The Effects of Cholesterol on the Body, in Telugu - Sakshi
Sakshi News home page

కొలెస్ట్రాల్‌ ఒంటికి  హాని చేస్తుందా? 

Published Wed, Mar 24 2021 12:00 AM | Last Updated on Wed, Mar 24 2021 4:08 PM

Cholesterols Impact On Your Healthy  - Sakshi

కొలెస్ట్రాల్‌ అనగానే అది హానికరమనే విధంగా నే చెప్పుకుంటూ ఉంటాం. కానీ కొలెస్ట్రాల్‌లో మంచి, చెడు ఉంటాయి. అది చెడు కొలెస్ట్రాల్‌ అయినా, మంచి కొలెస్ట్రాల్‌ అయినా ఉండాల్సిన పాళ్లలో ఉండాలి. మంచి కొలెస్ట్రాల్‌ను హెచ్‌డీఎల్‌ అంటారు. చెడు కొలెస్ట్రాల్‌ను ఎల్‌డిఎల్‌ అంటారు. వున శరీరంలో కొలెస్ట్రాల్‌ స్థాయులను రక్త పరీక్ష ద్వారా కనుక్కోవచ్చు. 12 గంటలపాటు ఏమీ తినకుండా ఈ టెస్ట్‌ చేయించుకోవాలి. ఈ పరీక్షలో మన ఎల్‌డీఎల్‌ (చెడు కొలెస్ట్రాల్‌), హెచ్‌డీఎల్‌ (మంచి కొలెస్ట్రాల్‌) మోతాదులు తెలుస్తాయి. ఎల్‌డీఎల్‌ ఎక్కువగా ఉంటే ధమనుల్లో కొవ్వు చేరి హార్ట్‌ ఎటాక్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎల్‌డీఎల్‌ను ‘‘చెడు కొలెస్ట్రాల్‌’’ అని అంటారు. కానీ హెచ్‌డీఎల్‌ రక్తనాళాల్లో కొవ్వు చేరకుండా చేస్తుంది. అందుకే హెడీఎల్‌ ను ‘‘వుంచి కొలెస్ట్రాల్‌’’ అని అంటారు.

మన శరీరంలో ఎప్పుడు హెచ్‌డీఎల్‌ ఎక్కువగా, ఎల్‌డీఎల్‌ తక్కువగా ఉండాలి. గుడ్డులోని తెల్లసొన లో మంచి కొలెస్ట్రాల్‌ ఉంటుంది. పచ్చ సొనలో చెడు కొలెస్ట్రాల్‌ ఉంటుంది. కాబట్టి తెల్లసొన తీసుకుని, పచ్చసొనను తగ్గించాల్సిందిగా డాక్టర్లు, ఆహారనిపుణులు చెబుతుంటారు. ఒకవేళ చెడు కొలెస్ట్రాల్‌ అంతగా లేనివారు మొత్తం గుడ్డును తినేయవచ్చు. కొలెస్ట్రాల్‌ కూడా ఉండాల్సిన మోతాదులో శరీరానికి అందాలి. అయితే అది తన మోతాదుకు మించకుండా చూసుకోవాలి. మంచి జీవనశైలితో మంచి ఆహార అలవాట్లతో సరైన వ్యాయామంతో చెడు కొలెస్ట్రాల్‌ ను అదుపులో పెట్టుకోవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement