అవమానాలు, 30 ఏళ్లకే చచ్చిపోతాననే భయం పట్టుకుంది అందుకే!
అధికబరువు బాధపడేవారికి కష్టాలు మామూలుగా ఉండవు. ఒక్కొక్కరి ఇష్టాలు ఒక్కోలా ఉంటాయి. పదిమంది చూపులు, కొంటెచూపులు వారిని తొలిచేస్తే ఉంటాయి. కొంతమంది అవమానకరమైన మాటలు కూడా వారిలో మానసిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. మరికొన్ని ఘటనలు వారిలో పంతాన్ని పట్టుదలను పెంచుతాయి. అలా విమానంలో సీటు చాలకపోవడంతో అవమానంగా భావించిన యువకుడు దృఢ సంకల్పంతో బరువు తగ్గాడు. ఇంతకీ ఆ యువకుడు ఎంత బరువు ఉండేవాడు? బరువును ఎలా తగ్గించుకున్నాడు? తెలుసుకుందామా!
గతంలో విమానంలో సీటు చాలట్లేదని ఏకంగా విమానాన్నే కొనేసింది ఒక మహిళ. కానీ అర్రాన్ యువకుడిది మరో గాథ. విమానం కొనే స్థోమత లేదుగనుక, తన బాడీని మార్చుకునేందుకు సిద్ధపడ్డాడు. స్కాట్లాండ్‌లోని తూర్పు ఐర్‌షైర్‌లోని ఆచిన్‌లెక్‌లోఎయిర్‌క్రాఫ్ట్ ఫిట్టర్‌గా పనిచేస్తున్నాడు అర్రాన్ చిడ్విక్. నిండా 30 ఏళ్లు కూడా లేకుండానే వందకు దాటి బరువుండేవాడు. 24 ఏళ్ల వయసులో అతని బరువు 175 కిలోలు అంటే అతని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
కబాబ్‌లు, బర్గర్‌లు, చైనీస్ ఫుడ్ , చిప్స్ బ్యాగులు వంటి పెద్ద మొత్తంలో జంక్ ఫుడ్ తినేవాడు. వారాంతంలో అయితే అతని తిండికి హద్దే ఉండేది కాదు. దీంతో షూలేస్‌లు కట్టుకోవడం , బట్టలు వేసుకోవడం లాంటి రోజువారీ పనులకు చాలా ఇబ్బందులు పడేవాడు. ఒకసారి విమానంలో సీటు సరిపోకపోవడంతో చాలా అవమాన పడ్డాడు. అప్పుడు నిర్ణయించుకున్నాడు. కఠినమైన మార్పులు చేయకపోతే తన మనుగడే కష్టమని గుర్తించాడు. బరువు తగ్గకపోతే ఇక నెక్ట్స్ పుట్టిన రోజు ఉండదని ఫిక్సై పోయాడు. అందుకే పట్టుబట్టి మరీ, ఆరోగ్యకరమైన ఎంపికల ద్వారా ఒక ఏడాదిలో 80 రెండున్నర కిలోలు తగ్గాడు. బరువు తగ్గించే ఇంజెక్షన్లు లేదా ఫ్యాషన్ డైట్‌లను ఇలాంటి వాటి జోలికి పోకుండా, హెల్దీగా తన బరువును నియంత్రణలోకి తెచ్చుకున్నాడు.
తనని చూసి ఒకరు జాలిపడేవారు. మరొకరు అవమానించేవారు. దీంతో బాగా ఆందోళన చెందేవాడు. నిరాశకు గురయ్యేవాడు. ఈ బాధతో మరింత ఎక్కువగా తినడం, తాగడం చేసేవాడినని స్వయంగా చెప్పాడు అర్రాన్. కానీ ఇంత లావుగా ఉంటే తనకిక వేరే ఉద్యోగాలు రావడం కూడా కష్టమని గ్రహించాడు. అంతేకాదు 30 పుట్టిన రోజు చూడటం అనుమానమే అని భావించాడు. అంతే బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించాడు. జీవనశైలి మార్పులు, ఆహార మార్పులు, వ్యాయామంతో గణనీయంగా బరువు తగ్గాడు. ఎవ్వరూ ఊహించని విధంగా స్మార్ట్ అండ్ స్లిమ్‌గా మారిపోయాడు. అంతేకాదు హాఫ్ మారథాన్ రన్నింగ్‌కి సిద్ధంగా ఉన్నాడు. బరువు తగ్గిన తరువాత చాలా ఆనందంగాఉందని చెబుతున్నాడు. అంకితభావం,నిబద్ధతతో నలుగురికీ స్ఫూర్తినిస్తూన్నాడు.
ఇదీ చదవండి: MahaKumbh Mela : సింపుల్‌గా, హుందాగా రాధిక-అనంత్ అంబానీ జంట
జంక్ ఫుడ్ పూర్తిగా మానేశాడు.పండ్లు, కూరగాయలు , ప్రోటీన్ ఆధారిత ఆహారాన్ని మాత్రమే తీసుకునేవాడు. జిమ్‌లో గంటల కొద్దీ వ్యాయామం చేశాడు. అయితే మొదట్లో తన ఆకారంతో జిమ్‌కెళ్లడానికి సిగ్గుపడేవాడట. అందుకే ఎవ్వరూ ఉండరని సమయంలో ఎక్కువగా జిమ్ చేసేవాడు. దీంతో మూడు నెలల్లోనే మంచి మార్పుకనిపించింది. మంచి ఫలితం కనిపించడంతో మరింత ఉత్సాహంగా తన వెయిట్ లాస్ జర్నీని కొనసాగించాడు. ‘‘మీ పట్ల జాలిపడకుండా ,అందరూ మిమ్మల్ని చూసి నవ్వుతున్నారని అనుకోకుండా ఉండటం ముఖ్యం - మిమ్మల్ని మీరు మార్చుకోగలిగే ఏకైక వ్యక్తి మీరే" అంటాడు ఉత్సాహంగా.
Comments
Please login to add a commentAdd a comment