‘ఆరోగ్యమే..మహాభాగ్యం’ ఈ భాగ్యాన్ని దక్కించుకునేందుకు అందరూ కష్టపడుతూ ఉంటారు. చక్కటి జీవనశైలి, సమతుల ఆహారం, ఒత్తిడి, ఆందోళన జీవితం కోసం ఆరాట పడతారు. అయితే మానవ శరీర ఆరోగ్యానికి కావాల్సిన ప్రామాణికాలు ఏంటి? ఈ విషయంలో పురుషులకు, స్త్రీలకు మధ్య తేడా ఉంటుందా?
మనిషి పల్స్ రేటు, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, ఊపిరి వేగం, బరువు ఈ ఐదింటిని ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంచి ఆరోగ్యం అనేది పూర్తి శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు స్థితి. ఆరోగ్యం అంటే బలమైన రోగనిరోధకశక్తి, ఆహారం, అరుగుదల, రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర, ఎలాంటి అనారోగ్యం, ఆందోళన, ఒత్తిడి, శారీరక బాధలు లేని ప్రశాంతమైన జీవితం. స్త్రీలైనా, పురుషులైనా ఏవో కొన్ని తప్ప దాదాపు ఇవే ప్రమాణికాలు వర్తిస్తాయి. అదే మహిళల్లో అదనంగా రుతు సమస్యలు, గర్భధారణ సమస్యలు లేకుండా ఉండటం కూడా చాలా కీలకం.
ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన వైద్య ప్రామాణికాలు
రక్తపోటు 120/80 ఉండాలి. పల్స్ 70-100 ఉండాలి. ఉష్ణోగ్రత 36.8-37 ఉండాలి.
శ్వాసక్రియ రేటు 12-16 ఉండాలి.
పురుషుల్లో హిమోగ్లోబిన్ 13.5-18 వరకు,
అదే స్త్రీలలో అయితే 11.50-16 ఉండాలి.
కొలెస్ట్రాల్ 130-200, పొటాషియం 3.5-5, సోడియం 135-145 ఉండాలి.
ట్రై గ్లిజరైడ్స్ 220 లోపు ఉండాలి. శరీరంలో రక్తం పరిమాణం 5-6 లీటర్లు ఉండాలి.
షుగర్ తినక ముందు పిల్లలకు 70-130, పెద్దలకు 70-110 మధ్య ఉండాలి.
ఐరన్ 8-15 మి.గ్రా. ఉండాలి.
తెల్ల రక్త కణాలు 4000-11000, ప్లేట్లెట్స్ 1.50 లక్షల నుంచి 4 లక్షలు
ఎర్ర రక్త కణాలు 4.5 - 6 మిలియన్లు ఉండాలి.
క్యాల్షియం 8.6-10.3, విటమిన్ డీ-3 స్థాయి 20-511, విటమిన్ బి12 లెవల్స్ 200-900 వరకు ఉండాలి.
Comments
Please login to add a commentAdd a comment