
బరువు తగ్గడం అనేది అనుకున్నంత సులువు కాదు. అలాగని అంత కష్టమూ కాదు. కావాల్సిందల్లా పట్టుదల. దృఢమైన నిశ్చయం ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు. అయితే దీనికి ముందు బరువు పెరగడానికి గల కారణాలను విశ్లేషించు కోవాలి. బీఎంస్ ఇండెక్స్ ఆధారంగా ఎంత బరువున్నదీ లెక్కించు కోవాలి. దాని ప్రకారం ఎంత తగ్గాలి నిర్ణయించు కుని, జీవనశైలి మార్పులను చేసుకొని ప్రణాళికా బద్ధంగా ప్రయత్నిస్తే ఫలితం దక్కుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ముఖ్యంగా కొవ్వు పదార్థాలకు దూరంగా ఉంటూ ఫైబర్ ఫుడ్ తీసుకోవాలి. పౌష్టికాహారం, వ్యాయామం, నిద్ర, తగినన్ని నీళ్లు లాంటివి చాలా అవసరం.
కొన్ని ఆహార నియమాలు
కీరదోసకాయ, బీర, సొరలాంటి వాటర్ కంటెంట్ ఎక్కువున్న కూరగాయలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కొంచెం తిన్నా, కడుపు నిండినట్టు అనిపిస్తుంది. పైగా వేసవిలో శరీరాన్నిహైడ్రేటెడ్‌గా ఉంచుతాయి కూడా.
తాజా ఆకు కూరల్లోని విటమిన్ సీ, విటమిన్ కే ఉంటాయి. బరువు తగ్గడానికి ఇవి చాలా బాగా పనిచేస్తాయి. కొత్తిమీర, పుదీనా కూడాచాలామంచిది.
తక్కువ కేలరీలు ఉండే బీట్‌రూట్, కేరట్లలో విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియ వ్యవస్థ సైతం మెరుగుపడుతుంది. వేగంగా బరువు తగ్గుతారు. (వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు)
లో కేలరీ పండ్లల్లో యాపిల్ చాలా ముఖ్యమైనది. ఇందులోని ఫైబర్, వాటర్ కంటెంట్ బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది. ఇంకా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పుచ్చ, పైనాపిల్, స్ట్రాబెర్రీ, ద్రాక్షతో పాటు జామ పండ్లను కూడా తీసుకోవచ్చు.
రోజుకు 800 కేలరీల తక్కువ తింటే వారానికి 1.5-2 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. సాధారణ భోజనానికి ప్రత్యామ్నాయంగా సూప్‌లు, షేక్‌లు, బార్‌లు వంటివి ఉపయోగపడతాయి.
రోజుకు అవసరమైన అన్ని పోషకాలను పొందేలా చూసుకోవాలి.
సాధారణంగా మహిళలకు రోజుకు 1,200 నుండి 1,500 కేలరీలు ,పురుషులకు 1,500 నుండి 1,800 కేలరీలు తీసుకోవచ్చు.
మిల్లెట్స్, ఓట్స్, మొలకలొచ్చిన గింజలు, నూనెకు బదులుగా నెయ్యి, బాదం, అవకాడో లాంటివి కూడా చాలా మంచిది.
ఇదీ చదవండి : ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా?
అడపాదడపా ఉపవాసం
ఇంటర్‌మిటెంట్ ఫాస్టింగ్ అంటే రోజులో 16 గంటల పాటు లేదా వారంలో 24 గంటలు ఏమీ తినకుండా ఉండటం. అంటే రాత్రి 9 నుంచి పగలు ఒంటిగంట వరకూ లేదా వారికి వీలైన 16 గంటల సమయంలో ఏమీ తినకూడదు. వీలును బట్టి ఈ 16 గంటలు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బరువు ఎంత తగ్గాము అనేదిచూసుకుంటూ ఉంటే ఇంకొంచెం ఉత్సాహంగా ఉంటుంది.
వ్యాయామం
వేగంగా బరువు తగ్గడం అంటే వ్యాయామం ద్వారా ఎక్కువ తగ్గించుకోవడమే. ఏ రకమైన డైట్ పాటించినా, వ్యాయామం మాత్రం తప్పనిసరి. అరగంట నుంచి గంటదాకా నడక, యోగా లాంటివి తప్పకుండా చేయాలి.
నోట్: అయితే కొన్ని జెనెటిక్ కారణాలు, అనారోగ్య పరిస్థితులుంటే వైద్యులను సంప్రదించి తగిన సూచనలు సలహాలు పాటించాలి. త్వరగా బరువు తగ్గాలనుకునే వారు వైద్యుల సలహా తీసుకోవాలి. కొంతమంది స్వయంగా వేగంగా బరువు తగ్గడం సురక్షితం కాకపోవచ్చు అని గమనించుకోవాలి. అలాగే తీవ్రమైన ఆహార మార్పులు, శారీరక శ్రమ ద్వారా నెమ్మదిగా బరువు తగ్గే వ్యక్తుల కంటే చాలా త్వరగా బరువు తగ్గే వ్యక్తులు కాలక్రమేణా బరువును తిరిగి పొందే అవకాశం చాలా ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment