ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇలా ఏదైనా సరే.. చకా చకా పది నిమిషాల్లో పూర్తి చేసేయడం మీకు అలవాటా? నిదానంగా, నెమ్మదిగా తినే టైం లేదంటూ ఏ పూటకాపూట భోజనాన్ని హడావిడిగా లాగించేస్తుంటారా? అయితే మీరీ విషయాన్ని తెలుసుకోవాల్సిందే.
పని ఒత్తిడి, సమయం లేకపోవడమో, కారణంగా ఏదైనా గానీ వేగంగా ఆహారం తింటే బరువు పెరగడంతోపాటు, అనేక ఇతర సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలన్నా, చక్కగా జీర్ణం కావాలన్నా ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం నమల కుండా మింగటం వల్ల ఆహారం జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు, మలబద్దక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు తొందర, తొందరగా భోజనం చేసే వారిలో షుగర్ లెవెల్స్ పెరిగి, మధుమేహం, ఊబకాయం సమస్య వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది.
నెమ్మదిగా తినడం మీరు ఊహంచలేని ఎక్కువ ప్రయోజనాలనే అందిస్తుంది. అధిక బరువు, దాని వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. జీర్ణ రసాలు సరిగ్గా విడుదలయ్యేందుకు సాయ పడుతుంది. ఆహారంలోని అన్ని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. ఫలితంగా, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాడీ మన సొంతమతుంది
బరువు తగ్గడం: బరువు తగ్గించుకునే క్రమంలో డైటింగ్, వ్యాయామం మాత్రమే కాదు. మనం పెద్దగా పట్టించుకోని అంశం ఏమిటంటే ఆహారాన్ని సరిగ్గా నమలడం. దీంతో మన లక్ష్యంలో మరి కొన్ని కేజీల బరువు తగ్గవచ్చు. అవును, మీరు చదివింది నిజమే.
నెమ్మదిగా తినడం అంటే క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడమే. దీని వలన జీర్ణక్రియ మెరుగుపడి పోషకాల శోషణను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
బరువు తగ్గడంలో నమలడం ఎలా సహాయపడుతుంది?
ఆహారాన్ని సరిగ్గా నమలడం జీర్ణక్రియ సక్రమంగా జరగడం మమాత్రమే కాదు , డా మెదడుకు ఆకలి , సంపూర్ణతను ప్రభావితం చేసే సంకేతాలను పంపుతుంది. నిదానంగా , పూర్తిగా నమిలే వ్యక్తులు తక్కువ తినడానికి ఇష్టపడతారని అధ్యయనాలు నిరూపించాయి. ఇది కాలక్రమేణా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అపెటైట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతీ ముద్దను 40 సార్లు నమిలిన పాల్గొనేవారు 15 సార్లు మాత్రమే నమిలే వారితో పోలిస్తే 12 శాతం తక్కువ కేలరీలు వినియోగిస్తారు. ఆకలిని నియంత్రించే గ్రెలిన్ అనే హార్మోన్, సంతృప్తిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్. ఎంత ఎక్కువ నమలితే, అంత అతిగా తినడాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా కడుపు నిండిన భావన తొందరగా కలుగుతుంది.
మైండ్‌ఫుల్ ఈటింగ్
అకాడెమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ జర్నల్‌లో ప్రచురించినదాని ప్రకారం శ్రద్ధగా ఆహారాన్ని నమలడం, ఇష్టపూర్వకంగా ఆస్వాదించడం చాలా అవసరం. ఉరుగుల ప్రపంచంలో స్థిమితంగా కూచొని నాలుగుముద్దలు తినే పరిస్థితి కరువవుతోంది. అందుకే చాలా మంది గబా గబా ఇంత లాగించేసి ఆఫీసులకు పరుగులుతీస్తారు. మరికొంతమంది ప్రయాణంలోనో, టీవీ చూస్తూనో, ఫోన్, కంప్యూటర్ చూస్తూనో తింటే, పరధ్యానంలో నియంత్రణ లేకుండానే ఎక్కువ తినేస్తారు. ఇలా చేయడం వల్ల అజీర్ణం, అసౌకర్యం, ఉబ్బరం లాంటి సమస్యలొస్తాయి.
నమిలి తినడం వల్ల బరువు తగ్గే క్రమంలో తీసుకునే ఆహారం, కేలరీల మీద శ్రద్ద పెరుగుతుంది. దీంతో మనం అనుకున్నదాని ప్రకారం బరువు తగ్గడం, స్లిమ్‌గా మారడం మరింత సులవవుతుంది. మరో ప్రయోజనం ఒత్తిడి తగ్గుతుంది. ఆహారాన్ని జాగ్రత్తగా నమలడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment