human body
-
అన్నేసి గంటలు పనిచేస్తే జరిగేది ఇదే!
భారత్‌లో పనిగంటల అంశం మరోసారి చర్చ తెర మీదకు వచ్చింది. ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం ఉద్యోగులు వారం మొత్తం మీద ఏకంగా 90 గంటలు పని చేయాల్సిందేనంటూ వ్యాఖ్యానించడం ఇందుకు కారణం. మొన్నీమధ్యే ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు నారాయణమూర్తి 70 గంటలు పని చేయాలంటూ పిలుపు ఇవ్వడం తెలిసిందే. అయితే సుబ్రహ్మణ్యం ‘అంతకుమించి’ స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇప్పుడు సెలబ్రిటీలు సైతం మండిపడుతున్నారు. ఈ దరిమిలా వీళ్లిద్దరి గురించి నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. అయితే.. ఇంతకీ 70.. 90.. మనిషి శరీరం ఒక వారంలో అసలు ఎన్నేసి పనిగంటలను చేయగలదు?. ఏ మేర పని ఒత్తిడిని ఒక ఉద్యోగి భరించగలరు?. అలా గనుక పని చేస్తే.. శరీరంలో కలిగే మార్పులేంటి?. ఈ విషయంలో అసలు వైద్యులు ఏం చెబుతున్నారు?.. బిజినెస్ టైకూన్లు చెబుతున్న అంతటి పని భారం ఉద్యోగి మోయ తరమేనా?.. వారంలో 90 గంటలపని.. అంటే ఏడు రోజులపాటు 13 గంటల చొప్పున పని చేయాలన్నమాట. మిగిలిన 11 గంటల్లోనే నిద్ర, ఇతర పనులు, ప్రయాణాలు, ఆఖరికి కుటుంబ సభ్యులతో గడపడం లాంటి వాటితో సర్దుకుపోవాలన్నమాట. అయితే ఇది శారీరకంగానేకాదు.. మానసికంగానూ మనిషిపై ప్రతికూల ప్రభావం చూపెడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయం ప్రకారం.. వారంలో 55 గంటలకు మించి గనుక పని చేస్తే గుండె జబ్బుల బారినపడే అవకాశం ఉంటుందట. అలా పనిచేసే ఉద్యోగుల్లో వందలో 35 మంది స్ట్రోక్ బారినపడే అవకాశం ఉంది. వందలో 17 మంది ప్రాణమే పొగొట్టుకునే అవకాశం ఉంది అని ఆ స్టడీ వెల్లడించింది. ‘‘ఎక్కువసేపు పని చేయడమంటే గుండె మీద ఒత్తిడి పెంచడమే. దీనివల్ల కోర్టిసోల్, అడ్రినలిన్ హార్మోన్లపై ప్రభావం పడుతుంది. తద్వారా బీపీ, గుండె కొట్టుకునే వేగంలో మార్పులొస్తాయి. అలా హార్ట్ స్ట్రోక్, హార్ట్ ఎటాక్‌తో పాటు హార్ట్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వారానికి 40 గంటల కంటే ఎక్కువ పని చేయడం వల్ల.. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాలు గట్టిపడడమో లేదంటే కుంచిచుపోతాయి’’ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: భారత్ బాగుండాలంటే.. ఉద్యోగుల పని గంటలు తగ్గాల్సిందే!.. ఇక ఎక్కువ గంటలు పని చేయడం డయాబెటిస్‌కు దారి తీసే అవకాశం లేకపోలేదు. ఇది రక్తంలో షుగర్ స్థాయిపై అనేక రకాలుగా ప్రభావం చూపెడుతుంది. మహిళలు 45 గంటలకంటే ఎక్కువసేపు పని చేసినా.. పురుషులు 53 గంటలకు మించి పని చేసినా షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువని పలు అధ్యయనాలు తెలిపాయి కూడా. ఇక చాలాసేపు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయి పెరుగుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి కూడా. ఇది ఒబెసిటీ(స్థూలకాయం)కి దారి తీయొచ్చు. అన్నింటికి మించి.. విపరీతమైన పనిభారం మానసిక ఆరోగ్యాన్ని కుంగదీస్తుంది. ఇది బంధాలకు బీటలు తెచ్చే ప్రమాదం లేకపోలేదు. అందుకే.. విశ్రాంతి లేకుండా శరీరానికి పని చెప్పడం ఎంతమాత్రం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. జీరో రెస్ట్ వర్క్.. నిద్రాహారాలను నిర్లక్ష్యం చేయిస్తుంది. పని ఒత్తిడి వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అంతిమంగా.. అనారోగ్యకరమైన జీవనశైలి వైపునకు అడుగులు వేయిస్తుందని అంటున్నారు. భారతీయుల్లో ఇప్పటికే గుండె జబ్బులు, డయాబెటిస్‌లాంటి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్న వాళ్ల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో అధిక పని గంటల నిర్ణయాలతో పరిస్థితి మరింత ముదిరే అవకాశం ఉంటుంది అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.ఇదీ చదవండి: వారానికి మొత్తం 40 గంటలే పని ఉండాలి!ఇన్ఫోసిస్ మూర్తి(78) ఏమన్నారంటే..ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఉత్పాదకత తక్కువ. అందుకే దేశ యువత మరిన్ని గంటలు అధికంగా శ్రమించాలి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ వంటి దేశాలు ఎలాగైతే కష్టపడ్డాయో.. మనమూ అలా శ్రమించాలి. అభివృద్ధి చెందిన దేశాలతో పోటీ పడాలంటే భారత్‌లోని యువత వారానికి 70 గంటల పాటు పనిచేయాలి.తన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శల నేపథ్యంలో మరోసారి ఆయన స్పందిస్తూ..ఇన్ఫోసిస్(Infosys)ను మేం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ కంపెనీలతో పోలుస్తాం. అలా పోల్చుకున్నప్పుడే భారతీయులు చేయాల్సింది చాలా ఉందనిపిస్తుంది. మన దేశంలో ఇంకా 80కోట్ల మంది ఉచిత రేషన్ అందుకుంటున్నారు. అంటే ఆ 80 కోట్ల మంది ఇంకా పేదరికంలో ఉన్నట్లే కదా..! అందుకే మన ఆశలు, ఆకాంక్షలను ఉన్నతంగా ఉంచుకోవాలి. వారానికి 70 గంటలు పని చేయలేకపోతే మనం ఈ పేదరికాన్ని ఎలా అధిగమించగలం? మనం కష్టపడి పనిచేసే స్థితిలో లేకపోతే ఇంకెవరు పనిచేస్తారు?.ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యం(64) ఏమన్నారంటే..ఆదివారాలు మీతో పనిచేయించలేకపోతున్నందుకు చింతిస్తున్నాను. మీతో అలా పనిచేయించగలిగితే.. నాకు సంతోషం. ఎందుకంటే నేను ఆదివారాలు పనిచేస్తున్నాను. అయినా ఇంట్లో కూర్చుని ఏం చేస్తారు. ఎంతకాలం అలా భార్యను చూస్తూ ఉండిపోతారు. ఇంట్లో తక్కువ సమయం, ఆఫీసులో ఎక్కువ సమయం ఉంటామని భార్యలకు చెప్పాలి. వారానికి 90 గంటలు పని చేయాలి. అందుకోసం ఆదివారం సెలవులనూ వదిలేయాలి. ఇదీ చదవండి: 104 రోజులు ఏకధాటిగా పని.. అనారోగ్యంతో వ్యక్తి మృతి -
మనిషి చనిపోయాక ఏమవుతుంది? కీలక విషయాలు చెప్పిన సీనియర్ నర్సు
మనిషి మరణించిన తరువాత ఏం జరుగుతుంది? ఆత్మలున్నాయా? ఇలాంటి సందేహాలు సాధారణంగా చాలా మందికి వస్తాయి కదా. దీనిపై పురాణాల్లో ప్రస్తావనలు, సైన్స్ రచనల్లో కొన్ని కీలక విషయాలు న్నప్పటికీ అమెరికాకు చెందిన సీనియర్ నర్సు కొన్ని విషయాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. తన కెరీర్లో అనేక మరణాలను చూసిన ఆమె, మరణం చుట్టూ కొన్ని అపోహలు, భయాల్ని తొలగించాలనే లక్ష్యంతో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఏమి జరుగుతుందనే దానిపై వెలుగులోకి తెచ్చిన అంశాలు నెట్టింట ఆసక్తికరంగా మారాయి.ఇంటెన్సివ్ కేర్‌లో విస్తృతమైన అనుభవం ఉన్న నర్సు జూలీ మెక్‌ఫాడెన్, మరణం తర్వాత సంభవించే శారీరక మార్పులపై కొన్ని విషయాలను తాజాగా వివరించింది. చనిపోవడం గురించిన సాధారణ ప్రశ్నలకు సమాధానాలిచ్చే ఉద్దేశంతో ఈమె ఒక యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే మరణం తరువాత ఏమి జరుగుతుందనే అంశంపై చేసిన వీడియో వైరల్‌గా మారింది. ఇది ఆరు లక్షలకు పైగా వ్యూస్‌ను సాధించింది.నర్స్ జూలీ అందించిన వివరాల ప్రకారం, మరణించిన వెంటనే శరీరం 'రిలాక్స్' అవుతుంది. సహజమైన రిలాక్సేషన్ ప్రక్రియకు లోనవుతుంది. మరణం తరువాత శరీరం కుళ్లిపోవడంలో ఇదే మొదటి దశ, దీనిని హైపోస్టాసిస్ అంటారు. అందుకే కొంత మందికి మూత్ర విసర్జన, ప్రేగు కదలికలు ఉండవచ్చు లేదా ముక్కు, కళ్ళు లేదా చెవుల నుండి ద్రవాలు స్రవిస్తాయి. ఆ తరువాత అన్ని కండరాలు, వ్యవస్థలు రిలాక్స్ అయిపోతాయి. శరీర ఉష్ణోగ్రత పడిపోతుందిమరణం తర్వాత ఒక్కో శరీర స్పందన భిన్నంగా ఉంటుంది. అల్గోర్ మోర్టిస్ అనే శీతలీకరణ ప్రక్రియ కొందరికి వెంటనే ప్రారంభం అవుతుంది. మరికొందరిలో ఒకటి లేదా రెండు గంటలదాకా ఆలస్యం కావచ్చు. ఈ ప్రక్రియలో సగటున, శరీర ఉష్ణోగ్రత గంటకు 1.5 డిగ్రీలు పడిపోతుంది.ఎవరికీ తెలియని విషయంనర్స్ జూలీ ప్రకారం, శరీరంలోని గురుత్వాకర్షణ కారణంగా రక్తం కింది వైపు కదలడం ప్రారంభమవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. దీన్నే లివర్ మోర్టిస్ అంటారు. అలాగే సాధారణంగా మన ఆప్తులు చనిపోయిన తరువాత చాలాసేపు బాడీని ఇంట్లో ఉంచుకుంటాం. అపుడు వారి బాడీ తిప్పి చూసినా, పాదాలను గమనించినా మొత్తం ఊదారంగు లేదా నల్లగా మారిపోతుంది. దీనికి కారణం రక్తం కిందికి ప్రవహించడమే.శరీరం గట్టిపడుతుందిజీవక్రియ ప్రక్రియల ఆగిపోవడం వల్ల కండరాలు గట్టిపడతాయి. ఇది (రిగర్ మోర్టిస్) సాధారణంగా పోస్ట్‌మార్టం తర్వాత 2-4 గంటలలోపు ప్రారంభమవుతుంది. అయితే ఇది వివిధ భౌతికఅంశాలపై ఆధారపడి 72 గంటల వరకు కూడా సమయం పట్టవచ్చు. శరీరం బరువెక్కిపోతుంది.బాడీ చల్లగా అయిపోతుంది దాదాపు 12 గంటల తర్వాత, జీవక్రియ ఆగిపోవడంతో ఉష్ణోగ్రత నియంత్రణ ఆగిపోతుంది. వైటల్ ఎనర్జీ ప్రొడక్షన్ ఆగిపోతుంది. దీంతో బాడీ చల్లగా అయిపోతుంది. కుళ్ళిపోవడంలో చివరి దశ మొదలైనట్టు అన్నమాట. కుళ్ళిపోవడం అనేది ఒక సాధారణ భాగం. అయితే ఈ ప్రక్రియ మొదలు కాకముందే అంత్యక్రియలు జరిగిపోతాయి కాబట్టి చాలా అరుదుగా ఈ విషయాన్ని మనం గమనిస్తాం అని నర్స్ జూలీ వెల్లడించింది. -
శరీర ధర్మం
మానవ ధర్మంగా తగినంత ప్రయత్నం చేయకుండా, ఫలాన్ని గురించి ఆలోచించడం వివేకంతో కూడుకున్న పని కాదు. మానకుండా మానవ ప్రయత్నం కొనసాగిస్తూ ఉంటే, ఆ ప్రయత్నానికి సరైన సమయంలో దైవం అందించే సహకారం తోడవుతుంది. ‘దేవుడిస్తాడులే!’ అనుకుంటూ ఏరోజు కారోజు, ఏవిధమైన ప్రయత్నమూ చేయ కుండా, ఇంట్లో కూర్చుంటే ఎవరికైనా సంపద ఎలా చేకూరుతుంది? పళ్ళెంలో వడ్డించివున్న పంచభక్ష్య పరమాణ్ణాలు, ఎవరికైనా గాని తింటేనే కదా కడుపులోకి వెళ్ళేది! తినే ప్రయత్నం కూడా చేయకపోతే కడుపెలా నిండుతుంది? ఆక లెలా తీరుతుంది? అందువల్ల సారాంశంగా తేలేది ఏమిటంటే మనిషి కోరకుండా దేవుడు ఇవ్వడం కూడా సంభవం కాదు. ఆకలితో ఉన్న బిడ్డడు, ఆ విషయాన్ని తల్లికి చెప్పి అడగనిదే అమ్మయినా పెట్టలేదు. ఇంట్లో అన్ని రకాల దినుసులు పుష్కలంగా ముందు నుండీ ఉంటాయి. కాని, వండి వార్చకుండా భోజనానికి వీలయ్యే పదార్థాలుగా అవి మార్పు చెందవు కదా! ఈ విషయాన్నే గట్టుప్రభువు తన ‘కుచేలోపా ఖ్యానం’ కావ్యం, ప్రథమాశ్వాసంలోని ఈ కింది పద్యం ద్వారా చెప్పాడు. కం. కావున మనుజుడు సేయక దేవుండీయంగ లేడు తెగి యేమియు నా నావిధ ధాన్యము లుండిన వావిరి వండకయె రిత్త వంటక మగునే. శ్రమించడం శరీర ధర్మం అని చెప్పడం పై పద్యంలోని మాటల ముఖ్యోద్దేశం. ఆ శరీర ధర్మాన్ని పాటించే వ్యక్తికే దైవ సహాయమైనా ,అంతకంటే ముందు ఆ కష్టాన్ని ప్రత్యక్షంగాతన కళ్ళతో చూసి స్పందించే తోటి మనిషి సహాయమైనా అందుతుంది తప్ప ఆ ఉత్తమ ధర్మాన్ని పాటించని వ్యక్తులకు కాదని తెలుసు కోవాలి.– భట్టు వెంకటరావు -
health: ఒంట్లో వేడి ఆవిర్లు తగ్గాలంటే ఏం చేయాలి?
నాకు నెలసరి ఆగి రెండేళ్లవుతోంది. ఇప్పటికీ మూడ్ స్వింగ్స్, ఒంట్లో వేడి ఆవిర్లతో సఫర్ అవుతున్నాను. వెజైనల్ ఇచ్చింగ్ కూడా సివియర్‌గా ఉంది. నేను వర్కింగ్ ఉమన్‌ని అవడం వల్ల వీటితో చాలా ఇబ్బంది పడుతున్నాను. పరిష్కారానికి డాక్టర్ని కలవడం తప్పనిసరి అంటారా? – రాజేశ్వరి, జగ్గంపేటశరీరంలో వచ్చే మెనోపాజ్ మార్పులను తొందరగా గుర్తించి, ట్రీట్మెంట్ మొదలుపెడితే ఇంత ఇబ్బంది ఉండదు. దీని మీద ఇప్పుడు అందరికీ అవగాహన పెరిగింది. ప్రీ మెనోపాజ్ వచ్చినవారు కూడా ఈ దశను దాటి హ్యాపీగా ఉంటున్నారు. మెనోపాజ్ టైమ్‌లో శారీరకంగా, మానసికంగా, సెక్సువల్‌గా మార్పులు చాలా ఉంటాయి. మీరు వర్కింగ్ ఉమన్ కాబట్టి ఆ మార్పులను ఎదుర్కొంటూ నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయడం చాలా కష్టం. మీరే కాదు చాలామంది ఇలాంటి సమస్యలను గుంభనంగా భరిస్తూ ఉంటారు. డాక్టర్ని సంప్రదించడానికి ఇబ్బందిపడుతుంటారు.కానీ ఈ ప్రాబ్లమ్స్‌కి వీలైనంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మెనోపాజ్ దశ దాటిన తరువాత ఓవరీస్ పనిచేయవు. అందువల్ల ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. దీనివల్ల వెజైనా ప్రాంతం పొడిబారిపోతుంది. ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది. తరచూ ఇన్ఫెక్షన్ల బారినపడతారు. 50 శాతం మందిలో ఈ మార్పు కొన్నేళ్లపాటు కొనసాగుతుంది. యూరిన్, యూటరస్, వెజైనల్ స్వాబ్స్ తీసి ఇన్ఫెక్షన్ ఉందేమో చూడాలి. ఇప్పుడు ఇలాంటి వాటినే ట్రీట్ చేయడానికి ప్రత్యేకంగా ‘మెనోపాజ్ క్లినిక్స్’ వచ్చాయి. ఇబ్బందిపడకుండా డాక్టర్ని సంప్రదిస్తే సమస్య త్వరగా నయమవుతుంది. -
రక్తం, గుండె..: ఈ వైద్య లెక్కల్ని ఎపుడైనా గమనించారా!
‘ఆరోగ్యమే..మహాభాగ్యం’ ఈ భాగ్యాన్ని దక్కించుకునేందుకు అందరూ కష్టపడుతూ ఉంటారు. చక్కటి జీవనశైలి, సమతుల ఆహారం, ఒత్తిడి, ఆందోళన జీవితం కోసం ఆరాట పడతారు. అయితే మానవ శరీర ఆరోగ్యానికి కావాల్సిన ప్రామాణికాలు ఏంటి? ఈ విషయంలో పురుషులకు, స్త్రీలకు మధ్య తేడా ఉంటుందా? మనిషి పల్స్ రేటు, రక్తపోటు, శరీర ఉష్ణోగ్రత, ఊపిరి వేగం, బరువు ఈ ఐదింటిని ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం మంచి ఆరోగ్యం అనేది పూర్తి శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు స్థితి. ఆరోగ్యం అంటే బలమైన రోగనిరోధకశక్తి, ఆహారం, అరుగుదల, రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర, ఎలాంటి అనారోగ్యం, ఆందోళన, ఒత్తిడి, శారీరక బాధలు లేని ప్రశాంతమైన జీవితం. స్త్రీలైనా, పురుషులైనా ఏవో కొన్ని తప్ప దాదాపు ఇవే ప్రమాణికాలు వర్తిస్తాయి. అదే మహిళల్లో అదనంగా రుతు సమస్యలు, గర్భధారణ సమస్యలు లేకుండా ఉండటం కూడా చాలా కీలకం.ప్రతి మనిషి జీవితంలో ముఖ్యమైన వైద్య ప్రామాణికాలురక్తపోటు 120/80 ఉండాలి. పల్స్ 70-100 ఉండాలి. ఉష్ణోగ్రత 36.8-37 ఉండాలి.శ్వాసక్రియ రేటు 12-16 ఉండాలి. పురుషుల్లో హిమోగ్లోబిన్ 13.5-18 వరకు, అదే స్త్రీలలో అయితే 11.50-16 ఉండాలి.కొలెస్ట్రాల్ 130-200, పొటాషియం 3.5-5, సోడియం 135-145 ఉండాలి.ట్రై గ్లిజరైడ్స్ 220 లోపు ఉండాలి. శరీరంలో రక్తం పరిమాణం 5-6 లీటర్లు ఉండాలి.షుగర్ తినక ముందు పిల్లలకు 70-130, పెద్దలకు 70-110 మధ్య ఉండాలి.ఐరన్ 8-15 మి.గ్రా. ఉండాలి.తెల్ల రక్త కణాలు 4000-11000, ప్లేట్లెట్స్ 1.50 లక్షల నుంచి 4 లక్షలుఎర్ర రక్త కణాలు 4.5 - 6 మిలియన్లు ఉండాలి.క్యాల్షియం 8.6-10.3, విటమిన్ డీ-3 స్థాయి 20-511, విటమిన్ బి12 లెవల్స్ 200-900 వరకు ఉండాలి. -
కిడ్నీలు జర భద్రం!
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాలు మానవ శరీరంలో చాలా కీలకమైన అవయవాలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరంలోని మిగతా అన్ని అవయవాలు సరిగ్గా ఉంటాయి. ఆరోగ్యంగా నాలుగు కాలాల పాటు జీవించగలడు. మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నట్టు తొలి దశలో అర్థం కాదు. ఎలాంటి లక్షణాలు కూడా బయటపడవు. దాదాపు 80 శాతంపైగా కిడ్నీలు పాడైన తర్వాతే చాలా మందికి అర్థం అవుతుంది. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. కొందరిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసిన రెండు మూడు వారాలకే మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను బయటకు వెళ్లిపోవు. దీంతో అవి కాస్తా విషపదార్థాలుగా మారి శరీరంలోని ఒక్కో అవయం దెబ్బతింటుంది. అలా ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. వారికి అదొక్కటే మార్గం.. కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి తాత్కాలికంగా, మరికొందరు పూర్తిగా కిడ్నీలు పాడైపోతాయి. డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం, ఇన్ఫెక్షన్లు, గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోవడం తదితర కారణాల వల్ల కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయవు. తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా డయాలసిస్ చేయాలి. అయితే శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌కు మాత్రం దీర్ఘకాలిక డయాలసిస్ ఒక్కటే మార్గం. డయాబెటిస్, బీపీ, ఆటోఇమ్యూన్ డిసీజ్, జన్యుపరమైన సమస్యల వల్ల మూత్రపిండాలు శాశ్వతంగా పాడవుతాయి. డయాలసిస్ అంటే ఏంటి? సాధారణంగా కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోస్తాయి. కిడ్నీలు 80 శాతం పాడయ్యే వరకు ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తాయి. అప్పటివరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అంతకుమించి పాడైతే మాత్రం కిడ్నీలు చేయాల్సిన పనులను చేయలేక మొరాయిస్తాయి. అలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇలాంటి వారికి డయాలసిస్ ప్రక్రియ వరప్రదాయిని అని చెప్పొచ్చు. డయాలసిస్ ప్రక్రియలో కిడ్నీలు చేయాల్సిన పనిని మెషీన్ సాయంతో రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగిస్తారు. హీమోడయాలసిస్ ప్రక్రియను వారానికి మూడు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు గంటల పాటు జరుగుతుంది. ఆలస్యమైతే ఏమవుతుంది? కిడ్నీలు పాడైన వారు నిరంతరం డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్ ఆలస్యమైతే రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మిగతా అవయవాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ విషయంలో కాస్త అలసత్వం వహించినా.. సమస్య మరింత జఠిలం కావచ్చు. కొద్ది రోజులు ఆగి చేయించుకుందామని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. మూత్రం సరిగ్గానే వస్తోందని, ఆరోగ్యం బాగానే ఉందని ఆలస్యం చేసినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. మూత్రపిండాలు మందకొడిగా పనిచేస్తాయి. నీటిని వడగట్టలేకపోవడంలో విఫలమవుతాయి. విషపదార్థాలు రక్తంలోనే ఉండిపోతాయి. కొన్నిసార్లు నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీనివల్ల ‘పల్మనరీ ఎడిమా’ అనే సమస్య ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు, ఆయాసం వస్తుంది. సమయానికి డయాలసిస్ చేయించుకునేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిస్టులా చేయించుకోవాల్సిందే.. డయాలసిస్ కన్నా ముందు ఫిస్టులా అనే ప్రక్రియ తప్పనిసరి. ఈ పద్ధతిలో చేయి పైన ధమని, సిరాను ఫిస్టులా అనే లావు పాటి సూది(క్యాథటీర్) ద్వారా కలుపుతారు. డయాలసిస్ ప్రక్రియ చేసే సమయంలో ఫిస్టులా లేకపోవడం వల్లే చాలా వరకు రోగి ప్రాణాపాయ స్థితిలో వెళ్లి.. చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాలసిస్ ముందు ఫిస్టులా వేయించుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు. నీరు తీసుకోకపోవడం వల్లే.. చాలావరకు కిడ్నీ సమస్యలు పరిశుభ్రమైన నీరు తీసుకోకపోవడం వల్ల వస్తుంటాయి. ముఖ్యంగా నీళ్లలో ఉండే పాదరసం, సీసం, ఫ్లోరిన్ వంటి లోహాలు కిడ్నీలను పాడు చేస్తాయి. పారిశ్రామిక వాడల్లో ఉండే వారు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలను గుర్తించవచ్చు. దీంతో సరైన సమయంలో చికిత్స తీసుకుని ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చు. సౌందర్య సాధనాల్లో ఉండే కెమికల్స్ కూడా కిడ్నీలు పాడయ్యేందుకు కారణం అవుతాయి.ఆహారం విషయంలో అపోహలొద్దు.. సాధారణంగా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వైద్యులు సూచించిన మేరకు సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. సరైన ఆహారం లేకపోతే ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు బలహీనమై సమస్య మరింత జఠిలమవుతుంది. అది ప్రాణాపాయస్థితికి కూడా దారి తీయొచ్చు. డయాలసిస్ ప్రక్రియ ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఎలాంటి భయం, అనుమానాలు, అపోహలు లేకుండా రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటే ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చని మూత్రపిండాల నిపుణులు చెబుతున్నారు.డయాబెటిస్, హైబీపీ కూడా కారణమే.. డయాబెటిస్ వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. డయాబెటిస్ సోకిన తర్వాత సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పదేళ్లలో కిడ్నీలు పాడవుతుంటాయి. 30– 40 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక అధిక రక్తపోటు ఉన్న వారిలో కూడా కిడ్నీలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ ఉన్న వారు కిడ్నీ సంబంధిత పరీక్షలు కచి్చతంగా చేయించుకోవాలి. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంశపారంపర్యంగా వస్తుంది. ప్రతి నలుగైదుగురిలో ఒకరిలో వస్తుంది. ఇంట్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే మిగిలిన వారు కూడా పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలు గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.పెయిన్ కిల్లర్స్ వల్ల.. చిన్న నొప్పి వచి్చనా ఇటీవల పెయిన్ కిల్లర్ మందులు వాడటం ఎక్కువైంది. అలాగే కడుపులో మంట తగ్గించే మందులు, యాంటీ బయాటిక్స్ వంటి మందులను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీల్లో రాళ్లు వస్తే సరైన చికిత్స తీసుకోకపోవడం, వాటిని తొలగించుకోకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీంతో కిడ్నీలు పాడైపోతాయి. 60 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ల వల్ల, పెయిన్ కిల్లర్ల, ఎసిడిటీ మందులు వాడకం వల్ల కిడ్నీలు చెడిపోతుంటాయి. కొందరిలో క్యాన్సర్ సోకిన వారిలో కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. మైలోమా, బోన్‌మ్యారో, ల్యుకేమియా కొన్ని రకాల క్యాన్సర్లు కిడ్నీ పరీక్షల ద్వారా కూడా తెలుస్తుంది.కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు పుట్టుకతోనే వస్తున్నాయి. కడుపులో ఉండగానే స్కానింగ్‌ల ద్వారా ఈ విషయాలను గుర్తిస్తున్నారు. కిడ్నీలు సరిగ్గా ఎదగకపోవడం, మూత్ర నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ఫిల్టర్లు పాడైపోవడం వల్ల చిన్న వయసులోనే డయాలసిస్ అవసరం పడుతోంది. ఈ పరిస్థితి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంటుంది. ఈ సమస్యలు ఉన్న పిల్లలు వాడే మందుల వల్ల కూడా సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. వీరి శరీరాల్లో రక్త నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల వారికి డయాలసిస్ ప్రక్రియ చేయడం కాస్త సంక్షిష్టంగా ఉంటుంది. యువతీ యువకుల్లో కిడ్నీలో రాళ్లు, అనవసరమైన మందులు వాడటం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి.అలసత్వం వద్దు.. డయాలసిస్ చేయించుకోవడంలో అస్సలు అలసత్వం వద్దు. వారానికి మూడుసార్లు కచి్చతంగా చేయించుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. రేపు, మాపు అంటూ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటే అందరూ పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీంతో ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవచ్చు. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉండేవారు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. సౌందర్య సాధనాల వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. – శ్రీభూషణ్ రాజు, నెఫ్రాలజీ విభాగం అధిపతి, నిమ్స్ -
దగ్గడంతో తొడ ఎముక విరిగిపోవడమా?..షాక్‌లో వైద్యులు!
కొంతమందికి పొడి దగ్గులా వచ్చి నాన్‌స్టాప్‌గా వస్తుంటుంది. దీంతో కొందరికి పక్కటెముకల్లో నొప్పి రావడం లేదా ఒక్కోసారి చిన్నగా విరగిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇవి కాస్త సున్నితమైన ఎముకలు కావడంతో చిన్న ప్రమాదానికి గురైన మొదటగా ఈ పక్కటెముకలకే చిన్నగా క్రాక్ రావడం లేదా విరగడం జరుగుతుంది. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం ఏకంగా దగ్గినందుకే శరీరంలో అత్యంత బలంగా ఉండే తొడ ఎముక విరిగిపోయింది. వైద్యులు సైతం ఈ కేసును చూసి షాక్‌కి గురయ్యారు. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఎక్కడ చోటు చేసుకుందంటే..చైనాకి చెందిన 35 ఏళ్ల వ్యక్తి దగ్గుతో బాధపుడుతున్న సమయంలో తొడ ఎముక ఫ్రాక్చర్‌కు గురయ్యాడు. ఈ తొడ ఎముక అనేది మానవ శరీరంలో అత్యంత గట్టి ఎముక. అలాంటి జస్ట్ దగ్గడం వల్లే ఇరిగిపోడం ఏంటని వైద్యులు ఆశ్చర్యపోయారు. 35 ఏళ్ల వ్యక్తి దగ్గిన తర్వాత నుంచి తోడ భాగం ఒక విధమైన తిమ్మిరితో కూడిన నొప్పితో బాధపడుతూ ఆస్పత్రికి చేరినట్లు వైద్యులు తెలిపార. బాధితుడు తొలుత ఈ విషయం గురించి చెప్పినప్పుడూ షాక్‌కి గురయ్యాం. అని అన్నారు. వెంటనే ఆ రోగిని తాము ఆర్థోపెడిక్స్ విభాగానికి పంపించి చెకప్ చేయగా..అతడి తొడ ఎముక ఫ్యాక్చరయ్యిందని చెప్పారు. అయితే ఇది పడటం వల్లన, ప్రమాదం వల్ల జరిగిన గాయం కాదని కూడా తేల్చారు. దీంతో దీన్ని అత్యంత అరుదైన కేసుగా భావించి..అసలు ఇలా జరగడానికి గల కారణాలపై అధ్యయనం చేయడం ప్రారంభించామని వైద్యులు తెలిపారు. అయితే అతడి నొప్పి తీవ్రతరం కావడంతో ఎక్స్‌రే వంటి వివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతని ఆరోగ్యపు అలవాట్లు గురించి కూడా ఆరా తీశారు వైద్యులు. ఎందుకంటే అతడు వయసు పరంగా చిన్న వ్యక్తి కానీ ఎక్స్‌రే తీసినప్పుడూ ఎముకలు ఏకంగా 80 ఏళ్ల వ్యక్తి మాదిరిగా ఎముకలు ఉండటంతో అతని జీవనశైలిపై దృష్టిసారించారు వైద్యులు. అదీగాక ఇంతవరకు ఎలాంటి ఎముకల వ్యాధులతో కూడా బాధపడని వైద్య చరిత్ర కూడా ఆ వ్యక్తికి లేదు. ఐతే అతని జీవనశైలి సంక్రమంగా లేదని వైద్యులు తేల్చి చెప్పారు. మంచినీళ్లు తాగే అలవాటు లేదని, ఎక్కువగా సోడాలు, డ్రింక్‌లతో లైఫ్‌స్టయిల్ ఉందని వైద్యలు చెప్పారు. కార్బోనేటేడ్ పానీయాలు ఎముకలను ప్రభావితం చేస్తాయా..?కార్బోనేటేడ్ పానీయాలు తాగడం వల్ల శరీరం కాల్షియంను గ్రహించకుండా చేస్తాయి. తద్వారా ఎముక సాంద్రతపై ఎఫెక్ట్ ఏర్పడతుంది. నిపుణులు అభిప్రాయం ప్రకారం..కార్బన్డయాక్సైడ్ వాయువుతో నింపిన డ్రింక్స్, సెల్ట్జర్వాటర్, ఫిజీ వాటర్ల వల్ల యాసిడ్‌కి గురువ్వుతాం. దీంతో పళ్లపై ఉండే ఎనామెల్ దెబ్బతినడం జరుగుతుంది. కోలా తాగేవారికి అయితే ఎముకలు దారుణంగా క్షీణతకు గురవ్వుతాయి. ఇది కాస్త బోలు ఎముకల వ్యాధికి దారితీస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది. నేషనల్ బోలు ఎముకల వ్యాధి ఫౌండేషన్ ప్రకారం..సగం కంటే ఎక్కువ మంది అమెరికన్లు ముఖ్యంగా రుతుక్రమం ఆగిపోయిన స్త్రీలకి బోలు ఎముకల వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. కోలా, పెప్సీల్లో ఉండే పాస్పోరిక్ యాసిడ్ కాల్షియాన్ని తటస్థం చేసేలా ప్రయత్నిస్తుంది. ఫలితంగా శరీరం ఆహరంలోని తగినంత కాల్షియం గ్రహించలేని స్థితికి చేరుకుని ఎముకలపై ప్రభావం ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల చిన్న వయసులోనే ఎముకలు పట్టుతప్పడం లేదా ఎముకలకు సంబధించిన వ్యాధుల బారిన పడతారని చెబుతున్నారు. (చదవండి: ఎవరీ మమతా దలాల్?..ఏకంగా షారూఖ్, సచిన్ కుమార్తెలకు..) -
ఉత్తరాదిన సూర్యుడి భగభగలు..మానవ శరీరంపై ప్రభావం ఎలా ఉంటుందంటే..
ఉత్తరాదిని ఎప్పుడూ లేని విధంగా ఉష్టోగ్రతలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఒక్క బుధవారం రోజునే ఉష్ణోగ్రతలు 50 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడం తీవ్ర కలకలం రేపింది. మొత్తం ఉత్తర భారతదేశం తీవ్ర వేడిగాలులతో అల్లాడిపోతోంది. దీంతో భారత వాతావరణ విభాగం(ఐఎండీ) ఈ అధిక ఉష్ణోగ్రతలు మానవ ఆరోగ్యానికి త్రీవమైన ప్రమాదాలను తెచ్చిపెతాయని హెచ్చరించింది. ముఖ్యంగా నీటి కొరతతో జనాభా అల్లాడిపోతుందని, ఇది ఢిల్లీ నివాసితులుకు అత్యంత సవాలుగా ఉంటుదని పేర్కొంది. ఈ వేడిని నివారించడం అనేది అసాధ్యమైనదైనప్పటికీ..ప్రమాదాలు, వాటి లక్షణాలపై అవగాహన ఏర్పరుచుకోవడం కీలకం. ఈ ప్రతికూల వాతారణంలో ఆరోగ్య ప్రభావాలను అర్థం చేసుకుని వాటికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం అనేది అత్యంత ముఖ్యం. అవేంటో చూద్దాం.వేడి అనేది సైలెంట్ కిల్లర్‌లా మనిషిని అతలాకుతలం చేసి మరణానికి దారితీసేలా చేస్తుంది. ఈ అధిక ఉష్ణోగ్రతలకు శరీరం ఎలా స్పందిస్తోందో చూద్దాం.విపరీతమైన వేడికి శరీరం స్పందించే తీరు..మానవ శరీరం చల్లగా ఉండటానికి రెండు ప్రధాన విధానాలను కలిగి ఉంటాయి. ఒకటి వాసోడైలేషన్, రెండు చెమట. వాసోడైలేషన్ చర్మం ఉపరితలం దగ్గర రక్తనాళాలను విస్తరించి వేడిని తప్పించుకునేలా అనుమతిస్తుంది. ఇక చెమట..శరీరం వేడికి ఉక్కిపోయి.. చెమట రూపంలో శరీరాన్ని చల్లబరుస్తుంది. దీని వల్ల కండరాల పనితీరుకు ముఖ్యమైన లవణాలు కూడా చెమట రూపంలో బయటకి వెళ్లిపోతాయి. దీంతో నిర్జలీకరణం, ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారితీసి వేడి సంబంధిత అనారోగ్యానికి గురవ్వుతారు.వేడి కారణంగా వచ్చే తిమ్మర్లు:వేడి కారణంగా కాళ్లు, పొత్తికడుపులో ఒక విధమైన తిమ్మిర్లు వస్తాయి. దీనికి కారణం.. శరీరంలో వేగంగా ద్రవాలు , ఎలక్ట్రోలైట్లను కోల్పోవడం వల్ల ఇది సంభవిస్తుంది. వేడి కారణంగా వచ్చే అలసట:ఉష్ణోగ్రత పెరగడంతో త్వరిగతిన ప్రజలు అలసటకు గురవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా విపరీతమైన చెమటలు పట్టి, ఈ చెమట రూపంలో ముఖ్యమైన లవణాలు కోల్పోవడంతో స్ప్రుహ కోల్పోవడం, వికారం, తలనొప్పి, పల్స్ వేగవంతమవ్వడం జరుగుతుంది. దీని కారణం శరీరం చల్లబడటానికి టైం తీసుకుంటుంది. ఈ క్రమంలో ఒక్కోసారి హృదయ స్పందన రేటు పడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ:ఇది అత్యంత తీవ్రమైన వేడి సంబంధిత అనారోగ్యం. చికిత్స చేయకండా వదిలేస్తే ప్రాణాంతకంగా మారుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రతకు గురైతే శరీరంలోని శీతలీకరణ విధానాలు విఫలమవుతాయి. చెమట పట్టడం ఆగిపోయి, పొడిగా మారుతుంది. శ్వాస నిస్సారమైన అస్పష్టమైన మాటలు, మూర్చలకు దారితీస్తుంది. ఒక్కోసారి తీమ్రైన సందర్భాల్లో కోమా లేదా మరణం సంభవించవచ్చు. ఇలా వడదెబ్బకు గురైన వారిలో మొదట వైఫల్యం చెందే అవయవం మూత్రపిండాలు. ఇవి రక్తం నుంచి మలినాలను తొలగించలేని స్థితికి చేరుకుంటాయి. అందువల్ల వడదెబ్బకు గురైన వారిని సంరక్షించేలా తగు జాగ్ర త్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..ఎండలు దంచికొడుతున్నప్పుడూ పుష్కలంగా నీరు తాగడం, ఎలక్ట్రోలైట్ అధికంగా ఉండే పానీయాలు తాగడం, హైడ్రేటెడ్‌గా ఉండటం చాలా ముఖ్యం. కఠినమైన కార్యకలాపాలకు దూరంగా ఉండండి. వదులుగా ఉండే దుస్తులు ధరించండి. సాధ్యమైనప్పుడల్లా ఎయిర్ కండిషన్డ్ ప్రదేశాల్లో ఉండేందుకు ప్రయత్నించండి. వేడి అనారోగ్యానికి సంబంధించిన సంకేతాలు వస్తే వెంటనే చర్యలు తీసుకోండి. బయటకు వెళ్లక తప్పదనుకున్నప్పుడూ.. వేడి తక్కువగా ఉండే ఉదయ, సాయంత్రాల్లో పనులు పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసుకోవడం, వేడికి గురికాకుండా ఉండేలా ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వంటివి చేయాలి.(చదవండి: వయసు 74 ఏళ్లు, చూస్తే..పదహారణాల పడుచు పిల్లలా ఏముందంటే..!) -
మానవ అవయవాల గురించి తెలుసుకోవాలంటే?ఈ మ్యూజియంకు వెళ్లాల్సిందే!
ఇంతవరకు ఎన్నో రకాల మ్యూజియంలను చూసుంటారు. ఆర్ట్‌కి సంబంధించి, డిఫెరెంట్ ఫోటోలు, లేదా పురాతన వస్తువులు, మమ్మీలు, కొన్ని రకాల వజ్రాలు తదితర విభిన్న మ్యూజియంలు గురించి మాత్రమే విన్నాం. కానీ ఇది అన్నింటికంటే విభిన్నమైన మానవ శరీర అవయవాలకు సంబంధించిన మ్యూజియం. మనిషి శరీరంలోని అవయవాల గురించి సబ్జెక్ట్ పరంగానో వైద్యుల ద్వారానో విని ఉంటాం. కానీ వాటి పనితీరుని ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఈ మ్యూజియంకు వెళ్లాల్సిందే. ఇందులో మానవుని తల నుంచి కాలి వరకు ఉన్న అంతర్గత అవయవాల పనితీరుని నేరుగా చూడొచ్చు తెలుసుకోవచ్చు. ఇది నిజంగా మంచి థ్రిల్లింగ్ ఫీల్‌ని కలుగజేసే మ్యూజియం అనే చెప్పాలి. ఇది ఎక్కడ ఉంది? ఆ మ్యూజియం ఎప్పుడు ఏర్పాటు చేశారు? తదితర విశేషాల గురించే ఈ కథనం.! ఈ అసాధారణ మ్యూజియం నెదర్లాండ్స్‌లోని లైడెన్ నగరంలో ఉంది. ఆ మ్యూజియం భవనంలో మొదట సుమారు 35 మీటర్ల పొడవైన ఉక్కు కొలోసన్(మనిషి విగ్రహం) ఉండగా, మరోవైపు ఏడు అంతస్తుల భవనం కనిపిస్తుంది. ఈ మ్యూజియం ఎంట్రీ టికెట్ పెద్దలకు సుమారు రూ. 1300/- వరకు ఉంటుంది. చిన్నపిల్లలు అయితే ఆరేళ్లు దాటిని వారికే అనుమతి ఉంటుంది. ఈ మ్యూజియం సైన్స్ పట్ల తెలియకుండానే ఆసక్తి పెరిగేలే చేస్తుంది. నెదర్లాండ్స్‌లో ఉన్న ఈ మ్యూజియం ప్రపంచంలోనే తొలి ఇంటరాక్టివ్ మ్యూజియం అఫ్ హ్యూమన్ బయాలజీ. మానవుని లోపల అవయవాల పనితీరుని విజ్యువల్గా చూడొచ్చు. మీకు వాటి గురించి అర్థమయ్యేలా వివరించేలా వివిధ భాషల్లో గైడ్ చేసే ఆడియాలు కూడా ఉంటాయి. మీరు ఎంట్రీకి ముందే మీకు నచ్చిన భాషను ఎంచుకోవాలి. మీరు ఏ ఫ్లోర్లో ఏ గదికి వెళ్తారో.. అక్కడ ఆ గదికి ఎంట్రవ్వగానే ఆ భాష ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. మొట్టమొదటగా చర్మంతో మొదలై.. కాలి వరకు ప్రతి భాగాన్ని సందర్శిస్తూ వెళ్తాం. మనం ఆయా రూంలకు సమీపించగానే ఆ గదిలోని అవయవం నిలబడి వివరిస్తున్నట్లు అనిపిస్తుంది. మన శరరీంలోని ఈ భాగం పని ఇదా? అని ఒకరకమైన ఫీల్ కలుగుతుంటుంది. ముఖ్యంగా మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. కొన్ని వ్యవస్థల పనితీరు చూసేందకు త్రీ డీ గ్లాస్లు ఉపయోగించాల్సి ఉంటుంది. ఆఖరికి రక్తం సరఫరా అయ్యే విధానం కూడా ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులు ఆక్సిజన్ తీసుకోగానే రక్తం ఎలా కదులుతుందో కళ్లకు కట్టినట్లు కనిపించడమే కాదు ఆడియోలో వివరిస్తారు కూడా. ఇలా.. అన్నవాహిక, గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, కండరాలు, ఎముకలు, కళ్లు ,చెవులు, ఇతర అంతర్గత అన్ని అవయవాలను చూడొచ్చు. అలాగే శరీరానికి ఏదైన గాయం అయ్యితే కనిపించే మార్పులు కూడా చూపిస్తుంది. వైద్యులుగా ట్రైయిన్ అయితే చూసే వాటన్నింటిని మనం కూడా నేరుగా చూడటమే గాక తాకడం, తెలుసుకోవడం వంటివన్నీ చేస్తాం ఈ మ్యూజియంలో. ఇక్కడ ఉన్న ఇంకో సదుపాయం ఏంటంటే..ముందుగానే మీ పేరు, పుట్టిన తేది తదితరాలు నోట్ చేస్తారు కాబట్టి మ్యూజియం జర్నీ ముగియగానే మీ అంతర్గత వ్యవస్థ గురించి కూడా వివరించి మరీ రిపోర్ట్ అందజేస్తారు నిర్వాహకులు. కాగా, ఈ మ్యూజియాన్ని మార్చి 14, 2008న అప్పటి ఇంగ్లాండ్ రాణి బీట్రిక్స్ ప్రారంభించారు. ఈ మ్యూజియం నిర్మాణం 2006 చివరిలో ప్రారంభమైంది. దీన్ని సుమారు 27 మిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించారు. ఈ మ్యూజియం ప్రపంచంలోని అత్యంత ప్రత్యేకమైన మ్యూజియంలలో ఒకటి. ఈ మ్యూజియంని నిర్వాహకులు దీన్ని సందర్శించే వ్యక్తులు వారి శరీర నిర్మాణం, సంబంధిత సమస్యల గురించి క్లియర్‌గా తెలుసుకుంటారు కాబట్టి వారి ఆరోగ్యాన్ని ఎలా సంరక్షించుకోవాలి అనే దానిపై అవగాహనే గాక ఒక గొప్ప పరిజ్ఞానాన్ని కూడా పొందుతారని అన్నారు.. (చదవండి: ఇదేం స్టయిలిష్ కాస్ట్యూమ్! కానీ ధర వింటే షాకవ్వడం ఖాయం!) -
కట్టేసుకుంటే చాలు, నొప్పిని ఇట్టే మాయం చేసే గాడ్జెట్.. అదెలా పనిచేస్తుందంటే
ఆటలాడేటప్పుడో, చిన్నా చితకా ప్రమాదాల్లోనో గాయాలు తగలడం సహజం. కొన్నిసార్లు కండరాలు వాచిపోయేలా, ఎముకల వరకు నొప్పి పాకేలా దెబ్బలు తాకుతుంటాయి. ఇంకొన్నిసార్లు కాళ్లు చేతులు బెణుకుతుంటాయి. నెత్తురు కనిపించని ఇలాంటి దెబ్బలు తగిలినప్పుడు ఉపశమనం కోసం కాపడం పెట్టడం, మంచుముక్కలను రుద్దడం వంటివి చేస్తుంటాయి. ఈ చర్యలు కొంత ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఫొటోలో కనిపిస్తున్న పరికరాన్ని నొప్పి ఉన్న చోట కట్టేసుకుంటే ఇట్టే నొప్పిని మాయం చేసేస్తుంది. నడుము, భుజాలు, తొడలు, మోకాళ్లు– ఇలా ఎక్కడైనా కట్టుకునేందుకు వీలుగా ఉండే బెల్ట్ వల్ల దీనిని ఉపయోగించుకోవడం చాలా తేలిక. ఇది కాపడంలోని వెచ్చదనాన్నీ, మంచుముక్కల్లోని చల్లదనాన్నీ అందించగలదు. వెచ్చదనం కోసం ఒక స్విచ్, చల్లదనం కోసం మరో స్విచ్ ఇందులో ఉంటాయి. కోరుకున్న రీతిలో వీటిని ఎంపిక చేసుకుని, టెంపరేచర్‌ను అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. దీనిని వాడటం వల్ల నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఇది రీచార్జబుల్ బ్యాటరీ సాయంతో పనిచేస్తుంది. అమెరికన్ కంపెనీ ‘థెరాబాడీ’ ఈ పరికరాన్ని ‘రికవరీ థెర్మ్‌క్యూబ్’ పేరుతో ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 149 డాలర్లు (రూ.12,402) మాత్రమే! -
మనసుకి వ్యాయామం
శరీరానికి సంబంధించి ఆహారంతో పాటు వ్యాయామం గురించి చాలామంది చెప్పటం, ఎంతోమంది అనుసరించటం గమనించవచ్చు. కాని, మనస్సు గురించి కొద్దిమంది వైద్యులు చెప్పినా పట్టించుకున్నవారి సంఖ్య అత్యల్పం. మనోవ్యాపారం జరిగేది మెదడులో. దానిని వాడక మూలన పడేస్తే అది మొద్దుబారిపోతుంది. అందుకే చాలామందికి మతిమరుపు వస్తూ ఉంటుంది. వయసు పైబడితే అది సహజం అనుకుంటారు. శరీరం చక్కగా ఉండాలని మందులు, అలంకారాలు చేసుకున్నప్పుడు మెదడుకి కూడా చేయాలని మర్చిపోతూ ఉంటారు. పైగా ఇంత వయసు వచ్చాక పరీక్షలు రాయాలా? ఉద్యోగాలు చేయాలా? ఊళ్లేలా? అని అడుగుతూ ఉంటారు. నిజమే కాని తన విషయాలు తనకి గుర్తు ఉండాలి కదా! ముందు వస్తువులు, మనుషుల పేర్లు మొదలైనవి మర్చిపోవటంతో మొదలై కొంతకాలానికి అవయవాలు కూడా తమ పని చేయటం మర్చిపోయే ప్రమాదం ఉన్నదట!ఆయువు ఉన్నంత కాలం ఒకరి మీద ఆధార పడకుండా తెలివితో ఉండటం ఎవరైనా కోరుకోవలసినదే! దీనికి చేయ వలసిన దల్లా మెదడుకి పని చెప్పి చేయిస్తూ ఉండటమే. ముందు నుండి ఆవిధంగా ఉంటే వృద్ధాప్యంలో మతిమరపు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని మానసిక వైద్యనిపుణులు చెప్పిన మాట. అప్పుడు మానవ జన్మ అనే అద్భుతమైన అవకాశాన్ని పూర్తిగా అనుభవించినట్టు అవుతుంది. దానికోసం కొన్ని మానసిక వ్యాయామాలు సహకరిస్తాయని చెప్పారు. మనస్తత్వ శాస్త్రవేత్తలు సూచించిన వాటిలో కొన్ని చూద్దాం. చదవటం, రాయటం, మాట్లాడటం, ఆలోచించటం, సమస్యలని పరిష్కరించటం మొదలైనవి. వీటి అన్నిటికీ మెదడుని ఉపయోగించక తప్పదు. 40 సంవత్సరాల తరువాత మెదడులో ఉన్న కణాలు పెరగవు. 60 సంవత్సరాల తరువాత తగ్గటం మొదలవుతుంది. కనుక క్రమంగా జ్ఞాపకశక్తి క్షీణిస్తూ ఉంటుంది. కాని చదవటం, రాయటం వంటివి చేసే వారికి పెరగక పోయినా తరగవు. ఉపాధ్యాయులకి జ్ఞాపకశక్తి ఎక్కువ ఉండటానికి కారణం వారు చదువుతూ, రాస్తూ, మాట్లాడుతూ ఉండటమే. అందరికీ ఆ అవకాశం ఉండదు కదా! అందుకని చిన్నపిల్లల దగ్గర కూర్చుని చదివించ వచ్చు. వారికి కథలు చెప్ప వచ్చు. అసలు మాట్లాడటమే చాలు. బుర్రకి కావలసినంత పని. çపద వినోదాలు పూర్తి చేయటం, చదరంగం ఆడటం వంటి వాటిని చేయచ్చు. ఇప్పుడైతే అవన్నీ ఉన్నాయి. మరి, పూర్వం ఏం చేసేవారు? పొడుపు కథలు, చిక్కుప్రశ్నలు, జంటపదాల ఆట, వైకుంఠపాళీ, పులి – జూదం, పచ్చీసు, వామన గుంటలు, వైకుంఠపాళీ వంటి కాలక్షేపాలు, వినోదాలు ఉండేవి. ఇవన్నీ మెదడుకి చురుకుతనం కలిగించేవే. పెద్ద ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కనుక ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేవారు. కొంతకాలం మాట్లాడకుండా ఉంటే, మాట్లాడటానికి కొంచెం ప్రయత్నం చేయవలసి ఉంటుంది. అందుకే వృద్ధులని,ఏదయినా కారణంతో జ్ఞాపకశక్తిని కోల్పోయిన వారిని తరచూ పలకరిస్తూ ఉండమని వాళ్ళని మాట్లాడేట్టు చేయమని వైద్యులు చెపుతారు. ఆనాటి వారు తమ కుటుంబ సమస్యలను తామే పరిష్కరించుకునే వారు. ఎవరి సమస్య అయినా అందరు పరిష్కరించటానికి కుస్తీ పట్టే వారు. ఇప్పుడు అందరికీ ఆలోచించటానికి బద్ధకం. కళ్ళు, చెవులు అప్పగించి కూర్చొనే అలవాటు ఎక్కువయింది. ఈనాడు ఎక్కడ పడితే అక్కడ కౌన్సిలింగ్ కేంద్రాలు తయారవటానికి కారణం మెదడుని పని చేయించకపోవటమే. శరీరం లాగానే మనస్సుకి కూడా సోమరితనం అలవాటు అయిపోయింది. నాకు ఏదైనా సమస్య వస్తే ఎవరో పరిష్కారం చూపించాలి, నా మెదడుని నేను కష్టపెట్టను అన్నది అలవాటు అయితే స్థబ్ధుగా తయారవుతారు. మెదడు తుప్పు పడుతుంది. తస్మాత్ జాగ్రత!! డా‘‘ ఎన్ అనంత లక్ష్మి -
నోటిమాట నిప్పుతో సమానం
మనకు ప్రధానంగా మూడు ఉపకరణాలుంటాయి–శరీరం, మనస్సు, వాక్కు. శరీరం అన్నం చేత తయారవుతుంది. సూక్ష్మ శరీరమైన, సంకల్ప వికల్ప సంఘాతమైన మనస్సు కూడా అన్నం వలననే తయారవుతుంది. ఇది ప్రాణం అత్యంత ప్రధానమైనది. ఎంతకాలం ప్రాణం లోపల తిరుగుతుంటుందో అంతకాలమే ఈ శరీరానికి పూజనీయత. ఎంతకాలం వాయువు బయటికెళ్ళి లోపలకు వస్తుంటుందో అంతకాలం మాత్రమే ‘బాగున్నారా !’, ‘బాగున్నారా!’ అని అని కుశల ప్రశ్నలు వేస్తుంటారు. లోపలికి వెళ్ళిన వాయువు బయటికి వెళ్ళకపోయినా, బయటికి వెళ్ళిన వాయువు లోపలికి పీల్చబడకపోయినా .. అక్కడితో దాని మంగళప్రదత్వం పోతుంది. అది ఇక శివం కాదు, శవం. అటువంటి ప్రాణాన్ని పోషించగలిగేది నీరు. ప్రాణులను అన్నింటినీ కూడా పోషించగలిగిన శక్తి నీటికి ఉంటుంది. అందుకే ‘అమృతం వా ఆపః’ అంటారు. నీరు అమృతంగా చెప్పబడింది. పరమేశ్వరుడికి అభిషేకం చేసినప్పుడు పంచామృతాభిషేకం అంటారు. పాలు, పెరుగు, నెయ్యి, తేనె, మంచినీరు.. ఇవి పంచామృతాలు. నీళ్ళు ముఖాన చిలకరిస్తే... స్పృహæతప్పిపోయినవాడికి కూడా స్పృహ, ప్రాణాలు వస్తాయి. అంటే ప్రాణాలను తిరిగి యథాస్థానంలో నిలబెట్టగలిగిన శక్తి నీటికి ఉంది. చిట్టచివరిది వాక్కు. ఈ వాక్కు.. స్వరపేటిక పేరిట భగవంతుడిచ్చిన మహత్తరమైన కానుక. దీనిని ఆధారం చేసుకుని మనిషి తాను తరించిపోవచ్చు... ఇతరుల అజ్ఞానం పోగొట్టడానికి ఉపయోగించవచ్చు. కలియుగంలో భగవంతుని నామాన్ని పలకడంకన్నా గొప్పది మరొకటి లేదు. అది భగవంతుడిని ఉద్దేశించే పలికింది కాకపోవచ్చు. ‘బిడ్డపేరుపెట్టి పిలిచిననైన విశ్రామకేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయనతలుప కలుషహరము’ అంటారు... భాగవతంలో. బిడ్డను దేముడి పేర్లలో ఒకటిపెట్టి పిలిచినప్పటికీ... పిలిచింది బిడ్డనే అయినా... భగవంతుడి నామాన్ని ఉచ్చరించాడు కాబట్టి పాపరాశి ధ్వంసమవుతుంది... అన్నారు. విశ్రామకేళినైన... ఆడుకునే సమయంలో ఇరుపక్షాలూ ఒకరు రాముడి పక్షమనీ, మరొకరు కృష్ణుడి పక్షమంటూ అలా పేర్లుపెట్టుకుని ఆడుకుంటూ ఆ పేర్లను ఉచ్చరించినా చాలట. పద్యమో, గద్యమో, గీతమో... ఏదయినా కావచ్చు... అది భగవంతుని నామంతో కూడుకున్నదయితే చాలు అది కలుషహరము.. కలుషాలను అన్నింటినీ పోగొట్టగలిగిన శక్తిని పొంది ఉంటుంది. అలా తనకు తాను తరించడానికే కాదు.. ఇతరుల అజ్ఞానమనే చీకటిని దహించివేయడానికి కూడా వాక్కు ఉపకరిస్తుంది ... ఎలా? వాక్కు అగ్నిహోత్రంతో సమానమైనది. అగ్నిహోత్రానికి ఉన్న లక్షణం అవతలి వస్తువును దహించి వేస్తుంది. అలాగే వాక్కుకు ఉన్న లక్షణం అవతలివారి అజ్ఞానాన్ని తొలగించేస్తుంది. తెలియని విషయం అది తెలిసినవారి దగ్గర విన్నప్పుడు.. ‘నాకు తెలియదు’ అన్న తెలియనితనం పోతుంది. అంత గొప్ప వాక్కు మహాత్ములయినవారి నోటివెంట వచ్చినప్పుడు దేశకాలాలతో సంబంధం లేకుండా ఎప్పటికీ అది వ్యక్తి ఉద్ధరణకు, సమాజ ఉద్ధరణకు కారణమయి ఉంటుంది. వారు దేశికులై ... అంటే మార్గనిర్దేశకులై మనం ఎటువైపు ప్రయాణం చేయాలో దిశానిర్దేశనం చేస్తుంటారు. (సశేషం). బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
మన కితకితలు మనకు ఎందుకు నవ్వు తెప్పించవంటే..
కితకితలు.. ఎవరికైనా ఎప్పుడో ఒకప్పుడు అనుభవంలోకి వచ్చే ఉంటాయి. ఎవరైనా కితకితలు పెడుతున్నప్పుడు మనకు విచిత్ర అనుభూతి కలిగి, నవ్వు వస్తుంటుంది. ఇటువంటి సందర్భంలో పగలబడి నవ్విన ఉదంతాలు కూడా ఉంటాయి. సాధారణంగా చిన్నపిల్లలకు పెద్దవాళ్లు కితకితలు పెట్టడం చూస్తుంటాం. అటువంటప్పుడు పిల్లలు ఆనందంతో మెలికలు తిరిగిపోతూ నవ్వుతుంటారు. అయితే ఇక్కడున్న ఒక విచిత్ర విషయాన్ని చాలామంది గమనించివుండరు. ఎవరికి వారు కితకితలు పెట్టుకున్నప్పుడు నవ్వు రాదు. ఇలా ఎందుకు జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుకనున్న కారణమేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కితకితలు అనుభూతికి రావడంలో మన మెదడులోని రెండు భాగాలు బాధ్యత వహిస్తాయి. వాటిలో మొదటిది కార్టిక్స్.. ఇది శరీరపు స్పర్శను అనుభూతి చెందుతుంది. ఇక రెండవది ఎంటీరియా సింగులెట్ కార్టిక్స్. ఇది ఆనందాన్ని, సెన్సేషన్‌ను అనుభూతి చెందుతుంది. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడులోని సెరిబెల్మ్ భాగానికి ముందుగానే ఈ విషయం తెలిసిపోతుంది. దీంతో అది కార్టిక్స్‌కు ఆ సమాచారాన్ని అందిస్తుంది. దీంతో కితకితలకు సిద్ధమైన కార్టిక్స్ అంతకుముందే విషయాన్ని గ్రహిస్తుంది. ఫలితంగా మనకు మనం కితకితలు పెట్టుకున్నా నవ్వురాదు. ఎటువంటి అనుభూతి కూడా కలుగదు. కితకితలను అనుభూతి చెందేందుకు సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేది తప్పనిసరి. మనకు మనం కితకితలు పెట్టుకున్నప్పుడు మెదడు ముందుగానే శరీరానికి సిగ్నల్ పంపుతుంది. అందుకే మన కితకితలు మన అనుభూతికి అందవు. అయితే మనకు ఎవరైనా కితకితలు పెట్టినప్పుడు మన మెదడు ఆ సిగ్నల్‌ను కార్టిక్స్‌కు పంపలేదు. దీంతో మెదడు కితకితల అనుభూతి చెందడానికి సిద్ధంగా ఉండదు. ఫలితంగా ఎవరైనా కితకితలు పెడితే వెంటనే ఎడతెగకుండా నవ్వువస్తుంది. అయితే ఇతరులు కితకితలు పెడుతుంటే మనం నవ్వడం కొంతవరకూ మంచిదేనని నిరూపితమయ్యింది. అప్పుడప్పుడు మన శరీరంపై ఏదైనా పురుగు లేదా కీటకం పాకినప్పుడు మనకు శరీరం జలదరిస్తుంది. వెంటనే ఆ పురుగును లేదా కీటకాన్ని తీసి బయట పారేస్తాం. మెదడు ఈ విధంగా కూడా మనకు రక్షణ కల్పిస్తుంది. -
మనిషి మృతితో యాక్టివ్‌గా మారే హార్మోన్.. ఏం చేస్తుందంటే...
ఈ ప్రపంచంలో జన్మించిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు. అయితే ఏ మనిషికైనా మృత్యువు సమీపించినప్పుడు అతను ఎటువంటి అనుభూతికి గురవుతాడనేదానిపై లెక్కలేనన్ని పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కాగా ఒక నిపుణుడు దీనిపై పలు వివరాలు వెల్లడించారు. లివర్ పూల్ యూనివర్శిటీకి పరిశోధకుడు సీమస్ కోయల్ అందించిన ఒక ఆర్టికల్‌లోని వివరాల ప్రకారం.. మనిషి మరణించే ప్రక్రియ అతనిలో రెండు వారాల ముందే మొదలవుతుంది. అతని ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తుంది. నిద్రించడం కూడా ఎంతో ఇబ్బందికరంగా మారుతుంది. జీవితపు చివరి రోజుల్లో మనిషి ఔషధాలు తీసుకోవడంలో, భోజనం చేయడంలో, ఏదైనా తాగడంలోనూ తగిన సామర్థ్యాన్ని కోల్పోతాడు. మరికొందరు పరిశోధకులు తెలిపిన వివరాల ప్రకారం మెదడు నుంచి పలు రసాయనాలు విడుదలవుతాయి. వాటిలో ఒకటి ఎండోఫ్రిన్. ఈ రసాయనం మనిషి భావాలను అమితంగా ప్రభావితం చేస్తుంది. మనిషి తాను మరణించే సమయాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. అయితే ఇప్పటివరకూ అందిన పలు పరిశోధనల వివరాల ప్రకారం మనిషి మృత్యువుకు సమీపిస్తున్న కొద్దీ అతని శరీరంలో స్ట్రెస్ కెమికల్ వృద్ధి చెందుతూ ఉంటుంది. క్యాన్సర్ బాధితులకు మరణ సమయంలో శరీరం వాపునకు గురవుతుంది. మరణించే సమయంలో మనిషిలో శారీరక నొప్పులు తక్కువకావడం విశేషం. ఇలా ఎందుకు జరుగుతుందో పరిశోధకులకు కూడా ఇంతవరకూ అంతుచిక్కలేదు. అయితే ఇది ఎండోఫ్రిన్ కారణంగానే జరుగుతుందని పరిశోధకులు భావిస్తున్నారు. కాగా ప్రతీ మనిషి మృతి ఒక్కో విధంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో మృత్యువుకు సంబంధించిన పలు విషయాలు పరిశోధకులకు సైతం అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయాయి. చదవండి: ఆ రోడ్డుపై ప్రయాణిస్తూ 14 దేశాలు దాటేయొచ్చు.. ఎక్కడుందో తెలుసా! -
మనుషులకే కష్టాలు.. మానులకు కాదు! ఈ నాలుగు ప్రాక్టీస్ చేయండి చాలు!
Sakshi Funday Cover Story: కష్టాలు మనుషులకు కాకుండా.. మానులకొస్తాయా! ఓదార్పు కోసం పెద్దవాళ్లు చెప్పే సాధారణమైన మాటిది. నిజమే కానీ.. సమాజంలో ఒకరిద్దరికి కష్టాలొస్తే ఇలాంటి ఓదార్పు మాటలు ఉపయోగపడతాయి! కానీ.. వందలో 42 మందికి తాము కష్టాల్లోనే బతుకీడుస్తున్నట్లు అనిపిస్తే? ఆ దుఃఖంలోనే వారు కుంగి కృశించి పోతూంటే.. అప్పుడు ఆ కష్టాలకు పెట్టుకోవాల్సిన పేరు.. ఒత్తిడి. ఇంగ్లిష్‌లో చెప్పుకుంటే స్ట్రెస్! ప్రపంచ దేశాలన్నింటిలోనూ అతిసామన్యమైపోతున్న ఈ మానసిక సమస్య గురించి భారత్‌లో చాలా తక్కువమందికి మాత్రమే తెలుసు. చాలామంది... పైన చెప్పుకున్నట్లు ఓదార్పు మాటలతోనే సరిపెట్టుకుంటున్నారు. అందుకే.. ఆందోళనకరమైన ఈ సమస్య ఆనుపానులు సులువుగా... సచిత్రంగా!!! సాధనం-1: గ్రౌండింగ్ గ్రౌండింగ్ అంటే మీతో మీరు కనెక్ట్ కావడం. అంటే.. మీ శరీరం, ఆలోచనలు, భావాలు, పరిసరాలతో కనెక్ట్ కావడం. మీరు భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోతున్నప్పుడు నెమ్మదిగా మీ పాదాలను నేలకు ఆనించండి. భూమితో కనెక్ట్ అవ్వండి. తర్వాత మీ దృష్టిని శ్వాసపై నిలపండి. ఆ తర్వాత మీ చుట్టూ ఉన్న పరిసరాలను గమనించండి. మీరు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో, ఏం చూస్తున్నారు, ఏం వింటున్నారు, ఏం వాసన, రుచి చూడగలరనే విషయాన్ని శ్రద్ధగా గమనించండి. అంటే మీరు మీ ఆలోచనల నుంచి దూరంగా జరిగి.. మీతో, మీ చుట్టూ ఉన్న పరిసరాలతో మమేకం అవండి. గ్రౌండింగ్ అంటే సింపుల్‌గా ఇంతే. గ్రౌండింగ్‌ను ప్రాక్టీస్ చేయడానికి ప్రత్యేక సమయం అవసరంలేదు. ఒకటి రెండు నిమిషాలు చాలు. ప్రతిరోజూ మీరు తినడం, వంట చేయడం లేదా నిద్ర పోవడం వంటి పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేయవచ్చు. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు మీరు ఆలోచనల నుంచి బయటపడి, ఒత్తిడికి దూరంగా ఆనందంగా మారడాన్ని గమనించవచ్చు. మొదట చిన్న చిన్న పనులకు ముందు గ్రౌండింగ్ ప్రాక్టీస్ చేస్తే ఆ తర్వాత క్లిష్ట పరిస్థితుల్లో గ్రౌండింగ్ ఉపయోగించడం సులభం అవుతుంది. సాధనం-2: అన్ హుకింగ్ అన్ హుకింగ్ అంటే మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచనల గాలం నుంచి తప్పించుకోవడం. మూడు దశల్లో ఆ పని చేయవచ్చు. మొదట మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తున్న ఆలోచన లేదా ఫీలింగ్‌ను గుర్తించండి. తర్వాత దాన్ని ఉత్సుకతతో గమనించండి. ఆ తర్వాత ఆ ఆలోచనకు లేదా అనుభూతికి ఓ పేరు పెట్టండి. ఇలా ఆలోచనలను, అనుభూతులను దూరంగా ఉండి గమనించడం, వాటికో పేరు పెట్టడం వల్ల.. మీరు, మీ ఆలోచనలు ఒకటి కాదనే స్పృహæ కలుగుతుంది. అది మిమ్మల్ని ఒత్తిడి నుంచి దూరంగా పెడుతుంది. ఆ తర్వాత మీతో ఎవరున్నారో, మీరేం చేస్తున్నారో దానిపై దృష్టి పెట్టండి. సాధనం-3: విలువలపై స్పందించడం ప్రతి మనిషికీ కొన్ని విలువలుంటారు. మీకు అత్యంత ముఖ్యమైన విలువలేమిటో ఎంచుకోండి. ఉదాహరణకు ప్రేమ, పని, ధైర్యం, దయ, కష్టపడి పనిచేయడం.. ఇలా చాలా! వీటికి దూరంగా జరగాల్సిన పరిస్థితుల్లో ఒత్తిడి కలుగుతుంది. ఆ ఒత్తిడిని తగ్గించుకోవాలంటే ముందుగా మీరు ముఖ్యమైన నాలుగైదు విలువలేమిటో నిర్ణయించుకోండి. వచ్చే వారమంతా మీ విలువలకు అనుగుణంగా పనిచేసే ఒక చిన్న మార్గాన్ని ఎంచుకోండి. మీ విలువలకు అనుగుణంగా జీవించండి. మీరు పాటించలేని విలువల గురించి ఒత్తిడికి గురికాకుండా, మార్చగలిగే వాటిని మార్చండి. మార్చలేని వాటిని వదిలేసి ముందుకు సాగండి. సాధనం-4: ప్రేమతో నింపుకోండి మీరు మీ పట్ల ప్రేమతో, దయతో ఉంటే ఒత్తిడిని అధిగమించడానికి కావాల్సిన శక్తి మీకు వస్తుంది. ఆ ప్రేమ, దయ ఆకాశం నుంచి ఊడిపడవు. మీరే ఊహించుకోవాలి, సృష్టించుకోవాలి. మీ మెదడుకు ఊహకు, వాస్తవానికీ ఉన్న తేడా తెలియదు. కాబట్టి మీరు జస్ట్ ఊహించుకున్నా చాలు దానికి అనుగుణంగా స్పందిస్తుంది. అందుకే మీ దోసిటి నిండా ప్రేమ లేదా దయ ఉన్నట్లు ఊహించండి. దాన్ని ఏ ఆకారంలో ఊహించుకుంటారనేది మీ ఇష్టం. తర్వాత, మీ శరీరంలో బాధ అనిపించే చోట చేతులుంచండి. మీ చేతుల నుంచి శరీరంలోకి ప్రవహించే ప్రేమను, దాని వెచ్చదనాన్ని అనుభవించండి. ఆ ప్రేమ ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. -
మ్యాన్ మేడ్ స్టోన్: మనిషి చితికి చేరినా, వజ్రంగా మెరుస్తూ..
సైన్స్ వైఫల్యాలలో మనిషి మరణం ఒకటి. ఎన్నో వింతలు, విడ్డూరాలు చేయగలిగిన టెక్నాలజీ, మరణాన్ని జయించడంలో పదేపదే విఫలమవుతూ వస్తోంది. అయితే ప్రస్తుతం చనిపోయిన వారిని ఎప్పటికీ చెరగని జ్ఞాపకంగా మార్చడంలో మాత్రం విజయవంతమైంది. మృతదేహాన్ని దహనం చేశాక మిగిలే బూడిదతో వజ్రాలను తయారుచేసి, ఆత్మీయులకు చిరకాల జ్ఞాపికలుగా అందిస్తోంది. అమెరికా, స్విట్జర్లాండ్, యూకే వంటి పలు దేశాల ప్రజలు మరణించిన తమవారిని చెక్కుచెదరని వజ్రాభరణాలుగా మార్చుకుంటున్నారు. వాటిని నిత్యం ధరిస్తూ మరణించిన ఆత్మీయులు తమతోనే ఉన్నట్లు భావిస్తున్నారు. వీటిని లక్కీ డైమండ్స్, మెమోరియల్ డైమండ్స్ అని పిలుచుకుంటున్నారు. మనిషి శరీరంలోని ఘన మూలకాల్లో కార్బన్ అత్యధికంగా ఉంటుంది. మనిషి శరీరం దహనమైపోయినా, అధిక పరిమాణంలో మిగిలే కార్బన్ తో వజ్రాలను తయారు చేసే ప్రక్రియను కొన్నేళ్ల కిందటే శాస్త్రవేత్తలు కనుగొన్నారు. శాస్త్రవేత్తలు అందించిన పరిజ్ఞానంతో కొన్ని అంతర్జాతీయ కంపెనీలు ఇలా ఆత్మీయుల చితాభస్మంతో వజ్రాలను తయారు చేసి, వారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు అందిస్తున్నాయి. అయితే, ఇదంతా పెద్ద స్కామ్ అని, ఎమోషనల్‌గా కనెక్ట్ చేసి డబ్బులు గుంజడానికే కంపెనీలు ఇలా మోసం చేస్తున్నాయని, డైమండ్ తయారీకి చితాభస్మం నుంచి 10% కార్బన్ మాత్రమే వాడుతున్నారని, మిగిలిన 90% సాధారణ స్టాక్ కార్బన్ వాడుతుంటారనే విమర్శలు ఉన్నాయి. అయితే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చి చాలా కాలం అయినా.. కరోనా వంటి విపత్కర పరిస్థితుల తర్వాత ఇది విపరీతంగా విస్తరించింది. కోవిడ్ మహమ్మారి కారణంగా అయిన వారిని కోల్పోయి, కనీసం కడసారి చూపులకైనా నోచుకోలేని స్థితిలో అల్లాడిపోయిన ఎందరికో ఈ విధానం ఊరటనిస్తోంది. తమవారు లేరనే విషాదం నుంచి కోలుకునేందుకు ప్రేమపూర్వక జ్ఞాపికగా మిగులుతోంది. స్నేహితుల్ని, ఆత్మీయుల్ని ఎంతో మంది ఈ వజ్రాలను తయారు చేయించుకోవడానికి మక్కువ చూపిస్తున్నారు. నిజానికి ఈ మనిషి చితాభస్మంతో తయారైన వజ్రాలు (మ్యాన్ మేడ్ స్టోన్) మొదట 1980లలో వాణిజ్యపరంగా అందుబాటులోకి వచ్చినా, ఇటీవలి కాలంలోనే వీటికి ఆదరణ పెరుగుతోంది. -
మీ బాడీలో ఏమున్నాయో తెలుసా? మన బరువులో.. ఏ మూలకం ఎంత?
హైడ్రోజన్, ఆక్సిజన్ కలిస్తే నీళ్లు.. సోడియం, క్లోరిన్ కలిస్తే ఉప్పు.. ఐరన్, కార్బన్ కలిస్తే ఉక్కు.. ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతిదీ వివిధ మూలకాల కలయికే. రాళ్లు, రప్పలు, వస్తువులే కాదు.. జీవులన్నీ కూడా రసాయన పదార్థాల సమ్మేళనమే. మరి మనం.. అంటే మనుషులం ఏ మూలకాలతో తయారయ్యాం? ఏమేం ఉంటాయి? ఎంతమేర ఉంటాయో తెలుసుకుందామా.. – సాక్షి సెంట్రల్ డెస్క్ 118 మూలకాలున్నా.. ఇప్పటివరకు భూమ్మీద 118 మూలకాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో కొన్ని విస్తారంగా ఉంటే.. మరికొన్ని మూలకాలు చాలా అరుదుగా లభిస్తాయి. భూమిపై మట్టి, నీళ్లు, గాలి, చెట్లు, జంతువులు, ఇళ్లు, వాహనాలు, వస్తువులు, మన ఫోన్లు.. ఇలా మనతోపాటు చుట్టూ ఉన్న ప్రతిదీ ఈ 118 మూలకాలతోనే తయారై ఉంటుంది. వేర్వేరు వస్తువుల్లో వేర్వేరు మూలకాలు ఉంటాయి. అదే చెట్లు, జంతువులు, ఇతర జీవజాలంలో మాత్రం ప్రధానంగా ఉండేవి నాలుగు మూలకాలే. మరికొన్ని మూలకాలు నామమాత్రస్థాయిలో ఉంటాయి. (చదవండి: పిల్లులూ పేర్లు గుర్తిస్తాయ్) లెక్కిస్తే.. హైడ్రోజన్ టాప్ మన శరీరంలో బరువుపరంగా ఆక్సిజన్ టాప్ అయినా.. పరమాణువుల సంఖ్య లెక్కన చూస్తే హైడ్రోజన్ శాతం చాలా ఎక్కువ. మన శరీర బరువులో నీటి శాతమే ఎక్కువ. రెండు హైడ్రోజన్, ఒక ఆక్సిజన్ పరమాణువులు కలిస్తే ఒక నీటి అణువు ఏర్పడుతుంది. అంటే ఆక్సిజన్ కంటే హైడ్రోజన్ రెండు రెట్లు ఎక్కువ. ► కానీ హైడ్రోజన్ పరమాణువు బరువు చాలా తక్కువ. 16 హైడ్రోజన్ పరమాణువులు కలిస్తే.. ఒక్క ఆక్సిజన్ పరమాణువు అంత అవుతాయి. నాలుగింటితోనే .. ఆక్సిజన్, కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్.. మన శరీరంలో 97 శాతం బరువు ఈ నాలుగు మూలకాలదే. అందులోనూ సగానికిపైగా బరువు ఒక్క ఆక్సిజన్‌దే కావడం విశేషం. ► నిజానికి మన శరీరంలో 60 శాతం నీళ్లే. ఆక్సిజన్, హైడ్రోజన్ మూలకాలు కలిసి ఏర్పడేవే నీళ్లు. దీనికితోడు శరీరంలోని అన్ని కణాలు, ప్రొటీన్లు, అమైనో ఆమ్లాల్లో ఆక్సిజన్ ఉంటుంది. ఇలా అన్నింటిలో కలిపితే శరీర బరువులో 65 శాతం ఆక్సిజనే. ఏ మూలకం.. ఎందుకోసం? మన శరీరం ప్రధానంగా నాలుగు మూలకాలతోనే నిర్మితమైనా.. మరికొన్ని మూలకాలు కూడా అత్యంత కీలకం. ఉదాహరణకు మన శరీరబరువులో సోడియం ఉండేది 0.2 శాతమే. కానీ అది తగ్గితే శరీరం పనితీరు దెబ్బతిని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆక్సిజన్: శరీరంలో ఉండే నీటితోపాటు అన్ని జీవ పదార్థాల్లో (ఆర్గానిక్ కాంపౌండ్స్) ఉంటుంది. శ్వాసక్రియ, శక్తి ఉత్పాదనకు కీలకం. కార్బన్: జీవ పదార్థం, డీఎన్ఏలో కీలక మూలకం ఇది. కార్బోహైడ్రేట్స్, కొవ్వులు, న్యూక్లిక్ ఆమ్లాలు, ప్రొటీన్లు.. ఇలా చాలా వాటిలో ఉంటుంది. అసలు కార్బన్ ఆధారిత పదార్థాల (ఆహారం) నుంచి శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. హైడ్రోజన్: జీవ పదార్థం, డీఎన్ఏలో కీలక మూలకమిది. నీటితోపాటు శరీరంలోని దాదాపు అన్ని ఆర్గానిక్ అణువుల్లో హైడ్రోజన్ ఉంటుంది. నైట్రోజన్: జీవానికి మూలమైన జన్యు పదార్థం (డీఎన్ఏ, ఆర్ఎన్ఏ), ఇతర ఆర్గానిక్ కాంపౌండ్స్, ప్రొటీన్లలో నైట్రోజన్ ఉంటుంది. కాల్షియం: శరీరంలో ఎముకలు, దంతాలు, కణాల మధ్య గోడలు (త్వచాలు) దీనితోనే నిర్మితమవుతాయి. ప్రోటీన్ల ఉత్పత్తికీ ఇది కీలకం. ఫాస్పరస్: ఎముకలు, దంతాలు, డీఎన్ఏ, ఏటీపీ ప్రొటీన్‌లో ఫాస్పరస్ ఉంటుంది. జీవం మనుగడకు కీలకమైన మూలకమిది. కొంచెమే అయినా అత్యవసరం.. నాడీ వ్యవస్థ పొటాషియం, సోడియం కీలకం. కణాలు, అవయవాల నుంచి నాడుల ద్వారా మెదడుకు వీటి అయాన్ల రూపంలోనే సమాచార ప్రసారం జరుగుతుంది. ఇక శరీరంలో ద్రవాల సమతుల్యతకు సోడియం, కండరాలు సరిగా పనిచేసేందుకు పొటాషియం అత్యవసరం. ► అత్యంత కీలకమైన అమైనో ఆమ్లాల్లో సల్ఫర్ ఉంటుంది. వెంట్రుకలు, గోర్లు, చర్మంలోని కెరాటిన్‌లో సల్ఫర్ కీలకం. ► రక్తంలోని హిమోగ్లోబిన్లో ఐరన్.. ప్రొటీన్ల తయారీ, రోగనిరోధకశక్తికి మెగ్నీషియం, జింక్ కీలకం. బంగారమూ ఉంటుంది మన శరీరంలో అతి సూక్ష్మ మొత్తంలో బంగారం కూడా ఉంటుంది. 70 కిలోల బరువున్న మనిషిలో సుమారు 0.2 మిల్లీగ్రాముల పుత్తడి ఉంటుందని.. శరీరంలో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వేగంగా ప్రయాణించడానికి తోడ్పడుతుందని ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తం అణువులెన్నో తెలుసా? సాధారణంగా 70 కిలోల బరువున్న మనిషి శరీరంలో ఏడు ఆక్టేలియన్ల అణువులు ఉంటాయని శాస్త్రవేత్తల అంచనా. (ఒక ఆక్టిలియన్ అంటే పది లక్షల కోట్ల కోట్ల కోట్లు.. సులువుగా చెప్పాలంటే పది పక్కన 27 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య) (చదవండి: సమ్మర్ డేస్: చలువ పందిరి జ్ఞాపకం) -
మనుషుల ఊపిరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్
లండన్: భూగోళాన్ని ముంచెత్తుతున్న ప్రమాదకరమైన ప్లాస్టిక్ భూతం ఇప్పుడు మనుషుల శరీరంలోకి సైతం చొరబడుతోంది. మనుషుల ఉపరితిత్తుల్లో సూక్ష్మ ప్లాస్టిక్ రేణువులను ఇంగ్లాండ్‌లో యూనివర్సిటీ ఆఫ్ హల్కు చెందిన హల్‌యార్క్ మెడికల్ స్కూల్ సైంటిస్టులు గుర్తించారు. గాలితోపాటు ప్రాణాంతక ప్లాస్టిక్ రేణువులను సైతం మనం పీలుస్తున్నామని వారు చెప్పారు. ఊపిరితిత్తుల్లో ప్లాస్టిక్ తిష్ట వేస్తే శ్వాస వ్యవస్థ దెబ్బతింటుందని, ఫలితంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని హెచ్చరించారు. సముద్రాలు, కొండలు, భూమి అనే తేడా లేదు.. ఎక్కడ చూసినా ప్లాస్టిక్కే కనిపిస్తోంది. వ్యర్థాల్లోకి చేరిన పెద్ద ప్లాస్టిక్ వస్తువులు చిన్నచిన్న ముక్కలుగా విడిపోతున్నాయి. 5 మిల్లీమీటర్ల పరిమాణంలోకీ మారుతున్నాయి. కంటికి కనిపించని సూక్ష్మమైన ఈ ప్లాస్టిక్ రేణువులను వాటర్ ఫిల్టర్లు కూడా అడ్డుకోలేవు. చివరకు ఇవి పీల్చే గాలి, తాగే నీటి ద్వారా శరీరంలోకి చేరుతున్నాయి. 13 లంగ్ టిష్యూ నమూనాలను పరీక్షించగా, 11 నమూనాల్లో 39 మైక్రో ప్లాస్టిక్ రేణువులు కనిపించాయని çపరిశోధకులు చెప్పారు. ఈ అధ్యయనం ఫలితాలను టోటల్ ఎన్విరాన్మెంట్ జర్నల్ సైన్స్‌లో ప్రచురించనున్నారు. జీవించి ఉన్న మనుషుల ఇతర శరీర భాగాల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లను గతంలోనే గుర్తించినప్పటికీ.. ఊపిరితిత్తుల అంతర్భాగాల్లో గుర్తించడం మాత్రం ఇదే మొదటిసారి అని సైంటిస్టులు వెల్లడించారు. ఊపిరితిత్తుల్లో గాలి మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయని, అందులోకి ప్లాస్టిక్ రేణువులు చేరితే శ్వాసలో సమస్యలు వస్తాయన్నారు. -
Sakshi Cartoon: ...ప్లాస్టిక్ సామాన్లు కొంటాం! ప్లాస్టిక్...
...ప్లాస్టిక్ సామాన్లు కొంటాం! ప్లాస్టిక్... -
Mosquitoes: ఆ రంగుల బట్టలేసుకుంటే మాత్రం ‘అంతే’
సాయంత్రమైందంటే చాలు పరుగెత్తుకొస్తాయి దోమలు. చెవుల పక్కన చేరి వాటి భాషలో హలో చెబుతుంటాయి. కుట్టి కుట్టి రక్తాన్ని పీల్చేస్తుంటాయి. అంతటితో అయి పోతుందా.. లేనిపోని రోగాలను కూడా అంటి స్తాయి. అందుకే దోమ తెరలు, ఆల్ అవుట్లు, రకరకాల ప్రయోగాలతో దోమల్ని దూరం పెట్టేందుకు ప్రయత్నిస్తుంటాం. ఇవన్నీ సరే.. మనం ఎక్కడున్నా సరే అసలు దోమలు మన దగ్గరకే రాకుండా ఉండాలంటే ఏం చేయాలని చాలా మంది అనుకునే ఉంటారు. తాజాగా శాస్త్రవేత్తలు కూడా ఇదే ఆలోచనపై పరిశోధన చేశారు. 4 రకాల రంగుల బట్టలు వేసుకుంటే దోమలు మనల్ని కాస్త తక్కువగా కుడతాయని, ఇంకో 4 రకాల రంగుల బట్టలేసుకుంటే మాత్రం ‘అంతే’ సంగతులని కనుగొన్నారు. ఆ రంగుల కథేంటో, దోమలు రంగులను ఎలా గుర్తిస్తు న్నాయో తెలుసుకుందాం. వాసన, రంగుతో పసిగట్టేసి.. మనుషులు విడుదల చేసే కార్బన్ డై ఆక్సైడ్, చెమట వాసన, శరీర ఉష్ణోగ్రతను గుర్తించాక నేరుగా మనుషుల దగ్గరకు దోమలు వస్తున్నాయని ఇదివరకే కనుగొన్నారు. తాజా పరిశోధనలో నాలుగో అంశాన్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. అదే ‘రంగు’. చెమట, కార్బన్ డై ఆక్సైడ్ వాసన గుర్తించనంత వరకు మనుషులున్నా, ఇంకేమున్నా దోమలు పట్టించుకోలేదని.. కానీ వాటి వాసనను పసిగట్టాక మాత్రం ఆ వాసన వస్తున్న వైపు ఎగురుతున్నాయని గుర్తించారు. అయితే ఇందులోనూ ఇంకో ఆసక్తికరమైన అంశాన్ని కనుగొన్నారు. వాసన వచ్చే ప్రాంతంలో ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగులవైపు దోమలు ఎక్కువగా వెళ్లాయని.. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగులను పట్టించుకోలేదని గమనించారు. మనుషుల శరీరం దోమలకు ఎరుపు–నారింజ రంగు రూపంలో కనిపిస్తుందని, అందుకే నేరుగా మన దగ్గరకు వచ్చేస్తాయని తెలుసుకున్నారు. మన శరీర ఛాయతో వాటికి సంబంధం లేదని, అన్ని శరీరాలూ వాటికి ఎరుపు–నారింజ రంగులోనే కనిపిస్తాయని చెబుతున్నారు. కాబట్టి ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగుల బట్టలు వేసుకుంటే మన శరీర రంగుకు ఆ బట్టల రంగు తోడై దోమలు మరింత ఎక్కువగా మన దగ్గరకు వస్తాయని అంటున్నారు. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగుల బట్టలు వేసుకుంటే కాస్త తక్కువగా ఆకర్షితమవుతాయని వివరిస్తున్నారు. ప్రయోగం ఎలా చేశారు? పరిశోధన కోసం ఒక్కో దోమను ఒక్కో టెస్ట్ చాంబర్లో పెట్టి మరీ శాస్త్రవేత్తలు పరీక్ష చేశారు. ఈ చాంబర్లలోకి రకరకాల వాసనలు పంపారు. అదే సమయంలో రకరకాల రంగులను ప్రదర్శించి చూశారు. ఎలాంటి వాసన లేనప్పుడు చాంబర్లో ఎలాంటి రంగును ప్రదర్శించినా దోమలు పట్టించుకోలేదు. కార్బన్ డై ఆక్సైడ్‌ను పంపాక ఆకుపచ్చ, నీలం, ఊదా రంగులను ప్రదర్శించినా పెద్దగా స్పందించలేదు. కానీ కార్బన్ డై ఆక్సైడ్‌తోపాటు ఎప్పుడైతే ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగులను ప్రదర్శించారో ఆ రంగుల వైపు వెళ్లడం గమనించారు. మామూలుగా మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు మంచి బిర్యానీ వాసన వస్తే ‘ఎక్కడినుంచబ్బా’ అని అటూ ఇటూ చూస్తాం. దోమలు కూడా కార్బన్ డై ఆక్సైడ్ వాసన రాగానే ‘వాటి బిర్యానీ’ ఎక్కడని చూస్తాయని శాస్త్రవేత్తలు సరదాగా చెప్పారు. శాస్త్రవేత్తలు తమ చేతికి రకరకాల గ్లోవ్స్ వేసుకొని కూడా పరిశీలించారని, అందులోనూ ఎరుపు, నారింజ, నలుపు, సియాన్ రంగు గ్లోవ్స్ వైపు దోమలు ఎక్కువగా వెళ్లాయని.. ఆకుపచ్చ, ఊదా, నీలం, తెలుపు రంగుల గ్లోవ్స్‌ను పట్టించుకోలేదని తెలిపారు. దోమలు వాటి ఆహారాన్ని ఎలా వెతుకుతాయో తెలుసుకోవడానికి ఇది తొలిమెట్టేనని, మనుషుల శరీరం నుంచి వచ్చే వాసనలను ఎలా అవి గుర్తిస్తున్నాయో తెలుసుకోవాల్సి ఉందని చెప్పారు. – సాక్షి సెంట్రల్‌డెస్క్ -
శ్మశానంలో వర్షానికి నీటిలో తేలియాడిన మృతదేహం
టేకుమట్ల: ఒకే మృతదేహానికి రెండుసార్లు అంతిమ వీడ్కోలు పలికిన హృదయ విదారక సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని అంకుషాపూర్‌లో మంగళవారం చోటుచేసుకుంది. వివరాలు.. అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని చలివాగు ఒడ్డుకు పూడ్చి అంతిమ సంస్కారాలు చేశారు. కాగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చలివాగు ఉప్పొంగడంతో పూడ్చిన శవం నీటిలో తేలియాడుతూ మండలంలోని వెలిశాల శివారులో గల చెట్ల కొమ్మలకు చిక్కుకోవడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు శవాన్ని బైటికి తీసి అంకుషాపూర్ గ్రామానికి చెందిన గురుకుంట్ల భద్రమ్మగా గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించి అక్కడే దహన సంస్కారాలు నిర్వహించినట్లు ఎస్సై రమణారెడ్డి తెలిపారు. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం సొంత అన్న చోరీ) చదవండి: రాజకీయ నాయకుడి వేధింపులకు మహిళ బలి -
ఉప్పును ఎక్కువగా వాడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
ఉప్పు రక్తపోటును పెంచుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే. అందుకే హైబీపీతో బాధపడేవారు ఉప్పు తగ్గించుకోవాలని వైద్యులు సలహా ఇస్తారు. ఉప్పులేని చప్పిడి తిండి తినడానికి చాలామంది ఇష్టపడరు గానీ, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే, బీపీ పెరుగుతుంది. ఉప్పు వల్ల రక్తపోటు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. మనం ఉప్పు ఉన్న పదార్థాలు ఎక్కవగా తీసుకున్నప్పుడు... ఆ ఉప్పు ద్వారా సోడియం అనే మూలకం రక్తంలోకి సాధారణ స్థాయి కంటే ఎక్కువగా చేరుతుంది. ఇలా చేరిన ఆ సోడియంను తొలగించడంలో కిడ్నీలు విఫలమవుతాయి. ఫలితంగా రక్తపోటు పెరుగుతుంది. రక్తంలోని సోడియం నరాల లోపల ఒత్తిడిని పెంచుతుంది. దీనిని తట్టుకునేందుకు నరాల లోపలి గోడల్లోని సన్నని కండరాలు మందంగా మారుతాయి. దీనివల్ల నరాల లోపల రక్తప్రసరణ సాఫీగా సాగేందుకు కావలసిన చోటు కుంచించుకుపోయి, రక్తపోటు పెరుగుతుంది. అతిగా ఉప్పు తింటే మెదడుకు దారితీసే నరాలు కూడా దెబ్బతింటాయి. ఫలితంగా గుండెకు ఆక్సిజన్, ఇతర పోషకాలు సజావుగా చేరలేని పరిస్థితి ఏర్పడుతుంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి డెమెన్షియా వంటి సమస్యలు తలెత్తుతాయి. రక్తపోటు అదుపు తప్పితే, గుండెపోటు రావడం, మెదడు వద్ద రక్తనాళాలు చిట్లి పక్షవాతం వంటి ప్రమాదకర పరిస్థితులు కూడా తలెత్తవచ్చు. అందుకే సాధ్యమైనంతవరకు మన ఆహారపదార్థాల్లో ఉప్పును పరిమితంగా తీసుకోవడమే మంచిది. ఇక ఉప్పు ఎక్కువగా ఉండే పచ్చళ్లు, అప్పడాలు, ఎక్కువకాలం నిల్వ ఉంచేలా తయారు చేసే బేకరీ ఐటమ్స్ పరిమితంగా తీసుకోవాలి. హైబీపీ ఉన్నవాళ్లు వాటిని తీసుకోకపోవడమే మంచిది. -
కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశం!
ప్రతి మనిషికీ పుట్టుమచ్చలు ఉండనే ఉంటాయి. సాధారణంగా పుట్టుమచ్చలేవీ ప్రమాదకరం కాదు. అయితే కొన్నిసార్లు అవి కూడా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంటుంది. అలా అవి ఎప్పుడు ప్రమాదకరంగా మారతాయి అనే విషయంలో ఓ కొండగుర్తు ఉంది. అదే... పుట్టుమచ్చల తాలూకు ‘ఏ, బీ, సీ, డీ’లు. వాటి గురించి తెలుసుకుందాం. ►ఏ అంటే ఎసిమెట్రీ – చర్మంపైన మచ్చ సౌష్ఠవాన్ని (సిమెట్రీని) కోల్పోవడం. ►బీ అంటే బార్డర్ – మచ్చ అంచులు మారడం. అవి ఉబ్బెత్తూగా ఉండటం. ►సీ అంటే కలర్ వేరియేషన్ – మునుపు ఉన్న రంగు మారడం. ►డీ అంటే డయామీటర్ – దాని వ్యాసం ఆరు మిల్లీమీటర్ల కంటే ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే అలాంటి కొన్ని పుట్టుమచ్చలు క్యాన్సర్స్‌గా మారే అవకాశాలు ఎక్కువ. అంటే పై ఏ, బీ, సీ, డీల జాగ్రత్తలను గమనించి ఆ మేరకు తేడాలుంటే వెంటనే డాక్టర్ / డర్మటాలజిస్ట్‌ను కలవాలి. -
కోమా నుంచీ బయటపడవచ్చు!
సినిమాల్లో కోమా కేసులను చూసి చూసి మనలో చాలామందికి ఓ దురభిప్రాయం ఉంది. కోమాలోకి వెళ్తే... అది దాదాపు గా మరణానికి ముందు దశ అనీ... అలా కోమాలోకి వెళ్లినవాళ్లు ఒక పట్టాన వెనక్కు రారని! కానీ... కోమాలోకి వెళ్లిన దాదాపు గా 80 శాతం కేసుల్లో మనుషులు వెనక్కు సురక్షితంగా వస్తుంటారు. ఇక కోమా గురించి మరో అపోహ కూడా ఉంది. అదేదో యాక్సిడెంట్ అయి... తలకూ, మెదడుకు తీవ్రమైన గాయం అయినవారిలోనే చాలామంది కోమాలోకి వెళ్తుంటారని!! కానీ... ఆహారంలో తగినంత ఉప్పు లేకపోవడం మొదలుకొని, ఓ సాయంత్రంవేళ ఆల్కహాల్ ఎక్కువగా తాగేసినా కోమాలోకి వెళ్తుంటారని. ఇలా కోమాపై ఎన్నెన్నో అపోహలు. అలాంటి అపోహలు తొలగిస్తూ... స్పృహతప్పిన స్థితి మరింత గాఢంగా ఉండటమే కోమా అనీ... ఏ 20 శాతం కేసులు మినహా మిగతా వాళ్లంతా బయటపడేందుకు అవకాశముందని చెబుతూ ‘కోమా’పై అవగాహన పెంచే కథనం ఇది. స్పృహ కోల్పోవడం మనందరికీ తెలిసిందే. కోమా అంటే కూడా స్పృహ లేని స్థితే. కాకపోతే మరింత గాఢమైన స్థితి. అంటే ‘ప్రొఫౌండ్ అన్కాన్షియస్’ స్టేజ్ అని చెప్పవచ్చు. వెలుతురుకూ, నొప్పికీ, దెబ్బకూ లేదా మరే ఇతర అంశాలకూ స్పందన లేకుండా నిద్రా, మెలకువలు... ఈ రెండింటికీ అతీతమైన స్థితే... ‘కోమా’. కోమాకు నూరు కారణాలంటూ వైద్యుల మాటల్లో ఓ వాడుక ఉంది. అయితే సాధారణంగా కోమాకు మూడంటే మూడు ప్రధాన కారణాలుంటాయని చెప్పుకోవచ్చు. 1. మెదడుకు సంబంధించిన జబ్బులవల్ల కోమాలోకి జారిపోవడం. 2. శరీరంలోని ఇతర అవయవాల వల్ల కోమాలోకి వెళ్లడం. 3. ఇతర కారణాలు అంటే... ఆల్కహాల్, డ్రగ్స్, విషపదార్థాలు ఓరల్‌గా తీసుకోవడం వల్లగానీ, కార్బన్డయాక్సైడ్, సయనైడ్ వంటి విషవాయువులు పీల్చడం వల్లగానీ లేదా ఒక్కోసారి వడదెబ్బ సింపుల్ వంటి కారణాలతోనూ కోమాలోకి వెళ్లడం. కోమా – కారణాలు: మెదడుకు సంబంధించని కారణాలతో కోమాలోకి వెళ్లడమన్నది సాధారణ వడదెబ్బ నుంచి మొదలుకొని దేహంలోని కీలకమైన అవయవాలకు (వైటల్ ఆర్గాన్స్) వచ్చే రకరకాల సమస్యల వరకు దేని కారణంగానైనా జరగవచ్చు. కార్డియాక్ అరెస్ట్ – సాధారణంగా కార్డియాక్ అరెస్ట్‌తో గుండె ఆగినప్పుడు కార్డియోపల్మునరీ రిససియేషన్ (సీపీఆర్) అనే ప్రక్రియ ద్వారా గుండెపై మసాజ్ చేసినట్లుగా కొంత ఒత్తిడి కలిగిస్తూ దాన్ని తిరిగి పనిచేయించడానికి ప్రయత్నిస్తారు. ఈ సీపీఆర్ చాలాసేపు కొనసాగినప్పుడు వెళ్లే కోమా నుంచి బయటపడేసేందుకు రోగికి ‘హైపోథెర్మియా’ అనే ప్రక్రియతో చికిత్స చేస్తారు. డయాబెటిస్తో – సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు తమ దేహంలో చక్కెర పెరగడం వల్ల కలిగే అనర్థాలు రాకుండా ఉండేందుకంటూ క్రమం తప్పకుండా మందులు వాడుతుంటారు. ఈ క్రమంలో ఒక్కోసారి సరిగ్గా ఆహారం తీసుకోకుండానూ మందులు మాత్రం వేళకు వేసుకుంటూ ఉంటారు. దాంతో అదనపు చక్కెరమీద పనిచేయాల్సిన మందులు... అన్నం తినని కారణంగా ఉన్న కొద్దిపాటి చక్కెరపైనా పనిచేసి, వాటినీ తగ్గించడంతో శరీరంలో చక్కెర పాళ్లు చాలా ఎక్కువగా తగ్గిపోతాయి. అంటే సాధారణంగా 100–140 వరకు ఉండాల్సిన షుగర్ లెవెల్స్ 30–20 కంటే తక్కువకు పడిపోతాయి. అలాంటప్పుడు రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంటుంది. దీన్ని ‘హైపోగ్లైసీమిక్ కోమా’ అంటారు. అలాంటి పరిస్థితుల్లో చక్కెర రోగులకు డాక్టర్లే చెప్పిమరీ చాక్లెట్ వంటి తీపిపదార్థాలు తినిపిస్తారు. ఇక ‘డయాబెటిక్ కోమా’ అని మరోటి ఉంది. చక్కెర రోగులు వారు తీసుకోవాల్సిన మందుల్ని సరిగ్గా తీసుకోకపోవడం వల్ల అలాగే సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల చక్కెరపాళ్లు విపరీతంగా పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి ఏర్పడవచ్చు. ఇందులోనూ మళ్లీ రెండు రకాలు... 1. చక్కెర పాళ్లు 500 ఎంజీ/డీఎల్ కంటే ఎక్కువగా పెరగడంతో కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని హైపర్ ఆస్మోలార్ కోమా అంటారు. 2. దేహంలోని వ్యర్థాలు (కీటోన్స్, యాసిడ్స్) పెరగడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. దీన్ని ‘కీటో అసిడోటిక్ కోమా’ అంటారు. ఈ రెండు సందర్భాల్లోనూ ఇన్సులిన్, సెలైన్ ఇచ్చి, దేహంలో చక్కెర పాళ్లు తగ్గించడం వల్ల కోమా స్థితి నుంచి వెనక్కు తీసుకురావచ్చు. హైపో న్యాట్రీమిక్ కోమా: మన శరీరంలో చక్కగా పనిచేయడానికి ఎన్నో లవణాలు అవసరమన్న సంగతి మనకు తెలిసిందే. ఇందులో సోడియం, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు మనం తీసుకునే ఉప్పు ద్వారా మనకు ఒంట్లోకి సోడియం చేరుతుంది. ఇది 140–150 మిల్లీ ఈక్వివాలెంట్స్ పరిమాణంలో ఉండటం అన్నది సాధారణమైన కొలత. ఆ పరిమాణం 110 కంటే తగ్గితే మనిషి కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. బీపీకి చికిత్స తీసుకుంటున్నవారిలో మందుల వల్ల ఈ పరిస్థితి చాలా సాధారణంగా కనిపిస్తుంది. కారణం... బీపీని నియంత్రించడానికి డాక్టర్లు ఉప్పు తగ్గించమంటారు. దాంతో కొందరు ఉప్పు పూర్తిగా మానేస్తారు. ఫలితంగా ఈ పరిస్థితి వచ్చే అవకాశం ఎక్కువ. ఐవీ ఫ్లుయిడ్స్‌తో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఒక ఎవరైనా రోగి పొటాషియం లవణాల లోపం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తే ముందే కాసిన్ని కొబ్బరినీళ్లు తాగించడం వల్ల కోమాను నివారించవచ్చు. హైపర్ న్యాట్రీమిక్ కోమా: ఇది దేహంలో సోడియం ఎక్కువ కావడం వల్ల వచ్చే సమస్య. ఉదాహరణకు సోడియం పాళ్లు 165 మిల్లీ ఈక్వివలెంట్స్ కంటే ఎక్కువ కావడం వల్ల కూడా కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. లివర్ కోమా: కాలేయం చాలా జబ్బుల వల్ల దెబ్బతింటుంది. ఎక్కువగా కొవ్వుండే ఆహారపదార్థాలు తినేవారి నుంచి మొదలుకొని... హెచ్‌బీసీ, హెచ్‌బీబీ వంటి వైరస్ల వల్ల లివర్ దెబ్బతిన్నప్పుడు కోమాలోకి వెళ్లే పరిస్థితి వస్తుంది. కిడ్నీ కోమా: మూత్రపిండాలు దెబ్బతినడం వల్ల కోమాలోకి వెళ్లే పరిస్థితి. అయితే ఇందులో 99% డయాబెటిస్ కారణంగా కిడ్నీలు దెబ్బతిని, కోమాలోకి వెళ్లే కేసులే ఎక్కువ. ఇలాంటివారికి డయాలసిస్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. గ్లాస్గో కోమా స్కేల్ కోమా తీవ్రతను కొలిచేందుకు ఉపయోగించే స్కేల్‌ను ‘గ్లాస్గో కోమా స్కేల్’గా చెబుతారు. ఇందులో స్కేల్ అంటూ ఏదీ ఉండదుగానీ.. రోగికి ఇస్తున్న సూచనల ఆధారంగా వారు స్పందించే ఒక్కోరకమైన స్పందనకూ ఒక్కో స్కోర్ ఇస్తారు. ఉదాహరణకు కనురెప్పలు కదిలించమంటూ సూచన ఇస్తే వారు కనబరిచే కంటి కదలికలకూ, నోటిమాటకు స్పందించే తీరుకు, ఇలా... ఒక్కోదానికి కొంత స్కోర్ ఉంటుంది. ఇందులో డాక్టర్ ఇచ్చిన ఏ ఆదేశానికీ స్పందన లేకపోతే కనిష్టంగా స్కోర్ మూడుగా నమోదవుతుంది. అలాగే డాక్టర్ ఆదేశాలకు రోగినుంచి స్పందనలు పెరుగుతున్న కొద్దీ స్కోర్ పెరుగుతుంది. అంటే మూడు స్కోర్ ఉంటే అది రోగి నుంచి ఏ స్పందనా లేని పరిస్థితి. అంటే అది పూర్తిస్థాయి కోమా అన్నమాట. అదే స్కోర్ పెరిగి అన్ని ఆదేశాలకూ స్పందిస్తే అది నార్మల్‌గా 15 ఉంటుంది. అంటే గ్లోస్గో స్కేల్ ఆదేశాలకు రోగి స్పందిస్తున్న కొద్దీ కోమా నుంచి దూరం అవుతున్నాడన్నాడని అర్థం. కోమాలోకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే రోగిని బాగా గాలి వచ్చే ప్రదేశంలో పడుకోబెట్టాలి. అతడిని వెల్లకిలా కాకుండా ఒకవైపునకు తిరిగి ఉండేలా పడుకోబెట్టాలి. నోట్లో గుడ్డలు కుక్కడం వంటివి చేయవద్దు. కోమాలో వెళ్లిన వారిచేత బలవంతంగా నీళ్లు తాగించడం వంటివి సరికాదు. స్పృహలోకి తెప్పించేందుకు చేసే ఈ పనులు రోగులకు ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఓ వ్యక్తికి ప్రమాదంలో మెడకు దెబ్బతగిలిందని భావిస్తే సాధ్యమైనంత వరకు మెడను కదలనివ్వకుండా చూడాలి. ఇలా కోమా చాలా పెద్దకారణాల వల్లనే కాకుండా, చిన్న చిన్న కారణాల వల్ల కూడా కలగవచ్చు. వాటిని చక్కదిద్దితే దాదాపు 80 శాతం రోగుల్లో కోమాను నివారించవచ్చు. కోమాలోకి వెళ్తే చేయాల్సిన ఏబీసీ...కోమాలో రోగికి చేయాల్సిన ప్రథమ చికిత్సను ఏబీసీగా చెప్పవచ్చు. ►ఏ – ఎయిర్ వే... అంటే ఊపిరి తీసుకోడానికి నోట్లో గల్ల వంటిది ఉంటే గుడ్డతో గాని, చేత్తోగాని తొలగించాలి. ►బి – బ్రీతింగ్ ... అంటే గాలి బాగా ఆడేలా, ఊపిరి తీసుకోగలిగేలా చూడాలి. ►సి – సర్క్యులేషన్... అంటే రక్తప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండేలా చూడటంతో పాటు తల వంటి చోట్ల దెబ్బతగిలి రక్తస్రావం అవుతుంటే దాన్ని ఆపడం వల్ల. ఈ మూడు ప్రాథమిక విషయాలను కాస్తంత విపులీకరించి చూస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ఈ ప్రథమ చికిత్సల తర్వాత తప్పనిసరిగా రోగిని వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలి. -
కొలెస్ట్రాల్ ఒంటికి హాని చేస్తుందా?
కొలెస్ట్రాల్ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్ అయినా, మంచి కొలెస్ట్రాల్ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్డిఎల్ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్డీఎల్ (చెడు కొలెస్ట్రాల్), హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్) మోతాదులు తెలుస్తాయి. ఎల్డీఎల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్’’ అని అంటారు. కానీ హెచ్‌డీఎల్ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్ ను ‘‘వుంచి కొలెస్ట్రాల్’’ అని అంటారు. మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్ ఎక్కువగా, ఎల్డీఎల్ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో పెట్టుకోవచ్చు. -
మనలో ఉన్న మంచి బ్యాక్టీరియా తెలుసునా?
బ్యాక్టీరియా.... ఈ పేరు వినగానే రకరకాల వ్యాధులు, వాటితో వచ్చే బాధలు గుర్తొస్తాయి. కానీ, పురుషులందు పుణ్యపురుషులు వేరయా అన్నట్లు బ్యాక్టీరియాలో కూడా మంచివి, మేలు చేసేవి కూడా ఉంటాయని చాలా తక్కువమందికి తెలుసు. ఇలా మనకు మేలు చేస్తూ మన శరీరంలో ఉంటూ మనతో సహజీవనం చేసే బ్యాక్టీరియా, ఈస్ట్‌లను ప్రోబయోటిక్స్ అంటారు. సింపుల్‌గా చెప్పాలంటే గుడ్ బ్యాక్టీరియా అన్నమాట! సాధారణంగా ఈ ప్రోబయోటిక్స్ మన జీర్ణవ్యవస్థలో ఉంటూ, జీర్ణవాహికను ఆరోగ్యంగా ఉంచుతాయి. మన డైజెస్టివ్ ట్రాక్‌లో దాదాపు 400 రకాల ‘గుడ్’ బ్యాక్టీరియా ఉంటాయి. ఆహారపదార్ధాల జీర్ణం, వాటి చోషణ (టuఛిజుజీnజ), ఇమ్యూనిటీ పెంచడం వంటి అనేక విషయాల్లో ఇవి సాయం చేస్తుంటాయి. ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు యాంటీ బయోటిక్స్ వాడితే ఆ సమయంలో ఇవి కూడా నశించిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా ’హెల్తీ గట్’(ఆరోగ్యవంతమైన అన్నవాహిక)ను మెయిన్‌టెయిన్ చేయవచ్చు. వేటి ద్వారా పొందొచ్చు? ఎక్కువగా ఫర్మెంటెడ్ పదార్ధాల్లో ఈ ప్రోబయోటిక్స్ లభిస్తాయి. పెరుగు, యాపిల్ సిడార్, యోగర్ట్, క్యాబేజీతో చేసే సౌర్‌క్రౌట్, సోయాబీన్స్‌తో చేసే టెంపె, పచ్చళ్లు, మజ్జిగ లాంటివి గట్‌లో గుడ్ బ్యాక్టీరియా పెండచడంలో సాయం చేస్తాయి. వీటిలో లాక్టోబాసిల్లస్, బైఫిడో బాక్టీరియం రకాలు ఎక్కువ ప్రయోజనకారులు. ఎంత డోసేజ్ మంచిది? సాధారణంగా రోజుకు 30 కోట్ల నుంచి 100 కోట్ల సీఎఫ్‌యూ(కాలనీ ఫామింగ్ యూనిట్స్– బ్యాక్టీరియా కొలమాని) ప్రోబయోటిక్స్‌ను డాక్టర్లు రికమండ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రత్యేకించి జీర్ణవ్యవస్థకు సంబంధించి ఇబ్బందులుంటే ఈ మోతాదు మరికొంత పెంచుతారు. లాభాలనేకం: ∙ఇరిటబుల్ బౌల్ సింట్రోమ్(ఐబీఎస్)తో పోరాటంలో కీలకపాత్ర పోషిస్తాయి. దీంతో పాటు గ్యాస్ సమస్యలు, మలబద్ధకం, డయేరియాలాంటి జీర్ణకోశ వ్యాధులు తగ్గించడంలో ఉపయోగ పడతాయి. హీలికోబాక్టర్ పైలోరి వల్ల వచ్చే ఇన్ఫెక్షన్స్, అల్సర్లు, జీర్ణకోశ కాన్సర్పై యుద్ధంలో ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని ప్రోబయోటిక్స్ బరువుతగ్గించేందుకు ఉపయోగపడతాయి. కొన్ని ఇన్ఫ్లమేషన్లపై పోరాటం చేస్తాయి. కొన్ని కీలక బ్యాక్టీరియాలు డిప్రెషన్, యాంగ్జైటీని తగ్గించడంలో సాయపడతాయి. మరికొన్ని ఎల్డీఎల్(బ్యాడ్ కొలెస్ట్రాల్) తగ్గించేందుకు ఉపకరిస్తాయి. ప్రొబయోటిక్స్ కారణంగా చర్మం కాంతి వంతంగా కావడం, మొటిమలు తొలగిపోవడం వంటి ప్రయోజనాలు కూడా ఉంటాయి. సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? సాధారణంగా ప్రోబయోటిక్స్ వాడకంతో ఎలాంటి ఇబ్బందులుండవు. కొందరికి మాత్రం జీర్ణ సంబంధిత తేలికపాటి సమస్యలు ఎదురుకావచ్చు. ఇవి స్వల్పకాలంలోనే తగ్గిపోతాయి. lఅయితే ఎయిడ్స్ పేషంట్లలో మాత్రం ఇవి ఒక్కోమారు తీవ్రమైన ఇన్ఫెక్షన్స్కు దారితీసే ప్రమాదం ఉంది. ∙ఇమ్యూనిటీ సంబంధిత వ్యాధులున్నవారికి సైతం ఇవి కొత్త తలనొప్పులు తెస్తాయి. అందువల్ల తీవ్రమైన వ్యాధులున్నవాళ్లు, గర్భిణులు, పసిపిల్లలు, వయోవృద్దులు ప్రోబయోటిక్స్ వాడేముందు డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. -
డయాబెటిస్‌కు.. టెస్టోస్టిరాన్‌కు లింకు!
ఆస్ట్రేలియా: పురుష హార్మోన్ టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లతో మధుమేహం బారిన పడకుండా నివారించొచ్చా..? అది సాధ్యమే అంటున్నారు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. సుమారు వెయ్యి మందిపై తాము ప్రయోగాలు నిర్వహించి ఈ అంచనాకు వచ్చామని చెబుతున్నారు. ఈ స్థాయిలో ఇదివరకు ఎన్నడూ ప్రయోగాలు జరగలేదని పేర్కొంటున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ పురుష హార్మోన్ స్థాయి తక్కువగా ఉన్న వారు మధుమేహం బారిన పడొచ్చని ఇప్పటికే కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. టెస్టోస్టిరాన్ తక్కువగా ఉన్నప్పుడు లైంగిక కోరికలు తగ్గడంతో పాటు కండరాలు బలహీనపడతాయి. ఎముకలు గుల్ల బారడమూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో అడిలైడ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ అంశంపై పరిశోధనలు చేశారు. 50 నుంచి 74 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ఎంపిక చేసి.. రెండు గుంపులుగా విడదీశారు. ప్రయోగాలకు ఎంపికైన వారందరూ అధిక బరువు లేదా ఊబకాయం సమస్యతో బాధపడుతున్న వారే. ఒక వర్గానికి ప్రతి మూడు నెలలకు ఒకసారి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్ ఇచ్చారు. వెయ్యి మంది అనుసరించేందుకు కొన్ని వ్యాయామాలను సూచించారు. రెండేళ్ల పరిశీలనల తర్వాత పరిశీలించగా ఇరు వర్గాల్లోని వారు సగటున నాలుగు కిలోల బరువు తగ్గారు. సుమారు 22 శాతం మందిలో ఎర్ర రక్త కణాల సంఖ్య ఎక్కువయ్యాయి. రెండో గుంపు వారిలో 21 శాతం మంది మధుమేహం బారిన పడగా.. టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు తీసుకున్న వారిలో 12 శాతం మందికి మాత్రమే మధుమేహం వచ్చింది. హార్మోన్ తీసుకున్న వారి రక్తంలో చక్కెర మోతాదు గణనీయంగా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి మధుమేహం నుంచి తప్పించుకునేందుకు కొంతమందికి టెస్టోస్టిరాన్ ఇంజెక్షన్లు ఓ మార్గం కావచ్చని ఈ పరిశోధనలు చెబుతున్నాయి. కొత్త సోలార్ సెల్స్ భలే! ఖరీదైన సిలికాన్‌తో తయారయ్యే సోలార్సెల్స్కు సమర్థమైన ప్రత్యామ్నాయం లభించింది.పెరోవెక్సైట్ అనే వినూత్న పదార్థంతో తయారు చేసిన సరికొత్త సోలార్ సెల్స్ ఏకంగా 30 శాతం సామర్థ్యంతో పని చేస్తున్నట్లు తాజా పరిశోధనల ద్వారా స్పష్టమైంది. నిజానికి పెరోవెస్కైట్ అనేది ఇటీవలే గుర్తించిన పదార్థమేమీ కాదు. దశాబ్దకాలం కిందటే దీన్ని సౌరశక్తి ఉత్పత్తికి వినియోగించొచ్చని గుర్తించారు. కాకపోతే అప్పట్లో ఈ పదార్థంతో తయారైన సోలార్ సెల్స్ సామర్థ్యం చాలా తక్కువగా ఉండేది. పెరోవెస్కైట్ ప్రత్యేకత ఏంటంటే.. చాలా చౌకగా లభిస్తుంది. దృశ్య కాంతి నుంచి పరారుణ కిరణాల వరకు అన్ని రకాల రేడియోధార్మికతను శోషించుకుని విద్యుత్తుగా మార్చగలదు. సిలికాన్ మాదిరిగా తయారీ కష్టం కాదు. ఎక్కడ కావాలంటే అక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో జర్మనీలోని హెల్మ్హోల్ట్ –జెంట్రమ్ శాస్త్రవేత్తలు తయారు చేసిన పెరోవెక్సైట్ సోలార్ సెల్స్ 30 శాతం సామర్థ్యాన్ని సాధించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఐదేళ్ల కింద ఈ సెల్స్ సామర్థ్యం 13.7 శాతం మాత్రం ఉంది. -
కరోనా తల నుండి కాలివేళ్ల వరకు
కరోనా అనేది గొంతునూ, ఊపిరితిత్తులనూ ప్రభావితం చేస్తుందని అందరికీ తెలుసు. కొందరిలో గుండెను మాత్రమే ప్రభావితం చేస్తుందన్న విషయం కొందరికే తెలుసు. కానీ... నిజానికి కరోనా వైరస్ తల భాగం మొదలుకుని కాళ్ల వరకు అనేక అవయవాలపై తన ప్రభావం చూపుతుంది. అలాగే తలవెంట్రుకల నుంచి కాలివేళ్ల వరకు అనేక అంశాలు సైతం అది సోకే తీరుతెన్నుల్లో వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. అయితే ఇవన్నీ తెలుసుకోవడం భయపడేందుకు కాదు. తెలుసుకొని ఆందోళనపడాల్సిన అవసరమూ లేదు. దేహం పైభాగం మొదలుకొని కిందివరకు ఎలా ఎలా ప్రవర్తిస్తుందో తెలుసుకోవడం చాలా ఆసక్తికరం. అందుకే జుట్టు మొదలుకొని... కాలి గోటి వరకు అదెలా ప్రభావం చూపుతుందనే అంశాలను తెలుసుకుందాం. అవగాహన పెంచుకుందాం. ఆందోళనను దూరం చేసుకుందాం. మెదడు కరోనా కారణంగా కొందరిలో పక్షవాతం రావడాన్ని వైద్యనిపుణులు గుర్తించారు. అయితే ఈ లక్షణం చాలా చాలా అరుదుగా మాత్రమే కనిపించింది. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్నవారిలో రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల క్లాట్స్ ఏర్పడి.. ఇలా జరగడం కనిపించింది. అలాగే కొందరిలో రక్తంలో ఆక్సిజన్ తగ్గడం వల్ల మెదడుకు సరైన మోతాదులో ఆక్సిజన్ అందక మెదడు గాయపడటం కూడా జరిగింది. నాలుక – ముక్కు కోవిడ్–19 సోకిన రోగుల్లో వాసనలూ, రుచి తెలియకపోవడం అన్నది ఒక ప్రధానమైన లక్షణం అన్నది ఇప్పటికే మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఈ లక్షణం తగ్గిందంటే... మన వ్యాధి నుంచి క్రమంగా బయటపడుతున్నామన్నదానికి ఓ ప్రధాన సంకేతంగా పరిగణించవచ్చు. ఊపిరితిత్తులు కరోనా వైరస్ కారణంగా అత్యధికుల్లోనూ, అత్యధికంగానూ ఊపిరితిత్తులే ప్రభావితమవుతాయన్న సంగతి అందరికీ తెలిసిందే. లంగ్స్‌లో ఉండే ఏసీఈ–2 రిసెప్టార్స్ కారణంగా ఈ పరిణామం సంభవిస్తుంది. అలాగే నిమోనియా లాంటి పరిణామాలూ ఏర్పడుతుండటమూ తెలిసిందే. ఇక వైరస్ ప్రభావంతో రక్తనాళాల్లో రక్తం కడ్డకట్టి క్లాట్స్ ఏర్పడి... రక్తప్రవాహంతోపాటు అవి ఊపిరితిత్తుల్లోకి కొట్టుకురావడం... దాని వల్ల గాలిమార్పిడి ప్రక్రియకు అవరోధం కలగడం మనందరికీ తెలిసిందే. మూత్రపిండాలు కోవిడ్–19 వ్యాధి కారణంగా కొందరిలో మూత్రపిండాలు దెబ్బతిని ‘అక్యూట్ కిడ్నీ డిసీజ్’కు దారితీయడాన్ని నిపుణులు గుర్తించారు. ఇక అకస్మాత్తుగా బ్లడ్‌ప్రెజర్ పడిపోవడం, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోవడం వల్ల కూడా కిడ్నీలు ప్రభావితం కావడం కనిపించింది. రోగులకు వాడే రకరకాల మందులు సైతం కిడ్నీలపై దుష్ప్రభావం చూపడం కూడా కొంత కనిపించింది. ఇక చాలామంది కోవిడ్–19 రోగుల్లో మూత్రం ద్వారా ప్రోటీన్ పోవడాన్ని వైద్యనిపుణులు తరచూ గమనించడం జరుగుతోంది. రక్తనాళాలు కోవిడ్–19 సోకిన వారిలో రక్తనాళాలు చాలా ఎక్కువగా ప్రభావితం కావడాన్ని గుర్తించారు. గతంలో కోవిడ్–19ను ప్రధానంగా శ్వాసవ్యవస్థకు చెందిన వ్యాధిగా పరిగణించేవారు కదా. అయితే ఇటీవలి అధ్యయనాల తర్వాత దీన్ని శ్వాస వ్యవస్థకు చెందిన వ్యాధిగా కంటే... ప్రధానంగా రక్తనాళాలకు చెందిన వ్యాధిగానే ఎక్కువగా గుర్తిస్తున్నారు నిపుణులు. రక్తనాళల్లోని అంతర్గత పొర అయిన ‘ఎండోథీలియమ్’ ఎక్కువగా ప్రభావితమై దెబ్బతిన్నట్లుగా, రోగుల్లో మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో తేలింది. ఇలా రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తపు క్లాట్స్... ఏయే అవయవాలకు చేరితే... ఆయా అవయవాలు బాగా దెబ్బతిన్నట్లుగా కూడా నిపుణులు గమనించారు. క్లోమగ్రంథి (పాంక్రియాస్) కోవిడ్–19 సోకాక కొందరిలో ‘అక్యూట్ పాంక్రియాటైటిస్’ కనిపించవచ్చు. కరోనా వల్ల వచ్చే అక్యూట్ పాంక్రియాటైటిస్‌లో రక్తంలో షుగర్ అధికంగా ఉండటం, దాంతోపాటు లిపిడ్స్ అధికంగా ఉండటాన్ని నిపుణులు గుర్తించారు. ఎండోక్రైన్ సిస్టమ్ కరోనా వైరస్ సోకిన కొందరిలో రక్తంలోని చక్కెర పాళ్లు అకస్మాత్తుగా పెరగడాన్ని చాలామంది రోగుల విషయంలో డాక్టర్లు గుర్తించారు. గతంలో డయాబెటిస్ లేని చాలామంది రోగుల్లోనూ ఈ పరిణామం సంభవించడాన్ని నిపుణులు చూశారు. అదేవిధంగా షుగర్ ఉన్న వారిలో కనిపించే ‘డయాబెటిక్ కీటో అసిడోసిస్’ అనే కాంప్లికేషన్‌ను కూడా కోవిడ్–19 రోగుల్లో గుర్తించారు. కాలివేళ్ల చివరలు (కోవిడ్ టోస్) కొంతమంది రోగుల్లో కాలివేళ్ల చివర్లలో మంట, తిమ్మిర్లు కనిపించాయి. అలాగే అవి ఊదా (పర్పులు) రంగులోకి మారడమూ నిపుణులు గుర్తించారు. ఇలా జరిగే పరిణామానికి ‘కోవిడ్ టోస్’గా పేరుపెట్టారు. కొందరిలో రక్తపు గడ్డలు కాలివేళ్ల చివరలకు చేరడం వల్ల అవి ఇన్ఫ్లమేషన్ (మంట, వాపు)లకు గురికావడం కూడా కనిపించింది. జుట్టు మీకో విషయం తెలుసా? కరోనా వైరస్ సోకుతున్న క్రమంలో అనేకానేక నిశితమైన పరిశీలనలను బట్టి చూస్తే... మామూలుగా తల నిండా ఒత్తుగా, పూర్తిగా జుట్టున్న వారితో పోలిస్తే బట్టతల (మేల్ బాల్డ్నెస్ పాటర్న్) ఉన్న వారిపై ఒకింత ఎక్కువ ప్రభావాన్ని చూపుతోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఇదే అంశాన్ని మరో రకంగా కూడా చెప్పవచ్చు. బట్టతల వచ్చే అవకాశం పురుషులకే ఎక్కువ కదా. ఇలా బట్టతల ఉన్న పురుషులకే కరోనా ఎక్కువగా సోకడాన్ని వైద్యనిపుణులూ, పరిశోధకులూ ‘గాబ్రిన్’ సైన్‌గా పరిగణిస్తున్నారు. కరోనా వైరస్ సోకిన వారికి చికిత్స చేస్తూ మరణించిన తొలినాటి డాక్టర్లలో ఒకరైన డాక్టర్ గాబ్రిన్ పేరు మీద ఈ అంశాన్ని ‘గాబ్రిన్ సైన్’గా చెబుతున్నారు. అలాగే కరోనా వైరస్ సోకాక విపరీతంగా మానసిక ఒత్తిడికి గురైన వారిలో సైతం జుట్టు విపరీతంగా రాలిపోవడం కూడా పరిశోధకులు గమనించారు. మామూలుగానే మానసిక ఒత్తిడికి జుట్టు రాలిపోవడం సహజం. దానికి తోడు ఈ కరోనా ఒత్తిడి మరింత అధికంగా కావడంతో అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా మారుతోంది. చర్మం కరోనా ప్రభావంతో చర్మంపై ఎర్రటి దద్దుర్లు, ర్యాష్‌తో పాటు చిన్న పగుళ్లలాంటి గాయాలు, గుల్లలు, మచ్చలు, చర్మం ఎర్రబారడాలు ఇలా ఎన్నెన్నో రూపాల్లో కనిపిస్తాయి. గుండె కొన్నిసార్లు కోవిడ్–19 నేరుగా గుండెను ప్రభావితం చేస్తుంది. అంతేకాదు... కొందరిలో గుండెపోటును పోలిన సిండ్రోమ్‌కు కారణమవుతుంది. అయితే యాంజియోగ్రామ్ చేస్తే మాత్రం గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే రక్తనాళల్లో ‘క్లాట్’ కనపడదు. ఇక మరికొందరిలో ‘టెంపరరీ బెలూనింగ్’ కారణంగా ‘బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్’ వంటి సమస్యలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వైరస్ వల్లగానీ లేదా క్లోరోక్విన్ వంటి మందులు వాడటం వల్లగానీ గుండె స్పందనల లయ (రిథమ్)లో తేడాలు రావచ్చు. ఇక కోవిడ్–19 సోకిన కొందరిలో అకస్మాత్తుగా గుండెపోటు రావడం మనందరమూ చూసిందే. జీర్ణవ్యవస్థలో కోవిడ్–19 సోకిన వారిలో అందరిలోనూ కనిపించే జ్వరం, దగ్గు, ఊపిరి అందకపోవడం వంటి సాధారణ లక్షణాలతోపాటు మరికొందరిలో నీళ్లవిరేచనాలు కావడం కూడా మామూలే. చాలామంది రోగులకు మలపరీక్ష నిర్వహించినప్పుడు వారు విసర్జించిన మలంలోనూ ‘కరోనా వైరస్’ (సార్స్ సీవోవీ–2) ఉన్నట్లు గుర్తించారు. కాలేయం కోవిడ్–19 సోకిన చాలామంది రోగుల్లో అనేక కాలేయ స్రావాలైన ఎంజైములు చాలా ఎక్కువ మొత్తంలో స్రవించిన దాఖలాలున్నాయి. అన్నట్టు... వైరస్ తీవ్రత పెరుగుతున్న కొద్దీ కాలేయ స్రావాలూ పెరగడాన్ని కూడా గమనించారు. వైరస్‌ను చంపడానికి ఇచ్చే మందులతో కాలేయం కూడా ఎంతో కొంత ప్రభావితమయ్యే అవకాశాలూ ఉన్నాయి. అందుకే అప్పటికే కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగులకు కోవిడ్–19 సోకినట్లయితే... వారు మెరుగుపడే అవకాశాలు మామూలు వారికంటే కాస్తంత ఆలస్యం కావడం నిపుణులు గుర్తించారు. ఇక వైరస్ కారణంగా దేహంలోని గాల్‌బ్లాడర్ సైతం ప్రభావితం కావడాన్నీ గమనించారు. మానసిక ప్రభావాలు వైరస్ సోకిన రోగుల్లో మానసిక ఒత్తిడి పెరగడం, స్పష్టత లోపించడం, అయోమయానికి గురికావడం, మెదడుకు రక్తసరఫరా తగ్గడంతో పాటు అనేక రకాల మానసిక సమస్యలు ఎదురుకావడం చాలా స్పష్టంగా కనిపించింది. ప్రత్యుత్పత్తి అవయవాలు చాలామంది మహిళా రోగుల్లో వారి గర్భం నుంచి బిడ్డకు కోవిడ్–19 సోకిన దాఖలాలు చాలా స్పష్టంగా కనిపించాయి. ఇలా మనకు తెలిసిన అవయవాలనే గాక ఇంకా అనేకానేక అవయవాలను ప్రభావితం చేయడం గురించి మనం ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇన్నిన్ని అవయవాలపై ఇన్ని రకాలుగా ప్రభావం చూపినప్పటికీ చాలా తక్కువ మందిలో మాత్రమే... అంటే దాదాపు 90 శాతం రోగుల్లో ఇది ప్రమాదకారి కానేకాదు. అయితే ఇటీవల కొందరు వ్యాధి కంటే అనవసరమైన ఆందోళనలతోనే ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. ఇన్ని అవయవాలను అది ప్రభావితం చేసినా... అసలు వ్యాధి కంటే ఆందోళనే ఎక్కువగా ప్రమాదకారి అవుతోందని గుర్తిస్తే... దాని నుంచి ముప్పే ఉండదన్న విషయం మనందరికీ స్పష్టమవుతోంది. అనేక అధ్యయనాల్లోనూ ఇది తేలింది. అందుకే విషయం తెలుసుకోండి. నిర్భయంగా ఉండండి. -
జన్యుపదార్థం హైజాక్...
వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ మన కణంలోని జన్యు పదార్థాన్ని హైజాక్ చేయడంతో సమస్య మొదలవుతుంది. శరీర వ్యవస్థ మానవ ప్రొటీన్లకు బదులుగా వైరస్ తాలూకు ప్రొటీన్లు తయారు చేయడం మొదలుపెడుతుంది. ఇది కాస్తా వైరస్ ఆర్ఎన్ఏల సంఖ్య పెరిగేందుకు కారణమవుతుంది. మరికొన్ని ఇతర వైరస్ ప్రొటీన్లు కణాలను నిర్వీ ర్యం చేస్తాయి. కణాలు శరీరానికి అవసరమైన పనులు కాకుండా.. వైరస్‌కు కావాల్సిన పనులు చేయడంలో బిజీ అయిపోతాయి. వైరస్ ఆర్ఎన్ఏ సంఖ్య పెరిగిపోతున్న కొద్దీ అవి కణం బయటకు వచ్చేసి మరిన్ని కణాలను ఆక్రమించేస్తాయి. ఊపిరితిత్తులు, గొంతు, నోరు మొత్తం వైరస్‌లతో నిండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్క రోజులో లక్షల రెట్లు పెరిగిపోయే వైరస్ రక్తం ద్వారా జీర్ణ వ్యవస్థలోకి చేరుతుంది. -
వైరస్ దండయాత్ర ఇలా..
కరోనా వైరస్ బయటి పొర కొవ్వులతో తయారై ఉంటుంది. అక్కడక్కడా ముళ్ల వంటి స్పైక్ ప్రొటీన్లు ఉంటాయి. వైరస్ మధ్యభాగంలో ఉండచుట్టుకుపోయిన జన్యుపదార్థం (ఆర్ఎన్ఏ) ఉంటుంది. ఊపిరితిత్తి కొమ్మపై పెరిగిపోయిన వైరస్లు నెమ్మదిగా శ్లేష్మం (మ్యూకస్) ద్వారా శరీర కణాలకు అతుక్కుపోతాయి. వైరస్ల కంటే బాగా పెద్దసైజులో ఉండే కణాలు వైరస్‌లను అడ్డుకునే ఏర్పాట్లు ఉన్నా.. ఓ చిన్న లోపమూ ఉంటుంది. కణాలపైన పొడుచుకుని బయటకు వచ్చి ఉండే ఏస్–2 రిసెప్టర్లకు కరోనా వైరస్ అతుక్కుపోతుంది. ఈ దశలోనే వైరస్ తాలూకు ఆర్ఎన్ఏ కణంలోకి చేరిపోతుంది. దీంతో వైరస్ దండయాత్ర మొదలవుతుంది! -
చెమట ఎక్కువగా పడుతుంటే ?
చెమట పట్టడం మంచి సూచన. ఒంట్లో అధికంగా ఉన్న వేడిమిని తగ్గించేందుకు, ఒంటికి పడని వ్యర్థాలను బయటికి పంపేందుకు దేహ ధర్మానుసారం చెమట పడుతుంది. అయితే చెమట అధికంగా పడుతుంటే మాత్రం అది దేనికైనా సంకేతమా అని ఆలోచించాలి. సమస్యేమిటో తెలుసుకుని పరిష్కరించుకోవాలి. సాధారణంగా 8 కారణాల వల్ల ధారాపాతంగా చెమటలు పడుతుంటాయి. ఒత్తిడి: ఆదుర్దా, ఆందోళన, మానసిక ఒత్తిడి వల్ల చెమటలు ఎక్కువగా పడుతుంటాయి. చర్మంపై బ్యాక్టీరియా కూడా చెమటకు కలవడం వల్ల కొందరిలో చెమట వాసన కూడా వస్తుంది. థైరాయిడ్ సమస్య (హైపోథైరాయిడిజం): గొంతు భాగంలో థైరాయిడ్ గ్రంథి ఉంటుంది. అది కనుక మితిమీరిన చురుకుదనంతో ఉంటేథైరాయిడ్ హార్మోన్ విపరీతంగా ఉత్పత్తి అవుతుంది. ఇలాంటప్పుడు చెమట ఎక్కువగా పడుతుంది. లో బ్లడ్ షుగర్ (హైపో గ్లైసీమియా): రక్తంలో గ్లూకోజ్ మోతాదులు పడిపోయే స్థితే హైపో గ్లైసీమియా. ఇలాంటప్పుడు బయటి ఉష్ణోగ్రతలతో నిమిత్తం లేకుండా చెమటలు పడతాయి. హైపర్ హైడ్రోసిస్: శరీరంలో ఒక భాగం మీద మాత్రమే చెమట పడుతుంటే అది హైపర్ హైడ్రోసిస్. ఈ స్థితిలో స్వేద గ్రంధులు ఎక్కువగా ఉండే.. మెడ, అరిచేతులు, అరికాళ్లలో చెమట పడుతుంటుంది. మందుల దుష్ప్రభావాలు: కొన్ని రకాల మందుల కారణంగా కూడా చెమట ఎక్కువగా పడుతుంది. ఉదా: యాంటీబయాటిక్స్, బీపీ మందులు, మానసిక రుగ్మతలకు వాడే మందుల వల్ల కొందరిలో చెమటలు పోయడం ఉంటుంది. మెనోపాజ్: మెనోపాజ్ దశకు చేరుకుంటున్నప్పుడు, చేరుకున్న తర్వాత హార్మోన్ల ఉత్పత్తిలో హెచ్చు తగ్గుల కారణంగా చెమటలు పడుతుంటాయి. ఇవికాక... స్థూలకాయం, కారణం తెలియని జ్వరం వల్ల కూడా చెమటలు ఎక్కువగా పోయడం జరుగుతుంది. -
20 శవాలతో ఎగ్జిబిషన్
-
శవాలతో ఎగ్జిబిషన్
సిడ్ని : ఈ ఎగ్జిబిషన్‌లోకి అడుగు పెట్టగానే మనషుల శవాలు స్వాగతం పలుకుతాయి. శరీర భాగాలు మిమ్మల్ని భయపెడతాయి. మన శరీరం లోపలి నిర్మాణం ఎలా ఉంటుంది. అవయవాలు ఎలా పనిచేస్తాయి. ఏ పని చేసినపుడు ఏ కండరం కదులుతుంది. ఇలా ఒకటేమిటి ఎన్నో విషయాలు అక్కడ తెలుసుకోవచ్చు. ఏకంగా 20 శవాలు, 200లకు పైగా విడి శరీర భాగాలను ప్రదర్శనలో ఉంచారు. సిడ్నీ నగరంలో మనషుల శవాలతో, శరీర భాగాలతో ఓ ప్రదర్శన ఏర్పాటు చేశారు. మనిషి శరీర భాగాల పనితీరు ఎలా ఉంటుందన్న దానిపై ఓ అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్ధేశమని నిర్వాహకులు తెలిపారు. డాక్టర్లు చెప్పిన శవాల సంగతులు.. ఈ ప్రదర్శనలో ఉంచిన శవాలను చక్కగా తీర్చిదిద్దిన డాక్టర్లు కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అసలు ఆ శవాలు ఇష్టపూర్వకంగా ప్రదర్శనకు ఇచ్చినవి కావని, అవి చైనాకు చెందిన ఓ నిషేధిత ఫాలున్ గాంగ్ తెగకు చెందినవిగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. వారందరూ మరణ శిక్ష విధించబడిన ఖైదీలు అయ్యిండొచ్చన్నారు. వారిని తీవ్రంగా హింసించడం వల్లే వారు మరణించారని తెలిపారు. ప్రదర్శన నిర్వాహకుడు టామ్ జాలర్ మాట్లాడుతూ.. శవాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి తప్పు జరగలేదని, సహజంగా మరణించిన వారి శవాలను మాత్రమే ప్రదర్శనకు ఉంచినట్లు చెప్పారు. ఏది ఏమైనప్పటికి ఈ శవాల ప్రదర్శనను చూడ్డానికి ప్రజలు మాత్రం చాలా ఆసక్తి చూపుతున్నారు. -
కనిపించకుండా పోయి మొసలి పొట్టలో..
బాలిక్పాపన్ (ఇండోనేషియా) : కనిపించకుండా పోయిన ఓ వ్యక్తి మొసలికి ఆహారంగా మారాడు. ఆఖరికి అతడి చేతులు, కాళ్లు మాత్రమే ఆ మొసలి పొట్టలో కనిపించాయి. ఈ విషయాన్ని ఇండోనేషియా పోలీసులు శుక్రవారం వెల్లడించారు. పోలీసుల వివరాల ప్రకారం ఓ పామాయిల్ తోటలో పనిచేసే వ్యక్తి దానికి సమీపంలోని నది ఒడ్డుకు వెళ్లాడు. అయితే, అక్కడ అతడి బైక్, చెప్పులు మాత్రమే కనిపించాయి. దాంతో పోలీసులు ఆ నదిలో తీవ్రంగా గాలింపులు జరిపారు. అయితే, అందులో కొంత చిద్రమైన దేహం కనిపించింది. అదే సమయంలో ఒడ్డుకు సమీపంలోనే వారికి ఓ మొసలి కనిపించింది. దాంతో పోలీసులు దాన్ని కాల్చి చంపారు. అనంతరం దాని పొట్ట చీల్చి చూడగా అందులో ఆ వ్యక్తి కాలు, చేయి బయటపడ్డాయి. ఆ మొసలి దాదాపు ఆరు మీటర్లు (20 అడుగులు) పొడవుంది. బహుశా అతడు స్నానానికి దిగిన సమయంలో మొసలి దాడి చేసి ఉంటుందని పోలీసులు చెప్పారు. గతంలో కూడా ఆ మొసలి బారిన పడి ఓ రష్యన్ వ్యక్తి చనిపోయినట్లు వారు వెల్లడించారు. -
మనిషి ఆకారంలో జన్మించిన గొర్రె పిల్ల
ప్రకాశం, ఉలవపాడు: చాకిచర్ల పల్లెపాలెం గ్రామంలో మనిషి ఆకారంలో ఆదివారం ఓ వింత గొర్రె పిల్ల జన్మించింది. దీనికి వీపు, తల, కాళ్లు, చేతులు ఉండటంతో గ్రామస్తులు చూడటానికి ఎగబడ్డారు. కాసేపటికే గొర్రె పిల్ల మరణించడంతో గ్రామస్తులు దాన్ని పూడ్చివేశారు. -
అతిగా నీళ్లు తాగుతున్నారా?, బీ కేర్‌ఫుల్..
క్యాన్బెరా: అతి ఏదైనా అనర్థమే అన్నది నూటికి నూరుపాళ్ళు నిజమే అంటున్నారు పరిశోధకులు. ప్రాణాధారంగా భావించే నీరే కొన్నిసార్లు ప్రాణాలను తీస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. శరీరం అవసరానికి మించి నీరు తాగితే వాంతులు, కళ్ళు తిరగడం వంటివి సంభవించి కొన్నిసార్లు కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. దీనిమీద ఆస్ట్రేలియాకు చెందిన మోనాష్ యూనివర్శిటీ పరిశోధకులు ఓ అధ్యయనాన్ని నిర్వహించారు. కొంతమందిని రెండు గ్రూపులుగా విభజించి ఒక గ్రూపు చేత అవసరం లేకున్నా నీరు తాగించారు. మరొక గ్రూపు చేత అవసరం ఉన్నంత మేరకే నీరు తాగించారు. అనంతరం రెండు గ్రూపుల వారి ఆరోగ్యాన్ని పరీక్షించారు. అవసరానికి మించి నీరు తాగిన వారిలో వాంతులు, వికారం, కళ్ళు తిరగడం వంటి లక్షణాలు కనిపించాయి. రెండో గ్రూపులో అలాంటివి కనిపించలేదు. మొదటి గ్రూపు వారిలో కనిపించిన లక్షణాలను ఏ మాత్రం ఆలస్యం చేసినా కోమాలోకి వెళ్ళే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు. water, coma, body, danger -
శరీరంలో 75% చెత్త డీఎన్ఏ
హ్యూస్టన్: మానవ శరీరంలోని జన్యువుల్లో 75 శాతం పనికిరాని (జంక్) డీఎన్ఏ ఉంటుందని వెల్లడైంది. మనిషి శరీరంలో 10 నుంచి 15 శాతం జన్యువులు మాత్రమే పనికొచ్చేవి ఉంటాయని పరిశోధకులు తెలిపారు. ఇలా శరీర క్రియలు నిర్వహించే జన్యువుల సంఖ్య శరీరంలో 25 శాతానికి మించి ఉండదని అమెరికాలోని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు వివరించారు. మిగతా 75 శాతం డీఎన్ఏ ఏ క్రియలను నిర్వర్తించవని, వీటి వల్ల శరీరానికి ఏ ఉపయోగం గానీ.. హాని గానీ ఉండదని వారు స్పష్టం చేశారు. గత పరిశోధనల్లో మానవ శరీరంలో 80 శాతం జన్యువులు క్రియాశీలకమైనవని వెల్లడించగా.. తాజా అధ్యయన ఫలితాలు దానికి పూర్తి వ్యతిరేకంగా రావడం గమనార్హం. ఈ ఫలితాలు మన జన్యువులపై మరింతగా పరిశోధనలు చేయాల్సిన ఆవశ్యకతను తెలుపుతున్నాయని హ్యూస్టన్ వర్సిటీ పరిశోధకులు డాన్గ్రాయర్ తెలిపారు. -
మన శరీరం ద్వారా స్మార్ట్ సిగ్నల్స్ పంపొచ్చు
వై-ఫై లాంటి రేడియో తరంగాలు లేదా బ్లూటూత్ ద్వారా పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను ఒక ఎలక్ట్రానిక్ పరికరం నుంచి మరో ఎలక్ట్రానిక్ పరికరానికి పంపిస్తే ఆ పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను మధ్యలోనే హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఉదాహరణకు మనంటికి స్మార్ట్‌లాక్ ఉండి, దానికి మన సెల్‌ఫోన్‌ను అనుసంధానించి ఉంటే.. డోర్ లాక్ ఓపెన్ చేయాలంటే సీక్రెట్ కోడ్‌ను సెల్‌ఫోన్ ద్వారా ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఆ కోడ్‌ను గాల్లో ఉండగానే తస్కరించే సైబర్ దొంగలు ఎప్పుడూ ఉంటారు. (సందేశాల విషయంలో అయితే ఇలా జరగకుండా ఎన్క్రిప్షన్ ఉంటుంది) మరి అలాంటివారి బారిన పడకుండా పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను రిసీవర్‌కు పంపాలంటే ఎలా? అందుకు ఏదీ అత్యుత్తమ మార్గం. ఇలాంటి సందేహమే వాషింగ్టన్ యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పరిశోధకులకు వచ్చింది. ఫింగర్ ప్రింట్స్, టచ్ స్క్రీన్లను ప్రస్తుతం ఇన్ప్రింట్గా వాడుతున్నామని, వాటినే అవుట్ ప్రింట్‌గా వాడలేమా అన్న అనుమానం కూడా వారికి వచ్చింది. అంతే తలలో తళుక్కున ఓ ఆలోచన మెరిసింది. అదే మన శరీరం నుంచి సిగ్నల్స్ ద్వారా పాస్వర్డ్ లేదా సీక్రెట్ కోడ్‌ను పంపించడం. ఈ ఆలోచన రాగానే మానవ శరీరం సిగ్నల్స్ ప్రసార వాహకంగా పనిచేస్తుందా లేదా ముందుగా తెలుసుకోవాలనుకొని ప్రయోగం జరిపి చూశారు. ఊహించని విధంగా విజయం సాధించారు. పైగా ఎలక్ట్రానిక్ పరికరాల నుంచి మరో ఎలక్ట్రానిక్ పరికరానికి పంపించే సిగ్నళ్ల ఫ్రీక్వెన్సీ కంటే అతి తక్కువ ఫ్రీక్వెన్సీతో శరీరం గుండా సిగ్నల్స్‌ను పంపించవచ్చని గుర్తించారు. మానవ శరీరం ద్వారా సిగ్నల్స్‌ను 30 మెగాహెర్ట్జ్ కన్నా తక్కువ ఫ్రీక్వెన్సీలో పంపించవచ్చని తేలింది. అలాగే ఫింగర్ ప్రింట్స్, టచ్ పాడ్స్ నుంచి రెండు నుంచి పది మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ సిగ్నల్స్ సులభంగా ప్రసారం అవుతాయని పరిశోధకులు గుర్తించారు. ఇంటికున్న స్మార్ట్‌లాక్‌ను ఓపెన్ చేయాలంటే మన స్మార్ట్ ఫోన్ నుంచి రేడియో తరంగాల ద్వారా సిగ్నళ్లను పంపించాల్సిన అవసరం లేదు. మన శరీరం ద్వారానే పంపించవచ్చని పరిశోధకుల ప్రయోగం ద్వారా రుజువైంది. అంటే ఫింగర్ ప్రింట్ ద్వారా స్మార్ట్ అప్లికేషన్‌ను పట్టుకొని మరో చేతితో డోర్ నాబ్‌ను పట్టుకుంటే మన శరీరం ద్వారా లాక్ పాస్వర్డ్ లేదా కోడ్ వర్డ్ డోర్ ఎలక్ట్రానిక్ డివైస్‌కు చేరుకొని డోర్ తెరుచుకుంటుంది. రేడియో తరంగాలు మధ్యలో గాలిలో ప్రయాణించవు కనుక వాటిని మధ్యలో ఎవరూ తస్కరించే అవకాశమే లేదు. ఈ సిగ్నల్స్ ప్రసారం చేతి నుంచి చేతికే కాకుండా చేతి నుంచి కాలుకు, మోచేతికి, తలకు, శరీరంలో ఏ అవయం వరకైనా వెళతాయని కూడా పరిశోధకులు కనుగొన్నారు. తాము చేసిన ఈ ప్రయోగం ప్రాథమికంగా గ్లూకోమీటర్, ఇన్సులిన్ పంపింగ్ మిషన్ తదితర వైద్య పరికరాలతోపాటు ఇంట్లోని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ పరికరాలను పని చేయించడానికి ఉపయోగపడుతుందని, భవిష్యత్తులో మరిన్ని ఊహించని ప్రయోజనాలు ఉండవచ్చని వారన్నారు. 'ది ఇంటెల్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఫర్ పర్వేసివ్ కంప్యూటింగ్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్' ఈ పరిశోధనకు నిధులు సమకూర్చింది. -
దురద, నొప్పికి తేడా ఉందా?
దురద అనేది చర్మానికి సంబంధించిన ఒక రకమైన సమస్య. కొన్ని రకాల వ్యాధులు, పొడి చర్మం, ఎలర్జీ వంటి వాటి వల్ల దురద పుడుతుంది. హిస్టామినన్ అనే రసాయనానికి ఎలర్జీని కలిగించే శక్తి ఉంటుంది. ఆ రసాయనాన్ని విడుదల చేసే విధంగా, కొన్ని పదార్థాలు మన శరీరంపై తమ ప్రభావాన్ని చూపినప్పుడు ఎలర్జీ రావడంతో దురద పుడుతుంది. ఉదాహరణకు దోమలు, కొన్ని రకాల పురుగులు కుట్టినప్పుడు కలిగే దురద ఈ రకానికి చెందినదే. కొన్ని రకాల దురదలు తాత్కాలికంగా మాత్రమే ఉంటే మరికొన్ని రకాల దురదలు ఏళ్ళ తరబడి ఉంటాయి. 19వ శతాబ్దంలో, ఫ్రాన్స్ కు వెళ్లి వచ్చిన అమెరికా సైనికులకు ఒక వ్యాధి కారణంగా మొదలయ్యే దురద కనీసం ఏడేళ్ల పాటు వారిని వేధించేది. దాంతో ఆ దురదకి ఏడేళ్ల దురద, ఫ్రెంచి దురద అని పేరు పెట్టారు. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధుల వల్ల వచ్చే దురదలు కూడా అంత సులభంగా తగ్గవు. అయితే అలాంటి వ్యాధులకు వైద్యుల పర్యవేక్షణలో తప్పనిసరిగా చికిత్స తీసుకోవలసి ఉంటుంది. సాధారణంగా దురద అనేది శరీరంలో ఏదో ఒక ప్రదేశానికో, లేదా కొన్ని ప్రదేశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. దీనికి భిన్నంగా నొప్పి శరీరం అంతటా లేదా శరీరంలోని ఏదో ఒక భాగానికే పరిమితమై ఉండవచ్చు. అయితే దురదలాగా అది కేవలం చర్మానికి మాత్రమే పరిమితమై ఉండదు. దురద అనేది శరీరంపై జరిగే ఒక దాడికి లేదా చర్మవ్యాధికి సంకేతంగా నిలిస్తే, నొప్పి అనేది శరీరానికి వచ్చిన ఒక కష్టానికి సంకేతంగా నిలుస్తుంది. -
మానవ శరీరంలో బ్యాక్టీరియా వర్తకం
న్యూయార్క్: కొనడం, అమ్మడం, ఇచ్చిపుచ్చుకోవడం లాంటి ఆర్థిక శాస్త్ర భావనలు కేవలం మానవులకే పరిమితం కాదని తేలింది. భూమ్మీద, మానవ శరీరంలో నివాసముండే సూక్ష్మజీవులు కూడా వాణిజ్య సూత్రాలను పాటిస్తాయని తాజా పరిశోధనలో వెల్లడైంది. సూక్ష్మజీవులు ఒకదానితో ఒకటి క్లిష్టమైన విధానాల ద్వారా ప్రతిస్పందిస్తాయని, ఇది అంత సులభంగా అర్థమయ్యేది కాదని పరిశోధకులు తెలిపారు. పెద్ద సమాజాలుగా ఉండే సూక్ష్మక్రిములు అణువులు, ప్రొటీన్ల పరస్పర మార్పిడి ద్వారా మనుగడ సాగిస్తాయని పేర్కొన్నారు. తమ వృద్ధి కోసం సహచర బ్యాక్టీరియాతో ఇచ్చిపుచ్చుకునే ధోరణి అనుసరించే సూక్ష్మక్రిములను ఆధునిక సమాజంలోని దేశాలతో సరిపోల్చవచ్చని అన్నారు. క్లారెమంట్ గ్రాడ్యుయేట్, బోస్టన్, కొలంబియా విశ్వవిద్యాలయాల పరిశోధకులు ఇందులో పాల్గొన్నారు. ఈ స్థితిని ఆర్థిక శాస్త్రంలోని సాధారణ సమతౌల్య సిద్ధాంతంగా వారు అభివర్ణించారు. -
మరణిస్తే వాసన ఎందుకు?
మనిషి బతికున్నపుడు అనేక సెంట్లు, ఫెర్ఫ్యూములు వాడతాడు. కానీ, చనిపోగానే దుర్గంధం రావడం మొదలవుతుంది. దీనికి కారణం ఏంటంటే? శరీరంలో ఉండే బ్యాక్టీరియా. బ్యాక్టీరియాలు సూక్ష్మ జీవులు. ఇవి పరపోషితాలు. ఇతర జీవులపై ఆధారపడి జీవనం సాగిస్తాయి. మనిషి బతికి ఉన్నంత కాలం మనిషిలో చేరి మన శరీరంలోని ఆహార పదార్థాలని తింటూ జీవిస్తాయి. బ్యాక్టీరియాలు మనిషిలోని ఆహార పదార్థాలను వాటికనుకూలంగా మార్పు చేసుకుని తింటాయి. ఈక్రమంలో కొన్ని రకాల రసాయనాలు కూడా విడుదలవుతాయి. మనిషి బతికి ఉన్నపుడు ఎలాంటి రసాయనాలు విడుదలైనా మనలో ఉండే రక్షణ వ్యవస్థ వాటిని ఎప్పటికప్పుడు నిర్మూలిస్తుంది. కానీ, మరణించాక రక్షణ వ్యవస్థ పనిచేయదు. దీనివల్ల బ్యాక్టీరియాలు శరీరంలో వివిధ రకాల రసాయనాలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో దుర్గంధం బయటికి వస్తుంది. అందుకే మనిషి లేదా జంతువులు మరణించినపుడు దుర్వాసన వస్తుంటుంది. -
ఎర్ర రక్త కణాలు లేని రక్త భాగం ఏది?
రక్తం - రక్త కణాలు మానవ శరీరంలో రక్తం జీవనది లాంటిది. ఇది ద్రవరూప కణజాలం. శరీరంలోని వివిధ భాగాల మధ్య పదార్థాల రవాణాను నిర్వహిస్తుంది. ఆహార పదార్థాలు, శ్వాసవాయువులు, హార్మోన్లు, విసర్జక పదార్థాల రవాణాను రక్తం నిర్వహిస్తుంది. రక్తంలోని తెల్ల రక్త కణాలు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. రక్తం శాస్త్రీయ అధ్యయనాన్ని ‘హెమటాలజీ’ అంటారు. రక్తం, రక్తకణాలు అస్థిమజ్జ నుంచి ఏర్పడే విధానాన్ని ‘హీమోపాయిసిస్’ అంటారు. కొంతమందిలో జన్యులోపం కారణంగా రక్తం సరిగా ఏర్పడదు. దీన్ని ‘థాలసీమియా’ అంటారు. రక్తంలో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగం ప్లాస్మా. ఇది రక్తంలో 55 శాతం. మిగిలిన 45 శాతం రక్తకణాలు ఉంటాయి. ప్లాస్మాలో 92 శాతం నీరు, మిగిలిన 8 శాతం కర్బన, అకర్బన పదార్థాలు ఉంటాయి. రక్తకణాలు మూడు రకాలు - ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు, రక్త ఫలకికలు (్క్చ్ట్ఛ్ఛ్టట). రక్తకణాలను ఎరిత్రోసైట్స్ అంటారు. ఇవి ఏర్పడే విధానాన్ని ‘ఎరిత్రోపాయిసిస్’ అంటారు. ప్రతి ఘనపు మిల్లీమీటరు రక్తంలో స్త్రీలలో 4.5 మిలియన్లు, పురుషుల్లో 5 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇవి అస్థిమజ్జ నుంచి ఏర్పడినప్పుడు కేంద్రకం, ఇతర కణభాగాలను కలిగి ఉంటాయి. ఆ తర్వాత పరిపక్వత చెందినప్పుడు వీటిని కోల్పోతాయి. కేవలం హీమోగ్లోబిన్ మాత్రమే ఉంటుంది. ఒంటె, లామా లాంటి జంతువుల్లో పరిపక్వత చెందిన ఎర్ర రక్తకణాల్లో సైతం కేంద్రకం ఉంటుంది. హీమోగ్లోబిన్ ఒక సంయోగ ప్రోటీన్. దీనిలో హీం, గ్లోబిన్ అనే రెండు భాగాలు ఉంటాయి. హీం ఇనుము కలిగిన పారఫైరిన్. గ్లోబిన్ అనేది ప్రోటీన్. ఇందులో ఇనుము ఫై అయాన్ల రూపంలో ఉంటుంది. ఇది శ్వాస వాయువుల రవాణాను నిర్వహిస్తుంది. మానవుల్లో ఎర్ర రక్తకణాల జీవితకాలం 120 రోజులు. ఆ తర్వాత అవి ప్లీహం అనే భాగంలో నాశనం చెందుతాయి. కాబట్టి ప్లీహాన్ని ఎర్ర రక్తకణాల శ్మశాన వాటిక అంటారు. రక్తహీనత: ఎర్ర రక్తకణాల పరిపక్వతకు, హీమోగ్లోబిన్ తయారీకి ఇనుము, విటమిన్ ఆ9, విటమిన్ ఆ12 అవసరమవుతాయి. ఇనుము లోపిస్తే న్యూట్రిషనల్ రక్తహీనత సంభవిస్తుంది. విటమిన్ ఆ9 (ఫోలిక్ ఆమ్లం) లోపం వల్ల మెగలోబ్లాస్టిక్/ మ్యాక్రోసిస్టిక్ రక్తహీనత వస్తుంది. విటమిన్ ఆ12 (సయనోకోబాలమిన్) లోపం వల్ల పెర్నీసియస్ రక్తహీనత కలుగుతుంది. తెల్లరక్త కణాలు లేదా ల్యూకోసైట్స్ ప్రతి ఘనపు మిల్లీమీటర్ రక్తంలో 4000 నుంచి 12,000 వరకు ఉంటాయి. అస్థిమజ్జలోని మైలోబ్లాస్ట్స్ అనే పూర్వకణాల నుంచి తెల్లరక్త కణాలు ఏర్పడే విధానాన్ని ‘ల్యూకోపాయిసిస్’ అంటా రు. తెల్లరక్తకణాలు రెండు రకాలు. అవి: గ్రాన్యులోసైట్స్, ఏగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్లో కేంద్రకం చుట్టూ కణద్రవ్యంలో ప్రత్యేక కణికలు ఉంటాయి. వీటి కేంద్రకం భిన్న ఆకారాల్ల్లో కనిపిస్తుంది. కాబట్టి గ్రాన్యులోసైట్స్ను బహురూప కేంద్రక తెల్ల రక్తకణాలు అంటారు. ఇవి తిరిగి మూడు రకాలు - అసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. అసిడోఫిల్స్ను ఈసినోఫిల్స్ అని కూడా అంటారు. ఇవి అలర్జీ చర్యల్లో అలెర్జన్కు వ్యతిరేకంగా పనిచేస్తాయి. వీటి సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ‘ఈసినోఫీలియా’ అంటారు. మొత్తం తెల్ల రక్తకణాల్లో ఇవి 2-8 శాతం ఉంటాయి. పేగులో క్రిములను బేసోఫిల్స్ నియంత్రిస్తాయి. తెల్ల రక్తకణాల్లో అధిక సంఖ్యలో (60-68 శాతం) న్యూట్రోఫిల్స్ ఉంటాయి. ఇవి ప్రధాన భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. వ్యాధి కారకాలను భక్షించి, నాశనం చేస్తాయి. ఏగ్రాన్యులోసైట్స్ అనే తెల్లరక్తకణాలు రెండు రకాలు - మోనోసైట్స్, లింఫోసైట్స్. మోనోసైట్స్ కూడా భక్షక కణాలుగా వ్యవహరిస్తాయి. ఇవి శరీర అవయవాల్లోకి చేరి మ్యాక్రోఫేజ్లుగా మారి, భక్షక క్రియను నిర్వహిస్తాయి. తెల్ల రక్తకణాల్లో లింఫోసైట్స్ కీలకమైనవి. ఇవిరోగ నిరోధకశక్తిని అందిస్తాయి. ఇవి ప్రధానంగా రెండు రకాలు - ఖీ-లింఫోసైట్స్, ఆ-లింఫోసైట్స్. ఖీ-లింఫోసైట్స్ తిరిగి రెండు రకాలు. ఇఈ4/ ఖీ4 కణాలు, ఇఈ8 కణాలు. వీటిలో ముఖ్యమైనవి ఖీ4 కణాలు. హెచ్ఐవీ ప్రధానంగా వీటిపైనే దాడి చేస్తుంది. ఖీ లింఫోసైట్స్ ద్వారా లభించే ఇమ్యునిటీని సెల్యులార్ ఇమ్యునిటీ అంటారు. ఆ-లింఫోసైట్స్ ద్వారా లభించేది హ్యుమొరల్ ఇమ్యునిటీ. ఆ-లింఫోసైట్స్ వ్యాధి కారకానికి విరుద్ధంగా ప్రతిదేహకాలను (అ్టజీఛౌఛీజ్ఛీట) విడుదల చేసి ఇమ్యునిటీని అందిస్తాయి. రక్త ఫలకికలు (ఆౌౌఛీ ్క్చ్ట్ఛట) పూర్తి కణాలు కావు. ఎముక మజ్జలోని మెగా క్వారియోసైట్స్ విచ్ఛిన్నమవడం ద్వారా రక్త ఫలకికలు ఏర్పడతాయి. రక్తంలో ప్రతి మిల్లీమీటర్‌కు 2-2.5 లక్షల రక్త ఫలకికలు ఉంటాయి. సకశేరుకాల్లో ఇవి క్షీరదాల్లో మాత్రమే ఉంటాయి. మిగతా సకశేరుకాల్లో వీటి స్థానంలో థ్రాంబోసైట్స్ అనే తెల్ల రక్తకణాలు ఉంటాయి. రక్తస్కంధన ప్రక్రియను రక్త ఫలకికలు ప్రారంభిస్తాయి. ఏదైనా భాగంలో గాయమైనప్పుడు రక్త ఫలకికలు విచ్ఛిన్నమై థ్రాంబోప్లాస్టిన్ అనే ఎంజైమ్‌ను విడుదల చేస్తాయి. ఇది వెంటనే రక్తంలోని ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్‌గా మారుస్తుంది. ఇలా ఏర్పడిన థ్రాంబిన్ కాల్షియం సమక్షంలో రక్తంలోని ఫైబ్రినోజెన్ను ఫైబ్రిన్గా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్ అనే ప్రోటీన్ వెంటనే పోగులుగా అల్లుకొని ఒక సంక్లిష్ట జాలకాన్ని ఏర్పర్చడం వల్ల రక్తం కారడం ఆగిపోతుంది. ఈ రక్త స్కంధన ప్రక్రియలో ప్రోథ్రాంబిన్, థ్రాంబోప్లాస్టిన్, ఫైబ్రినోజెన్, కాల్షియం కలుపుకొని మొత్తం 13 రక్త స్కంధన కారకాలు పాల్గొంటాయి. అదనంగా విటమిన్ కె లాంటి అనుబంధ రక్త స్కంధన కారకాలు కూడా పాల్గొంటాయి. ఏ చిన్న గాయమైనా, రక్తం గడ్డకట్టని జన్యువ్యాధిని ‘హీమోఫీలియా’ అంటారు. దీన్నే రాయల్ లేదా బ్లీడర్స డీసీజ్ అంటారు. ఇది రెండు రకాలు. 1) హీమోఫీలియా - అ: ఇది గఐఐఐవ రక్తస్కంధన కారక లోపం వల్ల వస్తుంది. 2) హీమోఫీలియా - ఆ: ఇది ఐగీవ రక్త స్కంధన కారక లోపం వల్ల వస్తుంది. రక్త నాళాల్లో రక్తం గడ్డ కట్టకుండా నిరోధించే రక్త స్కంధన నివారిణి హిపారిన్. జలగ, ఆడదోమలు లాంటి రక్తాన్ని పీల్చే జీవుల లాలాజలంలోనూ ఈ రకమైన రక్త స్కంధన నివారిణులు ఉంటాయి. గుండె - రక్త ప్రసరణ శరీరంలోని వివిధ భాగాల నుంచి రక్తాన్ని సేకరించి, మళ్లీ అన్ని భాగాలకు సరఫరా చేసే కండర నిర్మాణం గుండె. ఊపిరితిత్తుల మధ్య ఉన్న మీడియాస్టీనియం అనే కుహరంలో గుండె ఎడమవైపున అమరి ఉంటుంది. గుండె శాస్త్రీయ అధ్యయనాన్ని ‘కార్డియాలజీ’ అంటారు. మానవునిలో నాలుగు గదుల గుండె ఉంటుంది. పై గదులను కర్ణికలు, కింది గదులను జఠరికలు అంటారు. గుండెలోని ఎడమ కర్ణిక, ఎడమ జఠరిక ద్వారా మంచి రక్తం; కుడి కర్ణిక, కుడి జఠరిక ద్వారా చెడు రక్తం ప్రసరిస్తుంది. ఇలా మంచి, చెడు రక్తం వేర్వేరుగా ప్రసరించడాన్ని ‘ద్విరక్త ప్రసరణ’ అంటారు. మానవుని గుండె మయోజెనిక్ రకం. ఈ రకమైన గుండె లయ ఒక కండర కణుపులో మొదలవుతుంది. ఇలాంటి కండరకణుపును లయారంభకం అంటారు. ఇవి రెండు ఉంటా యి. మొదటిది, ప్రధానమైంది సిరా కర్ణికా కణుపు. ఇక్కడ మొదలైన సంకోచ తరంగాలు కర్ణికలకు మాత్రమే పరిమితమవుతాయి. వీటిని జఠరికలకు చేరవేసేందుకు కర్ణిక జఠరికా కణుపు అనే రెండో లయారంభకం ఉంటుంది. ఇది మొదటి లయారంభకం నుంచి సంకోచ తరంగాలను గ్రహించి, ్కఠటజుజ్జ్ఛీ పోగుల ద్వారా జఠరికలకు చేరవేస్తుంది. కర్ణికలు సంకోచించి, రక్తం జఠరికలకు చేరుతుంది. జఠరికలు సంకోచించినప్పుడు రక్తం తిరిగి కర్ణికలలోకి చేరకుండా కర్ణికలు - జఠరికల మధ్య ప్రత్యేక కవాటాలు ఉంటాయి. ఎడమ కర్ణిక - జఠరికల మధ్య మిట్రల్/ అగ్రద్వయ కవాటం ఉంటుంది. కుడి కర్ణిక, జఠరికల మధ్య అగ్రత్రయ కవాటం ఉంటుంది. శరీరంలో రక్తం ప్రత్యేక రక్తనాళాల ద్వారా ప్రసరిస్తుంది. ఇవి రెండు రకాలు - ధమనులు, సిరలు. ధమనులు శరీరం లోపలు ఉంటాయి. ఇవి ఎప్పుడూ గుండె నుంచి ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి. వీటిలో కవాటాలు ఉంటాయి. రక్త కేశనాళికలతో అంతమవుతాయి. సిరలు శరీర ఉపరితలంలో ఉంటాయి. ఇవి ఎప్పుడూ గుండెకు రక్తాన్ని తీసుకువస్తాయి. వీటిలో కవాటాలు ఉంటాయి. రక్త కేశనాళికలతో మొదలవుతుంది. రక్తనాళాల శాస్త్రీయ అధ్యయనాన్ని ‘ఆంజియాలజీ’ అంటారు.శరీరంలోని సిరలన్నీ వివిధ భాగాల నుంచి సేకరించిన మలిన రక్తాన్ని, మహాసిరల ద్వారా ‘గుండె’ కుడి కర్ణికలోకి విడుదల చేస్తాయి. ఒక్క పుపుస సిర మాత్రమే ఊపిరితిత్తుల నుంచి సేకరించిన మంచి రక్తాన్ని గుండె ఎడమ కర్ణికలోకి విడుదల చేస్తుంది. కర్ణికల సంకోచం ద్వారా రక్తం జఠరికలను చేరుతుంది. ఎడమ జఠిరక నుంచి మహాధమని ద్వారా మంచి రక్తం శరీర ధమనులన్నింటికీ చేరుతుంది. ఒక పుపుస ధమని ద్వారా మాత్రమే చెడు రక్తం కుడి జఠరిక నుంచి ఊపిరితిత్తులకు చేరుతుంది. మాదిరి ప్రశ్నలు 1. ఎర్ర రక్త కణాలు లేని రక్త భాగం ఏది? 1) ప్లాస్మా 2) సీరం 3) శోషరసం 4) ఏదీకాదు 2. ఎముక మజ్జలోని ఏ పూర్వ కణాల నుంచి ఎర్ర రక్తకణాలు ఏర్పడతాయి? 1) నార్మోబ్లాస్ట్స్ 2) మెగాక్యారియోసైట్స్ 3) మైలోబ్లాస్ట్స్ 4) ల్యూకోసైట్స్ 3. రక్తం ఞఏ విలువ? 1) 5.5-6.5 2) 7.2 - 7.4 3) 8.5 - 9.0 4) 10 - 12 4. రక్త హీనత ప్రధాన లక్షణం 1) అలసట 2) మానసిక మాంద్యత 3) ప్లీహం వాపు 4) పైవన్నీ 5. ఏ వ్యాధికి నిరోధక శక్తి అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో మానవునిలో కొడవలి కణ రక్త హీనత కలుగుతుంది? 1) టైఫాయిడ్ 2) మలేరియా 3) ఎన్సిఫలైటిస్ 4) చికున్‌గున్యా 6. {పతి 100 ఎం.ఎల్. రక్తంలో ఎంత హీమోగ్లోబిన్ ఉంటుంది? 1) 8 గ్రా. 2) 15 గ్రా. 3) 15 మి.గ్రా. 4) 20 మి.గ్రా. 7. ఒక హీమోగ్లోబిన్ అణువులో ఎన్ని ఫై అయాన్లు ఉంటాయి? 1) 1 2) 2 3) 3 4) 4 8. శరీరంలోని ఏ భాగంలో శోషరస కణుపులు ఉంటాయి? 1) మెడ 2) చంక 3) గజ్జ 4) అన్నీ 9. ప్లీహం బరువు ఎంత? 1) 120 గ్రాములు 2) 30 గ్రాములు 3) 200 గ్రాములు 4) 70 గ్రాములు 10. ఎర్ర రక్త కణాల సంఖ్య అసాధారణంగా పెరగడాన్ని ఏమంటారు? 1) ల్యుకేమియా 2) ల్యూకోపీనియా 3) పాలీసైథీమియా 4) అనీమియా 11. దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా విస్తరించిన అలర్జీ కారక వయ్యారిభామ మొక్క శాస్త్రీయ నామం? 1) ట్రెగియ ఇన్వాల్యుక్రీట 2) పార్థీనియం హిస్టిరోఫోరస్ 3) స్ట్రిక్నాక్స్ నక్స్వోమిక్ 4) కెలోట్రాపిస్ జెగాంటియా 12. అతి తక్కువ సంఖ్యలో ఉండే తెల్ల రక్తకణాలు? 1) అసిడోఫిల్స్ 2) బేసోఫిల్స్ 3) మోనోసైట్స్ 4) లింఫోసైట్స్ 13. భక్షక క్రియలో పాల్గొనే కణభాగాలు? 1) రైబోజోమ్‌లు 2) లైసోజోమ్‌లు 3) మైటోకాండ్రియా 4) గాల్జీ సంక్లిష్టం సమాధానాలు 1) 3; 2) 1; 3) 2; 4) 4; 5) 2; 6) 2; 7) 4; 8) 4; 9) 4; 10) 3; 11) 2; 12) 2; 13) 2. -
వెంట్రుక కన్నా పదివేల రెట్లు పలుచనైన ఎక్స్ రే!
బెర్లిన్: మనిషి శరీరంలో ఎముకలతోపాటు అనేక పదార్థాల నిర్మాణాన్ని చిత్రాల రూపంలోకి మలచేందుకు ఉపయోగించే ఎక్స్ రేల్లో అత్యంత పలుచనైన కిరణాన్ని యూనివర్సిటీ ఆఫ్ గోటిన్‌జెన్ శాస్త్రవేత్తలు సృష్టించారు. ప్రపంచంలోనే అతి పలుచనైన ఈ ఎక్స్ కిరణం మనిషి వెంట్రుక కన్నా 10 వేల రెట్లు పలుచగా ఉండటం విశేషం.ప్రస్తుత పద్ధతుల్లో సృష్టిస్తున్న ఎక్స్ కిరణాలు కనీసం 20 నానోమీటర్ల మందంలో ఉంటున్నాయని, తాము మాత్రం 5 నానోమీటర్ల వ్యాసంలోనే ఎక్స్ కిరణాన్ని సృష్టించగలిగామని పరిశోధనకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త టిమ్ చెప్పారు. సోలార్ సెల్స్ లో ఉపయోగించే నానోస్థాయి తీగలపై, రసాయన పదార్థాల్లో అతిసూక్ష్మ స్థాయి విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయన్నారు. -
అన్వేషణం: దేవతలు నివసించిన చోటు
భూమిపై ప్రకృతి సహజంగా జరిగే మార్పులు... మనిషికి అనేక సౌకర్యాలను సమకూర్చిపెడుతుంటాయి. ఇంధనాలు, వనరులు ఏర్పడటానికి కారణమవుతుంటాయి. భౌతికపరమైన కొన్ని మార్పులు మనిషి వినోదం కోసం చూడచక్కని, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కూడా ఏర్పరుస్తుంటాయి. అలా ఏర్పడిన ఓ ప్రకృతి విచిత్రమే ‘గార్డెన్ ఆఫ్ ద గాడ్స్’. కొన్ని మిలియన్ సంత్సరాల క్రితం భూమిపై వచ్చిన భౌతికపరమైన మార్పుల వల్ల ఏర్పడిన ఉద్యానవనం... ‘గార్డెన్ ఆఫ్ ది గాడ్స్’ . ఇది అమెరికాలోని కొలరాడోలో ఉంది. ఎత్తై కొండలు, విచిత్రాకృతిలోని శిఖరాలు, ఏపుగా పెరిగిన చెట్లు.. వెరసి ప్రకృతి సోయగానికి నిలయంలా ఉంటుంది. ఒక్కసారి చూస్తే, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 1330 నుంచి 250 మధ్య ఈ ప్రాంతంలో కొందరు నివసించారట. ఈ ప్రదేశానికి గార్డెన్ ఆఫ్ ద గాడ్స అన్న పేరు పెట్టింది వారేనని అంటారు పరిశోధకులు. ఈ అందమైన సృష్టి విచిత్రాన్ని దేవతలు, దేవుళ్లు కలిసి ఏర్పాటు చేశారని, ఆ తర్వాత దేవతలంతా ఇక్కడే నివసించానీ వారు విశ్వసించేవారట. అందుకే ఆ పేరు పెట్టారని తెలుస్తోంది. ఈ ప్రాంతంలో డైనోసార్లు నివసించినట్టుగా కూడా కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయి శాస్త్రవేత్తలకు. ఇప్పటికీ కొన్ని అరుదైన తేనెటీగలు, జింక జాతులు, అడవి గొర్రెలు, నక్కలతో పాటు, 130 రకాల పక్షిజాతులు కనిపిస్తాయిక్కడ. అందుకే ‘గార్డెన్ ఆఫ్ ది గాడ్స్’ ప్రముఖ పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతోంది. బైక్, హార్స్రేసులకు అద్భుతమైన వేదికగా పేరు పొందింది. రాక్ క్లైంబింగ్, రోడ్ అండ్ మౌంటెన్ బైకింగ్, హార్స్ రైడింగ్ వంటి వాటితో ఎప్పుడూ సందడి సందడిగా ఉంటుంది. ఊరంతటకీ టైమ్ చెబుతుంది! ఎత్తయిన భవనంపై ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తోన్న ఈ గడియారం ప్రపంచంలోనే అతి పెద్దదని మీకు తెలుసా? ఇటీవలే దీన్ని సౌదీ అరేబియాలోని మక్కాలో ప్రారంభించారు. ఈ అతి పెద్ద గడియారాన్ని నిర్మించడానికి దాదాపు మూడు బిలియన్ డాలర్లు ఖర్చయ్యాయి. అంటే మన కరెన్సీలో పన్నెండొందల కోట్ల రూపాయలకు పైనే. ఇప్పటివరకూ అతి పెద్ద గడియారంగా ఇస్తాంబుల్‌లోని సెవాహర్ మాల్ క్లాక్ గురించి చెప్పుకునేవారు. ఇప్పుడు ఈ గడియారం దాన్ని మించిపోయింది. 76 అంతస్తుల మక్కా క్లాక్ రాయల్ టవర్ పైభాగంలో అమర్చిన దీన్ని జర్మనీకి చెందిన ఓ సంస్థ రూపొందించింది. చట్రాలన్నీ బంగారంతో చేశారు. తొమ్మిది కోట్ల రంగు గాజు ముక్కల్ని వాడారు. 20 లక్షల రెడ్ బల్బులను పెట్టారు. అల్లా అనే అక్షరాల కోసం 21 వేల ఆకుపచ్చ విద్యుత్ బల్బుల్ని అమర్చారు. రోజుకు ఐదు సార్లు, ముస్లిములు ప్రార్థన జరిపే ప్రతిసారీ ఇవి వెలుగుతాయి. టవర్ పైన చంద్రవంక నుండి వెలువడే లేజర్ కిరణాల వెలుగు ఆకాశంలో పది కిలోమీటర్ల వరకూ ప్రకాశిస్తాయట. ఆ ప్రాంతం వారంతా ఇళ్లలో ఉండే దీనిలో టైమ్ చూసుకోవచ్చట! -
సన్మార్గం: వ్యక్తిలోని చైతన్య స్థాయిని పెంచుకోవడం ఎలా?
సర్వవ్యాప్తమైన ప్రాణశక్తిని అభివ్యక్తిలోకి తీసుకువచ్చే సామర్థ్యమే చైతన్యం. ఈ విశ్వంలో మనుగడలో ఉన్న అన్నింటికీ రూపాన్ని ఇచ్చేందుకు ప్రాణశక్తితో చైతన్యం ఐక్యం అవుతుంది. ఈ సృష్టిలో ప్రతిదీ ప్రత్యేకమైన ప్రాణశక్తి తరంగాలను కలిగి ఉంటుంది. సృష్టిలో ప్రతి వస్తువు, జీవి ఏర్పడేందుకు వివిధ రూపాలలోకి బదిలీ అయ్యే విశ్వంలోని శక్తి ఇదే. ఒక చెట్టుకు, జంతువుకు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాకు కారణం వారిలో స్పందించే ప్రాణశక్తి తరంగాలలోని తేడాలే. మనం కొందరు వ్యక్తుల సాహచర్యాన్ని ఇష్టపడడం లేదా కొందరి సమక్షంలో అసౌకర్యంగా భావించడానికి కారణం ఈ వ్యక్తిగత ప్రాణశక్తి ఫ్రీక్వెన్సీలలోని తేడాలే. మన ప్రాణశక్తి ఫ్రీక్వెన్సీ పరిధిలో ఉన్న వస్తువులు, వ్యక్తులతోనే సంబంధాన్ని నెరపగలిగే మనం, మనకన్నా ఉన్నతమైన లేక తక్కువస్థాయిలో ఉన్న వారితో సంబంధాన్ని ఏర్పరచుకోలేక పోవడానికి కారణమూ ఈ ఫ్రీక్వెన్సీలో తేడాయే. సర్వవ్యాప్తమైన ప్రాణశక్తిని అభివ్యక్తిలోకి తీసుకువచ్చే సామర్థ్యమే చైతన్యం. ఈ విశ్వంలో మనుగడలో ఉన్న అన్నింటికీ రూపాన్ని ఇచ్చేందుకు ప్రాణశక్తితో చైతన్యం ఐక్యం అవుతుంది. ఈ భౌతిక ప్రపంచంలో మిమ్మల్ని తయారుచేసేది చైతన్యమే. మీ ప్రత్యేక భౌతికస్థితిని ప్రాణశక్తి ఇస్తుండగా, మీ ఆలోచనలు ఒక రూపాన్ని సంతరించుకునేందుకు చైతన్యం వాటిని క్రమబద్ధం చేస్తుంది. ప్రతి ఆలోచనా సమర్థవంతమైన అభివ్యక్తే. ఆలోచిస్తున్న వ్యక్తి చైతన్యపుస్థాయి అతడి ఆలోచనలను వ్యక్తీకరించే సామర్థ్యంతో ప్రత్యక్షానుపాతాన్ని కలిగి ఉంటుంది. వ్యక్తి పరిణామ స్థాయి ఎంత ఉన్నతంగా ఉంటే అంత వేగంగా అతడి ఆలోచనలు అభివ్యక్తమవుతాయి. దీనిని ఒక ఉదాహరణతో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం: ఒక కంపెనీలో సి.ఈ.ఓ విలాసవంతమైన కార్యాలయంలో కూర్చుని కంపెనీకి అవసరమైన ప్రణాళికను కొద్దిగంటలలో రూపొందిస్తాడు. సి.ఈ.ఓ ఆలోచనలకు వాస్తవరూపం ఇచ్చేందుకు కార్మికుడు తన జీవితంలో అనేక గంటలు శ్రమిస్తాడు. ఇందుకు కారణం చైతన్య చలనమే. సి.ఈ.ఓ...శ్రామికుడి చైతన్యపు స్థాయిలలో భారీ అంతరం ఉంది. సి.ఈ.ఓ చైతన్య స్థాయి శ్రామికుడి ైచె తన్య స్థాయి కన్నా ఉన్నతంగా ఉండడంతో అతడి ఆలోచనా శక్తి కూడా అంతే ఉంది. విజయవంతమైన, విఫలమైన వ్యక్తుల మధ్య తేడా వారి చైతన్యపు స్థాయుల్లో తేడానే. చైతన్య స్థాయిని ఎలా పెంచుకోవాలి? శరీరంలోని ప్రాణశక్తి ఫ్రీక్వెన్నీ సూక్ష్మతరం అయినప్పుడు చైతన్యం పెరుగుతుంది. యోగా అంతిమ ప్రయోజనం, లక్ష్యం అదే. ప్రాణశక్తి ఫ్రీక్వెన్సీలను మార్చడం ద్వారా చైతన్యాన్ని పెంచడమే దాని లక్ష్యం. అష్టాంగయోగలోని ఎనిమిది అంగాలనూ పొందుపరచిన సనాతనక్రియ శరీరంలోని స్థూలప్రాణాన్ని శుభ్రపరచి, చైతన్యపు స్థాయిని పెంచుతుంది. నిత్యసాధన వల్ల శరీరంలో సూక్ష్మమార్పులు అభివ్యక్తమవడమే గాక చైతన్యపు స్థాయి కూడా పెరగడం ప్రారంభమవుతుంది. సాధారణంగా భౌతిక, ఆర్థిక, మానసిక లేదా ఉద్వేగపూరితమైన గందరగోళాలే ఈ అసమతుల్యతలకు దారితీస్తాయి. ఈ గందరగోళాలు సద్దుమణిగిన త ర్వాత అద్భుతమైన కాంతి, అంతర్గత భౌతిక శక్తి, ఉన్నతమైన చైతన్యపు స్థాయితో ఫలితాలు కనిపిస్తాయి. చైతన్యపు స్థాయి ఉన్నతంగా ఉన్నప్పుడు దేనినైనా మరో మాటలో చెప్పాలంటే ప్రతిదానినీ సాధించవచ్చు. ఈ కారణం వల్లనే రాజులు కూడా యోగులను గౌరవిస్తారు, పూజిస్తారు. ప్రకృతిలోని భౌతిక సూక్ష్మశక్తులపై యోగి ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. ఆయనకు రెండు ప్రపంచాలూ అందుబాటులో ఉంటాయి. ఆయన మాయ పరిధికి ఆవల ఉంటాడు. ఆయనకు ఇవ్వడం మాత్రమే తెలిసినందున వ్యక్తుల భౌతికస్థాయి లేక సంపదతో ప్రభావితం కాడు. నిజమైన యోగి ఎవరినీ దేనికోసమూ అడగడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న ప్రతిదీ ఆయనకు అందుబాటులో ఉంటుంది. కానీ ఆయన దానితో ప్రభావితం కాడు. యోగా అంటే వేగంగా శ్వాసక్రియలను చేయడమో లేక తలకిందులుగా నిలబడటమో కాదు. అది సాధకుడి ఆధ్యాత్మిక అన్వేషణకే కాదు, భౌతిక జీవితాన్ని కూడా ఉద్దేశించిన సంపూర్ణ శాస్త్రం. యోగా ఆధ్యాత్మిక, భౌతిక స్థితులను విడదీయదు. గురువు మార్గదర్శనంలో ఉన్నతమైన చైతన్యం ద్వారా మనందరం ఉన్న ఈ భౌతిక ప్రపంచంపై ఆధిపత్యం సంపాదించవచ్చు. యోగా అనేది చైతన్యానికి సంబంధించిన అంశం. మీరు ఎంత ఎత్తుకు ఎదిగితే అంత త్వరగా మీ సంకల్పం అభివ్యక్తమవుతుంది. అందుకే దైవిక చైతన్యం అత్యంత శక్తిమంతమైనది. సర్వవాప్తమైంది. అది సంకల్పమాత్రం చేతనే తక్షణమే అభివ్యక్తమవుతుంది. ఇది తెలుసా? ఏదయినా ముఖ్యమైన పని నిమిత్తం బయల్దేరి వెళ్లేటప్పుడు ‘‘వక్రతుండ మహాకాయం కోటి సూర్యసమప్రభం నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా’’ అని చదువుకొని వినాయకునికి భక్తితో నమస్కరించి వెళితే కార్యజయం కలుగుతుందని శాస్త్రోక్తి. 21 గణపతికి ఇష్టమైన సంఖ్య. కాబట్టి ఏదయినా కోరిక కోరుకొని వినాయకునికి 21 ఉండ్రాళ్లు నివేదిస్తానని మొక్కుకోవాలి. కోరిక తీరిన తర్వాత మొక్కు తీర్చుకోవడం మాత్రం మరచి పోవద్దు! -
వివేకం: మీ శరీర తయారీదారు ఎవరు?
అంటువ్యాధులు వేరు; అవి బయటి నుండి జరిగే దాడి. వాటికి కొన్ని రకాల మందులు అవసరమౌతాయి. కాని దీర్ఘకాలిక అనారోగ్యం అంటే, మన లోపల మనమే సృష్టించుకునే కొన్ని లోపాల వల్ల మాత్రమే ఎక్కువగా వచ్చేవి. డెబ్భై శాతం పైగా దీర్ఘవ్యాధులను మనమే సృష్టించుకుంటున్నాం. శరీరంలోని ప్రతి కణానికీ బతికి ఉండాలనే ఒక సహజమైన తపన ఉంటుంది. ఇలా ఉన్నప్పటికీ, మన శరీరానికి వ్యతిరేకంగా అవి ఎందుకు పనిచేస్తాయి? శరీరం సంగతి చూద్దాం. ప్రస్తుతం ఉన్న ఇంత ఆకారంలో పుట్టలేదు మనం. తల్లి గర్భంలో కేవలం రెండు కణాలుగా మీరు మొదలయ్యారు. ఒక శిశువుగా బయటికి వచ్చారు. ఇప్పుడేమో ఇంత పెరిగారు. ఇదంతా ఎలా జరిగింది? ఈ శరీరాన్ని సృష్టిస్తున్న మౌలిక శక్తి ఏదో ఈ పనిచేసింది. అదే సృష్టికి ఆధారం. దానిని మీరు సృష్టికర్త అంటున్నారు. మీ జీవితపు అనుక్షణమూ, ఆ సృష్టి మీ శరీరం లోపలి నుంచే పనిచేస్తోంది. ఈ శరీరాన్ని తయారుచేసేవాడు లోపలే ఉన్నాడు. మీరు ఏదైనా ఒక మరమ్మతు చేయించాలనుకోండి. మీరు తయారుచేసినవాడి దగ్గరకు వెళ్దామనుకుంటారా? లేకపోతే దగ్గరలో అందుబాటులో ఉండే మెకానిక్ దగ్గరకా? మీకు తయారీదారు చిరునామా తెలియకపోతే, అప్పుడు దగ్గరలోని మెకానిక్ దగ్గరకు వెళ్తారు. కానీ మీకు తయారీదారు తెలిసినవాడైతే, అతని వద్దకు వెళ్లే చనువు ఉంటే, కచ్చితంగా తయారీదారు దగ్గరకే వెళ్తారు. అవునా? మీ లోపల మీరు సృష్టించుకునే వాటన్నింటికీ, దగ్గరలో అందుబాటులో ఉండే డాక్టర్ దగ్గరకు పరిగెత్తితే ప్రయోజనం లేదు. ఆధునిక వైద్యశాస్త్రం దీర్ఘ రోగాలను మేనేజ్ చేసుకోవడానికి మాత్రమే మీకు సహాయం చేస్తుంది. మిమ్మల్ని దీర్ఘరోగాల బారి నుండి ఎప్పటికీ బయటకు పడవేయలేదు. ఎందుకంటే దీర్ఘరోగాలు బయట నుండి రాలేదు కాబట్టి. అవి బయట నుండి వచ్చి ఉంటే, వాళ్లు వాటిని మీ నుంచి తీసివేసేస్తారు. కానీ అవి లోపల నుండే వస్తున్నప్పుడు, మీరే వాటిని సృష్టిస్తున్నప్పుడు, మిమ్మల్ని వాటి నుండి వారు ఎలా వదిలించగలరు? ఆరోగ్యం కేవలం భౌతికమైన అంశం కాదు. మనసులో జరిగేది ఏదో, సహజంగా అదే శరీరంలో కూడా కలుగుతుంది. తిరిగి శరీరంలో జరిగేది ఏదో, అదే మనసులో కలుగుతుంది. అందుచేత, ఇక్కడ మనం ఎలా జీవిస్తున్నాము, మన వైఖరి, మన భావోద్వేగాలు, మన మానసిక స్థితి, మనం జరిపించే కార్యకలాపాల స్థాయి, మన ఆలోచనలు... ఇవన్నీ మన ఆరోగ్యంతో తప్పనిసరిగా ముడిపడి ఉండే భాగాలు. మీ శరీరం తయారీదారు దగ్గరకు వెళితే వీటన్నిటికీ చికిత్స ఉంటుంది. ఆరోగ్యం అంతర్గతంగా కలగాలంటే, లోపల కొంత ఇంజనీరింగ్ చేయాలి మనం. శరీరం, బుద్ధి, భావాలు, ప్రాణశక్తి - అన్నీ చక్కటి సమతుల్యతలో ఉండే వాతావరణాన్ని, సృష్టించుకోవాలి కొన్ని సరళమైన ప్రక్రియలతో శరీరాన్నీ, బుద్ధినీ సంపూర్ణ ఆరోగ్యంతో నిర్మించుకోవచ్చు. నేను చెప్పే ‘ఇన్నర్ ఇంజనీరింగ్’ అంటే, సరిగ్గా అదే. మీ తయారీదారుని వద్దకు రహదారి నిర్మించటం. ఇక అప్పుడు ఆరోగ్యంగా ఉండటం మీ పనికాదు, ఆరోగ్యాన్ని ఇవ్వడం అతని వంతు కార్యక్రమం అవుతుంది. సమస్య - పరిష్కారం ప్రస్తుత అధిక జనాభా పరిస్థితుల్లో, నేను ఒక బిడ్డతోనే సరిపెట్టుకుందామనుకుంటున్నాను. ఇంట్లో తల్లిదండ్రులు మరొకరినైనా కనమని బలవంతపెడుతున్నారు. మీ సలహా ఏమిటి? - ఎం.వెంకటేశ్, చిత్తూరు సద్గురు: భారతదేశ ప్రస్తుత జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువ. ఇంతమందికి సరిపోయేంత భూమి, నీరు, పర్వతాలు, కనీసం ఆకాశం కూడా లేదు. 60% కంటే ఎక్కువ గ్రామీణ జనాభాకు, శరీర నిర్మాణం సరిగా లేదు. వారి శరీరం, మెదడు పూర్తి స్థాయికి ఎదగడం లేదు. కారణం, గర్భస్త శిశు దశ నుంచి వారికి తగిన పోషణ అందడం లేదు. 35% మంది పిల్లలు బరువు తక్కువతో పుడుతున్నారు. ఈ కారణాన వారు ఎప్పటికీ సరిగా ఎదగలేరు. ఏ పిల్లలకైతే, పిండ దశలో పోషకాహార సమస్యలుంటాయో, ఎవరైతే సరైన బరువుతో పుట్టరో, వారికి మీరు ఏమి చేసినా, వారి జీవితంలో వారి శరీరము, మెదడు పరిపూర్ణంగా ఎదగదు. అంటే, మనం ఒక పరిపుష్టి లేని సమాజాన్ని తయారుచేస్తున్నాం. ఇది అభివృద్ధి కాదు. నా దృష్టిలో పిల్లలను కనడం కన్నా సరైన పోషణ లేని కొందరి పిల్లలనైనా ఆదుకోవడం ఉత్తమం. మీ పెద్దలకు ఈ విషయాలు మీరు విడమర్చి చెబితే వారు ఒప్పుకోకపోరు. - జగ్గీ వాసుదేవ్