jonna
-
జొన్నలతో అధిక బరువుకు చెక్ : ఇలా ఒకసారి ట్రై చేయండి!
జొన్నలు అనగానే గుర్తొచ్చేది జొన్న సంగటి, జొన్న రొట్టెలు, జొన్న అన్నం. కానీ జొన్నలతో జావకూడా తయారు చేసు కోవచ్చు. జొన్నలను మన ఆహారంలో చేర్చుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయి. మరి ఈజీగా జొన్న, ఉప్మా, కిచిడీ, జావను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.ఫైబర్-రిచ్ మిల్లెట్ జొన్నల్ని భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా - ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా,మధ్య అమెరికాలో సాగు చేస్తారు. దాదాపు వేల ఏళ్లుగా పేద, గ్రామీణ ప్రజల సాధారణ భోజనంగా ఉండేది. అయితే జొన్నలు పోషకాహారం మాత్రమే కాదు, అధికబరువుతో బాధపడేవారికి మేలు చేస్తుంది. ఇందులోని ఫైటోకెమికల్స్ బరువు తగ్గడంలో,గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో పనిచేస్తాయి.హిమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరుస్తాయి.శరీరంలోని గ్లూకోజ్ స్థాయిలను ,ఇన్సులిన్ సెన్సిటివిటీని నియంత్రించి డయాబెటిస్ నియంత్రణలో సహాయపపడతాయి వీటితో పాటు, ఫైబర్, థయామిన్, నియాసిన్, రైబోఫ్లావిన్, ఫోలేట్ జోవర్ అధికంగా ఉండటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ చెప్పవచ్చు. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. జొన్నల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మారుస్తుంది.జొన్నలతో జావజొన్న పిండిని అరకప్పు తీసుకోవాలి, మజ్జిగ ఒక కప్పు, ఉప్పు తగినంత తీసుకోవాలి. జొన్న పిండిలో నీళ్లు పోసుకొని ఉండలు లేకుండా కలపాలి. వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల నీళ్లు పోసి బాగా మరిగిన తరువాత ముందుగానే కలిపి ఉంచుకున్న జొన్న పిండి మిశ్రమాన్ని కలపాలి. తక్కువ మంట మీద 5 నిమిషాల పాటు ఉండలు రాకుండా, కలుపుకుంటూ ఉడికించాలి. సరిపడా ఉప్పు, పలుచని మజ్జిగ కలిపి తాగాలి. నచ్చినవాళ్లు సన్నగా తరిగిన పచ్చిమిర్చి, కరివేపాకు అల్లం, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. (మొలకెత్తిన రాగుల పిండితో లాభాలెన్నో: ఇంట్లోనే చేసుకోండిలా! )జొన్న ఉప్మాఒక కప్పు జొన్నలు లేదా రవ్వను సుమారు 8-12 గంటలు లేదా రాత్రిపూట నానబెట్టాలి.కుక్కర్లో మంచినీళ్లు, చిటికెడు పసుపు వేసి మూడు, నాలుగు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి.ఇపుడు ఉప్మా పోపు కోసం పాన్ వేడి చేసి, ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి, ఆవాలు , జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇష్టమున్నవారు పచ్చి బఠానీ, క్యారట్, బంగాళాదుంపు, బీన్స్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక ఉడికిని జొన్న రవ్వను కలుపుకోవాలి. టేస్ట్ కోసం రెండు టీస్పూన్ల మాగీ మసాలా ధనియాల పొడి కలుపుకోవచ్చు. ఐదు నుండి ఎనిమిది నిమిషాలు నెమ్మదిగా మంట ఉడకనిస్తే చాలు.జోవర్ ఖిచ్డీఅరకప్పు జొన్నల్ని రాత్రంతా నానబెట్టుకోవాలి. ఒక బాండ్లీలో క్యాప్సికమ్, టమాటా,పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు గుమ్మడికాయ (ఐచ్ఛికం) ముక్కలు, ఎండుమిర్చి జీలకర్ర, ఇంగువ, ఇతర పోపు గింజలువేసి వేయించుకోవాలి. బాగా వేగాక నాన బెట్టిన జొన్నలు, సరిపడినన్ని నీళ్లు, అరకప్పు పాలు యాడ్ చేసి కుక్కర్లో మూడు విజిల్స్ దాకా ఉడికించుకోవాలి. తినేమందు తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీన్ని అల్లం లేదా కొబ్బరి చట్నీతోగానీ, పుట్నాల చట్నీతోగానీ తింటే భలే రుచిగా ఉంటుంది. (డ్రీమ్ జాబ్స్ అంటే ఇలా ఉంటాయా? వైరల్ వీడియో) -
జొన్న ప్రొటీన్లు మిన్న
జొన్నరొట్టెకు పెరిగిన డిమాండ్ కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే జొన్నరొట్టెలను తింటేనే ఆరోగ్యంగా ఉంటారని డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే కొవ్వును తగ్గించడానికి జొన్నరొట్టెలు ఎంతో ఉపయోగపడతాయని చెబుతుండటంతో వాటిని తినేందుకు పట్టణ ప్రజలు, ఉద్యోగస్తులు ఆసక్తి చూపుతున్నారు. కొత్తకోట పట్టణంలోని కర్నూల్ రోడ్డులో పదుల సంఖ్యలో జొన్నరొట్టె సెంటర్లు వెలిశాయి. చాలామంది మహిళలు వీటినే ఉపాధిగా మలుచుకుని రెండుచేతులా సంపాదిస్తున్నారు. ఆహారపు అలవాట్లలో మార్పులు ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెడుతున్నారు. రుచిని కాకుండా ఆహార ఉపయోగాల విషయాలపై దృష్టి పెడుతున్నారు. వైద్యుల సూచనలతో దురలవాట్లను మార్చుకుని జంక్‌ఫుడ్‌తో కలిగే అనర్థాలను తెలుసుకుని జొన్నరొట్టె వైపు ఆసక్తి పెంచుకుంటున్నారు. ఈ ఆహారంలో మంచి పోషక విలువలు కలిగి ఉండటంతో జొన్నరొట్టెలకు డిమాండ్ పెరిగింది. ఒక్కరొట్టె రూ.10 నుంచి 15 వరకు పలుకుతోంది.చాలామంది ఇష్టంగా తింటున్నారు నేను ఇంట్లోనే జొన్న రొట్టెలు చేసి అమ్ముతాను. కాలనీలోని వారు, ఉద్యోగస్తులు ఎంతో ఇష్టంగా ఆర్డర్ ఇచ్చి రొట్టెలు చేయించుకుంటారు. ప్రజలకు జొన్నరొట్టెలు తినడం అలవాటు కావడంతో నాకు గిరాకీ బాగా పెరిగింది. ఒక్కోసారి 50 నుంచి 60 రొట్టెలు అమ్ముతాను. – జ్యోతి, కొత్తకోట -
ఖరీఫ్‌లో జొన్న, మొక్కజొన్న బాగు
– ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త రవీంద్రనాథరెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్‌లో జొన్న, మొక్కజొన్న పంటలు సాగు చేసే రైతులు సరైన యాజమాన్య పద్ధతులు పాటించాలని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బి.రవీంద్రనాథరెడ్డి తెలిపారు. విత్తన ఎంపిక, విత్తనశుద్ధి, ఎరువుల వాడకంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జొన్న: సీఎస్హెచ్–14, సీఎస్హెచ్–18, పీఎస్వీ–1, సీఎస్వీ–15, పాలెం–2 జొన్న రకాలు అనువైనవి. జూలై 15లోగా విత్తుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 కిలోలు అవసరం. సాళ్ల మధ్య 45 సెంటీమీటర్లు (సెం.మీ), మొక్కల మధ్య 12 నుంచి 15 సెం.మీ దూరంలో విత్తుకోవాలి. కిలో విత్తనానికి 3 గ్రాములు థయోమిథాక్సామ్‌తో విత్తనశుద్ధి చేసుకోవాలి. ఎకరాకు 32 నుంచి 40 కిలోలు నత్రజని, 24 కిలోలు భాస్వరం, 20 కిలోలో పొటాష్ ఎరువు వేసుకోవాలి. నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసుకుని విత్తేసమయంలో, ఆ తర్వాత మోకాలు ఎత్తు పైరు ఉన్నపుడు రెండో సారి వేసుకోవాలి. మొక్కజొన్న : డీహెచ్ఎం–11, డీహెచ్ఎం–113, డీహెచ్ఎం–115, డీహెచ్ఎం–117, డీహెచ్ఎం–119, డీహెచ్ఎం–121, ఆంబర్పాప్కార్న్, మాధురి, ప్రియా మొక్కజొన్న విత్తన రకాలు ఎంపిక చేసుకోవాలి. జూన్ 15 నుంచి జూలై 15వ తేదీ వరకు విత్తుకునేందుకు అనువైన సమయం. ఎకరాకు 8 కిలోలు విత్తనం అవసరం. సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు దూరం ఉండేలా విత్తుకోవాలి. ఎకరాకు 72 నుంచి 80 కిలోలు నత్రజని, 24 కిలోలు భాస్వరం, 20 కిలోలు పొటాష్ ఎరువు వేయాలి. నత్రజని ఎరువును రెండు భాగాలుగా చేసుకుని విత్తే సమయంలో సగం, విత్తుకున్న 30 రోజులకు రెండో సగం వేసుకోవాలి. నీటి పారుదల కింద అయితే నత్రజని ఎరువును నాలుగు భాగాలుగా చేసుకుని విత్తేసమయం, 25 నుంచి 30 రోజులు, 40 నుంచి 45 రోజులు, 60 నుంచి 65 రోజుల సమయంలో వేసుకోవాలి. -
కోనసీమ అందాలపై శతకం అంకితం
అంతర్వేది(సఖినేటిపల్లి) : అంతర్వేది పుణ్యక్షేత్రంలో మంగళవారం సాగరసంగమం వద్ద ప్రముఖ తెలుగు వేదకవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్వీయ రచన చేసిన కోనసీమ శతకాన్ని వాయుదేవునికి అంకితం చేశారు. గాలిపటంపై కోనసీమ గొప్పతనాన్ని వర్ణిస్తూ పటానికి ఒక వైపు 60, రెండోవైపు 48 పద్యాలు రాసి వశిష్టగోదావరి, సముద్రం సంగమం ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వశాంతిని కలిగించు వేదఘోషను ప్రతిధ్వనించే సాగరసంగమం, పుణ్యతీర్థాల క్షేత్రాల ముక్తి సీమ–కోనసీమ, వేదాన్ని– వ్యవసాయాన్ని ప్రతిబింబించే కోనసీమ, గలగల పారే గోదావరి, పక్షుల కిలకిలరావాలతో పులకరించే కోనసీమ, సంప్రదాయం–సంపద కలిగియుండే కోనసీమ, సుఖశాంతులతో ధాన్యాగారంగా తులతూగే కోనసీమ లోగిళ్లు, రేయింబవళ్లు కష్టించి పనిచేసే రైతుల మధుర సీమ కోనసీమ, కదలి గౌతమీపై గాలి, కడలి గాలి, చెరువులోని కలువతామరుల కమ్మనిగాలి, పైరుగాలి–తోట గాలిల సమ్మేళనం మానససరోవరం కోనసీమ అంటూ తదితర వాటిపై ఆయన 108 పద్యాలను రాశారు. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆయన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనాలు చెప్పి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకంలో ఆయన భోజనం చేశారు. వెంట శతావధానులు పాలపర్తి శ్యామలానంద్ప్రసాద్, గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్, సాహతీవేత్త ధవేజీ పాల్గొన్నారు.