calcium
-
కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుంది రాగులా? పాలా?
శరీరానికి కాల్షియం అనేక రోజువారీ పనులు చేసేందుకు ఉపకరిస్తుంది. అందువల్ల మన డైట్లో కాల్షియంని చేర్చుకోవడం ముఖ్యం. జున్ను, బొప్పాయి, మల్బరీ, లిచీ, కివి, బచ్చలికూర, బ్రకోలీలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. వీటిని రెగ్యులర్‌గా తినడం వల్ల చాలా సమస్యల్ని దూరం చేసుకోవచ్చు. ఆరోగ్యంగా కూడా ఉంటారు. పాలు, రాగుల్లో కాల్షియం ఎక్కువగా ఎందులో ఉంటుందంటే...పాలు, రాగులు రెండూ ఒకదానికి మించి లాభాలని అందిస్తాయి. ఉదాహరణకి..100 మి.లీ పాలు తాగితే 110 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. అదే 100 గ్రాముల రాగులని తీసుకుంటే, దాదాపు 350 మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థని ఆరోగ్యంగా ఉంచితే, ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తహీనత ఉన్నవారికి రాగులు మంచిది. రాగుల్లో ఉండే పొటాషియం వంటి ఇతర పోషకాలు మొత్తం శరీర ఆరోగ్యానికి సాయపడతాయి. పాలలో పోషకాలతో పాటు ఉండే ఎలక్ట్రోలైట్స్ బాడీని హైడ్రేట్ చేస్తాయి. రాగులు షుగర్ ఉన్నవారికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ని నియంత్రిస్తుంది కాబట్టి, మీ అవసరాలని బట్టి ఏది మంచిదో నిర్ణయించుకోవడం ఉత్తమం.ఇదీ చదవండి: భరించలేని మోకాళ్ల నొప్పులకు.. సూపర్ ఫుడ్ ఈ లడ్డూ...అంతేనా!రాగులు, ఆరోగ్య ప్రయోజనాలుభారతదేశంలోని చాలా ప్రాంతాలలో రాగిగా ప్రసిద్ధి చెందిన ఫింగర్ మిల్లెట్ అతి ముఖ్యమైన చిరుధాన్యాలలో ఒకటి ప్రధాన ఆహారంగా పరిగణించబడుతుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది కాబట్టి దీనిని తరచుగా శిశువులకు , వృద్ధులకు ఆహారంగా ఇవ్వవచ్చు. రాగులలో ప్రోటీన్ ,ఫైబర్స్ వంటి స్థూల పోషకాలతో పాటు, కాల్షియం, మెగ్నీషియం, మెథియోనిన్, లైసిన్, అమైనో ఆమ్లాలు ఉన్నాయి. సంతృప్తిగా ,కడుపు నిండిన అనుభూతిని ఎక్కువసేపు ఉంచుతుంది.ట్రిప్టోఫాన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కలిగి ఉండటం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహిస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రయోజనకరంగా ఉంటుందిగ్లూటెన్ రహితం కాబట్టి గ్లూటెన్ అసహనం ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది.తక్కువ కొవ్వును కలిగి ఉంటుంది , అసంతృప్త కొవ్వు అధికంగా ఉంటుంది.కాల్షియం మూలమైన రాగులు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయిమొలకెత్తిన రాగులు విటమిన్ బి 12 అవసరాలను తీరుస్తాయి.శీతాకాలంలో ఇది బెస్ట్ ఫుడ్. శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది.ఇది మలబద్దకానికి సహాయపడుతుంది.ఎవరు తీసుకోకూడదుమూత్రపిండాల్లో రాళ్ళు, తీవ్రమైన మూత్రపిండాల వైఫల్యం వంటి మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు లేదా డయాలసిస్ చేయించుకుంటున్నవారురాగులలో పొటాషియం అధికంగా ఉంటుంది కనుక హైపర్కలేమియా లేదా సీరం పొటాషియం స్థాయిలు పెరిగినవారు. అలాగే రాగులు రాత్రి పూట తినకుండా ఉండటం మంచిది.ఇదీ చదవండి : ఇలాంటి పీడ కలలు మీకూ వచ్చాయా? అర్థం, అనర్థాలేమిటి? -
హెల్త్: మీకు తెలుసా! ఈ రెండు కలిపి తీసుకోవడంతో.. ఏమవుతుందో?
మానవ శరీరం చురుగ్గా పనిచేయలంటే ఐరన్, కాల్షియం అనే రెండూ చాలా అవసరం. హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావడంలో ఐరన్ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే, ఆరోగ్యకరమైన ఎముకలు, దంతాలకు కాల్షియం అవసరం. అందుకే వైద్యనిపుణులు వివిధ రకాల కారణాల వల్ల క్యాల్షియం, ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవలసిందిగా పేషెంట్లకు సూచిస్తుంటారు. అయితే, ఈ రెండు సప్లిమెంట్లను కలిపి తీసుకుంటే.. కొన్ని దుష్ఫ్రభావాలు కలుగుతాయి. ఐరన్, కాల్షియం ఒకదానికొకటి ప్రత్యేకమైన ప్రయోజనాలను కలిగి ఉంటాయి. అందుకే వాటిని కలిపి ఒకేసారి తీసుకోవడం మంచిది కాదు. విటమిన్లు, మినరల్స్ కరిగిపోవడానికి కొంచెం సమయం పడుతుంది. ఈ రెండూ కలిపి తీసుకోవడం వల్ల వాటి ద్వారా అందాల్సిన ప్రయోజనాలు శరీరానికి అందవు. ఈ రెండు సప్లిమెంట్లను ఆరు గంటల తేడాతో తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి గుర్తుంచుకోవాలి.. ఐరన్ తీసుకునే సమయంలో పాలు, చీజ్, పెరుగు, బచ్చలికూర, టీ, కాఫీ, తృణధాన్యాలు తీసుకునే ముందు కనీసం రెండు గంటల గ్యాప్ తీసుకోండి. ఐరన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత కొన్ని గంటల పాటు యాంటాసిడ్లను కూడా నివారించాలి. సూచించిన దానికంటే ఎక్కువ కాలం ఐరన్ సప్లిమెంట్లను తీసుకోవద్దు. ఇవి చదవండి: హెల్త్: మెడనొప్పికి అసలు కారణాలేంటో తెలుసా!? -
'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!?
'దేహ నిర్మాణంలోనూ, దారుఢ్యంలోనూ ఎముకలది కీలక పాత్ర. ఎముకలు బలంగా ఉంటేనే మనిషి బలంగా ఉంటాడు. ఆరోగ్యంగానూ ఉంటాడు. చిన్న వయసులో ఎముకలు చాలా ఫ్లక్సిబుల్గా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకల్లోకి క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు నిండుతూ పోతుంటాయి. ఫలితంగా ముప్ఫయిల వయసు నాటికి ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆ గరిష్ఠ స్థాయికి చేరాక మళ్లీ ఎముక సాంద్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా తగ్గడాన్ని ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అంటారు. మెల్లగా తగ్గుతూపోతుంటే చాలాకాలం బలంగా ఉంటుంది. లేదంటే బలహీనపడుతుంది. ఈ 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ కథా కమామిషు చూద్దాం.' 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలంటే...? మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సిమెంటు అనుకుంటే... సూర్యరశ్మి నుంచి దొరికే విటమిన్ ‘డి’ ఈ కాంక్రీటును కలిపే నీరుగా భావిస్తే.. ఇదంతా ఎముకలో బలంగా కూరేలా చేసేది మనం చేసే వ్యాయామం. ఈ మూడు గరిష్ఠంగా కలగలిసి ఎంత బలంగా కూరినట్లు అయితే ఎముక అంత బలంగా మారుతుంది. అలా రూపొందే ఎముక సాంద్రత మీద ఎముక బలం ఆధారపడి ఉండటంతో.. ఎముక ఆరోగ్యానికి ‘బోన్ మినరల్ డెన్సిటీ’ అన్నది ఓ సూచికగా ఉంటుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఈ బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతూ పెరుగుతూ 30వ ఏటికి వచ్చేసరికి దాదాపుగా గరిష్టంగా కొంతకాలం పాటు ఉండి, మళ్లీ అప్పటి నుంచి క్రమంగా తగ్గుతుంటుంది. ప్రోగ్రెసివ్ బోన్ లాస్ మహిళల్లో మరింత ఎక్కువ. ఎముకలు తమ సాంద్రత కోల్పోయే కండిషన్ పురుషుల కంటే మహిళల్లో చాలా వేగంగా జరుగుతుంది. సాధారణంగా వాళ్లలో వ్యాయామం చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉండటం, అదీగాక 45 ఏళ్లు దాటాక రుతుస్రావం ఆగిపోవడం, దాంతో మెనోపాజ్ తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. ఈ కారణంగానే మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ. ఎముక సాంద్రత తగ్గడానికి కారణాలు.. మన ప్రమేయం లేనివి.. కొందరికి జన్యుపరంగానే ఎముక సాంద్రత ఎక్కువగా ఉంటుంది. వారిలో వంశపారం పర్యంగానే చాలా పెద్దవయసు వచ్చేవరకు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చే మార్చలేని అంశం. ∙కొందరిలో కుషింగ్ సిండ్రోమ్, హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తిలేకపోవడంతో ఆహారానికి దూరంగా ఉండటం), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గి, ఆ తర్వాత ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. కొందరు తరచూ కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడుతుండటం, అవి తగ్గడం కోసం గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ వంటి మందులు వాడుతుండటం... ఎముక సాంద్రతను తగ్గిస్తాయి. జెండర్ కారణాలు.. మహిళల విషయంలో.. అందునా వాళ్లలో మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ. ఎత్తు తక్కువగా ఉన్న మహిళల్లో రిస్క్ ్రపోగ్రెసివ్ బోన్లాస్ ముప్పు మరింత ఎక్కువ. (అంటే.. బరువు అరవై కిలోల లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). మన చేతుల్లో/ నియంత్రణలో ఉండే అంశాల విషయానికి వస్తే.. మన నియంత్రణలో ఉండే కొన్ని అంశాలు పాటించడం ద్వారా ప్రోగ్రెసివ్ బోన్ లాస్‌ను నివారించవచ్చు. అదెలాగంటే.. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పాలు, నట్స్ వంటి ఆహారాలు తీసుకుంటూ ఉండటం. దేహానికి విటమిన్–డి సమకూరేలా లేత ఎండలో వ్యాహ్యాళిగా తగినంత వ్యవధి పాటు తిరగడం. (నేరుగా పడే, తీవ్రమైన ఎండలో తిరగకూడదు). రోజుకు 30 – 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం. మన జీవనశైలి మార్చుకోవడం అంటే కాఫీ వంటివి పరిమితంగా తీసుకోవడం. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం. కంటినిండా తగినంతగా నిద్రపోవడం. ఒకవేళ కౌమార, యౌవన దశల్లో వ్యాయామానికి దూరంగా ఉండటం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు లోనైతే ఎముక సాంద్రత తగ్గిపోవడంలో వేగం పెరుగుతుంది. ఎముకలు త్వరగా గుల్లబారిపోయి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు త్వరగా వచ్చేందుకు అవకాశం పెరుగుతుంది. ఎముక సాంద్రత తెలిసేదెలా..? ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అనే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ పరీక్షే ఎముక సాంద్రత తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. బాధితుల వయసు ఆధారంగా ఎముక సాంద్రతను లెక్కగడతారు. దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దాంతో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలూ అవసరం పడవచ్చు. ఎముక సాంద్రత పెంచుకోవడం కోసం.. ప్రోగ్రెసివ్ బోన్లాస్ నివారణకు మన చేతిలో ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తే... ఎముక సాంద్రత పెంచుకోడానికి దోహదపడుతుంది. యుక్తవయసు పిల్లల్ని ఆరుబయట ఎండలో ఆడేలా ్రపోత్సహించడం. పెరిగే వయసు నుంచే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతోపాటు బ్రాకలీ వంటివి ఎక్కువగా తీసుకునేలా చూడటం. చిన్న వయసు నుంచి లేత ఎండలో ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల దేహంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. అది ఆహారాన్ని ఎముకల్లోకి ఇంకిపోయేలా చేయడంతో సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా ఎంత చిన్న వయసు నుంచి ఈ అలవాట్లు నేర్పితే.. అంత సుదీర్ఘకాలం సాంద్రత నిలిచి ఉండి, ప్రోగ్రెసివ్ బోన్ లాస్ తగ్గుతుంది. దాంతో వృద్ధాప్యంలో పడిపోవడం (ఫాల్), ఇతర ఎముకలతో పాటు ప్రధానంగా తుంటి ఎముకల వంటివి విరగడాన్ని నివారించవచ్చు. — డాక్టర్ సుధీర్‌రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. -
మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..!
కుటుంబ సభ్యులందరికీ కావలసిన వాటిని అమర్చడంలో పడి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించరు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసిందే. అందువల్ల ముందే మేలుకొనడం అవసరం. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే ఉంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించడం. తమ వయసుకు తగ్గ పోషకాహారం తీసుకోవడం. అనారోగ్య సమస్యలను దాచిపెట్టకుండా తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే...మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.. ఐరన్ ఉండే ఆహారం... మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో మాంసకృత్తులు, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలి కూర, బ్రోకలీ, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ ఎ తప్పనిసరి... మహిళలకు అవసరమైన విటమిన్ల జాబితాలో విటమిన్ ఎ ద్వితీయ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలి. విటమిన్ బి 12.. విటమిన్ బి 12 అనేది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల బీ 12 సమృద్ధిగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాలి. శాకాహారులు ΄÷ట్టు తియ్యని వేరసెనగపప్పు, సెనగలు, దంపుడు బియ్యం, వెన్న తియ్యని పాలు (జంతువుల నుంచి వచ్చిన పాలు) వంటివి తీసుకోవాలి. కాల్షియం... మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను తరచు ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాలు, గుడ్డు, నువ్వులు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి... ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. మెగ్నీషియం... మెగ్నీషియం కూడా స్త్రీలకు కావలసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలు అవసరం.. భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల అత్యవసరమైన సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్, ఐరన్ వంటి పరీక్షలను చేయించుకోవడం అవసరం. ఇవి చదవండి: సమాజాన్ని అద్దంలో చూపించాను -
యూరియా కావాలా?.. ఇతర ఎరువులు కొనాల్సిందే.. కంపెనీల దోపిడి..
ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ వస్త్ర,వస్తు తయారీ కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుంటాయి. ఇది సాధారణంగా జరిగేదే. కానీ ఎరువుల కంపెనీలు మాత్రం ఇది కొంటేనే అదిస్తామంటూ షరతులు పెడుతున్నాయి. యూరియా కావాలంటే పురుగు మందులు, జింక్, కాల్షియం వంటివి కొనాలని డీలర్లపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో డీలర్లు రైతులపై ఇదే పద్ధతిలో ఒత్తిడి తెస్తున్నారు. విధిలేని పరిస్థితుల్లో రైతులు తమకు అవసరం లేకపోయినా యూరియాతో పాటు ఇతర ఎరువులు కొనాల్సి వస్తోంది. దీనివల్ల సాగు ఖర్చు పెరిగి రైతులు నష్టాలపాలయ్యే పరిస్థితి ఏర్పడుతోందని, ముఖ్యంగా యథేచ్ఛగా ఎరువుల వినియోగంతో ఆహార పంటలు విషతుల్యమై ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టార్గెట్లతో రూ.కోట్ల అక్రమార్జన యూరియా అందుబాటులో ఉన్నా కృత్రిమ కొరత సృష్టిస్తూ కంపెనీలు ఇతర ఎరువులను రైతులకు అంటగడుతున్నాయి. కంపెనీలు వాటి సేల్స్ మేనేజర్లకు ఇతర ఎరువులను విక్రయించే టార్గెట్లు పెట్టి మరీ యూరియాయేతర ఎరువుల అమ్మకాలు చేయిస్తున్నాయి. టార్గెట్లు పూర్తి చేసిన సేల్స్ మేనేజర్లకు నగదు ప్రోత్సాహకం ఇస్తున్నాయి. దాంతో పాటు హైదరాబాద్‌లో విలాసవంతమైన రిసార్టుల్లో విందులు, వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాయి. కొన్నిసార్లు విదేశీ పర్యటనలకు కూడా అవకాశం కల్పిస్తున్నాయి. దీంతో వారంతా ఎరువుల డీలర్లపై ఒత్తిడి పెంచుతున్నారు. రూ.1.10 లక్షల విలువ చేసే 445 బస్తాల యూరియా ఇవ్వాలంటే రూ.4.40 లక్షల విలువ చేసే 400 బస్తాల 20/20/013 రకం కాంప్లెక్స్ ఎరువులు కొనాలనే నిబంధన విధిస్తున్నారు. దీంతో డీలర్లు యూరియా కోసం మార్కెట్లో రైతులకు అంతగా అవసరం లేని కాంప్లెక్స్ ఎరువుల బస్తాలను కూడా కొంటున్నారు. ఇలా కంపెనీలు ఏడాదికి వందల కోట్ల రూపాయల అక్రమ వ్యాపారం చేస్తున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కొందరు డీలర్లు ఇందుకు నిరాకరించడంతో ఆయా ప్రాంతాల్లో రైతులు యూరియా సక్రమంగా లభించక ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులను మభ్యపెడుతూ.. యూరియాతో పాటు ఫలానా ఎరువు, పురుగుమందు వాడితే ప్రయోజనం ఉంటుందని కంపెనీలు, డీలర్లు మభ్యపెడుతుండటంతో రైతులు అమాయకంగా వాటిని కొంటున్నారు. వాస్తవానికి యూరియాను ఇతర ఎరువులు, పురుగు మందులకు లింక్ పెట్టి విక్రయించకూడదన్న ఉత్తర్వులు ఉన్నాయి. జిల్లా వ్యవసాయాధికారి ఆదేశం మేరకే యూరియా కేటాయింపులు జరగాలి. కానీ డీలర్లు ఈ విధంగా లింక్ పెడుతూ ఇతర ఎరువులను బలవంతంగా అంటగడుతున్నారని తెలిసినా అధికారులు మిన్నకుంటున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మండల వ్యవసాయాధికారి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఎరువులను, పురుగుమందులను విక్రయించాలన్న నిబంధన ఉన్నా అది కూడా పట్టించుకోవడం లేదని అంటున్నాయి. మరోవైపు ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాలను కూడా కంపెనీలు వదలడంలేదు. యూరియాలో 20 శాతం ఈ సేవా కేంద్రాలకు కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసినా, ఈ ఆదేశాలను తుంగలో తొక్కుతున్న కొన్ని యూరియా కంపెనీలు 20/20/013 ఎరువుల్ని తీసుకుంటేనే యూరియా ఇస్తామని చెబుతున్నాయి. ఇప్పటికైనా వ్యవసాయాధికారులు తగు చర్యలు తీసుకుని డీలర్లు ఒక ఎరువుతో మరొక ఎరువుకు లింకు పెట్టకుండా చూడాలని రైతు సంఘాల నేతలు కోరుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ -
ఈ లక్షణాలు కనిపిస్తే మీరు కాల్షియం లోపంతో బాధపడుతున్నట్లే
శరీరానికి అనేక పోషకాలు అవసరం అందులో ముఖ్యమైన వాటిలో కాల్షియం కూడా ఒకటి. కాల్షియం లోపం వల్ల ఎముకలు బలహీనపడటంతోపాటు దంతాలకు సంబంధించిన సమస్యలు, గోళ్లు విరగడం, తలతిరగడం తదితర సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల, ఆహారంలో కాల్షియం తగినంత మొత్తంలో ఉండాలి. శరీరంలో కాల్షియం లేకపోతే, అది ఎముకల నుండి కాల్షియం తీసుకోవడం ప్రారంభిస్తుంది, దీని కారణంగా ఎముకలు మరింత బలహీనమవుతాయి. మరి కాల్షియం మన శరీరానికి దొరకాలి అంటే మనం తగినన్ని పాలు తాగాలి. కానీ, కొందరికి పాల వాసన కూడా పడదు. అలాంటప్పుడు కాల్షియం ఎలా తీసుకోవాలి? పాల ఉత్పత్తులు కాకుండా దండిగా కాల్షియం లభించే ఆహార పదార్థాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. కాల్షియం మన శరీరంలోని ఎముకలు, దంతాలను బలోపేతం చేయడమే కాకుండా.. కండరాల బలాన్ని, నరాల పనితీరును మెరుగుపరుస్తుంది. మన శరీరానికి రోజూ ఎంతమేర కాల్షియం అవసరం అన్నది ముందుగా తెలుసుకోవాలి. పురుషులు అయితే.. కనీసం 1000-1200 mg,మహిళలు, వృద్ధులు అయితే 1200- 1500 mg, పిల్లలు అయితే కనీసం 1300, గరిష్టంగా 2500 mg కాల్షియం తీసుకోవాల్సి ఉంటుంది. పాలతో మాత్రమే ఈ అవసరం తీరుతుందని అపోహ మాత్రమే. పాల ఉత్పత్తుల్లోనే కాకుండా చాలా ఆహార పదార్థాల్లోనూ కాల్షియం మెండుగా దొరుకుతుంది. కాల్షియం లోపిస్తే కనిపించే లక్షణాలు వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, ఒకవిధమైన జలదరింపు కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం బద్ధకం, తీవ్రమైన అలసట బలహీనమైన, పెళుసుగా ఉండే గోర్లు దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం తికమకగా అనిపించడం ఆకలి లేకపోవడం. పాలు ఇష్టం లేకపోతే, ఇవి తీసుకోండి ► తెల్లనువ్వులు లేదా నల్ల నువ్వులు రెండింటిలో క్యాల్షియం అధికమొత్తంలో ఉంటుంది. రోజుకి టీస్పూను నువ్వులు ఆహారంలో చేర్చుకుంటే మంచిది. ►ఖర్జూర పండ్లు: కాల్షియం, ఐరన్ లోపాలతో బాధపడేవారు ఖర్జూర పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి, అనిమీయా వ్యాధిని కూడా తగ్గిస్తాయి. ► అవిసె గింజల్లో ఒమేగా–3 ప్యాటీ యాసిడ్స్, ప్రొటీన్, పీచుపదార్థంతోపాటు క్యాల్షియం అధికంగా ఉంటుంది. డైలీ టీస్పూను గింజలను తింటే శరీరానికి కావాల్సిన క్యాల్షియం అందుతుంది. ► కాల్షియం అధికంగా ఉండే మినరల్ వాటర్ ►మ్యాంగనీస్, ప్రొటీన్, పీచుపదార్థంతోపాటు క్యాల్షియం కూడా గసగసాల్లో పుష్కలంగా ఉంటుంది. నేరుగా గానీ, ఇతర రకాల ఆహార పదార్థాల్లో వీటిని చేర్చుకోవడం ద్వారా శరీరంలో క్యాల్షియం స్థాయులను పెంచుకోవచ్చు. ► ఆకుకూరల్లో శరీరానికి కావాల్సిన అనేక పోషకాలు ఉంటాయి. మెంతికూర, మునగాకుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిని కూరలుగా లేదా ఎండబెట్టి తీసుకుంటే క్యాల్షియంతోపాటు, యాంటీ ఆక్సిడెంట్స్, ఖనిజపోషకాలు శరీరానికి అందుతాయి. ► సముద్రం నుంచి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్), కొవ్వు లేని మాంసాలు, గుడ్లు ► ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి. ► బ్రోకలీ, బీట్రూట్, బచ్చలికూర, అరటి, సోయాబీన్, గుడ్లు, చేపలు, బాదం, జీడిపప్పు నుంచి కాల్షియం లభిస్తుంది. ► మేడి పండ్లలో కూడా మంచి కాల్షియం ఉంటుంది. 8 మేడిపండ్లు తీసుకుంటే,241 mg కాల్షియం లభిస్తుంది. ► ఒక కప్పు పొద్దుతిరుగుడు గింజలలో 109 mg కాల్షియం ఉంటుంది మరియు ఈ విత్తనాలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది ► శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి3తోపాటు వ్యాయామం అవసరం. విటమిన్ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం లోపిస్తే? మన శరీరానికి కాల్షియం అన్నది ఎంతో అవసరం. కాల్షియం తగినంద అందకపోతే, చర్మం పొడిబారుతుంది. దంతాలు బలహీన పడతాయి. ఎముకలు కూడా బలహీనమవుతాయి.ఉదయం లేవగానే ఎముకల్లో తిమ్మిరిగా అనిపిస్తాయి. కాల్షియం లోపం వల్ల కొన్నికొన్ని సార్లు చేతులు, పాదం, కాలు, నోటి చుట్టూ కూడా తిమ్మిరి ఏర్పడుతుంది. కాల్షియం లేకపోవడం ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. చాలా తక్కువ కాల్షియం బోలు ఎముకల వ్యాధిని పెంచుతుంది. ఇది వృద్ధ మహిళల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇదే కాకుండా ఎముకలలో పటుత్వం తగ్గి ఎముకలు త్వరగా విరిగిపోవడం లేదా, బలహీనపడతాయి. ఇది కాకుండా గుండె సంబంధిత సమస్యలు, ప్రోస్టేట్ క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుంది.కాల్షియం మంచిది కదా అని మరీ ఎక్కువ తీసుసుకోకూడదు. ఎక్కువ మోతాదులో ఉంటే ప్రతికూల దుష్ప్రభావాలను కలిగిస్తుంది. మలబద్ధకం, గ్యాస్, ఉబ్బరం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదనపు కాల్షియం మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.కాబట్టి ఎప్పటికప్పుడు కాల్షియం చెక్ చేసుకుంటూ అవసరాన్ని బట్టి తీసుకోవడం మంచిది. -
ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా..
ఎండ కన్నెరగని జీవితాల్లో డీ విటమిన్ లోపం సాధారణమైపోయింది. నరాలు, కండరాలు, వ్యాధినిరోధక శక్తి మీద విటమిన్ డీ ప్రభావం ఉంటుంది. దేహంలో డీ విటమిన్ లోపిస్తే... నీరసం, నిస్సత్తువ, తరచూ అంటువ్యాధుల బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాల్షియమ్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకున్నా సరే... దేహం ఆ క్యాల్షియమ్‌ను స్వీకరించదు. ఆహారంలోని క్యాల్షియమ్ని దేహం చక్కగా స్వీకరించాలంటే దేహంలో డీ విటమిన్ తగినంత ఉండాలి. అలాగే ఐరన్ కూడా. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్‌ని దేహం గ్రహించాలంటే దేహంలో సీ విటమిన్ తగినంత ఉండాలి. విటమిన్ సీ లోపం ఉన్న వాళ్లు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నా సరే దేహం సంగ్రహించుకోలేదు. దాంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు... మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజెన్ తగు పాళ్లలో మెదడుకు చేరడం కూడా ముఖ్యమే. అలాగే ఛాతీ నిండుగా గాలి పీల్చుకోగలగడమూ అంతే అవసరం. దైనందిన ఆహారపు అలవాట్లలో భాగంగా అన్నం కూరలు, రొట్టె, పప్పులకు తోడుగా అవసరాన్ని బట్టి ఈ కింద చెప్పిన వాటిని ఆహారంలో భాగం చేసుకుందాం. క్యాల్షియమ్ కోసం... ►రాగులు, నువ్వులు, సబ్జా, అవిశె గింజలు, వాల్నట్, గెనస గడ్డ (స్వీట్ పొటాటో), పాలకూర, పుదీనలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. ►ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్తోపాటు మునగాకు, మునక్కాయలు వారంలో రెండు దఫాలు ఆహారంలో భాగం కావాలి. ►పాలు, పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకోవాలి. ఐరన్ కోసం... ►మష్రూమ్, క్యాలీఫ్లవర్, లివర్, ట్యూనా ఫిష్, రొయ్యలు, బీట్రూట్, శనగలు, బ్రౌన్ రైస్, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీలు, ఆపిల్‌తోపాటు విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పైనాపిల్, పియర్, నారింజ, కమలాలు తీసుకోవాలి. ►డ్రైఫ్రూట్స్‌లో ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు నమిలి తినాలి. ►అన్ని కాలాల్లో దొరికే సంపూర్ణ పోషకాల అరటి పండ్లు నిత్య ఆహారంగా ఉండాలి. ►పైవన్నీ తీసుకుంటే డీ విటమిన్ కూడా తగినంత అందుతుంది. విటమిన్ డీ కోసం ►మష్రూమ్, సోయా, గుడ్లు, పాలు, పెరుగు, మీగడలు, చేపలు డీ విటమిన్నిచ్చే ఆహారాలు. ►వీటితోపాటు రోజుకు కనీసం పావుగంట సేపు దేహానికి సూర్యరశ్మి తగలాలి. ►సూర్యరశ్మి సోకే చోట మార్నిగ్ లేదా ఈవెనింగ్ వాకింగ్ చేస్తే మంచిది. ►ఇవి సాధారణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ప్రధానమైన ఆహార జాగ్రత్తలు మాత్రమే. ►మనదేహంలో క్యాల్షియమ్, ఐరన్ స్థాయులను బట్టి డాక్టర్ సూచన మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్‌ను అనుసరించాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
మెడి టిప్
అందరిలోనూ 20 ఏళ్లు వచ్చే వరకు ఎముకలు వేగంగా పెరుగుతుంటాయి. మనలో దాదాపు 40 ఏళ్లు వచ్చేవరకు ఎముకలు కాస్త బలంగా గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత క్రమంగా పలచబడుతూ, పెళుసుగా మారుతూ ఉంటాయి. ఇలా ఎముకలు పలచబా రుతూ తేలిగ్గా విరిగేలా పెళుసుబారడాన్ని ‘ఆస్టియోపోరోసిస్’ అంటారు. ఈ ముప్పు మహిళల్లో మరీ ఎక్కువ. మహిళలైనా, పురుషులైనా ఆస్టియోపోరోసిస్ నివారణ కోసం ఈ కింది అక్షరాల సహాయంతో అవలంబించాల్సిన జాగ్రత్తలను గుర్తుపెట్టుకోవచ్చు. అవి... ♦ ‘సి’ ఫర్ క్యాల్షియమ్– ఎక్కువగా తీసుకోవాలి. అంటే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పాలు, ఆకుకూరల వంటివి. ♦ ‘డి’ ఫర్ విటమిన్ డి – శరీరానికి తగినంత అందేలా చూసుకోవాలి. ఇందుకోసం లేత ఎండలో నడక, వ్యాయామం మేలు. ♦ ‘ఈ’ ఫర్ ఎక్సర్సైజ్ – శరీరాన్ని తగినంత వ్యాయామాన్ని అందించాలి. ♦ ‘ఎఫ్’ ఫర్ ‘ఫాల్స్’ – ఫాల్ అంటే ఇంగ్లిష్‌లో పడిపోవడం. వయసు పెరిగినవారికి బాత్రూమ్ల వంటి చోట్ల, ఎక్కడానికి అంత అనువుగా లేని మెట్లు ఉండే చోట్ల పడిపోవడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలా పడిపోయే అవకాశాల్ని తగ్గించుకోవాలి. అంటే ఆయా ప్రదేశాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలి. -
మీ కన్నయ్య మన్ను తింటున్నాడా?
కొందరు పిల్లలు తల్లిదండ్రుల కళ్లు కప్పి మట్టి, బలపాలు, గోడకు ఉండే సున్నపు బెత్తికలు తింటూ ఉంటారు. మరికొందరు పెద్దవాళ్లు కూడా బియ్యంలో మట్టిగడ్డలు తినడం చూస్తుంటాం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్లు చిన్నప్పుడే పిల్లల్లో ఉండే మట్టి తినే అలవాటును మాన్పించకుంటే వారి ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మట్టితినే అలవాటు మాన్పించడం ఎలాగో చూద్దామా? ఎందుకు తింటారంటే..? చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్‌లు, ఇలా రకరకాల తినుబండారాలు ఉండగా వాటన్నింటికీ బదులు లేదా వాటితోపాటు అప్పుడప్పుడు ఇలా మట్టి ఎందుకు తింటారో తెలుసా? ... విటమిన్ల లోపమే అందుకు కారణం. శరీరంలో ఉండవలసిన దానికన్నా బాగా తక్కువ పరిమాణంలో ఈ విటమిన్లు ఉండటం లేదా అసలే లేకపోవడం వల్ల పిల్లలు మట్టితింటూ ఉంటారు. కాల్షియం, ఐరన్ తగినంత లేకపోవడం వల్ల పిల్లలు ఇలా మట్టి తినడానికి అలవాటు పడతార ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న పదార్థాలు తినేలా చూడాలి. పిల్లలకు మట్టి, బలపాలు తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6 -7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలచేత తాగించండి. అవసరం అనుకుంటే దీనికి కొద్దిగా తేనె కలిపినా మంచిదే. అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు. -
పిల్లల ఎముకలు దృఢంగా ఉండాలంటే...
గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, కండరాలను బలోపేతం చేయడానికి, ఎముకలను అభివృద్ధి చేయడానికి కాల్షియం అవసరమన్న సంగతి అందరికీ తెలుసు. పాలు, జున్ను, పెరుగుతో సహా అన్నిపాల ఉత్పత్తుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. పిల్లల ఎముకల ఎదుగుదలకి ఏం చేయాలో తెలుసుకుందాం.... తల్లిదండ్రులు.. పిల్లలు రోజుకు కనీసం 2 గ్లాసుల పాలను తాగేట్టు చూడాలి. అలాగే మీ పిల్లల ఆహారంలో బచ్చలికూర, బెండకాయ, పాలకూర వంటి ఆకుపచ్చ కూరగాయలు ఉండేట్టు చూడండి. అలాగే రోజుకు ఒకసారైనా పెరుగును తినేట్టు చూడాలి. సోయా పాలు, సోయా పెరుగు వంటి సోయాబీన్ ఉత్పత్తుల్లో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అన్నింటికీ మించి నువ్వులలో క్యాల్షియం చాలా అధికమొత్తంలో ఉంటుంది కాబట్టి పిల్లలు రోజూ ఒక స్పూను నువ్వులు తినేలా చూస్తే చాలు... తప్పకుండా ఉండాలండి కాల్షియం శోషణ విటమిన్ డి సహాయపడుతుంది. దీనికే విటమిన్ డి 3 అని కూడా పేరు. మన దేశంలో విటమిన్ డికి ఎలాంటి కొదవ లేకున్నా.. చాలా మంది డి విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ డి సూర్యరశ్మి ద్వారా, కొన్ని రకాల ఆహారాల ద్వారా పొందవచ్చు. పిల్లల ఆహారంలో తగినంత విటమిన్ డి లేకపోతే విటమిన్ డి సప్లిమెంట్‌ను తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డి ఎముకల ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది. ►నవజాత శిశువులకు కూడా విటమిన్ డి అవసరం. అందుకోసం వారి ఒంటికి నువ్వుల నూనె రాసి, లేలేత సూర్యకిరణాలు తగిలేలా చూస్తే సరిపోతుంది. ఆ తర్వాత మృదువుగా మర్దనా చేస్తూ స్నానం చేయించాలి. ఈ విటమిన్లు కూడా ► శరీరంలో విటమిన్ కె, మెగ్నీషియం స్థాయులు ఎక్కువగా ఉంటే విటమిన్ డి సమృద్ధిగా ఉన్నట్లే. అలాగే రికెట్స్, బోలు ఎముకల వ్యాధితో సహా ఎన్నో ఎముకల సమస్యలను తగ్గించడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియంతో పాటుగా ఈ విటమిన్లు కూడా పిల్లల ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి. క్యాబేజీ, ఆకుపచ్చ మొలకలు వంటి ఆకుపచ్చ కూరగాయల్లో విటమిన్ కె, మెగ్నీషియం ఉంటాయి. శీతల పానీయాలు వద్దే వద్దు... పిల్లలు ఎంత మారాం చేసినా వారిని శీతల పానీయాలు తాగనివ్వకూడదు. ఎప్పుడో ఒకసారి అయితే ఫరవాలేదు కానీ తరచూ ఇవి తాగడం పిల్లల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎందుకంటే వీటిలో సాధారణంగా కొన్ని ఫాస్పోరిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇది శరీరం కాల్షియాన్ని గ్రహించకుండా నిరోధిస్తుంది. ఈ ఆమ్లం ఎముకల ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కార్భోనేటెడ్ పానీయాలకు బదులుగా నారింజ రసం వంటి హెల్తీ డ్రింక్‌లను తాగించండి. దీనివల్ల పిల్లల ఎముకలు దృఢంగా ఉంటాయి. పిల్లల మానసిక, శారీరక ఎదుగుదల బాగుంటుంది. -
నాగార్జునసాగర్‌కు ప్రమాదం పొంచి ఉందా?
-
ప్రతి ముగ్గురిలో ఒకరికి కొలెస్ట్రాల్..
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ముగ్గురిలో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. వంద మందిలో 33 మంది అనారోగ్యంతో ఉన్నారు. జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్ సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దేశంలోనే మొదటిసారిగా సమగ్ర ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల, ములుగు జిల్లాల్లో చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రయోగా త్మకంగా చేపట్టిన ఈ–హెల్త్ ప్రొఫైల్స్ సిద్ధమవుతున్నాయి. ఆరోగ్య సర్వేలు ఇంటింటా సాగుతూ ముగింపు దశ (96%)కు చేరాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మార్చి 5న మంత్రి కె.తారక రామారావు, ములు గులో మంత్రి టి.హరీశ్‌రావు పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇంటింటా సర్వేలు రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 203 ఆరోగ్య కార్యకర్తల బృందాలు ఇంటింటా సర్వేలు చేస్తున్నాయి. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ సుమారు 30 రకాల ఆరోగ్య పరీక్షలు చేస్తు న్నారు. ఇప్పటికి 4,05,988 మందికి టెస్టులు పూర్తయ్యా యి. బ్లడ్‌గ్రూప్, రక్తహీనత, కిడ్నీ, షుగర్, కాల్షియం, కొలెస్ట్రాల్, కాలేయం, ఇతర పరీక్షలను సిరిసిల్లలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ సెంటర్లో నిర్వహిస్తున్నారు. ప్రతి ఒక్కరి ఎత్తు, బరువు వివరాలు నమోదు చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను ‘డిజిటల్ హెల్త్ ప్రొఫైల్’ రూపంలో భద్రపరుస్తున్నారు. ఈ సమాచారంతో ఆధార్ కార్డు నంబరు, మొబైల్ నంబరుతో అనుసంధానం చేసి పేరు, పుట్టిన తేదీ, యూనిక్ కోడ్, ఎమర్జెన్సీ ఫోన్ నంబర్ వంటి వివరాలు కార్డులో పొందుపరుస్తు న్నారు. యూనిక్ బార్‌కోడ్‌ను స్కాన్ చేస్తే.. చాలు సదరు వ్యక్తి సమగ్ర సమాచారం కళ్ల ముందు ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య సమాచారాన్ని ఆన్లైన్లో నిక్షిప్తం చేయడమే ఈ–హెల్త్ ప్రొఫైల్ లక్ష్యం. ఆధునిక పరిజ్ఞానంతో పరీక్షలు టీ–డయాగ్నోస్టిక్ సెంటర్లోని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నమూనాలను విశ్లేషిస్తున్నారు. రోజుకు సగటున ఆరు వేల రక్త నమూనాలను పరీక్షిస్తూ.. ఆ వివరాలను కంప్యూటర్లో నమోదు చేస్తున్నారు. ఈ మూడు నెలల్లో ఒకరోజు గరిష్టంగా 14,690 రక్తపరీక్షలు చేయగా.. ఇప్పుడు సగటున 400 నుంచి 600 శాంపిళ్లు పరీక్షిస్తు న్నారు. ఇప్పటివరకు పూర్తయిన పరీక్షల్లో ఎక్కువ మందిలో కొలెస్ట్రాల్ సమస్య బయట పడగా, ఆ తర్వాత స్థానంలో కాల్షియం సమస్య ఉంది. థైరాయిడ్ సమ స్యతో 17,001 మంది, కాలేయ సమస్యతో 15,839 మంది, మూత్రపిం డాల సమస్యతో 14,267 మంది, మధుమేహంతో 10,186 మంది ఉన్నట్టు గుర్తించారు. -
Health Tips: కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే!
Calcium Deficiency- Symptoms- Problems -Solutions: కాల్షియం అనేది మన శరీరంలో ఓ కీలక పోషకపదార్థం. నరాల ద్వారా మెదడుకు సందేశాలు పంపేటువంటి కీలక శరీర విధులకు కాల్షియం చాలా అవసరం. ఇంకా హార్మోన్ల స్రావం, కండరాలు, నరాల సంకోచ, వ్యాకోచాలకు కాల్షియం అవసరం చాలా ఉంటుంది. ముఖ్యంగా, అస్థిపంజర పనితీరుకు కాల్షియం నిదర్శనం. అయితే కొందరిలో కొన్ని కారణాల వల్ల కాల్షియం లోపిస్తుంటుంది. ఇలా కాల్షియం లోపించడాన్నే వైద్యపరిభాషలో ‘హైపోకాల్సీమియా’అని అంటారు. హైపోకాల్సీమియాకు చికిత్స తీసుకోకపోతే ‘ఆస్టియో పేనియా’ అనే ఎముకలు సన్నబడిపోయే వ్యాధి, పిల్లల్లో బలహీనమైన ఎముకలు (రికెట్స్, ఎముక సాంద్రత కోల్పోయే వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) వంటి తీవ్రమైన సమస్యలకు దారితీస్తుంది. అయితే ఆహార అలవాట్లను మార్చుకోవడం వల్ల కాల్షియం లోపాన్ని నివారించుకోవచ్చు. కాల్షియం లోపిస్తే కనిపించే లక్షణాలు ►వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, ఒకవిధమైన జలదరింపు ►కండరాలలో తిమ్మిరి లేదా కండరాలు పట్టేయడం ►బద్ధకం, తీవ్రమైన అలసట ►బలహీనమైన, పెళుసుగా ఉండే గోర్లు ►దంత సమస్యలు, దంతాలు రావడంలో ఆలస్యం ►తికమకగా అనిపించడం ►ఆకలి లేకపోవడం. దీర్ఘకాలిక కాల్షియం లోపం అనేక ఇతర శరీర భాగాలను బాధించవచ్చు. అందువల్ల మనకు పైన చెప్పుకున్న లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్ష చేయించుకుని, లోపం ఉందని నిర్ధారణ అయితే తగిన మందులు వాడటం ఉత్తమం. లేదంటే ఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకోవడం అవసరం. కాల్షియం లోప నివారణకు తీసుకోవలసిన ఆహార పదార్థాలు ►పాలు, పాల ఉత్పత్తులు: జున్ను, రసమలై, పెరుగు, పాలు పులియబెట్టి చేసిన పెరుగువంటి యోగర్ట్ అనే పదార్థం, పనీర్ ►కూరగాయలు, బచ్చలికూర, పాలకూర, బ్రోకలీ, పప్పుధాన్యాలు, బీన్స్, బఠానీలు, తృణధాన్యాలు ►కాల్షియం అధికంగా ఉండే మినరల్ వాటర్ ►సముద్రం నుంచి లభించే ఆహారపదార్థాలు (సీఫుడ్), కొవ్వు లేని మాంసాలు, గుడ్లు ►ఖర్జూర పండ్లు: కాల్షియం, ఐరన్ లోపాలతో బాధపడేవారు ఖర్జూర పండ్లు తీసుకోవడం చాలా మంచిది. ఇవి శరీర రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి, అనిమీయా వ్యాధిని కూడా తగ్గిస్తాయి. ►కాల్షియం సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకలు పుష్ఠిగా వుంటాయి. దృఢమైన ఎముకల వలన శరీరం నిటారుగా నిలుస్తుంది. చక్కని రూపం వస్తుంది. దంతాలు, గుండె కండరాలు ఆరోగ్యంగా వుంటాయి కాబట్టి కాల్షియం లోపం లేకుండా చూసుకోవడం అత్యవసరం. చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
యాభై ఏళ్లు వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ తగ్గిపోతుంది.. కాబట్టి
Health Tips For Women: మీ పిల్లలకు, మీ వారికి, అత్తమామలకు, ఇతర కుటుంబ సభ్యులకు కావలసిన వాటన్నింటినీ అమర్చి పెడుతూ మీ గురించి మీరు పట్టించుకోవడం మానేశారా? అయితే ఇప్పుడు తెలియకపోవచ్చు కానీ, ముందు ముందు చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. అందుకే కనీసం ఇప్పుడయినా మేలుకోవడం మంచిది. 50 సంవత్సరాలు దాటిన స్త్రీలు తమ ఆరోగ్యం కోసం అలవరచుకోవలసిన ఆహారపు నియమాలు ఏమిటో తెలుసుకుందాం... ►నిజానికి యాభై ఏళ్లు దాటిన వారికోసం ప్రత్యేకమైన ఆహారం అంటూ ఏమీ లేదు. కాకపోతే వయసుతోపాటు శరీరానికి విటమిన్లను గ్రహించే శక్తి తగ్గుతుంటుంది కాబట్టి తీసుకునే ఆహారంలోనే ఆయా విటమిన్లు పుష్కలంగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ►యాభైఏళ్లు వచ్చేసరికి మహిళల్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ తగ్గిపోవడం వల్ల శరీరానికి క్యాల్షియంను గ్రహించే శక్తి కూడా తగ్గుతుంది. శరీరంలో క్యాల్షియం తగ్గితే ఆస్టియో పొరోసిస్ అనే వ్యాధి వస్తుంది. కాబట్టి క్యాల్షియం ఎక్కువ ఉన్న ఆహారం తీసుకోవాలి. క్యాల్షియం ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆకుకూరలు బాగా తీసుకుంటే సరిపోతుంది. ►అయితే ఇక్కడ మరో విషయం... శరీరం క్యాల్షియంను గ్రహించాలంటే విటమిన్ డి3తోపాటు వ్యాయామం అవసరం. విటమిన్ డి3 కోసం పొద్దున పూట సూర్యరశ్మి శరీరానికి తగిలేలా వ్యాయామం చేస్తే శరీరం క్యాల్షియంను గ్రహించుకుంటుంది. లేకుంటే క్యాల్షియం ట్యాబ్లెట్లు మింగవలసి ఉంటుంది. ►సాధారణంగా 50 సం. దాటినవారు కుటుంబంలోని వాళ్లందరూ ఎవరి పనుల మీద వాళ్లు బయటకు వెళ్లిపోయాక ఎక్కువ సమయం కూర్చుని ఉంటారు. అందువలన కండరాలు పటుత్వం కోల్పోయి బలహీనత వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే పప్పు, మొలకలు, బాదం, నట్స్ లాంటి ఆహారం తీసుకోవాలి. ►యాభై దాటిన వారికే కాదు, ఎవరికైనా సరే, శరీర పోషణకు మాంస కృత్తులు చాలా అవసరం. కిలో శరీర బరువుకు 1.5 గ్రా.చొప్పున మాంసకృత్తులు తీసుకోవాలి. ఉదాహరణకు 60 కేజీల బరువున్నవారు 90 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. ►మరో ముఖ్య విటమిన్ – విటమిన్ బి 12. శరీరానికి రోజుకు 2.4 మైక్రోగ్రాముల బి12 కావాలి. విటమిన్ బి 12, శరీర ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు, ఎర్ర రక్తకణాల వృద్ధికి, మెదడు సరిగా పనిచేయడానికి అవసరం. బి 12, పాలు,పెరుగు, చీజ్, గుడ్లు, చేపలు, చికెన్ మొదలైన వాటిలో లభిస్తుంది. ►ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్ధాలు తగ్గిస్తే మంచిది. అధిక ఉప్పు అధిక రక్తపోటుకు, కీళ్ల నొప్పులకు దారి తీసే అవకాశం ఉంది. ►50 సం దాటినవారు ఎక్కువగా మతిమరుపు వచ్చిందని అంటూ ఉంటారు. ఒక సర్వే ప్రకారం వీళ్ళు నీళ్లు తక్కువ తీసుకోవడం కూడా మతిమరుపునకు ఉన్న కారణాల్లో ఒకటని తేలింది. ►చక్కగా పండ్లు, కూరలు, ఆకుకూరలు, మొలకలు, తృణధాన్యాలతో కూడిన మితాహారాన్ని తీసుకుంటూ, శరీరానికి తగినంత వ్యాయామం కల్పించడం అవసరం. చదవండి: Best Health Tips In Telugu: ఈ చిట్కాలతో ఆరోగ్యం, అందం కూడా! రోజూ కోడిగుడ్డు తింటే.. -
వెల్లుల్లిని పరగడుపునే తింటున్నారా?
-
Health Tips: రోజూ గ్లాసు పళ్ల రసం చక్కెర వేయకుండా తాగితే..
Top 5 Health Tips For Women: ఇంట్లో అందరికీ అన్నీ అమర్చాలి. ఈ బాధ్యత ఎప్పుడూ మహిళ మీదనే ఉంటుంది. ఆ మహిళ ఉద్యోగిని అయినా సరే ఇంట్లో వాళ్ల ఆహారం, ఆరోగ్యం అనే రెండు కీలక బాధ్యతలను కూడా తన భుజాల మీదనే మోస్తూ ఉంటుంది. ఇంటిని, ఉద్యోగాన్ని సమన్వయం చేసుకునే క్రమంలో తన జీవితంలో అనేక ప్రాధాన్యాలు వెనుకబడిపోతుంటాయి. వాటిలో ముఖ్యమైనవి తాను తీసుకునే ఆహారం, తన ఆరోగ్యం. ఉన్నత విద్యావంతులైన మహిళలను కూడా వదలకుండా పట్టి పీడిస్తున్న సమస్యలివి. తీవ్రమైన అలసట, అంతకు మించి మానసిక ఒత్తిడి... ఈ రెండూ దేహాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయి. అప్పుడు పరీక్షించుకుంటే దేహంలో పోషకాలు, సూక్ష్మపోషకాలు గణనీయంగా పడిపోయి ఉంటాయి. ఈ స్థితికి చేరకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం రొటీన్ డైట్ ప్లాన్‌లో వీటిని చేర్చుకోవాలి. ► ఉదయం ఒక గ్లాసు తాజా పళ్లరసం చక్కెర వేయకుండా తీసుకోవాలి. ► మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా ఒక కప్పు ఆకుకూర ఉండాలి. ►రోజూ ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఇది దేహాన్ని చల్లబరుస్తుంది. భోజనం తర్వాత ఐస్‌క్రీమ్ వంటి డెజర్ట్ తినాలనే కోరికను తగ్గిస్తుంది. ►రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చటి పాలు తాగాలి. ►ఈ మార్పు వల్ల అవసరమైన క్యాల్షియం అందుతుంది, ఐరన్, ప్రొటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది. చదవండి: Legs Swelling- Health Tips: ధనియాలను నీటిలో మరిగించి తాగారంటే... -
Health Tips: తిలలు తింటే ఎంతో మేలు.. అయితే, అలర్జీలు రావచ్చు అతి వద్దు!
Sesame Seeds Benefits: నవధాన్యాలలో నువ్వులు ఒకటి. సంస్కృతంలో తిలలు అంటారు. ఈ నూనెను చాలా వంటలలో ఉపయోగిస్తారు. వీటిని ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ►ముఖ్యంగా ఊరగాయ పచ్చళ్లలో నువ్వుపప్పునూనె వాడటం వల్ల అవి చాలా కాలం నిల్వ ఉండటమేగాక రుచికరంగా కూడా ఉంటాయి. దీపారాధనకు నువ్వుల నూనె శ్రేష్ఠమని పెద్దలు చెబుతారు. నువ్వులను దంచి చిమ్మిలి, వేయించి నువ్వుండలు మొదలైన మిఠాయిలు తయారు చేస్తారు. ►బ్రెడ్‌లోనూ, బర్గర్లలోనూ, వివిధ రకాల వంటకాలలో, కూరలలోనూ వేస్తారు. వేయించి, పొడికొడతారు. పచ్చడి కూడా చేస్తారు. ►నువ్వులలోని మెగ్నీషియం క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇందులోని జింక్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! ►నువ్వులు ఒమేగా–3, ఒమేగా –6, ఒమేగా– 9 ఆమ్లాలను కలిగి ఉండి, జుట్టు పెరుగుదలకు దోహద పడతాయి. ►గ్లాసు పాలలో కన్నా, చెంచా నువ్వులలో ఎక్కువ క్యాల్షియం ఉంటుందని రుజువైంది. నువ్వులు రుచిగా ఉంటాయి కానీ, వీటివల్ల కొందరిలో అలర్జీ కలగవచ్చు. ►అలాగే, ఇవి అమితంగా వేడి చేసే గుణం కలిగి ఉంటాయి కాబట్టి వేసవిలో ఎక్కువ తినరాదు. ►అయితే శీతాకాలంలో నువ్వులను వాడటం వల్ల శరీరానికి తగిన ఉష్ణోగ్రత అందుతుంది. అందుకే శీతాకాలంలో సంక్రాంతి పండుగకు నువ్వుల ఉండలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకోవడం, ఈ పండుగ ప్రత్యేకమైన అరిశలకు నువ్వులను అద్దడం ఆచారంగా మారింది. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. -
ఏడాదికి ఎన్ని గుడ్లు తినాలో తెలుసా?
గుడ్డు అంత శ్రేష్టమైన ఆహారం మరొకటి లేదని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. పోషణలో తల్లి పాల తర్వాత స్థానం గుడ్డుదే. గుడ్డు అనేక విటమిన్లు, మినరల్స్‌తో నిండిన సూపర్ ఫుడ్డు. గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్–ఇ, ఫొల్లేట్లు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్లు, 78 కాలరీల శక్తి ఉంటాయి. శరీరానికి అవసరమైన అన్ని కీలకమైన విటమిన్లు, ఖనిజాలు, ఆరోగ్యకరమైన కొవ్వులు, మాంసకృత్తులు దీనిద్వారా లభిస్తాయి. తెల్ల సొనలో అల్బుమిన్ పుష్కలంగా ఉంటుంది. కండరాలను బలోపేతం చేసుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. తెల్ల సొన వల్ల మహిళలకు అవసరం అయ్యే కాల్షియం పుష్కలంగా అందుతుంది. ముఖ్యంగా, మహిళల్లో ఎముకల ఆరోగ్యానికి, చాలా సహాయపడుతుంది. (ఎండలో ఎంతసేపుంటే సరిపడా విటమిన్ ‘డి’ అందుతుంది?) ఒక సర్వే ప్రకారం, 80 శాతం భారతీయుల ఆహారంలో ప్రోటీన్ల లోపం ఉన్నది. మనిషి బరువును బట్టి, కిలో బరువుకు, రోజుకు ఒక గ్రాము ప్రోటీన్‌ను ఆహారంలో తీసుకోవాలి. మరొక సర్వే ప్రకారం, 70–90 శాతం భారతీయులలో విటమిన్ డి లోపం ఉంది. ఆహార ఉత్పత్తులు ఎంత పెరిగినా, ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు మాత్రం తగిన మోతాదులో అందరికీ లభించటం లేదు. (బార్లీ, కొర్రలు.. వేపుళ్లు, నేతి వంటకాలు.. ఏవి తినాలి? ఏవి వద్దు?) ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం 180 గుడ్లు తినాలని జాతీయ పోషణ సంస్థ సూచించినది. కాని, మన దేశంలో సగటు వినియోగం 70 గుడ్లు మాత్రమే ఉన్నది. మెక్సికో, జపాన్, కొలంబియా లాంటి దేశాల్లో తలసరి వినియోగం 340 గుడ్ల వరకు ఉంది. మన వద్ద అది 70 కంటే మించడం లేదు. గుడ్ల వినియోగంలో, ప్రపంచంలో మన ర్యాంకు 114. ఇది చాలా తక్కువ. దీన్ని గుర్తించిన మన ప్రభుత్వాలు కూడా, విద్యార్థులకు, గర్భిణి స్త్రీలకు, మధ్యాహ్న భోజనం లాంటి పథకాల్లో గుడ్లను అందించి, పోషకాహార లోపం తలెత్తకుండా చూస్తున్నాయి. అంతర్జాతీయ ఎగ్ కమిషన్ ధ్యేయం గుడ్డు వినియోగంతోనే పోషకాల లోపాలను భర్తీచేసి, మెరుగైన ఆరోగ్యాన్ని సాధించటం. – సురేష్ చిట్టూరి, చైర్మన్, అంతర్జాతీయ ఎగ్ కమిషన్ -
గుండె ఆరోగ్యానికి అందుబాటులోని 5 పాల ఉత్పత్తులు ఇవే...
పట్టణాలతో పోల్చితే గ్రామాల్లో నివసించే వారు చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకో ఎప్పుడైనా గమనించారా? వీరు కల్తీలేని స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటారు కాబట్టి. సంపూర్ణ లేదా సమతుల్య ఆహారాల్లో పాలు చాలా ముఖ్యమైనవి. ఐతే చాలా మందికి పాలు, పాల ఆధారిత పదార్థాలు తినే అలవాటు అస్సలుండదు. హృద్యోగ సమస్యలకు దారీతీసే కొవ్వులు, కొలెస్ట్రాల్‌లు పాల ఉత్పత్తుల్లో అధికంగా ఉంటాయనేది వీరి బలమైన నమ్మకం. కానీ వాస్తవం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. తాజా పరిశోధనల్లో కూడా తేలిందేమిటంటే పాల ఉత్పత్తులు గుండెను రక్షించడంతోపాటు గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయని ధ్రువీకరించాయి. కొంత మంది వారి ఆరోగ్య కారణాల దృష్ట్యా పాలను నేరుగా తీసుకోలేరు. అలాంటప్పుడు ఇతర మార్గాల ద్వారా తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఈ కింది సూచించిన 5 రకాల పాల ఉత్పత్తులు మీ ఆరోగ్యానికి ఏ విధంగా మేలు చేస్తాయో తెలుసుకుందాం.. పన్నీర్ భారతీయుల ఆహారంలో పన్నీర్ చాలా ప్రసిద్ధమైనది. కూరగా వండుకున్నా లేదా ఇతర ఏ పద్ధతుల్లో వండినా రుచితో పాటు పోషకాలు అందుతాయి. దీనిలో కాల్షియం, విటమిన్ బి, ప్రొటీన్లు నిండుగా ఉంటాయి. ఎముకల పుష్టికి ఇది చాలా ఉపకరిస్తుంది. అంతేకాకుండా మీ హార్మొన్ల ఆరోగ్యానికి అవసరమైన మాగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు తగుమోతాదులో అందేలా చేస్తుంది. పెరుగు హృదయ ఆరోగ్యానికి, ఎముకల దృడత్వానికి పెరుగు ఎంతో మేలు చేస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా దీనిలో ప్రొబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. కడుపులోని పేగుల్లో ఆరోగ్య సహాయక సూక్ష్మజీవుల (బ్యాక్టీరియా) వృద్ధికి ఇది చాలా అవసరం. మన శరీరంలోని జీర్ణక్రియ, ఇతర జీవక్రియలకు కూడా పెరుగు ఉపయోగపడుతుంది. పాలకోవ స్వీట్లలో పాలకోవ స్థానం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఇష్టంగా తినే స్వీట్ ఇది. పాలను బాగా చిక్కబడేంత వరకూ వేడిచేయడం ద్వారా దీనిని తయారు చేస్తారు. దీనిలో ‘డి, బి, కె’ విటమిన్లు, కార్బొహైడ్రేట్స్తోపాటు, పాస్పరస్ వంటి మినరల్స్ కూడా అధికంగా ఉంటాయి. మజ్జిగ ప్రొటీన్లు, విటమిన్ ‘ఎ, బి’లు, కాల్షియం, పొటాషియం, రైబోఫేవిన్, ప్రొబయోటిక్స్ నిండుగా ఉంటాయి. ప్రాచీన కాలం నుంచే ధనిక పేద భేదం లేకుండా మన భారతీయుల ఆహారపు అలవాట్లలో మజ్జిగ మిలితమైఉంది. నెయ్యి రోజువారీ ఆహారంలో నెయ్యి కూడా ముఖ్యమైనదే. ఇది ఎముక ఖనిజ సాంద్రతలో నష్టాలను తిరిగి పొందడంలో సహాయపడుతుంది. ఇది జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. నెయ్యిలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఐదు మార్గాల ద్వారా పాల సంబంధిత ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి చేకూరే ప్రయోజనాన్ని మీరే తెలుసుకుంటారు! పలు పరిశోధనలు కూడా ఈ విషయానే దృవీకరించాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు నుంచే తినండి, ఆరోగ్యంగా ఉండండి!! చదవండి: మెదడు చురుకుగ్గా ఉండాలంటే.. ఈ ఐదింటికీ పని చెప్పాలట!! -
తాగునీటిలో కాల్షియం తప్పనిసరి
సాక్షి, అమరావతి: దేశంలో విక్రయించే ప్యాకేజ్డ్ వాటర్‌కు సంబంధించి జనవరి ఒకటి నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రాబోతున్నాయి. ప్యాకింగ్ చేసి విక్రయించే లీటర్ మంచి నీటిలో 20 మిల్లీ గ్రాముల కాల్షియం, 10 మిల్లీ గ్రాముల మెగ్నీషియం తప్పనిసరిగా ఉండాలని భారత ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) స్పష్టం చేసింది. శుద్ధి చేసిన నీటి పేరుతో ఆ నీటిలో శరీరానికి ఉపయోగపడే ఖనిజ లవణాలను కూడా తొలిగిస్తున్నారని, అలా కాకుండా ఆరోగ్యానికి మంచి చేసే ఖనిజ లవణాలు నీటిలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలంటూ జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ఎఫ్ఎస్ఎస్ఏఐని కోరింది. ఈ నేపథ్యంలో అందుకనుగుణంగా మంచి నీటిని శుద్ధి చేయడానికి వీలుగా ప్లాంట్లలో మార్పులు చేసుకోవడానికి ఈ నెల 31 వరకు ఎఫ్ఎస్ఎస్ఏఐ సమయం ఇచ్చింది. దీంతో ఆక్వాఫినా, హిమాలయన్, బైలే, రైల్‌నీర్, ఆక్సీరిచ్, టాటా వాటర్ వంటి ప్రముఖ బ్రాండ్లన్నీ ఈ నిబంధనలకు అనుగుణంగా జనవరి1 నుంచి మంచినీటిని మార్కెట్లోకి విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాయి. కోకోకోలా (కిన్లే) ఇప్పటికే కొత్త నిబంధనల ప్రకారం ప్యాకేజ్డ్ నీటిని మార్కెట్లోకి విడుదల చేసింది. 55% యూనిట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే.. దేశీయ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ పరిశ్రమ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3,000 కోట్ల లీటర్ల నీటి విక్రయాలు జరుగుతున్నాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) దగ్గర ఉన్న సమాచారం ప్రకారం..దేశవ్యాప్తంగా 6,000కు పైగా మినరల్ వాటర్ తయారీ సంస్థలుండగా వీటిలో 55 శాతం యూనిట్లు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఉన్నాయి. రెండు లీటర్లు, లీటర్, అర లీటర్, పావు లీటర్తోపాటు 15, 20 లీటర్ల బాటిల్స్‌లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఇందులో అత్యధికంగా 42 శాతం అమ్మకాలు లీటర్ బాటిల్స్వి కాగా, ఆ తర్వాతి స్థానంలో అరలీటర్, పావులీటర్ల బాటిల్స్ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్యాకేజ్డ్ వాటర్ పరిశ్రమ విలువ రూ.26 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. ప్యాకేజ్డ్ తాగునీటిలో ఉండాల్సినవి లీటర్‌కు -
రాగులు ఎంత ఆరోగ్యకరమంటే...
ఇటీవల ఆరోగ్యం కోసం రాగులను ఆహారంగా తీసుకోవడం పెరిగింది. రాగిముద్ద అని పిలిచే రాగిసంకటి ఇప్పుడు చాలా రెస్టారెంట్లలో ఓ ట్రెండీ ఫుడ్. రాగులను పిండి రూపంలో తీసుకోవడం ద్వారా దీంతో రాగిరొట్టెలు, రాగి అంబలి ఇలా అనేక రూపాల్లో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తీసుకుంటున్నాం. కొందరు రాగి దోసెలూ, ఇడ్లీలు, లడ్డూలంటూ చాలా ఐటమ్సే తయారు చేస్తున్నారు. రాగులు ఆరోగ్యానికి చాలా మంచివి కావడంతో వీటితో రకరకాల పదార్థాలు వంటలు చేసుకోవడం ఇటీవల బాగా పెరిగింది. రాగుల్లో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) చాలా ఎక్కువ. ఆ తర్వాత ప్రోటీన్లు, ఆ తదిపరి స్థానంలో పీచు పదార్థాలు ఉన్నాయి. ఇక రాగిపిండిలో ఉండే కొవ్వు శాతం చాలా చాలా తక్కువ. రాగులకు ఉన్న ఆదరణ వల్ల ఇప్పుడు రాగిపిండి మార్కెట్లో రెడీమేడ్‌గా లభిస్తోంది. వంద గ్రాముల రాగి పిండిలో... వంద గ్రాముల రాగి పిండితో 336 క్యాలరీలు లభ్యమవుతాయి. రాగుల్లో 80 శాతం కార్బోహైడ్రేట్లే. 12 శాతం తేమ ఉంటుంది. రాగిపిండిలో క్యాల్షియం చాలా ఎక్కువ. వంద గ్రాముల రాగిపిండిలో 350 మిల్లీగ్రాముల క్యాల్షియం ఉంటుంది. అందుకే ఎముకల ఆరోగ్యానికీ, పటిష్టతకూ రాగిపిండి చాలా మేలు చేస్తుంది. ఐరన్ కూడా కొంతమేరకు ఉంటుంది. రాగిపిండిలో మన శరీరానికి బాగా అవసరమైన ఎన్నోరకాల అమైనో ఆసిడ్స్ (ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్) పుష్కలంగా లభ్యమవుతాయి. వ్యాలైన్, మిథియోనైన్, ఐసోల్యూసిన్, థ్రియోనైన్, ట్రిప్టోఫాన్ వంటి అత్యావశ్యక అమైనో ఆసిడ్స్ అన్నవి మన ఆరోగ్య నిర్వహణ కోసం చాలా అవసరం. రాగుల్లో పీచుపదార్థాలు బాగా ఎక్కువే. దీంతోపాటు రాగిపిండి గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల తేలిగ్గా జీర్ణమవుతుంది. తేలిగ్గా ఒంటికి పడుతుంది. (గ్లూటెన్ అంటే... పిండిని కంచంలో రాశిగా పోసి మధ్యలో గురుగు చేసి (గుంట పెట్టి) అందులో నీళ్లు పోసినప్పుడు పొడి పిండి కాస్తా... పిండిముద్దగా మారుతుంది కదా. ఇలా పొడి పిండిని, పిండిముద్దలా మార్చడానికి పిండిలోని గ్లూటెన్ అనే ప్రోటీన్ తోడ్పడుతుంది. కొందరి ఒంటికి ఈ గ్లూటెన్ సరిపడదు. దాంతో వాళ్లకు గ్లూటెన్ ఉన్న పిండితో చేసిన వంటకం తిన్న వెంటనే కడుపులో ఇబ్బంది, కడుపునొప్పి, వికారం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వీరిని ‘గ్లూటెన్ ఇన్టాలరెన్స్’ ఉన్న వ్యక్తులుగా పేర్కొంటారు. ఇలాంటి వారి కోసమే... ఆయా పిండులతో గ్లూటెన్ లేకుండా కూడా తయారు చేస్తున్నారు. అంటే ఆ పిండి నుంచి గ్లూటెన్ను తొలగిస్తారన్నమాట. ఇలాంటి పిండిని ‘గ్లూటెన్ ఫ్రీ’ పిండి అని అభివర్ణిస్తుంటారు. కొన్ని రకాల పిండిలలో స్వాభావికంగానే గ్లూటెన్ ఉండదు). ఆరోగ్యానికి ప్రయోజనాలెన్నో... రాగుల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ వల్ల వెంటనే ఆకలి తీరినట్లు ఉంటుంది. మనం రోజూ తినే తెల్ల అన్నంతో పోలిస్తే రాగిపిండిలో ఉండే పీచుపదార్థాలు చాలా ఎక్కువ. కొవ్వులు దాదాపు లేనట్టే. ఈ పీచుపదార్థాల వల్ల తిన్న వెంటనే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. దాంతో రాగిపిండితో చేసిన పదార్థాలు తినేవారు బరువు పెరగకపోవడం, స్థూలకాయం రాకపోవడం వంటి ప్రయోజనాలు చేకూరతాయి. అందుకే బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఇది మంచి ఆహారం. ఇక ఇందులోని పీచుపదార్థాల కారణంగా రాగిపిండితో చేసిన వంటకాలు మెల్లగానూ, తేలిగ్గానూ జీర్ణమవుతాయి. ఇందులో క్యాల్షియమ్తో పాటు విటమిన్ ‘డి’ కూడా ఎక్కువగా ఉండటం వల్ల ఎముకల బలానికి ఇది బాగా తోడ్పడుతుంది. అందుకే ఎదిగే పిల్లలకు రాగిపిండితో చేసిన వంటకాలు ఇవ్వడం వల్ల వాళ్లు బాగా, వేగంగా ఎత్తు పెరుగుతారు. ఇక యువకులు, పెద్దవాళ్ల ఎముకల ఆరోగ్య నిర్వహణకూ రాగులు సమర్థంగా పనిచేస్తాయి. రాగిపిండి తినేవాళ్లలో ఎముకలు బలంగా ఉండటం వల్ల ఫ్రాక్చర్స్ అయ్యే రిస్క్ చాలా తక్కువ. డయాబెటిస్ నియంత్రణ... రాగులలో పాలీఫినాల్‌తో పాటు పీచు పదార్థాలు (డయటరీ ఫైబర్) ఉండటం వల్ల డయాబెటిస్తో పాటు, జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులను నివారిస్తాయి. ఇందులోని పీచు వల్ల రాగులతో చేసిన వంటలు తిన్న తర్వాత రక్తంలో చక్కెర పెరగడం అన్నది చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఇందులో ఉండే లెసిథిన్, మిథియోనైన్ వంటి అమైనో ఆసిడ్లు కొలెస్ట్రాల్‌ను బాగా తగ్గిస్తాయి. అంతేకాదు... కాలేయంలో పేరుకుపోయిన అదనపు కొవ్వులనూ అవి తొలగిస్తాయి. అందుకే కాలేయంలో కొవ్వు పేరుకుంటున్నవారు రాగులతో చేసిన ఆహారాన్ని తినడం చాలా మంచిది. రక్తహీనత నివారించే రాగులు రాగులలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వీటితో చేసిన ఆహారాలను తీసుకుంటూ ఐరన్ శరీరంలోకి ఇంకడానికి దోహదపడే విటమిన్ ‘సి’ ఉండే పండ్లు ఎక్కువగా తింటే రక్తహీనత (అనీమియా) సమస్య వేగంగా తగ్గుతుంది. ఒత్తిడినీ తగ్గిస్తాయి... తృణధాన్యాల్లో వేరే వాటికి లేని ఒక మంచి గుణం రాగులకు ఉంది. రాగులు ఒత్తిడిని సమర్థంగా తగ్గిస్తాయి. అందుకే యాంగై్జటీ, డిప్రెషన్, మైగ్రేన్‌తో బాధపడేవారికి రాగులు మంచి ఆహారం. ఇందులో ఉండే ట్రిప్టోఫాన్ నిద్ర వచ్చేలా చేసి నిద్రలేమి (ఇన్సామ్నియా) సమస్యను స్వాభావికంగా తగ్గిస్తుంది. మన ఒంటికి చాలా అవసరమైన ఎన్నెనోన అమైనో ఆసిడ్స్ ఇందులో ఉన్నాయి. ఉదాహరణకు థ్రియోనైన్, వ్యాలైన్, ఐసోల్యూసిన్, మిథియోనైన్ వంటివి మన కణజాలాన్ని అనుక్షణం రిపేర్ చేస్తూ, శరీర జీవక్రియలకూ, ఎముకల ఆరోగ్య నిర్వహణకు ఉపయోగపడతాయి. అంతేకాదు మన ఎముకలను రిపేర్ ప్రక్రియలోనూ ఈ అమైనోయాసిడ్స్ పాలుపంచుకుంటాయి. చాలా ఇతర తృణధాన్యాలలో సామాన్యంగా లభ్యం కాని మిథియోనైన్ ఇందులో ఉంటుంది. ఇది శరీరం నుంచి కొవ్వులను తొలగించడానికి, విషాలను తొలగించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నందున రాగులతో చేసే వంటకాలు ఆరోగ్యానికి ఆరోగ్యం. రుచికి రుచి. -
ఎముకల బలాన్నిచాలాకాలం కాపాడుకుందాం
ఎముక గట్టిగా ఉండాలంటే అందులో ఉండాల్సిన పదార్థాలూ, ఖనిజ లవణాలన్నీ కూరి కూరి నిండి ఉన్నట్లుగా ఉండాలి. అప్పుడే ఎముకకు బలం. అదే కూరినట్లుగా కాకుండా వదులొదులుగా ఉంటే అది పెళుసుగా ఉంటుంది. అంటే... దీన్ని బట్టి తెలిసేదేమిటంటే... ఎముకలో ఉండాల్సిన ఖనిజాలు, పదార్థాల సాంద్రత ఎంత ఎక్కువగా ఉంటే ఆ ఎముక అంత ఆరోగ్యంగా ఉంటుంది. అలాంటి ఎముకలు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ జబ్బుల్లాంటివి త్వరగా రావు. అలా ఎముక సాంద్రత ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు జబ్బులేమీ రాకుండా చూసుకోవడంతో పాటు వాటిని ఎక్కువ కాలం కాపాడుకోడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అదే ఎముకలో క్యాల్షియమ్, ఇతర మినరల్స్ వంటివి తక్కువగా ఉంటే అది పెళుసుగా మారిపోతుంది. పెళుసుగా ఉన్నవి త్వరగా విరిగిపోతాయన్న సంగతి తెలిసిందే కదా. ఎముకలు అలా పెళుసుబారకుండా ఉండాలంటే ఎముకలో ఉండాల్సిన పదార్థాల సాంద్రత (బోన్ మినరల్ డెన్సిటీ) ఎంత ఉండాలి, అసలు బోన్ మినరల్ డెన్సిటీ అంటే ఏమిటి, దాన్ని సమకూర్చుకోడానికి ఏం చేయాలి వంటి అనేక అంశాలపై అవగాహన కోసమే ఈ కథనం. మన ఎముకలు చిన్నప్పుడు కాస్తంత మెత్తగా ఉంటాయి. మెత్తగా అనడం కంటే ఫ్లెక్సిబుల్‌గా ఉంటాయి. మనిషి ఎదిగే కొద్దీ అవి క్రమంగా బలం పుంజుకుని, గట్టిపడుతుంటాయి. అంటే మునుపు ఉన్న ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుందన్నమాట. ఇలా ఎముకలు బలం పుంజుకోడానికి... మనం తీసుకునే ఆహారం నుంచి, సూర్యరశ్మి నుంచి అవి అనేక పోషకాలను గ్రహిస్తుంటాయి. ఆహారం నుంచి క్యాల్షియమ్, సూర్యరశ్మి నుంచి విటమిన్ ‘డి’ గ్రహిస్తాయి. ఈ రెండింటితో పాటు మనం చేసే శారీరక శ్రమ కూడా తోడైతే అవి మరింత బలంగానూ, ఆరోగ్యకరంగానూ తయారవుతాయి. ఇలా ఎముకలు బలం పుంజుకుని, వాటిలో ఉండాల్సిన పదార్థాన్ని, ఖనిజాలను సమకూర్చుకుని పూర్తి సాంద్రతను సమకూర్చుకోడం అన్నది ఎదిగే పిల్లలు ఎదిగే క్రమంలో నిరంతరం జరిగే ప్రక్రియ. ఇలా ఎముకలో ఉండే సాంద్రతను బోన్ మాస్ డెన్సిటీ (బీఎమ్‌డీ) అంటారు. ముప్ఫై ఏళ్ల వయసులో గరిష్ఠ సాంద్రత ఒక మనిషికి 30 ఏళ్లు వచ్చే నాటికి అతడి ఎముకల్లోని సాంద్రత గరిష్టంగా ఉంటుంది. అలా గరిష్టంగా ఉన్న 30 ఏళ్ల వయసు తర్వాత నుంచి... క్రమంగా ఎముకలోని పదార్థాన్ని కోల్పోతూ ఉంటారు. దీన్నే ‘ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అని వ్యవహరిస్తారు. ఒకవేళ ఎముకలు త్వరత్వరగా తమ సాంద్రత కోల్పోతే అవి చాలా త్వరగా పెళుసుబారి త్వరగా ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. అయితే కొందరిలో ఎముక సాంద్రతను కోల్పోయే ప్రక్రియ చాలా నెమ్మదిగా, ఆలస్యంగా జరుగుతుంది. కానీ ఒక వయసు తర్వాత మాత్రం ఎముక తన సాంద్రతను కోల్పేయే పరిస్థితి క్రమంగా కొనసాగుతూనే ఉంటుంది. మహిళల్లో మెనోపాజ్ తర్వాత... మహిళల విషయానికి వస్తే రుతుస్రావం ఆగిపోయిన (మెనోపాజ్) తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. (అందుకే మెనోపాజ్ ఆగిన మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ). కాబట్టి మన ఎముకలోని సాంద్రతను వీలైనంత ఎక్కువ కాలం మనం నిలుపుకోగలిగితే మన ఎముక ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎముకల్లో సాంద్రత తగ్గించే రిస్క్ ఫ్యాక్టర్లు ఇవే... ఎముకల్లో సాంద్రత తగ్గేలా చేసే పొగాకు, ఆల్కహాల్ దురలవాట్లు, వ్యాయామం చేయకపోవడం వంటి వాటిని మనం ప్రయత్నపూర్వకంగా మార్చుకుని ఆరోగ్యాన్ని సమకూర్చుకోవచ్చు. అయితే ఇందులో కొన్ని మార్చుకోలేని, తప్పనిసరి రిస్క్ ఫ్యాక్టర్లు కూడా ఉన్నాయి. అవి... మహిళలు ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ (మరీ ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత), పొట్టిదనం (అరవై కిలోల కంటే లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). దీనికి తోడు మన ప్రాంతీయత కూడా ఎముక సాంద్రతకు దోహదం చేస్తుంది. (పాశ్చాత్యులతో పోలిస్తే ఆసియన్లు, చైనీయులు, కాకసాయిడ్స్లో ఎముక సాంద్రత స్వతహాగానే తక్కువ). అలాగే మన కుటుంబ చరిత్ర (కొందరిలో ఎముకలు తేలిగ్గా విరిగే తత్వం ఉంటుంది), మన జీవనశైలి, కాఫీ, ఆల్కహాల్ వంటి అలవాట్లు... ఇవన్నీ ఎముక సాంద్రత త్వరగా తగ్గడానికి దోహదం చేసే అంశాలే. ఎముక సాంద్రతను తక్కువ చేసే జబ్బులివి... ఇక హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, కుషింగ్ సిండ్రోమ్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తికోల్పోయి అసలు ఆహారం తీసుకోకపోయే రుగ్మత), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్ (మనం తీసుకున్న పోషకాలు వంటికి పట్టని రుగ్మత), దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, ఫిట్స్ వస్తున్నప్పుడు తీసుకునే మందులైన యాంటీ కన్వల్సెంట్స్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గిపోయి, ఆ తర్వాతి దశలో మొదటి వ్యాధుల ఫలితంగా సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. ఎముక సాంద్రతపై దృష్టి పెట్టాల్సిన వారెవరు? ►మహిళలు 55 ఏళ్లు దాటిన వారైతే, పురుషులైతే 65 ఏళ్లు దాటినవారైతే ఒకసారి ఎముక సాంద్రత పరీక్ష చేయించుకోవాలి. ఇక ఈ కింది కండిషన్స్ గాని ఉంటే 50 ఏళ్ల పైబడ్డవారంతా ఎముక సాంద్రతపై దృష్టిపెట్టాలి. అవి... ►గతంలో ఏదైనా ప్రమాదం జరిగి ఎముక విరగడం వంటి ట్రామా కేసుల వారు. తక్కువ బరువు ఉన్నవారు. ►గతంలో తుంటి ఎముక ఫ్రాక్చర్ అయినవారు ►వెన్నెముకకు సంబంధించిన రుగ్మత లేదా అబ్నార్మాలిటీస్ ఉన్నవారు. ►గ్లూకోకార్టికాయిడ్ స్టెరాయిడ్‌ను ఒక మందుగా తీసుకుంటున్నవారు ►హైపర్ థైరాయిడిజమ్‌తో బాధపడుతున్నవారు ►ఆస్టియోపోరోసిస్ జబ్బుకు మందు తీసుకుంటూ... డాక్టర్ల అబ్జర్వేషన్లో ఉన్నవారు. ►తినడానికి సంబంధించిన రుగ్మతలు (అంటే తిన్నది సరిగా ఒంటబట్టకపోవడం వంటి) ఈటింగ్ డిజార్డర్స్ ఉన్నవారు... వీరితో పాటు పొగతాగడం, మద్యపానం అలవాటు ఉన్నవారు, విటమిన్ ‘డి’ లోపం ఉన్నవారు తప్పనిసరిగా మీద 50 ఏళ్లు పైబడ్డ నాటి నుంచే డాక్టర్ సలహా మేరకు ఎముక సాంద్రత పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. ఎముక సాంద్రత తెలుసుకోవడం ఎలా..? నిజానికి ఇది ఆస్టియోపోరోసిస్ నిర్ధారణకు చేసే పరీక్ష. దీన్ని ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అంటారు. దీనితో కేవలం ఐదు నిమిషాల్లోనే ఎముక సాంద్రత ఎంత అన్నది తెలిసిపోతుంది. అయితే ఈ విలువను అందరిలో ఒకేలా కాకుండా వయసును పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దీనితో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలు కూడా అవసరమవుతాయి. ఎముక సాంద్రతను పెంచుకోవాలంటే... ముందు చెప్పుకున్నట్లుగానే ఎముక సాంద్రతకు మంచి బీజం యుక్తవయసులోనే పడాలి. పైగా ఎముక సాంద్రత పెరగడానికి తీసుకోవాల్సిన చర్యలన్నీ పెద్దగా ఖర్చు లేకుండానే స్వాభావికంగా జరిగేవే ఎక్కువ. కాబట్టి పిల్లలందరినీ యుక్తవయసులోకి వచ్చే ముందు క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని అంటే పాలు, పెరుగు, బ్రకోలీ వంటి తాజా కూరలు ఎక్కువగా తీసుకునేలా చూడాలి. అలాగే ఆరుబయట ఎండకు ఎక్స్పోజ్ అవుతూ ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల శరీరంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల్లోని క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి ఇంకేలా చేస్తుంది విటమిన్ ‘డి’. అందుకే కేవలం క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకున్నంత మాత్రాన కాకుండా... విటమిన్ ‘డి’ వల్ల కూడా ఎముకలకు బలం చేకూరుతుంది. దీనితో పాటు ఆ సమయంలో వారు తగినంతగా శారీరక శ్రమ, వ్యాయామం చేసేలా చూస్తే పిల్లలు బలంగా మారడమే కాకుండా, వారు మంచి బలంగా తయారవుతారు. చాలాకాలం... అంతెందుకు వృద్ధాప్యంలోనూ వారు ఇంచుమించుగా దాదాపుగా అంతే బలంతో ఉంటారు. ఎముక సాంద్రతను నిర్ణయించే అంశాలు... మనలోని చాలా అంశాలు ఎముక సాంద్రతతో కీలక భూమిక పోషిస్తాయి. ఉదాహరణకు ఒకరి జన్యువుల్లోనే ఎముక సాంద్రత అధికంగా ఉండే గుణం ఉంటుంది. దాంతోపాటు వ్యాయామం / శారీరక శ్రమ, క్యాల్షియమ్ తీసుకోవడం, విటమిన్ ‘డి’ని గ్రహించడం వంటి అంశాలు కూడా ఎముక సాంద్రతకు దోహదపడతాయి. ఇక పొగతాగడం, మద్యపానం, తరచూ జబ్బుపడటం, శారీరక శ్రమ చేయకుండా ఒక చోట కూర్చొని పనిచేయడం లేదా బద్దకంగా ఉండటం, కొన్ని రకాల మందులు (గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ మందులు) తీసుకోవడం వంటి అంశాలు ఎముక సాంద్రతను గుల్లబార్చి అవి బలహీనంగా మారేలా చేస్తాయి. యౌవన దశే కీలకం మన బాలలు యౌవన ప్రవేశకాలంలో ఎక్కువగా క్యాల్షియమ్ ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఆ సమయంలో ఎక్కువగా విటమిన్ ‘డి’ని గ్రహించేలా ఆరుబయట తిరగడం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి. ఎందుకంటే ఆ సమయంలో సమకూర్చుకున్న ఎముక సాంద్రత దాదాపు జీవితకాలమంతా రక్షణ ఇస్తుంది. ఆ సమయంలో ఎంత ఎక్కువ సాంద్రతను గ్రహిస్తే, క్రమంగా కోల్పోయే దశ ప్రారంభమైనా కూడా అది చాలాకాలం ఉండేలా తోడ్పడుతుంది. ఆ సమయంలో దురలవాట్లకు చేరువ కావడం, వ్యాయామం చేయకపోవడం వంటివి చేస్తే అది ఆ తర్వాత కాలంలోనూ నష్టం చేకూరుస్తుంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్ -
సిగరెట్‌తో ఎముకలూ దెబ్బ తింటాయా?
నా వయసు 35 ఏళ్లు. రోజుకు రెండు పాకెట్ల సిగరెట్లు తాగుతాను. ఇటీవల నా బరువు తగ్గింది. విటమిన్ డి పాళ్లు కూడా తగ్గాయి. ఫ్రెండ్స్ మాట్లాడుతూ సిగరెట్లతో ఎముకలు కూడా బలహీనమవుతాయని అంటున్నారు. సిగరెట్ దుష్ప్రభావం ఎముకలపైన కూడా ఉంటుందా? – ఆర్. సమీర్, హైదరాబాద్ పొగతాగే అలవాటు అన్ని అవయవాల మాదిరిగానే ఎముకలపైనా దుష్ప్రభావం చూపుతుంది. సిగరెట్ల కారణంగా అనారోగ్యకరంగా బరువు తగ్గడం, విటమిన్ డి పాళ్లు తగ్గడం, ఎముకలు క్యాల్షియమ్‌ను గ్రహించడం కూడా తగ్గుతుంది. పైగా మామూలు వ్యక్తులతో పోలిస్తే స్మోకర్లలో ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు 25 శాతం ఎక్కువ. అలాగే తుంటిఎముక ఫ్రాక్చర్లు అయ్యే అవకాశాలు పొగతాగే వారిలో ఎక్కువ. స్మోకింగ్ వల్ల అనేక దుష్ప్రభావాలు కనిపించి ఎముక సాంద్రత తగ్గుతుంది. అందుకు దారితీసే అంశాలివి... ∙పొగతాగే అలవాటు వల్ల హార్మోనల్ మార్పులు వచ్చి క్యాల్షియమ్‌ను ఎముకల్లోకి వెళ్లేలా చేసే పారాథైరాయిడ్ హార్మోన్ పాళ్లు, మహిళల్లో ఈస్ట్రోజెన్ పాళ్లు తగ్గుతాయి. పొగతాగే అలవాటు వల్ల విటమిన్ డి పాళ్లు తగ్గడంతో, శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గుతుంది. శరీరానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ పెరగడం వల్ల క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రక్తనాళాల్లో రక్తప్రవాహానికి అడ్డంకులు ఏర్పడటం వల్ల ‘పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్’ వచ్చే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల ఎముకకూ రక్తప్రసరణ తగ్గుతుంది. పొగతాగే అలవాటు వల్ల నరాలు స్పందించే వేగం తగ్గుతుంది. దాంతో వాళ్లు పడిపోయే అవకాశాలు ఎక్కువ. పొగలోని విషపదార్థాలు ఎముక కణాలపైనా నేరుగా తమ దుష్ప్రభావం చూపుతాయి. ∙ఎముకలలోని బంతిగిన్నె కీలుతోపాటు అన్ని కీళ్లు పొగ వల్ల వేగంగా గాయపడే అవకాశాలుంటాయి. గాయాలు చాలా ఆలస్యంగా తగ్గుతాయి. భర్తకు పొగతాగే అలవాటు ఉన్నప్పుడు వారి భాగస్వామి ప్యాసివ్ స్మోకింగ్ బారినపడటం వల్ల వాళ్లకు పుట్టబోయే బిడ్డల ఎముకల బరువూ చాలా తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. అందుకే మీ డాక్టర్ చెప్పినట్లుగా మీరు వెంటనే పొగతాగే అలవాటు మానేయండి. సన్నగా ఉన్నాను... ఆరోగ్యంగా బరువు పెరగడం ఎలా? నా వయసు 29 ఏళ్లు. నేను చాలా సన్నగా ఉంటాను. బరువు కేవలం 48 కేజీలు మాత్రమే. నా ఫ్రెండ్స్ అంతా నన్ను చాలా ఎగతాళి చేస్తుంటారు. నా ఎత్తు ఐదడుగుల తొమ్మిది అంగుళాలు. నేను లావు పెరగడానికి సలహాలు ఇవ్వండి. ఏమైనా మందులు వాడాలా చెప్పగలరు. – ఎ. సిద్ధార్థ, కర్నూలు కొందరు బరువు పెరగకపోవడానికి సాధారణ కారణాలు ఇవి... ∙జన్యుపరమైనవి ∙సరిగా తినకపోవడం ∙చాలా తీవ్రమైన శారీరక శ్రమ ఉన్న వృత్తిలో ఉండటం ∙అవి వ్యాయామం. ఈ సమస్యలే గాక ఇక ఆరోగ్యపరంగా కొందరికి ఆహారం తీసుకోవడం విషయంలో వైద్యపకరమైన రుగ్మతలు (ఈటింగ్ డిజార్డర్స్) ఉండటంతో కూడా బరువు పెరగరు. మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోడానికి ముందుగా వైద్యుడిని కలవండి. డాక్టరు మిమ్మల్ని పరీక్షించి... ∙మీలో ఏదైనా వైద్యపరమైన సమస్య ఉందేమో తెలుసుకోడానికి తగిన పరీక్షలు చేయించి వాటిని నిర్ధారణ చేస్తారు (ఉదా: ౖహె పర్ థైరాయిడిజమ్) ∙మీరు తీసుకునే ఆహరంలో పోషకాలు పాళ్లు ఎలా ఉన్నాయో అన్నదానితో పాటు మీ శారీరక శ్రమ తీరుతెన్నులను అడిగి తెలుసుకుంటారు ∙ఆ తర్వాత ఆరోగ్యకరంగా బరువు పెరిగేందుకు మీరు తీసుకోవాల్సిన ఆహారం, చేయాల్సిన వ్యాయామాల గురించి వివరిస్తారు. మీకు కొన్ని సూచనలు: ∙మీరు ఇప్పుడు తీసుకుంటున్న పరిమాణం కంటే పెద్ద పరిమాణాల్లో కనీసం మూడుసార్లయినా ఆహారం తీసుకోండి. మధ్యలో మరో మూడుసార్లు చిన్న పరిమాణాల్లో తినండి. ఇలా రోజుకు ఆరుసార్లు తినండి ∙మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన ప్రోటీన్స్ ఉండేలా చూసుకోండి. అవి కండరాల పెరుగుదలకు దోహదపడతాయి. కేవలం ఆరోగ్యకరమైన ప్రోటీన్ మాత్రమే తీసుకోవాలి లేకపోతే మీరు అతిగా తీసుకునే ప్రోటీన్ మీ అంతర్గత అవయవాలపై ప్రభావం చూపుతుంది. (ముఖ్యంగా కిడ్నీలు). అందుకే హైప్రోటీన్ డైట్ వద్దు ∙మీ ఆహారంలో పండ్లు, పెరుగు, కస్టర్డ్, మిల్క్‌షేక్‌లు నిత్యం ఉండేలా చూసుకోండి ∙ఆరుసార్లు తినే ఆహారంలో అతిగా కొవ్వులు, పోషకాలు లేకుండా ఉండే జంక్‌ఫుడ్ లేకుండా జాగ్రత్త తీసుకోండి ∙ఇక నట్స్ ఎక్కువగా తీసుకోండి ∙వెన్న, ఆల్మండ్, వేరుశెనక్కాయలు, డ్రైఫ్రూట్స్ మీ ఆహారంలో ఉండేలా చూసుకోండి ∙మీరు వాడే నూనెకు బదులు ఆరోగ్యకరమైన ఆలివ్ ఆయిల్‌ను వాడండి ∙అతి వ్యాయామం కాకుండా పరిమితమైన వ్యాయామం తప్పక చేయండి. మీ వ్యాయామాలు ఎలా ఉండాలంటే అతిగా చేసి కొద్దిసేపట్లో ముగిసేలా కాకుండా, మెల్లగా చేస్తూ... చాలాసేపు కొనసాగేలా జాగ్రత్తపడండి. బరువు పెరగడానినిక ఉపయోగపడతాయంటూ న్యూస్పేపర్లలో, టీవీల్లో కనిపించే ప్రకటనలలోని పౌడర్ల జోలికి వెళ్లకండి. పరిమితమైన కొవ్వులు శరీర జీవకార్యకలాపాలకు అవసరం. అంత మేరకు మాత్రమే కొవ్వులు పెరిగేలా ముందుగా మీరు ఆహారాన్ని ప్లాన్ చేసుకోవాలి. ఇక మీరు బరువు పెరిగే క్రమం కూడా చాలా మెల్లగా జరగాలి. అంతేతప్ప ఒకేసారి కాదు. డా. సుధీంద్ర ఊటూరి లైఫ్‌స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
శాక రాజం – వంకాయ
వంకాయకు మన భారతదేశమే పుట్టినిల్లు. ప్రాచీన కాలంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఈ శాక రాజం, ఆధునిక యుగంలో కూడ అగ్రస్థానంలో నిలిచింది. తెలుగువారితో విడదీయరాని బంధం ఏర్పరచుకొంది. ‘వంకాయ వంటి కూరయు, లంకాపురి‡ వైరి వంటి రాజుంగలడే...’ అన్న ఒక చాటువులోని పద్య పాదాలు ఈ కూర ఔన్నత్యానికి ప్రతీకలు. ఆయుర్వేదంలో కూడా దీనికి విశిష్ట స్థానం ఉంది. సంస్కృతంలో పర్యాయపదాలు...వృంతాక, నీలఫలా, రక్తఫలా, శాకబిల్వ, రాజ కూష్మాండ, వంగణ, అంగణ, సింహీ మొదలైనవి. దీనినే వార్తాక అని కూడా అంటారు. అయితే ఆయుర్వేదంలో, వాకుడు (కంటకారీ) మొక్కని కూడా వార్తాకమంటారు. ఇది గుర్తుంచుకొని సందర్భోచితంగా అర్థం చేసుకోవాలి. ఇది లె లుపు, ముదురు + లేత నీలి రంగులలోనూ లభిస్తుంది. చిన్నవిగాను, పెద్దవిగాను, గుండ్రంగాను, కోలగా కూడా ఉంటాయి. వంకాయను అమెరికా, ఆస్ట్రేలియాలలో ‘ఎగ్ ఎలిఫెంట్’ అనీ, దక్షిణాఫ్రికా, ఆసియా ఖండాలలో ‘బ్రింజాల్’ అనీ పిలుస్తుంటారు. పోర్చుగీసు భాషలో దీనిని ‘బెరింగేల’ అంటారు. వీటి వ్యాపార సమయంలో వారు పలికే భాష రూపాంతరం చెంది ‘బ్రింజాల్’గా మారింది. వంకాయలోని పోషక ఔషధ విలువల్ని ఆయుర్వేద సంహితాకారులు ఈ విధంగా వివరించారు... వృంతాకం స్వాదు తీక్షో›్ణష్ణం కటుపాకమపిత్తలం జ్వరవాత బలాసఘ్నం దీపనం శుక్రలం లఘు... శ్వేత వృంతాకం కుక్కుటాండ సమం భవేత్ తత్ అర్శస్సు విశేషేణ హితం... వంకాయ రుచికరంగా ఉండి, ఉష్ణకరమై, ఆకలిని పుట్టించి వాత కఫ దోషాలను హరిస్తుంది. తేలికగా జీర్ణమౌతుంది. వీర్యవర్థకం. స్థూలకాయులలో బరువు తగ్గడానికి చక్కటి ఆహారం.నూ¯ð తో వేయించి ఉప్పు కలిపి సేవిస్తే మాత్రం శరీర బరువు పెరుగుతుంది. (ఉడికించిన కూర మంచిది).(తదేవహి గురు స్నిగ్ధం సతైలం లవణాన్వితం)తెల్ల వంకాయ: దీని పోషక విలువలు, కోడిగుడ్డుతో సరిసమానం. ఇది మూలవ్యాధి (అర్శస్సు – పైల్స్) తగ్గడానికి చాలా ఉపయుక్తం. దీనితో పోలిస్తే నీలం రంగు వంకాయలో పోషక విలువలు మరింత అధికం.ఆధునిక జీవరసాయన శాస్త్రం: వంకాయలో కొవ్వులు శూన్యం. మాంసకృత్తులు నామమాత్రంగాను, పిండి పదార్థాలు ఓ మోస్తరుగాను ఉంటాయి. 3.5 శాతం శర్కర, మూడు శాతం పీచుపదార్థాలు ఉంటాయి. బీ కాంప్లెక్సు, ఫోలేట్లు, సి, కె, ఎ విటమిన్లు చక్కగా లభిస్తాయి. ఒక శాతం ఐరన్, మూడు శాతం మెగ్నీషియం ఉంటాయి. సోడియం శూన్యం, క్యాల్షియం సమృద్ధిగాను, పొటాషియం అత్యధికంగాను లభిస్తాయి. కాబట్టి బలకరం, స్థౌల్యహరం, సుఖ విరేచనకారి. రక్తపోటుని అదుపు చేసి గుండెకు మేలు చేస్తుంది. వంకాయను ఎలా వండుకోవాలి... వేపడం అంత మంచిది కాదు. రుచికరంగా ఉన్నా, నూనెను వేడి చేయడం, ఉప్పు కలపడం ద్వారా మంచి గుణాలు మరుగున పడిపోతాయి. ఉడికించి వండటం శ్రేష్ఠం. దీనిలో కలిపే మసాలాల వైరుధ్యాన్ని బట్టి కూరను పిలిచే పేరు మారుతుంది. ఉదా: కొత్తిమీర, అల్లం కారం, జీలకర్ర కారం, మెంతి కారం, ఉల్లి కారం, వంకాయ + బంగాళ దుంప ముద్ద కూర మొదలైనవి. ఈ రోజుల్లో కనిపించే ‘బగారా బైంగన్’ కూరలో మసాలా ఎక్కువగా ఉంటుంది. వంకాయను వెతుక్కోవలసి వస్తుంది. దీనివలన ప్రయోజనం శూన్యం. వంకాయపై (పెద్ద సైజువి) కొంచెం నూనె పూసి, నిప్పులపై కాల్చి, అనంతరం తొక్కను తొలగించి, గుజ్జులా పిసికి, దానికి ‘చింతపండు రసం, ఉప్పు, పచ్చి మిర్చి తగుపాళ్లలో కలిపి, ఇంగువ పోపు, కొత్తిమీర చేర్చి పచ్చడి చేస్తారు. దీనిని ‘వంకాయ పులుసు పచ్చడి’ అంటారు. చింతపండు రసం కలపకుండా చేసే దానిని ‘చప్ప పచ్చడి’ అంటారు. దీంట్లోకి... వేయించిన అల్లం ముక్కలు, చిన్న సైజు గుమ్మడి లేక పిండి వడియాలు కూడా జోడిస్తారు. ఉత్తర భారతంలో ఈ చప్ప పచ్చడిలో ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, టొమాటో వేయించి కలుపుతారు. దీనిని ‘భడ్తా’ అంటారు. వంకాయతో చుక్కకూర కలిపి వండిన కూర చాలా రుచికరం. తేలికగా జీర్ణమై వాతహరంగా పని చేసి ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద భావప్రకాశ సంహితాకారుడు ఉటంకించాడు. ‘‘చుక్రికా స్యాత్తు పత్రామ్లా రోచనీ శతవేధినీ ... స్వాద్వీ వాతఘ్నీ కఫ పిత్తకృత్ రుచ్యా లఘుతరా పాకే వృంతాకేన అతి రోచనీ’ అపోహలు: చాలామంది వంకాయను ఆరోగ్యానికి శత్రువుగా పరిగణిస్తారు, తినరు కూడా. ఎలర్జీ కలుగుతుందంటారు. ఆయుర్వేద మందులు వాడుతుంటే, ‘వంకాయ, గోంగూర (పుంటి కూర)’ తినకూడదని భావిస్తుంటారు. ఇవన్నీ అపోహలు మాత్రమే. సత్య దూరం, అశాస్త్రీయం. గమనిక: ఏ కూరలకైనా పండించిన ప్రదేశం, పోసిన నీరు, వేసిన ఎరువు, ఇతర వాతావరణ పరిస్థితుల్ని బట్టి పోషక విలువలు పోయి, అనారోగ్య కారకమవుతుంది, చేదుగా కూడా ఉంటుంది. ఆరగించుyì ! వంకాయననుదినంబు శాకరాజంబు బల్యంబు లోకమందు తెల్ల వంకాయ గుణముల తీరు జూడ అర్శ మొలలను పూర్తిగ నణచి వేయు ఇక అపోహ వలదు సుమ్మి, హృద్యమదియ పులుసు పచ్చడి రుచి చూడ ముదము గాదె కూర నుడికించి చేయుము కూర్మి మీర సమ్మతంబిది! శ్రీరామచంద్ర సమము. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి,ప్రముఖ ఆయుర్వేద వైద్యులు -
క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకుంటున్నా ఆస్టియోపోరోసిస్ వస్తుందా?
ఆర్థోపెడిక్ కౌన్సెలింగ్ నా వయసు 53 ఏళ్లు. ఏడేళ్ల కిందట రుతుక్రమం ఆగిపోయింది. రుతుక్రమం తగ్గిన వాళ్లంతా జీవితాంతం క్యాల్షియమ్ ఎక్కువగా తీసుకోవాలని ఎక్కడో చదివాను. అప్పట్నుంచి క్రమం తప్పకుండా క్యాల్షియమ్ మాత్రలు వాడుతున్నాను. వారం రోజుల కిందట తీవ్రమైన వెన్నునొప్పితో డాక్టర్‌ను కలిశాను. ఆయన కొన్ని పరీక్షలు చేయించి ఆస్టిపోరోసిస్ అన్నారు. నేను క్యాల్షియమ్ వాడుతున్నా ఇలా ఎందుకు జరిగింది? – ఒక సోదరి, విజయవాడ క్యాల్షియమ్ తగ్గడం వల్ల ఎముకలు పెళుసుబారి ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఎముకలు గుల్లబారడం ఆస్టియోపోరోసిస్‌లో ప్రధానంగా జరిగే ప్రక్రియ. మనందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ ఎంతోకొంత ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంటుంది. అయితే మీరు చెప్పినట్లుగానే మహిళల్లో రుతుక్రమం ఆగిపోయాక ఆస్టియోపోరోసిస్ కనిపించడం చాలా సాధారణంగా జరిగేదే. దీనికి కేవలం క్యాల్షియమ్ టాబ్లెట్లు తీసుకోవడం మాత్రమే సరిపోదు. దానితో పాటు ఎముకల్లోకి క్యాల్షియమ్ ఇంకిపోయేలా క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేయాలి. వ్యాయామం చేయకుండా కేవలం క్యాల్షియమ్ తీసుకుంటూ ఉంటే అది మూత్రం ద్వారా బయటకు పోతూ ఉంటుంది. లేదా కొందరిలో అది మూత్రపిండాల్లో పోగుపడి కిడ్నీ స్టోన్‌గా కూడా పరిణమించవచ్చు. అందుకే మీరు క్యాల్షియమ్ తీసుకుంటూ ఉండటంతో పాటు వాకింగ్, జాగింగ్, ఏరోబిక్స్, స్విమ్మింగ్ వంటి వ్యాయామాలలో మీకు అనువైన దాన్ని ఎంచుకొని, క్రమం తప్పకుండా చేస్తూ ఉండటం. ఇక మంచి పోషకాహారాన్ని అంటే... పాలు, పాల ఉత్పాదనలు, ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు వంటివి వాటిని మీ ఆహారంలో భాగం చేసుకుంటే మీరు క్యాల్షియమ్ టాబ్లెట్స్ వాడాల్సిన పని కూడా ఉండదు. ఇంకా నొప్పి తగ్గడం లేదెందుకు? నా వయసు 27 ఏళ్లు. ఈమధ్యే నేను బైక్‌పైనుంచి కింద పడ్డాను. మోకాలు కొద్దిగా వాచింది. దానిపై ఏమాత్రం భారం వేయలేకపోతున్నాను. డాక్టర్గారికి చూపిస్తే ఎక్స్‌రే తీసి ఫ్రాక్చర్ ఏమీ లేదని చెప్పారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. నా సమస్యకు తగిన పరిష్కారం చూపండి. – ప్రమోద్‌కుమార్, ఖమ్మం మీకు బహుశా మోకాలిలో ఉన్న కీలకమైన లిగమెంట్లు చీరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి గాయాలు బైక్ యాక్సిడెంట్లలో చాలా సాధారణంగా జరుగుతుంటాయి. దీనికోసం ఎమ్మారై స్కాన్ అవసరం. ఇలాంటి గాయాలకు చాలా త్వరగా చికిత్స అందించాలి. ఉద్దేశపూర్వకంగా కాకపోయినా... ఎలాంటి ఫ్రాక్చర్ లేదనే అపోహతో చికిత్స ఆలస్యం చేసినట్లయితే మీలాంటి యువకుల్లో అది భవిష్యత్తులో మరింత సమస్య కావచ్చు. మీరు వీలైనంత త్వరగా ఆర్థోపెడిక్ సర్జన్‌ను సంప్రదించండి. ల్యూబ్రికెంట్ ఇంజెక్షన్‌తో ప్రయోజనం ఉంటుందా? నా వయసు 56 ఏళ్లు. నాకు గత కొంతకాలంగా రెండు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి వస్తూ అది క్రమంగా పెరుగుతోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే ఆర్థరైటిస్ అన్నారు. మోకాళ్లలోకి కందెనలాగా (ల్యూబ్రికెంట్ పనిచేసే) అత్యంత ఆధునికమైన ఇంజెక్షన్లు ఇస్తామని అంటున్నారు. వాటితో ప్రయోజనం ఉంటుందా? సలహా ఇవ్వండి. – సీతారామమోహన్‌రావు, విశాఖపట్నం మీరు చెప్పిన కందెనలా పనిచేసే ల్యూబ్రెకెంట్స్ చాలాకాలంగా అందుబాటులో ఉన్నావే. కాబట్టి అవి మరీ ఆధునికమైనవేమీ కాదు. దాదాపుగా గత 20 ఏళ్లుగా డాక్టర్లు వాడుతున్నవే. అయితే అవి కేవలం చాలా తక్కువ నుంచి ఒక మోస్తరు ఆర్థరైటిస్ ఉన్నవారికి మాత్రమే ఉపకరిస్తాయి. పైగా అవి లక్షణాల తీవ్రతను కొంతవరకు మాత్రమే తగ్గిస్తాయి. అంతేతప్ప వాటివల్ల శాశ్వత పరిష్కారం రాదు. ఇక మోడరేట్ ఆర్థరైటిస్ వారికే తప్ప సివియర్ ఆర్థరైటిస్ ఉన్నవారికి వాటి వల్ల ఒరిగేదేమీ లేదు. ఎందుకంటే ఆర్థరైటిస్ ఉన్నవారికి అప్పటికే కార్టిలేజ్ దెబ్బతిని ఉంటుంది కాబట్టి వాటి వల్ల అంతగా ప్రయోజనం ఉండదు. అందువల్ల ఆ ఇంజెక్షన్లతో అద్భుతాలు జరుగుతాయని ఆశించకండి. మీకు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్‌ను కలిసి, తగిన వైద్యసహాయం పొందండి. నా వయసు 57 ఏళ్లు. నేను నాలుగేళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నాను. డాక్టర్‌ను కలిస్తే... నాకు ఆస్టియో ఆర్థరైటిస్ అని చెప్పి, క్యాల్షియమ్ ప్రిస్క్రయిబ్ చేశారు. చాలాకాలంగా వాడుతున్నా నొప్పి తగ్గడం లేదు. దీర్ఘకాలికంగా క్యాల్షియమ్ వాడుతుంటే కిడ్నీలో రాళ్లు వచ్చే అవకాశం ఉందని నేను ఈ మధ్యనే చదివాను. అప్పట్నుంచి నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు సలహా ఇవ్వగలరు. – ఆర్. మంజరి, సూళ్లూరుపేట ఆస్టియో ఆర్థరైటిస్‌లో మొదట ఎముకల చివరల (అంటే కీళ్ల ఉపరితలంలో) ఉండే చిగురు ఎముక (కార్టిలేజ్) క్రమంగా అరిగిపోతుంది. కార్టిలేజ్‌లో క్యాల్షియమ్ ఉండదు. బహుశా మీ డాక్టర్ క్యాల్షియమ్ ఇచ్చింది మీ ఆస్టియో ఆర్థరైటిస్‌కు అయి ఉండదు. మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం మందులతో పాటు ఆయన క్యాల్షియమ్‌ను కూడా సూచించి ఉంటారు. ఆర్థరైటిస్‌కు కేవలం క్యాల్షియమ్తో గుణం కనిపించదు. మీ మోకాలి నొప్పి తగ్గదు. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ‘ఆస్టియో ఆర్థరైటిస్’కు కాకుండా... ‘ఆస్టియో పోరోసిస్’ కండిషన్లో మీ ఎముకలు బలహీనం అయిపోకుండా చూడటానికి క్యాల్షియమ్‌ను డాక్టర్లు ప్రిస్క్రయిబ్ చేస్తారు. మీరు మరోసారి మీ డాక్టర్ గారిని సంప్రదించండి. గాయం తగ్గింది... కానీ ఇప్పటికీ నొప్పి ఎనిమిది నెలల కిందట నా కాలు స్లిప్ అయ్యి, నా చీలమండ బెణికింది (ట్విస్ట్ అయ్యింది). అప్పట్లో ప్లాస్టర్ కూడా వేశారు. కానీ ఇప్పటికీ నాకు ఆ ప్రాంతంలో తరచూ నొప్పి వస్తూనే ఉంది. అప్పడప్పుడూ అక్కడ వాపు కూడా వస్తోంది. ఇంతకాలం తర్వాత కూడా ఇలా ఎందుకు నొప్పి వస్తోంది. – సుధారాణి, మాచర్ల మీ కాలు బెణికినప్పుడు మీ చీలమండ వద్ద ఉన్న లిగమెంట్లు గాయపడి (స్ప్రెయిన్ అయి) ఉండవచ్చు. మీరు ప్లాస్టర్ కాస్ట్ వేయించుకున్నానని చెబుతున్నారు. కాబట్టి ఆ సమయంలో మీ లిగమెంట్లు ఉన్న పరిణామం కంటే కాస్త తగ్గి పొట్టిగా మారే అవకాశం ఉంది. పైగా అవి తమ సాగే గుణాన్ని (ఎలాస్టిసిటీని) కోల్పోయి, తాము ఉండాల్సిన స్థానాన్ని తప్పి ఉండవచ్చు. ఆ తర్వాత కాలు ఏ కొద్దిపాటి మడతపడ్డా పాత గాయాలు మళ్లీ రేగి లిగమెంట్లు మళ్లీ దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. దాంతో నొప్పి, వాపు వస్తాయి. మీరు స్ట్రెచింగ్ వ్యాయామాలు చేస్తూ, మీ లిగమెంట్లు మళ్లీ మామూలు దశకు వచ్చేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది. డాక్టర్ కె. సుధీర్‌రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్, ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్, కేపీహెచ్‌బీ, హైదరాబాద్