాడకం వల్ల పిల్లల్లో సెకండరీ హైపర్ టెన్షన్ తలెత్తే అవకాశాలు ఉంటాయి. ప్రైమరీ హై బీపీ తొలిదశలో ఉన్నట్లయితే, ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సమస్యను అధిగమించవచ్చు. ఇతర కారణాల వల్ల రక్తపోటు పెరిగినట్లయితే మాత్రం తప్పక వైద్య సలహా మేరకు చికిత్స తీసుకోవాల్సిందే. - ఇన్పుట్స్: డాక్టర్ గోవర్ధన్, డాక్టర్ పాపారావు సీనియర్ ఫిజీషియన్స్ -
కార్డియాలజీ కౌన్సెలింగ్
నా వయసు 65 ఏళ్లు. నాకు పదేళ్ల నుంచి షుగర్, బీపీ ఉన్నాయి. నడిచే సమయంలో కొన్ని అడుగులు వేయగానే కుడి కాలి పిక్కలో విపరీతమైన నొప్పి వస్తోంది. అదేమిటోగాని ఆగి కాసేపు కూర్చున్నాక మరు నిమిషంలోనే తగ్గుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే నరాల బలహీనత అని బీ-కాంప్లెక్స్, కొన్ని మందులు ఇచ్చారు. అయినా ఏమాత్రం తగ్గడం లేదు. ఇదే విషయం డాక్టర్గారికి చెబితే ఒకసారి గుండెజబ్బుల నిపుణుడిని కలవమని సలహా ఇచ్చారు. కాల్లో సమస్య ఉంటే గుండెజబ్బుల నిపుణడిని కలవాల్సిన అవసరం ఎందుకు? నేను నడవలేకపోతుండటంతో పనేమీ చేయలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నాను. నాకు మంచి సలహా ఇవ్వగలరు. - జగదీశ్వరప్రసాద్, విజయవాడ మీరు వివరించిన దాన్ని బట్టి చూస్తే మీకు చాలా రోజుల నుంచి షుగర్ వ్యాధి ఉండటం వల్ల కాళ్లకు రక్తప్రసరణ చేసే రక్తనాళాల్లో అడ్డంకులు (బ్లాకేజెస్) వచ్చి అలా పిక్కలో నొప్పి వస్తోందని అనిపిస్తోంది. దీనిని వైద్య పరిభాషలో క్లాడికేషన్ అంటారు. దీనికి యాంజియోగ్రామ్ పరీక్ష చేసి బ్లాక్ ఎక్కడ ఉందో తెలుసుకుని దానిని తొలగించడానికి బెలూన్ యాంజియోప్లాస్టీ, స్టెంట్ ద్వారా రక్తప్రసరణ మళ్లీ సాఫీగా జరిగే విధంగా చేయవచ్చు. ఆ ప్రక్రియ తర్వాత మళ్లీ మామూలుగా నడవగలరు. బహుశా ఈ విషయాన్ని చెప్పించడం కోసమే మీ డాక్టర్‌గారు మీ సమస్య విషయంలో గుండెజబ్బుల నిపుణుడిని కలవమని సలహా ఇచ్చి ఉంటారు. అయితే బెలూన్ యాంజియోప్లాస్టీ తర్వాత మీరు ఆస్పిరిన్, స్టాటిన్స్ వంటి మందులను డాక్టర్ సలహా మేరకు తీసుకుంటూ, మీ షుగర్ వ్యాధిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. నా వయసు 43 ఏళ్లు. ఇటీవల రక్త పరీక్షలు చేయించుకున్నప్పుడు నా కొలెస్ట్రాల్ 380 అని చెప్పారు. కానీ నేను పూర్తిగా శాకాహారిని. నాలో కొలెస్ట్రాల్ ఇంత ఎక్కువగా ఉండటానికి కారణం ఏమిటి? - సూర్యనారాయణమూర్తి, గన్నవరం రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీదే కాదు... జన్యుపరమైన కారణాలపై కూడా ఆధారపడుతుంది. ఇలాంటి వారు ఏ ఆహార నియమాలూ పాటించనట్లయితే కొలెస్ట్రాల్ మరింతగా పెరగవచ్చు. కారణాలు ఏమైనప్పటికీ మున్ముందు అది గుండెజబ్బులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు స్టాటిన్స్ అనే కొలెస్ట్రాల్ తగ్గించే మందులను డాక్టర్ సలహాపై తీసుకుంటూ ఉండాలి. డాక్టర్ ఎ. శ్రీనివాస్‌కుమార్ చీఫ్ కార్డియాలజిస్ట్, సిటిజన్స్ హాస్పిటల్స్, నల్లగండ్ల, హైదరాబాద్ -
బీపీ.. ఏటీఎఫ్ విక్రయానికి నో
న్యూఢిల్లీ: విమానయాన ఇంధనం(ఏటీఎఫ్-ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) విక్రయం కోసం బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) చేసుకున్న దరఖాస్తును ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సంస్థ ఇప్పటిదాకా 47.7 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని, అయితే ఇంధనాన్ని రిటైల్‌గా విక్రయించడానికి అవసరమయ్యే లెసైన్స్ అర్హతను పొందడానికి ఈ పెట్టుబడులు సరిపోవని పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారొకరు చెప్పారు. అయితే మరిన్ని వివరాలతో తాజాగా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇంధనాలను రిటైల్‌గా విక్రయించే లెసైన్స్ పొందాలంటే ఏ కంపెనీ అయినా 50 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టాల్సి ఉండడం కానీ లేదా భవిష్యత్తులో పెట్టే ప్రతిపాదనలు కానీ ఉండాలని ఆయన వివరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన 21 చమురు బ్లాక్‌ల్లో 30 శాతం వాటా కొనుగోలుకు బీపీ 720 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెట్టిందని, అయితే ఈ పెట్టుబడిని మూలధన పెట్టుబడులుగా పరిగణించలేమని తెలిపారు. ఏటీఎఫ్ విక్రయ లెసైన్స్ పొందడం కోసం భవిష్యత్తు పెట్టుబడుల ప్రతిపాదనలతో తాజాగా బీపీ దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. -
గ్యాస్ ధర పెంచకుంటే పెట్టుబడులు నిలిచిపోతాయ్
న్యూఢిల్లీ: సవరించిన సహజ వాయువు ధరల అమల్లో జాప్యం వల్ల కృష్ణ-గోదావరి బేసిన్‌లోని కేజీ డీ6లో ప్రతిపాదిత రూ.24,000 కోట్ల పెట్టుబడులు నిలిచిపోతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పష్టం చేసింది. డీ34 క్షేత్రం అభివృద్ధికై ఫ్రంట్ ఎండ్ ఇంజనీరింగ్ డిజైన్‌ను పూర్తి చేసినట్టు తెలిపింది. నవంబరు నుంచి పనులు ప్రారంభించి, 2017లో గ్యాస్ ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో కావాల్సిన పరికరాలకు టెండర్లను ఆహ్వానించినట్టు పేర్కొంది. ‘రాబోయే రోజుల్లో సహజ వాయువు ధరపై స్పష్టత లేదు. ప్రస్తుత, భవిష్యత్ పెట్టుబడి ప్రణాళికలు సంకటంలో పడ్డాయి. దీని వల్ల లక్ష్యం మరో ఏడాది ఆలస్యం అవుతుంది’ అని రిలయన్స్ వెల్లడించింది. సవరించిన సహజ వాయువు ధరల అమల్లో జాప్యంపై రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థలు బీపీ, నికో రిసోర్సెస్‌లు భారత ప్రభుత్వానికి ఆర్బిట్రేషన్ (మధ్యవర్తిత్వ) నోటీసు జారీచేసిన సంగతి తెలిసిందే. కేజీ డీ6 క్షేత్రంలో ఉత్పత్తి అయ్యే గ్యాస్‌కు పెంచిన ధర ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాల్సి ఉంది. ఐదేళ్లపాటు మిలియన్ బ్రిటిష్ థర్మల్ యూనిట్లకు 4.205 డాలర్లు చెల్లించాలన్న ఒప్పందం గడువు ఇప్పటికే ముగిసింది. ఈలోగా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు కొత్త రేటు ప్రకటనను వాయిదావేయాలని ప్రభుత్వాన్ని ఎన్నికల సంఘం కోరింది. -
ఎన్సీడీపై నీలినీడలు
విజయనగరం ఆరోగ్యం, న్యూస్‌లైన్: అసంక్రమణ వ్యాధుల నివారణ కార్యక్రమం (ఎన్సీడీ)పై నీలినీడలు కమ్ముకున్నాయి. మంజూరై మూడేళ్లవుతున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. కనీసం సిబ్బందిని కూడా నియమించలేదు. జిల్లాకు 2010లో ఎన్సీడీ కార్యక్రమం మంజూరయింది. బీపీ, మధుమేహం, ఆస్తమా, ఊబకాయం వంటి రోగులకు సేవలు అందించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. అయితే కార్యక్రమం ప్రారంభించడంలో చూపించిన శ్రద్ధ ఆచరణలో చూపించలేదు. జిల్లాలో ఉన్న 12 సీహెచ్‌సీల్లో 12 ఎన్సీడీ క్లినిక్‌లు, కేంద్రాస్పత్రిలో 10 పడకల వార్డును ఏర్పాటు చేయాలి. నెల్లిమర్ల, బాడంగి, కురుపాం, ఎస్.కోట, గజపతినగరం, సాలూరు, పార్వతీపురం, భద్రగిరి, చీపురుపల్లి, జియ్యమ్మవలస, బొబ్బిలి, భోగాపురం సీహెచ్‌సీల్లో ఎన్సీడీ క్లినిక్‌లు ఏర్పాటు చేయాలి. అయితే క్లినిక్‌లకు గదులు కేటాయించారు కానీ అందులో పనిచేయడానికి సిబ్బంది లేరు. దీంతో అవి నిరుపయోగంగా మిగిలాయి. కేంద్రాస్పత్రిలో పది పడకల వార్డును కేటాయించారు. ఇక్కడ కూడా సిబ్బంది లేకపోవడంతో మూత పడింది. అదేవిధంగా క్లీనిక్‌లను పర్యవేక్షించడానికి జిల్లా మేనేజర్ కూడా నియమించలేదు. నోటిఫికేషన్ ఇచ్చి..... ఎన్సీడీ క్లినిక్‌లలో ఉద్యోగ నియామకాలకు సంబంధించి రెండు పర్యాయాలు నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే ఇంతవరకు నియూమకాలు చేపట్టలేదు. 2012లో జిల్లా స్థాయిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి నోటిఫికేషన్ ఇచ్చారు. 12 డేటా ఎంట్రీ ఆపరేటర్లు, 16 స్టాఫ్ నర్సులు, 12 కౌన్సిలర్లు, ఒక స్పెషలిస్టు వైద్యుడు, ఐదుగురు ఎంబీబీఎస్ వైద్యులు, లాజిస్టక్ ఆఫీసర్, లాజిస్టక్ ఆఫీసర్ అసిస్టెంట్ ఒకరు, 12 మంది ల్యాబ్ టెక్నీషయన్లు, 12 మంది వాచ్‌మన్ పోస్టులకు నోటి ఫికేషన్ ఇచ్చారు. వీటికి ఇంటర్వ్యూలు కూడా నిర్వహించారు. అయితే నియూమకాలను మాత్రం చేపట్టలేదు. తర్వాత జిల్లా స్థాయిలో నోటిఫికేషన్‌ను రద్దచేస్తున్నామని ప్రకటించి, తిరిగి 2013లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఎన్‌సీడీల్లో పనిచేయడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. దీంతో జిల్లా నుంచి సుమారు 500 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. నోటిఫికేషన్ ఇచ్చి ఎనిమిది నెలలవుతున్నా ప్రభుత్వం ఇంతవరకు ఇంటర్వ్యూలు నిర్వహించలేదు. ఎన్‌సీడీక్లినిక్‌లు ఉన్నప్పటి కీ వాటిలో పనిచేయడానికి వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో బీసీ, మధుమేహం, మూర్ఛ వంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి సేవలు నిలిచిపోయాయి. -
కేజీ-డీ6లో అదనంగా 10 బిలియన్ డాలర్ల పెట్టుబడి
న్యూఢిల్లీ: కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తిని మరింత పెంచే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్, దాని భాగస్వామ్య సంస్థ బ్రిటిష్ పెట్రోలియం(బీపీ) మరో 8-10 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేయనున్నాయి. శుక్రవారం జరిగిన సమావేశంలో బీపీ సీఈవో బాబ్ డడ్లీ, రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ మేరకు ప్రతిపాదించినట్లు చమురు శాఖ మంత్రి ఎం. వీరప్ప మొయిలీ తెలిపారు. అయితే, కేజీ-డీ6 క్షేత్రంలో ఉత్పత్తి తగ్గిపోవడానికి సంబంధించి పలు జరిమానాలు విధించడంపై వారు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆయన వివరించారు. గంట సేపు సాగిన ఈ సమావేశంలో.. గ్యాస్‌ను వెలికితీయకుండా కృత్రిమంగా తొక్కి పెట్టి ఉంచడం సాధ్యం కాదని, తమపై విధిస్తున్న జరిమానాలు ఒప్పందానికి విరుద్ధమని డడ్లీ, అంబానీ వివరించారు. అయితే, డీ6లో కొత్తగా ఉత్పత్తి చేసే గ్యాస్‌కి కొత్త ధరను వర్తింప చేసే అంశంపై కేబినెట్ కమిటీయే నిర్ణయం తీసుకోగలదని మొయిలీ వారికి తెలిపారు. ఆర్థిక మంత్రి పి. చిదంబరంతో కూడా డడ్లీ సమావేశమయ్యారు. కేజీ డీ6 బ్లాక్‌లో గ్యాస్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయినందున కేంద్రం 1.8 బిలియన్ డాలర్ల జరిమానా విధించడం తెలిసిందే. దీంతో పాటు ఉత్పత్తి క్షీణతకు కారణం తెలిసే దాకా కొత్తగా ఈ క్షేత్రంలో ఉత్పత్తయ్యే గ్యాస్‌కు కొత్త రేటు(యూనిట్‌కు 8.4 డాలర్లు) వర్తింపచేయబోమని కూడా స్పష్టం చేసింది. అయితే, బ్లాక్ సంక్లిష్టంగా ఉండటం వల్లే గ్యాస్ ఉత్ప త్తి తగ్గిపోయిందని, అధిక ధర కోసం తాము కృత్రిమంగా తగ్గించడం సాధ్యం కాదని రిలయన్స్, బీపీ చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే డడ్లీ, అంబానీలు కేంద్ర మంత్రులతో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.