జొన్నలు అనగానే గుర్తొచ్చేది జొన్న సంగటి, జొన్న రొట్టెలు, జొన్న అన్నం. కానీ జొన్నలతో జావకూడా తయారు చేసు కోవచ్చు. జొన్నలను మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. మరి ఈజీగా జొన్న, ఉప్మా, కిచిడీ, జావను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.
ఫైబర్-రిచ్ మిల్లెట్ జొన్నల్ని భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా - ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా,మధ్య అమెరికాలో సాగు చేస్తారు. దాదాపు వేల ఏళ్లుగా పేద, గ్రామీణ ప్రజల సాధారణ భోజనంగా ఉండేది. అయితే జొన్నలు పోషకాహారం మాత్రమే కాదు, అధికబరువుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ బరువు తగ్గడంలో,గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో పనిచేస్తాయి.హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తాయి.
శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను ,ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రించి డయాబెటిస్ నియంత్రణలో సహాయపపడతాయి వీటితో పాటు, ఫైబర్, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్ జోవర్ అధికంగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జొన్నల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది.
జొన్నలతో జావ
జొన్న పిండిని అరకప్పు తీసుకోవాలి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు తగినంత తీసుకోవాలి.
జొన్న పిండిలో నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలపాలి. వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగిన తరువాత ముందుగానే కలిపి ఉంచుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని కలపాలి. తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉండలు రాకుండా, కలుపుకుంటూ ఉడికించాలి. సరిపడా ఉప్పు, పలుచని మజ్జిగ కలిపి తాగాలి. నచ్చినవాళ్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు అల్లం, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. (మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా! )
జొన్న ఉప్మా
ఒక కప్పు జొన్నలు లేదా రవ్వను సుమారు 8-12 గంటలు లేదా రాత్రిపూట నానబెట్టాలి.
కుక్కర్‌లో మంచినీళ్లు, చిటికెడు పసుపు వేసి మూడు, నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.
ఇపుడు ఉప్మా పోపు కోసం పాన్ వేడి చేసి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, ఆవాలు , జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇష్టమున్నవారు పచ్చి బఠానీ, క్యారట్, బంగాళాదుంపు, బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక ఉడికిని జొన్న రవ్వను కలుపుకోవాలి. టేస్ట్ కోసం రెండు టీస్పూన్ల మాగీ మసాలా ధనియాల పొడి కలుపుకోవచ్చు. ఐదు నుండి ఎనిమిది నిమిషాలు నెమ్మదిగా మంట ఉడకనిస్తే చాలు.
జోవర్ ఖిచ్డీ
అరకప్పు జొన్నల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి.
ఒక బాండ్లీలో క్యాప్సికమ్, టమాటా,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు గుమ్మడికాయ (ఐచ్ఛికం) ముక్కలు, ఎండుమిర్చి జీలకర్ర, ఇంగువ, ఇతర పోపు గింజలువేసి వేయించుకోవాలి. బాగా వేగాక నాన బెట్టిన జొన్నలు, సరిపడినన్ని నీళ్లు, అరకప్పు పాలు యాడ్ చేసి కుక్కర్‌లో మూడు విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. తినేమందు తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని అల్లం లేదా కొబ్బరి చట్నీతోగానీ, పుట్నాల చట్నీతోగానీ తింటే భలే రుచిగా ఉంటుంది. (డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో)
Comments
Please login to add a commentAdd a comment