శరీరానికి కాల్షియం అనేక రోజువారీ పనులు చేసేందుకు ఉపకరిస్తుంది. అందువల్ల మన డైట్‌లో కాల్షియంని చేర్చుకోవడం ముఖ్యం. జున్ను, బొప్పాయి, మల్బరీ, లిచీ, కివి, బచ్చలికూర, బ్రకోలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పాలు, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే...
పాలు, రాగులు రెండూ ఒకదానికి మించి లాభాలని అందిస్తాయి. ఉదాహరణకి..100 మి.లీ పాలు తాగితే 110 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. అదే 100 గ్రాముల రాగులని తీసుకుంటే, దాదాపు 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచితే, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి రాగులు మంచిది.
రాగుల్లో ఉండే పొటాషియం వంటి ఇతర పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యానికి సాయపడతాయి. పాలలో పోషకాలతో పాటు ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీని హైడ్రేట్ చేస్తాయి. రాగులు షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని నియంత్రిస్తుంది కాబట్టి, మీ అవసరాలని బట్టి ఏది మంచిదో నిర్ణయించుకోవడం ఉత్తమం.
ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!
రాగులు, ఆరోగ్య ప్రయోజనాలు
భారతదేశంలోని చాలా ప్రాంతాలలో రాగిగా ప్రసిద్ధి చెందిన ఫింగర్ మిల్లెట్ అతి ముఖ్యమైన చిరుధాన్యాలలో ఒకటి ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి దీనిని తరచుగా శిశువులకు , వృద్ధులకు ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులలో ప్రోటీన్ ,ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి.
సంతృప్తిగా ,కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది.
ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుంది
గ్లూటెన్ రహితం కాబట్టి గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.
తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది , అసంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది.
కాల్షియం మూలమైన రాగులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
మొలకెత్తిన రాగులు విటమిన్ బి 12 అవసరాలను తీరుస్తాయి.
శీతాకాలంలో ఇది బెస్ట్ ఫుడ్. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.
ఇది మలబద్దకానికి సహాయపడుతుంది.
ఎవరు తీసుకోకూడదు
మూత్రపిండాల్లో రాళ్ళు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారు
రాగులలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక హైపర్కలేమియా లేదా సీరం పొటాషియం స్థాయిలు పెరిగినవారు.
అలాగే రాగులు రాత్రి పూట తినకుండా ఉండటం మంచిది.
ఇదీ చదవండి : ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి?
Comments
Please login to add a commentAdd a comment